పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

అనుయుక్తాలు- పారిభాషికపదాలు : ఉపవేదాదులు

(1)

వేదములు - శాస్త్రములు

2-222-వ.
(అ)
చతుర్వేదములు - 1. ఋగ్వేదము, 2. యజుర్వేదము, 3. సామవేదము, 4. అధర్వణవేదము.
(ఆ)
ఉపవేదములు:-
1. ఋగ్వేదమునకు ఆయుర్వేదము,
2. యజుర్వేదమునకు ధనుర్వేదము,
3. సామవేదమునకు గాంధర్వము,
4, అధర్వణవేదమునకు 1) స్థాపత్య, 2)శస్త్ర వేదములు.
(ఇ)
ధర్మశాస్త్రములు:- మనుస్మృతాదులు, ఇవి ప్రధానముగ పద్దెనిమిది (18)
(ఈ)
ఇతిహాసములు:- రామాయణము, భారతము.
(ఉ)
పురాణములు - ఇవి బ్రహ్మాది పద్దెనిమిది (18),
1. బ్రహ్మ, 2. పద్మ, 3. వైష్ణవ, 4. శైవ, 5. భాగవత, 6. నారదీయ, 7. మార్కండేయ, 8. ఆగ్నేయ, 9. భవిష్యత్తు, 10.బ్రహ్మకైవర్త,
11. లింగ, 12. వరాహ, 13. స్కాంధ, 14. వామన, 15. కూర్మ, 16.మత్య, 17.గరుడ మరియు 18. బ్రహ్మాండ పురాణములు.

(2)

వేదములు - బ్రహ్మ ముఖములు


(తృతీయ స్కంధము, 3-388-వ పద్యము)


చదుర్వేదములు బ్రహ్మదేవుని ముఖము
ఋగ్వేదము తూర్పు
యజుర్వేదము దక్షిణ
సామవేదము పడమర
అధర్వణవేదము ఉత్తర


చతుర్విధ ఉపవేదములు


ఆయుర్వేదము ఆరోగ్య విద్య
ధనుర్వేదము యుద్ద విద్య
గాంధర్వము గానవిద్య
స్థాపత్యము నిర్మాణవిద్య

చతుర్విధ యజ్ఞకర్తలు / ఋత్విక్కులు


హోత శస్త్రములు అను ఋగ్వేద మంత్రములు
అధర్వుడు యిజ్య, యజ్ఞమును అధ్వర్యము చేయుట
ఉద్గాత స్తుతులను సామవేద మంత్రములను పాడుటాదులు
బ్రహ్మ ప్రాయశ్చిత్త కర్మములు

3.చతుర్విధ యజ్ఞకర్తలు

1 షోడశి, 2 ఉక్థ్యము, 3 యజనము, 4 అగ్నిష్టోమము, 5 అప్తోర్యామము, 6 అతిరామము, 7 వాజపేయము, 8 గవాయము

4.ధర్మపాదచతుష్కయము


1విద్య 2దానము 3తపస్సు 4సత్యము