పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

పద్య మధురిమలు : భాగవతమ్ము భాగ్యముల పంట

: : చదువుకుందా భాగవతం: బాగుపడదాం: మనం అందరం :



ఉ.

భావతమ్ము భాగ్యముల పంట తెలుంగు జనాళికిన్, దృతిన్

భోములందు భావనలు పూర్తిగ వీడినరైతుబిడ్డ డా

వాధి దేవి సంతతము భాసిల నాతని మానసమ్మునన్

నాలిదున్నుచున్ తెలుగునన్ రచియించెను భారతీ కృపన్.

- అన్నపరెడ్డి సత్యన్నారాయణ రెడ్డి.

2014డిసంబరు, 29నాటి కంది శంకరయ్యగారి శంకరాభరణం బ్లాగు నందలి న్యస్తాక్షరి – 21

అంశం – బమ్మెర పోతన, ఛందస్సుః – ఉత్పలమాల; పూరకులు – అన్నపరెడ్డి సత్యన్నారాయణ రెడ్డి.

మొదటి పాదం మొదటి అక్షరం “భా” ,

రెండవ పాదం ఆరవ అక్షరం “భా”

మూడవ పాదం పదవ అక్షరం “భా”,

నాలుగవ పాదం పదహారవ అక్షరం “భా”.

తెలుగు భాగవతము బమ్మెర పోతనామాత్యులవారి వంట, తెలుగు ప్రజల పాలిటి భాగ్యముల పంట. భాగవతాన్ని పోతన సరస్వతీ దేవి కరుణాకటాక్షాలతో వ్రాసాడు. పూని భౌతిక భోగ లాలస విడిచిపెట్టిన ఈ రైతు బిడ్డడు, తనకి వాక్కుల రాణి వాణి ఎల్లప్పుడు మనసులో ప్రకాశిస్తుండగా, నాగలి దున్ని జీవిస్తు భాగవతానాన్ని తెలుగీకరించాడు.

శంకరాభరణ బ్లాగు