పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

అనుయుక్తాలు- పారిభాషికపదాలు : అవధూత చెప్పిన గురువులు

అవధూత చెప్పిన గురువులు - ఙ్ఞానములు SK_11-99-వ.

1 భూమి వలన సైరణ (సహనము) 

 2 గంధవహుని (వాయువు) వలన పరోపకారము 

 3 విష్ణుపదంబు (ఆకాశము) వలన కాలముచే సృష్టించబడిన గుణములతో సాంగత్యలేమి 

 4 ఉదకంబు (నీరు) వలన నిత్య శుచిత్వంబు

 5 అసితపథుని (అగ్ని) వలన నిర్మలత్వంబు 

 6, 7 సూర్య చంద్రులవలన సర్వ సమత్వ భావముగల జీవితము గ్రహణ మోక్షణంబులు 

 8 కపోతంబు (పావురము) వలన భార్యాబిడ్డల లందలి మిత్రత్వత్యాగము 

 9 అజగరంబు (కొండచిలువ వలన స్వేచ్ఛావిహారము లభించిన ఆహారాన్ని స్వీకరించుట 

 10 వననిధి (సముద్రము) వలన ఉత్సాహ రోషములు 

 11 శలభంబు (మిడుత) వలన శక్తికి అనుకూలమైన కర్మాచరణము 

12 భృంగంబు (తుమ్మెద) వలన సారము మాత్రమే స్వీకరించెడి నేర్పు 

 13 స్తంబేరమంబు (ఏనుగు) వలన స్త్రీల యెడ విముఖత 

 14 సరఘ (తేనెటీగ) వలన కూడబెట్టుట 

 15 హరిణంబు (లేడి) వలన చింతా పరత్వంబు 

16 జలచరంబు (తాబేలు) వలన జిహ్వాచాపల్యము 

 17 పింగళ (ముంగిస) వలన యథాలాభ సంతుష్టి 

18 కురరంబు (లకుముకిపిట్ట) వలన మోహ పరిత్యాగంబు 

19 డింభకు (బాలుని) వలన విచార పరిత్యాగము 

20 కుమారిక (బాలిక) వలన సంగ త్యాగము 

 21 శరకారుని (బాణాలు వేయువాని) వలన తదేకనిష్ఠ 

22 దందశూకంబు (పాము) వలన పరగృహ నివాసము 

23 ఊర్ణనాభి (సాలెపురుగు) వలన సంసార పరిత్యాగము 

24 కణుందురు (కందిరీగ) వలన లక్ష్యగత ఙ్ఞానమును విడువకుండుట