పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

అనుయుక్తాలు- పారిభాషికపదాలు : అష్టాదశ పురాణాల సంఖ్య

అష్టాదశ పురాణముల గ్రంథ సంఖ్య SK-12_30&48_వచనాలు

1 బ్రహ్మపురాణము 10000
2 పద్మపురాణము 55000
3 విష్ణుపురాణము 23000
4 శివపురాణము 24000
5 శ్రీమద్భాగవతము 18000
6 భవిష్యోత్తరపురాణము 14500
7 నారదపురాణము 25000
8 మార్కండేయపురాణము 9000
9 అగ్నిపురాణము 15400
10 బ్రహ్మకైవర్తపురాణము 18000
11 లింగపురాణము 11000
12 వరాహపురాణము 24000
13 స్కాందపురాణము 81100
14 వామనపురాణము 10000
15 కూర్మపురాణము 17000
16 మత్స్యపురాణము 14000
17 బ్రహ్మాండపురాణము 12000
18 గరుడపురాణము 19000
మొత్తము 400000

12-30-వ. :: బ్రాహ్మంబు, పాద్మంబు, వైష్ణవంబు, శైవంబు, భాగవతంబు, భవిష్యోత్తరంబు, నారదీయంబు, మార్కండేయం, బాగ్నేయంబు, బ్రహ్మకైవర్తంబు, లైంగంబు, వారాహంబు, స్కాందంబు, వామనంబు, కౌర్మంబు, మాత్స్యంబు, బ్రహ్మాండంబు, గారుడంబు, నని పదునెనిమిది మహాపురాణంబులు,

శ్లో.
మద్వయం, భద్వయం చైవ, బ్రత్రయం, వచతుష్టయం
అనాపలింగ కూస్కాని పురాణాని పృథక్‌ పృథక్‌.

అర్థం:- పురాణాలు ‘మ’ అనే ఆక్షరంతో మొదలయ్యేవి రెండు, ‘భ’తో మొదలయ్యేవి రెండు, ‘బ్ర’తో మొదలయ్యేవి మూడు, ‘వ’తో మొదలయ్యేవి నాలుగు, ‘అ’, ‘నా’, ‘ప’, ‘లిం’, ‘గ’, ‘కూ’, ‘స్కా’ ప్రథమాక్షరాలుగా కలిగినవి ఏడు, వెరసి 18 పురాణాలు