అనుయుక్తాలు- పారిభాషికపదాలు : రాగద్వేషాలు - వివరములు
త్రయోదశ రాగద్వేషములు SK_10.2-1077-సీ
త్రయోదశ రాగద్వేషములు - 1రాగము 2ద్వేషము 3కామము 4క్రోధము 5లోభము 6మోహము 7మదము 8మాత్సర్యము 9ఈర్ష్య 10అసూయ 11దంభము 12దర్పము 13అహంకారము.
1 : : రాగము : : పరస్త్రీ విషయకముగ కలిగెడి చిత్తవృత్తి : : రావణాసురుడు సీతను చెరపట్టి రాగము చెంది ఆ రాగము వలన నశించుట.
2 : : ద్వేషము : : అపకారముచేసినవానికి మరల అపకారము చేయవలెననెడి చిత్తవృత్తి : : హిరణ్యకశిపుడు అన్నని హరి చంపెనని హరిని ద్వేషించి నశించుట.
3 : : కామము : : మిక్కలిగా సంపాదించవలెనని యావ కల చిత్తవృత్తి : : నరకాసురుడు, జరాసంధుడు అనేక స్త్రీలను, రాజులను చెఱపట్టి నశించుట.
4 : : క్రోధము : : తన పనికి విఘ్నము కలిగించిన శిక్షించవలెననెడి చిత్తవృత్తి : : శిశుపాలుడు తను వివాహమాడదలచిన రుక్మిణిని కృష్ణుడు వివాహమాడెనని కృష్ణుని క్రోధించి నశించుట.
5 : : లోభము : : తనకు లభించిన దానిని ఇతరులకు ఇవ్వలేని చిత్తవృత్తి : : దుర్యోధనుడు లోభము వలన నశించుట.
6 : : మోహము : : పుత్ర కళత్ర ధనాదుల ఎడ మిక్కుటమైన తగులము కల చిత్తవృత్తి : : దశరథుడు కైకమీది మోహముచేత నశించుట.
7 : : మదము : : కలిమి వలన గర్వాంథము కల చిత్తవృత్తి : : కార్తవీర్యుని పుత్రుల మదము వలన నశించుట.
8 : : మాత్సర్యము : : తన కంటె ఎక్కుడు భోగములు కల ఇతరులందు ఓర్వలేకపోవు చిత్తవృత్తి : : శిశుపాలుడు కృష్ణుని వైభవము చూసి ఓర్వలేక వదరి నశించుట.
9 : : ఈర్ష్య : : తనకు వచ్చిన కష్టము ఇతరులకు రావలెననెడి చిత్తవృత్తి : : అరుణాసురుడు తోటి బాణాసురునకు దుఃఖమురాగోరి నశించుట.
10 : : అసూయ : : తనకు కలిగిన సుఖము ఇతరులకు కలుగ రాదను చిత్తవృత్తి : : పౌండ్రక వాసుదేవుడు కృష్ణుని ఎడల అసూయ వలన నశించుట.
11 : : దంభము : : గొప్పలు చెప్పుకొని ఇతరులనుండి అధిక మెచ్చుకోలు ఆశించు చిత్తవృత్తి : : అపూర్వుడు తన యాగము అతి విశిష్ఠత్వమనెడి దంభము వలన దుర్వాసుని చేత భంగపడుట.
12 : : దర్పము : : సాటిలేని వాడననెడి చిత్తవృత్తి : : రావణాసురుడు అధిక దర్పమువలన నశించుట.
13 : : అహంకారము : : అధిక సామర్థుడనని ఇతరులుకు అపకారము చేయు చిత్తవృత్తి : : మధుకైటభులు అహంకారము వలన నశించుట.
అరిషడ్వర్గాలు - వివరణ
కామము | = | మిక్కలిగా సంపాదించవలెనని యావ కల చిత్తవృత్తి. | - | (నరకాసురుడు, జరాసంధుడు అనేక స్త్రీలను, రాజులను చెఱపట్టి నశించుట. ) |
క్రోధము | = | తన పనికి విఘ్నము కలిగించిన వాని శిక్షించవలెననెడి చిత్తవృత్తి. | - | (శిశుపాలుడు తను వివాహమాడదలచిన రుక్మిణిని కృష్ణుడు వివాహమాడెనని కృష్ణుని క్రోధించి నశించుట. ) |
లోభము | = | తనకు లభించిన దానిని ఇతరులకు ఇవ్వలేని చిత్తవృత్తి. | - | (దుర్యోధనుడు లోభము వలన నశించుట. ) |
మోహము | = | పుత్ర, కళత్ర, ధనాదుల ఎడ మిక్కుటమైన తగులము కల చిత్తవృత్తి. | - | (దశరథుడు కైక మీది మోహముచేత నశించుట. ) |
మదము | = | జన్మ, విద్య, ధన, వైభవాదుల కలిమి వలన గర్వాంథము కల చిత్తవృత్తి. | - | (కార్తవీర్యుని పుత్రుల మదము వలన నశించుట.) |
మాత్సర్యము | = | తన కంటె ఎక్కుడు భోగములు కల ఇతరులందు ఓర్వలేకపోవు చిత్తవృత్తి. | - | (శిశుపాలుడు కృష్ణుని వైభవము చూసి ఓర్వలేక వదరి నశించుట) |