పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

అనుయుక్తాలు- పారిభాషికపదాలు : భాగవత దశ లక్షణాలు

2-SK- 257వ. పద్యము

సర్గ, ప్రతిసర్గ, మనువులు, మన్వంతరము, వంశాను చరితములు పురాణానికి పంచలక్షణాలు అని కొందరు అంటారు, దశ లక్షణాలు అని కొందరు అంటారు.
 ఇది ఇతర పురాణాలకి అన్వయిస్తుంది: శ్రీమద్భాగవత మహా పురాణం దశ లక్షణ సమన్వితం. ఆ పది లక్షణాలు:-

క్ర.
సం.
లక్షణము వివరణ
1 సర్గము మహదహంకార పంచతన్మాత్ర ఇంద్రియ భూతపంచ ప్రపంచ సృష్టి
2 విసర్గము విరాట్పురుషుని వలన సంభవించిన చరాచర భూత సృష్టి
3 స్థానము శ్రీహరి అవతారము లెత్తి జగత్తును పాలించుట
4 పోషణము శ్రీహరి నిజభక్త జనోద్ధరణము చేయుట
5 ఊతులు కర్మవాసనలు, పుణ్యపాపములు
6 మన్వంతరములు పదునలుగురు మనువుల చరిత్రలు వారి ధర్మములు
7 ఈశాను కథలు శ్రీహరి అవతార కథలు, అతని భక్తుల చరిత్రలు
8 నిరోధము శ్రీమన్నారాయణుని యోగనిద్ర, దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ
9 ముక్తి అవిద్య త్యజించి నిశ్చల భక్తిచే శ్రీహరి రూపమును స్వస్వరూపముగ నొందుట
10 ఆశ్రయము సృష్టి స్థితి లయములు ఎవ్వని వలన గలిగెనవో అతడే (పరమాత్మ) ఆశ్రయము