పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

అనుయుక్తాలు- పారిభాషికపదాలు : ద్వాదశాదిత్యులు పరిచారకులు

మాసవారీ సూర్యుని నామములు పరిచారకులు

గమనిక - 1. ఈ సూర్యపరిచారకులలో అప్సరసలు, ఋషులు, నాగులు, రాక్షసులు, గంధర్వులు, యక్షులు ఉన్నారు.

             2. (...) - పుండలీకరణాలలోవి సంస్కృత మూల భాగవతంలోనివి.

             3. ద్వాదశాదిత్యులు జాబితాలో పాఠ్యంతరాలు ఉన్నాయి. కొన్ని క్రింద ఉదహరింపబడ్డాయి.SK_12-41 to 47
మాసము ఆదిత్యుడు పరిచారకులు          
    అప్సరస ఋషులు నాగులు రాక్షసులు గంధర్వుడు యక్షులు
చైత్ర (మధు) ధాత కృతస్థలి పులస్త్యుడు వాసుకి హేతి తుంబురుడు రథకృత్తు
వైశాఖ (మాధవం) అర్యముడు పుంజికస్థలి పులహుడు కంజనీరుండు ప్రహేతి నారదుండు ఓజుడు
జ్యేష్ఠ (శుక్ర) మిత్రుడు మేనక అత్రి తక్షకుడు పౌరుషేయుడు హాహా రథస్వనుడు
ఆషాఢ (శుచి) వరుణుడు రంభ వసిష్టుడు చిత్రస్వనుడు శుక్రుడు హూహువు సహజన్యుడు
శ్రావణ (నభో) ఇంద్రుడు ప్లమోచ అంగిరసుడు ఏలాపుత్రుడు చర్యుడు విశ్వవసువు శ్రోతుడు
భాద్రపద (నభోస్వీ) వివస్వంతుడు అనుమ్లోచ భృగువు శంఖపాలుడు వ్యాఘ్రుడు ఉగ్రసేనుడు ఆసారణుడు
ఆశ్వయుజ (ఇషము) త్వష్ట తిలోత్తమ ఋచీకతనయ (జమదగ్ని) కంబళాశ్వుడు బ్రహ్మపేతుడు, ధృతరాష్ట్రుడు శతజిత్తు, ఇషంబరుడు
కార్తిక (ఊర్జ) విష్ణువు రంభ విశ్వామిత్రుడు యశ్వతరుడు మఘాపేతుడు సూర్యవర్చసుడు సత్యజిత్తు
మార్గశీర్ష (సహో) అర్యమ (మూలం అంశువు) ఊర్వశి కశ్యపుడు మహాశంఖుడ విద్యుచ్ఛత్రుడు ఋతసేనుడు తార్క్ష్యుడు
పుష్య భగుడు పూర్వచిత్తి ఆయువు కర్కోటకుడు స్పూర్జుడు అరిష్టనేమి ఊర్ణుడు
మాఘ (తపో) పూష ఘృతాచి గౌతముడు ధనంజయుడు వాతుడు సుషేణుడు సురుచి
ఫాల్గుణ (తపస్య) క్రతు (మూలం పర్జన్య) సేనజిత్తు భరద్వాజుడు ఐరావతుడు వర్చసుడు విశ్వుడు పర్జన్యుడు (మూలం క్రతు)

ద్వాదశాదిత్యులు పాఠ్యంతరాలు:-

(అ)
ఇంద్రుడు, ధాత, పర్జన్యుడు, త్వష్ట, పూషుడు, అర్యముడు, భగుడు, వివస్వంతుడు, విష్ణువు, అంశుమంతుడు, వరుణుడు, మిత్రుడు - (శబ్దరత్నాకరము, విద్యార్థి కల్పతరువు)

(ఆ)
ఇంద్రుడు, ధాత, పర్జన్యుడు, త్వష్ట, పూషుడు, అర్యముడు, భగుడు, వివస్వంతుడు, విష్ణువు, అంశుమంతుడు, వరుణుడు, అజఘన్యుడు - (ఆంధ్ర వాచస్పతము)
(ఇ)
వివశ్వంతుడు, పూషుడు, అర్యముడు, 4) త్వష్ట,5) సవితృడు, 6) భగుడు, 7) ధాత, 8) విధాత, 9) వరుణుడు, 10) మిత్రుడు, 11) ఇంద్రుడు, 12) వామనుడు. - 6-506-సీ. మఱియు 6-507-వ.
(ఈ)
ధాత, అర్యముడు, మిత్రుడు, వరుణుడు, ఇంద్రుడు, వివస్వంతుడు, త్వష్ట, విష్ణువు, అర్యముడు, భగుడు,పూషుడు, క్రతువు. – తెలుగు భాగవతము 12-41 నుండి 12- 47 వరకు.