పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

అనుయుక్తాలు- పారిభాషికపదాలు : చతుర్విధ జన్మలు

చతురవిధజన్మలు SK_10.2-1072సీ

చతురవిధజన్మలు 

1అండజములు 2స్వేదజములు 3జరాయుజములు 4ఉద్భిజ్జములు అనెడి విధానములైన జన్మలు కల ప్రాణులు.

1 అండజములు గుడ్డువలన పుట్టునవి, పక్షులు పాములు మొదలగునవి.

2 స్వేదజములు చెమట వలన పుట్టునవి, దోమలు మున్నగునవి.

3 జరాయుజములు జరాయువు (మావి) వలన పుట్టునవి, జంతువులు మున్నగునవి.

4 ఉద్భిజ్జములు భూమిని ఛేదించుకొని పుట్టునవి, వృక్షములు మున్నగునవి.