అనుయుక్తాలు- పారిభాషికపదాలు : అష్టాదశ సిద్దులు
అష్టాదశ ధారణాయోగసిద్ధులు
SK_11-99-వ.
అష్టాదశసిద్ధులు - అణిమాది ఎనిమిది (8) గౌణసిద్దులు పది (10)ఇవి కాక క్షుద్ర సిద్ధులు ఐదు (5)
అణిమాది, అష్టసిద్ధులు
అణిమాది, అష్టసిద్ధులు - అణిమ, మహిమ, లఘిమ, గరిమ, ప్రాప్తి, ప్రాకామ్యము, ఈశత్వము, వశిత్వము అను ఎనిమిది (8). వాటి వివరములు "
ఒక విధము:1 అణిమ - అణువుగ సూక్ష్మత్వము నందుట, 2 మహిమ - పెద్దగ అగుట, 3 గరిమ - బరువెక్కుట, 4 లఘిమ - తేలికగనౌట, 5 ప్రాప్తి - కోరినది ప్రాప్తించుట, 6 ప్రాకామ్యము - కోరిక తీర్చుట, 7 ఈశత్వము - ప్రభావము చూపగలుగుట, 8 వశిత్వము - వశీకరణము చేయగలుగుట | || | ఇంకొక విధమున 1 అణిమ - మిక్కిలి సూక్ష్మరూపమును పొందుట, 2 మహిమ - మిక్కిలి స్థూల రూపమును పొందుట, 3లఘిమ - మిక్కలి తేలిక రూపమును పొందుట, 4 ప్రాప్తి - ఇంద్రియాలతో ఇంద్రయాదిష్టాన దేవతలను దర్సించుట, 5 ప్రాకామ్య - లౌకిక పారలౌకిక పదార్తములను దర్శించి అనుభవించు సామర్థ్యము, 6 ఈశిత్వ - మాయనుపాధిగా కలిగిన ఈశ్వరుని అంశలగు ఙ్ఞాన వీర్యాదులను ప్రకోపింపజేయుట, 7 వశిత్వ - విషయ భోగ విరక్తి, 8 కామావసాయత - సమస్త కోరికలు ఉపశమించుట. |
దశవిధ గౌణ సిద్ధులు
దశవిధ గౌణ సిద్ధులు గుణములవలన పుట్టినవి గౌణసిద్ధులు వాని వివరములు
1 ఆకలి దప్పులు లేక ఉండుట - వాయు భక్షణము,
2దూర ప్రదేశములందున్న విషయములను ఆలకించుట - దూరశ్రవణము,
3 దూర ప్రదేశములందున్న దృశ్యములను దర్శించుట - దూరదర్శనము,
4 దేహము మనోవేగముతో కోరిన ప్రదేశమునకు వెడలుట - కామగమనము,
5 కోరిన రూపము ధరించుట - కామరూపము,
6 అన్య దేహముల ప్రవేశించుట - పరకాయప్రవేశము,
7 దేవతల క్రీడా విలాసములను తిలకించుట,
8 సంకల్పమును సిద్ధించుకొనుట - సంకల్పసిద్ధి,
9 అడ్డులేని ఆదేశమును కలిగి ఉండుట,
10 కోరినప్పుడు దేహమును త్యజించుట - స్వచ్చంద మరణము.
క్షుద్ర సిద్ధులు
ఇవి కాక క్షుద్ర సిద్ధులు ఐదు కలవు. అవి
1 త్రికాలజ్ఞత్వము భూతభవిష్యద్వర్తమానములలోని వానిని తెలిసికొనుట,
2 శీతోష్ణ సహిష్ణుత్వము,
3 అన్యుల మనస్సునెరుగుట,
4 అగ్ని సూర్యుడు జలము విషము మున్నగువాని ప్రభావమునాపుట,
5 అపజయమునను యెరుగకుండ ఉండుట - అజేయము.
సౌజన్యము: సుందర చైతన్యుల వారి శ్రీమద్భాగవతము 1992.