పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

అనుయుక్తాలు- పారిభాషికపదాలు : అణిమాది - అష్టైశ్వర్యములు

అణిమాది - అష్టైశ్వర్యములు


1 అణిమ అణుప్రమాణ మగుట సూర్యకిరణములలో కనబడు దుమ్ముకణములో ఆరవవంతు లేదా ఎనిమిదవవంతు ఉండునది అణువు. అది కంటికి కనబడదు. దాని యంత అయ్యి అణుప్రమాణజీవులలో కూడ ఉండుట.
2 మహిమ గొప్పదనము బ్రహ్మ విష్ణు మహేశ్వర విరాట్పురుషుల కంటెను గొప్పవాడై యుండుట.
3 గరిమ బరువై యుండుట బ్రహ్మాండ మంత బరువై యుండుట.
4 లఘిమ తేలికగానుండుట దూదిపింజముకంటెను తేలికగానగుట.
5 ప్రాప్తి సంపాదించుట శూన్యమునుండి కూడ ఇష్టపదార్దములు లభింపజేసికొనుట.
6 ప్రాకామ్యము సమర్థత ఆకాశగమనము దూరశ్రవణము మున్నగు సిద్దులు కలిగియుండుట.
7 ఈశత్వము నియమింప గలుగుట సూర్య చంద్ర మహేంద్ర ఉపేంద్రాది దేవతలను కూడ నియమింప గలుగుట.
8 వశిత్వము వశము జేసికొనుట సకల జీవులను స్వాధీనమునకు తెచ్చుకొనుట.