పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

అనుయుక్తాలు- పారిభాషికపదాలు : పంచీకరణ

గమనిక - ప్రపంచ సృష్టికి కారణమైన క్రియ ఇది. పృథివి, ఆకాశం, వాయువు, నీరు, తేజస్సు, అగ్ని అనేవి పంచభూతాలు. తొలుత ఒక్కొక్క భూతంలోని సగభాగం తిరిగి నాలుగు భాగాలై, మిగతా నాలుగు భూతాల సగాలతో కలిసింది. ఇలా ఒక పద్ధతిలో కలుస్తూ పోవడంలో జీవకోటి ఏర్పడిరది. మిశ్రమంలో పరిమాణాలు మారుతున్న కొలది సృష్టిలో వైవిధ్యం పెరిగింది. జీవుల ప్రారబ్ధాన్ని బట్టి పంచభూతాల మిశ్రమంలో మార్పులు రావడం, సృష్టి వైవిధ్యం కొన సాగడం జరిగిపోతుంటుంది. (శంకరా చార్యుల వారు ‘పంచీకరణం’ అనే గ్రంథం వ్రాశారు. దానికి సురేశ్వరాచార్యులు వార్తికం వ్రాశారు.) ప్రతి భూతంలోనూ మిగతా భూతాల గుణాలు ఎంతోకొంత ప్రమాణంలో ప్రవేశించడం వైవిధ్యహేతువు. ఇలా పంచీ కరణం చేసిన భూతాల నుంచే బ్రహ్మాండం, భోగ్య పదార్ధాలు, భిన్న భిన్న స్వభావాలు కలిగిన శరీరాలు జనించాయి. (వేదాంత పంచదశి- తత్త్వవివేక ప్రకరణం)

1 ( ఆకాశపంచికరణములు )
ఆకాశం- ఆకాశంలోకలవడం వల్ల (జ్ఞానం )
ఆకాశం- వాయువులోకలవడం వల్ల (మనస్సు )
ఆకాశం- అగ్నిలోకలవడం వల్ల (బుద్ది )
ఆకాశం- జలంతోకలవడంవల్ల (చిత్తం )
ఆకాశం- భూమితోకలవడంవల్ల (ఆహంకారం )పుడుతుతున్నాయి

2( వాయువుపంచికరణములు )
వాయువు- వాయువుతోకలవడం వల్ల (వ్యాన)
వాయువు- ఆకాశంతోకలవడంవల్ల (సమాన )
వాయువు- అగ్నితోకలవడంవల్ల (&;దాన )
వాయువు- జలంతోకలవడంవల్ల (ప్రాణ )
వాయువు- భూమితోకలవడంవల్ల (అపాన )వాయువులు పుడుతున్నాయి.

3 ( అగ్నిపంచికరణములు )
అగ్ని- ఆకాశంతోకలవడంవల్ల (శ్రోత్రం )
అగ్ని- వాయువుతోకలవడంవల్ల (వాక్కు )
అగ్ని- అగ్నిలోకలవడంతో (చక్షువు )
అగ్ని- జలంతోకలవడంతో (జిహ్వ )
అగ్ని- భూమితోకలవడంతో (ఘ్రాణం )పుట్టెను.

4 ( జలంపంచికరణములు )
జలం- ఆకాశంలోకలవడంవల్ల (శబ్దం )
జలం- వాయువుతోకలవడంవల్ల (స్పర్ష )
జలం- అగ్నిలోకలవడంవల్ల (రూపం )
జలం- జలంలోకలవడంవల్ల (రసం )
జలం- భూమితోకలవడం వల్ల (గంధం)పుట్టెను.

5 ( భూమిపంచికరణంలు )
భూమి- ఆకాశంలోకలవడంవల్ల (వాక్కు )
భూమి- వాయువుతోకలవడం వల్ల (పాని )
భూమి- అగ్నితోకలవడంవల్ల (పాదం )
భూమి- జలంతోకలవడంతో (గూహ్యం )
భూమి- భూమిలోకలవడంవల్ల (గుదం )పుట్టెను.

Top of Form