పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

అనుయుక్తాలు- పారిభాషికపదాలు : ఆదిశేషుడు

ఆది శేషుడు

శేషుడు
శ్లో.  ఆదావంతేచ మధ్యేచ సృజ్యాసృజ్యం యదన్వయాత్,
    పునస్తత్ప్రతిసంక్రామే యచ్ఛిష్యేత తదేవ సత్,
    నష్టే లోకే ద్విపరార్థావసానే మహాభూతేష్వాది భూతంగతేషు,
    వ్యక్తేవ్యక్తం కాలవేగన  యాతే భవానేకశ్శిష్యతే శేషసంఙ్ఞః.
సృష్టి లయములు ఆది మధ్యాంతములందు దేనిని అనుసరించి గడచునో, అటులనే మరలమరల అనుసరించి ప్రకాశింపజేయబడునో, సకల చతుర్దశభువనములు పంచ మహాభూతములు నష్టమై పోయిన బ్రహ్మప్రళయానంతర సుషుప్తి యందు నష్టముకాక శేషించి ఉండునో ఆ ప్రజ్ఞ శేషుడు అని పలుకబడును.
(ఆధారము - సర్వారాయాంధ్రవారి ఆంధ్రమహాభాగవతము)