పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

పద్య మధురిమలు : పద లాలిత్యము

పద లాలిత్యముమ.

లాలిత్యము పాకశుద్ధి భగవత్భక్తాగ్ర సంసేవ్యమున్

మత్యున్నతమున్మహాశుభదమున్ ద్మోద్భవానందమున్

చిచిద్రూపవిభాగ భాగవతమున్ చింతింతు నాంధ్రంబుగా

యం జెప్పిన పోతరాజుపదముల్ త్ప్రేమ నే మ్రొక్కెదన్.

- చిదంబరకవి, అంగదరాయబారము

మన తెలుగు భాగవతము పదలాలిత్యముతో తొణికిసలాడునది; చక్కటి పాకశుద్ధి కలది; భగవద్భక్త శ్రేష్ఠులచే సేవింబడునది; మిక్కిలి ఉన్నత స్థాయి కలది; గొప్ప శుభాలను అందించునది; బ్రహ్మానందము కలిగించునది; చిత్తు అచిత్తు భేదములను తెలుపునది. అట్టి తెలుగు భాగవతమును సదా అధ్యయనం చేసుకొనెదను. తెలుగు వారిపై దయతో దానిని ఆంధ్రీకరించిన బమ్మెర పోతన పాదములకు నేను నమస్కరిస్తాను. అని చిదంబర కవి అంగద రాయబారము రచనలో కీర్తించాడు.