పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

అనుయుక్తాలు- పారిభాషికపదాలు : షోడశోపచారములు

షోడశ-ఉపచారములు :

1. ఆవాహనము, 2. ఆసనము, 3. పాద్యము, 4. అర్ఘ్యము, 5. ఆచమనీయము, 6. స్నానము, 7. వస్త్రము, 8. యజ్ఞోపవీతము, 9. గంధము, 10. పుష్పము, 11. ధూపము, 12. దీపము, 13. నైవేద్యము, 14. తాంబూలము, 15. నమస్కారము, 16. ఉద్వాసనము.

ఆవాహనము – ఆహ్వానము, పిలుపు సమర్పించుట
ఆసనము – పీఠము, సింహాసనము సమర్పించుట
పాద్యము – కాళ్ళు కడుకడుకొనుటకు నీళ్ళు సమర్పించుట
అర్ఘ్యము - చేతులు కడుకడుకొనుటకు నీళ్ళు సమర్పించుట
ఆచమనీయము – త్రాగుటకైన కొద్ది నీరు సమర్పించుట
స్నానము – స్నానము చేయించుట
వస్తము – కట్టుకొనుటకు జత బట్టలు సమర్పించుట
యజ్ఞోపవీతము – మార్చుకొనపటకు సమర్పించుట
గంథము – గంథము అలముట
పుష్పము – పువ్వులు సమర్పించుట లేదా పూజించుట
ధూపము – అగరు ధూపము చూపుట
దీపము – దీపము సమర్పించుట
నైవేద్యము – ఆహారము సమర్పించుట
తాంబూలము – తాంబూలం సమర్పించుట
నమస్కారము – నమస్కరించుట
ఉద్వాసన – స్వస్థానానమునకు సాగనంపుట

పంచ ఉపచారములు.

1) స్నానము, 2) పూజ, 3) నైవేద్యము, 4) ప్రదక్షిణ, 5) నమస్కారము(ఆంధ్ర వాచస్పతము)