పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

అనుయుక్తాలు- పారిభాషికపదాలు : గర్భస్థ పిండం దశలు

గర్భస్థ పిండం దశలు
3-991-వ.

 

గర్భధారణ సమయంలో మళ్ళీ దేహం పొందెడి జీవుడు పురుషుని వీర్యబిందువుతో కూడి స్త్రీ గర్భంలో ప్రవేశిస్తాడు.
1 రోజుకి శుక్ర శోణితాల ద్రవము అవుతాడు
5 రోజులకు బుద్బుదము అంత అవుతాడు
10 రోజులకు రేగుపండు అంత, ఆ పైన మాంస పిండం అవుతాడు ; గ్రుడ్డు ఆకారం పొందుతాడు
1 నెలకి శిరస్సు ఏర్పడుతుంది
2 నెలలకు కాళ్ళు, చేతులు ఏర్పడతాయి
3 నెలలకు గోళ్ళు, వెంట్రుకలు, ఎముకలు, నవరంద్రాలు (కళ్ళు - 2, ముక్కు రంధ్రాలు – 2, చెవులు - 2, నోరు, గుదము, రహస్యాంగం మొత్తం - 9) ఏర్పడతాయి
4 నెలలకు సప్తధాతువులు (శుక్లం, శోణితం, మాంసం, చీము, మెదడు, ఎముక, చర్మం మొత్తం - 7) కలుగుతాయి
5 నెలలో ఆకలి, దుప్పులు మొదలౌతాయి
6 నెలలో మావి చేత కప్పబడి; తల్లి కడుపులో కుడి వైపున తిరుగుతుంటాడు; తల్లి తిన్న ఆహార, పానీయాలతో తృప్తి పొందుతుంటాడు; ధాతువులు (వాత, పిత్త, శ్లేష్మాలు) పెరుగుతుంటాయి; మలమూత్రాల గుంటలలో పొర్లుతుంటాడు; అందలి క్రిములు శరీరమంతా ప్రాకి బాధపెడుతుంటే మూర్ఛపోతు ఉంటాడు; తల్లి తిన్న కారం, చేదు, ఉప్పు, పులుపు మొదలైన తీవ్ర రసాలు అవయవాలను తపింప జేస్తాయి, మావిచేత కప్పబడి, బయట ప్రేగులచే కట్టబడి, తల్లి కడుపులో తల వంచి, వంగి ముడుచుకొని పండుకొని ఉంటాడు. అవయవాలు కదల్చడానికి శక్తి లేక బంధింపబడి ఉంటాడు; దైవదత్తమైన తెలివి ఉంటుంది; పూర్వజన్మలలో చేసిన పాపాలు తలంచుకొని నిట్టూరుస్తుంటాడు; కొంచం కూడ సుఖం పొందలేడు.
7వ నెలలో జ్ఞానం కలుగుతుంది; కదలికలు కలుగుతాయి; మలంలోని క్రిములతో కలిసిమెలిసి ఒకచోట ఉండ లేక తల్లి కడుపులు అటు యిటు తిరుగుతు ఉంటాడు. గర్భ వాయువులకు తపిస్తుంటాడు;  దేహాత్మ దర్శనం కలిగి, విమోచనాన్ని యాచిస్తు ఉంటాడు. మళ్ళీ గర్భవాసం కలిగినందుకు భయపడుతు ఉంటాడు; ; సప్తధాతువులతో బంధింపబడి ఉంటాడు; చేతులు జోడించి దీనముఖుడై సర్వేశ్వరుని సంస్తుతిస్తు ఉంటాడు.
9 నెలలు నిండే వరకు ఇలా గర్భ నరక బాధలు పడుతుంటాడు
10వ నెలలో తలక్రిందులు అవుతాడు; ఉచ్ఛ్వాస నిశ్వాసాలు లేక ఉక్కిరిబిక్కిరి అవుతుంటాడు; ఎంతో బాధ పడుతు ఉంటాడు; జ్ఞాన రహితుడై నెత్తురు పులుముకొని బాహ్య ప్రపంచంలోకి పడతాడు.