పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

అనుయుక్తాలు- పారిభాషికపదాలు : పంచ మహా యఙ్ఞాలు

పంచ మహా యజ్ఞములు SK_10.2-619సీ.

1 దేవయజ్ఞము దేవతల తృప్తికొరకు అగ్ని యందు హవిరాదికముచే హోమము చేయుట. 

2 పితృయజ్ఞము పితృదేవతల ప్రీతికై తర్పణముచేసి ద్విజులకు భోజనము పెట్టుట. 

3 భూతయజ్ఞము వైశ్వదేవానుష్ఠానము పిమ్మట బహిర్దేశమున భూతతృప్తికై బలి యిచ్చుట. 

4 మనుష్యయజ్ఞము శక్తికొలది అతిథులకు అన్నమిడుట. 

5 బ్రహ్మయజ్ఞము ఒక ఋక్కును కాని యజుస్సునుకాని సామము కాని శక్తికొలది నిత్యము అభ్యసించుట.