పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

అనుయుక్తాలు- పారిభాషికపదాలు : భాగవతతుల ధర్మములు

భాగవతులు అయినవారి లక్షణములు 7-409వచనము

సకల జనులు మరియు చాతుర్వర్ణులవారు (విప్రులు; క్షత్రియులు; వైశ్యులు; శూద్రులు)

సకలజనుల త్రింశతి లక్షణములు (31)


సత్యము - దయ
ఉపవాసాది తపము - శౌచము
సైరణ - సదసద్వివేకము
మనోనియమము - బహిరింద్రియ జయము
హింస లేమి - బ్రహ్మచర్యము
దానము - యథోచిత జపము
సంతోషము - మార్దవము
సమదర్శనము - మహాజన సేవ
గ్రామ్యకోరికలు - నిష్ఫల క్రియలు విడుచుట
మితభాషిత్వము - దేహముగాని తన్ను వెదకికొనుట
అన్నోదకంబులు ప్రాణులకు పంచి యిచ్చుట - ప్రాణులందు దేవతాబుద్ధి యాత్మబుద్ధి చేయుట
శ్రీనారాయణచరణ స్మరణ - కీర్తనము
శ్రవణము - సేవ
అర్చన - నమస్కారము
దాస్యము - ఆత్మసమర్పణము
సఖ్యము - చెలిమి కలిగి ఉండుట

బ్రాహ్మణుని-లక్షణములుఈ త్రింశతి (30) లక్షణాలు కలిగి, (31) సత్కులాచారాములు కలగి ఉండుట మరియు (32) మంత్రపూతములు అయిన గర్భాదానిది సంస్కారములు కలిగి ఉండుట

బ్రాహ్మణుడుక్షత్రియుడువైశ్యుడుశూద్రుడు
షట్కర్మములుఏడు కర్మములు మూడు కర్మములుఒక కర్మము
1. యజన - యజ్ఞములు చేయుట
2. యాజన - యజ్ఞములు చేయించుట
3. అధ్యయన - వేదశాస్త్రములు అధ్యయనము (చదువులు చదువుకొనుట)
4. అద్యాపన - చదువులు చెప్పుట
5. దాన - దానములు చేయుట
6. ప్రతిగృహము - దానములు పుచ్చుకొనుట
1. యజన - యజ్ఞములు చేయుట
2. యాజన - యజ్ఞములు చేయించుట
3. అధ్యయన - వేదశాస్త్రములు అధ్యయనము (చదువులు చదువుకొనుట)
4. అద్యాపన - చదువులు చెప్పుట
5. దాన - దానములు చేయుట
6. ప్రజాపాలన - రాజ్యమును పాలించుట
7. దండశుల్కాదులు - బ్రహ్మణులు కానివారి నుండి దండుగలు, పన్నులు వసూలు చేయుట

1. కృషి - వ్యవసాయము
2. వాణిజ్యము - వ్యాపారము
3. గోరక్షణ - పశుపాలన

1. ద్విజ శుశ్రూష - బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య వర్ణముల వారి సేవ