పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

అనుయుక్తాలు- పారిభాషికపదాలు : కౌరవులు

ధృతరాష్ట్రుని కొడుకులు కౌరవులు నూరుగురు వారి చెల్లెలు దుశ్శల

పాండురాజు కొడుకులు పంచపాండవులు
పాండవుల 5గురి పేర్లు
1. యుధిష్టరుడు (ధర్మరాజు), 2. భీమసేనుడు, 3. అర్జునుడు, 4.నకులుడు, 5. సహదేవుడు
2. కౌరవులు నూరుగురు పెర్లు:
1)సుయోధనుడు(దుర్యోధనుడు) 2)దుశ్శాసనుడు 3)దుర్దర్షుడు 4)దుర్ముఖుడు 5)జలసంధుండు 6)సహుడు 7)సముడు 8)విందుడు 9)అనువిందుడు 10)దుర్బాహుడు 11)సుబాహుడు 12)దుష్టదర్శనుడు 13)ధర్మదుడు 14)చిత్రయోధి 15)దుష్కర్ణుడు 16)కర్ణుడు 17)వివంశతి 18)వికర్ణుడు 19)జయసంధి 20)సులోచనుడు 21)చిత్రుడు 22)ఉపచిత్రుడు 23)చిత్రాక్షుడు 24)చారువిత్రువుడు 25)శతాననుడు 26)దుర్మర్షణుడు 27)దుర్దర్షణుడు 28)వివర్షుడు 29)కటుడు 30)శముడు 31)వృద్దనాభుడు 32)సునాధుడు 33)నందకుడు 34)ఉపనందకుడు 35)సేనాపతి 36)శుషేణుడు 37)కుండకుడు 38)మహోదరుడు 39)చిత్రధ్వజుడు 40)చిత్రరథుడు 41)చిత్రభానుడు 42)అమిత్రజిత్ 43)చిత్రబాణుడు 44)చిత్రవర్ముడు 45)సువర్ముడు 46)దుర్వియోచనుడు 47)చిత్రసేనుడు 48)విక్రాంతకుడు 49)సుచిత్రుడు 50)చిత్రవర్మభృత్ 51)అపరాజితుడు 52)పండితుడు 53)శాలాక్షుడు 54)దురాపరాజితుడు 55)జయంతుడు 56)జయత్శేనుడు 57)దుర్జయుడు 58)దృఢహస్తుడు 59)సుహస్తుడు 60)వాతవేగుడు 61)సువర్చనుడు 62)ఆదిత్యుడు 63)కేతువు64)బహ్యంశి 65)నాగదంతుడు 66)ఉగ్రసాయి 67)కవచి 68)శషంగి 69)చాపి 70)దండధారుడు 71)ధనుర్గ్రహుడు 72)ఉగ్రుడు 73)భీముడు 74)రథభీముడు 75)భీమబాహుడు 76)అలోకుడు 77)భీమకర్ణుడు 78)సుబాషుడు 79)భీమవిక్రాంతుడు 80)అభయుడు 81)రౌద్రకర్ముడు 82)ధృఢరథుడు 83)అనాశ్రుద్రుడు 84)కుండబేధి 85)విరావి 86)దీర్ఘలోచనుడు 87)దీర్ఘద్వజుడు 88)దీర్ఘభుజుడు 89)అదీర్ఘుడు 90)దీర్ఘుడు 91)దీర్ఘబాహుడు 92)మహాబాహుడు 93)వ్యుడోరుడు 94)కనకద్వజుడు 95)మహాకుండుడు 96)కుండుడు 97)కుండజుడు 98)చిత్రజాసనుడు 99)చిత్రకుడు 100)కవి

కౌరవుల పూర్వ వంశక్రమము


జయత్సేనునికి కొడుకు రథికుడు. అతనికి అయుతాయువు, అతనికి క్రోధనుడు. అతనికి దేవాతిథి. అతనికి ఋక్షుడు, అతనికి భీమసేనుడు. వానికి ప్రతీపుడు ఆ ప్రతీపునికి కుమారులు దేవాపి, శంతనుడు, బాహ్నికుడు. దేవాపి చిన్నతనంలోనే భక్తి మార్గం పట్టాడు. తపస్సు చేసుకొడానికి అడవికిపోయాడు. దానితో శంతనుడు రాజు అయ్యాడు.
శంతనుడు - కుమారులు - 1. భార్య గంగాదేవి యందు భీష్ముడు (ఆజన్మబ్రహ్మచారి); 2. భార్య సత్యవతి యందు చిత్రాంగదుడు (అపుత్రకుడు); 3. భార్య సత్యవతి యందు విచిత్రవీర్యుడు. పెంచిన కొడుకు కృపుడు, పెంచిన కూతురు కృపి,
విచిత్రవీర్యుడు - కుమారులు - 1. పాండు రాజు; 2. ధృతరాష్ట్రుడు; 3. విదురుడు
అంబిక యందు - కుమారుడు- ధృతరాష్ట్రుడు
అంబాలిక యందు - కుమారుడు – పాండురాజు
అంబాలిక దాసివలన - కుమారుడు - 3. విదురుడు
గమనిక :- విచిత్రవీర్యునికి కాశిరాజు పుత్రికలను అంబిక అంబాలికలను భీష్ముడు బలవంతంగా తీసుకొని వచ్చి పెండ్లి చేసాడు. అతను క్షయరోగంతో మరణించాడు. అంతట అతని అకాల మరణంతో తల్లి సత్యవతి వంశవిస్తారార్థం విచిత్రవీర్యుని భార్యల యందు సంతానం కలిగించమని, భీష్ముడు ఆజన్మాంతం బ్రహ్మచారిగా ఉంటానని భీష్మ ప్రతిజ్ఞ చేసి ఉండుటవలన, తనకు పూర్వం పరాశర మహర్షి వలన కన్యత్వం చెడకుండ కలిగిన వ్యాసమహర్షిని ఆజ్ఞాపించింది. ఆప్రకారం అంబికను అనుగ్రహిస్తుంటే ఆమె బెదిరి కనులు మూసుకొనుట వలన పుట్టుగ్రుడ్డిగా ధృతరాష్ట్రుడు కలిగాడు. మరల తల్లి ఆజ్ఞప్రకారం అంబాలికను అనుగ్రహించగా ఆమె వెలవెలబోవడంతో పాండురోగంతో పాండురాజు పుట్టాడు. మరల అనుగ్రహించ బోగా ఆమె దాసిని పంపినది. అలా దాసి యందు విదురుడు కలిగాడు.
1. పాండురాజు -కుమరులు -పాండవులు (5)
గమనిక :- పాండురాజుకు స్త్రీసంగమం చేస్తే మరణం అని శాపం కలుగుట వలన వఇశ్వామిత్రవర మంత్ర ప్రభావంతో పెద్దభార్య దశరథుడను రాజు కుంతిదేశ రాజుకు పెంపుకానికి ఇచ్చిన కుమార్తె కుంతీదేవి యమధర్మరాజు వలన యుధిష్టరుని, వాయుదేవుని వలన భీముని, ఇంద్రుని వలన అర్జనుని పుత్రులుగా పొందింది. రెండవభార్య మద్ర దేశరాకుమారి మాద్రి అశ్వనీ దేవతల వలన నకుల సహదేవులను పుత్రులుగా పొందింది. కుంతీదేవి వివాహానికి ముందు కనిన పుత్రుడు కర్ణుడు, సూతుని భార్య రాధ పెంచింది. ఇందు అర్జునికి ఉత్తర అను భార్య యందు పుట్టిన అభిమన్యుని పుత్రుడు భాగవత శ్రోత పరీక్షిన్మహారాజు
2. ధృతరాష్ట్రుడు - కొడుకులు కౌరవులు నూరుమంది (100), పుత్రిక ఒకర్తె (1) దుశ్శల.
గమనిక :-ధృతరాష్ట్రుని భార్య గాంధార (కాందహార) దేశ రాకుమార్తె గాంధారి. వివాహ సందర్భంలో ఆమె సోదరుడు శకుని కూడ వచ్చి ఉండిపోయాడు. ఆ గాందారి గర్ఫం ధరించి కనిన పిండం కుండలో భద్రపరచారు. చాలా కాలం ఐందని తొందరపడి పగులగొట్టగా నూరు (100) ముక్కలై నూరుగురు కొడుకులు పుట్టారు. తరువాత దుశ్శల పుట్టింది.