పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

అనుయుక్తాలు- పారిభాషికపదాలు : తెలుగువారి మానములు

తెలుగు వారి మానములు

నాకు (భాగవత గణనాధ్యాయికి) గుర్తున్నవరకు 20వ శతాబ్దము 2వ అర్థభాగము మొదటిలో వాడుకలోనున్న వివిధ మానములు 

ద్రవ్య మానం

రూపాయి
గుండ్రటి బిళ్ళ (తులము బరువు వెండి నాణెం)
1 రూపాయికి - 2 అర్థరూపాయిలు (కొంతచిన్నవి గుండ్రటివి)
1అర్థరూపాయికి - 2 పావలాలు (గుండ్రటివి చిన్నవి)
1 పావలాకి - 2బేడలు (నలుపలకలవి పెద్దవి)
1బేడకి - 2 అణాలు (గుండ్రటివంకీలవి)
1అణాకి - 2అర్థణాలు (నలుపలకలవి చిన్నవి)
1అర్థణాకి - 2కానీలు (చిన్న గుండ్రటి రాగివి, పెద్దవి చిల్లుకానీలు)
1కానీ - 2 దమ్మిడీలు (బాగా చిన్న గుండ్రని రాగివి)
లేదా
1 కానీ - 3 పైసలు
16 అణాలు - 1 రూపాయి
4 కానులు - 1 అణా

2 .కొల మానం

1బస్తా - 12కుంచములు (48 సేరులు ~ 100 లీ)
1కుంచము - 2మానిక
1మానిక - 2 సేరులు
1సేరు - 2 అర్థసేరులు / 2 అడ్డలు (1 సేరు ~ 2.1 లీ)
1అడ్డ - 2తవ్వ
1తవ్వలు - 2సోలలు
1 సోల - 2 అర సోలలు
1అరసోల - 2గిద్దలు
1గిద్ద - 2అరగిద్దలు

3. భార మానం

1 బారువ లేదా పుట్టి - 20 మణుగులు
1మణుగు - 8వీశలు
1వీశ - 2అరవీశ (1 వీశ = 1.399656456 kg)
1అరవీశ - 2ఏబులములు
1ఏబులము - 2 పదులములు
1పదులములు - 5 ఫలములు
1ఫలము - 3 తులములు
1తులము - 2అరతులములు (1 తులము = 11.6638038 గ్రాములు)

4. దూర మానం (బ్రిటిష పద్ధతి)

12అంగుళములు - 1అడుగు (1 అంగుళము = 2.54 cm)
3అడుగులు - 1గజము (1 గజము = 0.9144 మీ)
220గజములు - 1పర్లాంగు
8ఫర్లాంగులు - 1మైలు (1మైలు = 1.60934 కిమీ)
4840 చదరపు గజములు – 1 ఎకరము
1 హెక్టారు ~ 2.471 ఎకరాలు
నిలువు మనిషి ఎత్తు 1 బార
బార మనిషి క్షితిజ సమాంతరంగా చాచిని రెండు చేతుల చివర్ల మధ్య దూరం 4 మూరలు
మూర మనిషి మోచేతి మొదలు నుండి వేలి చివరకి దూరం 2 జానలు (మూర 1 ½ అడుగులు
జాన సాగదీసిన చేతి బొటకనవేలి చివరి నుండి మధ్య వేలి వరకు 3 బెత్తలు
బెత్త అర చేతి నాలుగు వేళ్ళ వెడల్పు 3 ఏస్కులు (బొటకన వేలి వెడల్పు)
ఏస్కు బొటకన వేలి వెడల్పు

5. సర్వే కొలతలు

7 . 92 అంగుళములు 1 లింకు
100 లింకులు 1 గొలుసు
10 గొలుసులు 1 ఫర్లాంగు
8 ఫర్లాంగులు 1 మైలు

6. వస్తుమానము

జత - 2 వస్తువులు
చేయి - 5వస్తువులు
డజను - 12 వస్తువు
పాతిక - 25 వస్తువులు
కట్ట - 4 వస్తువులు