పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

అమృతగుళికలు : ఉపక్రమణిక

అమృత గుళికలు


ఉపక్రమణిక

పోతన తెలుగు భాగవతం అనే రత్న గర్భ గర్భంలో అసంఖ్యాకమైన అమూల్య అమృత ధారలు, ప్రవాహాలు ఉన్నాయి. మహాసముద్రంలో ముత్యాలు రత్నాలు వెతకాలంటే చాలా కష్టం కానీ, మన పోతనార్యుల పుణ్య వర ప్రసాదం వలన భాగవత రత్నగర్భలో, అతి సుళువుగా ఎక్కడ చెయ్యి పెడితే అక్కడ అమృతోపమానములు, రత్నప్రభాసమానమలు దొరుకుతాయి. కాని గ్రంథ విస్తార రీత్యా అన్నీ ఎంచి సంకలనం చేయాలంటే, మిగిలేవి ఏవీ ఉండవనుకుంటాను.

కనుక, కొంత తడవు మునిగి దేవులాడి కొన్నిటిని ఏరడం జరిగింది. వాటిని అమృతగుళికలు పేర పునఃసంకలనం చేసి 386 పద్యాలను, వాడుకరులకు అనుకూలంగా ఉండేలా వివిధ శీర్షికల క్రింద సర్ది పెట్టబడ్డాయి. రెండుకు రెండూ అద్భుతమైన దండకములే కనుక వాటినీ, ఆరు వచనములనూ మఱియు పోతనకు చెందిన కొన్ని మధురమైన పద్యములను ఆరింటినీ పెట్టబడ్డాయి ఈ సంకలనంలో. అలా నాలుగు వందలు పద్యగద్యలు అయ్యాయి.

జాలతెలుగులకు అనుకూలత కోసం, ఈ నాలుగు వందల పద్యగద్యల పేర్లను అకారాది వరసలో పేర్చిన జాబితానూ, పైన చెప్పినట్లు వివిధ శీర్షికల క్రింద సర్ది పెట్టాము. హాయిగా మీకు నచ్చినట్లు ఈ అమృతగుళికలను జుర్రుకోండి, ఆస్వాదించండి... ఇక్కడ మరింకేవైనా ఉండాలని భావిస్తే, మొహమాటపడకుండా దయచేసి మాకు చెప్పండి.