పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

అనుయుక్తాలు- పారిభాషికపదాలు : అష్టవిధ వివాహాలు

8 విధముల వివాహములు 10.1_1683-vachanam


1 బ్రాహ్మము  సదాచారుడైన వరునకు చేయు కన్యాదానము.
2 దైవము  యఙ్ఞారంభమునందు ఋత్విజుని పూజించి అలంకరించి చేయునది.
3 ఆర్షము  ధర్మార్థము వరుని నుండి గోమిథునమును పుచ్చుకొని చేయునది.
4 ప్రాజాపత్యము గృహస్థాశ్రమము అనుసరించుటకు చేయునది.
5 ఆసురము వరుడు ధనమిచ్చి కన్యకను పుచ్చుకొని చేసుకొనునది.
6 గాంధర్వము కన్య, వరుడు ఇరువురు పరస్ఫరము సమ్మతించి చేసికొనునది.
7 రాక్షసము వరుడు బలాత్కారముగా కన్యకను అపహరించి చేసుకొనునది
8 పైశాచము నిద్రించి తాగి మైమరచిన కన్యకను ఎత్తుకుపోయి చేసుకొనునది.

ఇవికాక క్షాత్రము లేదా స్వయంవరము అని మరియొకటి కలదు. అది క్షత్రియ కన్యలు తమ ఇష్టానుసారము వరుని ఎంచుకొని వరించుట స్వయంవరము ఇది క్షత్రియులలో యొక వివాహ పద్ధతి.