పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

స్తుతులు స్తోత్రాలు : బహుళాశ్వుని కృష్ణ స్తుతి (భక్తి ప్రదం)

  1
"కృష్ణ! పరమాత్మ! యదుకుల క్షీరవార్ధి
పూర్ణచంద్రమ! దేవకీపుత్త్ర! సుజన
వినుత! నారాయణాచ్యుత! వేదవేద్య!
క్తజనపోషపరితోష! రమపురుష!

  2
శ్రీ పురుషోత్తమాఖ్య! యదుసింహకిశోరక! భక్తలోకర
క్షారతంత్ర! నీవు మునిసంఘముఁ గొన్నిదినంబు లుండవే
నీ దపద్మ రేణువులు నెమ్మి మదీయగృహంబు సోఁకినం
దాసవంద్య! యే నిపుడ న్యుఁడ నయ్యెదఁగాదె మాధవా!”

  3
ఇతి బమ్మెఱ పోతనామాత్య కృత శ్రీమత్తెలుగు భాగవత దశమస్కంధ ఉత్తరభాగ అంతర్గత బహుళాశ్వుని కృష్ణ స్తుతి (భక్తి ప్రదం)