పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

అనుయుక్తాలు- పారిభాషికపదాలు : అష్ట భుజ విష్ణువు ఆయుధాలు

అష్టబాహు విష్ణుమూర్తి ఆయుధాలుఅష్టభుజ విష్ణువు అంగకూరు వాటు వీరభద్ర విజాయానంతరం దక్షునికి శివానుగ్రహంతో గొఱ్ఱె తల వచ్చిన సందర్భంలో మహావిష్ణువు అష్టభుజములతో, ఎనిమిది చేతులలో ఎనిమిది ఆయుదాలతో సాక్షాత్కరించాడు. ఇంద్రుడు "..... సాధన సముద్దీప్తాష్ట బాహా సమన్విత..." (4-181-మ.) అని నుతిస్తాడు.
ప్రసన్నుడైన విష్ణుమూర్తి అనుగ్రహిస్తాడు, అ దక్షయజ్ఞ సుసంపూర్ణం చేయిస్తాడు. అట్టి దివ్య స్వరూప విగ్రహం బహు అపురూపం. కాంబోడియా అనబడుతున్న కాంభోజ దేశంలో అంకూరు వాటు దేవాలయంలో ఉన్నది. కాల ప్రభావంతో ఆయుధాలు మాయం అయిపోయినట్లున్నాయి. ఆ విగ్రహ ఛాయాచిత్రం కుడి ప్రక్క దర్శించలరు, ఎడమ ప్రక్క ఉన్నది ఆయుధాలతో ఉన్న అష్టబాహు విష్ణువు చిత్రం
అష్టభుజ విష్ణుమూర్తి ఎనిమిది (8) చేతులలో ఉండే ఆయుధాలు:-

4-164-చ. పద్యం అనుసరించి - (1) శంఖము; (2) చక్రము; (3)శార్ఙ్గము అనెడి విల్లు; (4) కత్తి; (5)పద్మము; (6) గదా; (7) దండము; (8) శూలము.

(ఆ) 6-300-చ. పద్యంలో చెప్పిన ప్రకారము అష్ట ఆయుదాలు -

1) శంఖము; 2) చక్రము; 3) చర్మము (డాలు); 4) శార్ఙ్గము (విల్లు); 5) ఖడ్గము; 6) శరము; 7) పాశము; 8) గద. ( 6-300-చ. )

(ఇ) పాఠ్యాతరం
(1) చక్రం; (2) ధనుస్సు; (3) పద్మం; (4) శంఖం; (5) ఖడ్గం; (6) పాశం; (7) డాలు; (8) గదాదండం.

గమనిక:- ఇంకా ఇతర పాఠ్యాంతరాలు కూడ ఉన్నాయి...