పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

పద్య మధురిమలు : అచ్చమైన యమృత

అచ్చమైన యమృత


ఆ.

చ్చమైన యమృత మరులు త్రావినా
రోయి దాని కే నసూయ పడను
రమభక్తవరుడు మ్మెరపోతన
భాగవదమృతంబు పంచెగాన.
- విశ్వనాథ సత్యన్నారాయణ

అన్నారట కవిసామ్రాట్ విశ్వనాథ సత్యన్నారాయణుల వారు తమ రామాయణకల్పవృక్షం ప్రారంభమునందు. అవును అసలైన అమృతాన్ని దేవతలు తాగారు అంటారు. మరి మా భక్తశిరోమణి బమ్మెర పోతన, భాగవతం అనే అమృతాన్ని మనందరికి పంచాడు కదా. దీని ముందు ఆ దేవతలు తాగిన అమృతం ఏపాటిది అందుకే దాని గురించి మనం అసూయ పడనక్కరేదు.