పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

అనుయుక్తాలు- పారిభాషికపదాలు : కాలము - కొలత - (11) పేర్లు కల్పములు

కల్పముల పేర్లు

ప్రస్తుతం మహాభారతం ప్రకారం బ్రహ్మకు 51వ సంవత్సరంలో "శ్వేతవరాహ కల్పం" నడుస్తున్నది. మత్స్య పురాణం (290.3-12)లో 30 కల్పాల పేర్లు చెప్పబడ్డాయి. అవి]:

1. శ్వేత వరాహ కల్పము, 2. నీలలోహిత కల్పము, 3. వామదేవ కల్పము, 4. రత్నాంతర కల్పము, 5. రౌరవ కల్పము, 6. దేవ కల్పము, 7. బృహత్ కల్పము, 8. కందర్ప కల్పము, 9. సద్యః కల్పము, 10. ఈశాన కల్పము, 11. తమో కల్పము, 12. సారస్వత కల్పము, 13. ఉదాన కల్పము, 14. గరుడ కల్పము, 15. కౌర కల్పము, 16. నారసింహ కల్పము, 17. సమాన కల్పము, 18. ఆగ్నేయ కల్పము, 19. సోమ కల్పము, 20. మానవ కల్పము, 21. తత్పుమాన కల్పము, 22. వైకుంఠ కల్పము, 23. లక్ష్మీ కల్పము, 24. సావిత్రీ కల్పము, 25. అఘోర కల్పము, 26. వరాహ కల్పము, 27. వైరాజ కల్పము, 28. గౌరీ కల్పము, 29. మహేశ్వర కల్పము, 30. పితృ కల్పము.
మరికొన్ని ఇతర పురాణాలలోని పేర్లు - 31. మానవ కల్పము, 32. తత్పురుష కల్పము, 32. వైకుంఠ కల్పము,, 4. లక్ష్మీ కల్పము,, 35. సావిత్రీ కల్పము,, 36. అఘోర కల్పము,, 37. పద్మ కల్పము

పాఠ్యంతరము :_ షడ్వింశతి-కల్పములు : సంకేత పదకోశము (రవ్వా శ్రీహరి) 2002 1. బ్రాహ్మము, 2. పాద్మము, 3. శ్వేతము, 4. నీలలోహితము, 5. వామదేవము, 6. రథంతరము, 7. గౌరవము, 8. దేవము, 9. బృహత్తు, 10. కందర్పము, 11. సద్యః, 12. ఈశానము, 13. తమస్‌, 14. సారస్వతము, 15. ఉదానము, 16. గరుడము, 17. కౌర్మము, 18. నారసింహము, 19. సమానము, 20. ఆగ్నేయము, 21. తత్పురుషము, 22. వైకుంఠము, 23. లక్ష్మీ, 24. సావిత్రీ, 25. అఘోరము, 26. వారాహము.