పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

తేనెసోనలు(అ-న) : తాటంకాచలనంబుతో (8-102-శా.)

  •  
  •  
  •  

8-102-శా.

  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

తాటంకాచలనంబుతో; భుజనటద్ధమ్మిల్లబంధంబుతో;
శాటీముక్త కుచంబుతో; నదృఢచంత్కాంచితో; శీర్ణలా
లాటాలేపముతో; మనోహరకరాగ్నోత్తరీయంబుతోఁ;
గోటీందుప్రభతో; నురోజభర సంకోచద్విలగ్నంబుతోన్.

టీకా:

తాటంకా = కర్ణాభరణముల; ఆచలనంబు = అధికమైన కదలికల; తోన్ = తోటి; భుజ = భుజములపై; నటత్ = నాట్యమాడుతున్న; ధమ్మిల్లబంధంబు = జుట్టుముడి; తోన్ = తోటి; శాటీ = పమిటనుండి; ముక్త = విడివడిన; కుచంబు = స్తనముల; తోన్ = తోటి; అదృఢ = బిగుతుతగ్గి; చంచత్ = చలించుచున్న; కాంచీ = ఒడ్డాణము; తోన్ = తోటి; శీర్ణ = నుసిరాలుచున్న; లాలాట = నుదిటి యందలి; లేపము = పూత; తోన్ = తోటి; మనోహర = భర్త {మనోహరుడు - మనస్ (మనసును) హరుడు (దొంగిలించినవాడు), భర్త}; కరా = చేతియందు; ఆలగ్న = చిక్కుకున్న; ఉత్తరీయంబు = పమిట; తోన్ = తోటి; కోటి = కోటిమంది; ఇందు = చంద్రుల; ప్రభ = కాంతి; తోన్ = తోటి; ఉరోజ = స్తనముల యొక్క; భర = బరువువలన; సంకోచత్ = చిక్కిపోయిన; వలగ్నంబు = నడుము; తోన్ = తోటి;

భావము:

లక్ష్మీదేవి, చెవిపోగులు ఊగుతున్నాయి; భుజాల మీద కొప్పముడి చిందులేస్తోంది; స్తనాలపై నించి పైట తొలగిపోయింది; తళతళలాడే వడ్డాణం వదు లైపోయింది; పైటకొంగు భర్త చేతిలో పట్టుబడే ఉంది; ఆమె కోటి చంద్రుల కాంతితో మెరిసిపోతోంది; స్తనభారంతో నడుం నకనక లాడుతోంది.

    గజేంద్రుని మొర విని అదాట్టుగా బయలుదేరిపోయాడు విష్ణుమూర్తి. పాపం లక్ష్మీ దేవి పాట్లు ఆహా! ఎంత చక్కగా వర్ణించారు మా పొతన్న గారు.