ఆశ్రమములు | వృత్తులు | వివరణ |
(అ) బ్రహ్మచర్యము | 1. సావిత్రము | బ్రహ్మచర్యము - ఉపనయనము ఆదిగా మూడు దినములు గాయత్రి జపించుట |
| 2. ప్రాజాపత్యము | నాలుగు వేదవ్రతములును ఒక్కొక్కటి సంవత్సరము పాటు ఆచరించుట |
| 3. బృహత్తనము | వేదము నేర్చుకొనిన తరువాత ఆచరించు వ్రతము |
| 4. నైష్ఠికము | వేదము నేర్చుకొనిన తరువాత ఆచరించు వ్రతము |
(ఆ)గార్హస్థము | 1. వార్త | నిషిద్దముకాని వ్యవసాయము చేయుట |
| 2. సంచయము | యఙ్ఞాది మొదలగునవి చేసి ధనము సంపాదించుట |
| 3. శాలీనము | అయాచితము, ఎవరిని యాచింపకుండుట |
| 4. శిలోంఛనము | పొలములలో రాలిన కంకులు సమీకరించుట |
(ఇ) వానప్రస్థము | 1. వైఖనసులు | భూమిని దున్నకుండ దొరుకు ఆహారములు సేవించును |
| 2. వాలఖిల్యులు | కొత్త పంట రాగానే వెనుకటి (పాత) పంటను విసర్జించును |
| 3. ఔదంబరులు | ఉదయము లేవగానే చూసిన వైపు వెళ్ళి అక్కడ అయాచితముగ లభించిన ఆహారము స్వీకరించును |
| 4. ఫేనపులులు | చెట్లనుండి వాటంతటవి రాలినవి మాత్రము స్వీకరించును |
(ఈ) సన్యాసము | 1. కుటీచకుడు | స్వంత ఆశ్రమము (కుటీరము)న నిర్దేశించిన కర్మములు ఆచరించును |
| 2. బహూదకుడు | కుటీరము ఉండదు. కర్మములను విడిచి ఙ్ఞానప్రదానుడై తిరుగుచుండును |
| 3. హంస | కేవలము ఙ్ఞానమును అబ్యాసము చేయుచుండును |
| 4. నిష్క్రియుడు | అభ్యాసము కూడ ఉండదు. కేవలము పరబ్రహ్మ తత్త్వము గా యుండును |