పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

అమృతగుళికలు : వైడూర్యాలు


భాగవత పద్యవైడూర్యాలు

పద్య సూచిక;-
బలయుతులకు దుర్భలులకు ; బలవంతుఁడ నే జగముల ; బలవత్సైన్యముతోడఁ గృష్ణుఁడు ; బహుజీవనముతోడ భాసిల్లి యుండుబో? ; బాలశీతాంశురేఖా విభాసమాన ; బాలాజన శాలా ధన ; బిడ్డఁడు మ్రొక్కినఁ దల్లులు ; బిడ్డలకు బుద్ధి సెప్పని ; బుద్ధిమంతుఁడయిన బుధుఁడు ; బొమ్మ పెండిండ్లకుఁ బో నొల్ల ; భగవంతుం డగు విష్ణుఁడు ; భాంధవమున నైనఁ బగనైన ; భాగవతము దెలిసి పలుకుట చిత్రంబు ; భీమంబై తలఁ ద్రుంచి ; భూతములవలన నెప్పుడు ; భూపాలకులకు విప్రుల ; భూషణములు వాణికి ; భూసురుఁడవు, బుద్ధిదయాభాసురుఁడవు ; చూడని వారల నెప్పుడుఁ జూడక ; చెచ్చెరఁ గరినగరికి నీ విచ్చేసిన ; చెప్పఁ డొక చదువు మంచిది ; చెలఁగరు కలఁగరు సాధులు ; చేబంతి దప్పి పడెనని ; చేసినఁ గాని పాపములు సెందవు ;

up-arrow (1) 7-264-క.

"బయుతులకు దుర్భలులకు
మెవ్వఁడు? నీకు నాకు బ్రహ్మాదులకున్
మెవ్వఁడు ప్రాణులకును
మెవ్వం డట్టి విభుఁడు ల మసురేంద్రా!
భావము:- హిరణ్యకశిప రాక్షసరాజ! బలవంతులకు, బలహీనులకు, నీకు, నాకు, బ్రహ్మ మున్నగు వారికి, సృష్ణిలోని సర్వ ప్రాణులకు అందరికి శరణు అయిన వాడు ఎవరో ఆ పరాత్పరుడే నాకు అండగా ఉన్నాడు.
అందానికి పెట్టిందిపేరు ఈ పద్యం. ప్రహ్లాదుడు సరిగా చదువుకోటంలేదని హిరణ్యకశిపుడు దండిస్తుంటే బెదరటం లేదు. నా దండన నుంచి నిన్ను కాపాడగలిగే దిక్కెవరు అన్న తండ్రికి కొడుకు వినయంగా సమాధానం చెప్తున్నాడు. పంచాబ్దముల వాని పంచదార పలుకులతో సహజత్వం ఉట్టిపడేలా కళ్ళకు కట్టినట్లు ఎంతో చక్కగా నాటకీయత పండించారు మన సహజ కవి పోతనులవారు.

up-arrow (2) 7-262-క.

వంతుఁడ నే జగముల
ములతోఁ జనక వీరభావమున మహా
లుల జయించితి నెవ్వని
మున నాడెదవు నాకుఁ బ్రతివీరుఁడ వై."
భావము:- బాలకా! ప్రహ్లాద! లోకా లన్నిటిలో నేనే అందరి కన్నా బలవంతుణ్ణి; సేనా సహాయం ఏం లేకుండానే ఒంటరిగా వెళ్ళి ఎందరో బలశాలుల్ని గెలిచిన శూరుణ్ణి; అలాంటి నాకు సాటి రాగల వీరుడిలా, ఎవరి అండ చూసుకొని, ఎదురు తిరుగుతున్నావు.

up-arrow (3) 11-3-మ.

"వత్సైన్యముతోడఁ గృష్ణుఁడు మహాబాహా బలోపేతుఁడై
నన్‌ రాక్షసవీరవర్యుల వడిన్‌ ఖండించి, భూభారము
జ్జ్వమై యుండఁగ ద్యూతకేళి కతనం జావంగఁ గౌరవ్య స
ద్బముంబాండవ సైన్యమున్నడఁచె భూభాగంబు గంపింపఁగన్‌.
భావము:- “శ్రీకృష్ణుడు మిక్కిలి బలమైన సైన్యంతో గొప్ప భుజబలం కలవాడై యుద్ధంలో గొప్ప రాక్షసవీరులను వడివడిగా వధించాడు. భూభారం ఇంకా ఎక్కువగా ఉండటం చేత ద్యూతక్రీడ వంక పెట్టి భూమి అదిరిపోయేలా కౌరవపాండవ యుద్ధం జరిపించి ఉభయ సైన్యాలను హతమార్చాడు.

up-arrow (4) 10.1-822-సీ.

హుజీవనముతోడ భాసిల్లి యుండుటో? ;
గోత్రంబు నిలుపుటో కూర్మితోడ?
హి నుద్ధరించుటో? నుజసింహంబవై;
ప్రజలఁ గాచుటొ? కాక లిఁ దెరల్చి
పిన్నవై యుండియుఁ బెంపు వహించుటో? ;
రాజుల గెలుచుటో ణములోన?
గురునాజ్ఞ జేయుటో? గుణనిధి వై బల;
ప్రఖ్యాతిఁ జూపుటో ద్రలీల?
10.1-822.1-ఆ.
బుధులు మెచ్చ భువిఁ బ్రబుద్ధత మెఱయుటో?
లికితనము చేయ నత గలదె?
వావి లేదు వారి వారు నా వారని
యెఱుఁగ వలదె? వలువ లిమ్ము కృష్ణ!
భావము:- ఓ కిట్టయ్యా! ఏం పనయ్యా యిది!దొడ్డ బ్రతుకుతో వన్నెకెక్కడం కాని (జలరాశిలో విలసిల్లుట – మత్యావతారం), కూర్మితో కులం ప్రతిష్ట నిలబెట్టటంకాని ( కొండను మూపున నిల్పుట – కూర్మావతారం), భూమిని రక్షించటంకాని (భూదేవిని పైకి లేవనెత్తుట – వరహావతారము), పురుషపుంగవుడవై జనులను కాపాడటంకాని ( నరకేసరియై భక్తుల రక్షించుట – నృసింహావతారం), వయసున పసివాడవయ్యు దుష్టులు బలవంతులు నైనవారిని నిగ్రహించి ప్రఖ్యాతి వహించుటకాని (వటువు రూపమున బలిచక్రవర్తి నణచి కీర్తిపొందుట – వామనావతారం), యుద్దాలలో రాజులను గెలవటం కాని ( ఇరవైయొక్క మార్లు క్షత్రియులను జయించుట – బలరామావతారం), పండితులు ప్రశంసించేలా ప్రబుద్ధుడవై లోకంలో ప్రకాశించటం కాని (పొందిన జ్ఞానంతో పండితుల ప్రశంసలకు పాత్రుడగుట - బుద్ధావతారం) తగిన పని. అంతే కాని యిలాంటి వంచకత్వం యే మాత్రం గొప్పదనంకాదయ్యా. (కల్కి పదంతో కల్క్యావతారం సూచన). నీకు వావివారసలు లేనట్లుంది, తనవారు పరాయివారు అనే వివేకం అక్కరలేదా (భగవంతునికి వావివరసలు, స్వపక్ష పరపక్షాలు లేవు). మా బట్టలు మా కిచ్చెయ్యవయ్యా.

up-arrow (5) 3-421-తే.

బాలశీతాంశురేఖా విభాసమాన
వళ దంష్ట్రాగ్రమున నున్న రణి యొప్పె
రికి నిత్యానపాయిని యైన లక్ష్మి
నెఱయఁ బూసిన కస్తూరినికర మనఁగ.
భావము:- పాడ్యమి నాటి చంద్రరేఖలా విరాజిల్లుతున్న వరహావతారుడి తెల్లని కోరకొనపై నున్న ఆ భూమి, స్వామిని ఎప్పుడూ ఎడబాయని శ్రీ మహాలక్ష్మి ఆయనకు పూసిన కస్తూరి పంకంలా, కనిపించింది.

up-arrow (6) 1-309-క.

బాలాజన శాలా ధన
లీలావన ముఖ్య విభవ లీన మనీషా
లాసు లగు మానవులను
గాము వంచించు దురవగాహము సుమతీ!
భావము:- శౌనక మహర్షి! అందమైన బిడ్డలు, అందచందాల అంగనలు, ఆనంద సౌధాలు, అపార సంపదలు, అలరారే ఉద్యానవనాలు మొదలైన భోగభాగ్యాలు యందు మునిగితేలుతూ, సుఖలాలసు లైన మానవులను కాలం మోసం చేస్తు ఉంటుంది. కాల ప్రవాహాన్ని తెలిసికొనుట దుస్సాధ్యం సుమా.

up-arrow (7) 1-261-క.

బిడ్డఁడు మ్రొక్కినఁ దల్లులు
డ్డన నంకముల నునిచి న్నుల తుదిఁ బా
లొడ్డగిలఁ బ్రేమభరమున
డ్డువడం దడిపి రక్షిలముల ననఘా!
భావము:- చాలా రోజుల తరువాత శ్రీకృష్ణుడు ద్వారకకు తిరిగి వచ్చి నమస్కరించగా, అతని తల్లులు అందరు బిడ్డడిమీది బద్దానురాగంతో చటుక్కున తమ తొడలపై కూర్చుండ బెట్టుకున్నారు. ఆపేక్షతో పొంగిపొర్లి చన్నులు చేపుతుండగా, తమ కన్నీటితో అతనిని అభిషేకించారు.

up-arrow (8) 1-314-క.

బిడ్డలకు బుద్ధి సెప్పని
గ్రుడ్డికిఁ బిండంబు వండికొని పొం; డిదె పైఁ
డ్డాఁడని భీముం డొఱ
గొడ్డెము లాడంగఁ గూడు గుడిచెద వధిపా!
భావము:- “ఏనాడు బిడ్డలకు బుద్ధిచెప్పనట్టి గ్రుడ్డివాడు, ఈ నాడు సిగ్గు లేకుండా మాయింటి మీద పడ్డాడు; ఈ కళ్లులేని కబోదికి ఇంత పిండం వండి పట్టుకెళ్లి పడెయ్యండి" అంటున్న భీముడు పలికే దెప్పుడు మాటలు వింటు, ఆ దిక్కుమాలిన తిండి ఎలా తినగలుగుతున్నావు మహారాజా!
(కురుక్షేత్ర యుద్ధానంతరం ధర్మరాజు పంచను చేరి రోజులు వెళ్ళదీస్తున్న ధృతరాష్ట్ఱ్ఱునికి విదురుడు విరక్తి మార్గం ఉపదేశిస్తు ఇలా చెప్పసాగాడు. తన కొడుకులు పాండవులను అనేక బాధలు అవమానాలు పెడుతున్నప్పుడు తప్పని వారించ లేదు కదా. అలాంటిది సిగ్గు లేకుండ ఇవాళ ఎలా వాళ్ళ చేతికూడు తింటున్నావు అని అడుగుతున్నాడు. ద్విక్తాక్షరం"డ్డ’ ప్రాసగా వేసి ఆపైన ఏడు డకారాలు వేసి ధ్వని సూచకం సాధించిన తీరు అద్భుతం.)

up-arrow (9) 9-386-ఆ.

బుద్ధిమంతుఁడయిన బుధుఁడు పుత్రుండైన
మేను పెంచి రాజు మిన్నుముట్టె;
బుద్ధిగల సుతుండు పుట్టినచోఁ దండ్రి
మిన్నుముట్టకేల మిన్నకుండు?
భావము:- అన్ని విధాల బుద్ధిమంతుడైన బుధుడు తన కొడుకని వృద్ధిచెంది చంద్రుడు ఆకాశాన్ని అందుకున్నాడు; అవును బుద్ధిమంతుడైన కొడుకు పుడితే తండ్రి సంతోషంతో ఎంతో ఉప్పొంగిపోతాడు కదా!
తారకి చంద్రుని వలన పుట్టిన వాడు బుధుడు. కవి మిన్నుముట్టు అనే జాతీయాన్ని, సంతోషంతో ఉప్పొంగుట అని, మిన్ను అంటే ఆకాశం ముట్టు అంటే అందుకోడం అనే అర్థాలని, బుధుడు అంటే బుద్ధిమంతుడు అనే అర్థాన్ని చమత్కారంగా ప్రయోగించిన చక్కటి నడక గల పద్యం ఇది. రెండు లేక అంతకన్నా ఎక్కువ అక్షరాలు ఉన్న పదాలు తిరిగి తిరిగి వస్తు అర్థభేదం కలిగి ఉంటే అది యమకాలంకారం. ఇక్కడ ఉన్నది మిన్నుముట్ట యమకం అందం.

up-arrow (10) 10.2-180-సీ.

బొమ్మ పెండిండ్లకుఁ బోనొల్ల నను బాల;
ణరంగమున కెట్లు రాఁదలంచె?
గవారిఁ గనినఁ దా ఱుఁగుఁ జేరెడు నింతి;
గవారి గెల్వనే గిదిఁ జూచెఁ?
సిఁడియుయ్యెల లెక్క య మందు భీరువు;
గపతి స్కంధమే డిఁది నెక్కె?
ఖుల కోలాహల స్వనము లోర్వని కన్య;
టహభాంకృతుల కెబ్భంగి నోర్చె?
10.2-180.1-ఆ.
నీలకంఠములకు నృత్యంబుఁ గఱపుచుఁ
లసి తలఁగిపోవు లరుఁబోఁడి
యేవిధమున నుండె నెలమి నాలీఢాది
మానములను రిపులమాన మడఁప?
భావము:- బొమ్మల పెండ్లిండ్లకే వెళ్ళని ముద్దరాలు, యుద్ధరంగాని కెలా రావాలని భావించిందో? మగవారిని చూడగానే చాటుకు వెళ్ళే లతాంగి, పగవారిని గెలవాలని ఎలా అనుకుందో? బంగారు ఉయ్యాలలు ఎక్కడానికి భయపడే పడతి, గరుత్మంతుడి వీపుపై ఎలా ఎక్కిందో? చెలికత్తెల కోలాహలమే ఆలకింపలేని ముగ్ధ, భేరీలు తప్పెట్ల భీకర ధ్వనులను ఎలా ఓర్చుకుంటున్నదో? నెమిళ్ళకు నాట్యం నేర్పించి అలసిపోయే అబల, ఎడమపాదం ముందు కుంచి కుడిపాదం వంచి సంగరరంగంలో శత్రువుల అభిమానాన్ని అంతం చేయడానికి ఎలా సిద్ధమైందో? అంతా వింతే.
అసలే అసమాన సౌందర్య నారీ రత్నం, మథురానగరి అంతఃపుర వాసిని, శ్రీకృష్ణునంతటి వాని పట్టపు మహిషి. హంసతూలికా తల్పములు, బంగరు తూగుటుయ్యలలు, నానావిధ భూషణ, లేపనాదుల సౌఖ్యాలకు అలవాలమైన జీవన శైలి. అట్టి కాంతామణి కఠోర భీకర రాక్షసమూకలతో యుద్ధానికి వచ్చిందట. అది కేళీ వేదికలపై నుండి చెలులతో చేసే లీలారణరంగం కాదు. ఎత్తున ఎగురుతూ ఉండే పక్షీంద్రుని మూపున ఉండి అస్త్ర శస్త్రాల పరంపరలతో ఏమరుపా టన్నది లేని అరివీర భయంకర యుద్ధం. దానికి తగ్గని సందర్భశుద్ధి, వ్యక్తిత్వ పరిపుష్టి ప్రకటనలు చూపుతూ; లలిత లావణ్యాలు వదలకుండా, కర్కశ రణకౌశలం చూపుతూ; శృంగార రసం, వీరరసం కలిసి ఉప్పొంగి పారాయి; మన పోతనామాత్యుల వారి గంటంనుండి జాలువారాయి; మన మానస వాకిళ్ళను అలరారిస్తూ, ఇదేకాదు ముందరి అయిదు, తరువాతి మూడు పద్యాల పోకిళ్ళు.

up-arrow (11) 1-65-క.

వంతుం డగు విష్ణుఁడు
ముల కెవ్వేళ రాక్షవ్యధ గలుగుం
నవ్వేళలఁ దడయక
యుయుగమునఁ బుట్టి కాచు నుద్యల్లీలన్.
భావము:- ప్రతి యుగంలో రాకాసుల చేష్ఠలతో లోకాలు చీకాకుల పాలయ్యే సమయాలలో, భగవంతుడైన శ్రీమహావిష్ణువు విడువక తగిన అవతారాలు అవతరించి దుష్టుల శిక్షించి, శిష్టుల రక్షించి లోకాలను ఉద్ధరిస్తాడు.

up-arrow (12) 10.1-974-ఆ.

భాంధవమున నైనఁ గనైన వగనైనఁ
బ్రీతినైనఁ బ్రాణభీతినైన
క్తినైన హరికిఁ రతంత్రులై యుండు
నులు మోక్షమునకుఁ నుదు రధిప!
భావము:- ఓ పరీక్షిన్మహారాజా! చుట్టరికంతో నైనా, విరోధంతో నైనా, చింతతో నైనా, ప్రేమతో నైనా, ప్రాణభయంతో నైనా, భక్తితో నైనా ఏ లాగున నైనా సరే శ్రీహరి ధ్యానపరతంత్రులై ఉండే జనులు ముక్తిని పొందుతారు.

up-arrow (13) 1-19-ఆ.

భాగవతము దెలిసి లుకుట చిత్రంబు,
శూలికైనఁ దమ్మిచూలికైన,
విబుధజనుల వలన విన్నంత కన్నంత
దెలియ వచ్చినంత దేటపఱతు.
భావము:- అయితే చిత్రమేమంటే భాగవతాన్ని చక్కగా సమగ్రంగా అర్థం చేసుకున్నాం అని ఎవరు చెప్పలేరు. ఆఖరికి ఆ త్రిశూలధారి పరమశివుడైనా సరే, పద్మభవుడైన బ్రహ్మదేవుడైనా సరే అలా అనలేరంటే ఇక నా సంగతి వేరే చెప్పాలా. అయినా పెద్దల వల్ల ఎంత విన్నానో, వారి సన్నిధిలో ఎంత నేర్చుకున్నానో, స్వయంగా ఎంత తెలుసుకోగలిగానో అదంతా తేటతెల్ల మయ్యేలా చెప్తాను.

up-arrow (14) 8-112-శా.

భీమంబై తలఁ ద్రుంచి ప్రాణములఁ బాపెంజక్ర మా శుక్రియన్
హేక్ష్మాధర దేహముం జకితవన్యేభేంద్ర సందోహముం
గాక్రోధన గేహమున్ గరటి రక్తస్రావ గాహంబు ని
స్సీమోత్సాహము వీత దాహము జయశ్రీమోహమున్ గ్రాహమున్.
భావము:- రివ్వున పోయి, చక్రాయధం మొసలి తలని భయంకరంగా తెగనరికింది. ఆ మకరం మేరు పర్వతమంత పెద్ద దేహం గలది, అడవి ఏనుగులకు సైతం భయం కలిగించేది, కామక్రోధాలతో నిండినది. గజరాజు రక్తధారల రుచిమరిగినది, అంతులేని ఉత్సాహంతో అలసటలేకుండ పోరాడుచున్నది, గెలుపుని నమ్మకంగా కోరుతున్నది. విష్ణుచక్రం వెళ్ళి అలాంటి మొసలి శిరస్సుని ఖండించి ప్రాణాలు తీసింది.

up-arrow (15) 1-378-క.

భూములవలన నెప్పుడు
భూములకు జన్మ మరణ పోషణములు ని
ర్ణీములు సేయుచుండును
భూమయుం డీశ్వరుండు భూతశరణ్యా!
భావము:- ఆశ్రితవత్సలా! అన్నా! ధర్మరాజా! పరమేశ్వరుడు సర్వభూతాంతర్యామి. ఆయన ప్రాణులకు సృష్టి స్థితి సంహారాలు తోటి ప్రాణుల వలననే కలుగజేస్తు ఉంటాడు. (అర్జునుడు అన్న ధర్మరాజుకి కృష్ణనిర్యాణము తెలుపుతు ఆప్తునిగా భగవంతునిగా స్మరిస్తున్న సందర్భంలోది ఈ పద్యం.)

up-arrow (16) 1-167-క.

భూపాలకులకు విప్రుల
గోపింపం జేయఁ దగదు కోపించినఁ ద
త్కోపానలంబు మొదలికి
భూపాలాటవులఁ గాల్చు భూకంపముగన్."
భావము:- ప్రజాపాలకులగు క్షత్రియులు బ్రాహ్మణులకు కోపం తెప్పించేలా చేయరాదు. అలా చేస్తే, విప్రుల కోపాగ్ని జ్వాల కార్చిచ్చులా భూకంపంలా వారి వంశాల నాశనానికి దారితీస్తుంది."

up-arrow (17) 1-46-క.

భూణములు వాణికి నఘ
శోణములు మృత్యుచిత్త భీషణములు హృ
త్తోణములు కల్యాణ వి
శేణములు హరి గుణోపచితభాషణముల్.
భావము:- శ్రీమహావిష్ణువు యొక్క గుణకీర్తనములతో కూడిన పలుకులు, వాక్కులకు అధిదేవత యైన సరస్వతీ దేవికి అలంకారాలు. మృత్య దేవతకు భయం కలిగించేవి. భక్తుల హృదయాలకు సంతోషాలు కలిగించేవి. సకల పాపాలను ఎండగొట్టునవి. నిత్యకల్యాణములను సమకూర్చేవి.

up-arrow (18) 1-162-క.

భూసురుఁడవు, బుద్ధిదయా
భాసురుఁడవు, శుద్ధవీరటసందోహా
గ్రేరుఁడవు, శిశుమారణ,
మాసురకృత్యంబు ధర్మ గునే? తండ్రీ!
భావము:- తండ్రీ! దివ్యమైన బ్రాహ్మణుడివి కదయ్యా; వివేక, దయాదాక్షిణ్యాలతో ప్రకాశించేవాడివి కదయ్యా; వీరాధివీరులందరిలో ఎన్నదగ్గ వాడివి కదయ్యా; అలాంటి నువ్వు బాలుర ప్రాణాలు తీసే ఇలాంటి రాక్షసకృత్యానికి పాల్పడడం ధర్మమా? చెప్పు.

up-arrow (19) 10.1-292-క.

చూని వారల నెప్పుడుఁ
జూక లోకములు మూఁడు చూపులఁ దిరుగం
జూడఁగ నేర్చిన బాలక
చూడామణి జనుల నెఱిఁగి చూడఁగ నేర్చెన్.
భావము:- ఊర్థ్వ, అధో, భూలోకాలు మూటిని తన కనుసన్నలలో నడుపే ఆ శ్రీహరి, భక్తిలేక తనని లెక్కచేయని వారి ఎడల దయచూపడు. అట్టి శ్రీహరి శైశవశ్రేష్ఠు డైన కృష్ణుడుగా కళ్ళు తిప్పుతు చుట్టుపక్కలవారిని చూసి గుర్తుపట్ట నారంభించాడు.

up-arrow (20) 1-254-క.

చెచ్చెరఁ గరినగరికి నీ
విచ్చేసిన నిమిషమైన వేయేండ్లగు నీ
వెచ్చోటికి విచ్చేయక
చ్చికతో నుండుమయ్య మానగరమునన్.
భావము:- ప్రభు! నీవు మాటిమాటికి హస్తినాపురానికి వెళ్తున్నావు. అలా వెళ్ళినప్పు డల్లా ప్రతి నిమిషము మాకు పదివందల సంవత్సరాల లాగ అనిపిస్తున్నది. అందుచేత, మా ద్వారకానగరాన్ని వదలి ఎక్కడకి వెళ్ళకుండా ప్రేమగా ఇక్కడే ఉండిపోవయ్య నల్లనయ్య!

up-arrow (21) 7-210-క.

"చెప్పఁడొక చదువు మంచిది
చెప్పెడిఁ దగులములు చెవులు చిందఱ గొనఁగాఁ
జెప్పెడు మన యెడ నొజ్జలు
చెప్పెద నొక చదువు వినుఁడు చిత్తము లలరన్."
భావము:- “ఓ స్నేహితులారా! మన గురువులు మన కెప్పుడు ఒక్క మంచి చదువు కూడ చెప్పటం లేదు కదా! ఎప్పుడు చూసినా చెవులు చిల్లులు పడేలా సంసార భోగ విషయాలైన కర్మబంధాలను గూర్చి చెప్తున్నారు. మీ మనసుకు నచ్చే మంచి చదువు నేను చెప్తాను. వినండి."

up-arrow (22) 1-488-క.

చెలఁగరు కలఁగరు సాధులు
మిళితములయి పరులవలన మేలుం గీడున్
నెకొనిన నైన నాత్మకు
నొయవు సుఖదుఃఖచయము యుగ్మము లగుచున్."
భావము:- ద్వంద్వాలకు కోపతాపాలకు లొంగరు, భగవంతునిపై ప్రపత్తి విడువరు, సుఖదుఃఖాలకు కలగరు. సజ్జనులు ఇతరులు చేసిన మేలులకు పొంగిపోరు, కీడులకు కుంగిపోరు. మహాత్ముల ఆత్మలను సుఖదుఃఖాలు ఆవహించవు."
భాగవతుల లక్షణాలను తెలుపుతు భాగవతంలో తన కొడుకు పరీక్షిత్తును శపించుటకు సంతోషించని శృంగి తండ్రి శమీకమహర్షి నోట ఇలా పలికించారు.

up-arrow (23) 10.1-316-క.

చేబంతి దప్పి పడెనని
ప్రాల్యముతోడ వచ్చి వనము వెనుకన్
మా బిడ్డ జలక మాడఁగ
నీబిడ్డఁడు వలువఁ దెచ్చె నెలఁతుక! తగునే?
భావము:- ఓ యింతి! తన చేతి ఆట బంతి ఎగిరివచ్చి పడిందని దబాయింపుగా మా పెరట్లోకి వచ్చేసాడు. అప్పుడు మా అమ్మాయి స్నానం చేస్తోంది. మీ అబ్బాయి చీర తీసుకొని పారిపోయాడు, ఇదేమైనా బావుందా చెప్పమ్మా యశోదా!

up-arrow (24) 1-443-ఉ.

చేసినఁ గాని పాపములు సెందవు; చేయఁ దలంచి నంతటం
జేసెద నన్నమాత్రమునఁ జెందుఁ గదా కలివేళఁ బుణ్యముల్
మోము లే దటంచు నృపముఖ్యుఁడు గాచెఁ గలిన్ మరంద ము
ల్లాముతోడఁ గ్రోలి విరులందెగఁజూడని తేఁటి కైవడిన్.
భావము:- అయితే ఈ కలియుగంలో ఒక విశేషముంది, చేస్తేనే గాని పాపాలు పట్టుకోవు. ఇక పుణ్యాలందామా "చేస్తాను’ అని అనుకొంటే చాలు ఫలితాన్ని ఇచ్చేస్తాయి. అందుకనే అభిమన్య కుమారుడు, కలి విజృంభణాన్ని మాత్రం అరికట్టి ప్రాణాలతో విడిచిపెట్టాడు. తుమ్మెద, లోపల ఉన్న మకరందాన్ని మాత్రం ఆనందంతో త్రాగి పూలను వదులుతుంది కదా! అలాగన్నమాట.
పరీక్షిత్తు కలిపురుషుని నిగ్రహించాడు కాని నిర్మూలించలేదు ఎందుకు అనే సందేహానికి తావు లేకుండా వివరించబడింది.


 <