పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

పద్య మధురిమలు : అమృతమహాంబురాసి

అమృతమహాంబురాసి


చ.

మృతమహాంబురాసి తెలుగై మఱి భాగవతమ్మునై త్రిలిం

మునకు డిగ్గెనేమొ యనఁగా హృదయమ్ముల నాడు నేడు నా

ట్యము లొనరించు పోతనమహాకవి ముద్దులపద్యముల్ శతా

బ్దము లయిపోవుగాక మఱవన్ తరమే రసికప్రజాళికిన్.
- దాశరథి

ఎక్కడో స్వర్గంలో ఉండే అమృత సముద్రం, ఆ మహా సముద్రం తెలుగుభాష అయిపోయి, ఆ పైన తెలుగు భాగవతం అయిపోయి త్రిలింగదేశానికి దిగొచ్చేసిందేమో అన్నట్లుగా హృదయాలలో మెదులుతు ఉన్నాయి. బమ్మెర పోతనామాత్యుల వారి ముద్దులొలికే మధుర పద్యాలు ఆ నాటి నుంచి నేటి దాకా ఆలా ఆనంద తాండవాలు చేస్తూనే ఉన్నాయి. ఎన్నైనా శతాబ్దాలు గడిచిపోనీ, రసహృదయం తెలిసిన వా రెవిరికైనా వాటిని మరచిపోవుటం సాధ్యం కాదు కదా.

అమృత = అమృతపు; మహా = గొప్ప; అంబురాసి = సముద్రము; తెలుగు = తెలుగు భాషగా; ఐ = అయిపోయి; మఱి = ఇంకా; భాగవతమున్ = భాగతముగా; ఐ = అయిపోయి; త్రిలింగమున్ = త్రిలింగ దేశాని; కున్ = కి; డిగ్గెనేమొ = దిగివచ్చిందేమో; అనగాన్ = అన్నట్లుగా; హృదయమ్ములన్ = హృదయాలలో; ఆడున్ = మెదులుతాయి; నేడున్ = ఇవాళ్టికి కూడ; నాట్యములు = నృత్యాలు; ఒనరించున్ = చేస్తాయి; పోతన = బమ్మెర పోతన అనే; మహా = గొప్ప; కవి = కవి; ముద్దుల ముద్దులోలికే; పద్యముల్ = పద్యాలు; శతాబ్దములు = వందలఏళ్ళు; అయిపోవుగాక = గడచినా; మఱవన్ = మర్చిపోవటం; తరమే = సాధ్యమా; రసిక = రసహృదయులైన; ప్రజ = వారల; ఆళికిన్. = సమూహానికి.