పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

స్తుతులు స్తోత్రాలు : బ్రహ్మాది దేవతల నరనారాయణ స్తుతి (దయా ప్రదం)

  1
"గనస్థలిం దోఁచు గంధర్వనగరాది-
రూప భేదము లట్లు రూఢి మెఱసి
యే యాత్మయందేని యేపార మాయచే-
నీ విశ్వ మిటు రచియింపఁబడియె
ట్టి యాత్మప్రకాశార్థమై మునిరూప-
ముల ధర్ముగృహమునఁ బుట్టినట్టి
రమపురుష! నీకుఁ బ్రణమిల్లెద; మదియుఁ-
గాక యీ సృష్టి దుష్కర్మవృత్తి

  2
రగనీకుండు కొఱకునై త్త్వగుణము
చే సృజించిన మమ్మిట్లు శ్రీనివాస
మైన సరసీరుహప్రభ పహసించు
నీ కృపాలోకనంబుల నెమ్మిఁ జూడు."

  3
ఇతి బమ్మెఱ పోతనామాత్య కృత శ్రీమత్తెలుగు భాగవత చతుర్థ స్కంధ అంతర్గత బ్రహ్మాది దేవతల నరనారాయణ స్తుతి (దయా ప్రదం)