పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

అనుయుక్తాలు- పారిభాషికపదాలు : త్రేతాగ్నులు

త్రేతాగ్నులు

Padyam IX -333 (ఆంగ్ల వికిపీడియా నుండి) http://en.wikipedia.org/wiki/Yagya#The_various_sacred_Agnis


శ్రౌతాగ్నులకు సంబంధించిన సంస్కారములు శ్రౌత సూత్రాలలో వివరింప బడినవి. శ్రౌతాగ్నులను శ్రౌతినులు నిర్వహించెదరు. ఇరవై ఒక్క (21) తప్పనిసరి ఆహుతులలో పద్నాల్గింటిని (14) శ్రౌతాగ్నులందు ఆహుతి, వేల్చుట చేస్తారు. శ్రౌతాగ్నులనే మూడగ్నులని త్రేతాగ్నులు అని కూడ అంటారు. అవి 1)గార్హపత్యము 2)దక్షిణాగ్ని 3)ఆహవనీయము. యజ్ఞశాల యందు గార్హపత్య కుండము గుండ్రని ఆకారములో పడమటి వైపున ఉంటుంది. గార్హపత్యాగ్ని నుండి తీసుకొని మిగతా రెండగ్నులను ప్రజ్వలించెదరు. దక్షిణాగ్నిగుండము యజ్ఞశాలలో దక్షిణపు వైపున అర్థచంద్రాకారములో నిర్మింపబడుతుంది. ముఖ్యముగ దీనిలో పితృదేవతలకు వేల్చుతారు. ఆహవనీయ గుండము యజ్ఞశాలకు తూర్పువైపున నలుచదరముగ ఏర్పరుస్తారు, చాలావరకు ఆహుతులను దీనిలోనే వేల్చుతారు, హృతము చేయుదురు.