పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

అనుయుక్తాలు- పారిభాషికపదాలు : పురాణాల వివరాలు

పురాణములు 8SK_629vachanam

పురాణము - పురాతన చరిత్రము, పురణింప (వర్ధిల్ల) జేయునది, “పురా అపి నవ ఇతి పురాణః”. ఎంతో పురాతన మై ఎప్పటికప్పుడు సరికొత్తగా స్పురించేది పురాణం.


పంచ లక్షణములు

పంచ లక్షణములు -
1సర్గ (సృష్టి)
2ప్రతిసర్గ (ప్రతిసృష్టి)
3(మను)వంశము
4మన్వంతరము
5వంశానుచరితము


దశ లక్షణములు

దశలక్షణములు -
1సర్గము (మహదహంకార పంచతన్మాత్ర ఇంద్రియ భూతపంచ ప్రపంచ సృష్టి)
2విసర్గము (విరాట్పురుషుని వలన సంభవించిన చరాచర భూత సృష్టి)
3స్థానము (శ్రీహరి అవతారము లెత్తి జగత్తును పాలించుట)
4పోషణము (శ్రీహరి నిజభక్త జనోద్ధరణము చేయుట)
5ఊతులు (కర్మవాసనలు, పుణ్యపాపములు)
6మన్వంతరములు (పదునలుగురు మనువుల చరిత్రలు వారి ధర్మములు)
7ఈశాను కథలు (శ్రీహరి అవతార కథలు, అతని భక్తుల చరిత్రలు)
8నిరోధము (శ్రీమన్నారాయణుని యోగనిద్ర, దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ)
9ముక్తి (అవిద్య త్యజించి నిశ్చల భక్తిచే శ్రీహరి రూపమును స్వస్వరూపముగ నొందుట)
10ఆశ్రయము (సృష్టి స్థితి లయములు ఎవ్వని వలన గలిగెనవో అతడే, ఆ పరమాత్మే ఆశ్రయము)


అష్టాదశపురాణములు

అష్టాదశ పురాణములు (18)
1బ్రాహ్మము 2పాద్మము 3వైష్ణవము 4శైవము 5భాగవతము 6నారదీయము 7మార్కండేయము 8ఆగ్నేయము 9భవిష్యత్తు 10బ్రహ్మకైవర్తము 11లైంగము 12వారాహము 13స్కాందము 14వామనము 15కౌర్మము 16మాత్స్యము 17గారుడము 18బ్రహ్మాండ


తర్కాదులు

తర్కము - శాస్త్రములు (నియమన గ్రంధములు) ఆరింటిలోనిది, 1తర్కము 2వ్యాకరణము 3ధర్మము 4మీమాంస 5వైద్యము 6జ్యోతిషము

ఆమ్నాయము చతుర్వేదములు, 1ఋగ్వేదము 2యజుర్వేదము 3సామవేదము 4అధర్వణవేదము

నియమము - అష్టాంగయోగములలోని శరీరముకంటె భిన్నమైన మృజ్జలాదులు సాధనములుగా కలిగి నిత్యముగా ఆచరింపదగిన ఒక యోగాంగము (ఇది దశవిధము - 1తపము 2సంతోషము 3ఆస్తికత్వము 4దానము 5భగవదర్చన 6వేదాంతశ్రవణము 7లజ్జ 8మతి 9జపము 10వ్రతము)


ఇతిహాసము - పూర్వము జరిగిన కథ, 1రామాయణము 2భారతము మొదలైనవి.

సంహిత - వేదాంగములు 6
1 శిక్ష - కర్త - పాణిని
2 వ్యాకరణము - కర్త - పాణిని
3 ఛందము - కర్త - పింగళముని
4 నిరుక్తము - కర్త - యాస్కముని
5 జ్యోతిషము - కర్తలు - ఆదిత్యాదులు
6 కల్పము - కర్తలు - అశ్వలాయన, కాత్యాయన, ఆపస్తంబ, బోధాయన, వైఖానస, ద్రాహ్యాయన, భారద్వాజ, సత్యాషాఢ, హిరణ్యకేశి మున్నగువారు


అష్టాదశ పురాణముల గ్రంథ సంఖ్య SK-12_30&48_వచనాలు

1 బ్రహ్మపురాణము 10000
2 పద్మపురాణము 55000
3 విష్ణుపురాణము 23000
4 శివపురాణము 24000
5 శ్రీమద్భాగవతము 18000
6 భవిష్యోత్తరపురాణము 14500
7 నారదపురాణము 25000
8 మార్కండేయపురాణము 9000
9 అగ్నిపురాణము 15400
10 బ్రహ్మకైవర్తపురాణము 18000
11 లింగపురాణము 11000
12 వరాహపురాణము 24000
13 స్కాందపురాణము 81100
14 వామనపురాణము 10000
15 కూర్మపురాణము 17000
16 మత్స్యపురాణము 14000
17 బ్రహ్మాండపురాణము 12000
18 గరుడపురాణము 19000
మొత్తము 400000