పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

అనుయుక్తాలు- పారిభాషికపదాలు : తాపత్రయములు

తాపత్రయము :- మూడు విధాల తాపములు (తపింపజేసేవి). ప్రారబ్ధం వీటికి కారణమై ఉంటుంది.
(1) ఆధ్యాత్మికం :- ఆత్మకు సంబంధించినవి. శరీరకంగా, మానసికంగా అనుభవించేవి. శోకం, మోహం, కోరిక, కోపం, ఆకలి, దప్పిక, నిద్ర మొదలైనవి. ప్రయత్నంతో ఆధ్యాత్మిక సాధన ద్వారా ఈ తాపాలను దూరం చేసుకోవచ్చు.
(2) ఆధిభౌతికం :- పంచభూతాల నుండి, మిగిలిన ప్రాణుల నుండీ కలిగే బాధలు. జబ్బులు, ప్రమాదాలు. వీటిని కొంత వరకు తప్పించుకోవచ్చు. ఎక్కువగా మన చేతుల్లో ఉండవు.
(3) ఆధి దైవికం :- ప్రకృతివల్ల కలిగే విపరీతాలు. వరదలు, భూకంపాలు, కరువుకాటకాలు, జరా మరణాలు మొదలైనవి. వీటిని తప్పించుకోవడం మనచేతుల్లో ఉండదు. ఎంతో కొంత ఏదో విధంగా వాటి పరిణామాలు అనుభవించవలసి ఉంటుంది.