పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

: :చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం: :ఓం సహనావవతు! సహనౌభునక్తు!
సహవీర్యం కరవావహై!
తేజస్వి నావధీతమస్తు! మా విద్విషా వహై!
ఓం శాంతిః శాంతిః శాంతిః!!

పోతన తెలుగు భాగవతము అను గణనాలయము

తెలుగు జాలజనులారా మీకు స్వాగతం సుస్వాగతం. . రండి రండి. . . మీ ఈ తెలుగుభాగవతం.ఆర్గ్ ఒక అందాల భరిణ లాంటిది. మీ తెలుగు జాలజనులు (నెట్ సిటిజనులు) కోసం, ఎంతో శ్రమించి ఈ భరిణలోని అనేక "అర"లలో ఏర్చి కూర్చిన ఈ అమృత గుళికలు ఆస్వాదించండి:

~ ~ ~

వ్యాసమహర్షి సంస్కృతంలో రచించిన భాగవతాన్ని పోతనామాత్యులు తెలుగులోనికి ఆంధ్రీకరించి ఆ అమృతభాండాగారాన్ని మన తెలుగులు అందరికీ అందించారు. సమగ్రంగా దేశభాషలలోకి వచ్చిన మొట్టమొదటి భాగవతం ఇదే. అలాగే, తెలుగులోనే కాదు దేశభాషల్లోని గ్రంథాలలో, ఇంత సమగ్రంగా అంతర్జాలంలో అందించిన మొట్టమొదటి గ్రంథంగా మన "తెలుగు భాగవతానికే" ఆ ఘనత దక్కింది. "పలికెడిది భాగవతమట నే పలికిన భవహార మగునట" అని తన వినయాన్ని, భాగవతం పలకడం వల్ల కలిగే ప్రయోజనాన్ని సరళమైన భాషలో చెప్పారు . మన తెలుగు భాగవతం జాలగూడు (వెబ్సైటు)లో భాగవతంలోని 9000+ పద్యాలూ ఉంచడమే కాదు వాటి ప్రతిప్రదార్ధాలు , భావాలే కాకుండా ఆ పద్యం వినేలాగా, నేర్చుకోవడానికి వీలుగా ఉండేలా ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నాం. అంతేకాదు,, భాగవతానికి పోతనామాత్యులవారికీ,. . . చెందిన అనేకానేక విషయాలు, వ్యాసాలు, పుటలు, పుస్తకాలు, ఆటలు, పాటలు. . . మున్నగునవి కూడా ఇక్కడ సంకలనం చేయబడ్డాయి. ఈ జాలగూడు (వెబ్సైటు)లో ఎటువంటి వ్యాపారప్రకటనలు ఉండవు , మీరు స్వేచ్చగా ఏ పద్యానైనా కాపీ చేసుకోవచ్చు, వాడుకోవచ్చు , షేర్ చేసుకోవచ్చు వ్యాపారాత్మకం కానంత వరకు. మీరు షేర్ చేసిన చోట మన భాగవత వెబ్సైటు పేరు ఇవ్వడం ఇవ్వకపోవడం మీ విజ్ఞతకే విడిచిపెడుతున్నాం.

విష్ణుమూర్తి కథలు శుభప్రదమైనవి, అమృతంలా ఉంటాయి; వాటిని ఎన్నిసార్లు విన్నా, ఎప్పటికప్పుడు సరి క్రొత్తగా ఉంటాయి; మన పోతన తెలుగు భాగవతం అలాంటి పవిత్రమైన కథల కాసారం; ఇది భక్తి ప్రపత్తులు, సాహిత్యమే కాకుండా అనేక శాస్త్రీయ, సాంఘిక విషయాలు అసంఖ్యాకంగా ఉన్న ఒక మహా ప్రపంచం; దీని లోని సందేశాన్ని, అనంత విజ్ఞాన విశేషాలను సంపూర్ణంగా, సమగ్రంగా పాత కొత్తల మేలు కలయికగా, అందిస్తున్నాం; రండి రండి: ఆస్వాదించండిసంకలనములు
పిల్లలకు:-

ఎంచిన పద్యాలు:-

ఎంచిన ఘట్టాలు:- మున్నగునవి

పుస్తకములు:- మొదలైనవి.

వ్యాకరణాదులు:- వంటివి.

వివరణలు:- .

ఇతరములు:- వగైరా

పరిశోధనలు:- .

గణాంకములు:- జాబితాలు, పట్టికలు, పదకేళి అక్షర కేళి వంటి దత్తైలు, అకారాది - ఛందోవారీ జాబితాలు లాంటివి.