పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

అనుయుక్తాలు- పారిభాషికపదాలు : విష్ణుమూర్తి పరికరాదులు

విష్ణుమూర్తి సంబంధించిన వాని వివరములు

ఆయుధములు
శంఖము పాంచజన్యము
చక్రము సుదర్శనము / సునాభము
గద కౌమోదకి
ధనుస్సు శార్ఙ్గము
ఖడ్గము నందకము
డాలు చర్మము
రథము / తేరు శతానందము
వాహనము గరుత్మంతుడు
సేనానాయకుడు విష్వక్సేనుడు
సారథి దారకుడు
గుఱ్ఱములు 1సైబ్య 2సుగ్రీవ 3పుష్ప 4వలాహకములు

: ఆభరణములు
తలపై: కిరీటము
చెవులకు: మకరకుండలాలు
వనమాలిక కంఠమునందలి మాల: వైజయింతీమాల
కంఠమునందలి మాల: తులసీమాల
కంఠమునందు: హారాలు
వక్షస్థలమందలి పుట్టుమచ్చ: శ్రీవత్సము
వక్షమునందలి మణి, కంఠమాలలో: కౌస్తుభము
వక్షమునందు అలంకరించి యుండును: లక్ష్మీదేవి
దేహమున: సరిక్రొత్త పచ్చని పట్టు బట్టలు
దండలకు కడియాలుగా: అంగదములు
భుజములకు: భుజకీర్తులు
చేతులకు: కంకణములు
చేతులలో: శంఖ చక్ర గదాలు
చేతిలో: పద్మము
చేతిలోని మణి: శమంతకము
కటిప్రదేశమున: మొలత్రాడు
కాళ్ళకు: బంగారు అందెలు

కౌమోదకి

1) కౌమోదకి = విష్ణుమూర్తి గద పేరు
వ్యుత్పత్తి: కుం భూమిం మోదయతి హర్షయతీతి కుమోదకో విష్ణుః తస్యేయం కౌమోదకీ,
భూమిని సంతోషింపజేయు విష్ణు సంబంధమయినది
వ్యుత్పత్తి: కోః మోదకః - కుమోదకః=విష్ణుః, కుమోదకస్య ఇయమ్ - కుమోదక+ఇణ్
త.ప్ర. కుమోదకుని (విష్ణుని) ఆయుధము.

కౌస్తుభము

2) కౌస్తుభము : విష్ణువు వక్షస్థలమందలి మణి.
వృత్పత్తి - కుం (భూమిమ్) స్తుభ్నాతి = కుస్తుభః = సముద్రః - కుస్తుభే భవః = కుస్తుభః+ అణ్ = కౌస్తుభః
భూమిని ఆవరించి ఉన్నది అగుటచే సముద్రము కుస్తుభము అనబడును, అందు పుట్టినది కౌస్తుభము

నందకము

విష్ణుమూర్తి ఖడ్గము పేరు, సంతోషించునది, సంతోషపెట్టునది, అలరించునది,. వ్యు. టునది - సమృద్ధౌ - నంద+ ణ్యుల్, కృ.ప్ర.

పాంచజన్యము

పాంచజన్యము విష్ణుమూర్తి శంఖము, శ్రీకృష్ణుని శంఖము
వ్యుత్పత్తి: పంచజనః +ఞ్ - ఞ్యాః వా
పంచజనుడు అను రాక్షసుని ఎముకచే నిర్మింపబడుటచే దీనికి ఈ వ్యవహారము

శ్రీవత్సము

శ్రీమహావిష్ణువు వక్షమున గల ఒక సుడి / మచ్చ.
శ్వేతరోమావర్తము
వృత్పత్తి - వద+స = వత్సః; శ్రీ.యుతః వత్సః
శాకసా. మహత్వమును తెలియజేయు చిహ్నము.

శమంతకము

శమంతకము : విష్ణువు హస్తమునందలి మణి., సత్రాజిత్తు శ్రీకృష్ణునకు సత్యభామతో పాటు సమర్పించిన ఒక మణి

సుదర్శనము

విష్ణుదేవుని ఆయుధం. సూర్యశక్తితో విశ్వకర్మ నిర్మించిన చక్రం. వ్యు. సు+దృశ ఈక్షణే +ల్యుట్ అన, కృ.ప్ర., చూడముచ్చటైనది, మంచి చూపు గలది

సునాభము

విష్ణుదేవుని ఆయుధం. చక్రము సుదర్శనమునకు మరొకపేరు, మంచి మధ్యప్రదేశము గలది కనుక సునాభము.


పరిచరాదులు


భార్య లక్ష్మీదేవి
పరిచరులు సునంద, నంద, జయ, విజయ,జయంత, ప్రబల, ఉద్బల, కుముద, కుముదాక్ష,తార్క్ష్య, పుష్పదంత, శ్రుతదేవ, సాత్వత,విష్వక్సేన, అర్హణ
పాన్పు ఆదిశేషుడు
లోకము వైకుంఠము
భక్త సమూహములు వైష్ణవులు
భక్తులు నారదుడు,తుంబురుడు,ప్రహ్లాదుడు,పరీక్షిత్తు,ధ్రువుడు,అంబరీషుడు


అష్టభుజ విష్ణుమూర్తి ఎనిమిది (8) చేతులలో ఉండే ఆయుధాలు:-

  1. చక్రం,
  2. ధనుస్సు,
  3. పద్మం,
  4. శంఖం,
  5. ఖడ్గం,
  6. పాశం,
  7. డాలు,
  8. గదాదండం.