పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

అనుయుక్తాలు- పారిభాషికపదాలు : సప్తధాతువులు

ధాతువు అంటే దేహమునకు ఆఱంభకమైన రసము లోనగునది, వ్యు. ధీయతే అస్మిన్ - ధా + తున్, కృ.ప్ర., జవసత్వాదులు ఇందుండును. ఇవి సప్తసంఖ్యలో ఇలా చెప్పుదురు
అ)వసాదులు (వస, అసృక్కు, మాంసము, మేధస్సు, అస్థి, మజ్జ, శుక్లములు)
ఆ) రోమాది (రోమ, త్వక్, మాంస, అస్థి, స్నాయువు, మజ్జ, ప్రాణములు)
ఇ) త్వగాది (1త్వక్, మాంస, రుధిర, మేధో, మజ్జ, అస్థి, శుక్లములు)

(అ)1వస (బొడ్డుక్రిందనుండు ఉల్లి పొర వంటి క్రొవ్వు) 2అసృక్కు (రక్తం) 3మాంసము 4మేధస్సు (మెదడు) 5అస్థి (ఎముక) 6మజ్జ (ఎముకలలోని కొవ్వు) 7శుక్లములు (రేతస్సు)
(ఆ) 1రోమ (వెంట్రుక) 2త్వక్ (చర్మము) 3మాంస 4అస్థి (ఎముక) 5స్నాయు (సన్నపు నరము) 6మజ్జా (ఎముకలలోని కొవ్వు) 7ప్రాణములు (ప్రాణవాయువు)
(ఇ) 1త్వక్ (చర్మము) 2మాంస (మాంసము) 3రుధిర (రక్తము) 4మేధో (మెదడు) 5మజ్జ (మూలుగ) 6అస్థి (ఎముకలు) 7శుక్లములు (వీర్యము)