అనుయుక్తాలు- పారిభాషికపదాలు : శివుని ఎదుట మోహిని విహారాలు
జగన్మోహిని విహారంలో వర్ణనలు
8-896-వ.
పరమ శివుని ఎదుట ఆ ఉద్యానవనంలో వాలుకన్నుల వయ్యారి జగన్మోహిని అంతులేని అందచందాలు ఒలకబోస్తూ ఒంటరిగా ఎలా విహరిస్తోంది అంటే: -
1) ఒక చెట్టు నీడలో ఒక ఎలప్రాయపు సుందరాంగిలా కనబడింది
2) కుచకుంభముల మీద పైట తొలగింది
3) కొప్పుముడి వీడింది
4) నుదుట ముంగురులు ముసురుతున్నాయి
5) నడుము ఉందాలేదా అనే అనుమానానికి అవకాశమిస్తూ కదలాడుతోంది
6) చెవుల కమ్మల కాంతులు చెక్కిళ్ళపై చిందుతున్నాయి
7) పిరుదుల బరువుతో పాదాలు తడబడుతున్నాయి
8) తళుకు చూపులు దిక్కులలో పిక్కటిల్లుతున్నాయి
9) జారిపోయిన చీర కుచ్చెళ్ళను ఎడమచేతితో పట్టుకుంది
10) బంగారు కాలిఅందెల గలగలలూ, చేతికంకణాల ఝణ ఝణాలూ అతిశయిస్తున్నాయి
11) బంతితో ఆడుతోంది
12) మోహిని ముడుచుకున్న కొప్పుముడి వీడింది
13) వెంట్రుకలు భుజాలు మీదా, మెడ మీదా చెదరి పడి చలిస్తున్నాయి
14) ఆమె నుదుటిమీద కస్తూరి బొట్టు కరిగిపోతోంది
15) ముద్దులు మూటగట్టే ముఖకాంతులు నలుదెసలా ప్రసరిస్తున్నాయి
16) చిరునవ్వులు చిందుతున్నాయి
17) చెమటతో తడిసి తడబడుతూ తనువున పులకలు మొలకెత్తుతున్నాయి
18) మనసుకు ఇంపునింపే బంతిని అందమైన హస్తంతో అందుకుంటోంది
19) దానిని రొమ్ముపై ఉంచుకుంటోంది
20) చెక్కిలిపై చేర్చుకుంటోంది
21) గడ్డానికి తాకించుకుంటోంది
22) చనుమొనలపై ఆనించుకుంటోంది
23) గోళ్ళతో మీటుతోంది
24) సొగసైన చేతులలో బంతిని కుడిఎడమలకు తృళ్ళిపడేలా ఒయ్యారంగా ఎగురవేస్తోంది
25) బంతి ఎగరేస్తుంటే మెల్లమెల్లగా కదలాడే మేలిమి కంకణాలు ఝణ ఝణ ధ్వనిస్తున్నాయి
26) కుచకుంభాలు ఒకదానితో ఒకటి రాసుకుంటున్నాయి
27) తనకుతానే చిన్నచిన్న పందాలు వేసుకుంటోంది
28) సన్నని నడుం వణికేట్లు మెడలోని హారాలు చిక్కుపడేటట్లు తిరుగాడుతోంది
29) అలా తిరిగేటప్పుడు చెవులకుండలాల కాంతులు చెక్కిళ్ళపై చిందులాడుతున్నాయి
30) ఆమె గుండ్రంగా తిరుగుతూ బంతిని పట్టుకుని ప్రక్కలకు కదులుతోంది
31) అప్పుడు ఆమె పైటచెరగు జారిపోతోంది
32) ఒడ్డాణంలోని బంగారుచిరుగంటలు మ్రోగుతున్నాయి
33) కాలిఅందెలు గల్లుగల్లుమంటున్నాయి
34) కరకంకణాలు రత్నాలు మెరస్తున్నాయి
35) ఆమె బంతి వెనువెంట పరుగెత్తి పట్టుకొంటోంది
36) పట్టుకున్న బంతిని నేలపై చరుస్తోంది
37) పైకెగిరిన బంతి రెండుచేతులూ చేర్చి చాలా సార్లు పట్టుకుంటోంది
38) బంతి ఎగిరేటప్పుడూ పడేటప్పుడూ పొడవైన వలలు వేసి లాగుతున్నట్లు తన సోగచూపులు వ్యాపంపజేస్తోంది
39) బంతిని కొడుతూ ఒకటి నుండి పది, నూరు అంటూ వరుసగా ఎంతో నేర్పుతో లెక్కపెడుతోంది
40) ఎఱ్ఱతామరలవంటి తన పాదాల అరుణకాంతులతో తూర్పుకొండ మీది సూర్య బింబాన్ని స్పురింపజేస్తోంది
41) నెమ్మోము చంద్రుని వెన్నెల వెలుగులతో చంద్రమండలాలను సృజిస్తోంది
42) అప్పుడప్పుడు కుచలకలశాల మిట్టపల్లాల నుండి జారిపోయిన పైట సవరించుకుంటోంది
43) చెక్కిళ్ళపై చిందే చెమటబొట్లను కొనగోళ్ళతో చిమ్ముతోంది
44) ఎఱ్ఱని పెదవిని దొండపండుగా భ్రమించి వచ్చిన రాచిలుకలను తోలుతోంది
45) పద్మంవంటి ముఖంలోని సువాసనకోసం మూగిన కొదమ తుమ్మెదలను అదలిస్తోంది
46) అందమైన మందగమనం నేర్చుకోవడానికి వచ్చిన రాయంచ జంటలను గెంటుతోంది
47) సొగసైన చూపులకోసం ముచ్చటపడి వచ్చిన నెమళ్ళ జంటలకు దూరంగా వెళ్తోంది
48) పొదరిండ్ల దరిచేరకుండా చిగుళ్ళవంటి చేతులకు మనసుపడి వచ్చిన కోయిల జంటలకు దూరమవుతోంది
49) తీగఉయ్యాల మీద ఊగుతోంది
50) పూలగురివింద గుబుర్లపై ఎక్కుతోంది
51) పుప్పొడి గుట్టలను దాటుతోంది
52) మకరందాల మడుగులు గడుస్తోంది
53) క్రీడాపర్వతాలపై విహరిస్తోంది
54) చిగురుటాకుల ఆసనాలపై అలసట తీర్చుకుంటోంది
55) తీగ ఇండ్లలో దాగుడుమూతలు ఆడుతోంది
56) మొగలిపొదలకు ఆనుకంటోంది
57) పూరేకుల గవాక్షాలలో తొంగిచూస్తోంది
58) మెట్టతామర మొక్కలను తాకుతోంది
59) సంపెంగ పొదల గడపలలో నిలబడుతోంది
60) అరటి ఆకులద్వారాలు తెరుస్తోంది
61) కమ్మని పుప్పొడి బొమ్మలను బుజ్జగిస్తోంది
62) రత్నాలబాటపై విహరిస్తోంది
63) చంద్రకాంత వేదికలను సమీపిస్తోంది
64) రత్న పంజరాలలోని గోరువంకలకు మాటలు నేర్పుతోంది
65) ఇష్టం వచ్చిన దానిని చూస్తోంది
66) చూచిన దానిని మెచ్చుకుంటోంది
67) మెచ్చుకొన్నదానిపై అచ్చెరువు కనబరుస్తోంది
68) మైమరుస్తోంది
69) మైమరపిస్తోంది
70) మోహిని బంతిని ఎగురవేసింది
71) పట్టుకుందాం అంటే వీలు చిక్కలేదు
72) ఆ బంతి జారి పడిపోయింది
73) బంతిని తీసుకోడానికి వస్తుండగా గాలి తాకిడికి చీర ముడి ఊడిపోయింది
74) కడగంటి కాంతులు తళుక్కుమని మెరస్తున్నాయి
75) చీర సరిగా కట్టుకోడానికి ప్రయత్నించింది
76) మేను పులకించింది
77) స్తనభారంతో ఆమె వంగింది
78) రెండు చేతులతో ఆమె వక్షః స్ధలాన్ని కప్పుకున్నది
79) ఆమె కొప్పుముడి వీడి వ్రేలాడుతున్నది
80) చీర ఊడిన సిగ్గుతో నవ్వుతూ చెట్ల చాటున దాగింది
81) ఆ మాయామానిని జడ వీడి వీపుపై వ్రేలాడుతున్నది
82) ఆమె పిరుదుల బరువుతో అలసిసొలసి వెనుతిరిగి చూస్తూ పరిగెడుతున్నది.