పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

పద్య మధురిమలు : బాలరసాలసాల

బాలరసాల సాల


ఉ.
బారసాల సాల నవల్లవ కోమల కావ్యకన్యకన్
గూలకిచ్చి యప్పడుపుఁగూడు భుజించుటకంటె సత్కవుల్
హాలికులైన నేమి? గహనాంతర సీమలఁ గందమూల కౌ
ద్దాలికులైన నేమి నిజదారసుతోదరపోషణార్ధమై.
- పోతన చాటువు

గున్నమామిడి చెట్టుకు పూసిన లేత చివుళ్ళలా కోమలమైనట్టి, కావ్యం అనే కన్యను అమ్ముకుని; అట్టి నీచపు తిండి తినడం కంటే; నిజమైన కవి, తన భార్యాపిల్లల ఉదరపోషణ కోసం నాగలి పట్టిన వ్యవసాయదారు డైనప్పటికి తప్పులేదు; అడవీ ప్రాంతాలలో కంద దుంపలు, పుట్టతేనెలుతో జీవించువా రైనప్పటికి తప్పులేదు.

బాల = గున్న, చిన్న; రసాల = మామిడి; సాల = చెట్టు; నవ = లేత; పల్లవ = చివుళ్ళు వలె; కోమల = కోమలమైన; కావ్య = కావ్యము అనెడి; కన్యకన్ = అమ్మాయిని; కూళలు = క్రూరులు, కుత్సితులు; కున్ = కు; ఇచ్చి = అప్పజెప్పి; ఆ = ఆ యొక్క; పడుపు = ప్యభిచారపు; కూడు = తిండి; భుజించుట = తినుట; కంటెన్ = కంటెను; సత్కవుల్ = మంచి కవులు; హాలికులు = వ్యవసాయదారుల; ఐనన్ = అయినను; ఏమి = పరవాలేదు; గహన = అడవుల; అంతర = లోపలి; సీమలన్ = ప్రాంతాలలో; కందమూల = కందదుంపలు; ఔద్దాలికులు = పుట్టతేనెలతో జీవించువారు;ఐనన్ = అయినను; ఏమి = పరవాలేదు; నిజ = తన; దార = భార్య; సుత = పిల్లల; ఉదరపోషణ = జీవిక; అర్థము = నిమిత్తము; ఐ = కోసము.

మధురాతి మధురమైన ఈ పోతనగారి చాటుపద్యం బహుప్రసిద్దమైనది. దీని వెనుక ఒక కథ ఉంది అని చెప్తారు.

శ్రీనాథ మహాకవి భాగవతాన్ని రాజుకి అంకితమిమ్మని చెప్పటానికి పోతన ఇంటికి పల్లకి లో వెడుతున్నారు. పోతనకొడుకు పొలం దున్నుతున్నారు. శ్రీనాథుడు తన మహాత్మ్యము చూపుదాం అని, ఒక పక్క పల్లకి బొంగు మోస్తున్న బోయీలను తొలగిపొమ్మన్నారు. ఆ బోయీలు లేకున్నా పల్లకి వెళ్తోంది. అది చూసి కొడుకు వింతపడగా, పోతన నాగలి కాడికి గట్టిన వెలపలి ఎద్దును తొలగించమన్నారు. ఆ ఎద్దు లేకుండానే నాగలి పొలమును దున్నుతోంది. శ్రీనాథుడు రెండో పక్క బోయీలను కూడ తొలగిపొమ్మన్నారు. ఏ బోయీలు లేకున్నా పల్లకి గాలిలో తేలుతూ వెళ్తోంది. పోతన లోపలి ఎద్దును సైతం తొలగించమన్నారు. ఏ ఎద్దు లేకుండానే గాలిలో తేలుతూ నాగలి పొలం దున్నుతోంది. ఆ దృశ్యము చూసి శ్రీనాథుడు పల్లకి దిగివచ్చి పోతనతో "హాలికులకు సేమమా?" అని పరిహాస మాడారు. వెంటనే పోతన ఆశువుగా ఇలా కవిత్వ పటుత్వపు పద్యం రూపంలో సమాధాన మిచ్చారు. ఇంతకీ ఆ సత్కవులు ఎవరో మరి? ఇది ప్రజల నాలుకలపై కలకాలంగా నానుతున్న కథ.

ఒకమారు శ్రీనాథుడు వచ్చి పోతనను భాగవతం రాజుకి అంకిత మిమ్మని నచ్చచెప్తూ ఇలా అన్నాడట. .

క.
మ్మని గ్రంథం బొక్కటి
యిమ్ముగ నే నృపతికైన కృతి ఇచ్చిన కై
కొమ్మని యీ యరె అర్థం
బిమ్మహి దున్నంగ నేల ట్టి మహాత్ముల్
- శ్రీనాథ మహాకవి చాటువు

దానికి పోతన ఈ బాలరసాలసాల పద్యంతో సమాధానం చెప్పాడట. .