పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

అమృతగుళికలు : మధురిమలు


భాగవత పద్యమధురిమలు

పద్య సూచిక;-
కాటుక కంటి నీరు చనుకట్టు ; గుడులుకట్టించె కంచర్ల గోపరాజు ; అమృతమహాంబురాసి తెలుగై ; బాలరసాల సాల నవపల్లవ కోమల ; ఖ్యాతి గడించుకొన్న కవులందరులేరే! ; ముద్దులుగార భాగవతమున్ ;

up-arrow (1) కాటుక కంటి నీరు చనుకట్టు

కాటుక కంటి నీరు చనుట్టు పయింబడ నేల యేడ్చెదో
కైభదైత్యమర్దనుని గాదిలి కోడల! యో మదంబ! యో
హాకగర్భురాణి! నిను నాకటికిం గొనిపోయి యల్ల క
ర్ణా కిరాట కీచకుల మ్మ త్రిశుద్ధిగ నమ్ము భారతీ!
భావము:- నీవు కంటికి పెట్టుకున్న కాటుక, కన్నీటికి కరిగి రవికపై పడేలా ఎందుకు ఏడుస్తావు? ఆ మహా విష్ణువునకు ఇష్టమైన కోడలా! ఓ మా తల్లీ! బ్రహ్మదేవునికి సాక్షాత్తు ఇల్లాలా! నిన్ను తీసుకుపోయి అంగట్లో పెట్టినట్లు ఆ కర్ణాట కిరాట కీచకులకు అమ్మివేయను. త్రికరణ శుద్ధిగా ఒట్టు వేస్తున్నాను. నన్ను నమ్ము సరస్వతీదేవి!
  ఆంధ్రమహాభాగవతాన్ని రాజుకి అంకితం యిమ్మని, బమ్మెర పోతనను అనేక రకాలుగా వత్తిడి చేస్తున్నారు. రాజు తలచుకుంటే దెబ్బలకు కొదువా. ఆ పైన వత్తిడి చేసేవారు సాక్షాత్తు శ్రీనాథ కవిసార్వభౌములు. పోతరాజు నలిగిపోతున్నాడు. అయినా శ్రీరామునికి తప్ప నరుల కెవ్వరికి అంకిత మివ్వను అంటున్నాడు. గంటం పట్టింది సంపాదించటానికి కాదు, నా నాగలి పెట్టేది మాకు చాలు అంటున్నాడు. అట్టి పరిస్థితులలో ఒకమారు దేవతా పీఠం వద్ద కలత మనసుతో వచ్చి కూర్చున్నాడు. సాక్షాత్తు తల్లి వాణి కన్నీరు కారుస్తూ ప్రత్యక్ష మైంది. చూసి తట్టుకోలేని బాధలో చెమర్చిన కన్నులతో పోతన్నగారి నోటివెంట ఈ పద్యం అలవోకగా జాలువారిందిట. ఆమె తృప్తిగా వెళ్ళింది. ఎలా అయితే నేమి ఈ పరమాద్భుతమైన చాటువు తెలుగువారికి దక్కింది.

up-arrow (2) గుడులుకట్టించె కంచర్ల గోపరాజు

గుడులుకట్టించె కంచర్ల గోపరాజు
రాగములుకూర్చె కాకర్ల త్యాగరాజు
పుణ్యకృతిచెప్పె బమ్మెర పోతరాజు
రాజులీమువ్వురును భక్తిరాజ్యమునకు
భావము:- భక్తులు ఎందరో ఉన్నారు వారందరిలోను రాజులు (గొప్పవారు) అని చెప్పటానికి ముగ్గురే ఉన్నారట. ఒకరు కంచర్ల గోపరాజు. ఆయన గుళ్ళు కట్టించారు భద్రాచలంలో. ఇంకొకరు త్యాగరాజు. ఈయన సంగీతకృతులు కూర్చేరట. మరింకొరు పోతరాజు (బమ్మెర పోతనామాత్యుడు). ఈయన పుణ్య గ్రంధరచన చేసారట.
  అవును అవును కరుణశ్రీ మాట
కలకాలం సత్యం, ఎవరు కా దనగలరు.

up-arrow (3) అమృతమహాంబురాసి తెలుగై

మృతమహాంబురాసి తెలుగై మఱి భాగవతమ్మునై త్రిలిం
మునకు డిగ్గెనేమొ యనఁగా హృదయమ్ముల నాడు నేడు నా
ట్యము లొనరించు పోతనమహాకవి ముద్దులపద్యముల్ శతా
బ్దము లయిపోవుగాక మఱవన్ తరమే రసికప్రజాళికిన్.
భావము:- ఎక్కడో స్వర్గంలో ఉండే అమృత సముద్రం, ఆ మహా సముద్రం తెలుగుభాష అయిపోయి, ఆ పైన తెలుగు భాగవతం అయిపోయి త్రిలింగదేశానికి దిగొచ్చేసిందేమో అన్నట్లుగా హృదయాలలో మెదులుతు ఉన్నాయి. బమ్మెర పోతనామాత్యుల వారి ముద్దులొలికే మధుర పద్యాలు ఆ నాటి నుంచి నేటి దాకా ఆలా ఆనంద తాండవాలు చేస్తూనే ఉన్నాయి. ఎన్నైనా శతాబ్దాలు గడిచిపోనీ, రసహృదయం తెలిసిన వా రెవిరికైనా వాటిని మరచిపోవుటం సాధ్యం కాదు కదా.

up-arrow (4) బాలరసాల సాల నవపల్లవ కోమల

బారసాల సాల నవల్లవ కోమల కావ్యకన్యకన్
గూలకిచ్చి యప్పడుపుఁగూడు భుజించుటకంటె సత్కవుల్
హాలికులైన నేమి? గహనాంతర సీమలఁ గందమూల కౌ
ద్దాలికులైన నేమి నిజదారసుతోదరపోషణార్ధమై.
భావము:- గున్నమామిడి చెట్టుకు పూసిన లేత చివుళ్ళలా కోమలమైనట్టి, కావ్యం అనే కన్యను అమ్ముకుని; అట్టి నీచపు తిండి తినడం కంటే; నిజమైన కవి, తన భార్యాపిల్లల ఉదరపోషణ కోసం నాగలి పట్టిన వ్యవసాయదారు డైనప్పటికి తప్పులేదు; అడవీ ప్రాంతాలలో కంద దుంపలు, పుట్టతేనెలుతో జీవించువా రైనప్పటికి తప్పులేదు.
  మధురాతి మధురమైన ఈ పోతనగారి చాటుపద్యం బహుప్రసిద్దమైనది. దీని వెనుక ఒక కథ ఉంది అని చెప్తారు.
 శ్రీనాథ మహాకవి భాగవతాన్ని రాజుకి అంకితమిమ్మని చెప్పటానికి పోతన ఇంటికి పల్లకి లో వెడుతున్నారు. పోతనకొడుకు పొలం దున్నుతున్నారు. శ్రీనాథుడు తన మహాత్మ్యము చూపుదాం అని, ఒక పక్క పల్లకి బొంగు మోస్తున్న బోయీలను తొలగిపొమ్మన్నారు. ఆ బోయీలు లేకున్నా పల్లకి వెళ్తోంది. అది చూసి కొడుకు వింతపడగా, పోతన నాగలి కాడికి గట్టిన వెలపలి ఎద్దును తొలగించమన్నారు. ఆ ఎద్దు లేకుండానే నాగలి పొలమును దున్నుతోంది. శ్రీనాథుడు రెండో పక్క బోయీలను కూడ తొలగిపొమ్మన్నారు. ఏ బోయీలు లేకున్నా పల్లకి గాలిలో తేలుతూ వెళ్తోంది. పోతన లోపలి ఎద్దును సైతం తొలగించమన్నారు. ఏ ఎద్దు లేకుండానే గాలిలో తేలుతూ నాగలి పొలం దున్నుతోంది. ఆ దృశ్యము చూసి శ్రీనాథుడు పల్లకి దిగివచ్చి పోతనతో "హాలికులకు సేమమా?" అని పరిహాస మాడారు. వెంటనే పోతన ఆశువుగా ఇలా కవిత్వ పటుత్వపు పద్యం రూపంలో సమాధాన మిచ్చారు. ఇంతకీ ఆ సత్కవులు ఎవరో మరి? ఇది ప్రజల నాలుకలపై కలకాలంగా నానుతున్న కథ.
 ఒకమారు శ్రీనాథుడు వచ్చి పోతనను భాగవతం రాజుకి అంకిత మిమ్మని నచ్చచెప్తూ ఇలా అన్నాడట. .
 క.
 కమ్మని గ్రంథం బొక్కటి
 యిమ్ముగ నే నృపతికైన కృతి ఇచ్చిన కై
 కొమ్మని యీ యరె అర్థం
 బిమ్మహి దున్నంగ నేల ఇట్టి మహాత్ముల్- శ్రీనాథ మహాకవి చాటువు
 దానికి పోతన ఈ బాలరసాలసాల పద్యంతో సమాధానం చెప్పాడట. .

up-arrow (5) ఖ్యాతి గడించుకొన్న కవులందరులేరే!

ఖ్యాతి గడించుకొన్న కవులందరులేరె! అదేమి చిత్రమో
పోన యన్నచో కరిగిపోవునెడంద, జొహారు సేతకై
చేతులు లేచు; ఈ జనవశీకరణాద్భుత శక్తి చూడగా
నాని పేరులో గలదొ! యనగంటములోన నున్నదో
భావము:- సిద్ధులైన మహాకవులు ఎందరో ఉన్నారు. కాని విచిత్రం ఏమిటంటే పోతన పేరు చెప్పగానే మనసు కరిగిపోతుంది, చేతులు రెండు నమస్కరించటానికి లేస్తాయి. ఇలా జనాల మనసులు దోచుకునే అద్భుత శక్తి అతని పేరులోనే ఉందో లేక గంటంలో ఉందో.
 పోతన అంటే పోతపోసిన పుణ్యాల రాశి, వారి గంట మేమో పంచదారలో అద్దినది. చూడగా యెలా విడదీసి చూడగల మా మథుర బందాన్ని?

up-arrow (6) ముద్దులుగార భాగవతమున్

ముద్దులుగార భాగవతమున్ రచియించుచు పంచదారలో
ద్దితివేమొ గంటము మహాకవిశేఖర! మధ్యమధ్య అ
ట్లద్దక వట్టి గంటమున నట్టిటు గీసిన తాటియాకులో
ద్దెములందు ఈ మధురభావములెచ్చటనుండి వచ్చురా!
భావము:- కరుణశ్రీ గారు బహుప్రసిద్ధమైన ఆధునిక మహాకవి పోతన భాగవతం ప్రజలలో పరివ్యాప్తి జరగటానికి వారు చేసినఅవిరళ కృషి శ్లాఘనీయమైనది. తెలుగులో భాగవతం అనగానే పోతన పద్యాలు గుర్తువస్తాయి.అది సహజం. కరుణశ్రీ పద్యాలు కూడ గుర్తొస్తాయి అది వారి విజ్ఞాన విశిష్ఠత. అట్టివాటిలో మొదటగా ఎన్నదగిన పద్యం ముద్దులుగార. పోతనవంటి మహాకవీశ్వరుని ఆసాంతం ఔపోసనపట్టి, ఇలా అలతి పొలతి పదాలతో సామాన్య పాఠకుల మనసులు దోచటానికి అసామాన్య ప్రతిభకావాలి .
  పోతన కవిత్వం పంచదార పాకానికిప్రసిద్ధి. పోతనగారు ముద్దులొలికేలా అంత మథురాతి మధురంగా ఎలా రాయగలిగాడు అని సందేహం వచ్చిందిట. ఆయనంటే కష్టపడి తాటియాకులపై గంటంతో రాసారు. మహాకవి కదా, రవి గాంచని చోటే కాదు కాలం కాంచనిది కూడ కనగలడు. తరువాతి తరాలలో సులువుగా కలం సిరాలో ముంచి రాసేవాళ్ళం కదా. పంచదార వాడిమధుర పదార్థాలు చేసేవాళ్ళం కదా. అవన్నీ తెలిసిన వాడు కనుక పంచదారలో గంటం అద్ది తాటాకుల మీద చెమటలు కాదు ముద్దులు కారేలా రాసారు. అలాకాకుండా వట్టి గంటంతో తాటాకులమీద అక్షరాలు గీకేస్తే పద్యాలకి ఇంత మాధుర్యం రాదు కదా. అన్నారు మన కరుణశ్రీ. ఆ రోజుల్లో పంచదార ఎక్కడది అని అడక్కండి.