పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

పద్య మధురిమలు : గుడులు కట్టించె

గుడులు కట్టించె

తే,

గుడులుకట్టించె కంచర్ల గోపరాజు

రాగములుకూర్చె కాకర్ల త్యారాజు

పుణ్యకృతిచెప్పె బమ్మెర పోతరాజు

రాజులీమువ్వురును భక్తిరాజ్యమునకు

- కరుణశ్రీ

భక్తులు ఎందరో ఉన్నారు వారందరిలోను రాజులు (గొప్పవారు) అని చెప్పటానికి ముగ్గురే ఉన్నారట. ఒకరు కంచర్ల గోపరాజు. ఆయన గుళ్ళు కట్టించారు భద్రాచలంలో. ఇంకొకరు త్యాగరాజు. ఈయన సంగీతకృతులు కూర్చేరట. మరింకొరు పోతరాజు (బమ్మెర పోతనామాత్యుడు). ఈయన పుణ్య గ్రంధరచన చేసారట.

అవును అవును కరుణశ్రీ మాట కలకాలం సత్యం, ఎవరు కా దనగలరు.