పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

ఛందోపరిచయము : తేటగీతి

26 తేటగీతి                                                  (ఉపజాతి)

తే.
క్కఁ డర్కుఁ డిద్ధఱు జిష్ణు లొనర మఱియు
నిద్ధ ఱర్కు లీచొప్పుమ నేగురేసి
నాల్గు వంకలఁ గదిసి వర్ణన మొనర్ప
తేటగీతి విష్ణుని పేర్మిఁ దేటపఱచు.
గణ విభజన
1 సూర్య గణం    2 ఇంద్ర గణాలు    2- సూర్య గణాలు
UI    UII    IIIU    III    III
హ    భ    నగ    న    న
క్కఁ     డర్కుఁ డి    ద్ధఱు జిష్ణు    లొనర    మఱియు
లక్షణములు
•    పాదాలు:    నాలుగు
•    ప్రతి పాదంలోనూ అక్షరాల సంఖ్య:    నియమం లేదు
•    ప్రతిపాదంలోని గణాలు:    ప్రతిపాదంలో - 1 సూర్యగణము 2 ఇంద్రగణములు 2 సూర్యగణములు.
•    యతి :
ప్రతి పాదములో - 4వ గణాద్యక్షరం
•    ప్రాస:
నియమం లేదు
•    ప్రాస: యతి
యతి బదులు ప్రాస యతి వేయవచ్చు
పోతన తెలుగు భాగవతములో వాడిన పద్యముల సంఖ్య -     1061
ఉదాహరణ 1:
9-269.1-తే.
విని దశగ్రీవుఁ డంగజ వివశుఁ డగుచు
ర్థిఁ బంచినఁ బసిఁడిఱ్ఱి యై నటించు
నీచు మారీచు రాముఁడు నెఱి వధించె
నంతలో సీతఁ గొనిపోయె సురవిభుఁడు.
ఉదాహరణ 2:
8-87.1-తే.
ఖిల రూపముల్ దనరూప మైనవాఁడు
దిమధ్యాంతములు లేక డరువాఁడు
క్తజనముల దీనుల పాలివాఁడు
వినఁడె? చూడఁడె? తలఁపడె? వేగ రాఁడె?