అనుయుక్తాలు- పారిభాషికపదాలు : అష్టదిగ్గజములు
అష్టదిగ్గజములు
దిక్కు | గజములు | గజ భార్యలు |
తూర్పు | ఐరావతం | అభ్ర |
ఆగ్నేయం | పుండరీకం | కపిల |
దక్షిణ | వామనం | పింగళ |
నైఋతి | కుముదం | అనుపమ |
పడమర | అంజనం | తామ్రపర్ణి |
వాయవ్యం | పుష్పదంత | శుభ్రదంతి |
ఉత్తరం | సార్వభౌమ | అంగన |
ఈశాన్యం | సుప్రతీకం | అంజనావతి |
పాఠ్యంతరం
నాలుగు దిక్కులలో నాలుగు దిగ్గజాలు ఉంటాయి అవి:-
ఋషభము, పుష్కరచూడము, వామనము, అపరాజితము.
ఆధారం: తెలుగు భాగవతము:-
5.2-73-వ,
బ్రహ్మచేతఁ జతుర్దిశల యందు ఋషభ పుష్కరచూడ వామ నాపరాజిత సంజ్ఞలుగల దిగ్గజంబులు నాలుగును లోకరక్షణార్థంబు నిర్మితంబై యుండు;