పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

అనుయుక్తాలు- పారిభాషికపదాలు : పంచప్రాణములు

దశవిధప్రాణములు లేక దశవిధవాయువులు

7-464 పద్యము

1) పంచప్రాణములు - ప్రాణము, అపానము, వ్యానము, ఉదానము, సమానము.
2) పంచోప ప్రాణములు - నాగము, కూర్మము, కృకరము, దేవదత్తము, ధనంజయము.

పంచ వాయువులు


1. ప్రాణము - హృదయముననుండియు నాసికముండియు వెలువడును
2. అపానము - పొత్తికడుపునకు దిగువనుండి మలమూత్రాదుల వెడలింపజేయును
3. వ్యానము - శరీరము నందంతటను వ్యాపించి యుండును
4. ఉదానము - కంఠమునుండి మాటలాడ వీలుగలుగ చేయును
5. సమానము - అన్నాశయమున జఠరాగ్నికి సమీపమున యుండును

పంచ ఉపవాయువులు

1. నాగము  - వాక్కు నందుండునది
2. కూర్మము  - కంటిరెప్ప లందుండునది
3. కృకరము  - నేత్రము లందుండునది
4. దేవదత్తము  - కంఠద్వారమున నుండునది
5. ధనంజయము  - హృదయముననుండునది