పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

తేనెసోనలు(అ-న) : ఈసౌకుమార్య (3-728-క.)

3-728-క.

సౌకుమార్య మీ వయ
సీసౌందర్యక్రమంబు నీధైర్యంబు
న్నీ సౌభాగ్యవిశేషము
నేతులకుఁ గలదు చూడనిది చిత్ర మగున్.

టీకా:

ఈ = ఈ; సౌకుమార్యమున్ = సుకుమారత్వమును; ఈ = ఈ; వయస్ = యౌవనము; ఈ = ఈ; సౌందర్యక్రమమున్ = సుందరత; ఈ = ఈ; ధైర్యంబున్ = ధైర్యమును; ఈ = ఈ; సౌభాగ్య = సౌభాగ్యము యొక్క; విశేషమున్ = ప్రత్యేకతయును; ఏ = ఏ; సతుల్ = స్త్రీల; కున్ = కి; కలదు = ఉన్నది; చూడన్ = చూస్తే; ఇది = ఇది; చిత్రము = విచిత్రము; అగున్ = అయు ఉన్నది.

భావము:

ఆహాహ ఎంత మృదువైన దేహము, ఎంతటి నవయౌవనము, ఎంత చక్కటి శరీర సౌష్టవము, ఎంతటి జాణతనము, ఎంత ఎక్కువ సౌభగ్యం. ఇంతటి విశేషాలు ఏ స్త్రీలలో మాత్రం ఉన్నాయి. అబ్బో ఈమె చాలా చిత్రంగా ఉందే. 

 సృష్ట్యాదిలో రాక్షసులు జనించారు. కాముకత సృష్టి నిరంతరంగా జరగటానికి వలసినదే. కాని కాముక లోలత్వము, అది మితిమీరుట నియంత్రించుకోలేక పోవుట దౌర్భల్యం యిది రాక్షసత్వ లక్షణం, పరిహరించ దగినవి. బ్రహ్మదేవుని కోరిక మేరకు వారిని నియంత్రించడానికి విష్ణుమాయ సంధ్యా సుందరిని సృష్టించింది. వారికి ఇలా అపూర్వ సౌందర్యరాశిలా కనిపించి ఆకర్షిస్తోంది. ఇలాంటి సౌందర్యారోపణకి కారణమైన లోలత్వమే మోహం. ఇక్కడ చిత్రం ఏమంటే ఆమెనుండి ప్రతిస్పందన శూన్యం. ఐనా నియంత్రించు కోలేని వారి ఆ లోలత్వాన్ని ‘స’ కార ప్రాస సూచిస్తోందా?.