పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

టిప్పణి కోశాలు పట్టికలు : టిప్పణి పట్టికి (యంత్రము - రౌరవము)

శ్రీరామ

up-arrow

: :తెలుగు భాగవత గ్రంథంలో వాడబడిన పద / పదబంధాలకు టిప్పణిల జాబితా: :


4181} యంత్రము(ప్ర)  - జంత్రము (వి) :-
[10.1-1761-వ.]

4182} యక్షులు  - సంచారులు, దేవయోని విశేషము, ఖేచరులు, కశ్యపునికి సురసయందు జనియించినవారు. వీరు కుబేరాదులు, యక్షుడు (ప్ర) జక్కుడు (వి) :-
[2-274.1-తే.]

4183} యజమానశాల  - యజమాని (యజ్ఞమును చేయువాని) యొక్క శాల :-
[4-118-వ.]

4184} యజురధీశ్వరుండు  - యజుర్వేదమునకు అధికారి, భగవంతుడు :-
[3-451.1-తే.]

4185} యజ్ఞపతి  - యజ్ఞములకు పతి (ప్రభువు), విష్ణువు :-
[4-510-వ., 6-438-చ.]

4186} యజ్ఞపురుషుడు  - యజ్ఞమే తానైన పురుషుడు, విష్ణువు :-
[4-399-తే., 5.2-64-వ.]

4187} యజ్ఞభుజుడు  - అన్ని హవిర్భాగములను (ఆయా దేవతా రూపములలో) తినువాడు, విష్ణువు :-
[10.1-236-వ.]

4188} యజ్ఞమూర్తి  - యజ్ఞములు తన స్వరూపముగా కలవాడు, విష్ణువు :-
[3-400-మ.]

4189} యజ్ఞరేతస్సుడు  - యజ్ఞమునకు రేతస్సువంటివాడు (కారణుడు), విష్ణువు :-
[4-702.1-తే.]

4190} యజ్ఞవరాహమూర్తి  - యజ్ఞమే తానైన వరాహ స్వరూపము కలవాడు, విష్ణువు :-
[3-407.1-తే., 3-439-ఉ.]

4191} యజ్ఞవిభుడు  - యజ్ఞములకు ప్రభువు, విష్ణువు. :-
[3-425.1-తే.]

4192} యజ్ఞాంగుడు  - యజ్ఞమే దేహముగా కలవాడు, విష్ణువు :-
[4-509.1-తే.]

4193} యజ్ఞాధిపతి  - యజ్ఞములకు అధిపతి, విష్ణువు :-
[6-254-వ.]

4194} యజ్ఞాధీశుడు  - యజ్ఞాధికారి, విష్ణివి :-
[9-170.1-తే.]

4195} యజ్ఞుడు  - యజ్ఞకర్మ యజ్ఞకర్త యజ్ఞభోక్త తానైన వాడు, విష్ణువు :-
[11-77-వ.]

4196} యజ్ఞేశుడు  - యాగములకు ఈశుడు (ప్రభువు), విష్ణువు :-
[2-236-మ., 4-557.1-తే., 8-483.1-తే., 9-84.1-ఆ., 10.1-550-క.]

4197} యజ్ఞేశ్వరుడు  - యజ్ఞములకు ఈశ్వరుడు, విష్ణువు :-
[5.2-58-వ., 9-420-క.]

4198} యతి  - ఇంద్రియములను నియమించి, అధిపత్యము పొందినవాడు, సన్యాసి :-
[2-27.1-తే., 10.1-1084-వ.]

4199} యదుకుమారవరేణ్యుడు  - యదువంశపు వారిలో వరేణ్యుడు (శ్రేష్ఠుడు), కృష్ణుడు :-
[10.2-108.1-తే.]

4200} యదుకులేశ్వరుడు  - యదు వంశమునందలి ప్రభువు, కృష్ణుడు :-
[10.2-697.1-తే.]

4201} యదుపుంగవుడు  - యాదవ వంశస్థులలో శ్రేష్ఠుడు, కృష్ణుడు :-
[10.1-1729-ఉ.]

4202} యదుపుత్రుడు  - యదువంశమున పుట్టినవాడు, కృష్ణుడు :-
[10.2-49-క.]

4203} యదుప్రవరుడు  - యదు వంశావళిలోని వాడు, కృష్ణుడు :-
[10.2-987-చ.]

4204} యదుభూషణుడు  - యదు వంశమునకు భూషణము వంటి వాడు, కృష్ణుడు :-
[1-201-శా.]

4205} యదువంశమండనుడు  - యాదవ వంశమునకు అలంకారమైన వాడు, కృష్ణుడు :-
[10.1-1467.1-తే.]

4206} యదువల్లభుడు  - యాదవ వంశపు ప్రభువు, కృష్ణుడు :-
[10.2-62-క., 10.2-694-వ.]

4207} యదువులు  - యయాతి కొడుకు యదువు వంశస్తులు :-
[1-305-క.]

4208} యదుసింహుడు  - యాదవులలో సింహము వంటి వాడు, కృష్ణుడు :-
[10.1-1634-క.]

4209} యమతనూభవుడు  - యమధర్మరాజు యొక్క పుత్రుడు. ధర్మరాజు :-
[3-89.1-తే.]

4210} యమదండము  - యముని ఆయుధము :-
[5.1-147.1-తే.]

4211} యమనియమాది  - అష్టాంగయోగముమార్గములు, 1 యమము 2 నియమము 3 ఆసనము 4 ప్రాణాయామము 5 ప్రత్యాహారము 6 ధారణ 7 ధ్యానము 8 సమాధి :-
[6-224-వ.]

4212} యమము  - అంతరింద్రియ నిగ్రహము, నిషిద్ధములను ఆచరించకుండుట, ఇది దశవిధము అవి సత్యము, దయ, క్షమ, ధృతి (ధైర్యము), మితాహారము, ఆర్జవము (ఋజువర్తన), బ్రహ్మచర్యము, అస్తేయము (దొంగతనములేమి), అహింస, శౌచము (శుచిత్వము, నైర్మల్యము). :-
[2-253.1-తే., 4-618-వ.]

4213} యముడు(ప్ర)  - జముడు (వి), 1.మృత్యుదేవత, 2.కాలుఁడు, 3.తగిన దండనలతో దండించుట ద్వారా పాపముల ప్రక్షాళనము చేయువాడు, 4. దక్షిణదిశ దిక్పాలుడు, 5. సూర్యపుత్రుడు, 6 సోదరి యమున, 7. లోకం నరకం, 8. పట్టణము సంయమని, 9. భార్య ధూమవర్ణ, 10. కరణము చిత్రగుప్తుడు. :-
[10.1-1430-వ., 10.1-1502-క.]

4214} యయాతి  - చంద్రవంశపు రాజు, నహుషుని కొడుకు. ఇతని కొడుకు యదువు. యానము చేయువాడు, య+యాతి, యస్య వాయురివ యాతి సర్వత్ర, వాయువు వలె అంతట సంచరించువాడు. యయాతి చక్రవర్తి. :-
[2-204.1-తే., 4-812.1-తే.]

4215} యవనిక(ప్ర)  - జవనిక (వి), తెర, మరుగు నిచ్చుటకు వేదిక యందు కట్టుదురు. :-
[10.1-1747-వ.]

4216} యవనులు  - తురుష్కులు, యవనదేశము వారు, మహ్మదీయులు తొలుత యవన (గ్రీరు) దేశపువారు. :-
[4-814-క., 4-817-వ., 4-817-వ., 4-819-వ.]

4217} యశోదపాపడు  - యశోదాదేవి పిల్లవాడు, కృష్ణుడు :-
[10.1-725-క.]

4218} యశోవిహారుడు  - యశః (కీర్తి)తో విహారుడు (విహరించువాడు), విష్ణువు :-
[3-924.1-తే.]

4219} యాతన  - తీవ్రవేదన, విపరీతమైన కష్టం :-
[4-215-వ.]

4220} యాతనాశరీరము  - మరణ సమయమున భౌతిక దేహము విడిచి యమలోకపు శిక్షలకు అనువగుటకు జీవుడు దాల్చు దేహము :-
[3-984-వ.]

4221} యాతుధాన  - నిరృతి, రాక్షసవిశేషము, యాతనలు కలిగించు శక్తులు :-
[2-274.1-తే.]

4222} యాత్ర  - యోగుల నియమమును అనుసరించి ఏకస్థలమున ఉండరాదు కనుక వారు చేయు ప్రయాణములు. :-
[1-108-వ.]

4223} యాదవకుంజరుడు  - యదువంశపు శ్రేష్ఠుడు, కృష్ణుడు :-
[10.1-1145-ఉ.]

4224} యాదవవంశపయోధిచంద్రుడు  - యాదవవంశము అను సముద్రమున (ఉప్పొంగుట)కు చంద్రుని వంటి వాడు. :-
[10.2-750-ఉ.]

4225} యాదవవల్లభుఁడు  - యాదవులకు ప్రియమైనవాడు, కృష్ణుడు :-
[1-410-క.]

4226} యాదవసింహము  - యదువంశమున సింహము వంటి వాడు, బలరాముడు :-
[10.2-303-వ.]

4227} యాదవులు  - చంద్రవంశలోని నహుషుని కొడుకైన యదువు వంశము వారు, కృష్ణుడు, బలరాముడు :-
[1-396-వ., 10.1-1525-శా.]

4228} యాదవేంద్రుడు  - యాదవుల ప్రభువు, కృష్ణుడు, , బలరాముడు :-
[10.1-1387.1-తే., 10.1-1619-వ., 10.1-1679-వ., 10.1-1783-వ., 11-105-వ.]

4229} యామ  - కాలవిభాగమైన యామమును నిర్ణయించినవాడు, దేవతాయోని :-
[1-63-వ.]

4230} యామినీచరుడు  - రాత్రి తిరుగువాడు, రాక్షసుడు :-
[3-694-క.]

4231} యుగద్వయము  - 1సంవత్సరము 2వయస్సులు :-
[4-771.1-తే.]

4232} యుద్ధధర్మము  - ఆయుధము జారిన లేదా దీనుడైన శత్రువుపైకి వెళ్శరాదు అనెడిది ఒక యుద్ధనీతి :-
[6-411-ఆ.]

4233} యుధిష్ఠిరుడు  - ధర్మరాజు అసలుపేరు, పాండురాజు పెద్దకొడుకు :-
[1-308-వ., 10.2-668-వ.]

4234} యువతి  - యౌవనమున ఉన్నామె, స్త్రీ :-
[1-256-వ.]

4235} యూపదారువు  - యజ్ఞము నందు పశుబంధనార్థము నాటిన పైపట్టలేని కొయ్య (స్తంభము) :-
[4-520-చ.]

4236} యోగమాయ  - యోగింపగల మాయ, అవినాభావముగా భగవంతుని యందు వెలిగెడి అవ్యక్త నామక ప్రకృతి :-
[2-223.1-తే., 10.1-566-ఆ.]

4237} యోగాదేశము  - రుద్రోపదిష్టమైన విష్ణు స్తోత్రము యోగాదేశ స్తోత్రము :-
[4-732-వ.]

4238} యోగి  - యమనియమాది అష్టాంగములు కల యోగాభ్యాసము ప్రధానమార్గముగా కల ఋషి, చిత్తనిరోధముగలవాడు :-
[7-453-వ., 10.2-1195-క.]

4239} యోగికులాబ్ధిచంద్ర  - యోగి (యోగుల) కుల (జనులు అనెడి) అబ్ధి (సముద్రమునకు) చంద్రుడు (చంద్రుని వంటి వాడు), మహాయోగి. :-
[4-635.1-తే.]

4240} యోగిజనంబుడెందము  - యోగుల మనసులో ఉండు వాడు, యోగులకు ఇష్టుడు, విష్ణువు :-
[3-146-మత్త.]

4241} యోగిమానససరోవాసుడు  - యోగి (యోగుల యొక్క) మానస (మనసు లనెడి) సరః (సరస్సు లందు) వాసుడు (నివసించెడివాడు), విష్ణువు :-
[3-922.1-తే., 6-124.1-ఆ.]

4242} యోగిరాజు  - పరమయోగులలో శ్రేష్ఠుడు, విష్ణువు :-
[10.1-566-ఆ.]

4243} యోగివంద్యుడు  - యోగులచే స్తుతింపబడు వాడు, విష్ణువు :-
[10.1-949-క.]

4244} యోగిహృత్పంకజపంకజాప్తుడు  - యోగుల హృదయములను పంకజ (పద్మముల)కు పంకజాప్తుడు (సూర్యుని వంటి వాడు), శివుడు :-
[10.2-315-ఉ.]

4245} యోగీంద్రచేతస్సరోహంస  - యోగీంద్రుల (యోగులలో శ్రేష్ఠుల) చేతస్ ( మనసు) అను సరస్(సరోవరము) న ఉండు హంస, విష్ణువు :-
[3-203-దం.]

4246} యోగీంద్రహృద్వనజాతైకచరిష్ణుడు  - యోగులలో శ్రేష్ఠు లైనవారి హృదయపద్మములందు ముఖ్యుడై చరించువాడు, విష్ణువ :-
[3-148-మ.]

4247} యోగీంద్రహృద్వనవర్తిష్ణుడు  - యోగీంద్రుల హృదయము లనెడి వన (తోటలలో) వర్తిష్ణుడు (మెలగెడువాడు), విష్ణువు :-
[8-105-మ.]

4248} యోగీశుడు  - యోగులకు ప్రభువు, విష్ణువు :-
[10.1-1180.1-ఆ.]

4249} యోగీశ్వరుడు  - యోగులలో ఈశ్వరుడు, కపిలావతారుడు, విష్ణువు :-
[10.1-236-వ., 11-77-వ.]

4250} యోగీశ్వరేశ్వరుడు  - యోగులలో శ్రేష్ఠులను పాలించువాడు, విష్ణువు :-
[2-237-మ., 3-100-వ., 3-753.1-తే., 10.1-975-వ., 10.1-1003-వ., 10.2-1137.1-తే.]

4251} యోజనము  - యోజనమునకు సరైన విలువ పాత దూరమానములతో పాటు ప్రస్తుతము లభించుటలేదు, రకరకముల సమాధానములు అందబాటులో ఉన్నాయి. నాలుగుకోసుల దూరము, పిలుపునకు అందనిది; వాచస్పతము; ఎనిమిది మైళ్ళ దూరం, పది లేక పన్నెండు మైళ్ళ దూరం; తెలుగు వ్యుత్పత్తి కోశం. :-
[5.1-19.1-తే.]

4252} రంకె,ఱంకె  - ఎద్దు అరుపు :-
[10.1-898-క.]

4253} రంగధాముడు  - రంగ (శ్రీరంగము) ధాముడు (నివాసముగా ఉండువాడు), శ్రీరంగనాయకుడు :-
[10.2-952-స్రగ్ద.]

4254} రంతిదేవుడు  - మహాదానశీలి, ఇతని దానశీల మహత్యము వలన ముంగిసకు బంగారు శరీరము వచ్చినది, భరధ్వాజుని మనుమడైన నరుని మనుమడు. :-
[2-204.1-తే.]

4255} రంభాదికాంతలు  - అప్సరసలు (రంభ ఊర్వశి తిలోత్తమ అలంబుస మున్నగువారు ) :-
[10.1-107-క.]

4256} రంభాదులు  - రంభమున్నగువారు, ఏకత్రిశంతి యప్సరసలు :-
[10.1-485-వ.]

4257} రక్కసులగొంగచక్రము  - రాక్షసుల గొంగ (శత్రువు) చక్రము, విష్ణుచక్రము :-
[9-139-వ.]

4258} రక్షించెదవు  - విష్ణుమూర్తి రూపమున సత్వదుణముతో లోకములను పాలించెదవు :-
[10.1-1180.1-ఆ.]

4259} రక్షితకరి  - రక్షిత (కాపాడబడిన) కరి (గజేంద్రుడు గలవాడు), విష్ణువు :-
[6-33-క.]

4260} రక్షోగణభోజనము  - రాక్షస గణములచే భుజింపబడు శిక్షలు, నరక విశేషము :-
[5.2-136-వ.]

4261} రక్షోనాథసంహర్తుడు  - రక్షస్ (రాక్షసుల యొక్క) నాథ (రాజులను) సంహర్తుడు (చంపెడి వాడు), విష్ణువు :-
[10.1-876-మ.]

4262} రక్షోవంశాధీశ్వరుడు  - రక్షః (రాక్షస) వంశా (కులమునకు) అధీశ్వరుడు (ప్రభువు), హిరణ్యకశిపుడు :-
[7-161-క.]

4263} రక్షోవిభుడు  - రక్షః (రాక్షస) విభుడు (ప్రభువు), హిరణ్యకశిపుడు :-
[7-84-వ.]

4264} రక్షోవైరి  - రాక్షసుల వైరి (శత్రువు), విష్ణువు :-
[3-697-వ., 10.1-1348-వ.]

4265} రక్షోహంత  - రక్షః (రాక్షసులను) హంత (సంహరించువాడు), విష్ణువు :-
[3-665-మ., 10.1-666-శా.]

4266} రఘుకులతిలకుడు  - రఘుకుల (రఘువంశమునకు) తిలకుడు (వన్నె తెచ్చినవాడు), రాముడు. :-
[7-480-క., 11-125-క.]

4267} రఘుకులరాముడు  - రఘు వంశపు రాముడు. :-
[3-1-క.]

4268} రఘుపుంగవుడు  - రఘువంశములో శ్రేష్ఠుడు, రాముడు :-
[9-354-వ.]

4269} రఘుప్రవరుడు  - రఘువు యొక్క ప్రవర (వంశము)లో పుట్టినవాడు, రాముడు :-
[9-308-ఉ.]

4270} రఘువరుడు  - రఘు వంశపు శ్రేష్ఠుడు, రాముడు :-
[9-332-వ.]

4271} రఘువు  - సూర్యవంశపు మహారాజు దిలీపుని పుత్రుడు, వీరి పేరనే రాఘవరాముడు :-
[2-204.1-తే.]

4272} రఘుసత్తముడు  - రఘువంశ శ్రేష్ఠుడు, శ్రీరాముడు :-
[10.2-1340-చ.]

4273} రజకుడు  - బట్టలు ఉతుకువాడు, రజత్ (తెల్లగా మెరయుట) చేయువాడు, చాకలి :-
[10.1-1257-వ.]

4274} రజతగిరిపతి  - రజతగిరి (కైలాసపర్వతము) పై నుండు పతి (ప్రభువు), శివుడు :-
[11-72.1-తే.]

4275} రజతభూధరము  - రజత (వెండి, తెల్లని) భూధరము (కొండ), కైలాసపర్వతము :-
[6-489-క.]

4276} రజతాచలము - రజతము (వెండి వలె తెల్లగా ఉండెడి) అచలము (కొండ), కైలాసపర్వతము కైలాసపర్వతము. :-
[10.2-601-వ.]

4277} రజతాద్రి  - వెండి కొండ, కైలాస పర్వతము :-
[3-413.1-తే.]

4278} రజని  - రాత్రి :-
[5.2-62-వ.]

4279} రజనీనాథుడు  - రాత్రికి ప్రభువు, చంద్రుడు :-
[10.2-354-మ.]

4280} రజనీశుడు  - రాత్రికి నాయకుడు, చంద్రుడు :-
[10.2-949-క.]

4281} రజోగుణవిహీనుడు  - రజోగుణము లేనివాడు, విష్ణువు :-
[3-145.1-తే.]

4282} రణత్  - శబ్దముచేయుచున్న, గజ్జలు శబ్దము :-
[3-726.1-తే.]

4283} రతీశ్వరుడు  - 1. మాయాదేవిగా ఉన్న రతీదేవి భర్త, ప్రద్యుమ్నుడు (మన్మథుని అవతారం), 2. రతీదేవి భర్త, మన్మథుడు. :-
[10.2-454.1-తే.]

4284} రత్నగర్భ  - రత్నములు గర్భమునగలది, సముద్రము :-
[8-224.1-తే.]

4285} రత్నగర్భుడు  - రత్నములు గర్భమున గలవాడు, సముద్రుడు :-
[3-290-మ.]

4286} రత్నాకరము  - రత్నములు ఉండు స్థానము, సముద్రము :-
[10.1-700-వ.]

4287} రత్నాకరుడు  - రత్నముల సమూహము కలవాడు, సముద్రుడు :-
[4-266-క.]

4288} రథము  - 1. వాహనవిశేషము, తేరు, 2. దేహము, 3. పురంజనోపాఖ్యానంలో రథము దేహమునకు సంకేతము, 4. బృహస్పతిరథము నీతిఘోషము, అర్జునునిరథము నందిఘోషము, విష్ణురథము శతానందము :-
[4-771.1-తే.]

4289} రథము(ప్ర)  - అరదము (వి) :-
[10.2-1174-వ.]

4290} రథాంగపాణి  - రథాంగ (చక్ర) పాణి (చేత ధరించినవాడు), కృష్ణుడు :-
[10.2-433-వ.]

4291} రథాంగము  - రథముయొక్క అంగము (భాగము) వలె ఉండునది, చక్రము :-
[3-679-వ.]

4292} రథి  - రథమునెక్కి యుద్ధము చేయు యోధుడు, (మహారథుడు పదకొండువేలమంది (11000) విలుకాండ్రతో పోరాడెడి యోధుడు, తనను సారథిని గుఱ్ఱములను కాపాడుకొనుచు పోరాడెడి యోధుడు 2)అతిరథుడు పెక్కువిలుకాండ్రతో పోరాడెడి యొధుడు 3)సమరథుడు ఒకవిలుకానితో సరిగనిలిచి పోరాడెడి యోధుడు 4)అర్ధరథుడు ఒక్కవిలుకానితో పోరాడెడి యోధుడు) :-
[6-370-వ., 10.2-842-చ.]

4293} రథికులు  - రథముపై నుండి యుద్ధము చేయు వీరులు :-
[1-216-వ.]

4294} రమణి  - రమ్యము (మనోజ్ఞము) ఐనామె, క్రీడించునామె, క్రీడింపదగినామె, స్త్రీ, :-
[3-789-క., 4-778-ఉ., 4-788-చ., 9-18-ఆ., 10.1-806-శా., 10.1-1091-మ., 10.1-1472.1-తే.]

4295} రమణుడు  - మనోజ్ఞమైన వాడు, కృష్ణుడు :-
[10.1-1050-ఆ.]

4296} రమాధినాథుడు  - రమ (లక్ష్మీదేవి)కి అధినాథుడు (భర్త), విష్ణువు :-
[7-22-క.]

4297} రమాధిపుడు  - రమ (లక్ష్మీదేవి) యొక్క అధిపుడు (భర్త), విష్ణువు :-
[2-214-మ., 4-189-చ.]

4298} రమాధీశుడు  - రమ (లక్ష్మీదేవి) అధీశుడు (భర్త), విష్ణువు :-
[2-219-మ., 2-275-మ., 3-203-దం.]

4299} రమాధీశ్వరుడు  - రమ (లక్ష్మీదేవి)కి అధీశ్వరుడు (భర్త), విష్ణువు :-
[3-779-క.]

4300} రమానాథుడు  - లక్ష్మీదేవికి భర్త, విష్ణువు :-
[10.1-1485-వ.]

4301} రమాపతి  - రమ (లక్ష్మీదేవి యొక్క) పతి (భర్త), విష్ణువు. :-
[3-174-క., 3-186-క., 4-892-చ., 11-16-మత్త.]

4302} రమామండనుడు  - రమ (లక్ష్మీదేవి)చే మండనుండు (అలంకారముగా గలవాడు), విష్ణువు :-
[3-45-ఉ.]

4303} రమామనోహరుడు  - రమ (లక్ష్మీదేవి) మనోహరుడు (భర్త), విష్ణువు :-
[4-307-చ.]

4304} రమారమణీమణి  - రమ (లక్ష్మీ) అను రమణీ (స్త్రీలలో) మణి (ఉత్తమురాలు), లక్ష్మీదేవి :-
[3-595-ఉ.]

4305} రమారమణీసుమనోహరుడు  - రమారమణి (లక్ష్మీదేవి) సుమనోహరుడు (భర్త), విష్ణువు :-
[4-438-కవి.]

4306} రమాలలనాకళత్రుడు  - లక్ష్మీదేవిని కళత్రుడు (భర్త), విష్ణువు. :-
[4-286.1-తే.]

4307} రమావరుడు  - రమ+వరుడు లక్మీదేవిభర్త, విష్ణువు :-
[2-97-చ., 3-103-చ.]

4308} రమావిభుడు  - రమా (లక్ష్మీదేవి యొక్క) విభుడు (భర్త), విష్ణువు :-
[3-665-మ.]

4309} రమాసతీహృదయహారి  - రమాసతి (లక్ష్మీదేవి) హృదయమునకు మనోహరుడు, విష్ణువు :-
[3-335-ఉ.]

4310} రమాహృదయేశుడు - రమ (లక్ష్మీదేవి) హృదయమునకు ప్రభువు, విష్ణువు :-
[4-285-చ., 10.2-647-ఉ.]

4311} రమాహృదీశుడు  - రమ (లక్ష్మీదేవి)కి హృదీశుడు (భర్త), విష్ణువు :-
[4-937-త.]

4312} రమేశుడు  - రమ (లక్ష్మీదేవి)కి భర్త, విష్ణువు. :-
[2-105-ఉ., 2-121.1-తే., 3-302-తే., 3-748-క., 4-193.1-తే., 4-550-చ., 6-152-మ., 8-725-ఉ., 10.2-752-చ., 11-66-చ.]

4313} రమేశ్వరుడు  - రమ (లక్ష్మీదేవి)కి భర్త, విష్ణువు. :-
[3-433-చ., 3-599-ఉ., 4-509.1-తే., 5.2-117-చ., 8-186-క.]

4314} రమ్యము - రమ్యతరము రమ్యతమము :-
[10.1-997.1-ఆ.]

4315} రవి  - కిరణములు కలవాడు, రూయతేస్తూ యత ఇతి రవిః, సూర్యుడు :-
[4-426-క., 10.1-1131-మ.]

4316} రవికులాబ్ధిచంద్రుడు  - సూర్య వంశము అనెడి సముద్రమునకు చంద్రుని వంటివాడు, రాముడు :-
[9-355-ఆ.]

4317} రవిసుత  - సూర్యుని పుత్రిక, యమున :-
[10.1-1481-శా.]

4318} రవిసుతుడు  - రవి (సూర్యుని) సుతుడు (కుమారుడు), శనీశ్వరుడు, యముడు :-
[5.2-91-క.]

4319} రసాతనయాహృదయాబ్జరంజనుడు  - రసాతనయ (సముద్రునికూతురైన లక్ష్మీదేవి) యొక్క హృదయ (హృదయముయనెడి) అబ్జ (పద్మమును) రంజనుడు (రంజింపజేయువాడు), రాముడు :-
[7-482-చ.]

4320} రసాతలము  - పాతాళాది సప్త అధోలోకములు యందలి ఒక లోకము :-
[3-435-చ.]

4321} రహస్యము  - దాచుకొనదగ్గది :-
[1-66-ఆ., 1-68-చ.]

4322} రాకా  - పూర్ణిమా భేదము, నిండుపున్నమి, సంపూర్ణ కళలుగల చంద్రునితోగూడిన పౌర్ణమి :-
[4-25-క., 5.2-62-వ., 6-507-వ.]

4323} రాకేందుయశోవిశాలుడు  - రాకేందు (నిండు పున్నమి చంద్రుని) వంటి యశః (కీర్తి) విశాలుడు (విరివిగా కలవాడు), రాముడు :-
[10.1-1-క.]

4324} రాక్షసకులాంతకుడు  - రాక్షస కుల (వంశమును) అంతకుడు (నాశనముచేయువాడు), విష్ణువు :-
[7-153-చ.]

4325} రాక్షసము  - బలాత్కారమున కన్యను అపహరించి వివాహమాడు పద్ధతి. ఇది అష్టవిధవివాహములు యందు ఒకటి. రాక్షస వివాహంలో ఉన్న రాక్షసం కన్య పెద్దల అంగీకారంతో సంబంధంలేకుండా, అంగీకరించిన కన్యను ఎత్తుకు వచ్చి వివాహమాడుట వరకు. కన్య అంగీకారంతో కూడ సంబంధలేకుండా చేసేది పైశాచికం. :-
[10.1-1683-వ.]

4326} రాక్షసుడు  - ప్రమాణము శ్లో:: వృక్షాన్ ఛిత్వా పశూన్ హత్వా కృత్వా రుధిరకర్దమం: బ్రాహ్మణావ యమిత్యేవం మౌస్యంతే రాక్షసాః కలౌ: రాక్షసాః కలిమాశ్రిత్య జాయంతే బ్రహ్మయోనిషు: బ్రాహ్మణానేవ బాధంతే పరిత్యక్తాఖిలాగమాః :-
[2-274.1-తే., 10.1-727-వ.]

4327} రాక్షసుడు(ప్ర)  - రక్కసుడు(వి) :-
[10.2-20-వ.]

4328} రాగద్వేషములు  - 1రాగము 2ద్వేషము 3కామము 4క్రోధము 5లోభము 6మోహము 7మదము 8మాత్సర్యము 9ఈర్ష్య 10అసూయ 11దంభము 12దర్పము 13అహంకారము :-
[10.1-575-క., 10.2-1177.1-తే., 10.2-1232.1-తే.]

4329} రాగద్వేషాదిశూన్యుడు  - రాగము ద్వేషము మున్నగునవి లేనివాడు, విష్ణువు :-
[5.2-55-వ.]

4330} రాగద్వేషాదులు  - 1రాగము 2ద్వేషము 3కామము 4క్రోధము 5లోభము 6మోహము 7మదము 8మాత్సర్యము 9ఈర్ష్య 10అసూయ 11దంభము 12దర్పము 13అహంకారము :-
[7-241-వ., 7-465-వ., 10.1-31-ఆ.]

4331} రాగవైరాగ్యోపాధులు  - వేదాంతశాస్త్ర సాంకేతిక పదాలు. రాగముతో అనురక్తులగుదురు, వైరైగ్యము రాగ రాహిత్యము విరక్తి, ఉపాధి ధర్మచింత ఆధారము కారణము ఆధారము :-
[1-216-వ.]

4332} రాఘవరాముడు  - రాఘవ (రఘు వంశమునకు చెందిన) రామ, శ్రీరామ. :-
[4-1-క., 8-743-క.]

4333} రాఘవుడు  - రఘువంశమున పుట్టినవాడు, రాముడు :-
[2-169-మ., 2-170-క., 9-274-క.]

4334} రాఘవేంద్రుడు  - రఘువంశపు ప్రభువు, రాముడు :-
[9-311-వ., 9-321.1-తే.]

4335} రాచపూబోడి  - రాచ (రాజ) పూబోడి (స్త్రీ), రాకుమారి :-
[9-25-వ.]

4336} రాజకులావతంసుడు  - రాజ (చంద్ర) కులా (వంశమున) అవతంసుడు (సిగబంతివలె శ్రేష్ఠుడు), కృష్ణుడు :-
[10.2-206-ఉ.]

4337} రాజకులైకవిరాముఁడు  - రాజ (రాజుల) కుల (వంశమునకు) ఏక (సమస్తమును) విరాముడు (తొలగించువాడు), పరశురాముడు :-
[6-305-క.]

4338} రాజకొడుకు  - రాజ (చంద్రుని) కొడుకు, బుధుడు :-
[9-26-ఆ.]

4339} రాజత్వము  - రాజు అను తత్వము, భావము :-
[1-63-వ.]

4340} రాజధరార్చితుడు  - రాజధరుని (చంద్రధరుడైన శివుని)చే అర్చితుడు, శ్రీరాముడు :-
[8-743-క.]

4341} రాజధాని  - రాజుండెడిపట్టణము, ముఖ్యపట్టణము :-
[10.1-1467.1-తే.]

4342} రాజముఖి  - రాజ (చంద్రునివంటి) ముఖి (మోములుగలస్త్రీ), సుందరి :-
[9-180-క., 9-398-ఆ.]

4343} రాజరాజు  - రాజ (వైభవములకు) రాజు అధిపతి, కుబేరుడు :-
[4-442.1-తే.]

4344} రాజర్షి  - వైదిక సంప్రదాయ అనువర్తి యైన రాజు :-
[1-78-వ., 1-142-వ., 1-411-వ.]

4345} రాజవదన  - రాజు (చంద్రునివంటి) వదన (మోముగలామె), సుందరి :-
[9-26-ఆ.]

4346} రాజశేఖరుడు  - రాజులలో (శ్రేష్ఠమైనవాడు), రాముడు :-
[4-974-చ.]

4347} రాజసూయము  - ఒకరాజు తక్కిన రాజులను జయించి చేసెడి యజ్ఞము :-
[7-9-వ.]

4348} రాజస్తుత్యుడు  - రాజులచేత స్తుతింపబడువాడు, శ్రీరాముడు :-
[8-743-క.]

4349} రాజాన్వయుడు  - రాజ (చంద్ర) అన్వయుడు (వంశమువాడు), ఉద్ధవుడు :-
[10.1-1452-శా.]

4350} రాజావతంసుడు  - రాజులందరిలోను తలమానికమైనవాడు, శ్రీరాముడు :-
[8-743-క.]

4351} రాజితఫణివిభూషణుడ  - విరాజిల్లుతున్న నాగులతో చక్కగ అలంకరింపబడినవాడు, శివుడు. :-
[4-147.1-తే.]

4352} రాజీవదళనేత్ర  - రాజీవదళ (పద్మదళముల వంటి) నేత్ర (కన్నులు గలామె), అందగత్తె :-
[9-26-ఆ.]

4353} రాజీవభవాదిదేవరాజివినుతుడు  - రాజీవభవ (బ్రహ్మదేవుడు) ఆది (మున్నగు) దేవ (దేవతల) రాజి (సమూహములచే) నుతుడు (స్తుతింపబడినవాడు), రాముడు :-
[7-480-క.]

4354} రాజీవభవుడు  - రాజీవము (ఎఱ్ఱకలువ) యందు భవ (పుట్టిన) వాడు, బ్రహ్మదేవుడు :-
[3-331-తే., 3-381-ఉ., 3-411-తే., 3-791-క.]

4355} రాజీవము  - రాజును (చంద్రుని) అనుసరించి జీవించునది, పద్మము :-
[10.2-7-క.]

4356} రాజీవరాజపూజ్యశ్రీజితగోపీకటాక్షసేవాంతరవిభ్రాజితమూర్తి  - రాజీవ (తామరపూలలో) రాజ (శ్రేష్ఠమైనవానిచే) పూజ్య (అర్చిందగిన) శ్రీ (వైభవమును) జిత (నెగ్గెడి) గోపీ (గోపికల) కటాక్ష (కడగంటి చూపు లనెడి) సేవ (సేవించుట యందలి) అంతరము (గొప్పదనముచే) విభ్రాజిత (ప్రకాశించెడి) మూర్తి (స్వరూపమ), విష్ణువు :-
[6-528-క.]

4357} రాజీవసంభవుడు  - రాజీవము (పద్మము) న సంభవుడు (పుట్టిన వాడు), బ్రహ్మదేవుడు :-
[3-395.1-తే.]

4358} రాజీవసదృశనయనుడు  - రాజీవ (పద్మముల) సదృశ (వంటి) నయన (కన్నులు కలవాడు), రాముడు :-
[11-125-క.]

4359} రాజీవసదృశలోచనుడు  - రాజీవ (తామరల) సదృశ(వంటి) లోచనుడు, కన్నులుగలవాడు, రాముడు :-
[7-480-క.]

4360} రాజీవాక్షుడు  - రాజీవ (కలువలవంటి) అక్షుడు (కన్నులు కలవాడు), కృష్ణుడు, విష్ణువు :-
[3-409-క., 10.1-559-క., 10.1-924-క., 10.2-128-క.]

4361} రాజీవేక్షణ  - రాజీవ (కలువలవంటి) ఈక్షణ (కన్నులు కలామె), పద్మాక్షి, స్త్రీ :-
[10.1-1499-క.]

4362} రాజు  - రజియింతి రాజః, రంజింపజేయువాడు రాజు, పరిపాలకుడు :-
[10.2-46-వ., 10.2-147-చ.]

4363} రాజేంద్రచంద్రుడు  - రాజులలో ఇంద్రుని వంటి చంద్రుని వంటి వాడు, మహారాజు. :-
[10.2-1329.1-తే.]

4364} రాజేంద్రుడు  - రాజులలో ఇంద్రుని వంటివాడు, మహారాజు, శ్రీరాముడు :-
[8-743-క., 10.1-581-క.]

4365} రాజ్యము  - 1స్వామి 2అమాత్య 3సుహృత్త్ 4కోశ 5రాష్ట్ర 6దుర్గ 7బలంబులు అనెడి సప్తాంగములు కలది :-
[10.1-1643-మ.]

4366} రాధేయుడు  - రాధపుత్రుడు, కర్ణుడు :-
[10.2-1092-క.]

4367} రామ  - రమించెడి ఆమె, రమింప జేయునట్టి స్త్రీ, సుందరి :-
[4-777-క., 9-182-క., 10.1-792-మ., 10.1-1089-క., 10.1-1461-శా.]

4368} రామచంద్రనరేంద్రుడు  - రాముడనెడి చంద్రునివంటివా డైన నరేంద్రుడు (రాజు), రాముడు. :-
[9-1-క.]

4369} రామచంద్రమహీశుడు  - రామచంద్రుడనెడి మహీశుడు (రాజు), రాముడు. :-
[12-1-క.]

4370} రామచంద్రుడు  - రాముడు అను చక్కటి (చల్లటి) వాడు. :-
[2-171.1-తే.]

4371} రామనరేంద్రుడు  - రాముడు అనెడి నరేంద్రుడు (రాజు), రాముడు. :-
[10.2-1-క.]

4372} రామనృపాలుడు  - రాముడు అను రాజు. :-
[11-1-క.]

4373} రామభద్రుడు  - చక్కటి భద్రతను ఇచ్చువాడు, రాముడు :-
[2-163-క.]

4374} రామరాజాఖ్యనిధీ  - రామరాజు (రామరాజు) ఆఖ్య (పేరును) నిధి (ఆశ్రితులకు నిధిగా ఇచ్చినవాడ), విష్ణువు. :-
[6-528-క.]

4375} రామవినోదుడు  - రామ (పరబ్రహ్మము, ప్రమాణము శ్లో. రమంతే యోగినోనంతే సత్యానందే చిదాత్మని, ఇతి రామపదేనాసౌ పరబ్రహ్మాభియతే.) అందు వినోదించువాడు, పరీక్షిత్తు. :-
[10.1-1089-క.]

4376} రామాజనకాముడు  - రామా (రమించునట్టి వారైన, స్త్రీ జన (జనులకు) కాముడు (మన్మథుని వంటివాడు, కోరబడు వాడు), రాముడు :-
[8-1-క.]

4377} రామాజనము  - రామా (ఆనందమును) ఇచ్చువారైన జనము, స్త్రీలు :-
[4-777-క.]

4378} రామానుజుడు  - బలరాముని తోబుట్టువు, కృష్ణుడు :-
[10.1-1089-క.]

4379} రాముడు  - శ్రు:: రమంతే యోగినోనంతే సత్యానందే చిదాత్మని: ఇతి రామ పదేనాసౌ పరబ్రహ్మాభియతే, పరమానందము నిచ్చెడి పరబ్రహ్మ :-
[10.1-728-క.]

4380} రామునిసహజన్ముడు  - బలరాముని యొక్క సోదరుడు, కృష్ణుడు :-
[10.1-728-క.]

4381} రావణుడు  - రవము కలవాడు, వ్యు. రు+ణిచ్+ల్యుట్, రావయతి భీషయతి శత్రూన్ శత్రువులను భయపెట్టువాడు. :-
[4-26-వ.]

4382} రాష్ట్రాధిపతి  - రాష్ట్రము (దేశము, దేహము)నకు అధిపతి :-
[4-421-వ.]

4383} రాసకేళి  - ఒకరి చేతులొకరు పట్టుకొని గుండ్రముగ పాటలకు లయబద్దముగ తిరుగు నాట్యవిశేషము, జంటలు జంటలుగ ఉండి వర్తులాకారముగా మెలగుచు చేసెడి నృత్యవిశేషము :-
[2-188.1-తే.]

4384} రాసము  - ఒకరి చేతులొకరు పట్టుకొని గుండ్రముగ పాటలకు లయబద్దముగ తిరుగు నాట్యవిశేషము, జంటలు జంటలుగ ఉండి వర్తులాకారముగా మెలగుచు చేసెడి నృత్యవిశేషము :-
[10.1-1084-వ.]

4385} రాసలీలలు  - ఒకరి చేతులొకరు పట్టుకొని గుండ్రముగ పాటలకు లయబద్దముగ తిరుగు నాట్యవిశేషము, జంటలు జంటలుగ ఉండి వర్తులాకారముగా మెలగుచు చేసెడి నృత్యవిశేషము, నిరంతర సంసార (జన్మ మరణ) చక్ర భ్రహణమునకు సంకేతము. :-
[3-91-వ.]

4386} రాహిత్యులు  - రహితములు కలవారు, లేనివారు, ఉదా. శోభనరాహిత్యులు :-
[2-198-మ.]

4387} రిక్త(ప్ర)  - రిత్త (వి), శూన్యమైనది, వట్టి :-
[10.2-752-చ.]

4388} రిపుమానవిమర్దనుడు  - రిపు (శత్రువుల) మాన (అభిమాన)మును విమర్దనుడు (బాగుగ అణచువాడు), విష్ణువు :-
[3-666-చ.]

4389} రుక్మవతి  - రుక్మిణి అన్న యైన రుక్మి కూతురు :-
[10.2-281.1-తే.]

4390} రుక్మి  - రుక్మిణి అన్న, రుక్మిణి వివాహ సమయమున అవమానం చెందిన ఆమె పెద్దన్న, రుక్మి కూతురు రుక్మవతి ప్రద్యుమ్నుని భార్య, రుక్మి మనవరాలు రుక్మలోచన అనిరుద్ధుని భార్య :-
[2-190-చ., 10.1-1729-ఉ., 10.2-279-వ.]

4391} రుక్మిణి  - రుక్మమస్యాసీతి రుక్మిణి (వ్యుత్పత్తి), సువర్ణి :-
[10.1-1687-చ., 10.1-1725-క.]

4392} రుచి  - 1. ప్రకాశము, దృశ్యప్రపంచ రూపమైన ఇదంవృత్తి 2. చవి, నాలుక స్పర్శజ్ఞానము, 3. ఇచ్చ, 5. రుచి ప్రజాపతి :-
[4-3.1-తే., 10.1-682.1-తే.]

4393} రుచిరము - రుచిరతరము రుచిరతమము :-
[11-72.1-తే.]

4394} రుచులునాలుగు  - తీపి, పులుపు, కారము, చేదు. :-
[10.1-91.1-తే.]

4395} రుద్రగణములు  - రౌద్రస్వభావము కల సమూహములు, రుద్రుని పరిచరులు :-
[3-371-ఉ.]

4396} రుద్రపారిషదులు  - రుద్రుని అనుచరులు, రుద్రగణములు :-
[3-215-వ.]

4397} రుద్రాణి  - రుద్రుని (శివుని) రాణి (భార్య), పార్వతి :-
[4-751.1-తే.]

4398} రుద్రుడు  - రౌద్ర రూపము కల వాడు, వ్యుత్పత్తి. రుద్ సాంసార దుఃఖం ద్రావయతి నాశయతీతి రుద్రః. సంసారదుఃఖమును నశింపజేయువాడు, శివుడు :-
[3-215-వ., 3-473-వ., 4-47-వ., 4-54-వ., 4-159-క., 4-357-వ., 4-695-మ., 4-703.1-తే., 4-732-వ., 7-307-వ., 9-78-వ., 10.2-1243-క.]

4399} రుద్రునిఏకాదశస్థానములు  - 1 చంద్రుడు 2 సూర్యుడు 3 అగ్ని 4 వాయువు 5 జలము 6 ఆకాశము 7 భూమి 8 ప్రాణములు 9 తపస్సు 10 హృదయము 11 ఇంద్రియములు. :-
[3-369-తే.]

4400} రూపవతులు  - (మంచి) రూపము కల వారు, అందగత్తెలు :-
[2-173.1-తే.]

4401} రెండుమూడమ్ములయేటుకాడు  - ఐదు (2+3) బాణముల వాడు, పంచబాణుడు, మన్మథుడు :-
[10.1-1058-ఉ.]

4402} రేచకము  - ప్రాణవాయువు ముక్కుద్వారా బయటకు పంపుట, ఒక ప్రాణాయామ ప్రక్రియ :-
[3-921-వ.]

4403} రేచితఅంగహారము  - వేళ్ళ కదలికలతో సూచించునవి, రాసక్రీడా పారిభాషిక పదము :-
[10.1-1084-వ.]

4404} రేతఃపానము  - ఇంద్రియమును తాగించెడి శిక్షలు, నరక విశేషము :-
[5.2-136-వ.]

4405} రొప్పుట  - గట్టిగా ఆయాసము వలె శబ్దము చేస్తూ ఊపిరి తీయుట :-
[3-413.1-తే.]

4406} రోచనుడు  - (కంటికి) వెలుగు యైనవాడు, యజ్ఞుడు దక్షిణల పన్నెండు మంది కొడుకులలో చిన్నవాడు :-
[4-6-వ.]

4407} రోచిష్ణుడు  - ప్రకాశించెడి స్వభావము గల వాడు, విష్ణువు. :-
[2-236-మ., 3-148-మ., 8-105-మ.]

4408} రోలంబము.  - రోడ్బ అంటే ఉన్మాదం, అంబచ్ అంటే కలది కనుక మకరందాలు మిక్కిలిగా త్రాగి మదించేది తుమ్మెద రోలంబము. :-
[10.1-1462-శా.]

4409} రోలు  - ధాన్యాదులను దంచుటకైన గుండ్రటి రాతి లేదా కఱ్ఱ సాధనము, రోలు యందు పోస్తూ రోకలితో దంచుతారు. :-
[10.1-310-మత్త.]

4410} రోహిణీవిభుడు  - రోహిణి (27 నక్షత్రములలోను ఒకటి, రోహిణి దక్షుడు చంద్రునికి ఇచ్చిన ఇరవైఏడుగురు పుత్రికలలో చిన్నది, చంద్ర కళలకు కారణం ఈమె అంటే చంద్రునికి గల బహు ప్రీతి అంటారు) యొక్క విభుడు, చంద్రుడు :-
[8-115-మ.]

4411} రౌక్మిణేయుడు  - రుక్మిణి కొడుకు, ప్రద్యుమ్నుడు :-
[10.2-842-చ.]

4412} రౌద్రము  - భయంకరమైన తీక్షణమైన కోపము వంటి నవరసములలోని ఒక రసము :-
[3-371-ఉ.]

4413} రౌరవములు  - రురురూపమున కల ప్రాణులచేత బాధింప పెట్టునవి, నరక విశేషములు :-
[5.2-136-వ., 5.2-140-వ., 5.2-140-వ.]