పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

స్తుతులు స్తోత్రాలు : మేదినీ కృత ఫృథు (విష్ణు) స్తుతి (రక్షా కరం)

  1
“ఓనాథ! పరమపురుషుఁడ
వై నిజమాయా గుణంబు లందిన కతనన్
నానావిధ దేహములం
బూనుదు సగుణండ వగుచు బుధనుతచరితా!

  2
అట్టి నీవు.

  3
ను సకల జీవతతికిని
మును నీ వాధారభూతముగ నిర్మింపన్
విను నా యందుఁ జతుర్విధ
భూతవిసర్గ మర్థిఁ గైకొన వలసెన్.

  4
ను నుద్యతాయుధుఁడవై
నుజేంద్ర! వధింపఁ బూని సలెదు; నీకం
టెను నన్యుని నెవ్వని నే
ముగ శరణంబు జొత్తుఁ రుణాభరణా!

  5
నఘ! స్వకీయంబునై యతర్కితమునై-
హిమ నొప్పిన భవన్మాయచేత
కల చరాచర ర్గంబు నిర్మించి-
ర్మార్థపరుఁడవై నరు దీశ!
నీవిక్రమము నవనీరజలోచన!-
కల లోకులకు దుర్జయము; దలఁపఁ
గు నట్టి నీవు స్వతంత్రుఁడ వగుటను-
బ్రహ్మఁ బుట్టించి యా బ్రహ్మచేత

  6
కల జగములఁ జేయింతు మతఁ బేర్చి;
యేక మయ్యు మహాత్మ! యనేక విధము
గుచు వెలుగొందు చుందు వీ ఖిలమందుఁ
జారుతరమూర్తి! యో! పృథుక్రవర్తి!

  7
మఱియు మహాభూతేంద్రియ కారక చేతనాహంకారంబులను శక్తులం జేసి యీ జగంబుల కుత్పత్తి స్థితి లయంబులఁ గావించుచు సముత్కట విరుద్ధ శక్తులు గల పురుషునకు నమస్కరించెద; నట్టి పరమ పురుషుండ వయిన నీవు నిజనిర్మితంబును భూతేంద్రియాంతఃకరణాత్మకంబును నైన యీ విశ్వంబు సంస్థాపింపం బూని.

  8
దివరాహంబవై యా రసాతల-
తనైన నన్ను నక్కటికతోడ
నుద్ధరించితి; వట్టి యుదకాగ్ర భాగంబు-
నం దర్థి నున్న నే నెఁడి నావ
యందున్న నిఖిల ప్రజావళి రక్షింపఁ-
గోరి యీ పృథురూపధారి వైతి;
ట్టి భూభరణుండ వైన నీ విపుడు ప-
యో నిమిత్తంబుగా నుగ్రచరుఁడ

  9
గుచు నన్ను వధించెద నుచు బుద్ధిఁ
లఁచుచున్నాఁడ; విది విచిత్రంబుగాదె?
విశ్వసంపాద్య! నిరవద్య! వేదవేద్య!
వ్యగుణసాంద్ర! వైన్య భూపాలచంద్ర!

  10
ఇతి బమ్మెఱ పోతనామాత్య కృత శ్రీమత్తెలుగు భాగవత చతుర్థ స్కంధ అంతర్గత మేదినీ కృత ఫృథు (విష్ణు) స్తుతి (రక్షా కరం)