పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

అనుయుక్తాలు- పారిభాషికపదాలు : వసుదేవుని భార్యలు

వసుదేవుని భార్యలు - కృష్ణుని తల్లులు

1-260 –వ
శ్రీకృష్ణుడు తల్లుల కేడ్వురకు మ్రొక్కెను. వారు వసుదేవుని భార్యలైన దేవకుని పుత్రికలు 7గురు.

వసుదేవుని సంతానం    9-722- వ.

1.(పురు వంశపు) రోహిణి అందు బలుడు, గదుడు, సారణుడు, దుర్మదుడు, విపులుడు, ధ్రువుడు, కృతుడు మున్నగువారు;
2.(పురు వంశపు) పౌరవి అందు సుభద్రుడు, భద్రబాహుడు, దుర్మదుడు, భద్రుడు, భూతుడు మున్నగు పన్నెండుమంది;
3.(పురు వంశపు) మదిర అందు నందుడు, ఉపనందుడు, కృతకుడు, శ్రుతుడు, శూరుడు, మున్నగువారు;
4.కౌసల్య అందు కేశి; రోచన తోటి హస్తుడు, హేమాంగదుడు మున్నగువారు;
5.ఇళ అందు ఉరువల్కలుడు మున్నగువారు; ధృతదేవ అందు త్రిపృష్ఠుండు;
6.(భోజ వంశపు) శాంతిదేవ అందు ప్రశ్రముడు, ప్రశ్రితుడు మున్నగువారు;
7.(భోజ వంశపు) ఉపదేవ అందు కల్పవృష్టుడు మున్నగు పదిమంది (10);
8.(భోజ వంశపు) శ్రీదేవ అందు వసుహంసుడు, సుధన్వుడు ఆదులు ఆరుగురు; 9.(భోజ వంశపు) దేవరక్షిత అందు గదుడు మున్నగు తొమ్మిదిమంది;
10.(భోజ వంశపు) సహదేవ అందు పురూఢుడు, శ్రుతుడు, మున్నగు ఎనిమిదిమంది (8);
11.(భోజ వంశపు) దేవకి తోటి కీర్తిమంతుడు, సుషేణుడు, భద్రసేనుడు, ఋజువు, సమదనుడు, భద్రుడు, సంకర్షణుడు, శ్రీకృష్ణుడు; పిమ్మట కుమార్తె సుభద్ర.

10.2-1129వ.
అని యభ్యర్థించి యమ్మునీంద్రుల యాజకులంగా వరించి, యప్పుణ్యతీర్థోపాంతంబున మహేంద్రామితవైభవంబున, నష్టాదశ భార్యాసమేతుండై దీక్షఁ గైకొని, యమ్మహాధ్వరంబు

వసుదేవుని భార్యలు 18మంది.

(10.2-1129-వ.)

1) భోజవంశమున పుట్టిన దేవకుని కుమార్తెలు 7గురు(కృష్ణుని తల్లులు)

(1) ధృతదేవి, (2) శాంతిదేవి, (3) ఉపదేవి, (4) శ్రీదేవి, (5) దేవరక్షిత, (6) సహదేవి, (7) దేవకీదేవి,
మరియు

2) పురువంశమున పుట్టిన 7గురు(బలరాముని తల్లులు)

(1) పౌరవి, (2) రోహిణి, (3) మధిరా, (4) రోచన, (5) ఆది (6) వైశాఖి (7)భద్ర

3. వీరుకాక వసుదేవునికి

(15) సునామ్నీ (16) కౌసల్య, (17) ఇళ
అనే మరి ముగ్గురు భార్యలు కలరు.

4) మరొక భార్య (18) కూడ కలదు.

5) దేవకీదేవి పుత్రుడు కృష్ణుడు
6) రోహిణి పుత్రుడు బలరాముడు6