ఓం నమో భగవతే వాసుదేవాయ

తెలుగు భాగవతములోని పేర్ల కోశము
క, చ, ట - వర్గములు
(నిర్మాణంలో ఉంది - సవరణలు సూచనలు అందించండి)


అక్షరాలుఇతరులవిపురుషులవిస్త్రీలవిమొత్తం పేర్లు
క+చ+ట3726531601185
17134490605
1618236
718226179
810422
569012158
112
4510924178
22
11
112


[ ↑ ] :1) కంక-1 (పురుష){సంజ్ఞా}[రాజు]:- కంక అంటే కంకుభట్టుగ పిలవబడ్డ ధర్మరాజు అని రాబందులు అని నానార్ర్థాలు ఉన్నాయి. ఈ పదం ప్రథమ స్కంధలో నైమిశారణ్య వర్ణన సందర్భంలో మహాభారతం} ఉపమాన పదంగా వాడబడింది. - :వంశం - రాజు;:::::::పద్య సం.(లు) - 1-39-వ.,

[ ⇑ ] :2) కంక-2 ( -){జాతి}[గగనచర]:- కంక అంటే రాబందులు అని కంకుభట్టుగ పిలవబడ్డ ధర్మరాజు అని నానార్ర్థాలు ఉన్నాయి. ఈ పదం ప్రథమ స్కంధలో నైమిశారణ్య వర్ణన సందర్భంలో మహాభారతం} కు ఉపమాన పదంగా వాడబడింది. - :వంశం - గగనచర;:::::::పద్య సం.(లు) - 1-39-వ., 3-344-ఆ., 6-251-వ., 6-331-వ., 8-334-వ., 10.2-513-మ.,

[ ⇑ ] :3) కంక-3 (స్త్రీ){సంజ్ఞా}[చంద్రవంశం]:- ఈమె వసుదేవుని సోదరుడు కంకుని భార్య - :వంశం - చంద్రవంశం;::::భర్త - కంకుడు;:కొడుకు(లు) - బకుడు, సత్యాజిత్తు, పురుజిత్తు;::పద్య సం.(లు) - 9-722-వ.,

[ ⇑ ] :4) కంకటములు- (-){జాతి}[పరికరములు]:- కంకటములు అంటే కవచములు - :వంశం - పరికరములు;:::::::పద్య సం.(లు) - 8-327-క., నుండి 8-334-వ., వరకు,

[ ⇑ ] :5) కంకణములు- (స్త్రీ){జాతి}[పరికరములు]:- కంకణములను సాగరమథనం తరువాత జరిగిన సురాసుర యుద్ధంలో ఇరు పక్షాల వారు ధరించారు. - :వంశం - పరికరములు;:::::::పద్య సం.(లు) - 8-327-క., నుండి 8-334-వ., వరకు,

[ ⇑ ] :6) కంకణుడు- (పురుష){సంజ్ఞా}[చంద్రవంశం]:- చంద్రవంశంలోని భజమానుని కొడు కితను.
భజమానునకు మొదటి భార్య తోటి నిమ్రోచి, కంకణుడు, వృష్ణుడు అని ముగ్గురు; రెండవ భార్య తోటి శతజిత్తు, సహస్రజిత్తు, అయుతజిత్తు అని ముగ్గురు; జన్మించారు. - :వంశం - చంద్రవంశం;:తండ్రి - భజమానుడు;::::::పద్య సం.(లు) - 9-709-వ.,

[ ⇑ ] :7) కంకము- (పురుష){జాతి}[గగనచర]:- కంకము అంటే రాపులుగు (కంక, రాబందు) అనే విహంగము. బలి దేవేంద్రుల నేతృత్వంలో జరిగిన సురాసుర యుద్ధంలో రాక్షసులు వీటిని వాహనాలుగా వాడారు. - :వంశం - గగనచర;:::::::పద్య సం.(లు) - 8-327-క., నుండి 8-334-వ., వరకు,

[ ⇑ ] :8) కంకుడు- (పురుష){సంజ్ఞా}[చంద్రవంశం]:- ఇతడు శ్రీకృష్ణుని చిన్నాన్న. చంద్ర వంశంలోని శూరుడను దేవమీఢునికి మారిషకి కొడుకు. వసుదేవుని తమ్ముడైన కంకుడు భార్య కంక యందు బకుడు, సత్యాజిత్తు, పురుజిత్తు అను కొడుకులను పొందాడు.
శ్రీకృష్ణుని తాత శూరునికి (ఇతని మరొక పేరు దేవమీఢుడు) భార్యలు మారిష అందు వసుదేవుడు, దేవభాగుడు, దేవశ్రవుడు, నానకుడు, సృంజయుడు, శ్యామకుడు, కంకుడు, అనీకుడు, వత్సకుడు, వృకుడు అనెడి పదిమంది పుత్రులు; పృథ, శ్రుతదేవ, శ్రుతకీర్తి, శ్రుతశ్రవస, రాజాధిదేవి అనెడి కుమార్తెలు ఐదుగురు - :వంశం - చంద్రవంశం;:తండ్రి - దేవమీఢుడు (శూరుడు);:తల్లి - మారిష;:భార్య - కంక;::కొడుకు(లు) - బకుడు, సత్యాజిత్తు, పురుజిత్తు;::పద్య సం.(లు) - 9-714-వ., 9-722-వ.,

[ ⇑ ] :9) కంకులు-1 (పురుష){జాతి}[ఆంధ్ర జాతీయులు]:- భవిష్యత్తులో నాభీర వంశం తరువాత కంక వంశం రాజులు ఏలుతారు.
నాభీరవంశం వారు ఏడుగురు, గర్దభవంశం వారు పదిమంది, కంకవంశం వారు పదహారుమంది రాజ్యభారాన్ని ధరించి పరిపాలిస్తారు. అటు పిమ్మట ఎనిమిదిమంది యవనులు, పదునాలుగురు బర్బరులు ప్రభువులు అవుతారు. - :వంశం - ఆంధ్ర జాతీయులు;:::::::పద్య సం.(లు) - 12-8-వ.,

[ ⇑ ] :10) కంకులు-2 (పురుష){జాతి}[మానవ యోని]:- కంకులు, యవనులు, కిరాతులు, పుళిందులు, హూణులు, శకులు, ఆభీరులు, చండాలురు-ఇలాంటి జాతుల్లో పుట్టినవారు, ఇతర పాపాత్ములు కూడ పరమపావనుని సేవించినచో భాగవత శ్రేష్ఠుల నాశ్రయించినవారు, పరిశుద్ధ శరీరులు, మంగళాకారులు అయి ఉంటారు. - :వంశం - మానవ యోని;:::::::పద్య సం.(లు) - 2-63-మ.,

[ ⇑ ] :11) కంకులు-3 (పురుష){జాతి}[మానవ యోని]:- విష్ణుమూర్తిని సేవించి, భాగవతశ్రేష్ఠులతో చేరినచో అందరూ పరిశుద్ధులు, మంగళాకారులు అవుతారు అంటూ నిర్ణయిస్తూ వీరిని కూడా పేర్కొన్నారు. - 2-63-మ. - :వంశం - మానవ యోని;:::::::పద్య సం.(లు) - 2-63-మ.,

[ ⇑ ] :12) కంజనీరుండు- (పురుష){సంజ్ఞా}[నాగుడు]:- ఇతడు వైశాఖ (మాధవం) మాసంలో సూర్యుని అనుచరులలోని నాగుడు.
సూర్యుడు ఈ మాసంలో అర్యముడు అను పేరుతో, పుంజికస్థలి, పులహుడు, కంజనీరుండు, ప్రహేతి, నారదుండు, ఓజుడు మున్నగువారు అనుచరులుగా కలిగి సంచరిస్తాడు. - :వంశం - నాగుడు;:::::::పద్య సం.(లు) - 12-41-వ., నుండి 12-45-వ., వరకు,

[ ⇑ ] :13) కంజాక్షుడు- (పురుష){సంజ్ఞా}[దైవ యోని]:- విష్ణువు, కంజ (పద్మము) వంటి కన్నులు కలవాడు. - :వంశం - దైవ యోని;:::::::పద్య సం.(లు) - 5.2-9.,1-ఆ., 6-498-తే., 10.1-1131-మ., 10.2-119-మ., 10.2-980-మ., 10.2-1141-మ., 11-44-సీ.,

[ ⇑ ] :14) కంజాతభవాండకుంభకుడు- (పురుష){సంజ్ఞా}[దేవ యోని]:- కంజాతభవాండకుంభకుడు అంటే బ్రహ్మాండభాండములు కడుపులో కలవాడు, హరి - :వంశం - దేవ యోని;:::::::పద్య సం.(లు) - 1-1-శా.,

[ ⇑ ] :15) కంజోదరుడు- (పురుష){సంజ్ఞా}[దైవ యోని]:- విష్ణువు, కంజము (పద్మము) ఉదరమునగలవాడు. బ్రహ్మదేవుని వరాలతో కొవ్వెక్కిన హిరణ్యకశిపుడు తన తమ్ముడిని చంపాడు అని పగబూని కంజాక్షుని (విష్ణుమూర్తి) మీద విడువని శత్రుత్వం పెంచుకున్నాడు. - :వంశం - దైవ యోని;:::::::పద్య సం.(లు) - 7-94-క.,

[ ⇑ ] :16) కంఠీరవ - (స్త్రీ){జాతి}[జంతు]:- సింహములు - ఇవి అష్టమ స్కంధములోని త్రికూట పర్వతములో వర్ణించబడ్డాయి - :వంశం - జంతు;:::::::పద్య సం.(లు) - 8-23-సీ., 8-24-వ., 8-25-క.,

[ ⇑ ] :17) కండుముని- (పురుష){సంజ్ఞా}[ఋషి]:- పూర్వం కండు మహాముని చేస్తున్న తపస్సును భగ్నం చేయటానికి ఇంద్రుడు ప్రమ్లోచ అనే అప్సరసను పంపించాడు. ఆమె కండుమునివల్ల గర్భం ధరించి ఒక పుత్రికను ప్రసవించి చెట్ల మధ్య వదిలి స్వర్గానికి వెళ్ళిపోగా…
ఆ శిశువు ఆకలి బాధతో గట్టిగా ఏడ్వసాగింది. సోముడు వచ్చి అమృతం స్రవించే తన చూపుడు వ్రేలిని శిశువు నోటిలో ఉంచాడు. శిశువు ఆ అమృతం త్రాగి పెరిగింది. ఆమె పేరు మారిష. - :వంశం - ఋషి;:::::::పద్య సం.(లు) - 4-909-వ., 4-910-సీ.,

[ ⇑ ] :18) కందపద్యము- ( -){జాతి}[భాష]:- ఛందస్సు, తెలుగు భాగవతములో ఉపయోగించిన జాతి ఛందోరీతి కందపద్యము. వీటిని గ్రంధములో 2610 పద్యాలకు ఉపయోగించారు. వచనములు తప్పించి. పద్యాలలో వీటినే అత్యధిక మారులు వాడారు. - :వంశం - భాష;:::::::పద్య సం.(లు) - 1-18-క.,

[ ⇑ ] :19) కందరాళ - ( -){జాతి}[వృక్ష]:- కలజువ్వి - ఇవి అష్టమ స్కంధములోని త్రికూట పర్వతములో వర్ణించబడ్డాయి - :వంశం - వృక్ష;:::::::పద్య సం.(లు) - 8-23-సీ., 8-24-వ., 8-25-క.,

[ ⇑ ] :20) కందర్పుడు- (పురుష){సంజ్ఞా}[దైవ యోని]:- మన్మథుడు, సుఖం తత్ర ద్రపో యస్య, బవ్రీ., సుఖ విషయమున గర్వము కలవాడు. - :వంశం - దైవ యోని;:::::::పద్య సం.(లు) - 1-237-మ., 2-16-వ., 3-51-శా., 4-642-వ., 9-604-క., 10.1-835-., 10.1-1004-మ., 10.2-12-వ.,

[ ⇑ ] :21) కందుకబంధము- ( -){సంజ్ఞా}[నృత్తము]:- పారిభాషిక పదము - రాసక్రీడ - నృత్తము
పూలచెండ్లు ఎగరవేయునట్లు ఎగురుతుగాని పూలచెండ్లను ఎగురవేయుచుగాని హస్త విన్యాసాదులు కనుపింపజేయుట - :వంశం - నృత్తము;:::::::పద్య సం.(లు) - 10.1-1084-వ.,

[ ⇑ ] :22) కంపితశిరోభావాలు- ( -){సంజ్ఞా}[నృత్తము]:- పారిభాషిక పదము - రాసక్రీడ - నృత్తము
కిందమీదలుగా కదలించి శిరస్సులు కలవి - :వంశం - నృత్తము;:::::::పద్య సం.(లు) - 10.1-1084-వ.,

[ ⇑ ] :23) కంబళబర్హిషుడు- (పురుష){సంజ్ఞా}[చంద్రవంశం]:- ఇతడు చంద్రవంశంలోని వాడు. ఇతని తండ్రి అందకుడు. ఇతనికి భజమానుడు, కుకురుడు, శుచి అని ముగ్గురు సోదరులు. - :వంశం - చంద్రవంశం;:తండ్రి - అందకుడు;::::::పద్య సం.(లు) - 9-712-వ.,

[ ⇑ ] :24) కంబళాశ్వుడు- (పురుష){సంజ్ఞా}[నాగుడు]:- ఇతడు ఆశ్వయుజ (ఇషము) మాసంలో సూర్యుని అనుచరులలోని నాగుడు.
సూర్యుడు ఈ మాసంలో త్వష్ట అను పేరుతో, తిలోత్తమ, ఋచీకతనయ (జమదగ్ని), కంబళాశ్వుడు, బ్రహ్మపేతుడు,, ధృతరాష్ట్రుడు, శతజిత్తు, ఇషంబరుడు మున్నగువారు అనుచరులుగా కలిగి సంచరిస్తాడు. - :వంశం - నాగుడు;:::::::పద్య సం.(లు) - 12-41-వ., నుండి 12-45-వ., వరకు,

[ ⇑ ] :25) కంబళుడు- (పురుష){సంజ్ఞా}[నాగ జాతి]:- పాతాళలోకంలో వాసుకి, శంఖుడు, కుళికుడు, మహాశంఖుడు, శ్వేతుడు, ధనంజయుడు, ధృతరాష్ట్రుడు, శంఖచూడుడు, కంబళుడు, అశ్వతరుడు, దేవదత్తుడు మొదలైనవారు మహానాగులుఉంటారు. వారికి ఐదు, నూరు వేయి తలలు ఉంటాయి. వారి పడగల మీద మణులు మెరుస్తూ ఉంటాయి. ఆ మణుల కాంతులు పాతాళంలోని చీకట్లను పారద్రోలుతుంటాయి. - :వంశం - నాగ జాతి;:::::::పద్య సం.(లు) - 5.2-121-వ.,

[ ⇑ ] :26) కంబళుడు,- (పురుష){సంజ్ఞా}[నాగులు]:- కద్రువ పుత్రుడు, పాతాళలోకంలోని ప్రముఖ నాగులలో ఒకడు.
వాసుకి, శంఖుడు, కుళికుడు, మహాశంఖుడు, శ్వేతుడు, ధనంజయుడు, ధృతరాష్ట్రుడు, శంఖచూడుడు, కంబళుడు, అశ్వతరుడు, దేవదత్తుడు మొదలైనవారు (అధోలోకం అయిన) కద్రువ కుమారులు, పాతాళలోక వాసులు అయిన మహానాగులు. వారిలో కొందరు ఐదు తలలవారు, కొందరు నూరు తలలవారు, వేయి తలలవారూ ఉన్నారు. వారి పడగల మీద మణులు మెరుస్తూ ఉంటాయి. ఆ మణుల కాంతులు పాతాళంలోని చీకట్లను పారద్రోలుతుంటాయి. - :వంశం - నాగులు;:::::::పద్య సం.(లు) - 5.2-121-వ.,

[ ⇑ ] :27) కంస (స్త్రీ)- (స్త్రీ){సంజ్ఞా}[చంద్రవంశం]:- శ్రీకృష్ణునికి ఈమె పెదతల్లి. చంద్రవంశంలోని ఉగ్రసేనుని పెద్ద కుమార్తె. ఈమె సోదరులు కంసుడు, న్యగ్రోధుడు, సునామకుడు, కహ్వుడు, శంకుడు, సుభువు, రాష్ట్రపాలుడు, విసృష్టుడు, తుష్టిమంతుడు అనెడి తొమ్మిదిమంది; సోదరీమణులు కంసవతి, సురాభువు, రాష్ట్రపాలి అనెడి ముగ్గురు. వారు వసుదేవుని సోదరులకు భార్యలు అయ్యారు.
వసుదేవుని తమ్ముడు దేవభాగునికి కంసతో చిత్రకేతుడు, బృహద్బలుడు అని ఇద్దరు కొడుకులు పుట్టారు. - :వంశం - చంద్రవంశం;:తండ్రి - ఉగ్రసేనుడు;::::::పద్య సం.(లు) - 9-714-వ., 9-722-వ.,

[ ⇑ ] :28) కంసజింఘాంసునంశము- (పురుష){సంజ్ఞా}[దైవ యోని]:- బ్రహ్మ, కంసజింఘ (కంసునిశత్రువైన కృష్ణుని) యొక్క అంశము (అంశ అయినవాడు) - :వంశం - దైవ యోని;:::::::పద్య సం.(లు) - 6-3-ఉ.,

[ ⇑ ] :29) కంసదానవుడు- (పురుష){సంజ్ఞా}[చంద్రవంశం]:- కంసుడు, మధురను ఏలిన శ్రీకృష్ణుని మేనమామ, దేవకీదేవి అష్టమగర్భం చేతిలో మరణం అని ఆకాశవాణి చెప్పింది, ఆ ప్రకారమే కృష్ణుని చేతిలో మరణించాడు) - :వంశం - చంద్రవంశం;:::::::పద్య సం.(లు) - 3-92-వ.,

[ ⇑ ] :30) కంసమర్దనుడు- (పురుష){సంజ్ఞా}[చంద్రవంశం]:- కృష్ణుడు, కంసుని సంహరించినవాడు. - :వంశం - చంద్రవంశం;:::::::పద్య సం.(లు) - 10.1-1467-సీ.,

[ ⇑ ] :31) కంసవతి (స్త్రీ)- (స్త్రీ){సంజ్ఞా}[చంద్రవంశం]:- శ్రీకృష్ణునికి ఈమె పెదతల్లి. చంద్రవంశంలోని ఉగ్రసేనుని రెండవ కుమార్తె. ఈమె సోదరులు కంసుడు, న్యగ్రోధుడు, సునామకుడు, కహ్వుడు, శంకుడు, సుభువు, రాష్ట్రపాలుడు, విసృష్టుడు, తుష్టిమంతుడు అనెడి తొమ్మిదిమంది; సోదరీమణులు కంస, సురాభువు, రాష్ట్రపాలి అనెడి ముగ్గురు. వారు వసుదేవుని సోదరులకు భార్యలు అయ్యారు.
వసుదేవుని తమ్ముడు దేవశ్రవుడికి కంసవతితో వీరుడు, నిషుమంతుడు పుట్టారు. - :వంశం - చంద్రవంశం;:తండ్రి - ఉగ్రసేనుడు;::::::పద్య సం.(లు) - 9-714-వ., 9-722-వ.,

[ ⇑ ] :32) కంసవిదారి- (పురుష){సంజ్ఞా}[చంద్రవంశం]:- కృష్ణుడు, కంసుని సంహరించినవాడు. - :వంశం - చంద్రవంశం;:::::::పద్య సం.(లు) - 5.2-166-క., 10.2-139-చ.,

[ ⇑ ] :33) కంసారి- (పురుష){సంజ్ఞా}[చంద్రవంశం]:- కృష్ణుడు, కంసుని సంహరించినవాడు. విష్ణువు కలియుగంలో నల్లనిరంగుతో కృష్ణుడు అనుపేరు కలిగి, భక్తులను రక్షించడానికి పుండరీకాక్షుడు యజ్ఞములందు కీర్తించబడతాడు. అప్పుడు ఆయనను హరి, రాముడు, నారాయణుడు, నృసింహుడు, కంసారి, నళినోదరుడు మున్నగు పేర్లతో బ్రహ్మవాదులైన మునీంద్రులు స్తుతిస్తూంటారు. అని కరభాజన ఋషి విదేహరాజుకు చెప్పాడు - :వంశం - చంద్రవంశం;:::::::పద్య సం.(లు) - 11-213-వ., 1-77-వ., 10.1-1704.,1-తే., 11-77-వ.,

[ ⇑ ] :34) కంసాసురసంహారుడు- (పురుష){సంజ్ఞా}[చంద్రవంశం]:- కృష్ణుడు, కంసుని సంహరించినవాడు. - :వంశం - చంద్రవంశం;:::::::పద్య సం.(లు) - 6-35-క.,

[ ⇑ ] :35) కంసుడు- (పురుష){సంజ్ఞా}[చంద్రవంశం]:- ఇతడు కృష్ణుని మేనమామ, కృష్ణుని చేతిలో చనిపోయాడు. ఇతడు చంద్రవంశంలోని ఉగ్రసేనుని పెద్ద కుమారుడు. ఇతని సోదరులు న్యగ్రోధుడు, సునామకుడు, కహ్వుడు, శంకుడు, సుభువు, రాష్ట్రపాలుడు, విసృష్టుడు, తుష్టిమంతుడు అనెడి ఎనిమిదిమంది; సోదరీమణులు కంస, కంసవతి, సురాభువు, రాష్ట్రపాలి అనెడి నలుగురు.
చెల్లెలు దేవకీదేవి వసుదేవుల వివాహ సందర్భంలో కంసుడు ఉల్లాసంగా రథం ఎక్కించుకుని తానే నడుపుతూ తీసుకువెళ్లే సమయంలో అశరీరవాణి "ఈమె ఎనిమిదవ గర్భంలో విష్ణువు పుట్టి నిన్ను సంహరిస్తాడు" అంది. కంసుడు చెల్లెలును చంపబోతే వసుదేవుడు సర్ది చెప్పాడు. దేవకీదేవి ఏడుగురు కొడుకులను కంసుడు చంపేసాడు.
దేవకీ వసుదేవులను కారాగారంలో పెట్టాడు.
వసుదేవుడు కృష్ణుడు పుట్టగానే వ్రేపల్లెలో యశోద వద్ద ఉంచి. ఆడపిల్లను కారాగారానికి తెచ్చి దేవకి వద్ద ఉంచాడు.
కంసుడు పిల్లను చంపడానికి విసరగా. ఆమె మాయాదేవిగా ఆకాశంలోకి నిలబడి, "నిన్ను చంపేవాడు వేరే చోట పెరుగుతున్నాడు" అని చెప్పింది.
ఇతను పూర్వ జన్మలో కాలనేమి అని నారదుని నుండి తెలుసుకున్నాడు. కృష్ణునిపై ఆ కక్ష పెంచుకున్నాడు. రాక్షసులను అనేకులను కృష్ణుని పైకి పంపాడు.
కృష్ణుడు కంసుని చంపిన పిమ్మట
కంసుడి భార్యలు అస్తి, ప్రాస్తి విధవలై దుఃఖిస్తూ తమ తండ్రి అయిన జరాసంధుడి దగ్గరకు వెళ్ళి మొరపెట్టుకోగా, అతను శ్రీకృష్ణుని పైకి యుద్ధానికి వెళ్ళాడు. - :వంశం - చంద్రవంశం;:తండ్రి - ఉగ్రసేనుడు;::::::పద్య సం.(లు) - 1-390-మత్త., 2-190., 3-103-చ., 9-714-వ., 10.1-20-సీ.,10.1-53-క., 10.1-212-సీ., 10.1-286-వ., 10.1-1375-వ., 10.1-1524-వ., 1525-శా., 10.2-206-ఉ., 11-6-మ.,

[ ⇑ ] :36) కకుత్థ్సుడు-1 (పురుష){సంజ్ఞా}[సూర్య వంశం]:- రాజ్యమోహంతో గర్వాంధులైన రాజులను చూసి భూదేవి నవ్వుకుంటుంది అంటూ పేర్కొన్న ఇరవై ఎనిమిది రాజులలో ఇతను ఒకడు. - :వంశం - సూర్య వంశం;:::::::పద్య సం.(లు) - 12-18-వ.,

[ ⇑ ] :37) కకుత్థ్సుడు-2 (పురుష){సంజ్ఞా}[సూర్య వంశం]:- శశాదుని కుమారుడు రాక్షసుల పురాలను జయించుటచే పురంజయుడు అని, ఆబోతు రూపుడైన ఇంద్రుడుని ఎక్కి రాక్షసుల జయించుట వలన ఇంద్రవాహనుడు అని; అతని మూపురంను ఎక్కి యుద్దం చేసినందు వలన కకుత్స్థుడు అని మూడు (3) పేర్లతోను పేరుపొందాడు. అలా దేవతల తరఫున యుద్ధాలు చేసి జయించిన రాక్షసుల సంపదలను ఇంద్రుడికి ఇచ్చాడు. ఆ పురంజయుని కొడుకు అనేనసుడు. అతని పుత్రుడు పృథువు. - :వంశం - సూర్య వంశం;:::::::పద్య సం.(లు) - 9-163-వ.,

[ ⇑ ] :38) కకుద్మి- (పురుష){సంజ్ఞా}[సూర్యవంశం]:- సూర్యవంశంలోని రైవతుని నూరుగురు (100) కొడుకులలో జేష్ఠుడు. ఇతడు. ఆనర్తుని పుత్రుడైన రైవతునికి కకుద్మి మున్నగు వందమంది కొడుకులు, రేవతి (కకుద్మి సోదరి) అని కూతురు. ఆ రేవతికి వరుని చెప్పమని బ్రహ్మదేవుని అడిగి, ఈలోగా యుగాలు గడిచిపోయాయి, ద్వాపరయుంగంలో భూలోకానికి వచ్చి బలరాముడికి ఇచ్చాడు. - :వంశం - సూర్యవంశం;:తండ్రి - రైవతుడు;::::::పద్య సం.(లు) - 9-70-సీ., నుండి 974-వ., వరకు.,

[ ⇑ ] :39) కకుప్పు- (స్త్రీ){సంజ్ఞా}[దక్షుని వంశం]:- ఈమె మరొక పేరు కకుబ్దేవి. ధర్ముని భార్యలైన పదిమంది (10) దక్షుని పుత్రికలలో ఈమె ఒకామె. ఈమెకు సంకుటుడు పుట్టాడు. అతనికి కీకటుడు జన్మించాడు. కీకటునకు దుర్గాభిమానులైన దేవతలు జన్మించారు. - :వంశం - దక్షుని వంశం;:తండ్రి - దక్షుడు;:తల్లి - అసక్ని;::భర్త - ధర్ముడు;:కొడుకు(లు) - సంకుటుడు;::పద్య సం.(లు) - 6-254-వ.,

[ ⇑ ] :40) కకుబ్దేవి- (స్త్రీ){సంజ్ఞా}[దక్షుని వంశం]:- ఈమె మరొక పేరు కకుప్పు. ధర్ముని భార్యలైన పదిమంది (10) దక్షుని పుత్రికలలో ఈమె ఒకామె. ఈమెకు సంకుటుడు పుట్టాడు. అతనికి కీకటుడు జన్మించాడు. కీకటునకు దుర్గాభిమానులైన దేవతలు జన్మించారు. - :వంశం - దక్షుని వంశం;:తండ్రి - దక్షుడు;:తల్లి - అసక్ని;::భర్త - ధర్ముడు;:కొడుకు(లు) - సంకుటుడు;::పద్య సం.(లు) - 6-254-వ.,

[ ⇑ ] :41) కక్షేపువు- (పురుష){సంజ్ఞా}[చంద్రవంశం]:- చంద్రవంశంలోని రౌద్రాశ్వునికి అప్సరస ఘృతాచి యందు పుట్టిన పదిమంది (10) కొడుకులలో ఒకడు. - :వంశం - చంద్రవంశం;:తండ్రి - రౌద్రాశ్వుడు;:తల్లి - అప్సరస ఘృతాచి;:::::పద్య సం.(లు) - 9-563-వ.,

[ ⇑ ] :42) కచుడు- (పురుష){సంజ్ఞా}[దైవ యోని]:- బృహస్పతి కొడుకు కచుడు శుక్రాచార్యుని వలన మృతసంజీవనీ విద్య నేర్చుకొనే సమయంలో అతనిని శుక్రుని పుత్రిక కోరగా అతను ఒప్పుకోలేదు. ఆమె అతను నేర్చుకొన్న విద్యలు పనికిరాకపోవు గాక అని శపించింది. అతను ఆమె భర్త విప్రుడు కాకపోవు గాక అని శపించాడు. ఆ కారణంచేత ఆమెకు క్షత్రియుడైన యయాతి భర్త అయ్యాడు. - :వంశం - దైవ యోని;:తండ్రి - బృహస్పతి;::::::పద్య సం.(లు) - 9-531-సీ.,

[ ⇑ ] :43) కచ్ఛపం-1 ( -){జాతి}[నిధులు]:- కుబేరుని వద్ద ఉండే నవనిధులలో ఒకటి. ద్వారకకు తరలి వచ్చిన శ్రీకృష్ణునికి సకల లోకపాలకులు కానుకలు సమర్పించారు. వారిలో కుబేరుడు మత్స్యం, కూర్మం, పద్మం, మహాపద్మం, శంఖం, ముకుందం, కచ్ఛపం, నీలం, అనే పేర్లు కల ఎనిమిది నిధులను సమర్పించాడు. - :వంశం - నిధులు;:::::::పద్య సం.(లు) - 10.1-1613-వ., 8-108-వ., 9-230-వ.,

[ ⇑ ] :44) కచ్ఛపం-2 (స్త్రీ){జాతి}[జలచర]:- తాబేలు - :వంశం - జలచర;:::::::పద్య సం.(లు) - 10.1-1613-వ., 8-108-వ., 9-230-వ.,

[ ⇑ ] :45) కటకాముఖకరభావము- ( -){సంజ్ఞా}[నృత్తము]:- పారిభాషిక పదము - రాసక్రీడ - నృత్తము
వలయము ముఖమువలె కపిత్థ హస్తమందు తర్జనిని మధ్యామాంగుష్టములతో పట్టునది, శ్లో. కపిత్థ తర్జనీచోర్ధ్వం మిశ్రితాంగుష్ట మధ్యమా, కటకాముఖహస్తోయం కీర్తితో భరతాదిభిః - :వంశం - నృత్తము;:::::::పద్య సం.(లు) - 10.1-1084-వ.,

[ ⇑ ] :46) కటిభ్రాంతకరణము- ( -){సంజ్ఞా}[నృత్తము]:- పారిభాషిక పదము - రాసక్రీడ - నృత్తము
నడుముమాత్రము కదలించుట - :వంశం - నృత్తము;:::::::పద్య సం.(లు) - 10.1-1084-వ.,

[ ⇑ ] :47) కణ్వవంశజులు- (పురుష){జాతి}[భవిష్యద్రాజులు]:- పరీక్షిత్తుకు భవిష్యత్తు కాలంలో, కణ్వవంశస్థులు మొత్తం మీద మూడువందలనలభైఅయిదు ఏళ్ళు ప్రభవులై పరిపాలన చేస్తారు. అటుపిమ్మట, కణ్వవంశంలో పుట్టిన సుశర్ముడనే రాజుని, అతని భృత్యుడు, ఆంధ్ర జాతీయుడు అయిన వృషలుడు అధర్మమార్గంలో వధించి రాజ్యాన్ని చేపడతాడు. - :వంశం - భవిష్యద్రాజులు;:::::::పద్య సం.(లు) - 12-4-వ., 12-8-వ.,

[ ⇑ ] :48) కణ్వుడు-1 (పురుష){సంజ్ఞా}[ఋషి]:- శ్రీకృష్ణుని దర్శించుకోవడానికి వచ్చి వసుదేవునిచే క్రతువు చేయించిన మునీశ్వరులలో ఒక మునీశ్వరుడు.
విదేహ రాజు జనకుని, బ్రాహ్మణుడు శ్రుతదేవుని చూడడానికి శ్రీకృష్ణునితో వచ్చిన ఋషులలో ఒకడు
- :వంశం - ఋషి;:::::::పద్య సం.(లు) - 10.2-1117-వ., 10.2-1179-వ.,

[ ⇑ ] :49) కణ్వుడు-2 (పురుష){సంజ్ఞా}[ఋషి]:- పరమాణువులే ఈ సృష్టికి కారణమని భావించే ఋషి - :వంశం - ఋషి;:::::::పద్య సం.(లు) - 10.2-1220-వ,

[ ⇑ ] :50) కణ్వుడు-3 (పురుష){సంజ్ఞా}[ఋషి]:- ఇతడు ధర్మరాజు చేసిన రాజసూయయాగంలో పాల్గొన్న మునీశ్వరులలో ఒకడు - :వంశం - ఋషి;:::::::పద్య సం.(లు) - 10.2-766-సీ.,

[ ⇑ ] :51) కణ్వుడు-4 (పురుష){సంజ్ఞా}[భవిష్యద్రాజులు]:- పరీక్షిత్తుకు భవిష్యత్తు కాలంలో, శుంగవంశం వారిలో చివరివాడు అయిన దేవభూతిని, వసుదేవుడు కణ్వుడు అను తన మంత్రితో కలిసి వధించి తానే రాజ్యాధిపతి అవుతాడు. అతనికి భూమిపుత్రుడు కలుగుతాడు. ఆ మహానుభవుడికి నారాయణుడనే కొడుకు పుడతాడు. కణ్వవంశస్థులు మొత్తం మీద మూడువందలనలభైఅయిదు ఏళ్ళు ప్రభవులై పరిపాలన చేస్తారు. - :వంశం - భవిష్యద్రాజులు;:::::::పద్య సం.(లు) - 12-4-వ.,

[ ⇑ ] :52) కణ్వుడు-5 (పురుష){సంజ్ఞా}[ఋషి]:- పరీక్షిత్తు గంగానది ఒడ్డున ప్రాయోపవిష్టుడై ఉన్నాడని విని, వచ్చిన ఋషులలో ఈయన ఒకరు. - :వంశం - ఋషి;:::::::పద్య సం.(లు) - 1-499-వ.,

[ ⇑ ] :53) కణ్వుడు-6 (పురుష){సంజ్ఞా}[చంద్రవంశం]:- కణ్యుడు చంద్ర వంశంలోని అప్రతిరథుని కుమారుడు. కణ్వుని కొడుకు మేధాతిథి. అతనికి ప్రస్కందుడు మున్నగు బ్రాహ్మణులు పుట్టారు. - :వంశం - చంద్రవంశం;:తండ్రి - అప్రతిరథుడు;::::కొడుకు(లు) - మేధాతిథి;::పద్య సం.(లు) - 9-593-వ.,

[ ⇑ ] :54) కణ్వుడు-7 (పురుష){సంజ్ఞా}[ఋషి]:- శకుంతలను పెంచిన మహర్షి. విశ్వామిత్రునితో అప్సరస కని వదలివేయగా, శకుంతలను కణ్యుమహర్షి పెంచాడు. పిమ్మట దుష్యంతుడు వచ్చి కణ్వాశ్రమంలో శకుంతలను చూసి వరించాడు. వారికి భరతుడు పుట్టాడు. తరువాత కణ్యుడు తల్లీకొడుకులను రాజు వద్దకు పంపాడు. - :వంశం - ఋషి;:::::::పద్య సం.(లు) - 9-598-వ., నుండి 9-626-ఉ., వరకు,

[ ⇑ ] :55) కదంబ- ( -){జాతి}[వృక్ష]:- కదంబ అంటే కడిమి చెట్లు కదంబము (కడిమి) అని సమూహము అని నానార్ర్థాలు ఉన్నాయి. ఈ పదం ప్రథమ స్కంధలో నైమిశారణ్య వర్ణన సందర్భంలో కురుపాండవుల యుద్ధం} కు ఉపమాన పదంగా వాడబడింది. - :వంశం - వృక్ష;:::::::పద్య సం.(లు) - 1-39-వ., 3-160-మ., 3-709., 3-764-ఉ., 3-996.,1-తే., 4-135-వ.,5.1-32-క., 5.2-20-వ., 8-24-వ., 8-507-వ., 10.1-597-వ., 10.1-757-వ., 10.2-1323-వ.,

[ ⇑ ] :56) కదంబ - ( -){జాతి}[వృక్ష]:- కడిమి - ఇవి అష్టమ స్కంధములోని త్రికూట పర్వతములో వర్ణించబడ్డాయి - :వంశం - వృక్ష;:::::::పద్య సం.(లు) - 8-23-సీ., 8-24-వ., 8-25-క.,

[ ⇑ ] :57) కదళీ - ( -){జాతి}[వృక్ష]:- అరటి - ఇవి అష్టమ స్కంధములోని త్రికూట పర్వతములో వర్ణించబడ్డాయి - :వంశం - వృక్ష;:::::::పద్య సం.(లు) - 8-23-సీ., 8-24-వ., 8-25-క.,

[ ⇑ ] :58) కదుపు- ( -){జాతి}[కీటకము]:- తుమ్మెదల గుంపు - :వంశం - కీటకము;:::::::పద్య సం.(లు) - 8-30-క.,

[ ⇑ ] :59) కద్రువ- (స్త్రీ){సంజ్ఞా}[దక్ష వంశం]:- మహాతలంలో కద్రువ కొడుకులైన కుహకుడు, తక్షకుడు, కాళియుడు, సుషేణుడు మొదలైన సర్ప ముఖ్యులు గరుత్మంతుని వల్ల భయంతో కలవరపడుతూ ఉంటారు.
ఈమె దక్షునికి అసిక్ని యందు పుట్టిన అరవైమంది (60) పుత్రికలలో పద్దెనిమిదవ (18) కూతురు. ఈమె తార్క్షుని భార్యలలో రెండవ ఆమె. ఈమె సంతానం నానవిధములైన నాగులు. ఈమె సవతులు వినత, పతంగి, యామిని. - :వంశం - దక్ష వంశం;:తండ్రి - దక్షుడు;:తల్లి - అసక్ని;::భర్త - తార్క్షుడు (కశ్యపుని నామాంతరం);:కొడుకు(లు) - కుహకుడు, తక్షకుడు, కాళియుడు, సుషేణుడు మొదలైన నాగులు;::పద్య సం.(లు) - 5.2-119-వ., 6-252-వ., 6-254-వ.,

[ ⇑ ] :60) కనకకశిపుడు- (పురుష){సంజ్ఞా}[రాక్షస యోని]:- ఇతడు హిరణ్యకశిపుడు. విష్ణువు తన ఏకవింశతి (21) అవతారాలలో పద్నాలుగవది అయిన నరసింహావతారంలో హిరణ్యకశిపుని సంహరించాడు. - :వంశం - రాక్షస యోని;:::::::పద్య సం.(లు) - 1-63-వ.,

[ ⇑ ] :61) కనకాక్షుడు- (పురుష){సంజ్ఞా}[రాక్షస యోని]:- ఇతడు హిరణ్యాక్షుడు. తల్లి దితికి, కశ్యప ప్రజాపతి చెప్పిన మాటలు తప్పవేమో అని అనుకొంటుండగా (కనకాక్షుని) హిరణ్యాక్షుని పతనాన్ని సూచిస్తున్నట్లుగా ఆమె పాలిండ్లనుండి రక్తధారలు ప్రవహించాయి. ఇతని సోదరుడు హిరణ్యకశిపుడు - :వంశం - రాక్షస యోని;:తండ్రి - కశ్యపుడు ;:తల్లి - దితి;:::::పద్య సం.(లు) - 3-696-క.,

[ ⇑ ] :62) కనకాచలేంద్రము- ( -){సంజ్ఞా}[ప్రదేశము]:- మేరుపర్వతము - :వంశం - ప్రదేశము;:::::::పద్య సం.(లు) - 8-49-సీ.,

[ ⇑ ] :63) కన్య- (స్త్రీ){సంజ్ఞా}[దైవ యోని]:- కన్యాకుమారి, దుర్గాదేవి, బలరాముడు నైమిశారణ్యంలో తన దర్భకు సుతుడు మరణించగా, మునులు చెప్పిన ప్రకారం పల్వలుని హతమార్చిన పిమ్మట, యాత్రలకు వెళ్ళి నప్పుడు దక్షిణసముద్రము చేరి, కన్యాకుమారి పేర వెలసి ఉన్న దుర్గాదేవిని దర్శించాడు. - :వంశం - దైవ యోని;:::::::పద్య సం.(లు) - 10.2-953-వ.,

[ ⇑ ] :64) కన్యక-1 (స్త్రీ){సంజ్ఞా}[దైవ యోని]:- దుర్గ - ఈమె శ్రీకృష్ణుడు తన అవతార సందర్భంలో ఆ మాయాదేవికి ఒసగిన పద్నాలుగు (14) నామములలో ఈమెది ఒకటి [ మాయాదేవి 14 పేర్లు ] భద్రకాళి - ఈమె శ్రీకృష్ణుడు తన అవతార సందర్భంలో ఆ మాయాదేవికి ఒసగిన పద్నాలుగు (14) నామములలో ఈమెది ఒకటి [ మాయాదేవి 14 పేర్లు ] విజయ - ఈమె శ్రీకృష్ణుడు తన అవతార సందర్భంలో ఆ మాయాదేవికి ఒసగిన పద్నాలుగు (14) నామములలో ఈమెది ఒకటి [ మాయాదేవి 14 పేర్లు ] వైష్ణవి - ఈమె శ్రీకృష్ణుడు తన అవతార సందర్భంలో ఆ మాయాదేవికి ఒసగిన పద్నాలుగు (14) నామములలో ఈమెది ఒకటి [ మాయాదేవి 14 పేర్లు ] కుముద - ఈమె శ్రీకృష్ణుడు తన అవతార సందర్భంలో ఆ మాయాదేవికి ఒసగిన పద్నాలుగు (14) నామములలో ఈమెది ఒకటి [ మాయాదేవి 14 పేర్లు ] చండిక - ఈమె శ్రీకృష్ణుడు తన అవతార సందర్భంలో ఆ మాయాదేవికి ఒసగిన పద్నాలుగు (14) నామములలో ఈమెది ఒకటి [ మాయాదేవి 14 పేర్లు ] కృష్ణ - ఈమె శ్రీకృష్ణుడు తన అవతార సందర్భంలో ఆ మాయాదేవికి ఒసగిన పద్నాలుగు (14) నామములలో ఈమెది ఒకటి [ మాయాదేవి 14 పేర్లు ] మాధవి - ఈమె శ్రీకృష్ణుడు తన అవతార సందర్భంలో ఆ మాయాదేవికి ఒసగిన పద్నాలుగు (14) నామములలో ఈమెది ఒకటి [ మాయాదేవి 14 పేర్లు ] కన్యక - ఈమె శ్రీకృష్ణుడు తన అవతార సందర్భంలో ఆ మాయాదేవికి ఒసగిన పద్నాలుగు (14) నామములలో ఈమెది ఒకటి [ మాయాదేవి 14 పేర్లు ] మాయ - ఈమె శ్రీకృష్ణుడు తన అవతార సందర్భంలో ఆ మాయాదేవికి ఒసగిన పద్నాలుగు (14) నామములలో ఈమెది ఒకటి [ మాయాదేవి 14 పేర్లు ] నారాయణి - ఈమె శ్రీకృష్ణుడు తన అవతార సందర్భంలో ఆ మాయాదేవికి ఒసగిన పద్నాలుగు (14) నామములలో ఈమెది ఒకటి [ మాయాదేవి 14 పేర్లు ] శారద - ఈమె శ్రీకృష్ణుడు తన అవతార సందర్భంలో ఆ మాయాదేవికి ఒసగిన పద్నాలుగు (14) నామములలో ఈమెది ఒకటి [ మాయాదేవి 14 పేర్లు ] - :వంశం - దైవ యోని;:::::::పద్య సం.(లు) - 10.1-61-వ.,

[ ⇑ ] :65) కన్యక-2 (స్త్రీ){సంజ్ఞా}[దైవ యోని]:- బలరాముడు తన యాత్రలలో దక్షిణసముద్రము చేరి, కన్యాకుమారి పేర వెలసి ఉన్న దుర్గాదేవిని దర్శించాడు. - :వంశం - దైవ యోని;:::::::పద్య సం.(లు) - 10.2-953-వ.,

[ ⇑ ] :66) కన్యా రాశి- ( -){సంజ్ఞా}[భగణ విషయం]:- సూర్యుడు మేషరాశిలో, తులారాశిలో సంచరిస్తుంటే పగలు, రాత్రి సమానంగా ఉంటాయి. వృషభం, మిథునం, కర్కాటకం, సింహం, కన్య అనే ఐదు రాశులలో సంచరిస్తుంటే ఒక్కొక్క గడియ చొప్పన రాత్రి తగ్గుతూ వస్తుంది. వృశ్చికం, ధనుస్సు, మకరం, కుంభం, మీనం అనే ఐదు రాశులలో సంచరిస్తుంటే ఒక్కొక్క గడియ చొప్పన రాత్రి పెరుగుతుంది. పగలుతగ్గిపోతుంది. - :వంశం - భగణ విషయం;:::::::పద్య సం.(లు) - 5.2-79-ఆ., 5.2-80-ఆ.,

[ ⇑ ] :67) కపాలి- (పురుష){సంజ్ఞా}[దైవ యోని]:- శివుడు, పుఱ్ఱె ధరించువాడు. - :వంశం - దైవ యోని;:::::::పద్య సం.(లు) - 1-2-ఉ.,

[ ⇑ ] :68) కపి- (స్త్రీ){జాతి}[జంతు]:- కోతి - :వంశం - జంతు;:::::::పద్య సం.(లు) - 8-29-సీ.,

[ ⇑ ] :69) కపిత్తకరభావము- ( - ){సంజ్ఞా}[నృత్తము]:- పారిభాషిక పదము - రాసక్రీడ - నృత్తము
వెలగపండు ఆకృతిని బొటకనవేలు తర్జని తప్ప తక్కినవాటిని ముడిచి బొటకనవేలు ఇంచుక వంచి దానిపై తర్జనిని మోపి పట్టునది, శ్లో. అంగుష్టమూర్ధ్ని శిఖరేవక్రితాయది తర్జనీ, కపిత్థాఖ్యకరస్సోయం తన్నిరూపణముచ్యతే - :వంశం - నృత్తము;:::::::పద్య సం.(లు) - 10.1-1084-వ.,

[ ⇑ ] :70) కపిత్థ - ( -){జాతి}[వృక్ష]:- వెలగ - ఇవి అష్టమ స్కంధములోని త్రికూట పర్వతములో వర్ణించబడ్డాయి - :వంశం - వృక్ష;:::::::పద్య సం.(లు) - 8-23-సీ., 8-24-వ., 8-25-క.,

[ ⇑ ] :71) కపిల- (పురుష){సంజ్ఞా}[దైవయోని]:- కపిలావతారము ప్రథమ స్కంధములో వివరించిన వైష్ణవ అవతారాలలో ప్రధానమైన ఏకవింశ త్యవతారములు (21) అందలి 6 వ. అవతారం (1-63-వ.)
మఱియు, ద్వితీయ స్కంధములో అవతారముల వైభవంలో వివరించిన పంచవింశతి అవతారాలు (25) అందలి 4 వ. అవతారం. ఇది బ్రహ్మదేవుడు నారదునికి ఉపదేశించే నాటికి, జరిగిన పద్దెనిమిది అవతారాలులోనిది (2-119-చ) - :వంశం - దైవయోని;:తండ్రి - కర్దముడు;:తల్లి - దేవహూతి;:::::పద్య సం.(లు) - 1-63-వ., 2-119-చ.,

[ ⇑ ] :72) కపిల పర్వతం- ( - ){సంజ్ఞా}[పర్వతం]:- మేరుపర్వతం తామరదుద్దు. దాని చుట్టూ కురంగం, కురరం, కుసుంభం, వైకంకతం, త్రికూటం, శిశిరం, పతంగం, రుచకం, విషధం, శితివాసం, కపిలం, శంఖం మొదలైన పర్వతాలు కేసరాలుగా ఉన్నాయి. - :వంశం - పర్వతం;:::::::పద్య సం.(లు) - 5.2-30-వ.,

[ ⇑ ] :73) కపిలం- ( - ){సంజ్ఞా}[పర్వతం]:- నాభి వర్షంలో కపిలం అను గిరి, శ్రుతనింద అను మహానది ఉన్నాయి. - :వంశం - పర్వతం;:::::::పద్య సం.(లు) - 5.2-64-వ.,

[ ⇑ ] :74) కపిలాశ్వడు- (పురుష){సంజ్ఞా}[సూర్యవంశం]:- సూర్యవంశపు కువలయాశ్వుడు ఇరవైయొక్క వేయి మంది పుత్రులుతో కలిసి వెళ్ళి ఉదంకుడు అనే బ్రాహ్మణుడు ఆజ్ఞాపించగా ధుంధుడు అనే రాక్షసుడిని సంహరించి ధుంధుమారుడు అని పేరు పొందాడు. ఆ దుంధు రాక్షసుడి నోటి నుండి వెలువడిన అగ్నికి కువలయాశ్వుడి పుత్రులు ముగ్గురు తప్పించి, అందరు బూడిద అయిపోయారు. అలా దృఢాశ్వుడు, కపిలాశ్వుడు, భద్రాశ్వుడు అను ముగ్గురు (3) కుమారులు మాత్రమే తప్పించుకొన్నారు. - :వంశం - సూర్యవంశం;:తండ్రి - కువలయాశ్వుడు;::::::పద్య సం.(లు) - 9-164-క., 9-165-వ.,

[ ⇑ ] :75) కపిలుడు-1 (పురుష){సంజ్ఞా}[ఋషి]:- సాంఖ్యయోగ ప్రవర్తకుడు. శ్రీమన్నారాయణుని ఏకవింశతి అవతారాలలో అయిదవ అవతారంలో కర్దమునికి భార్య దేవహూతి (స్వాయంభువ మనువు పుత్రిక) యందు జన్మించి, సిద్ధేశుడు అయి ఆసురి అను బ్రాహ్మణునకు సాంఖ్యయోగము అను తత్వాన్ని బోధించాడు. కపిలుడు సాంఖ్యయోగం ప్రవర్తింపజేసాడు. హరి కపిలునిగా తన ఇంట అతరించాక కర్దముడు తన తొమ్మిదిమంది (9) కుమార్తెలకు వివాహం చేసి తపస్సు చేసుకోడానికి వెళ్ళిపోయాడు. ఆ కపిలుని అక్కలు వారి భర్తలు 1) కళ –భర్త- మరీచి; 2) అనసూయ –భర్త- అత్రి; 3) శ్రద్ధ –భర్త- అంగీరసుడు; 4) హవిర్భువు –భర్త- పులస్త్యుడు; 5) గతి –భర్త- పులహుడు; 6) క్రియ –భర్త- క్రతువు; 7) ఖ్యాతి –భర్త- భృగువు; 8) అరుంధతి –భర్త- వసిష్ఠుడు; 9) శాంతి –భర్త- అధర్వుడు.
పిమ్మట తల్లి దేవహూతికి కపిలుడు ఆత్మమార్గాన్ని బోధించాడు.
పూతనను చంపిన కృష్ణశిశువును గోపికలు రక్షచదువుతూ మనస్సు యోగీశ్వరుడైన కపిలుడు రక్షించుగాక అని వేడారు.
వీరు కర్మబంధాల నుండి కాపాడు గాక అని విశ్వరూపుడు దేవేంద్రునికి ఉపదేశించిన శ్రీమన్నారాయణ కవచంలో ఉన్న నలభైతొమ్మిది స్తుతులలో ఇది ఒకటి.
చిత్రకేతోపాఖ్యానంలోని చిత్రకేతు మహారాజు పుత్రశోకంతో ఉండగా అంగిరసుడు నారదృడు వచ్చి రాజుకు తత్వం అనుగ్రహించి ఊరడించారు. అప్పుడు వారిని మీరు ఎవరు కపిల పరశురాముడు మున్నగు మునులా అంటూ రాజు అడుగుతాడు. అలా అడిగిన విదానం, సనత్కుమారాదులా? నారద ఋషభులా? అసిత దేవలులా? వ్యాస వసిష్ఠులా? దుర్వాస మార్కండేయులా? శుక గౌతములా? కపిల పరశురాములా? లేక యాజ్ఞవల్క్యుడు, తరణి, అరుణి, చ్యవనుడు, రోమశుడు, ఆసురి, జాతుకర్ణుడు, దత్తాత్రేయుడు, మైత్రేయుడు, భరద్వాజుడు, పంచశిఖుడు, పరాశరుడు మొదలైన మహర్షుల లోనివారా?
అంబరీషునిపై కృత్య ప్రయోగించడెతో వెంటబడుతున్న సుదర్శన చక్రం బారినుండి కాపాడమని అడగడానికి దుర్వాసుడు శివుని వద్దకు కైలాసం వెళ్ళాడు. శివుడు తనతో పాటు "కపిలుడు" మున్నగువారు కూడా నారాయణుని మాయ దాటలేరు. కనుక ఆయన వద్దకే వెళ్ళమని చెప్తాడు. అప్పుడు చెప్పిన పేర్లు "ప్రహ్లాదుడు, నారదుడు, బ్రహ్మదేవుడు, సనత్కుమారుడు, ధర్ముడు, కపిలుడు, మరీచి, సిద్ధులు మున్నగు మహా జ్ఞానసంపన్నులం, సిద్ధ శ్రేష్ఠులం నారాయణుని మాయను తెలియలేము." - :వంశం - ఋషి;:తండ్రి - కర్దముడు;:తల్లి - దేవహూతి ;:::::పద్య సం.(లు) - 1-6-వ., 2-118-వ., 2-119-చ., 3-825-క., 3-895-సీ., 8-7-వ., 10.1-236-వ., 6-300-చ., నుండి 6-307-వ., 6-458-సీ., 6-496-క., 9-113-సీ.,

[ ⇑ ] :76) కపిలుడు-2 (పురుష){సంజ్ఞా}[రాక్షస యోని]:- ఇతడు దానవుడు. కశ్యపునికి దనువు యందు పుట్టిన పద్దెనిమిది (18) మంది కొడుకులలో తొమ్మిదవ (9)వ వాడు.
వృత్రాసుర సంహారఘట్టంలో దేవదానవ యుద్ధం జరుగుతు న్నప్పుడు వృత్రాసురుని వైపు పాల్గొన్నవారిలో ఒకరు - :వంశం - రాక్షస యోని;:తండ్రి - కశ్యపుడు ;:తల్లి - దనువు ;:::::పద్య సం.(లు) - 6-258-వ., 6-363-వ., 8-327-క., నుండి 8-334-వ., వరకు,

[ ⇑ ] :77) కపిలుడు -1 (పురుష){సంజ్ఞా}[ఋషి]:- కపిలాదులుతో కూడి విష్ణువు పృథుచక్రవర్తి చేస్తున్న అశ్వమేధ యాగానికి విచ్చేశాడు. అలా విష్ణుమూర్తి గంధర్వులు, మునులు, సిద్ధులు, సాధ్యులు, విద్యాధరుడు, అప్సరసలు, దైత్యులు, యక్షులు, దానవులు మొదలైన వారు కీర్తిస్తూ ఉండగా; కపిలుడు, నారదుడు, సనకుడు మొదలైన యోగీంద్రులు కొనియాడుతూ ఉండగా; నందుడు, సునందుడు మొదలైన పార్షదులతోను; బ్రహ్మతోను, పరమశివునితోను, అష్టదిక్పాలకులతోను కూడి వేంచేశాడు. - :వంశం - ఋషి;:::::::పద్య సం.(లు) - 4-509-సీ.,

[ ⇑ ] :78) కపిలుడు -2 (పురుష){సంజ్ఞా}[విప్రుడు]:- జడభరతుడు తుది జన్మ అయిన విప్రసుతునిగా ఉండి పొలం కాపలాకాస్తున్నాడు. ఆ ప్రక్కనుండి సింధుదేశపు రాజు రహూగణుడు పల్లకీ మీద కపిలుని ఆశ్రమానికి వెళుతూ, విప్రునిచేత పల్లకీ మోయించిన సందర్భంలో ఇతను మహానిభావుడు అని గ్రహించి, రాజు ఇతనిని మీరెవరు అంటూ కపిలుడు మున్నగు పేర్లు చెప్తూ ఆ మహానుభావులా మీరు అని అడుగుతాడు. - :వంశం - విప్రుడు;:::::::పద్య సం.(లు) - 5.1-139-సీ., నుండి 5.1-148-వ., వరకు,

[ ⇑ ] :79) కపిలుడు -3 (పురుష){సంజ్ఞా}[ఋషి]:- సగరచక్రవర్తి యాగాశ్వాశాన్ని వెతకడానికి వెళ్ళిన ఆయన కొడుకులు నేల త్రవ్వి పాతాళంలో కపిలముని ఆశ్రమంలో ఉన్న గుఱ్ఱాన్ని చూసి పౌరుషాలు చూపబోయారు. కపిల మహర్షి కనులు తెరచి చూసేసరికి వారు కాలి బూడిద అయిపోయారు. పిమ్మట అంశుమంతుడు వచ్చి వినయంతో కపిలుని మెప్పు పొంది అశ్వాన్ని తెచ్చి సగరునికి ఇచ్చాడు. యాగం పూర్తయింది. తరువాత తన తండ్రులకు పుణ్యగతులకోసం భగీరథుడు గంగను భూమికి తెచ్చాడు. - :వంశం - ఋషి;:::::::పద్య సం.(లు) - 9-206-వ., నుండి 9-215-క., వరకు,

[ ⇑ ] :80) కపోతరోముడు- (పురుష){సంజ్ఞా}[చంద్రవంశం]:- చంద్ర వంశంలోని వృష్ణిపుత్రుడైన విలోమతనయుని కొడుకు కపోతరోముడు; కపోతరోముని కొడుకు అనువు. అతడు తుంబురుని స్నేహితుడు; అనువున కొడుకు దుందుభి. - :వంశం - చంద్రవంశం;:తండ్రి - విలోమ తనయుడు;::::కొడుకు(లు) - అనువు;::పద్య సం.(లు) - 9-712-వ.,

[ ⇑ ] :81) కబళాహార - ( -){జాతి}[వృక్ష]:- మధువులతో {కబళాహారము - తినెడి ఆహారము, పూలతేనె} - ఇవి అష్టమ స్కంధములోని త్రికూట పర్వతములో వర్ణించబడ్డాయి - :వంశం - వృక్ష;:::::::పద్య సం.(లు) - 8-23-సీ., 8-24-వ., 8-25-క.,

[ ⇑ ] :82) కమఠము- (స్త్రీ){జాతి}[జలచర]:- తాబేలు - :వంశం - జలచర;:::::::పద్య సం.(లు) - 8-42-మ., 8-55-వ.,

[ ⇑ ] :83) కమల-1 (స్త్రీ){సంజ్ఞా}[దైవ యోని]:- లక్ష్మీదేవి - :వంశం - దైవ యోని;:::::::పద్య సం.(లు) - 1-406-సీ., 3-288-వ., 3-930-చ., 4-16-చ., 6-333-సీ., 10.1-608-సీ.,

[ ⇑ ] :84) కమల-2 ( -){జాతి}[వృక్ష]:- కమలములు, ఎఱ్ఱతామర, పద్మములు - ఇవి అష్టమ స్కంధములోని త్రికూట పర్వతములో వర్ణించబడ్డాయి - :వంశం - వృక్ష;:::::::పద్య సం.(లు) - 8-44-సీ., 8-50-వ., 8-23-సీ., 8-24-వ., 8-25-క.,

[ ⇑ ] :85) కమలగర్భుడు- (పురుష){సంజ్ఞా}[దైవ యోని]:- బ్రహ్మదేవుడు, కమలమున పుట్టిన వాడు - :వంశం - దైవ యోని;:::::::పద్య సం.(లు) - 2-253-సీ., 3-1028-సీ., 5-5.2-69-సీ., 6-282-వ., 10.1-353.,1-ఆ.,

[ ⇑ ] :86) కమలజుడు- (పురుష){సంజ్ఞా}[దైవ యోని]:- బ్రహ్మదేవుడు, కమలమున పుట్టిన వాడు - :వంశం - దైవ యోని;:::::::పద్య సం.(లు) - 2-246-క., 3-848-క., 3-930-చ., 4-569-సీ., 6-277-క.,

[ ⇑ ] :87) కమలదళాక్షుడ- (పురుష){సంజ్ఞా}[దైవ యోని]:- విష్ణువు, కమలముల వంటి కన్నులు కలవాడు - :వంశం - దైవ యోని;:::::::పద్య సం.(లు) - 3-571-చ., 4-922-చ.,

[ ⇑ ] :88) కమలనయన - (స్త్రీ){సంజ్ఞా}[మనువు వంశం]:- దేవహూతి, ఈమెకు కొడుకు కపిలుడు చంద్రసూర్య మార్గములను చెప్తూ ఇలా సంభోధించాడు. కమలనయమ, కమలముల వంటి కన్నులు కలా ఆమె. - :వంశం - మనువు వంశం;:::::::పద్య సం.(లు) - 3-1040-తే.,

[ ⇑ ] :89) కమలనయనుడు- (పురుష){సంజ్ఞా}[దైవ యోని]:- విష్ణువు, కమలముల వంటి కన్నులు కలవాడు - :వంశం - దైవ యోని;:::::::పద్య సం.(లు) - 3-573.,1-తే., 3-276-తే., 10.2-694-వ.,

[ ⇑ ] :90) కమలనాభుడు- (పురుష){సంజ్ఞా}[దైవ యోని]:- విష్ణువు, కృష్ణుడు, కమలము నాభియందు కలవాడు - :వంశం - దైవ యోని;:::::::పద్య సం.(లు) - 1-50-సీ., 1-482-ఆ., 1-102.,1-ఆ., 2-51.,1-ఆ., 3-123.,1-తే., 4-245.1-తే., 10.2-1013-క.,

[ ⇑ ] :91) కమలనేత్రుడు- (పురుష){సంజ్ఞా}[దైవ యోని]:- విష్ణువు, కమలముల వంటి కన్నులు కలవాడు - :వంశం - దైవ యోని;:::::::పద్య సం.(లు) - 6-181-తే., 8-433.,1-తే.,

[ ⇑ ] :92) కమలపత్రనయనుడు- (పురుష){సంజ్ఞా}[దైవ యోని]:- విష్ణువు, కమల పత్రముల వంటి కన్నులు కలవాడు - :వంశం - దైవ యోని;:::::::పద్య సం.(లు) - 3-806-తే.,

[ ⇑ ] :93) కమలబంధుడు- (పురుష){సంజ్ఞా}[దైవ యోని]:- సూర్యుడు, కమలకు మిత్రుడు - :వంశం - దైవ యోని;:::::::పద్య సం.(లు) - 1-74-వ.,

[ ⇑ ] :94) కమలభవుడు- (పురుష){సంజ్ఞా}[దైవ యోని]:- బ్రహ్మదేవుడు, కమలమున పుట్టిన వాడు - :వంశం - దైవ యోని;:::::::పద్య సం.(లు) - 4-144-తే., 3-90-క., 3-276-తే., 10.1-1732.,1-ఆ., 11-86-వ., 12-24-వ.,

[ ⇑ ] :95) కమలమిత్రుడు- (పురుష){సంజ్ఞా}[దైవ యోని]:- సూర్యుడు, కమలములకు మిత్రుడు - :వంశం - దైవ యోని;:::::::పద్య సం.(లు) - 10.1-568-వ.,

[ ⇑ ] :96) కమలరాగ - ( -){జాతి}[మణులు]:- కమలరాగమణులు - ఇవి అష్టమ స్కంధములోని త్రికూట పర్వతములో వర్ణించబడ్డాయి - :వంశం - మణులు;:::::::పద్య సం.(లు) - 8-23-సీ., 8-24-వ., 8-25-క.,

[ ⇑ ] :97) కమలలోచనుడు-1 (పురుష){సంజ్ఞా}[దైవ యోని]:- విష్ణువు, కృష్ణుడు, కమలముల వంటి కన్నులు కలవాడు - :వంశం - దైవ యోని;:::::::పద్య సం.(లు) - 1-58-వ., 3-652-వ., 6-414.,1-తే., 8-659-సీ., 10.1-787-మ.,

[ ⇑ ] :98) కమలలోచనుడు-2 (పురుష){సంజ్ఞా}[దైవ యోని]:- విష్ణువు, కృష్ణుడు, కమలముల వంటి కన్నులు కలవాడు - :వంశం - దైవ యోని;:::::::పద్య సం.(లు) - 4-313.,1-తే., 10.2-393-వ., 10.2-535-వ., 10.1-627-వ.,

[ ⇑ ] :99) కమలసంభవుడు- (పురుష){సంజ్ఞా}[దైవ యోని]:- బ్రహ్మదేవుడు, కమలమున పుట్టిన వాడు - :వంశం - దైవ యోని;:::::::పద్య సం.(లు) - 2-226-వ, 10.2-600.,1-తే., 6-178-సీ.,

[ ⇑ ] :100) కమలహితుడు- (పురుష){సంజ్ఞా}[దైవ యోని]:- సూర్యుడు, కమలకు మిత్రుడు - :వంశం - దైవ యోని;:::::::పద్య సం.(లు) - 3-451.,1-తే.,

[ ⇑ ] :101) కమలాకరము- ( -){జాతి}[ప్రదేశము]:- సరోవరము - :వంశం - ప్రదేశము;:::::::పద్య సం.(లు) - 8-55-వ.,

[ ⇑ ] :102) కమలాకాంతుడు- (పురుష){సంజ్ఞా}[దైవ యోని]:- విష్ణువు, లక్షీదేవి భర్త - :వంశం - దైవ యోని;:::::::పద్య సం.(లు) - 3-88-మ.,

[ ⇑ ] :103) కమలాక్షుడు- (పురుష){సంజ్ఞా}[దైవ యోని]:- విష్ణువు, కమలముల వంటి కన్నులు కలవాడు - :వంశం - దైవ యోని;:::::::పద్య సం.(లు) - 1-237-మ., 1-242-ఉ., 1-450-క., 356-సీ., 3-681-క., 6-397.,1-ఆ., 7-240-సీ., 8-126-క., 10.1-1355-సీ., 10.1-1724-వ., 10.2-659-తే., ,

[ ⇑ ] :104) కమలాధీశ్వరుడు- (పురుష){సంజ్ఞా}[దైవ యోని]:- విష్ణువు, లక్షీదేవి భర్త - :వంశం - దైవ యోని;:::::::పద్య సం.(లు) - 3-494-క., 4-929-మ., 4-954-మ., 3-58-మ., 3-90-క., 8-433.,1-తే., 10.1-787-మ., 10.1-1033-సీ.,

[ ⇑ ] :105) కమలాప్తుడు- (పురుష){సంజ్ఞా}[దైవ యోని]:- సూర్యుడు, కమలములకు మిత్రుడు - :వంశం - దైవ యోని;:::::::పద్య సం.(లు) - 1-24-సీ., 10.1-410-క.,

[ ⇑ ] :106) కమలామనోవిహారుడు- (పురుష){సంజ్ఞా}[దైవ యోని]:- కృష్ణుడు, విష్ణువు, లక్ష్మీదేవి మనసున విహరించువాడు - :వంశం - దైవ యోని;:::::::పద్య సం.(లు) - 10.2-614-క.,

[ ⇑ ] :107) కమలారి- (పురుష){సంజ్ఞా}[దైవ యోని]:- చంద్రుడు, కమలాలకు శత్రువు - :వంశం - దైవ యోని;:::::::పద్య సం.(లు) - 10.1-1345-సీ.,

[ ⇑ ] :108) కమలాసతి- (స్త్రీ){సంజ్ఞా}[దైవ యోని]:- లక్ష్మీదేవి - :వంశం - దైవ యోని;:::::::పద్య సం.(లు) - 10.2-690.,1-తే.,

[ ⇑ ] :109) కమలాసనుడు- (పురుష){సంజ్ఞా}[దైవ యోని]:- బ్రహ్మదేవుడు, కమలము ఆసనముగా కల వాడు - :వంశం - దైవ యోని;:::::::పద్య సం.(లు) - 3-422-వ., 5.2-125-వ., 6-241-చ., 7-84-వ., 7-305-వ., 11-86-వ.,

[ ⇑ ] :110) కమలేక్షణుడు- (పురుష){సంజ్ఞా}[దైవ యోని]:- విష్ణువు, కృష్ణుడు, కమలముల వంటి కన్నులు కలవాడు - :వంశం - దైవ యోని;:::::::పద్య సం.(లు) - 10.1-269-ఉ., 10.1-1001-క.,

[ ⇑ ] :111) కమలోదరుడు- (పురుష){సంజ్ఞా}[దైవ యోని]:- విష్ణువు, కమలము ఉదరమున కలవాడు - :వంశం - దైవ యోని;:::::::పద్య సం.(లు) - 3-591-క., 4-896-క.,

[ ⇑ ] :112) కర- ( -){జాతి}[అవయవము]:- ఏనుగు తొండము - :వంశం - అవయవము;:::::::పద్య సం.(లు) - 8-49-సీ.,

[ ⇑ ] :113) కరంధనుడు- (పురుష){సంజ్ఞా}[సూర్యవంశం]:- ఇతడు సూర్యవంశపు రాజు. రంభునికి ధార్మికుడు అయిన ఖనినేత్రుడు; అతనికి కరంధనుడు; కరంధనునికి అవిక్షిత్తు; ఆ అవిక్షిత్తునికి మరుత్తుడు పుట్టారు. ఆ మరుత్తుడు చక్రవర్తి అయ్యాడు. - :వంశం - సూర్యవంశం;:తండ్రి - ఖనినేత్రుడు;::::కొడుకు(లు) - కవిజిత్తు;::పద్య సం.(లు) - 9-44-వ.,

[ ⇑ ] :114) కరంధముడు- (పురుష){సంజ్ఞా}[చంద్రవంశం]:- ఇతడు చంద్రవంశంలోని భానుమంతపుత్రుడైన త్రిసానువు. కరంధముని కొడుకు మరుత్తు ఇతనికి యయాతి శాపం వలన సంతానం కలగలేదు. - :వంశం - చంద్రవంశం;:తండ్రి - త్రిసానువు;::::కొడుకు(లు) - మరుత్త్తుడు;::పద్య సం.(లు) - 9-699-వ.,

[ ⇑ ] :115) కరక-1 ( -){జాతి}[వృక్ష]:- కరక అంటే దానిమ్మ చెట్లు దానిమ్మ పూలు (దాడిమ పువ్వులు) అని వడగళ్లు అని నానార్ర్థాలు ఉన్నాయి. ఈ పదం ప్రథమ స్కంధలో నైమిశారణ్య వర్ణన సందర్భంలో వర్షాకాలం రాక} కు ఉపమాన పదంగా వాడబడింది. - :వంశం - వృక్ష;:::::::పద్య సం.(లు) - 1-39-వ.,

[ ⇑ ] :116) కరక-2 ( -){జాతి}[వస్తువు]:- కరక అంటే వడగళ్లు అని దానిమ్మ చెట్లు దానిమ్మ పూలు (దాడిమ పువ్వులు) అని నానార్ర్థాలు ఉన్నాయి. ఈ పదం ప్రథమ స్కంధలో నైమిశారణ్య వర్ణన సందర్భంలో వర్షాకాలం రాక} ఉపమాన పదంగా వాడబడింది. - :వంశం - వస్తువు;:::::::పద్య సం.(లు) - 1-39-వ., 10.,757-వ.,

[ ⇑ ] :117) కరజ-1 ( -){జాతి}[వృక్ష]:- కరజ అంటే కానుగ చెట్లు అని గోళ్ళు అని నానార్ర్థాలు ఉన్నాయి. ఈ పదం ప్రథమ స్కంధలో నైమిశారణ్య వర్ణన సందర్భంలో నరసింహుడి రూపం} కు ఉపమాన పదంగా వాడబడింది. - :వంశం - వృక్ష;:::::::పద్య సం.(లు) - 1-39-వ.,

[ ⇑ ] :118) కరజ-2 ( -){జాతి}[భూచర]:- కరజ అంటే గోళ్ళు అని కానుగ చెట్లు అని నానార్ర్థాలు ఉన్నాయి. ఈ పదం ప్రథమ స్కంధలో నైమిశారణ్య వర్ణన సందర్భంలో నరసింహుడి రూపం} ఉపమాన పదంగా వాడబడింది. - :వంశం - భూచర;:::::::పద్య సం.(లు) - 1-39-వ.,

[ ⇑ ] :119) కరణములు- ( - ){జాతి}[నృత్తము]:- పారిభాషిక పదము - రాసక్రీడ - నృత్తము
నటనా విధానములు - :వంశం - నృత్తము;:::::::పద్య సం.(లు) - 10.1-1084-వ.,

[ ⇑ ] :120) కరణి- (స్త్రీ){జాతి}[జంతు]:- ఆడు ఏనుగు - :వంశం - జంతు;:::::::పద్య సం.(లు) - 8-49-సీ.,

[ ⇑ ] :121) కరణీవిభుడు- (స్త్రీ){జాతి}[జంతు]:- గజేంద్రుడు - :వంశం - జంతు;:::::::పద్య సం.(లు) - 8-35-మ.,

[ ⇑ ] :122) కరభాజనుడు- (పురుష){సంజ్ఞా}[ప్రియవ్రతుని వంశం]:- ఋషభుని వందమంది కొడుకులలో ఒకడు, వీరిలో ఇతనితోపాటు తొమ్మిది మంది పరమ భాగవతులు అయ్యారు వీరు తరువాతి కాలంలో విదేహ రాజుకు తత్వం చెప్పారు. వారు కవి, హరి, అంతరిక్షుడు, ప్రబుద్ధుడు, పిప్పలాయనుడు, అవిర్హోత్రుడు, ద్రమీఢుడు, చమనుడు, కరభాజనుడు. - :వంశం - ప్రియవ్రతుని వంశం;:తండ్రి - ఋషభుడు;:తల్లి - జయంతి ;:::::పద్య సం.(లు) - 5.1-63-సీ., 5.1-64-వ., 11-35-వ., 11-77-వ.,

[ ⇑ ] :123) కరభావము- ( -){జాతి}[నృత్తము]:- పారిభాషిక పదము - రాసక్రీడ - నృత్తము
హస్త ముద్రలు వేయుట - :వంశం - నృత్తము;:::::::పద్య సం.(లు) - 10.1-1084-వ.,

[ ⇑ ] :124) కరము- (స్త్రీ){జాతి}[అవయవము]:- ఏనుగు తొండము - :వంశం - అవయవము;:::::::పద్య సం.(లు) - 8-52-క.,

[ ⇑ ] :125) కరవాలములు- (-){జాతి}[పరికరములు]:- కరవాలము అంటే కత్తి - :వంశం - పరికరములు;:::::::పద్య సం.(లు) - 8-327-క., నుండి 8-334-వ., వరకు,

[ ⇑ ] :126) కరవీర - ( -){జాతి}[వృక్ష]:- గన్నేరు - ఇవి అష్టమ స్కంధములోని త్రికూట పర్వతములో వర్ణించబడ్డాయి - :వంశం - వృక్ష;:::::::పద్య సం.(లు) - 8-23-సీ., 8-24-వ., 8-25-క.,

[ ⇑ ] :127) కరి- (స్త్రీ){జాతి}[జంతు]:- ఏనుగు - :వంశం - జంతు;:::::::పద్య సం.(లు) - 8-28-క., 8-53-చ., 8-54-క., 8-55-వ.,

[ ⇑ ] :128) కరినాథుడు- (స్త్రీ){జాతి}[జంతు]:- గజేంద్రుడు - :వంశం - జంతు;:::::::పద్య సం.(లు) - 8-37-క.,

[ ⇑ ] :129) కరివరదుడు- (పురుష){సంజ్ఞా}[దైవ యోని]:- విష్ణువు, గజేంద్రునికి వరములు ఇచ్చిన వాడు - :వంశం - దైవ యోని;:::::::పద్య సం.(లు) - 4-166-చ., 6-187-క., 11-72.,1-తే.,

[ ⇑ ] :130) కరీంద్రుడు- (స్త్రీ){సంజ్ఞా}[జంతు]:- గజేంద్రుడు - :వంశం - జంతు;:::::::పద్య సం.(లు) - 8-52-క.,

[ ⇑ ] :131) కరూశ- ( -){సంజ్ఞా}[ప్రదేశం]:- ఉషాకుమారికి కలలో కనబడిన రాకుమారుని కముగొనుటకు, ఆమె నెచ్చెలి, మంత్రిపుత్రీ అయిన చిత్రరేఖ రాజుల చిత్రాలు అన్నీ వేసింది. అలా వేసిన చిత్రాలలో మాళవ, కొంకణ, ద్రవిడ, మత్స్య, పుళింద, కళింగ, భోజ, నేపాల, విదేహ, పాండ్య, కురు, బర్బర, సింధు, యుగంధర, ఆంధ్ర, బంగాళ, కరూశ, టేంకణ, త్రిగర్త, సుధేష్ణ, మరాట, లాట, పాంచాల, నిషాద, ఘూర్జర, సాళ్వ దేశాల ప్రభువులు ఉన్నారు చూడు అని చూపించింది. - :వంశం - ప్రదేశం;:::::::పద్య సం.(లు) - 10.2-348-ఉ.,

[ ⇑ ] :132) కరూశకుడు- (పురుష){సంజ్ఞా}[సూర్యవంశం]:- ఇతడు ప్రస్తుతం నడుస్తున్న ఏడవ వైవశ్వత మన్వంతరంలో, శ్రాద్ధదేవుడు అను వైవశ్వత మనువునకు భార్య శ్రాద్ధాదేవి యందు కలిగిన పదిమంది (10) కొడుకులలో ఎనిమిదవ (8) వాడు. ఇతని సోదరులు తొమ్మండుగురు ఇక్ష్వాకుడు, నభగుడు, ధృష్టుడు, శర్యాతి, నరిష్యంతుడు, నాభాగుడు, దిష్టుడు, పృషద్ధ్రుడు, వసుమంతుడు. ఈ పదిమందీ రాజులు అయ్యారు. పురందరుడు అనేవాడు ఇంద్రుడు అయ్యాడు. ఆదిత్యులూ, మరుత్తులూ, అశ్వినులూ, వసువులూ, రుద్రులు అనేవారు దేవతలు అయ్యారు. గౌతముడూ, కశ్యపుడూ, అత్రీ, విశ్వామిత్రుడు, జమదగ్నీ, భరద్వాజుడూ, వసిష్టుడూ అనేవారు సప్త ఋషులు అయ్యారు. అందులో కశ్యపుని భార్య అయిన అదితి గర్భంలో విష్ణువు వామన రూపంలో జన్మించి, ఇంద్రునికి తమ్ముడు అయ్యాడు. - :వంశం - సూర్యవంశం;:తండ్రి - శ్రాద్ధ దేవుడు వైవశ్వత మనువు;:తల్లి - శ్రద్ధ;:::కొడుకు(లు) - కారూశులు అను క్షత్రియులు కలిగి బ్రాహ్మణులైరి;::పద్య సం.(లు) - 8-412-వ., 9-9-వ., 9-42-వ., 10.2-348-ఉ.,

[ ⇑ ] :133) కరూశాధిపతి- (పురుష){సంజ్ఞా}[సూర్యవంశం]:- పౌండ్రకుడు, కరూశదేశానికి ప్రభువు. - :వంశం - సూర్యవంశం;:::::::పద్య సం.(లు) - 10.2-507-వ.,

[ ⇑ ] :134) కరేణు- (స్త్రీ){జాతి}[జంతు]:- ఆడు ఏనుగు - :వంశం - జంతు;:::::::పద్య సం.(లు) - 8-37-క., 8-38-వ.,

[ ⇑ ] :135) కర్కటము- (స్త్రీ){జాతి}[జలచర]:- పీత,కర్కాటక రాశి - :వంశం - జలచర;:::::::పద్య సం.(లు) - 8-47-మ., 8-55-వ.,

[ ⇑ ] :136) కర్కాటక- ( -){జాతి}[జలచర]:- కర్కాటకరాశి, ఎండ్రకాయ, పీత - :వంశం - జలచర;:::::::పద్య సం.(లు) - 8-56-క.,

[ ⇑ ] :137) కర్కాటక రాశి- ( -){సంజ్ఞా}[భగణ విషయం]:- సూర్యుడు మేషరాశిలో, తులారాశిలో సంచరిస్తుంటే పగలు, రాత్రి సమానంగా ఉంటాయి. వృషభం, మిథునం, కర్కాటకం, సింహం, కన్య అనే ఐదు రాశులలో సంచరిస్తుంటే ఒక్కొక్క గడియ చొప్పన రాత్రి తగ్గుతూ వస్తుంది. వృశ్చికం, ధనుస్సు, మకరం, కుంభం, మీనం అనే ఐదు రాశులలో సంచరిస్తుంటే ఒక్కొక్క గడియ చొప్పన రాత్రి పెరుగుతుంది. పగలుతగ్గిపోతుంది. - :వంశం - భగణ విషయం;:::::::పద్య సం.(లు) - 5.2-79-ఆ., 5.2-80-ఆ.,

[ ⇑ ] :138) కర్కోటకుడు- (పురుష){సంజ్ఞా}[నాగుడు]:- ఇతడు పుష్య మాసంలో సూర్యుని అనుచరులలోని నాగుడు.
సూర్యుడు ఈ మాసంలో భగుడు అను పేరుతో, పూర్వచిత్తి, ఆయువు, కర్కోటకుడు, స్పూర్జుడు, అరిష్టనేమి, ఊర్ణుడు మున్నగువారు అనుచరులుగా కలిగి సంచరిస్తాడు. - :వంశం - నాగుడు;:::::::పద్య సం.(లు) - 12-41-వ., నుండి 12-45-వ., వరకు,

[ ⇑ ] :139) కర్ణధారుడు- (పురుష){జాతి}[మానవ యోని]:- నావ చక్కని పట్టి నడుపువాడు - :వంశం - మానవ యోని;:::::::పద్య సం.(లు) - 3-459-వ.,

[ ⇑ ] :140) కర్ణిక- (స్త్రీ){సంజ్ఞా}[చంద్రవంశం]:- వసుదేవుని తమ్ముడు, అలా శ్రీకృష్ణుని సోదరవరుస ఐనవాడు ఆనకుడు. అతని భార్య కర్ణిక, వీరి కొడుకులు జయుడు, ఋతుదాముడు - :వంశం - చంద్రవంశం;::::భర్త - ఆనకుడు;:కొడుకు(లు) - జయుడు;::పద్య సం.(లు) - 9-722-వ.

[ ⇑ ] :141) కర్ణుడు- (పురుష){సంజ్ఞా}[చంద్రవంశం]:- కన్యగా ఉన్న కుంతి కనుక కానీనుడు.
కుంతి చిన్నతనంలో కోరి సూర్యుని పొందగా పుట్టిన పిల్లవాడిని పెట్టెలో ఉంచి గంగానదిలో విడిచి పెట్టింది. ఆ పిల్లవాడిని అతిరథుడు కనుగొని ఆదరించి కర్ణుడు అంటూ పుత్రునిగా పెంచుకున్నాడు. ఇతను దుర్యోధనునికి ఆప్త మిత్రుడు. మహాశూరుడు, పరీక్షిత్తు తండ్రి అభిమన్యుడు అసహాయశూరుడై, ద్రోణ కర్ణాదులచే పరిరక్షితమైన కౌరవసేవావ్యూహంలో ప్రవేశించి చీల్చి చెండాడాడు. ఇతని కొడుకు వృషసేనుడు - :వంశం - చంద్రవంశం;:తండ్రి - అతిరథుడు పెంపుడు తండ్రి;:తల్లి - రాధ పెంపుడు తల్లి , కుంతి కన్న తల్లి;:::కొడుకు(లు) - వృష సేనుడు;::పద్య సం.(లు) - 1-39-వ., 1-79-సీ., 1-189-సీ., 1-366-వ., 9-698-ఆ., 9-699-వ., 1-79-సీ., 3-28-క., 6-306-సీ.,

[ ⇑ ] :142) కర్తరీముఖకరభావము- ( -){సంజ్ఞా}[నృత్తము]:- పారిభాషిక పదము - రాసక్రీడ - నృత్తము
కత్తెరవలె చిటికినవేలు తర్జనివేలు తప్ప మిగిలినవి ముడిచి పట్టునది, శ్లో.అన్యైవచాపిహస్త తర్జనీచ కనిష్టకా బహిః ప్రసారితేద్వేత్స కరః కర్తరీ ముఖః - :వంశం - నృత్తము;:::::::పద్య సం.(లు) - 10.1-1084-వ.,

[ ⇑ ] :143) కర్థనుడు- (పురుష){సంజ్ఞా}[చంద్రవంశం]:- ఇతడు కృష్ణునికు మిత్రవిందకు పుట్టిన పదిమంది (10) కొడుకులలో అయిద(5)వ వాడు - :వంశం - చంద్రవంశం;:తండ్రి - కృష్ణుడు;:తల్లి - మిత్రవింద;:::::పద్య సం.(లు) - 10.1-275-వ.,

[ ⇑ ] :144) కర్దముడు- (పురుష){సంజ్ఞా}[ఋషి]:- ఇతను బ్రహ్మ దేవుని నీడ నుండి పుట్టిన ప్రజాపతి. స్వాయంభువ మనువు తన కూతురు దేవహూతిని ఇచ్చాడు. భార్య యందు ప్రసన్నుడై గొప్ప వైభవాలతో కూడిన దివ్య ధామం పుట్టించి, ఆమెను సకల సౌఖ్యాలలో తేల్చాడు. ఇతనికి భార్య దేవహూతి యందు తొమ్మిది (9) మంది కూతుళ్ళు, కపిలుడని ఒక కొడుకు పుట్టారు. కపిలుడు సాంఖ్యాయోగ కర్త మహా యోగి. తన కుమార్తెలైన కళను మరీచికి, అనసూయను అత్రికి, శ్రద్ధను అంగిరసునకు, హవిర్భువును పులస్త్యునకు, గతిని పులహువునకు, క్రియను క్రతువుకు, ఖ్యాతిని భృగువుకు, అరుంధతిని వసిష్ఠునకు, శాంతిని అధ్వర్యునకు ఇచ్చి వివాహాలు చేసాడు. - :వంశం - ఋషి;:తండ్రి - బ్రహ్మదేవుడు;::భార్య - దేవహూతి ;::కొడుకు(లు) - కపిలుడు ;:కూతురు(లు)- కళ; అనసూయ; శ్రద్ధ; హవిర్భుక్కు; గతి; క్రియ; ఖ్యాతి; ఊర్జ / అరుంధతి ; జిత్తి / శాంతి ;:పద్య సం.(లు) - 2-119-చ., 3-745-వ., 3-803-వ., 3-849-వ.,

[ ⇑ ] :145) కర్పూరతిలకా-1 ( -){జాతి}[వృక్ష]:- కర్పూరతిలకా అంటే కలిగొట్లు బొట్టుగ చెట్ల అని కర్పూరతిలకము అని నానార్ర్థాలు ఉన్నాయి. ఈ పదం ప్రథమ స్కంధలో నైమిశారణ్య వర్ణన సందర్భంలో వర్షాకాలం రాక} కు ఉపమాన పదంగా వాడబడింది. - :వంశం - వృక్ష;:::::::పద్య సం.(లు) - 1-39-వ.,

[ ⇑ ] :146) కర్పూరతిలకా-2 ( -){జాతి}[ఆహార్యం]:- కర్పూరతిలకా అంటే కర్పూరతిలకము అని కలిగొట్లు బొట్టుగ చెట్ల అని నానార్ర్థాలు ఉన్నాయి. ఈ పదం ప్రథమ స్కంధలో నైమిశారణ్య వర్ణన సందర్భంలో వర్షాకాలం రాక} ఉపమాన పదంగా వాడబడింది. - :వంశం - ఆహార్యం;:::::::పద్య సం.(లు) - 1-39-వ.,

[ ⇑ ] :147) కర్మజిత్తు- (పురుష){సంజ్ఞా}[చంద్రవంశం]:- ఇతడు జరాసంధుని వంశంలో బృహత్సేనుని కొడుకు, ఇతని కొడుకు శ్రుతంజయుడు. - :వంశం - చంద్రవంశం;:తండ్రి - బృహత్సేనుడు;::::కొడుకు(లు) - శ్రుతంజయుడు;::పద్య సం.(లు) - 9-681-వ.,

[ ⇑ ] :148) కర్మశ్రేష్ఠుడు- (పురుష){సంజ్ఞా}[ఋషి]:- ఇతను పులహుని కొడుకు, పులహునికి భార్య గతి యందు కలిగిన కర్మశ్రేష్ఠుడు, వరీయాంసుడు, సహిష్ణుడు అను ముగ్గురు (3) కొడుకులలో ఒకడు. గతి కర్దముని తొమ్మిది (9) మంది కూతురులలోనూ అయిదవ (5) కూతురు. - :వంశం - ఋషి;:తండ్రి - పులహుడు;:తల్లి - గతి ;:::::పద్య సం.(లు) - 4-26-వ.,

[ ⇑ ] :149) కఱకంఠుడు- (పురుష){సంజ్ఞా}[దైవ యోని]:- శివుడు, నల్లని కంఠము కలవాడు - :వంశం - దైవ యోని;:::::::పద్య సం.(లు) - 4-974-చ., 10.2-426-చ., ,

[ ⇑ ] :150) కఱటి- (స్త్రీ){జాతి}[జంతు]:- ఏనుగు - :వంశం - జంతు;:::::::పద్య సం.(లు) - 8-56-క.,

[ ⇑ ] :151) కలభము- (స్త్రీ){జాతి}[జంతు]:- ఏనుగు గున్న, ఏనుగు పిల్ల {కలభములలో విశేషములు - 1బాలము 2పోతము 3విక్కము} - :వంశం - జంతు;:::::::పద్య సం.(లు) - 8-35-మ., 8-49-సీ.,

[ ⇑ ] :152) కలశసంభవుడు (అగస్త్యుడు)- (పురుష){సంజ్ఞా}[ఋషి]:- అగస్త్యుడు. పరీక్షిత్తు గంగానది ఒడ్డున ప్రాయోపవిష్టుడై ఉన్నాడని విని, వచ్చిన ఋషులలో ఈయన ఒకరు. అలా వచ్చిన ఋషులు అత్రి, విశ్వామిత్రుడు, మైత్రేయుడు, భృగువు, వసిష్ఠుడు, పరాశరుడు, చ్యవనుడు, భరద్వాజుడు, పరశురాముడు, దేవలుడు, గౌతముడు, కశ్యపుడు, కవషుడు, కణ్వుడు, కలశసంభవుడు (అగస్త్యుడు), వ్యాసుడు, పర్వతుడు, నారదుడు మొదలైన బ్రహ్మర్షులూ, దేవర్షులూ, రాజర్షులూ, అరుణుడు మొదలైన కాండర్షులూ, ఇంకా వివిధ గోత్రసంభవులైన మహర్షులు శిష్యులతోనూ, ప్రశిష్యులతోనూ కలిసి అచ్చటికి విచ్చేశారు.
అదితి కుమారులైన మిత్రావరుణులకు ఊర్వశి వల్ల రేతస్సు స్ఖలనం కాగా దానిని ఒక కుండలో ఉంచగా అందులోనుండి అగస్త్యుడు, వసిష్ఠుడు జన్మించారు. కనుక వీరిని కుంభసంభవులు అంటారు. - :వంశం - ఋషి;:::::::పద్య సం.(లు) - 1-499-వ., 6-507-వ.,

[ ⇑ ] :153) కలహంస- (స్త్రీ){జాతి}[గగనచర]:- కలహంస,
కలహంసలు - ఇవి అష్టమ స్కంధములోని త్రికూట పర్వతములో వర్ణించబడ్డాయి - :వంశం - గగనచర;:::::::పద్య సం.(లు) - 8-23-సీ., 8-24-వ., 8-25-క., 8-44-సీ.,

[ ⇑ ] :154) కలి-1 (పురుష){సంజ్ఞా}[దైవ యోని]:- ఇతడు కలియుగ పురుషుడు, పరీక్షిత్తు గోమిథునాన్ని తన్నుతూ రాజచిహ్న ముద్రితుడై శూద్రవేషంలో ఉన్న కలి పురుషుని శిక్షించాడు.
పొంచి పైకి దూకే తోడేలులాగా, ప్రమత్తులై చంచల చిత్తులైన వారిని మాత్రమే కలి బాధిస్తుంది, కానీ ధీరులైన వారికి కలి వల్ల ఎట్టి భయమూ కలగదని పరీక్షిన్మహారాజు భావించాడు. కనుక కలిని అంతం చేయ లేదు. - :వంశం - దైవ యోని;:::::::పద్య సం.(లు) - 1-391-వ., 1-432-వ., 1-437-వ., 1-444-వ.,

[ ⇑ ] :155) కలి-2 (స్త్రీ){సంజ్ఞా}[దైవ యోని]:- వీరు సంసార హేతువైన అధర్మం అనే వృక్షానికి కొమ్మలై వ్యాపించారు. తన మేలు కోరే మానవు డెవ్వడూ ఏమాత్రం వారిని అనుసరించకూడదు. కలికి తండ్రి - క్రోధుడు; తల్లి - హింస; భార్య - దురుక్తి; కొడుకు - భయం - :వంశం - దైవ యోని;:తండ్రి - క్రోధుడు;:తల్లి - హింస ;:భార్య - దురుక్తి;::కొడుకు(లు) - భయం;:కూతురు(లు)- మృత్యువు;:పద్య సం.(లు) - 4-215-వ.,

[ ⇑ ] :156) కలిదమనుడు- (పురుష){సంజ్ఞా}[చంద్రవంశం]:- పరీక్షిత్తు, కలిని శిక్షించిన వాడు - :వంశం - చంద్రవంశం;:::::::పద్య సం.(లు) - 1-438-క.,

[ ⇑ ] :157) కలియుగము- ( -){సంజ్ఞా}[కాలము]:- కలియుగము చతుర్యుగములు నాలుగింటిలో నాలుగవ యుగము - :వంశం - కాలము;:::::::పద్య సం.(లు) - 1-430-వ., 3-349-సీ., 11-77-వ.,

[ ⇑ ] :158) కలువలసంగడీడు- (పురుష){సంజ్ఞా}[దైవ యోని]:- చంద్రుడు, కలువలకు మిత్రుడు. - :వంశం - దైవ యోని;:::::::పద్య సం.(లు) - 9-376-సీ.,

[ ⇑ ] :159) కల్కి - (పురుష){సంజ్ఞా}[దైవయోని]:- కల్క్యావతారము ప్రథమ స్కంధములో వివరించిన వైష్ణవ అవతారాలలో ప్రధానమైన ఏకవింశ త్యవతారములు (21) అందలి 21 అవతారాలు పిమ్మట భవిష్యత్తులో వచ్చే అవతారము. (1-63-వ.)ద్వితీయ స్కంధములో అవతారముల వైభవంలో వివరించిన పంచవింశతి అవతారాలు (25) అందలి 26 వ. అవతారం. ఇది భవిష్యత్తు కాలంలో వచ్చే అవతారము. (2-198-మ)
మఱియు, ఏకాదశ స్కంధములో వివరించిన దశా వతారములు(10) అందలి 10 వ. అవతారం.
వీరు శనిపీడ నుండి కాపాడు గాక అని విశ్వరూపుడు దేవేంద్రునికి ఉపదేశించిన శ్రీమన్నారాయణ కవచంలో ఉన్న నలభైతొమ్మిది స్తుతులలో ఇది ఒకటి.
విష్ణుమూర్తి తన ఇరవై రెండవ అవతారంగా కల్కి రూపంతో విష్ణుయశుడనే విప్రునికి కుమారుడై జన్నించి కలియుగాంతంలో కలుషాత్ములైన రాజులను కఠినంగా శిక్షిస్తాడు.
కలియుగంలో భగవంతుడు కల్కిగా అవతరిస్తాడు. అధర్మం తొలగిస్తాడు. భూతలంలో ధర్మం స్థాపిస్తాడు.
మానినీ మానసచోర దండకంలో కల్కిరూపము ధరించి పెంపుతో వెలుగొందవా? అని పొగుడుతారు.
శ్రీమన్నారాయణ కవచంలో శనైశ్వరుని వలన కల్కి అయి కాపాడు గాక అని స్తుతిస్తారు. - :వంశం - దైవయోని;:::::::పద్య సం.(లు) - 1-63-వ.,2-138-మ., 11-71-వ., 6-300-చ., నుండి 6-307-వ., 1-63-వ., 2-198-మ., 10.1-1236-దం., 6-246-వ.,

[ ⇑ ] :160) కల్పుడు- (పురుష){సంజ్ఞా}[మనువు వంశం]:- ఇతడు ధ్రువుని పుత్రుడు. ధ్రువుడు శింశుమార ప్రజాపతి కూతురయిన భ్రమిని వివాహమాడి ఆమెవల్ల కల్పుడు, వత్సరుడు అనె ఇద్దరు కొడుకులను పొందాడు. వాయు పుత్రిక అయిన ఇలను పెండ్లాడి ఆమెవల్ల ఉత్కలుడు అనే కొడుకును, సౌందర్యవతి అయిన కూతురును పొందాడు. - :వంశం - మనువు వంశం;:తండ్రి - ధ్రువుడు;:తల్లి - ఇల ;:::కొడుకు(లు) - ఉత్కళుడు;:కూతురు(లు)- సౌందర్యవతి;:పద్య సం.(లు) - 4-322-వ.,

[ ⇑ ] :161) కల్పువృష్టుడు- (పురుష){సంజ్ఞా}[చంద్రవంశం]:- ఇతడు వసుదేవునికి భార్య ఉపదేవ యందు కలిగిన పదిమంది పుత్రులలో పెద్దవాడు. - :వంశం - చంద్రవంశం;:తండ్రి - వసుదేవుడు;:తల్లి - ఉపదేవ;:::::పద్య సం.(లు) - 9-722-వ.,

[ ⇑ ] :162) కల్లోలము- ( -){జాతి}[ -]:- అల - :వంశం - -;:::::::పద్య సం.(లు) - 8-51-సీ.,

[ ⇑ ] :163) కల్హారము- ( -){జాతి}[వృక్ష]:- కలువ, ఎఱ్ఱకలువలు - ఇవి అష్టమ స్కంధములోని త్రికూట పర్వతములో వర్ణించబడ్డాయి,
సౌగంధికము, ఇంచుక ఎఱుపు తెలుపు కలిగి మిక్కిలి పరిమళము కలిగిన కలువ. - :వంశం - వృక్ష;:::::::పద్య సం.(లు) - 8-23-సీ., 8-24-వ., 8-25-క., 8-42-మ., 8-49-సీ.,

[ ⇑ ] :164) కళ- (స్త్రీ){సంజ్ఞా}[ఋషి]:- ఈమె కశ్యపుని తల్లి, మరీచి భార్య, కర్దముని కూతురు
ఈమె కర్దమునికి దేవహూతి యందు కలిగిన కన్యకా నవకము (9)లో పెద్ద కూతురు, ఈమెను మరీచికి ఇచ్చి వివాహం చేసారు, భర్త మరీచికి కశ్యపుడు కొడుకుగాను, పూర్ణిమ కూతురుగానూ పుట్టారు. - :వంశం - ఋషి;:తండ్రి - కర్దముడు;:తల్లి - దేవహూతి ;::భర్త - మరీచి;:కొడుకు(లు) - కశ్యపుడు ;:కూతురు(లు)- పూర్ణిమ ;:పద్య సం.(లు) - 3-849-వ., 4-7-సీ.,

[ ⇑ ] :165) కళింగ- ( -){సంజ్ఞా}[ప్రదేశం]:- ఉషాకుమారికి కలలో కనబడిన రాకుమారుని కముగొనుటకు, ఆమె నెచ్చెలి, మంత్రిపుత్రీ అయిన చిత్రరేఖ రాజుల చిత్రాలు అన్నీ వేసింది. అలా వేసిన చిత్రాలలో మాళవ, కొంకణ, ద్రవిడ, మత్స్య, పుళింద, కళింగ, భోజ, నేపాల, విదేహ, పాండ్య, కురు, బర్బర, సింధు, యుగంధర, ఆంధ్ర, బంగాళ, కరూశ, టేంకణ, త్రిగర్త, సుధేష్ణ, మరాట, లాట, పాంచాల, నిషాద, ఘూర్జర, సాళ్వ దేశాల ప్రభువులు ఉన్నారు చూడు అని చూపించింది. - :వంశం - ప్రదేశం;:::::::పద్య సం.(లు) - 10.2-348-ఉ.,

[ ⇑ ] :166) కళింగుడు-1 (పురుష){సంజ్ఞా}[చంద్రవంశం]:- రుక్మి బలరాములు జూదం ఆడిన సందర్భంలో, ఇంతకు ముందు తనను చూసి పండ్లికిలించి నవ్విన ఆ కళింగుడిని క్రిందపడత్రోసి పండ్లు ఊడగొట్టాడు.
బలరాముడు కళింగుని పళ్ళురాలగొట్టినట్లు, దక్షాధ్వర ధ్వంసము సందర్భంలో దక్షుడు కోపంతో శివుని శపించినప్పుడు పరిహాసం చేసిన పూషుని దంతాలను చండీశ్వరుడు రాలగొట్టాడు. - :వంశం - చంద్రవంశం;:::::::పద్య సం.(లు) - 4-120-తే., 10.2-301-క.,

[ ⇑ ] :167) కళింగుడు-2 (పురుష){సంజ్ఞా}[చంద్రవంశం]:- బలి అనే రాజుకు అతని భార్య సుధేష్ణ యందు కలిగిన ఆరుగురు కొడుకులలో ఒకడు. వీరు 6గురు అంగుడు, వంగుడు, కళింగుడు, సింహుడు, పుండ్రుడు, ఆంధ్రుడు. వీరు 6గురు వారి వారి పేర ఉన్న భారతవర్షంలోని తూర్పు దేశాలకు రాజులై పాలించారు, - :వంశం - చంద్రవంశం;:తండ్రి - బలి;:తల్లి - సుధేష్ణ;:::::పద్య సం.(లు) - 9-663-వ.,

[ ⇑ ] :168) కళిందకన్య- (స్త్రీ){సంజ్ఞా}[నది]:- యమునానది, కళింద పర్వతము కూతురు. - :వంశం - నది;:::::::పద్య సం.(లు) - 10.1-1227-క.,

[ ⇑ ] :169) కళిందతనయ- (స్త్రీ){సంజ్ఞా}[నది]:- యమునానది, కళింద పర్వతమునందు పుట్టినది - :వంశం - నది;:::::::పద్య సం.(లు) - 10.1-1479-శా.,

[ ⇑ ] :170) కళిందనందన- (స్త్రీ){సంజ్ఞా}[నది]:- యమునానది, కళింద పర్వతమునందు పుట్టినది - :వంశం - నది;:::::::పద్య సం.(లు) - 10.1-1101-వ.,

[ ⇑ ] :171) కవచము- ( -){జాతి}[ -]:- పృథుచక్రవర్తి పట్టాభిషిక్తుడు అయిన సందర్భంలో దేవతలు అందరు వివిధ బహుమానాలు ఇచ్చారు. వారిలో బ్రహ్మదేవుడు, కవచము ఇచ్చెను - :వంశం - -;:::::::పద్య సం.(లు) - 4-442-సీ., 4-443-సీ.,

[ ⇑ ] :172) కవచులు- (పురుష){జాతి}[రాక్షసయోని]:- కవచులు మున్నగు రాక్షసవీరులు సురాసుర యుద్ధములో బలి పక్షమున పోరాడాడు. నివాత కవచులు మరుత్తులుతో పోరాడారు. - :వంశం - రాక్షసయోని;:::::::పద్య సం.(లు) - 8-327-క., నుండి 8-334-వ., వరకు,

[ ⇑ ] :173) కవషుడు- (పురుష){సంజ్ఞా}[ఋషి]:- పరీక్షిత్తు గంగానది ఒడ్డున ప్రాయోపవిష్టుడై ఉన్నాడని విని, వచ్చిన ఋషులలో ఈయన ఒకరు. - :వంశం - ఋషి;:::::::పద్య సం.(లు) - 1-499-వ.,

[ ⇑ ] :174) కవషులు- (పురుష){జాతి}[ఋషి]:- ఇతడు ధర్మరాజు చేసిన రాజసూయయాగంలో పాల్గొన్న మునీశ్వరులలో ఒకడు - :వంశం - ఋషి;:::::::పద్య సం.(లు) - 10.2-766-సీ.,

[ ⇑ ] :175) కవి-1 (పురుష){సంజ్ఞా}[చంద్రవంశం]:- శ్రీకృష్ణునికి కాళింది యందు కలిగిన పుత్రదశకంలో ఒకడు.
శ్రీకృష్ణుని కుమారులలో ప్రసిద్ధులైన పదిమందిలో ఒకడు - :వంశం - చంద్రవంశం;:తండ్రి - కృష్ణుడు;:తల్లి - కాళింది;:::::పద్య సం.(లు) - 10.2-275-వ., 10.2-1325-వ.,

[ ⇑ ] :176) కవి-2 (పురుష){జాతి}[మానవ యోని]:- కవిత్వం వ్రాయువాడు.
పోతనామాత్యులవారు గ్రంథారంభంలో ఎనిమిది మంది కవులను వారి పేర్లు చెప్పి మరీ స్తుతించారు. వారు వాల్మీకి, వ్యాసుడు, శుకయోగి, బాణుడు, మయూరుడు, కాళిదాసు, నన్నయ, తిక్కన. పిమ్మట తక్కిన పూర్వకవు లందరిని మనసారా భావించి సంభావిస్తున్నాను. ఈనాటి కవు లందరిని అభినందిస్తున్నాను. ముందు తరాలలో రాబోయే కవు లందరికీ శుభం పలుకుతున్నాను. అన్నాడు.
నారయ తన షష్ఠస్కంధ ఆరంభంలో స్మరించిన కవుల పేర్లు వ్యాసుడు, వాల్మీకి, శుకుడు, బాణుడు, మయూరుడు, భాసుడు, సౌమిల్లకుడు, భారవి, మాఘుడు, కాళిదాసు, నన్నయ, తిక్కన, ఎఱ్ఱన, భాస్కరుడు, నాచన సోముడు, శ్రీనాథుడు, పోతన. - :వంశం - మానవ యోని;:::::::పద్య సం.(లు) - 1-12-వ., 6-9-చ., నుండి 6-12-ఉ., వరకు.,

[ ⇑ ] :177) కవి-3 (పురుష){సంజ్ఞా}[కర్దమ వంశం]:- ఇతడు కర్దమ పుత్రిక ఉశన యందు భార్గవునికి (శుక్రునికి) కలిగిన కొడుకు - :వంశం - కర్దమ వంశం;:తండ్రి - భార్గవుడు శుక్రుడు ;:తల్లి - ఉశన ;:::::పద్య సం.(లు) - 4-26-వ.,

[ ⇑ ] :178) కవి-4 (పురుష){సంజ్ఞా}[మనువు వంశం]:- యజ్ఞుడు, దక్షిణల పన్నెండు మంది (12) పుత్రులలోను ఎనిమిదవ (8) వాడు. తోషుడు, ప్రతోషుడు, సంతోషుడు, భద్రుడు, శాంతి, ఇడస్పతి, ఇధ్ముడు, కవి, విభుడు, వహ్ని, సుదేవుడు, రోచనుడు అనే వీరు పన్నెండు మంది తుషితలు అనే దేవగణాలు అయ్యారు. - :వంశం - మనువు వంశం;:తండ్రి - యజ్ఞుడు ;:తల్లి - దక్షిణ ;:::::పద్య సం.(లు) - 4-6-వ.,

[ ⇑ ] :179) కవి-5 (పురుష){సంజ్ఞా}[ప్రియవ్రతుని వంశం]:- ఇతడు ప్రియురతునికి భార్య బర్హిష్మతి యందు కలిగిన పదిమంది (10) పుత్రులలో చిన్నవాడు. అతని అన్నలు ఆగ్నీధ్రుడు, ఇధ్మజిహ్వుడు, యజ్ఞబాహువు, మహావీరుడు, హిరణ్యరేతసుడు, ఘృతపృష్ఠుడు, సవనుడు, మేధాతిథి, వీతిహోత్రుడు. వీరికి ఊర్జస్వతి అని ఒక సోదరి. ఈ పదిమంది సోదరులలోనూ ఇతడు (కవి), మహావీరుడు, సవనుడు అనేవారు చిన్నవారైనా బ్రహ్మచర్యం అవలంబించి బ్రహ్మవిద్యా నిష్ణాతులై ఈశ్వర తాదాత్మ్యం పొందారు. - :వంశం - ప్రియవ్రతుని వంశం;:తండ్రి - ప్రియవ్రత ;:తల్లి - బర్హిష్మతి ;:::::పద్య సం.(లు) - 5.1-16-వ.,

[ ⇑ ] :180) కవి-6 (పురుష){సంజ్ఞా}[ప్రియవ్రతుని వంశం]:- ఋషభుని వందమంది కొడుకులలో ఒకడు, వీరిలో ఇతనితోపాటు తొమ్మిది మంది పరమ భాగవతులు అయ్యారు వీరు తరువాతి కాలంలో విదేహ రాజుకు తత్వం చెప్పారు. వారు కవి, హరి, అంతరిక్షుడు, ప్రబుద్ధుడు, పిప్పలాయనుడు, అవిర్హోత్రుడు, ద్రమీఢుడు, చమనుడు, కరభాజనుడు. - :వంశం - ప్రియవ్రతుని వంశం;:తండ్రి - ఋషభుడు;:తల్లి - జయంతి ;:::::పద్య సం.(లు) - 5.1-63-సీ., 5.1-64-వ.,

[ ⇑ ] :181) కవి-7 (పురుష){సంజ్ఞా}[ఋషి]:- ఇతడు భరతుని తమ్ముడు. ఋభునికి భార్య జయంతి యందు పుట్టిన వందమందిలో ఇతను ఒకడు. వారిలో ఇతడు (కవి), హరి, అంతరిక్షుడు, ప్రబుద్ధుడు, పిప్పలాయనుడు, అవిర్హోత్రుడు, ద్రమీఢుడు, చమనుడు, కరభాజనుడు అనే తొమ్మిది మంది భాగవత ధర్మాన్ని ప్రకాశింపజేశారు.
విదేహునికి తత్వం చెప్పిన ఋషులలో ఒకడు. వీరు కవి, హరి, అంతరిక్షుడు, ప్రబుద్ధుడు, పిప్పలాయనుడు, ఆవిర్హోత్రుడు, ద్రమీళుడు, చమసుడు, కరభాజనుడు అనే పేర్లు కలగిన తొమ్మిదిమంది ఊర్ధ్వరేతస్కులు. - :వంశం - ఋషి;:తండ్రి - ఋషభుడు;:తల్లి - జయంతి;:::::పద్య సం.(లు) - 5.1-64-వ., 11-35-వ.,

[ ⇑ ] :182) కవి-8 (పురుష){సంజ్ఞా}[చంద్రవంశం]:- మహావీర్యునికి ఉరుక్షయుడు; ఉరుక్షయునకు త్రయారుణి, కవి, పుష్కరారుణి అని ముగ్గురు కొడుకులు పుట్టారు. వారు విప్రులైపోయారు. - :వంశం - చంద్రవంశం;:తండ్రి - ఉరుక్షయుడు;::::::పద్య సం.(లు) - 9-653-వ.,

[ ⇑ ] :183) కవి-9 (పురుష){సంజ్ఞా}[సూర్యవంశం]:- నాభాగుడు బ్రహ్మచారిగా వచ్చి తన సోదరులను సంపదలో భాగం పంచిమ్మని అడిగాడు. వారు “నాన్నగారు ఎలా చెప్పితే అలా ఇస్తాం” అన్నారు. నాభాగుడు తండ్రి నభగుని వద్దకు వెళ్ళి పంపకాలు చేయమని అడిగాడు. అతడు “ఇప్పుడు అంగిరసులు సత్రయాగం చేస్తూ ఆరో(6) దినం తగిన కర్మకాండ తట్టకుండా ఉంటారు. వారికి నీవు విశ్వదేవ మంత్రాలను రెండు (2) తెలుపగా "కవి" అని ఖ్యాతి చెందుతావు. - :వంశం - సూర్యవంశం;:::::::పద్య సం.(లు) - 9-76-వ., 9-79-క.,

[ ⇑ ] :184) కవి-10 (పురుష){సంజ్ఞా}[మనువు వంశం]:- వైవశ్వత మనువు కడపటి కొడుకు రాజ్యాన్ని వదలి, బంధువుల తోసహా వెళ్ళి అడవిలో నారాయణమూర్తిని గురించి తపస్సు చేసి మోక్షం పొందాడు.
ఇతడు వైవస్వత మనువు పదిమంది పుత్రులలో కనిష్ఠ పుత్రుడు. ఇతని తల్లి శ్రద్ధాదేవి. అన్నలు ఇక్ష్వాకుడు, నృగుడు, శర్యాతి, దిష్టుడు, దృష్టుడు, కరూశకుడును, నరిష్యంతుడు, పృషద్రధుడు, నభగుడు. ఇతడు అపుత్రకుడు. - :వంశం - మనువు వంశం;:తండ్రి - వైవశ్వతమనువు;:తల్లి - శ్రాద్ధాదేవి;:::::పద్య సం.(లు) - 9-9-వ., 9-42-క.,

[ ⇑ ] :185) కవిజిత్తు- (పురుష){సంజ్ఞా}[సూర్యవంశం]:- ఇతడు సూర్యవంశంలోని ఖనినేత్రపుత్రుడైన కరంధనుని కొడుకు ఇతని కొడుకు ప్రసిద్ధుడైన మరుత్తు. మరుత్తు చక్రవర్తి అయ్యాడు, గొప్ప యాగం చేసాడు. సంతోషించిన ఇంద్రుడు యజ్ఞ సామగ్రి సమస్తాన్ని బంగారపువాటిగా మార్చాడు. - :వంశం - సూర్యవంశం;:తండ్రి - కరంధనుడు;::::కొడుకు(లు) - మరుత్తు;::పద్య సం.(లు) - 9-44-వ.,

[ ⇑ ] :186) కవిరాజ విరాజితము- ( -){జాతి}[భాష]:- ఛందస్సు, తెలుగు భాగవతములో ఉపయోగించిన ఒక ఛందోరీతి వృత్తము ఈ కవిరాజ విరాజితము.
గ్రంథములో ఈ ఛందస్సు మూడు పద్యములకు వాడారు. - :వంశం - భాష;:::::::పద్య సం.(లు) - 4-438-కవి.,

[ ⇑ ] :187) కశలు- ( -){జాతి}[పరికరములు]:- కశలు అంటే గుఱ్ఱము మున్నగు వాటిని కొట్టుటకు వాడు కొరడాకఱ్ఱ - :వంశం - పరికరములు;:::::::పద్య సం.(లు) - 8-327-క., నుండి 8-334-వ., వరకు,

[ ⇑ ] :188) కశ్యప- ( -){సంజ్ఞా}[నక్షత్ర]:- ధృవునికి సర్వోన్నతమైన ధ్రువక్షితి అనుగ్రహిస్తున్నాను అని చెప్పేటప్పుడు విష్ణుమూర్తి జ్యోతిశ్చక్రంలోని ధర్మ, అగ్ని, కశ్యప, శక్రు, సప్తర్షులును, తారకలు అను నక్షత్రాలను పేర్కొన్నాడు. - :వంశం - నక్షత్ర;:::::::పద్య సం.(లు) - 4-290-వ.,

[ ⇑ ] :189) కశ్యపుడు-1 (పురుష){సంజ్ఞా}[విప్రుడు]:- ఇతను ఒక బ్రాహ్మణుడు.
నృగమహారాజు చేసిన లెక్కలేన్నన్ని దానాలలో, కశ్యపుడు అను బ్రాహ్మణునకు ఇచ్చిన ఆవు వెనక్కి వచ్చింది. అది తెలియక దానిని మరొక విప్రునికి దానం ఇచ్చాడు. తెలియక ఐనా విప్రుని సొమ్ము తీసుకున్న కారణంగా ఆయనకు ఊసరవెళ్ళి కాయం సంక్రమించింది. శ్రీకృష్ణ స్పర్శతో విముక్తి లభించింది. - :వంశం - విప్రుడు;:::::::పద్య సం.(లు) - 10.2-466-క.,

[ ⇑ ] :190) కశ్యపుడు-2 (పురుష){సంజ్ఞా}[ఋషి]:- ఋషి, రంగపతితుడైన భీష్ముడిని దర్శించడానికి ధర్మరాజు వెళ్ళినప్పుడు బృహదశ్వుడు, భరద్వాజుడు, పరశురాముడు, పర్వతుడు, నారదుడు, వేదవ్యాసుడు, కశ్యపుడు, ఆంగిరసుడు, కౌశికుడు, ధౌమ్యుడు, సుదర్శనుడు, శుకుడు, వసిష్ఠుడు మొదలైన పెక్కుమంది రాజర్షులు, బ్రహ్మర్షులు తమతమ శిష్యులతో కూడి వచ్చారు. వారిలో ఈయ నొకరు.
పరీక్షిత్తు గంగానది ఒడ్డున ప్రాయోపవిష్టుడై ఉన్నాడని విని, వచ్చిన ఋషులలో ఈయన ఒకరు.
ఇతడు ధర్మరాజు చేసిన రాజసూయయాగంలో పాల్గొన్న మునీశ్వరులలో ఒకడు
శ్రీకృష్ణుని దర్శించుకోవడానికి వచ్చి వసుదేవునిచే క్రతువు చేయించిన మునీశ్వరులలో ఒక మునీశ్వరుడు. - :వంశం - ఋషి;:::::::పద్య సం.(లు) - 1-208-వ., 1-499-వ., 10.2-766-సీ., 11-11-వ.,

[ ⇑ ] :191) కశ్యపుడు-3 (పురుష){సంజ్ఞా}[ఋషి]:- కశ్యపుడు, త్రయ్యారుణి, కశ్యపుడు, సావర్ణి, అకృతవ్రణుడు, వైశంపాయనుడు, హరీతుడు అనే ఆరుగురు రోమహర్షణుని నుండి పురాణాలు నేర్చుకుని, పురాణ ప్రవక్తలుగా ప్రసిద్ధులు అయ్యారు. - :వంశం - ఋషి;:::::::పద్య సం.(లు) - 12-30-వ.,

[ ⇑ ] :192) కశ్యపుడు-4 (పురుష){సంజ్ఞా}[ఋషి]:- ఇతడు మార్గశీర్ష (సహో) మాసంలో సూర్యుని అనుచరులలోని ఋషి.
సూర్యుడు ఈ మాసంలో అర్యమ (మూలం అంశువు) అను పేరుతో, ఊర్వశి, కశ్యపుడు, మహాశంఖుడ, విద్యుచ్ఛత్రుడు, ఋతసేనుడు, తార్క్ష్యుడు మున్నగువారు అనుచరులుగా కలిగి సంచరిస్తాడు. - :వంశం - ఋషి;:::::::పద్య సం.(లు) - 12-41-వ., నుండి 12-45-వ., వరకు,

[ ⇑ ] :193) కశ్యపుడు-5 (పురుష){సంజ్ఞా}[ఋషి]:- ఋషి, ఇతనికి తార్క్షుడు అను నామాంతరం కలదు. ఇతడు బ్రహ్మ మానసపుత్రుడైన మరీచి మహర్షికి కర్దమపుత్రి కళ యందు పుట్టాడు. ఇతని సోదరి పూర్ణిమ. ఇతని భార్యలు అదితి; దితి; కాష్ట; దనువు; అరిష్ట; తామ్ర; క్రోధవశ; సురస; సురభి; ముని; తిమి; ఇల; సరమ అని పదముగ్గురు దక్షపుత్రికలు; మఱియు వినత; కద్రువ; పతంగి; యామిని అని నలుగురు దక్షపుత్రికులు. అనువు; ప్రాతః మఱియు వైశ్వానరుని పుత్రికలు పులోమ; కాలక. ఇతనికి అదితి యందు ద్వాదశాదిత్యులు; దితి యందు హిరణ్యాక్షుడు హిరణ్యకశిపుడు అను దైత్యులు; దనువు యందు పద్దెనిమిది మంది (18) దానవులు; అరిష్ట యందు గంధర్వులు; తామ్ర యందు డేగలు, గద్దలు; క్రోధవశ యందు భయంకరమైన సర్పాలు; సురస యందు యాతుధానులు; సురభి యందు మహిషాది సురభులు; ముని యందు అప్సరసలు; తిమి యందు తిమింగలాది జలచరాలు; ఇళ యందు వృక్షాలు; సురమ యందు శునకాలు; వినత యందు అనూరుడు, గరుత్మంతుడు; కద్రువ యందు నాగులు; పతంగి యందు పక్షులు; యామిని యందు శలభాలు పుట్టారు. అనువు యందు సిద్ధులు; ప్రాతః యందు గంధర్వులు పుట్టారు. వైశ్వానర పుత్రకలైన పులోమకు పౌలోములు అనేడి దానవులు, కాలకకు కాలకేయులు అనెడి దానవులు పుట్టారు.
ఒక సాయం సంధ్యా సమయంలో మంచిది కాదు అని చెప్తున్నా రెండవ భార్య దితి కోరి కవియగా, హిరణ్యకశిపుడు, హిరణ్యాక్షుడు అను దైత్యులు పుట్టారు.
దితికి భర్త కశ్యపుని వలన సప్తసప్తకంబైన నలభైతొమ్మిది (49) మంది మరుత్తుల మరుద్గణం పుట్టింది. అదెలాగ అంటే, దితి తన సౌజన్య, సేవలతో పతి కశ్యపుని వశుని చేసుకొని ఇంద్రుని జయించగల అమరుడైన పుత్రుని కోరింది. కశ్యపుడు పుంసవన వ్రతం చేయ్యి కోరిక తీరుతుంది అని అనుగ్రహించాడు. ఇది కాచుకుని ఉన్న ఇంద్రుడు, ఆమె వ్రత భంగం కావడం చూసి, ఆమె గర్భంలో ప్రవేసించి పిండాన్ని ఏడు ముక్కలు చేసాడు. ఇంకా బ్రతికే ఉండటంతో మరల ఏడేసి ఖండాలు చేసాడు. ఆ ఖండాలు అన్నీ ఇంద్రునికి అనుకూలంగా ఉంటామని మరుత్తులు అను దేవతలు అయ్యారు.
బలి ఇంద్రాదులను జయించడంతో, వారందరూ నానా బాధలు పడసాగారు. అదితి కశ్యపుని వేడి అతను చెప్పిన పయోభక్షణ వ్రతము ఆచరించి, వామనుని కన్నది. ఈ కశ్యపుడే మరుజన్మలో వసుదేవుడు అయి కృష్ణుని కన్నాడు.
కశ్యపునికి దక్షాత్మజ అయిన అదితికి సూర్యుడు పుట్టాడు. - :వంశం - ఋషి;:తండ్రి - మరీచి;:తల్లి - కళ ;:భార్య - అదితి; దితి; కాష్ట; దనువు; అరిష్ట; తామ్ర; క్రోధవశ; సురస; సురభి; ముని; తిమి; ఇల; సరమ; వినత; కద్రువ; అనువు; ప్రాతః; పులోమ; కాలక;::కొడుకు(లు) - ఆదిత్యులు మంది; దైత్యులు; దానవులు; గంధర్వులు; డేగలు, గద్దలు; భయంకరమైన సర్పాలు; యాతుధానులు; సురభులు; అప్సరసలు; తిమింగిలాది జలచరాలు; వృక్షాలు; శునకాలు; అనూరుడు; గరుత్మంతుడు; నాగులు; సిద్ధులు; గంధర్వులు; పౌలోములు; కాలకేయులు;::పద్య సం.(లు) - 3-451-సీ., నుండి 3-610-వ., వరకు, 4-7-సీ., 8-480-వ., నుండి 8-512-ఆ., వరకు; 9-8-సీ., 6-252., 10.1-132-క.,

[ ⇑ ] :194) కశ్యపుడు-6 (పురుష){సంజ్ఞా}[ఋషి]:- ఏడవది ప్రసుతం నడుస్తున్నది అయిన వైవశ్వత మన్వంతరంలో సప్తర్షులలో ఒకడు. అ సప్త ఋషులు ఏడుగురు గౌతముడు, కశ్యపుడు, అత్రి, విశ్వామిత్రుడు, జమదగ్ని, భరద్వాజుడు, వసిష్టుడు. - :వంశం - ఋషి;:::::::పద్య సం.(లు) - 8-412-వ.,

[ ⇑ ] :195) కశ్యపుడు-7 (పురుష){సంజ్ఞా}[ఋషి]:- కశ్యపుడూ, గౌతముడూ, అత్రీ, విశ్వామిత్రుడు, జమదగ్నీ, భరద్వాజుడూ, వసిష్టుడూ ఏడవవదీ ప్రస్తుతపుది అయిన వైవశ్వతమన్వంతరంలో సప్త ఋషులు. - :వంశం - ఋషి;:::భార్య - అదితి;::కొడుకు(లు) - వామనుడు;::పద్య సం.(లు) - 8-412-వ.,

[ ⇑ ] :196) కశ్యపుడు-8 (పురుష){సంజ్ఞా}[ఋషి]:- పరశురాముని నుండి మధ్యప్రదేశాన్ని దానంపొందిన ఋషి,
పరశురాముడు శమంత పంచకం వద్ద క్షత్రియ రక్తాలతో తొమ్మిది మడుగులు చేసాడు. యాగం చేసి హోతకు తూర్పుదిక్కు, బ్రహ్మకు దక్షిణపు దిక్కు, అధ్వరునికి పశ్చిమ దిక్కు, ఉద్గాతకు ఉత్తర దిక్కు మిగిలిన వారికి మూలలను, కశ్యపునకు మధ్యదేశాన్ని, ఉపద్రష్టకు ఆర్యావర్తం, సదస్యులకు మిగిలిన ప్రదేశాలు ఇచ్చాడు. - :వంశం - ఋషి;:::::::పద్య సం.(లు) - 9-397-వ.,

[ ⇑ ] :197) కషదేశరాజులు- (పురుష){జాతి}[చంద్రవంశం]:- భరతుడు తన దిగ్విజయ యాత్రలో ఓడించిన రాజులలోని వారు. అలా ఓడించిన రాజులు శక, శబర, బర్బర, కష, కిరాతక, హూణ, మ్లేచ్ఛ దేశాల రాజులను ఓడించాడు. - :వంశం - చంద్రవంశం;:::::::పద్య సం.(లు) - 6-635-వ.,

[ ⇑ ] :198) కసుడు- (పురుష){సంజ్ఞా}[చంద్రవంశం]:- ఇతడు కృష్ణునికి నాగ్నజిత్తికి పుట్టిన పదిమంది (10) కొడుకులలో ఒకడు - :వంశం - చంద్రవంశం;:తండ్రి - కృష్ణుడు;:తల్లి - నాగ్నజిత్తి;:::::పద్య సం.(లు) - 10.1-275-వ.,

[ ⇑ ] :199) కసువనమంత్రి- (పురుష){సంజ్ఞా}[ఏర్చూరి]:- వీరు భాగవతపురాణంలో షష్ఠస్కంధం ఆంధ్రీకరించిన ఏర్చూరి సింగయగారి తండ్రి. శ్రీవత్సగోత్రంలో ఏర్తూరి వంశంలో నాదయామాత్యులు పోలమాంబలకు కలిగిన పెద్దకొడుకు. వీరి తమ్ముళ్ళు వీరన్న, సింగన్న. నాదయకు భార్య పోలమాంబ యందు, సింగయ, తెలగయ అని ఇద్దరు కొడుకులను కలిగారు. వారిలో పెద్దవాడు సింగయ ఆంధ్రీకరించిన షష్ఠస్కంధం పోతన భాగవతంలో చోటు సంపాదించుకుంది. - :వంశం - ఏర్చూరి;:తండ్రి - నాదయామాత్యుడు;:తల్లి - పోలమాంబ;:భార్య - ముమ్మడమ్మ;::కొడుకు(లు) - సింగయ, తెలగయ;::పద్య సం.(లు) - 6-26-సీ., 6-28-క.,

[ ⇑ ] :200) కహ్వుడు,- (పురుష){సంజ్ఞా}[చంద్రవంశం]:- ఇతడు కంసుని ఎనమిది మంది తమ్ముళ్ళలో ఒకడు. ఉగ్రసేనుని కొడుకులలో ఒకడు. కంస వధానంతరం, బలరామ కృష్ణుల చేతిలో చనిపోయారు, - :వంశం - చంద్రవంశం;:తండ్రి - ఉగ్రసేనుడు;::::::పద్య సం.(లు) - 9-714-వ., 10.1-1382-శా.,

[ ⇑ ] :201) కాంచన-1 ( -){జాతి}[వృక్ష]:- కాంచన అంటే సంపెంగ చెట్లు కాంచన (సంపంగి) అని బంగారు అని నానార్ర్థాలు ఉన్నాయి. ఈ పదం ప్రథమ స్కంధలో నైమిశారణ్య వర్ణన సందర్భంలో కురుపాండవుల యుద్ధం} కు ఉపమాన పదంగా వాడబడింది. - :వంశం - వృక్ష;:::::::పద్య సం.(లు) - 1-39-వ.,

[ ⇑ ] :202) కాంచన-2 ( -){జాతి}[సంపద]:- కాంచన అంటే బంగారు అని సంపెంగ చెట్లు కాంచన (సంపంగి) అని నానార్ర్థాలు ఉన్నాయి. ఈ పదం ప్రథమ స్కంధలో నైమిశారణ్య వర్ణన సందర్భంలో కురుపాండవుల యుద్ధం} ఉపమాన పదంగా వాడబడింది. - :వంశం - సంపద;:::::::పద్య సం.(లు) - 1-39-వ.,

[ ⇑ ] :203) కాంచన -1 ( -){జాతి}[వృక్ష]:- కాంచన అంటే ఉమ్మెత్త - ఇవి అష్టమ స్కంధములోని త్రికూట పర్వతములో వర్ణించబడ్డాయి - :వంశం - వృక్ష;:::::::పద్య సం.(లు) - 8-23-సీ., 8-24-వ., 8-25-క.,

[ ⇑ ] :204) కాంచన -2 ( -){జాతి}[వృక్ష]:- బంగారుకాంతితోకూడిన కలువలు - ఇవి అష్టమ స్కంధములోని త్రికూట పర్వతములో వర్ణించబడ్డాయి - :వంశం - వృక్ష;:::::::పద్య సం.(లు) - 8-23-సీ., 8-24-వ., 8-25-క.,

[ ⇑ ] :205) కాంచనలోచనుడు- (పురుష){సంజ్ఞా}[రాక్షస యోని]:- కాంచనలోచనుడు హిరణ్యాక్షుని పేరు. కశ్యపుని వలన భార్య దితి గర్భంలో ముందు పడ్డవాడు ‘హిరణ్యకశిపుడు’, ముందుగా పుట్టిన వాడు ‘హిరణ్యాక్షుడు’. - :వంశం - రాక్షస యోని;:తండ్రి - కశ్యపుడు ;:తల్లి - దితి;:::::పద్య సం.(లు) - 3-611-చ.,

[ ⇑ ] :206) కాంచనుడు- (పురుష){సంజ్ఞా}[చంద్రవంశం]:- ఇతను చంద్రవంశంలోని పురూరవుని మనుమడు, పురూరవునికి అప్సరస ఊర్వశి యందు కలిగిన ఆరుగురులో (6) ఆరవ కొడుకైన భీముని కొడుకు. ఇతని కొడుకు హోత్రకుడు, ఇతని ద్వారా కలిగిన మనుమడు జహ్నువు. ఈ జహ్నువు గంగాప్రవాహాన్ని పుక్కిట పట్టిన మహానుభావుడు. - :వంశం - చంద్రవంశం;:తండ్రి - భీముడు;::::కొడుకు(లు) - హోత్రకుడు;::పద్య సం.(లు) - 9-422-వ.,

[ ⇑ ] :207) కాండము- ( -){జాతి}[వృక్ష]:- కలువల తూడు - :వంశం - వృక్ష;:::::::పద్య సం.(లు) - 8-49-సీ.,

[ ⇑ ] :208) కాండర్షులూ- (పురుష){జాతి}[ఋషి]:- పరీక్షిత్తు గంగానది ఒడ్డున ప్రాయోపవిష్టుడై ఉన్నాడని విని, వచ్చిన ఋషులలో ఈయన ఒకరు. - :వంశం - ఋషి;:::::::పద్య సం.(లు) - 1-499-వ.,

[ ⇑ ] :209) కాంతి- (పురుష){జాతి}[శక్తి]:- అక్రూరునికి యమునా జలాలో దర్శనం ఇచ్చిన కృష్ణుని సేవించు వారిలో ఒకరు.
లక్ష్మి, పుష్టి, తుష్టి, కీర్తి, కాంతి, ఇల, ఊర్జ, విద్య, అవిద్య, శక్తి, మాయ మున్నగు తేజోమూర్తులు శక్తులచే సేవింపబడేవాడు అక్రూరునికి దర్శనం ఇచ్చాడు. - :వంశం - శక్తి;:::::::పద్య సం.(లు) - 10.1-1235-వ.,

[ ⇑ ] :210) కాంతిధరుడు- (పురుష){సంజ్ఞా}[దైవ యోని]:- విష్ణువు, కాంతి (ప్రకాశమును) ధరుడు (ధరించువాడు), విష్ణువు - :వంశం - దైవ యోని;:::::::పద్య సం.(లు) - 6-530-తో.,

[ ⇑ ] :211) కాందిని- (స్త్రీ){సంజ్ఞా}[చంద్రవంశం]:- ఈమె కాందిని శ్వఫల్కుని (పృశ్ని కొడుకు) భార్య, అక్రూరుని తల్లి.
కాశీరాజు తన రాజ్యంలో వర్షాలు కురవనప్పుడు అక్రూరుడి తండ్రి అయిన శ్వఫల్కుని తీసుకుని వెళ్ళి కాందిని అనే తన కూతురును ఇచ్చి వివాహంచేసి సత్కరించేడు. అప్పుడు కాశీరాజ్యంలో వానలు కురిశాయి. - :వంశం - చంద్రవంశం;:::::కొడుకు(లు) - అక్రూరుడు;::పద్య సం.(లు) - 9-712-వ., 10.2-96-సీ.,

[ ⇑ ] :212) కాంపిల్య- (పురుష){సంజ్ఞా}[చంద్రవంశం]:- చంద్రవంశంలో రంతిదేవుని తరువాతి తరాలలోని భర్మ్యాశ్వునకు ముద్గల, అవీనర, బృహదిషుడు, కాంపిల్యుడు, సృంజయుడు అనే ఐదుగురు కొడుకులు. వారిలో అయిదవవాడు ఈ కాంపిల్యుడు. - :వంశం - చంద్రవంశం;:తండ్రి - భర్మ్యాశ్వుడు;::::::పద్య సం.(లు) - 9-655-వ.,

[ ⇑ ] :213) కాక - ( -){జాతి}[పక్షి]:- కాకులు - ఇవి అష్టమ స్కంధములోని త్రికూట పర్వతములో వర్ణించబడ్డాయి - :వంశం - పక్షి;:::::::పద్య సం.(లు) - 8-23-సీ., 8-24-వ., 8-25-క.,

[ ⇑ ] :214) కాకము- (స్త్రీ){జాతి}[గగనచర]:- కాకము అంటే కాకి అనే విహంగము. బలి దేవేంద్రుల నేతృత్వంలో జరిగిన సురాసుర యుద్ధంలో రాక్షసులు వీటిని వాహనాలుగా వాడారు. - :వంశం - గగనచర;:::::::పద్య సం.(లు) - 8-327-క., నుండి 8-334-వ., వరకు,

[ ⇑ ] :215) కాకముఖం- ( -){సంజ్ఞా}[పర్వతం]:- భారతవర్షంలోని ఒక ప్రసిద్ధమైన పర్వతం. - :వంశం - పర్వతం;:::::::పద్య సం.(లు) - 5.2-55-వ.,

[ ⇑ ] :216) కాకవర్ణుడు- (పురుష){సంజ్ఞా}[రాజుల ఉత్పత్తి]:- భవిష్యత్తులో పుట్టబోయే రాజులో శిశునాగుడు అను రాజు కొడుకు కాకవర్ణుడు - :వంశం - రాజుల ఉత్పత్తి;:::::::పద్య సం.(లు) - 12-4-వ.,

[ ⇑ ] :217) కాణ్వులు- (పురుష){జాతి}[ఋషి]:- కాణ్వులు, మాధ్యందినులు మొదలయినవారు వాజసనేయశాఖ శాఖలో ఉండే యజుస్సంహితలను స్వీకరించి అభ్యసించారు.. - :వంశం - ఋషి;:::::::పద్య సం.(లు) - 12-30-వ.,

[ ⇑ ] :218) కాత్యాయని- (స్త్రీ){సంజ్ఞా}[దైవ యోని]:- పార్వతీదేవి, గోపికలు కాత్యాయనీ వ్రతం చేపట్టినప్పుడు, కృష్ణుడు గోపికావస్త్రాపహరణ చేశాడు.
గోపికలు "కాత్యయని! దయతో మా కందరికీ శీఘ్రంగా శ్రీకృష్ణుణ్ణి పతిగా ప్రసాదించమ్మా అని ప్రార్థించారు. - :వంశం - దైవ యోని;:::::::పద్య సం.(లు) - 10.1-808-వ., 10.2-809-క.,

[ ⇑ ] :219) కానీనుడు-1 (పురుష){సంజ్ఞా}[సూర్యవంశం]:- అగ్నివేశుడు, జాతకర్ణుడు, కానీనుడు (కన్యకు పుట్టినవాడు) అను పేర్లతో ప్రసిద్దుడైన ఇతడు దేవదత్తుడి కొడుకు, ఇతడు గొప్ప ఋషి. ఇతని యందు అగ్నివేశ్యాయనం అను బ్రాహ్మణకులం ఏర్పడింది. - :వంశం - సూర్యవంశం;:::::::పద్య సం.(లు) - 9-42-వ.,

[ ⇑ ] :220) కానీనుడు-2 (పురుష){సంజ్ఞా}[చంద్రవంశం]:- కర్ణుడు, కుంతి చిన్ననాట సూర్యుని వలన పుట్టిన పిల్లవాడిని పెట్టిలో పెట్టి గంగానదిలో విడిచిపెట్టింది. ఆ పెట్టిలోని పిల్లాడిని అతిరథుడు కనుగొని కర్ణుడు అంటూ పెంచుకున్నాడు - :వంశం - చంద్రవంశం;:తండ్రి - అతిరథుడు పెంపుడు తండ్రి;:తల్లి - రాధ పెంపుడు తల్లి , కుంతి కన్న తల్లి;:::::పద్య సం.(లు) - 9-698-క., 9-699-వ.,

[ ⇑ ] :221) కాపాలికులు- (పురుష){జాతి}[మానవ యోని]:- ఇంద్రుడు పృథుచక్రవర్తి నూరవ అశ్వమేథంలో యజ్ఞాశ్వాన్ని దొంగిలించటం కోసం ధరించి విడిచిన అమంగళకరాలైన మాయారూపాలను మూర్ఖులైన మానవులు గ్రహించారు. ఆ రూపాలు పాషండ చిహ్నాలు యందలి జడలు ఎముకలు భస్మం ధరించే కాపాలికులు మొదలైనవారు పాషండులు ధరించారు. - :వంశం - మానవ యోని;:::::::పద్య సం.(లు) - 4-524-సీ,

[ ⇑ ] :222) కామకోటి- ( -){సంజ్ఞా}[ప్రదేశం]:- బలరాముడు తీర్థయాత్ర యందు ఇక్కజి శక్తిని సేవించాడు. - :వంశం - ప్రదేశం;:::::::పద్య సం.(లు) - 10.2-951-వ.,

[ ⇑ ] :223) కామగమనులు- (పురుష){జాతి}[దైవ యోని]:- భవిష్యత్తులోది, పదకొండవది అయిన ధర్మసావర్ణి మన్వంతరంలో విహంగములూ, కామగమనులూ, నిర్వాణచరులూ దేవతలు అవుతారు. వైధృతుడు ఇంద్రుడు అవుతాడు. వరుణుడూ మొదలైనవారు సప్తఋషులు అవుతారు. - :వంశం - దైవ యోని;:::::::పద్య సం.(లు) - 8-421-వ.,

[ ⇑ ] :224) కామదేవి- (స్త్రీ){సంజ్ఞా}[దైవ యోని]:- దీపవతి కామాదేవిని బలరాముడు తన తీర్థయాత్రలలో దర్శించాడు. తరువాత తాపి యందలి పయోష్ఠి నదిని దర్శించి, నిర్వింద్యను దాటాడు. - :వంశం - దైవ యోని;:::::::పద్య సం.(లు) - 10.2-953-వ.,

[ ⇑ ] :225) కామదేవుడు- (పురుష){సంజ్ఞా}[దైవ యోని]:- కేతుమాలవర్షంలో దేవుడు శ్రీదేవిని సంతోషపెట్టే కామదేవుడు. శ్రీదేవి ప్రజాపతి పుత్రికలు, పుత్రులు అయిన రాత్రులతో, పగళ్ళతో కూడి కామదేవుణ్ణి ఆరాధిస్తూ ఉంటుంది.
కామదేవుని నుండి సనత్కుమారుడు కాపాడు గాక అని విశ్వరూపుడు దేవేంద్రునికి ఉపదేశించిన శ్రీమన్నారాయణ కవచంలో ఉన్న నలభైతొమ్మిది స్తుతులలో ఇది ఒకటి.
సాగరమథనం తరువాత జరిగిన సురాసుర యుద్ధంలో కామదేవుడు, దుర్మర్షణునితో యుద్ధం చేసాడు. - :వంశం - దైవ యోని;:::::::పద్య సం.(లు) - 5.2-43-వ., 6-307-వ., 8-327-క., నుండి 8-334-వ., వరకు,

[ ⇑ ] :226) కామధేనువు- (స్త్రీ){సంజ్ఞా}[దైవ యోని]:- కోరినకోరికలు తీర్చగలిగిన గోవు; దీనిని సురభి అని కూడ అంటారు. సాగరమథన సమయంలో రెండవ వస్తువుగా కామధేనువు పుట్టింది. స్వర్గపురి వర్ణనలో కల్పవృక్షాలు కామధేనువులకు నీడనిస్తున్నాయి అని వర్ణించారు, ధేనువు లందు కామధేనువు శ్రేష్ఠమైనది. - :వంశం - దైవ యోని;:::::::పద్య సం.(లు) - 8-252-క., 8-253-ఆ., 8-447-వ., 9-230-వ., , 10.1-626-క., 10.1-948-వ., 11-105-వ,

[ ⇑ ] :227) కామపాలుడు- (పురుష){సంజ్ఞా}[చంద్రవంశం]:- కామపాలుడు అంటే బలరాముడు. - :వంశం - చంద్రవంశం;:::::::పద్య సం.(లు) - 10.2-357-ఉ., 10.2-404-వ., 10.2-945-క.,

[ ⇑ ] :228) కామశాస్త్రము- ( -){సంజ్ఞా}[విద్య]:- కామశాస్త్రము అంటే రతితంత్రము - :వంశం - విద్య;:::::::పద్య సం.(లు) - 3-807-వ., ,

[ ⇑ ] :229) కామినులు- (స్త్రీ){జాతి}[రాక్షస యోని]:- బలాసురుని ఆవులింతల నుండి పుట్టిని స్వైరిణులు, కామినులు, పుంశ్చలులు అనే స్త్రీలు పాతాళంలో ప్రవేశించిన పురుషునికి హాటకరసం అనే సిద్ధ రసఘుటికను ఇచ్చి అతనిని వాడుకుంటారు - :వంశం - రాక్షస యోని;:::::::పద్య సం.(లు) - 5.2-109-చ.,

[ ⇑ ] :230) కాముడు-1 (పురుష){సంజ్ఞా}[దైవ యోని]:- కాముడు అంటే మన్మథుడు., విరాట్పురుషుడు తన మాయను ధ్యానించేటప్పుడు కామానికి, సంకల్పాదులకు స్థానమైన హృదయం పుట్టింది. ఆ హృదయం నుండి మనస్సు, చంద్రుడు, కాముడు, సంకల్పము పుట్టాయి. - :వంశం - దైవ యోని;:::::::పద్య సం.(లు) - 2-269-వ., 3-377-సీ.,

[ ⇑ ] :231) కాముడు-2 (పురుష){సంజ్ఞా}[దక్షుని వంశం]:- దక్షపుత్రిక సంకల్ప మనుమడు ఈ కాముడు. దక్షునికి అసిక్ని యందు కలిగిన పదిమంది (10) కూతురులలో తొమ్మిదవది (9) అయిన 9 సంకల్పకు సంకల్పుడు జన్మించాడు. ఆ సంకల్పునకు కాముడు పుట్టాడు. - :వంశం - దక్షుని వంశం;:తండ్రి - సంకల్పుడు;::::::పద్య సం.(లు) - 6-254-వ.,

[ ⇑ ] :232) కారండవ - ( -){జాతి}[నీటిపక్షులు]:- కారండవములు - ఇవి అష్టమ స్కంధములోని త్రికూట పర్వతములో వర్ణించబడ్డాయి - :వంశం - నీటిపక్షులు;:::::::పద్య సం.(లు) - 8-23-సీ., 8-24-వ., 8-25-క.,

[ ⇑ ] :233) కారూశకులు- (పురుష){జాతి}[సూర్యవంశం]:- కారూశులు, కారూశకులు నామాంతరములు. ప్రస్తుత మన్వంతరంలోని మనువు వైవశ్వతుని పుత్రుడైన కరూశుడికి (కరూశకునికి) కారూశులు (కారూశకులు) అను రాజులు పుట్టారు. వారు వేద ధర్మములు అందు ప్రీతితో బ్రాహ్మణప్రియులు అయ్యి ఉత్తరదిక్కు రాజ్యాలు పాలించారు. మనువుకు సుద్యుమ్నుడు వానప్రస్థానికి వెళ్ళాక కలిగిన 1. ఇక్ష్వాకుడు, పృషధ్రుడు, కవి, కరూశుడు, దృష్ఠుడు, నృగుడు, ప్రతీతుడు, అరిష్యంతుడు, నభగుడు, కవి అను పదిమంది (10) పుత్రులలో నాలుగవ వాడు (4) ఈ కరూశుడు. - :వంశం - సూర్యవంశం;:తండ్రి - కరూశకుడు;::::::పద్య సం.(లు) - 8-42-వ., 9-9-వ., 9-42-వ.,

[ ⇑ ] :234) కారూశులు- (పురుష){జాతి}[సూర్యవంశం]:- కారూశులు, కారూశకులు నామాంతరములు. ప్రస్తుత మన్వంతరంలోని మనువు వైవశ్వతుని పుత్రుడైన కరూశుడికి (కరూశకునికి) కారూశులు (కారూశకులు) అను రాజులు పుట్టారు. వారు వేద ధర్మములు అందు ప్రీతితో బ్రాహ్మణప్రియులు అయ్యి ఉత్తరదిక్కు రాజ్యాలు పాలించారు. మనువుకు సుద్యుమ్నుడు వానప్రస్థానికి వెళ్ళాక కలిగిన 1. ఇక్ష్వాకుడు, పృషధ్రుడు, కవి, కరూశుడు, దృష్ఠుడు, నృగుడు, ప్రతీతుడు, అరిష్యంతుడు, నభగుడు, కవి అను పదిమంది (10) పుత్రులలో నాలుగవ వాడు (4) ఈ కరూశుడు. - :వంశం - సూర్యవంశం;:తండ్రి - కరూశుడు;::::::పద్య సం.(లు) - 8-42-వ., 9-9-వ., 9-42-వ.,

[ ⇑ ] :235) కారూషకుడు- (పురుష){సంజ్ఞా}[చంద్రవంశం]:- కుంతీదేవి చెల్లెలు శ్రుతదేవను కారూషదేశపురాజు వృద్ధశర్మ వివాహమాడాడు. వారికి ఋషి శాపం వలన దంతవక్త్రుడు అనె రాక్షసుడు పుట్టాడు. - :వంశం - చంద్రవంశం;:::::::పద్య సం.(లు) - 9-722-వ., ,

[ ⇑ ] :236) కార్తవీర్యార్జునుడు- (పురుష){సంజ్ఞా}[చంద్రవంశం]:- ధనుర్ధరాగ్రేసరుడు.
చంద్రవంశంలో హైహయ వంశపు రాజు. ఇతడు దత్తాత్రేయుని పూజించి, అతని వలన శత్రు జయం, వెయ్యి చేతులు, అఖండమైన ఇంద్రియ పటుత్వం మున్నగునవి పొందాడు. రేవానదికి వెళ్ళి తన చేతులతో నీటిని ఆపేసాడు. ఆ నీరు రావణునిమీదకు ఎగజిమ్మాయి. పోరానికి వచ్చిన రావణుని బంధించి సిగ్గుపుచ్చి వదిలాడు.
వేటకి వెళ్ళినపుడు జమదగ్ని ఆశ్రమంలో చక్కటి ఆతిథ్యం సమకూర్చిన వారి హోమధేనువును పట్టుకుపోయాడు. జమదగ్నిపుత్రుడైన పరశురాముడు కోపించి, కార్యవీర్యార్జనుని సంహరించాడు. అతని పదివేల మంది కొడుకులు పారిపోయారు. వారు పగతీర్చుకోడానికి అదనుచూసి, జమదగ్ని ఋషిన సంహరించారు. పరశురాముడు ఇరవైయొక్క మార్లు దండయాత్ర చేసి రాజులను అందరిని సంహరించాడు. అలా కార్తవీర్యుని కొడుకులలో జయద్వజుడు, శూరసేనుడు, వృషణుడు, మధువు, ఊర్జితుడు అనెడి అయిదుగురు మాత్రమే బ్రతికారు.
చంద్రవంశపు యదువు వంశంలో విష్ణుమూర్తి అంశతో, కృతవీర్యునికి కొడుకుగా అర్జునుడు పుట్టాడు. - :వంశం - చంద్రవంశం;:తండ్రి - కృతవీర్య;::::కొడుకు(లు) - వెయ్యి మంది పుత్రులు పరశురాముని బారి తప్పి బతికిన వారు ఐదుగురు వారు జయధ్వజుడు, శూరసేనుడు, వృషణుడు, మథువు, ఊర్జితుడు;::పద్య సం.(లు) - 1-293-వ., 9-431-సీ., నుండి 9-486-ఆ వరకు, 9-700-చ., నుండి 9-703-వ., వరకు.,

[ ⇑ ] :237) కార్తికేయుడు- (పురుష){సంజ్ఞా}[దైవ యోని]:- కార్తికేయుడు అంటే కుమారస్వామి. - :వంశం - దైవ యోని;:::::::పద్య సం.(లు) - 6-178-సీ.,

[ ⇑ ] :238) కార్తీక (ఊర్జ)- ( -){సంజ్ఞా}[కాలం]:- సూర్యుడు ఈ మాసంలో విష్ణువు అను పేరుతో, రంభ, విశ్వామిత్రుడు, యశ్వతరుడు, మఘాపేతుడు, సూర్యవర్చసుడు, సత్యజిత్తు మున్నగువారు అనుచరులుగా కలిగి సంచరిస్తాడు. - :వంశం - కాలం;:::::::పద్య సం.(లు) - 12-41-వ., నుండి 12-45-వ., వరకు,

[ ⇑ ] :239) కార్ముకుడు- (పురుష){సంజ్ఞా}[మానవ యోని]:- మహాపద్మునికి సుమాల్యుడు మున్నగు తనయులు ఎనమండుగురు పుడతారు. వారి పాలన వందసంవత్సరాలపాటు సాగుతుంది. అటుపిమ్మట కార్ముకుడు మొదలయిన రాజులు తొమ్మండుగురు పుడతారు. వారిని నవనందులు అని అంటారు. ఆ నవనందులను ఒక విప్రశ్రేష్ఠుడు అంతరింప జేస్తాడు. నందులు లేకపోవడంచేత కొంతకాలం మౌర్యులు పరిపాలన చేస్తారు. నందులను తొలగించిన ఆ విప్రోత్తముడు చంద్రగుప్తుని అభిషేక్తుని చేసి రాజ్యాన్ని అప్పగిస్తాడు. - :వంశం - మానవ యోని;:::::::పద్య సం.(లు) - 12-4-వ,

[ ⇑ ] :240) కాఱెనుబోతు- (స్త్రీ){జాతి}[జంతు]:- అడవిదున్న - :వంశం - జంతు;:::::::పద్య సం.(లు) - 8-35-మ.,

[ ⇑ ] :241) కాలక- (స్త్రీ){సంజ్ఞా}[రాక్షస యోని]:- ఈమె వైశ్వానరుని పుత్రిక.
దానువుడైన (దనువుపుత్రుడు) వైశ్వానరునికి ఉపదానవి, హయశిర, పులోమ, కాలక అనే నలుగురు కుమార్తెలు కలిగారు. వారిలో ఉపదానవి హిరణ్యాక్షునికి భార్య అయింది. హయశిరను క్రతువు వివాహం చేసుకున్నాడు. పులోమ, కాలక అనే ఇద్దరిని బ్రహ్మదేవుని ఆజ్ఞానుసారం కశ్యప ప్రజాపతి భార్యలుగా స్వీకరించాడు. పులోమకు పౌలోముడు, కాలకకు కాలకేయుడు పుట్టారు. వారు యుద్ధనిపుణులైన దానవులు. ఆ ఇద్దరికి అరవై వేలమంది రాక్షసులు జన్మించారు. వారు యజ్ఞకార్యాలకు ఆటంకం కలిగిస్తుండగా అర్జునుడు వారిని సంహరించి ఇంద్రునికి సంతోషాన్ని కలిగించాడు. - :వంశం - రాక్షస యోని;:తండ్రి - వైశ్వానరుడు;:::భర్త - కశ్యప ప్రజాపతి;:కొడుకు(లు) - కాలకేయులు;::పద్య సం.(లు) - 6-258-వ.,

[ ⇑ ] :242) కాలకన్య- (స్త్రీ){సంజ్ఞా}[దైవ యోని]:- పురంజనుని కథ అనే ప్రతీకాత్మక కథలో చెప్పబడిన కాలుని పుత్రిక. భయనామ యవనేశ్వరునితో ప్రజ్వారునితో సోదరభావంతో కూడి జననాశనం చేస్తూ ఉంటుంది. చివరికి పురంజనుని ఆక్రమించి అతనిని చంపింది. - :వంశం - దైవ యోని;:::::::పద్య సం.(లు) - 4-811-క., నుండి 4-829-వ., వరకు,

[ ⇑ ] :243) కాలకన్యక- (స్త్రీ){సంజ్ఞా}[దైవ యోని]:- కాలపుత్రిక లేదా కాలకన్యక వరుని కోరి అన్ని లోకాలలోను తిరుగుతూ, రాజర్షి యయాతి కొడుకు పూరునిచే వరింపబజింది. కానీ తన దౌర్భాగ్యం చేత "దుర్భగ" అని పేరుబడింది. తరువాత ఎవరూ ఆమెను వరించలేదు. పిమ్మట నారదుని సూచన మేరకు, ఆమె భయుడు అను పేరు గల యవనేశ్వరుని వరించమని కోరింది. అతను అంగీకరించక సోదరభావం చూపి, తన సోదరుడగు ప్రజ్వారునితో కలిసి తిరుగుతూ కర్మనిర్మితమైన లోకాన్ని అనుభవించు అన్నాడు. తరువాత సమయం వచ్చినప్పుడు పురంజనుని పురాన్ని ఈమె బలవంతంగా అనుభవించింది. - :వంశం - దైవ యోని;:::::::పద్య సం.(లు) - 4-811-క, 4-817-వ.,

[ ⇑ ] :244) కాలకి- (స్త్రీ){సంజ్ఞా}[దక్ష వంశం]:- రసాతలంలో దైత్యులు, దానవులు అయిన హిరణ్యపురవాసులు, నివాతకవచులు, కాలకేయులు - :వంశం - దక్ష వంశం;::::భర్త - కశ్యపుడు;:కొడుకు(లు) - కాలకేయులు;::పద్య సం.(లు) - 5.2-119-వ.,

[ ⇑ ] :245) కాలకేయులు- (పురుష){జాతి}[రాక్షస యోని]:- వీరు దానవులు; వైశ్వానరుని పుత్రిక కాలక యందు కశ్యప ప్రజాపతికి కలిగినవాడు కాలకేయుడ అతను అతని సంతానం కాలకేయులు.
దానవుడైన (దనువుపుత్రుడు) వైశ్వానరునికి ఉపదానవి, హయశిర, పులోమ, కాలక అనే నలుగురు కుమార్తెలు కలిగారు. వారిలో ఉపదానవి హిరణ్యాక్షునికి భార్య అయింది. హయశిరను క్రతువు వివాహం చేసుకున్నాడు. పులోమ, కాలక అనే ఇద్దరిని బ్రహ్మదేవుని ఆజ్ఞానుసారం కశ్యప ప్రజాపతి భార్యలుగా స్వీకరించాడు. పులోమకు పౌలోముడు, కాలకకు కాలకేయుడు పుట్టారు. వారు యుద్ధనిపుణులైన దానవులు. ఆ ఇద్దరికి అరవై వేలమంది రాక్షసులు జన్మించారు. వారు యజ్ఞకార్యాలకు ఆటంకం కలిగిస్తుండగా అర్జునుడు వారిని సంహరించి ఇంద్రునికి సంతోషాన్ని కలిగించాడు.
విష్ణుని సూచన మేరకు క్షీరసాగర మథనంలో పాలుపంచుకోడానికి అసురులను ఒప్పించుకోవడానికి దేవతలు వారితో మిత్రత్వం నెరపుతూ ఉన్నప్పుడు పౌలోమి, కాలకేయ, నివాత కవచాది రాక్షస వీరుల పట్ల స్నేహంతో బాంధవ్యాలు కలిపి మాట్లాడారు.
సురాసుర యుద్ధంలో బలి తరఫున యుద్ధంచేసినవారిలో కాలకేయ, పౌలోమ, నివాత, కవచాదులు ఉన్నారు.
రసాతలంలో దైత్యులు, దానవులు అయిన హిరణ్యపురవాసులు, నివాతకవచులు, కాలకేయులు అనేవారు నివాసం చేస్తుంటారు. వారు దేవతల పట్ల శత్రుత్వం వహించి ఉంటారు. వారు మహా సాహసవంతులు, తేజోవంతులు.
కాలకేయులూ మున్నగు రాక్షసవీరులు సురాసుర యుద్ధములో బలి పక్షమున పోరాడాడు. కాలకేయులు, వసువులతో పోరాడారు.
రసాతలంలో దైత్యులు, దానవులు అయిన హిరణ్యపురవాసులు, నివాతకవచులు, కాలకేయులు - :వంశం - రాక్షస యోని;:తండ్రి - కశ్యప ప్రజాపతి;:తల్లి - కాలక;:::::పద్య సం.(లు) - 1-353-శా., 1-366-సీ., 6-258-వ., 8-182-వ., 8-331-వ., 5.2-119-వ., 8-327-క., నుండి 8-334-వ., వరకు, 5.2-119-వ.,

[ ⇑ ] :246) కాలగళుడు- (పురుష){సంజ్ఞా}[దైవ యోని]:- కాలగళుడు అంటే పరమశివుడు - :వంశం - దైవ యోని;:::::::పద్య సం.(లు) - 6-362-క., ,

[ ⇑ ] :247) కాలనాథుడు- (పురుష){సంజ్ఞా}[చంద్రవంశం]:- యయాతి పుత్రుడైన సబానరుని కొడుకు కాలనాథుడు. ఇతని కొడుకు సృంజయుడు - :వంశం - చంద్రవంశం;:తండ్రి - సభానరుడు;::::కొడుకు(లు) - సృంజయుడు;::పద్య సం.(లు) - 9-683-వ.,

[ ⇑ ] :248) కాలనాభుడు-1 (పురుష){సంజ్ఞా}[దైవ యోని]:- కాళియమర్దన సందర్భంలో నాగకాంతలు కృష్ణుని కాలనాభుండవయ్యు..... నమస్కరిస్తున్నాము అంటూ స్తుతించారు - :వంశం - దైవ యోని;:::::::పద్య సం.(లు) - 10.1-681-వ., ,

[ ⇑ ] :249) కాలనాభుడు-2 (పురుష){సంజ్ఞా}[రాక్షస యోని]:- దైత్యుడు, దైత్యుడైన హిరణ్యాక్షునికి, దానవుడైన వైశ్వానరునిపుత్రికైన ఉపదానివి యందు కలిగిన పుత్రులు శకుని, శంబరుడు, కాలనాభుడు, మదోత్కచుడు ఆది ప్రముఖుల. వీరిని హిరణ్యకశిపుడు సోదరుని మరణానంతరం ఊరడించాడు.
వృత్రాసుర సంహారఘట్టంలో దేవదానవ యుద్ధం జరుగుతు న్నప్పుడు వృత్రాసురుని వైపు పాల్గొన్నవారిలో ఒకరు
సురాసురయుద్ధంలో బలితో ఇంద్రుడు, కాలనాభునితో యముడు ఇలా అనేక సురాసురులు యుద్ధం చేసారు. - :వంశం - రాక్షస యోని;:తండ్రి - హిరణ్యాక్షుడు;:తల్లి - ఉపదానవి;:::::పద్య సం.(లు) - 6-258-వ., 7-37-వ., 6-363-వ., 8-334-వ.,

[ ⇑ ] :250) కాలనేమి- (పురుష){సంజ్ఞా}[రాక్షస యోని]:- దేవదానవ యుద్ధంలో రాక్షస వీరుడు కాలనేమి భీకరమైన సింహాన్ని ఎక్కి వచ్చి, గరుత్మంతుని తలమీద వాడి బల్లెంతో కుమ్మాడు. విష్ణువు అతని ఆ ఆయుధాన్ని లాక్కొని ఆ రాక్షసుడుని చచ్చేలా పొడిచాడు.
ఇంతడే తరువాత కంసుడు అయి పుట్టాడు. - :వంశం - రాక్షస యోని;:::::::పద్య సం.(లు) - 8-345-ఆ., 10.1-53-క., 10.1-1653.,1-ఆ., ,

[ ⇑ ] :251) కాలపుత్రిక- (స్త్రీ){సంజ్ఞా}[దైవ యోని]:- కాలపుత్రిక లేదా కాలకన్యక వరుని కోరి అన్ని లోకాలలోను తిరుగుతూ, రాజర్షి యయాతి కొడుకు పూరునిచే వరింపబజింది. కానీ తన దౌర్భాగ్యం చేత "దుర్భగ" అని పేరుబడింది. తరువాత ఎవరూ ఆమెను వరించలేదు. పిమ్మట నారదుని సూచన మేరకు, ఆమె భయుడు అను పేరు గల యవనేశ్వరుని వరించమని కోరింది. అతను అంగీకరించక సోదరభావం చూపి, తన సోదరుడగు ప్రజ్వారునితో కలిసి తిరుగుతూ కర్మనిర్మితమైన లోకాన్ని అనుభవించు అన్నాడు. తరువాత సమయం వచ్చినప్పుడు పురంజనుని పురాన్ని ఈమె బలవంతంగా అనుభవించింది. - :వంశం - దైవ యోని;:::::::పద్య సం.(లు) - 4-811-క, 4-817-వ.,

[ ⇑ ] :252) కాలమూర్తి-1 (పురుష){సంజ్ఞా}[దైవ యోని]:- కృష్ణుని నరకాసుర వధ సందర్భంలో భూదేవి కాలమూర్తివి, ప్రధానపూరుషుడవు అంటూ స్తుతించింది. - :వంశం - దైవ యోని;:::::::పద్య సం.(లు) - 10.1-203-వ.,

[ ⇑ ] :253) కాలమూర్తి-2 (పురుష){సంజ్ఞా}[దైవ యోని]:- వీరు ఉదయం, మధ్యాహ్నం, పట్టపగలు, సాయంకలం, మునిమాపువేళ, అర్ధరాత్రి, అపరాత్రి, పత్యూషకాలం, సంధికాలాలు, ప్రభాతం అనే సకల సమయాలలో కాపాడు గాక అని విశ్వరూపుడు దేవేంద్రునికి ఉపదేశించిన శ్రీమన్నారాయణ కవచంలో ఉన్న నలభైతొమ్మిది స్తుతులలో ఇది ఒకటి. - :వంశం - దైవ యోని;:::::::పద్య సం.(లు) - 6-300-చ., నుండి 6-307-వ.,

[ ⇑ ] :254) కాలయవనుడు- (పురుష){సంజ్ఞా}[మానవ యోని]:- కాలయవనుడు, సాల్వుడు, జరాసంధుడు మొదలైన రాజులు అందరూ, చతురంగ బలాలతో కూడి మథురాపురాన్ని చుట్టుముట్టారు. ఆ రాజలోకాన్ని సేనానీకంతో సహా శ్రీకృష్ణుడు సంహరించాడు.
ఇతడు ఒక యవనాధీశుడు బలగర్వంతో విర్రవీగుతున్నవాడు, నారద చోదితుడై మూడు కోట్ల మ్లేచ్ఛ వీరులను కూడగొట్టుకొని మధురపైకి దండెత్తివచ్చాడు. అదే సమయంలో జరాసంధుడుపద్దెనిమిదోసారి దండెత్తి వచ్చాడు. పిమ్మట శ్రీకృష్ణుడు నిరాయుధుడై కోట బయటకు వచ్చి పరుగెడుతుంటే కాలయవనుడు వెనకబడ్డాడు. శ్రీకృష్ణుడు ఒక కొండ గుహలో దూరగా, తను కూడా గృహ ప్రవేశించి, అక్కడ చిరకాలంగా గాఢనిద్రలో ఉన్నముచికుందుని కృష్ణుడని పొరబడి తన్నాడు. మెళకువ వచ్చిన ముచికుందుని చూపుల అగ్నిలో కాలయవనుడు కాలి బూడిదైపోయాడు. - :వంశం - మానవ యోని;:::::::పద్య సం.(లు) - 3-129-సీ., 10.1-1581-వ., నుండి 10.1-1653-సీ.,

[ ⇑ ] :255) కాలసూత్రం- ( -){సంజ్ఞా}[ప్రాంతం]:- నరకలోకంలో అనేక నరకాలు ఉన్నాయి. మహా భయంకరమైన ఆ నరకాలు తామిస్రం, అంధతామిస్రం, రౌరవం, మహారౌరవం, కుంభీపాకం, కాలసూత్రం, అసిపత్రవనం, సూకరముఖం, అంధకూపం, క్రిమిభోజనం, సందంశం, తప్తోర్మి, వజ్రకంటకశాల్మలి, వైతరణి, పూయోదం, ప్రాణరోధం, విశసనం, లాలాభక్షణం, సారమేయోదనం, అవీచిరయం, రేతఃపానం, క్షారమర్దమం, రక్షోగణభోజనం, శూలప్రోతం, దందశూకం, అవటనిరోధనం, అపర్యావర్తనం, సూచీముఖం అనే ఇరవై ఎనిమిది నరకాలు.
తల్లిదండ్రులకు, బ్రాహ్మణులకు కీడు తలపెట్టినవాడు కాలసూత్రం అనే భయంకర నరకంలో పడతాడు.
దండింప దగని వారిని దండించి, బ్రాహ్మణ శ్రేష్ఠులను శారీరకంగా హింసించిన దుర్మార్గుణ్ణి కాలసూత్ర నరకంలో పడవేస్తారు. - :వంశం - ప్రాంతం;:::::::పద్య సం.(లు) - 5.2-136-వ., నుండి 5.2-164-వ.,

[ ⇑ ] :256) కాలాంజన పర్వతం- ( -){సంజ్ఞా}[ప్రాంతం]:- కాలాంజన పర్వతం పులస్త్య, పులహ ఆశ్రమాల వద్ద ఉన్నది. భరతుడు జింకపిల్లపై వ్యామోహం వలన జింక గర్భాన్ని జన్మించాడు. పూర్వజన్మ స్మృతి పొంది తల్లిని విడిచి కాలాంజన పర్వతప్రాంతాల సమీపంలోని పులస్త్య పులహాశ్రమాలకు వచ్చాడు. తరువాతదైన ఇతని కడ జన్మలో విప్రుని ఇంట పుట్టాడు - :వంశం - ప్రాంతం;:::::::పద్య సం.(లు) - 5.1-118-వ.,

[ ⇑ ] :257) కాలారి- (పురుష){సంజ్ఞా}[దైవయోని]:- కాలారి అంటే కాలుని ధిక్కరించిన శివుడు. జగన్మోహిని వృత్తాంతములోని వర్ణన. మన్మథుడిని ఓడించినా, యముని ధిక్కరించిన మృత్యుంజయుడైనా, ఆడవారి వాలుచూపులను గెలవడం ఆ శివుడికైనా సాధ్యంకాదు. - :వంశం - దైవయోని;:::::::పద్య సం.(లు) - 8-405-ఆ.,

[ ⇑ ] :258) కాలుడు-1 (పురుష){సంజ్ఞా}[దైవ యోని]:- కాలుడు అంటే యముడు - :వంశం - దైవ యోని;:::::::పద్య సం.(లు) - 1-13-ఉ., 8-405-ఆ.,

[ ⇑ ] :259) కాలుడు-2 (పురుష){సంజ్ఞా}[దైవయోని]:- రుద్రుని ఏకాదశ నామాలలో ఒకటి. బ్రహ్మదేవుని ముడిపడిన బొమముడి నుండి ఉద్భవించిన రుద్రునికి, బ్రహ్మదేవుడు ఇచ్చిన ఏకదశనామాలలో కాలుడు నామం కలిగి భార్య ఇరావతితో, తపస్సు స్థానంగా కలిగి ఉంటాడు. రుద్రుని ఏకాదశనామాలు (మన్యువు, మనువు, మహాకాలుడు, మహత్తు, శివుడు, ఋతధ్వజుడు, ఉరురేతసుడు, భవుడు, కాలుడు, వామదేవుడు, ధృతవ్రతుడు) ఏకాదశ భార్యలు (ధీ, వృత్తి, అశన, ఉమ, నియుతి, సర్పి, ఇల, అంబిక, ఇరావతి, సుధ, దీక్ష). ఏకాదశ స్థానాలు (చంద్రుడు, సూర్యుడు, అగ్ని, వాయువు, జలం, ఆకాశం, భూమి, ప్రాణం, తపస్సు, హృదయం, ఇంద్రియాలు) - :వంశం - దైవయోని;:తండ్రి - బ్రహ్మదేవుడు;::భార్య - ఇరావతి;::::పద్య సం.(లు) - 3-369-క., 3-370-వ.,

[ ⇑ ] :260) కాళి-1 (స్త్రీ){సంజ్ఞా}[దైవ యోని]:- కాళీమాత, పోతనామాత్యులు గ్రంథారంభ ప్రార్థనలో సరస్వతీదేవిని స్తతిస్తూ, కాళిని కొలిచిన కాళిదాసును కాను.. అని అంటూ స్తుతించారు.
సింగయ గారి షష్ఠస్కంధ ఆరంభ ప్రార్థన కాళికి బహుసన్నుత లో కాళికిఁ గమనీయ వలయ కరకీలిత కం కాళికిఁ దాపస మానస కేళికి వందనము చేసి కీర్తింతు మదిన్. - :వంశం - దైవ యోని;:::::::పద్య సం.(లు) - 1-7-శా., 6-7-క.,

[ ⇑ ] :261) కాళి-2 (స్త్రీ){సంజ్ఞా}[చంద్రవంశం]:- ఈమె భీముని భార్య, పంచపాండవులలోని భీమసేనునికి హిడింబి వలన ఘటోత్కచుడు, కాళి వలన సర్వగతుడు కలిగారు. - :వంశం - చంద్రవంశం;::::భర్త - భీముడు;:కొడుకు(లు) - సర్వగతుడు;::పద్య సం.(లు) - 9-673-వ.,

[ ⇑ ] :262) కాళింగుడు- (పురుష){సంజ్ఞా}[రాజు]:- ఉషాకన్య కలలో కనిపించిన వాడు ఎవరో కనుక్కోవడానికి, ఆమె చెలి చిత్రరేఖ రాజు లందరి చిత్రపటం గీసి ఒక్కొక్కరి గురించీ చెప్తూ ఇతను కాళింగుడు (కళింగ దేశంవాడు) గురించి ఇలా చెప్పింది.
ఇతడు కళింగ భూపాలుడు యుద్ధరంగంలో శత్రువులను చీల్చిచెండాడేవాడు; వైరిసేనాపతులను చతురంగబలాలను తన అవక్రపరాక్రమంతో పరాజితులను గావించి అఖండ మైన కీర్తిగాంచిన వీరాధివీరుడు. - :వంశం - రాజు;:::::::పద్య సం.(లు) - 10.2-351-ఉ.,

[ ⇑ ] :263) కాళింది-1 ( -){సంజ్ఞా}[మడుగు]:- యమునలోని మడుగు కాళింది, శ్రీకృష్ణుడు కాళిందీ మడుగులో కాళియ మర్దనం చేసాడు.
ఆ రాత్రి కాళిందీ మడుగు వద్ద గోవులు గోపగోపికలు ఉండగా దావానలం వ్యాపించించి. దానిని శ్రీకృష్ణుడు భక్షించాడు.
గోపికలు కాళింది గట్టున వేణువునై పుడితే కృష్ణుని అధరామృతం పానం చేసేదానిని కదా అని. అలా వేణువు కావడానికి ఏమి నోము నోచాలి అంటు అనుకున్నారు.
కృష్ణుడు కాళిందిలో స్నానాలు చేసే గోపికల వస్త్రాపహరణం చేశాడు
వాసుదేవుడిని వల్లవాంగనాలు యమునా తీర వనంలో పాడుతూ వెతికారు.
కృష్ణుని మధురకు తీసుకువెళ్తూ అక్రూరుడు దారిలో కాళిందీ జలాలలో అద్భుత సాక్షాత్కారం పొందాడు.
శ్రీకృష్ణుడు తన అష్టమహిషలలో కాళిందిని కాళింది నది వద్ద మొట్టమొదట చూసాడు. - :వంశం - మడుగు;:::::::పద్య సం.(లు) - 10.1-631-సీ., నుండి 10.1-712-శా., వరకు, 10.1-713-వ., 10.1-783-శా., 10.1-784-క., 10.1-808-వ., 10.1-1009-క., 1024-క., 10.1-1228-వ, 10.2-119-మ.,

[ ⇑ ] :264) కాళింది-2 (స్త్రీ){సంజ్ఞా}[చంద్రవంశం]:- శ్రీకృష్ణుడు తన అష్టమహిషులలో ఒకామె కాళింది. (అష్టమహిషులు - రుక్మిణి, సత్యభామ, జాంబవతి, నాగ్నజితి, కాళింది, మాద్రి, మిత్రవింద మఱియు భద్ర), ఈమెను కాళింది నది వద్ద మొట్టమొదట చూసాడు. ఈమె కృష్ణుని భార్య, సూర్యుని కుమార్తె,
కృష్ణునికి భార్య కాళింది యందు పదిమంది పుత్రులు కలిగారు. - :వంశం - చంద్రవంశం;:తండ్రి - సూర్య;:::భర్త - కృష్ణుడు;:కొడుకు(లు) - శుతుడు , కవి , వృషుడు , వీరుడు , సుబాహుడు , భద్రుడు , శాంతి , ధర్ముడు , పూర్ణమానుడు , శోమకుడు ;::పద్య సం.(లు) - 10.2-119-మ., 10.1-124-వ.,

[ ⇑ ] :265) కాళింది-3 ( -){సంజ్ఞా}[నది]:- యమునానది, చిత్రకేతు మహారాజు బాలునిలోని జీవుడు పలికిన తత్వం విని పుత్రశోకం విడిచి,బాలుని కట్టెకు అంత్యక్రియలు చేసి కాళింది (యమున)లో స్నానం చేశాడు.
గజేంద్రమోక్ష కథా ఫలసృతి చెప్తూ కాళింది (యమునానది) మున్నగు పవిత్రమైన వాటిని తలచేవారికి విష్ణుపదం అనుగ్రహిస్తాను అని చెప్పాడు.
అంబరీషుడు కార్తీకమాసంలో ద్వాదశీ వ్రతాంతము నందు కాళిందీ జలములలో స్నానం చేశాడు.
బలరాముడు ఘోషయాత్రకు వెళ్ళినప్పుడు గోపికలతో ఉండి పిలుస్తే రాలేదని కాళిందిని కోపించాడు. అప్పుడు నదీమాతా రూపుదాల్చి వచ్చి అతనిని శాంతింపజేసింది - :వంశం - నది;:::::::పద్య సం.(లు) - 6-467-వ., 8-136-వ., 9-96-వ., 10.2-494-వ., నుండి 10.2-506-క.,

[ ⇑ ] :266) కాళిక- (స్త్రీ){సంజ్ఞా}[దైవ యోని]:- భద్రకాళి, భరతుడు చివరి జన్మ అయిన విప్రజన్మలో, పొలానికి కాపాలకాస్తున్నాడు. సర్వభూతములకు సఖుడు, బ్రహ్మభూతాత్ముడు, నిర్వైరుడు అయిన అతనిని తీసుకుపోయి కాళికకు నరబలి ఇవ్వబోయారు. కాళిక క్రోంధంతో ఆ పాపత్ములను సంహరించింది. - :వంశం - దైవ యోని;:::::::పద్య సం.(లు) - 5.1-132-క.,

[ ⇑ ] :267) కాళిదాసు- (పురుష){సంజ్ఞా}[మానవ యోని]:- పోతనామాత్యుల వారు గ్రంథారంభంలో కవిశ్రేష్ఠులను స్తుతిస్తూ, "మహాకావ్యకరణ కళావిలాసుం గాళిదాసుం గొనియాడి" అన్నారు షష్ఠస్కంధ ఆరంభంలో సింగయ మహాకవి, "కాళిదాసుఁ గవీంద్రకల్పవృక్షముఁ గొల్చి" అని స్తుతించారు. - :వంశం - మానవ యోని;:::::::పద్య సం.(లు) - 1-12-వ., 6-11-సీ.,

[ ⇑ ] :268) కాళియుడు-1 (పురుష){సంజ్ఞా}[రాక్షస యోని]:- మహాతలంలో కద్రువ కొడుకులైన కుహకుడు, తక్షకుడు, కాళియుడు, సుషేణుడు మొదలైన సర్ప ముఖ్యులు గరుత్మంతుని వల్ల భయంతో కలవరపడుతూ ఉంటారు. - :వంశం - రాక్షస యోని;:తండ్రి - కశ్యపుడు;:తల్లి - కద్రువ;:::::పద్య సం.(లు) - 5.2-119-వ.,

[ ⇑ ] :269) కాళియుడు-2 (పురుష){సంజ్ఞా}[నాగ యోని]:- ఒక సాటిలేనిమేటి సర్పము, మహాతలంలో కుహకుడు, తక్షకుడు, కాళియుడు, సుషేణుడు మొదలైన సాటిలేని మేటిరూపం కల సర్ప ముఖ్యు లున్నారు.
శ్రీకృష్ణుడు కాళిందీ మడుగులో కాళియ మర్దనం చేసాడు. ఈ విషయాన్ని షష్ఠ్యంతాలలో కూడ స్మరించేడు.
పాములకు భయపడి ప్రజలు వాటికొఱకు ఆహారం పెట్టేవారు, పాములు వాటివాటి వాటాలో కొంత భాగం గరుత్మంతునికి సమర్పించేవి. కాళియ సర్పం గర్వించి గరుత్మంతుని వాటా ఇవ్వడం మానేసింది. గరుడు సంహరించడానికి వస్తే భయంతో పారిపోయింది.
మునుపు కాళింది నదిలో సౌభరి అనే ముని తపస్సు చేస్తున్నాడుచ అప్పుడు, గరుత్మంతుడు అక్కడి చేపలరాజును తిన్నాడు. దానికి దుఃఖిస్తున్న మిగతా చేపలను చూసిన సౌభరిమహర్షి "ఇక మీదట గరుడుడు ఈ మడుగుకు వస్తే మరణిస్తా" డని శపించాడు. ఈ విషయం తెలిసిన కాళియుడు కాళిందిలో ఉండసాగాడు.
కాళియుని విషం వలన కాళిందిని చేరవచ్చిన జీవులు మరణించేవారు. ఆ బాధ తప్పించడానికి. గోవులు గోపాలురు స్వచ్ఛమైన నీరు త్రాగడానికి కాళియమర్దనం చేసి. అతనిని సముద్రంలోకి పంపాడు. - :వంశం - నాగ యోని;:::::::పద్య సం.(లు) - 5.2-119-వ., 10.1-631-సీ., నుండి 10.1-712-శా., వరకు, 1-31-ఉ.,

[ ⇑ ] :270) కావషేయుడు- (పురుష){సంజ్ఞా}[మానవ యోని]:- జనమేజయుడు చేసే అశ్వమేధయాగానికి కావషేయుడు పురోహితుడు. - :వంశం - మానవ యోని;:::::::పద్య సం.(లు) - 9-679-వ.,

[ ⇑ ] :271) కావేరి- (స్త్రీ){సంజ్ఞా}[జలప్రాంతం]:- భారతవర్షంలోని ప్రసిద్ధమైన పర్వతాలకు పుత్రికలవంటివి అయిన మహానదులలో ఒక నది కావేరి.
ప్రహ్లాదుడు కావేరీ తీరం వద్ద విస్తరించి ఉన్న సహ్యపర్వత సానువులలో సంచరించే సమయంలో, అజగరవ్రత దీక్షలో ఉన్న ఒక మునీశ్వరుని దర్శించాడు.
బలరాముడు తీర్థయాత్రలకు వెళ్ళినప్పుడు దక్షిణాదిన గల ఈ నదిని దర్శించాడు. పిమ్మట ఆ కావేరీ నదీమధ్యంలో వెలసిన శ్రీరంగం లోని శ్రీరంగనాథుడిని సేవించాడు.
కావేరి మున్నగు మహనదుల పావనజలాలలో స్నానం చేయటంలోను, దానాలు చేయటంలోను, విష్ణుధ్యానంలోను, హరికథామృత రసానుభవంలోను నిష్ణాతులైన భాగవతోత్తములు చెడని పరమపదాన్ని పొందుతారు - :వంశం - జలప్రాంతం;:::::::పద్య సం.(లు) - 5.2-55-వ., 7-431-వ., 10.2-951-వ., 10.2-952-స్రగ్ద., 11-79-వ.,

[ ⇑ ] :272) కావ్యుడు- (పురుష){సంజ్ఞా}[ఋషి]:- కావ్యుడు అంటే కవి యొక్క పుత్రుడైన, శుక్రుడు,
కవి కుమారుడైన శుక్రుడు విష్ణువు ఆజ్ఞను తలదాల్చి బలిచక్రవర్తి యాగాన్ని పూర్తి చేసాడు. - :వంశం - ఋషి;:తండ్రి - కవి;::::::పద్య సం.(లు) - 8-680.,1-తే.,

[ ⇑ ] :273) కాశి- (పురుష){సంజ్ఞా}[చంద్రవంశం]:- చంద్రవంశంలోని పురూరవుని తరువాతి తరాలలోని కాశ్యుని కొడుకు ఈ కాశి. ఇతని పుత్రుడు రాష్ట్రుడు. ఆ రాష్ట్రునకు దీర్ఘతపుడు పుట్టాడు. - :వంశం - చంద్రవంశం;:తండ్రి - కాశ్యుడు;::::కొడుకు(లు) - రాష్ట్రుడు;::పద్య సం.(లు) - 9-497-వ.,

[ ⇑ ] :274) కాశిరాజు- (పురుష){సంజ్ఞా}[చంద్రవంశం]:- విచిత్రవీర్యునికి కాశిరాజు పుత్రికలను అంబిక, అంబాలికలను భీష్ముడు బలవంతంగా తీసుకొచ్చి పెండ్లి చేసాడు. అతను మరణించడంతో సత్యవతీదేవి ఆజ్ఞానుసారం వ్యాసుడుధృతరాష్ట్రుని, పాండురాజుని, విదురుని పుట్టించాడు, కురు వంశం నిలబెట్టాడు. - :వంశం - చంద్రవంశం;::::::కూతురు(లు)- అంబ, అంబిక, అంబాలిక;:పద్య సం.(లు) - 9-671-వ.,

[ ⇑ ] :275) కాశీ- ( -){సంజ్ఞా}[ప్రదేశం]:- కాశీ ప్రసిద్ధమైన నగరము పుణ్యక్షేత్రము. రామకృష్ణులు కాశీకి చేరి, సమీపాన ఉన్న అవంతీపట్టణ నివాసి, సాందీపనీ అనే పండితోత్తముడి వద్ద శిష్యరికం చేసారు.
కాశీరాజు తన రాజ్యంలో వర్షాలు కురవనప్పుడు అక్రూరుడి తండ్రి అయిన శ్వఫల్కుని తీసుకుని వెళ్ళి కాందిని అనే తన కూతురును ఇచ్చి వివాహంచేసి సత్కరించేడు. అప్పుడు కాశీరాజ్యంలో వానలు కురిశాయి.

శ్రీకృష్ణుడు పౌండ్రకుని ఎదిరించడానికి కాశీనగరం వెళ్ళాడు. పౌండ్రకుని సంహారం పిమ్మట అతని మిత్రుడు కాశీరాజు తలను బాణాలతో ఛేదించి కాశీలో పడేలా కొట్టాడు. దానితో పగబూనిన కాశీరాజు పుత్రుడు సుదక్షిణుడు కృత్యను ప్రయోగించాడు. ద్వారక చేరిన కృత్యపై శ్రీకృష్ణుడు చక్రం ప్రయోగించాడు. చక్రం కృత్యను తరుముకుని వెళ్ళి కృత్యను సుదక్షిణుని అతని పట్టణాన్ని కాల్చి వేసింది. - :వంశం - ప్రదేశం;:::::::పద్య సం.(లు) - 10.1-1411-వ., 10.2-96-సీ.,స 10.2-515-వ., నుండి 10.2-535-వ.,

[ ⇑ ] :276) కాశీరాజు- (పురుష){జాతి}[చంద్రవంశం]:- పౌండ్రకుడుమీదకు శ్రీ కృష్ణుడు దండెత్తి వచ్చినప్పుడు. పౌండ్రకుని మిత్రుడు అయిన కాశిరాజు అతనిపై యుద్ధం చేసాడు. పౌండ్రకుని వధానంతంరం, కాశిరాజుమీద బాణంపై బాణం పరంపరలుగా ప్రయోగించి, అతని తల ద్రుంచి బంతిలా గెంటిస్తూ అతని పట్టణంలో పడేలా చేశాడు.
పిమ్మట, కాశీరాజు కొడుకు సుదక్షిణుడు పగతో ప్రయోగించిన కృత్య ద్వారకానగరాన్ని వేపుకుతింటుంటే తెలిసి కృష్ణుడు తన చక్రాన్ని ప్రయోగించాడు. అది ఆ కృత్యను, ప్రయోగించిన సుదక్షిణుని, ఆ ఋత్విక్కులను, ఆ పట్టణాన్ని కాల్చేసింది. - :వంశం - చంద్రవంశం;:::::కొడుకు(లు) - సుదక్షిణుడు;::పద్య సం.(లు) - 10.2-515-వ., నుండి 10.2-536-వ, వరకు,

[ ⇑ ] :277) కాశులు- (పురుష){సంజ్ఞా}[మానవ యోని]:- క్షతవృద్దుని వంశంలో పుట్టిన కాశ్యుడు మొదలు భార్గభూమి వరకు కల రాజులు కాశులు అనే పేర లోకంలో వర్ధిల్లారు. - :వంశం - మానవ యోని;:::::::పద్య సం.(లు) - 9-502-ఆ.,

[ ⇑ ] :278) కాశ్యపుడు-1 (పురుష){సంజ్ఞా}[విప్రుడు]:- శృంగి వల్ల ప్రేరేపింపబడిన తక్షకుడు బ్రాహ్మణవేషం ధరించి పరీక్షిత్తును సంహరించడం కోసం వస్తూ త్రోవలో కాశ్యపుడనే పాము విషానికి విరుగుడు ఇవ్వ గల ఒక బ్రాహ్మణుని కలుసుకున్నాడు. అతనికి అంతులేని ధనం సమర్పించి సంతృప్త పరచి, పరీక్షన్మహారాజు చెంతకు వెళ్ళకుండా చేశాడు. - :వంశం - విప్రుడు;:::::::పద్య సం.(లు) - 12-26-వ.,

[ ⇑ ] :279) కాశ్యపుడు-2 (పురుష){సంజ్ఞా}[ఋషి]:- చంద్ర కాశ్యపుల భార్యసను,మంచిబుద్ధితో తలచుకునే వారికి, మరణానంతరం విష్ణువు నిర్మలమైన గతిని ప్రసాదిస్తాడు... - :వంశం - ఋషి;:::::::పద్య సం.(లు) - 8-136-వ.,

[ ⇑ ] :280) కాశ్యుడు-1 (పురుష){సంజ్ఞా}[చంద్రవంశం]:- చంద్రవంశంలోని పురూరవుని తరువాతి తరాలలోని సుహోత్రుని కొడుకు ఈ కాశ్యుడు. క్షత్రవృద్ధుని పౌత్రుడు. ఆ కాశ్యుని కొడుకు కాశి. కాశికి రాష్ట్రుడు, రాష్ట్రునకు దీర్ఘతపుడు పుట్టారు. - :వంశం - చంద్రవంశం;:తండ్రి - సుహ్రోతుడు;::::కొడుకు(లు) - కాశి;::పద్య సం.(లు) - 9-497-వ., 9-592-వ.,

[ ⇑ ] :281) కాశ్యుడు-2 (పురుష){సంజ్ఞా}[చంద్రవంశం]:- హస్తినాపురం నిర్మించిన చంద్రవంశంలోని హస్తి తరువాతి తరాలలోని, సేనజిత్తునకు కలిగిన రుచిరాశ్వుడు, దృఢహనువు, కాశ్యుడు, వత్సుడు అను నలుగురు కొడుకులలో మూడవవాడు ఈ కాశ్యుడు. - :వంశం - చంద్రవంశం;:తండ్రి - సేనజిత్తు;::::::పద్య సం.(లు) - 9-653-వ.,

[ ⇑ ] :282) కాష్ట- (స్త్రీ){సంజ్ఞా}[దక్ష]:- దక్షునికి అసిక్ని యందు కలిగిన 60 మంది పుత్కలలో 13గ్గరురను కాశ్యపునకు ఇచ్చాడు. వారిలో మూడవ ఆమె కాష్ఠ - :వంశం - దక్ష;:తండ్రి - దక్షుడు;:తల్లి - అసిక్ని;::భర్త - కశ్యపుడు ;:::పద్య సం.(లు) - 6-254-వ., 6-256-త.,

[ ⇑ ] :283) కాష్ఠ- ( -){జాతి}[కాలం]:- కాలమానములో ఒక ప్రమాణము. అయిదు క్షణములు ఒక కాష్ఠ; పది కాష్ఠలు ఒక లఘువు. వెయ్య కాష్ఠలు ఒక ముహూర్తము.. - :వంశం - కాలం;:::::::పద్య సం.(లు) - 3-346-వ.,

[ ⇑ ] :284) కాసారము- ( -){జాతి}[ప్రదేశ]:- సరోవరములు - ఇవి అష్టమ స్కంధములోని త్రికూట పర్వతములో వర్ణించబడ్డాయి
మడుగు, చెఱువు. - :వంశం - ప్రదేశ;:::::::పద్య సం.(లు) - 1-244-మ., 3-429-మ., 5.1-38-మ., 8-23-సీ., 8-24-వ., 8-25-క., 8-26-శా., 8-42-మ., 10.1-1747-వ., 10.2-153-సీ.,

[ ⇑ ] :285) కాసారుడు- (పురుష){సంజ్ఞా}[ఋషి]:- కాసారుడు, బాలాయని, గార్గ్యుడు అనే ముగ్గురు బాష్కలుని కుమారుడైన బాష్కలుని నుండి ఋగ్వేద వాలఖిల్య సంహితను పొందారు. - :వంశం - ఋషి;:::::::పద్య సం.(లు) - 12-30-వ.,

[ ⇑ ] :286) కింపురుషవర్షం- ( - ){సంజ్ఞా}[ప్రాంతం]:- పరీక్షిత్తు తన దిగ్విజయ యాత్రలో కింపురుషాది వర్షాలు ఉత్తర కురుదేశాలనూ జయించి. ఆయా దేశవాసులు తీసుకొనివచ్చి యిచ్చిన కానుకలు అందుకొన్నాడు.
ఇలావృత వర్షానికి దక్షిణంగా నిషధ పర్వతం, హేమకూట పర్వతం, హిమవత్పర్వతం అనే మూడు సరిహద్దు పర్వతాలు ఉన్నాయి. ఇవి తూర్పునుండి పడమటికి పొడవు, ఉత్తరం నుండి దక్షిణం వరకు వెడల్పు కలిగి ఉన్నాయి. వీని నిడివి నీల శ్వేత శృంగవత్పర్వతాలతో సమానంగా ఉంటుంది. ఈ మూడు పర్వతాల నడుమ హరివర్షం, కింపురుషం, భారతవర్షం అనే మూడు భూప్రదేశాలు ఉన్నాయి.
కింపురుష వర్షానికి సీతా లక్ష్మణ సమేతుడైన శ్రీరామచంద్రుడు అధిదేవత. - :వంశం - ప్రాంతం;:::::::పద్య సం.(లు) - 1-396-వ., 5.2-20-వ., 5,2-51-క., 5.2-52-ఆ.,

[ ⇑ ] :287) కింపురుషుడు- (పురుష){సంజ్ఞా}[మానవ యోని]:- కింపురుషుడు అగ్నీధ్రుని రెండవ కొడుకు, కింపురుషవర్షమును ఏలాడు, మేరువు రెండవ కూతురు ప్రతిరూపను వివాహమాడాడు. ఆగ్నీధ్రుడు పూర్వచిత్తి అను అప్సరస వలన వరుసగా నాభి, కింపురుషుడు, హరివర్షుడు, ఇలావృతుడు, రమ్యకుడు, హిరణ్మయుడు, కురువు, భద్రాశ్వుడు, కేతుమాలుడు అనే పేర్లు గల తొమ్మిది మంది కొడుకులను కన్నాడు. వీరు తమ పేరుగల వర్షములుగా రాజ్యాన్ని విభజించుకుని పాలించారు. వీరు మేరువు తొమ్మిదిమంది కుమార్తె లైన మేరుదేవి, ప్రతిరూప, ఉగ్రదంష్ట్ర, లత, రమ్య, శ్యామ, నారి, భద్ర, దేవి అనే వాళ్ళను వరుసగా వివాహమాడారు. - :వంశం - మానవ యోని;:తండ్రి - అగ్నీధ్రుడు ;:తల్లి - పూర్వ చిత్తి;:భార్య - ప్రతిరూప;::::పద్య సం.(లు) - 5.1-40-వ.,

[ ⇑ ] :288) కింపురుషులు- (పురుష){జాతి}[దైవ యోని]:- కింపురుషులు - ఆ వెండికొండ ఎత్తైన శిఖరాలు ప్రకాశిస్తున్నాయి. ఆ కొండచరియలు కిన్నరులు, గంధర్వులు, కింపురుషులు, అప్సరసలు మున్నగువారితో నిండి ఉన్నాయి.
ఆయా దారుల కిరువైపులా నిల్చి సిద్ధులు, సాధ్యులు, గంధర్వులు, చారణులు, గరుడులు, కింపురుషులు స్తుతిస్తూ ఉండగా, ప్రియవ్రతునికి దర్శనం ఇవ్వడానికి బ్రహ్మదేవుడు వస్తున్నాడు. అది చూసి నారదుడు స్వాయంభువ ప్రియవ్రతులతో పాటు ఎదురేగి స్తుతించాడు.
వీరు అష్టమ స్కంధములోని త్రికూట పర్వతములో వర్ణించబడ్డారు
కింపురుషులు దేవ సర్గకు చెందినవారు. దేవ సర్గము ఎనిమిది విధాలు. అందులో విబుధులు, పితృదేవతలు,సురాదులు మూడు భేదాలు; గంధర్వులు, అప్సరసలూ, ఒకటీ; యక్షులు, రాక్షసులు, ఒకటీ; భూత, ప్రేత, పిశాచాల ఒకటీ, సిద్ధ చారణ విద్యాధరులు ఒకటీ, కిన్నర కింపురుషులు ఒకటీ; ఈ ఎనిమిది కలిసి దేవ సర్గం అయింది.
వృత్రాసుర సంహారఘట్టంలో దేవదానవ యుద్ధం జరుగుతు న్నప్పుడు ఇంద్రుని వైపు పాల్గొన్నవారిలో ఒకరు
ఎందరో మునులు, గంధర్వులు, కిన్నరులు, కింపురుషులు, నాగులు, అప్సరసలు, గరుడులు మొదలైనవారు క్రమం తప్పకుండా భూమండలం చుట్టూ తిరుగుతుండే సూర్యుణ్ణి సేవిస్తూ ఉంటారు.
నృసింహావిర్భావము నారసింహ విజయము సందర్భంలో ఇతరులతో పాటు కింపురుషులు కూడ ఏతెంచి స్తుతించారు. - :వంశం - దైవ యోని;:::::::పద్య సం.(లు) - 4-134-సీ., 5.1-8-వ., 8-23-సీ., 8-24-వ., 8-25-క., 3-344-వ., 6-363-వ., 5.2-83-వ., 7-303-వ., 7-332-క.,

[ ⇑ ] :289) కిటి -1 (పురుష){సంజ్ఞా}[దైవ యోని]:- వరహావతారుడు - :వంశం - దైవ యోని;:::::::పద్య సం.(లు) - 3-630-చ., 10.1-1019-క., 11-72.,1-తే.,

[ ⇑ ] :290) కిటి -2 ( -){జాతి}[జంతు]:- పంది, సూకరము, వరాహము - ఇవి అష్టమ స్కంధములోని త్రికూట పర్వతములో వర్ణించబడ్డాయి - :వంశం - జంతు;:::::::పద్య సం.(లు) - 8-23-సీ., 8-24-వ., 8-25-క., 9-333.,1-ఆ.,

[ ⇑ ] :291) కిన్నర - (స్త్రీ){జాతి}[దైవ యోని]:- కిన్నరలు - ఇవి అష్టమ స్కంధములోని త్రికూట పర్వతములో వర్ణించబడ్డాయి
వృత్రాసుర సంహారఘట్టంలో దేవదానవ యుద్ధం జరుగుతు న్నప్పుడు ఇంద్రుని వైపు పాల్గొన్నవారిలో ఒకరు - :వంశం - దైవ యోని;:::::::పద్య సం.(లు) - 8-23-సీ., 8-24-వ., 8-25-క., 3-344-వ., 3-739-సీ., 4-29-సీ., 5.2-83-వ., 6-359-వ., 6-363-వ., 7-146-మ., 7-335-వ., 10.1-153-వ., 10.2-347-సీ., 11-35-వ.,

[ ⇑ ] :292) కిన్నరేంద్రుడు- (పురుష){సంజ్ఞా}[దైవ యోని]:- కిన్నరేంద్రుడు అంటే కుబేరుల నాయకుడు కుబేరుడు. విష్ణుమూర్తి గజేంద్రుని రక్షించడానికి వచ్చినప్పుడు, ఆ మడుగులో కిన్నరేంద్రుని (కుబేరుని) ధనాగారంలోని కచ్చపం అనే నిధి వంటి శ్రేష్ఠమైన తాబేళ్ళు ఉన్నాయిట - :వంశం - దైవ యోని;:::::::పద్య సం.(లు) - 8-108-వ.,

[ ⇑ ] :293) కిరాతక- (పురుష){జాతి}[మానవ యోని]:- కిరాతకులు వేటగాళ్ళు అడవిలో వేటాడుతుంటారు.
భరతుడు తన దిగ్విజయ యాత్రలో ఓడించిన రాజులలోని వారు. అలా ఓడించిన రాజులు శక, శబర, బర్బర, కష, కిరాతక, హూణ, మ్లేచ్ఛ దేశాల రాజులను ఓడించాడు. ఆ కిరాతక దేశ ప్రజలు కిరాతకులు. - :వంశం - మానవ యోని;:::::::పద్య సం.(లు) - 6-277-క., 7-61-చ., 7-61-చ., 9-635-వ.,

[ ⇑ ] :294) కిరాతకదేశరాజులు- (పురుష){జాతి}[రాజు]:- భరతుడు తన దిగ్విజయ యాత్రలో ఓడించిన రాజులలోని వారు. అలా ఓడించిన రాజులు శక, శబర, బర్బర, కష, కిరాతక, హూణ, మ్లేచ్ఛ దేశాల రాజులను ఓడించాడు. - :వంశం - రాజు;:::::::పద్య సం.(లు) - 9-635-వ.,

[ ⇑ ] :295) కిరాతులు- (పురుష){జాతి}[మానవ యోని]:- విష్ణుమూర్తిని సేవించి, భాగవతశ్రేష్ఠులతో చేరినచో అందరూ పరిశుద్ధులు, మంగళాకారులు అవుతారు అంటూ నిర్ణయిస్తూ వీరిని కూడా పేర్కొన్నారు. - 2-63-మ. - :వంశం - మానవ యోని;:::::::పద్య సం.(లు) - 2-63-మ.,

[ ⇑ ] :296) కిరి- (పురుష){సంజ్ఞా}[దైవ యోని]:- వరహావతారుడు - :వంశం - దైవ యోని;:::::::పద్య సం.(లు) - 6-33-క.,

[ ⇑ ] :297) కిరిపతి (ఆదివరాహమూర్తి)- (పురుష){సంజ్ఞా}[దైవ యోని]:- కిరిపతి అంటే ఆదివరాహమూర్తి. వీరు ఎల్లప్పుడు సకల దారులందు కాపాడు గాక అని విశ్వరూపుడు దేవేంద్రునికి ఉపదేశించిన శ్రీమన్నారాయణ కవచంలో ఉన్న నలభైతొమ్మిది స్తుతులలో ఇది ఒకటి. - :వంశం - దైవ యోని;:::::::పద్య సం.(లు) - 6-300-చ., నుండి 6-307-వ.,

[ ⇑ ] :298) కిరీటము- ( -){జాతి}[పరికరములు]:- పృథుచక్రవర్తి పట్టాభిషిక్తుడు అయిన సందర్భంలో దేవతలు అందరు వివిధ బహుమానాలు ఇచ్చారు. వారిలో ఇంద్రుడు, కిరీటము ఇచ్చెను - :వంశం - పరికరములు;:::::::పద్య సం.(లు) - 1-16-సీ., 4-442-సీ., 4-443-సీ., 6-332-సీ., 10.2-217-సీ.,

[ ⇑ ] :299) కిరులు- (పురుష){జాతి}[భూచర]:- కిరులు అంటే అడవిపందులు అను జంతువులు. బలి దేవేంద్రుల నేతృత్వంలో జరిగిన సురాసుర యుద్ధంలో రాక్షసులు వీటిని వాహనాలుగా వాడారు. - :వంశం - భూచర;:::::::పద్య సం.(లు) - 8-327-క., నుండి 8-334-వ., వరకు, 10.1-915-క., ,

[ ⇑ ] :300) కీకట- ( - ){సంజ్ఞా}[ప్రదేశము]:- కీకటము భారత వర్షమునందలి తొమ్మిది వర్షములలో ఒకటి. ఆ తొమ్మిది వర్షములు కుశావర్తము, ఇలావర్తము, బ్రహ్మావర్తము, ఆర్యావర్తము, మలయకేతువు, భద్రసేనము, ఇంద్రస్పృశము, విదర్భ, కీకటము. - :వంశం - ప్రదేశము;:::::::పద్య సం.(లు) - 5.1-64-వ.,

[ ⇑ ] :301) కీకటుడు-1 (పురుష){జాతి}[ప్రియవ్రతుని వంశం]:- కీకటుడు ఋషభుని నూరు మంది పుత్రులలో ఒకడు. ప్రియవ్రత పుత్రుడైన ఋషభుని పెద్ద కొడుకు భరతుడు. మిగిలిన తొంబది తొమ్మిది మంది సోదరులలో కుశావర్తుడు, ఇలావర్తుడు, బ్రహ్మావర్తుడు, ఆర్యావర్తుడు, మలయకేతువు, భద్రసేనుడు, ఇంద్రస్పృశుడు, విదర్భుడు, కీకటుడు అనే తొమ్మిది మందిని, భరతవర్షంలోని వారి వారి పేర ప్రసిద్ధమైన ప్రాంతాలకు, భరతుడు ప్రధానులుగా నియమించాడు. - :వంశం - ప్రియవ్రతుని వంశం;:తండ్రి - ఋషభుడు;:తల్లి - జయంతి;:::::పద్య సం.(లు) - 5.1-63-సీ., 5.1-64-వ.,

[ ⇑ ] :302) కీకటుడు-2 (పురుష){సంజ్ఞా}[దైవ యోని]:- ధర్మునికి దక్షుని పుత్రిక కకుబ్దేవి యందు పుట్టిన సంకుటుని కుమారుడు కీకటుడు. ఇతనికి దుర్గాభిమాన దేవతలు పుట్టారు. - :వంశం - దైవ యోని;:తండ్రి - సంకుటుడు;::::కొడుకు(లు) - దుర్గాభిమానులు;::పద్య సం.(లు) - 6-254-వ.,

[ ⇑ ] :303) కీర్తి- (స్త్రీ){సంజ్ఞా}[విప్రుడు]:- వామనునకు బార్య కీర్తి యందు బృహత్ శ్లోకుడు పుట్టాడు. అతనికి సౌభగాదులు పుట్టారు. - :వంశం - విప్రుడు;::::భర్త - ఉరుక్రముడు (వామనుడు);:కొడుకు(లు) - బృహత్ శ్లోకుడు;::పద్య సం.(లు) - 6-507-వ.,

[ ⇑ ] :304) కీర్తిమంతుడు- (పురుష){సంజ్ఞా}[చంద్రవంశం]:- వసుదేవునికి దేవకి యందు కీర్తిమంతుడు, సుషేణుడు, భద్రసేనుడు, ఋజువు, సమదనుడు, భద్రుడు, సంకర్షణుడు నను వారు ఏడుగురు పుట్టారు. కీర్తిమంతుడు పుట్టగానే ఇచ్చిన మాట దాటకుండా వాసుదేవుడు తెచ్చి కంసునికి ఇచ్చాడు. వసుదేవుని మాట నిలుకడకు మెచ్చి కంసుడు వెనక్కి తీసుకుని వెళ్ళిపొమ్మన్నాడు. కాని, పిమ్మట వారిని ఏడుగురుని కంసుడు చంపాడు. ఈ ఏడుగురిపైన దేవకీ దేవి గర్భంలో పడిన పిండాన్ని ఆకర్షించి, మాయాదేవి విష్ణుమూర్తి ఆజ్ఞానుసారం, రోహిణీదేవి గర్భంలో ప్రవేశపెట్టింది. అలా పుట్టినవాడు బలరాముడు. దేవకీదేవి అష్టమగర్భంగా అవతరించి, యశోదాదదేవి పొత్తిళ్ళలో పెరిగిన వాడు శ్రీకృష్ణుడు... కనుక కీర్తిమంతుడు శ్రీకృష్ణుని అన్న. - :వంశం - చంద్రవంశం;:తండ్రి - వసుదేవుడు;:తల్లి - దేవకి;:::::పద్య సం.(లు) - 9-722-వ.,

[ ⇑ ] :305) కీర్తిరాతుడు- (పురుష){సంజ్ఞా}[సూర్యవంశం]:- కీర్తిరాతుడు సూర్యవంశంలోని మహాధృతి కుమారుడు. ఇతని కొడుకు మహారోముడు. వీరి వంశంలోనే సీతాదేవి సీరధ్వజుడు అనెడి మిథిలాధిపతికి, మఖము చేయుటకు నేలను దున్నుతుంటే నాగలి కొన యందు జనించింది. అలా సీతీదేవికి తాత యొక్క తాతకు తండ్రి ఈ కీర్తిరాతుడు. - :వంశం - సూర్యవంశం;:తండ్రి - మహాధృతి;::::కొడుకు(లు) - మహారోముడు;::పద్య సం.(లు) - 9-373-వ.,

[ ⇑ ] :306) కీలి-1 (పురుష){సంజ్ఞా}[దైవ యోని]:- కీలి అంటే అగ్నిదేవుడు. పరీక్షిత్తు జన్మించినప్పుడు జాతకం చెప్తున్న విప్రులు ఈ బాలుడు అగ్నిహోత్రునిలా చెనకరాని వాడవుతాడు అని చెప్పారు. - :వంశం - దైవ యోని;:::::::పద్య సం.(లు) - 1-293-వ.,

[ ⇑ ] :307) కీలి-2 ( -){జాతి}[ - ]:- కీలి అంటే అగ్ని - :వంశం - - ;:::::::పద్య సం.(లు) - 8-208-వ., 9-449-శా., 10.1-403-వ., 10.1-717-సీ.,

[ ⇑ ] :308) కుంచితచూడ్కులు- ( -){సంజ్ఞా}[నృత్తము]:- పారిభాషిక పదము - రాసక్రీడ - నృత్తము
సగము మూయబడిన చూపులు - :వంశం - నృత్తము;:::::::పద్య సం.(లు) - 10.1-1084-వ.,

[ ⇑ ] :309) కుంజరము- (పురుష){జాతి}[జంతు]:- కుంజరము అంటే ఏనుగు - :వంశం - జంతు;:::::::పద్య సం.(లు) - 1-50-సీ.,1-216-వ., 1-256-వ., 3-166-క.,.,.,

[ ⇑ ] :310) కుంజరి- (స్త్రీ){జాతి}[జంతు]:- ఆడు ఏనుగు - :వంశం - జంతు;:::::::పద్య సం.(లు) - 8-49-సీ., 8-59-క.,

[ ⇑ ] :311) కుండలి- ( -){జాతి}[జంతు]:- కుండలి అంటే సర్పము, పాము. 3-740-క. పద్యంలో బ్రహ్మదేవుడు తన సృష్టి లేమికి చింతిస్తూ కాళ్ళూచేతులూ విదలించగా రాలిన రోమములు పాములు అయ్యాయని చెప్పబడింది. 6-256-సీ. కశ్యపునకు భార్య దక్షుని పుత్రిక అయిన క్రోధ యందు సర్పములు పుట్టాయని - :వంశం - జంతు;:::::::పద్య సం.(లు) - 3-290-మ., 3-740-క., 4-173-సీ., 5.2-97-వ., 8-271-సీ., 10.2-502-మ.,

[ ⇑ ] :312) కుండలీకరణబంధము- ( -){సంజ్ఞా}[నృత్తము]:- పారిభాషిక పదము - రాసక్రీడ - నృత్తము
ఒంటికాలితో నిలిచి చక్రాకారముగ గిరుక్కున తిరుగుచు హస్త విన్యాసాదులను కనబరచునది, కుండలాకారముగ అందరి చేతులు పైకెత్తుకొని లయ తప్పక నటించునది - :వంశం - నృత్తము;:::::::పద్య సం.(లు) - 10.1-1084-వ.,

[ ⇑ ] :313) కుండలీశ్వరుడు- (పురుష){సంజ్ఞా}[దైవ యోని]:- కుండలీశ్వరుడు అంటే సర్పరాజైన ఆదిశేషుడు - :వంశం - దైవ యోని;:::::::పద్య సం.(లు) - 10.2-502-మ., 10.2-1252-వ.,

[ ⇑ ] :314) కుండిన- ( -){సంజ్ఞా}[ప్రదేశము]:- కుండిన అనునది విదర్భ దేశమున ఒక పురము. రుక్మిణీదేవి పుట్టిల్లు. కుండిన పుర ప్రభువు భీష్మకుడు. ఇతని పుత్రికయే రుక్మిణి, ఈమె శ్రీకృష్ణుని వరించి కల్యాణమాడినది. - :వంశం - ప్రదేశము;:::::::పద్య సం.(లు) - 10.1-1687-చ., 10.1-1718-వ., 10.1-1781-వ.,

[ ⇑ ] :315) కుంతము- ( -){జాతి}[ఆయుధము]:- కుంతము అంటే ఈటె - :వంశం - ఆయుధము;:::::::పద్య సం.(లు) - 8-55-వ.,

[ ⇑ ] :316) కుంతలము- ( -){జాతి}[అవయవము]:- కుంతలము అంటే శిరోజములు. శ్రీరాముడు చేపట్టే సీతాదేవికి తుమ్మెదల వంటి కుంతలములు ఉన్నాయని వర్ణించారు. - :వంశం - అవయవము;:::::::పద్య సం.(లు) - 2-158-సీ., 3-160-సీ., 8-301-సీ., 10.1-862-సీ.,

[ ⇑ ] :317) కుంతలుడు- (పురుష){సంజ్ఞా}[దైవ యోని]:- తాపసుని జీవయాత్ర వివరించే సందర్భంలో శుకుడు, విశేష జ్ఞానసంపన్నులై జీవించే శరణాగతులు మాయకు లోబడక నేర్పుతో తమతమ హృదయాలలో భగవంతుని ధ్యానిస్తారు. అని చెప్పి ఆయనను వర్ణిస్తూ నీలకుంచితకుంతలుండును అని కూడ వర్ణించాడు - :వంశం - దైవ యోని;:::::::పద్య సం.(లు) - 2-26-వ.,

[ ⇑ ] :318) కుంతి-1 ( -){సంజ్ఞా}[ప్రదేశము]:- కుంతి అను దేశము. కుంతి దేశపు రాకుమారి కనుక కుంతి. కుంతిభోజుడు ఈ దేశాన్ని ఏలాడు. - :వంశం - ప్రదేశము;:::::::పద్య సం.(లు) - 10.2-1044-వ, 10.2-119.,వ.,

[ ⇑ ] :319) కుంతి-2 (పురుష){సంజ్ఞా}[చంద్రవంశం]:- చంద్రవంశంలో శ్రీకృష్ణునకు నాగ్నజితికి కలిగిన పదిమంది పుత్రులలో కుంతి ఒకడు - :వంశం - చంద్రవంశం;:తండ్రి - కృష్ణుడు;:తల్లి - నాగ్నజిత్తి;:::::పద్య సం.(లు) - 10.2-275-వ.,

[ ⇑ ] :320) కుంతి-3 (స్త్రీ){సంజ్ఞా}[చంద్రవంశం]:- ఈమె కృష్ణుని మేనత్త. దేవమీఢుని (శూరుని) పెద్ద కూతురైన పృథ ఈ కుంతి. కన్నతండ్రి శూరుడు తన స్నేహితుడు కుంతిభోజునికి పిల్లలు లేరని తన కూతురు పృథ అను ఈమెను దత్తత ఇచ్చాడు. చిన్నతనంలో కన్యగా ఉండగా దుర్వాసుని వరంగా లభించిన మంత్ర బలం పరీక్షించుటకు సూర్యుని పిలువగా ఆయన వచ్చి కన్యత్వం చెడదు అని వరమిచ్చి కొడుకును ప్రసాదించాడు. లోకనిందకు బెదిరి ఆ బాలుని నీట వదిలింది. అతడే కర్ణుడు. ఈమె పాండురాజునకు పెద్దభార్య. పాండురాజునకు మృగ (కిందమ ముని) స్త్రీ సంగమం మరణహేతువు అని శాపం ఇచ్చాడు. కనుక, కుంతి తన మంత్ర ప్రభావంతో యమ, వాయుు, ఇంద్రుల వలన ధర్మరాజ, భీమ, అర్జునులను పొందింది. తన సవితి (పాండురాజు చిన్నభార్య) అయిన మాద్రికి ఆ మంత్ర ప్రభావం వలన యశ్వనీకుమారుల ఆహ్వానించి నకుల సహదేవులను పుత్రులను కలుగజేసింది. పాండురాజు మరణానంతరం మాద్రి సహగమనం చేసినా తను ఉండి పంచపాండవులను అయిదుగురిని పెంచి పెద్ద చేసింది. శ్రీకృష్ణా యదుభూషణా అనే అమృతగుళిక కుంతిస్తుతిలోదే. - :వంశం - చంద్రవంశం;:తండ్రి - కృష్ణుని తాత శూరుడు కన్నతండ్రి, కుంతిభోజుడు పెంపుడు తండ్రి;:::భర్త - పాండురాజు;:కొడుకు(లు) - మంత్ర ప్రభావంతో కన్యగా సూర్యుని వలన కర్ణుడు, భర్త పాండురాజునకు అదే మంత్రప్రభావంతో యముని వలన యుధిష్టరుడు ధర్మరాజు, వాయుదేవుని వలన భీమసేనుడు, ఇంద్రుని వలన అర్జునుడు,;::పద్య సం.(లు) - 1-187-క., 1-201-శా., వరకు, 3-63-తే., 9-698-ఆ.,9-716-క., 9-717-వ., 10.1-1517-వ., 10.2-694-వ.,

[ ⇑ ] :321) కుంతి-4 (పురుష){సంజ్ఞా}[చంద్రవంశం]:- కుంతిభోజుడు లేదా కుంతి, కుంతీదేవి పెంపుడు తండ్రి. కుంతి దేశాధీశుడు. - :వంశం - చంద్రవంశం;::::::కూతురు(లు)- కుంతి;:పద్య సం.(లు) - 3-63-తే., 9-716-వ., 10.1-694-వ., 10.2-1044-వ.,

[ ⇑ ] :322) కుంతి-5 (పురుష){సంజ్ఞా}[చంద్రవంశం]:- చంద్రవంశంలోని హేహయుని మనుమడైన నేత్రుని కుమారుడు కుంతి. ఇతని కొడుకు మహిష్మంతుడు. - :వంశం - చంద్రవంశం;:తండ్రి - నేత్రుడు;::::కొడుకు(లు) - మహిష్మంతుడు;::పద్య సం.(లు) - 9-681-వ.,

[ ⇑ ] :323) కుంతి-6 (పురుష){సంజ్ఞా}[చంద్రవంశం]:- చంద్రవంశంలోని విదర్భుని రెండవ కుమారుడైన కృథుని కొడుకు కుంతి. ఈ కుంతికి కొడుకు ధృష్టి. - :వంశం - చంద్రవంశం;:తండ్రి - కృథుడు;::::కొడుకు(లు) - వృష్ణి;::పద్య సం.(లు) - 9-709-వ.,

[ ⇑ ] :324) కుంతి-7 (పురుష){సంజ్ఞా}[చంద్రవంశం]:- చంద్రవంశంలోని దశరథుని కొడుకైన శకునికి కొడుకు కుంతి. ఈ కుంతి కొడుకు దేవరాతుడు. - :వంశం - చంద్రవంశం;:తండ్రి - శకుని;::::కొడుకు(లు) - దేవరాతుడు;::పద్య సం.(లు) - 9-709-వ.,

[ ⇑ ] :325) కుంతిభోజుడు- (పురుష){సంజ్ఞా}[చంద్రవంశం]:- కుంతిభోజుడు లేదా కుంతి, కుంతీదేవి పెంపుడు తండ్రి. కుంతి దేశాధీశుడు. - :వంశం - చంద్రవంశం;::::::కూతురు(లు)- కుంతి;:పద్య సం.(లు) - 3-63-తే., 9-716-వ., 10.1-694-వ., 10.2-1044-వ.,

[ ⇑ ] :326) కుంద-1 ( -){జాతి}[సంపద]:- కుంద అంటే నవనిధుల లోని కుందము అని మొల్లలు, కుందమల్లి అని నానార్ర్థాలు ఉన్నాయి. ఈ పదం ప్రథమ స్కంధలో నైమిశారణ్య వర్ణన సందర్భంలో కుబేరుడి ఖజానా} ఉపమాన పదంగా వాడబడింది. - :వంశం - సంపద;:::::::పద్య సం.(లు) - 1-39-వ., 6-326-వ., ,

[ ⇑ ] :327) కుంద-2 ( -){జాతి}[వృక్ష]:- కుంద అంటే మొల్లలు, కుందమల్లి అని నవనిధుల లోని కుందము అని నానార్ర్థాలు ఉన్నాయి. ఈ పదం ప్రథమ స్కంధలో నైమిశారణ్య వర్ణన సందర్భంలో కుబేరుడి ఖజానా} కు ఉపమాన పదంగా వాడబడింది.
మొల్ల అనే అర్థంలో గ్రంథారంభంలోని సరస్వతీదేవి ప్రార్థనలోనూ, ద్వితీయలో సీతాదేవిని వర్ణించడంలోనూ, అష్టమ స్కంధములోని త్రికూట పర్వతములోనూ వర్ణించబడ్డాయి - :వంశం - వృక్ష;:::::::పద్య సం.(లు) - 1-8-ఉ., 1-39-వ., 2-158-సీ., 3-108-చ., 8-23-సీ., 8-24-వ., 8-25-క., ., ., ., ,

[ ⇑ ] :328) కుంభ రాశి- ( -){సంజ్ఞా}[భగణ విషయం]:- సూర్యుడు మేషరాశిలో, తులారాశిలో సంచరిస్తుంటే పగలు, రాత్రి సమానంగా ఉంటాయి. వృషభం, మిథునం, కర్కాటకం, సింహం, కన్య అనే ఐదు రాశులలో సంచరిస్తుంటే ఒక్కొక్క గడియ చొప్పన రాత్రి తగ్గుతూ వస్తుంది. వృశ్చికం, ధనుస్సు, మకరం, కుంభం, మీనం అనే ఐదు రాశులలో సంచరిస్తుంటే ఒక్కొక్క గడియ చొప్పన రాత్రి పెరుగుతుంది. పగలుతగ్గిపోతుంది. - :వంశం - భగణ విషయం;:::::::పద్య సం.(లు) - 5.2-79-ఆ., 5.2-80-ఆ.,

[ ⇑ ] :329) కుంభకర్ణుడు- (పురుష){సంజ్ఞా}[రాక్షస యోని]:- విశ్రవసునకు కైకసి వలన కలిగిన రావణ, కుంభకర్ణ, విభీషణులలో రెండవ కొడుకు. రామరావణ యుద్దంలో మరణించాడు. సనకాది మహర్షుల శాపవశమున శ్రీహరి పార్షదులైన జయవిజయులు రెండవ జన్మమున రావణ కుంభకర్ణులై పుట్టారు. రామావతారుని చేతిలో మరణించారు. - :వంశం - రాక్షస యోని;:తండ్రి - విశ్రవసు ;:తల్లి - కైకసి ;:::::పద్య సం.(లు) - 4-26-వ., 6-306-సీ., 7-24-వ., 7-384-వ.,

[ ⇑ ] :330) కుంభము- ( -){జాతి}[అవయవము]:- ఏనుగు కుంభస్థలము - :వంశం - అవయవము;:::::::పద్య సం.(లు) - 8-35-మ., 8-36-క., 8-40-సీ., 8-62-మ.,

[ ⇑ ] :331) కుంభసంభవుడు- (పురుష){సంజ్ఞా}[ఋషి]:- కుంభసంభవుడు అనగా కుంభమున జన్మించిన వాడు, అగస్త్య మహర్షి. అజామిళోపాఖ్యానమును మలయపర్వతం వద్ద తనకు చెప్పెనని శుకుడు పరీక్షిత్తునకు చెప్పెను.
ఇంద్రుడు బ్రహ్మహత్యాపాతకము పొంది వెయ్యి సంవత్సరములు స్వర్గమును వీడగా, ఆ సమయంలో నహుషుడు ఇంద్రపదవిని పొందాడు. మదాంధుడై, శచీదేవిని కొరి, సప్తర్షులచే పల్లకీ మోయిస్తూ ఆ పల్లకీలో వెళ్ళసాగాడు. ఆ సందర్భంలో దర్పం ప్రదర్శించి కుంభసంభవుడైన అగస్త్యునిచే శాపం పొంది అజగరయోని యందు పుట్టాడు.
కృష్ణ సందర్శనార్థం ద్వారకకు విచ్చేసిన సకల తాపస శ్రేష్ఠులలో కుంభసంభవుడైన అగస్త్యుడు ఒకడు. - :వంశం - ఋషి;:::::::పద్య సం.(లు) - 6-192-వ., 6-647-వ., 10.2-1117-ఉ.,

[ ⇑ ] :332) కుంభాండుడు- (పురుష){సంజ్ఞా}[రాక్షస యోని]:- బాణుని మంత్రి కుంభాండుడు. ఉషాకుమారి చెలి ఇతని కూతురు చిత్రరేఖ. శివకృష్ణల యుద్ధంలో కూపకర్ణుడు కుంభాండులు బాణుని వైపు యుద్ధం చేసారు. ఆ యుద్ధంలో బలరాముడు రోకటి పోటులతో కూపకర్ణ, కుంభాండులను సంహరించాడు - :వంశం - రాక్షస యోని;:::::::పద్య సం.(లు) - 10.2-337-తే., 10.2-404-వ., 10.2-417-మ.,

[ ⇑ ] :333) కుంభిని- (స్త్రీ){సంజ్ఞా}[ప్రదేశము]:- కుంభిని అనగా భూమి - :వంశం - ప్రదేశము;:::::::పద్య సం.(లు) - 5.2-45-ఆ., 7-169-సీ., 7-2117-వ.,

[ ⇑ ] :334) కుంభినీధరము- ( -){జాతి}[ప్రదేశము]:- కుంభినీధరము - కుంభిని (భూమిని) ధరము (మోసెడిది), కులపర్వతము - :వంశం - ప్రదేశము;:::::::పద్య సం.(లు) - 7-285-వ.,

[ ⇑ ] :335) కుంభినీధరుడు- (పురుష){సంజ్ఞా}[దైవ యోని]:- విష్ణువు - :వంశం - దైవ యోని;:::::::పద్య సం.(లు) - 10.2-402-వ.,

[ ⇑ ] :336) కుంభివిభుడు- (స్త్రీ){జాతి}[జంతు]:- గజేంద్రుడు - :వంశం - జంతు;:::::::పద్య సం.(లు) - 8-40-సీ.,

[ ⇑ ] :337) కుంభీంద్రము- (పురుష){జాతి}[జంతు]:- కుంభీద్రము అంటే గజరాజు - :వంశం - జంతు;:::::::పద్య సం.(లు) - 10.1-1327-క., 10.2-153-సీ.,

[ ⇑ ] :338) కుంభీనసుడు- (పురుష){సంజ్ఞా}[దైవ యోని]:- కుంభీనసుడు - విషజ్వాలలుగ్రక్కెడి పాము, ఆదిశేషుడు - :వంశం - దైవ యోని;:::::::పద్య సం.(లు) - 7-285-వ.,

[ ⇑ ] :339) కుంభీపాకం- ( -){సంజ్ఞా}[ప్రాంతం]:- నరకలోకంలో అనేక నరకాలు ఉన్నాయి. మహా భయంకరమైన ఆ నరకాలు తామిస్రం, అంధతామిస్రం, రౌరవం, మహారౌరవం, కుంభీపాకం, కాలసూత్రం, అసిపత్రవనం, సూకరముఖం, అంధకూపం, క్రిమిభోజనం, సందంశం, తప్తోర్మి, వజ్రకంటకశాల్మలి, వైతరణి, పూయోదం, ప్రాణరోధం, విశసనం, లాలాభక్షణం, సారమేయోదనం, అవీచిరయం, రేతఃపానం, క్షారమర్దమం, రక్షోగణభోజనం, శూలప్రోతం, దందశూకం, అవటనిరోధనం, అపర్యావర్తనం, సూచీముఖం అనే ఇరవై ఎనిమిది నరకాలు.
ఎలుకల కన్నాలు మూసి వాటిని చంపడం వంటి జీవహింస చేయువానికి కుంభీపాక నరకం. - :వంశం - ప్రాంతం;:::::::పద్య సం.(లు) - 5.2-136-వ., నుండి 5.2-164-వ., 10.2481-వ.,

[ ⇑ ] :340) కుంభుడు-1 (పురుష){సంజ్ఞా}[రాక్షస యోని]:- క్షీరసాగరమథనానికి రాక్షసులను ఒప్పించడానికి ఇంద్రుడు ఇతర రాక్షసులతోపాటు కుంభ నికుంభులతో కూడ సౌజన్యం పాటించాడు. - :వంశం - రాక్షస యోని;:::::::పద్య సం.(లు) - 8-182-వ.,

[ ⇑ ] :341) కుంభుడు-2 (పురుష){సంజ్ఞా}[రాక్షస యోని]:- ఇతడు రావణుని అనుచరుడు, ఇతడు రామరావణ యుద్ధంలో వధింపబడ్డాడు. - :వంశం - రాక్షస యోని;:::::::పద్య సం.(లు) - 9-291-వ.,

[ ⇑ ] :342) కుకుంభం- ( -){సంజ్ఞా}[పర్వతం]:- భారతవర్షంలోని ప్రసిద్ధమైన అనేక పర్వతాలలో ఒకటి. - :వంశం - పర్వతం;:::::::పద్య సం.(లు) - 5.2-55-వ.,

[ ⇑ ] :343) కుకురుడు- (పురుష){సంజ్ఞా}[చంద్రవంశం]:- చంద్రవంశంలోని అంధకునికి భజమానుడు, కుకురుడు, శుచి, కంబళబర్హిషుడు అని నలుగురు కొడుకులు. వారిలో రెండవవాడైన కురునకు వృష్ణి - :వంశం - చంద్రవంశం;:తండ్రి - అందకుడు;::::కొడుకు(లు) - వృష్ణి;::పద్య సం.(లు) - 9-712-వ.,

[ ⇑ ] :344) కుకురులు- (పురుష){జాతి}[చంద్రవంశం]:- శ్రీకృష్ణుడు ద్వారకకు తిరిగివచ్చే సందర్భంలో కుకుర అంధకాది వీరులచే పాలితమగు దేశము అని వర్ణింపబడింది - :వంశం - చంద్రవంశం;:::::::పద్య సం.(లు) - 1-256-వ.,

[ ⇑ ] :345) కుక్కుటము- (స్త్రీ){జాతి}[గగనచర]:- కుక్కుటము అంటే కోడి అనే విహంగము. బలి దేవేంద్రుల నేతృత్వంలో జరిగిన సురాసుర యుద్ధంలో రాక్షసులు వీటిని వాహనాలుగా వాడారు. - :వంశం - గగనచర;:::::::పద్య సం.(లు) - 8-327-క., నుండి 8-334-వ., వరకు,

[ ⇑ ] :346) కుచము- ( -){జాతి}[అవయవము]:- వక్షోజము - :వంశం - అవయవము;:::::::పద్య సం.(లు) - 2-158-సీ., 3-100-వ., 8-50-వ.,

[ ⇑ ] :347) కుచేలుడు- (పురుష){సంజ్ఞా}[మానవ యోని]:- కుచేలుడు శ్రీకష్ణుని సఖుడు. సహాధ్యాయి, బ్రాహ్మణుడు, మానధనుడు, పండితుడు. దారిద్ర్యముతో బాధపడుతూ ఎవరినీ యాచించ ఇష్టపడక, శ్రీకృష్ణుని దర్శించాడు, కృష్ణుడు అతను తెచ్చిన అటుకులు ఆరగించాడు, ఆదరించాడు, అశేష సంపదలను అనుగ్రహించాడు. - :వంశం - మానవ యోని;:::::::పద్య సం.(లు) - 10.2-965-సీ., నుండి 10.2-1015-వ.,

[ ⇑ ] :348) కుటకము- ( -){సంజ్ఞా}[ప్రదేశము]:- ఋషభుడు యోగమాయాసక్తుడై తిరుగుతూ ఒకనాడు దక్షిణ కర్ణాటక దేశములలోని కుటకమునకు, పిమ్మట కుటకాచలము దగ్గరి వనములకు వెళ్ళాడు. మట్టిబెడ్డలు నోట బెట్టుకుంటూ పిచ్చివానిలా ప్రవర్తించసాగాడు. అక్కడ చెలరేగిన దావానలంలో కాలిపోయాడు. - :వంశం - ప్రదేశము;:::::::పద్య సం.(లు) - 5.1-89-వ.,

[ ⇑ ] :349) కుటకాచలము- ( -){సంజ్ఞా}[ప్రదేశము]:- ఋషభుడు యోగమాయాసక్తుడై తిరుగుతూ ఒకనాడు దక్షిణ కర్ణాటక దేశములలోని కుటకమునకు, పిమ్మట కుటకాచలము దగ్గరి వనములకు వెళ్ళాడు. మట్టిబెడ్డలు నోట బెట్టుకుంటూ పిచ్చివానిలా ప్రవర్తించసాగాడు. అక్కడ చెలరేగిన దావానలంలో కాలిపోయాడు. - :వంశం - ప్రదేశము;:::::::పద్య సం.(లు) - 5.1-89-వ.,

[ ⇑ ] :350) కుటజ - ( -){జాతి}[వృక్ష]:- కొండమల్లె - ఇవి అష్టమ స్కంధములోని త్రికూట పర్వతములో వర్ణించబడ్డాయి - :వంశం - వృక్ష;:::::::పద్య సం.(లు) - 8-23-సీ., 8-24-వ., 8-25-క.,

[ ⇑ ] :351) కుటీచకుడు- (పురుష){జాతి}[మానవ యోని]:- చతురాశ్రమములలో సన్యాసాశ్రమంలో నాలుగు ఉపవిభాగాలలో కుటీచకునికి తన ఆశ్రమం ఆ ఆశ్రమ ధర్మాలు పాటించుట ఉంటాయి. మిగతా మూడు బహూదకుడు, హంసుడు, నిష్క్రియుడు. - :వంశం - మానవ యోని;:::::::పద్య సం.(లు) - 3-388-వ.,

[ ⇑ ] :352) కుటీరము- ( -){జాతి}[ప్రదేశము]:- కుటీరము అనగా గుడిసె. - :వంశం - ప్రదేశము;:::::::పద్య సం.(లు) - 10.1-238-వ., 10.1-1467-సీ., 10.2-682-చ.,

[ ⇑ ] :353) కుఠారములు- ( -){జాతి}[పరికరములు]:- కుఠారములు అంటే చిన్నగొడ్డలి - :వంశం - పరికరములు;:::::::పద్య సం.(లు) - 2-153-మ., 3-181-వ., 7-137-ఉ., 8-327-క., నుండి 8-334-వ., వరకు,

[ ⇑ ] :354) కుణి- (పురుష){సంజ్ఞా}[చంద్రవంశం]:- చంద్రవంశంలో జయుని కొడుకు కుణి, కుణి కొడుకు యుగంధరుడు. - :వంశం - చంద్రవంశం;:తండ్రి - జయుడు;::::కొడుకు(లు) - యుగంధరుడు;::పద్య సం.(లు) - 9-712-వ.,

[ ⇑ ] :355) కుతల- ( -){సంజ్ఞా}[ప్రదేశము]:- భూలోకము - :వంశం - ప్రదేశము;:::::::పద్య సం.(లు) - 7-36-సీ., 8-54-క.,

[ ⇑ ] :356) కుత్సుడు- (పురుష){సంజ్ఞా}[ధ్రువుని వంశం]:- ఇతడు ధ్రువుని వంశపు చక్షుస్సంజ్ఞునికి భార్య అడ్వల యందు కలిగిన కొడుకులు పన్నిండుగురులో ఒకడు. - :వంశం - ధ్రువుని వంశం;:తండ్రి - చక్షుస్సంజ్ఞుడు;:తల్లి - అడ్వల;:::::పద్య సం.(లు) - 4-390-వ.,

[ ⇑ ] :357) కుబేర- ( -){జాతి}[వృక్ష]:- కుబేర అంటే నంది వృక్షాలు అని కుబేరుడు అని నానార్ర్థాలు ఉన్నాయి. ఈ పదం ప్రథమ స్కంధలో నైమిశారణ్య వర్ణన సందర్భంలో శివుడి సభ} కు ఉపమాన పదంగా వాడబడింది. - :వంశం - వృక్ష;:::::::పద్య సం.(లు) - 1-39-వ.,

[ ⇑ ] :358) కుబేరుడు- (పురుష){సంజ్ఞా}[దైవ యోని]:- ఇతడు ధనపతి, ఉత్తరదిక్పాలకుడు., కుబేరుడు, ఇలబిల కుమారుడు కనుక ఐలబిలుడు. కర్దమపుత్రి హవిర్భుక్కు పులస్త్యుల పుత్రుడైన "విశ్రవసు"నికి, అప్సరస అలంబుస తృణబిందుల పుత్రిక "ఇలబిల"కు, ఐలబిలుడు అయిన కుబేరుడు పుట్టాడు.
ధ్రువుడు సోదరుని మరణానికి శోకించి యక్షులపైకి దండెత్తి వెళ్ళినప్పుడు. కుబేరుడు ప్రత్యక్షమయ్యాడు. ధ్రువునికి అచలితమగు హరిస్మరణ వరంగా ఇచ్చాడు.
ఇలబిల తృణబిందును వరించిన అప్సరస అలంబుస తృణబిందు యందు పుట్టి విశ్రావసును వివాహమైంది, వీరికి ఐలబిలుడు ఐన కుబేరుడు పుట్టాడు. ఇతడు యక్షులలో ముఖ్యుడు.
వృత్రాసుర సంహారఘట్టంలో దేవదానవ యుద్ధం జరుగుతు న్నప్పుడు ఇంద్రుని వైపు పాల్గొన్నవారిలో ఒకరు
కుబేర అంటే కుబేరుడు అని నంది వృక్షాలు అని నానార్ర్థాలు ఉన్నాయి. ఈ పదం ప్రథమ స్కంధలో నైమిశారణ్య వర్ణన సందర్భంలో శివుడి సభ} ఉపమాన పదంగా వాడబడింది. - :వంశం - దైవ యోని;:తండ్రి - విశ్రవసుడు;:తల్లి - ఇలబిల;:::::పద్య సం.(లు) - 4-26-వ., 4-386-వ., 9-48-వ., 6-363-వ., 1-39-వ., 3-821-చ., 4-112-చ.,10.1-393-వ.,

[ ⇑ ] :359) కుబ్జ- (స్త్రీ){సంజ్ఞా}[మానవ యోని]:- బలరామకృష్ణులు మథురకు మొదటిసారి ధనుర్యాగ నిమిత్తం వచ్చారు. అప్పుడు మథురలో వారికి మైలేపనాలు పట్టుకు వెళ్తున్న త్రివక్ర అను కుబ్జ ఎదురైంది. కృష్ణుడు ఆమె గడ్డం క్రింద తన చేతి రెండు వేళ్ళు పెట్టి పైకి లేపాడు. దానితో ఆమె వంకరలు పోయి అందగత్తెగా మారిపోయింది. సంతోషంతో లేపనాలు వారిద్దరికి సమర్పించి, కృష్ణుని వరంగా సమాగమం కోరింది. కంసవధానంతరం శ్రీకృష్ణుడు ఉద్ధవునితోడు తీసుకుని ఆమె నివాసానికి వేంచేసి ఆమె కోరిక తీర్చాడు. ఈమెకు కృష్ణుని వలన కలిగిన పుత్రుడు ఉపశ్లోకుడు. - :వంశం - మానవ యోని;:::::::పద్య సం.(లు) - 10.1-1274-క., నుండి10.1-1283-వ., వరకు, 10.1-1488-మ., 10.1-1498-ఆ., వరకు, 10.2-1330-వ.,

[ ⇑ ] :360) కుబ్జుడు- (పురుష){సంజ్ఞా}[దైవ యోని]:- శుక్రాచార్యుడు బలిచక్రవర్తిని వామనునికి దానం ఈయవద్దని వారిస్తూ కుబ్జుడు అని పేర్కొన్నాడు,
త్రివిక్రమావతారం చాలించి మరల వామనునిగా నిలబడగా కనుగొన్న బలిచక్రవర్తి అనుచరులు హేతి, ప్రహేతి, విప్రచిత్తి మున్నగువారు వామనుని కుబ్జుడు అని పేర్కొనుచు నిర్జించబోయారు. కాని, బలి వారిని నివారించాడు. - :వంశం - దైవ యోని;:::::::పద్య సం.(లు) - 8-586-మ., 8-634-వ.,

[ ⇑ ] :361) కుమార- (పురుష){సంజ్ఞా}[దైవ యోని]:- కుమార అంటే కుమారస్వామి - :వంశం - దైవ యోని;:::::::పద్య సం.(లు) - 1-12-వ., 8-681-వ.,

[ ⇑ ] :362) కుమారస్వామి- (పురుష){సంజ్ఞా}[దైవ యోని]:- బలరాముడు, పల్వలుని సంహారానంతరం, తన తీర్థయాత్రలో భీమనదీ తీరమునందు గల కుమారస్వామిని దర్శించుకున్నాడు. - :వంశం - దైవ యోని;:::::::పద్య సం.(లు) - 10.2-951-వ.,

[ ⇑ ] :363) కుముద-1 (స్త్రీ){సంజ్ఞా}[దైవ యోని]:- దుర్గ - ఈమె శ్రీకృష్ణుడు తన అవతార సందర్భంలో ఆ మాయాదేవికి ఒసగిన పద్నాలుగు (14) నామములలో ఈమెది ఒకటి [ మాయాదేవి 14 పేర్లు ] భద్రకాళి - ఈమె శ్రీకృష్ణుడు తన అవతార సందర్భంలో ఆ మాయాదేవికి ఒసగిన పద్నాలుగు (14) నామములలో ఈమెది ఒకటి [ మాయాదేవి 14 పేర్లు ] విజయ - ఈమె శ్రీకృష్ణుడు తన అవతార సందర్భంలో ఆ మాయాదేవికి ఒసగిన పద్నాలుగు (14) నామములలో ఈమెది ఒకటి [ మాయాదేవి 14 పేర్లు ] వైష్ణవి - ఈమె శ్రీకృష్ణుడు తన అవతార సందర్భంలో ఆ మాయాదేవికి ఒసగిన పద్నాలుగు (14) నామములలో ఈమెది ఒకటి [ మాయాదేవి 14 పేర్లు ] కుముద - ఈమె శ్రీకృష్ణుడు తన అవతార సందర్భంలో ఆ మాయాదేవికి ఒసగిన పద్నాలుగు (14) నామములలో ఈమెది ఒకటి [ మాయాదేవి 14 పేర్లు ] చండిక - ఈమె శ్రీకృష్ణుడు తన అవతార సందర్భంలో ఆ మాయాదేవికి ఒసగిన పద్నాలుగు (14) నామములలో ఈమెది ఒకటి [ మాయాదేవి 14 పేర్లు ] కృష్ణ - ఈమె శ్రీకృష్ణుడు తన అవతార సందర్భంలో ఆ మాయాదేవికి ఒసగిన పద్నాలుగు (14) నామములలో ఈమెది ఒకటి [ మాయాదేవి 14 పేర్లు ] మాధవి - ఈమె శ్రీకృష్ణుడు తన అవతార సందర్భంలో ఆ మాయాదేవికి ఒసగిన పద్నాలుగు (14) నామములలో ఈమెది ఒకటి [ మాయాదేవి 14 పేర్లు ] కన్యక - ఈమె శ్రీకృష్ణుడు తన అవతార సందర్భంలో ఆ మాయాదేవికి ఒసగిన పద్నాలుగు (14) నామములలో ఈమెది ఒకటి [ మాయాదేవి 14 పేర్లు ] మాయ - ఈమె శ్రీకృష్ణుడు తన అవతార సందర్భంలో ఆ మాయాదేవికి ఒసగిన పద్నాలుగు (14) నామములలో ఈమెది ఒకటి [ మాయాదేవి 14 పేర్లు ] నారాయణి - ఈమె శ్రీకృష్ణుడు తన అవతార సందర్భంలో ఆ మాయాదేవికి ఒసగిన పద్నాలుగు (14) నామములలో ఈమెది ఒకటి [ మాయాదేవి 14 పేర్లు ] శారద - ఈమె శ్రీకృష్ణుడు తన అవతార సందర్భంలో ఆ మాయాదేవికి ఒసగిన పద్నాలుగు (14) నామములలో ఈమెది ఒకటి [ మాయాదేవి 14 పేర్లు ] - :వంశం - దైవ యోని;:::::::పద్య సం.(లు) - 10.1-61-వ.,

[ ⇑ ] :364) కుముద-2 (స్త్రీ){సంజ్ఞా}[దైవ యోని]:- మాయాదేవి - :వంశం - దైవ యోని;:::::::పద్య సం.(లు) - 10.1-61-వ.,

[ ⇑ ] :365) కుముద-3 (పురుష){జాతి}[జంతు]:- కుముద అష్టదిగ్గజములులో ఒకటి మిగతా దిగ్గజములు, ఐరావతము, పుండరీకము, వామనము, అంజనము, పుష్పదంతము, సార్వభౌమము, సుప్రతీకము. - :వంశం - జంతు;:::::::పద్య సం.(లు) - 7-285-వ.,

[ ⇑ ] :366) కుముద - (స్త్రీ){జాతి}[వృక్ష]:- తెల్లకలువలు - ఇవి అష్టమ స్కంధములోని త్రికూట పర్వతములో వర్ణించబడ్డాయి - :వంశం - వృక్ష;:::::::పద్య సం.(లు) - 8-23-సీ., 8-24-వ., 8-25-క., 8-49-సీ., 3-288-వ., 3-823-మ., 3-1047-వ., 5.2-107-వ., 10.1-766-వ., 10.1-1011-వ., 10.2-419-చ., 10.2-1323-వ.,

[ ⇑ ] :367) కుముద పర్వతం- ( - ){సంజ్ఞా}[పర్వతం]:- సుమేరు పర్వతానికి తూర్పున మందర పర్వతం, దక్షిణాన మేరుమందర పర్వతం, పడమట సుపార్శ్వ పర్వతం, ఉత్తరాన కుముద పర్వతం ఉన్నాయి. ఈ నాలుగు పర్వతాలు పదివేల యోజనాలు ఎత్తు కలిగి ఉన్నవి. ఇన్నిటికి నడుమ మేరుపర్వతం ఎత్తుగా పొడుగైన స్తంభంలాగా ఉంటే మిగిలిన పర్వతాలు నాలుగు ప్రక్కల నాటిన పొట్టి గుంజల లాగా ఉన్నాయి. ఈ పర్వత శిఖరాల మీద పతాకాల లాగా పెద్ద పెద్ద మఱ్ఱి చెట్లు ఉంటాయి.ఇంతేకాక, ఆ పర్వత శిఖరం మీద వంద యోజనాల విస్తీర్ణం కలిగిన నాలుగు నిర్మల జల సరస్సు అనే పెద్ద సరోవరం ఉంది. క్రమంగా వాటి పేర్లు క్షీరసరస్సు, మధు సరస్సు, ఇక్షురస సరస్సు, నిర్మల జల సరస్సు. ఆ సరస్సులో స్నానం చేసేవారికి స్వభావం చేతనే యోగనిష్ఠ, అణిమాది సిద్ధులు సిద్ధిస్తాయి. ఇంకా ఆ పర్వత శిఖరంపై సర్వతోభద్రం అనే దేవోద్యానవనం ఉంది.
కుముద పర్వత శిఖరం మీద బాగా పెరిగిన పెద్ద మర్రిచెట్టు ఉన్నది. ఆ చెట్టునుండి పాలు, పెరుగు, నేయి, తేనె, బెల్లం ఇంకా రకరకాల రుచులు కలిగిన ఆహార పదార్థాలు ఎప్పుడూ ఉత్పన్నమౌతూ ఉంటాయి. వస్త్రాలు, పాన్పులు, ఆసనాలు, నగలు మొదలైన వస్తువులను ఆ వటవృక్షం ప్రసాదిస్తుంది. కోరికలు తీర్చే ఆ మర్రిమాను ఇలావృత వర్షంలో నివసించే ప్రజల కందరికీ సమస్త విధాలైన సుఖ సంపత్తిని ప్రసాదిస్తుంది. ఆ ఆహార పదార్థాలను వాడడం వల్లను, ఆ ప్రదేశంలో అయాచితంగా దక్కే సుఖ భోగాలను అనుభవించడం వల్లను అక్కడ ఎవరికీ ముసలితనం రాదు. చర్మ ముడతలు పడదు. జుట్టు నెరసిపోదు. శరీర దుర్గంధం ఉండదు. మరణభయం అసలు లేదు. చలి, ఎండల బాధలు ఉండనే ఉండవు.
బ్రహ్మపట్టణం ఉత్తరద్వారం గుండా వెలువడిన భద్ర అనే నదీ ప్రవాహం కుముదం, నీలం, శ్వేతం అనే పర్వత శిఖరాల మీదుగా శృంగనగరం మీదుగా మానసోత్తరాలైన కురుభూముల మీదుగా ప్రవహిస్తూ ఉత్తర సముద్రంలో కలుస్తుంది. - :వంశం - పర్వతం;:::::::పద్య సం.(లు) - 5.2-20-వ., 5.2-28-సీ., 5.2-34-వ.,

[ ⇑ ] :368) కుముదము- ( -){సంజ్ఞా}[పర్వతం]:- దేవబర్హ వర్షం ప్లక్షద్వీపంలో ఉంది. దీనిలో కుముదం అను పర్వతం, కుహువు అను మహానది ఉన్నాయి. - :వంశం - పర్వతం;:::::::పద్య సం.(లు) - 5.2-62-వ.,

[ ⇑ ] :369) కుముదాక్షుడు- (పురుష){సంజ్ఞా}[దైవ యోని]:- కుముదాక్షుడు శ్రీహరి పార్శదులలో ఒకడు. వామనుడు త్రివిక్రమం చాలించాక రాక్షససేన యుద్ధానికి సిద్ధపడుతుంటే, హరిపరిచరులు సునంద నంద జయ జయంత విజయ ప్రబలోద్బల కుముద కుముదాక్ష తార్క్ష్య పుష్పదంత విష్వక్సేన శ్రుతదేవ సాత్వత ప్రముఖులు కూడ సిద్ధమయ్యారు. కాని తన సేనలను బలి నివారించాడు. - :వంశం - దైవ యోని;:::::::పద్య సం.(లు) - 8-634-వ.,

[ ⇑ ] :370) కుముదాప్తుడు- (పురుష){సంజ్ఞా}[దైవ యోని]:- కుముదాప్తుడు అంటే కుముదములకు మిత్రుడైన వాడు, చంద్రుడు - :వంశం - దైవ యోని;:::::::పద్య సం.(లు) - 10.,3830-సీ.,

[ ⇑ ] :371) కుముదుడు-1 (పురుష){సంజ్ఞా}[ఋషి]:- కుముదుడు, శునకుడు, జాబాలి, బభ్రువు, అంగిరసుడు, సైంధవాయునుడు పథ్యుడు నుండి తమ తమ అధర్వవేద శాఖలను నేర్చుకున్నారు. - :వంశం - ఋషి;:::::::పద్య సం.(లు) - 12-30-వ.,

[ ⇑ ] :372) కుముదుడు-2 (పురుష){సంజ్ఞా}[దైవ యోని]:- కుముదుడు శ్రీహరి అనుచరులలో ఒకడు. వైకుంఠపుర దర్శన వర్ణనలో బ్రహ్మదేవునికి సాక్షాత్కారం ఒసగినప్పుడు, విష్ణుమూర్తిని నందుడు, సునందుడు, కుముదుడు మున్నగువారు సేవిస్తున్నారు. - :వంశం - దైవ యోని;:::::::పద్య సం.(లు) - 2-238-వ., 7-303-వ., 8-634-వ.,

[ ⇑ ] :373) కుముదుడు-3 (పురుష){సంజ్ఞా}[వానర యోని]:- కుముదుడు వానరయోధుడు. రామరావణ యుద్ధంలో రాముని తరఫున యుద్ధం చేసాడు. - :వంశం - వానర యోని;:::::::పద్య సం.(లు) - 9-291-వ.,

[ ⇑ ] :374) కురంగ పర్వతం- ( - ){సంజ్ఞా}[పర్వతం]:- మేరుపర్వతం తామరదుద్దు. దాని చుట్టూ కురంగం, కురరం, కుసుంభం, వైకంకతం, త్రికూటం, శిశిరం, పతంగం, రుచకం, విషధం, శితివాసం, కపిలం, శంఖం మొదలైన పర్వతాలు కేసరాలుగా ఉన్నాయి. - :వంశం - పర్వతం;:::::::పద్య సం.(లు) - 5.2-30-వ.,

[ ⇑ ] :375) కురంగమదము- ( -){జాతి}[వస్తువు]:- కురంగమదము అంటే కస్తూరి (కస్తూరిమృగ మదము) అను సుగంధద్రవ్యము. - :వంశం - వస్తువు;:::::::పద్య సం.(లు) - 5.2-165-చ.,

[ ⇑ ] :376) కురంగము- (స్త్రీ){జాతి}[జంతు]:- కురంగము అంటే లేడి - :వంశం - జంతు;:::::::పద్య సం.(లు) - 2-162-చ., 7-215-శా., 8-216-వ.,.,.,

[ ⇑ ] :377) కురంటక - ( -){జాతి}[వృక్ష]:- పచ్చగోరింట - ఇవి అష్టమ స్కంధములోని త్రికూట పర్వతములో వర్ణించబడ్డాయి - :వంశం - వృక్ష;:::::::పద్య సం.(లు) - 8-23-సీ., 8-24-వ., 8-25-క., 10.1-766-వ.,

[ ⇑ ] :378) కురర- (స్త్రీ){జాతి}[గగనచర]:- కురర అంటే లకుముకి పిట్ట - :వంశం - గగనచర;:::::::పద్య సం.(లు) - 11-97-వ,

[ ⇑ ] :379) కురర పర్వతం- ( - ){సంజ్ఞా}[పర్వతం]:- మేరుపర్వతం తామరదుద్దు. దాని చుట్టూ కురంగం, కురరం, కుసుంభం, వైకంకతం, త్రికూటం, శిశిరం, పతంగం, రుచకం, విషధం, శితివాసం, కపిలం, శంఖం మొదలైన పర్వతాలు కేసరాలుగా ఉన్నాయి. - :వంశం - పర్వతం;:::::::పద్య సం.(లు) - 5.2-30-వ.,

[ ⇑ ] :380) కురరి- (స్త్రీ){జాతి}[గగనచర]:- కురరి అంటే ఆడు లకుముకి పిట్ట - :వంశం - గగనచర;:::::::పద్య సం.(లు) - 7-226-వ.,

[ ⇑ ] :381) కురవక - ( -){జాతి}[వృక్ష]:- ఎఱ్ఱగోరింట - ఇవి అష్టమ స్కంధములోని త్రికూట పర్వతములో వర్ణించబడ్డాయి - :వంశం - వృక్ష;:::::::పద్య సం.(లు) - 3-42-చ., 3-108-చ., 4-937-వ., 4-135-వ., 8-23-సీ., 8-24-వ., 8-25-క., 10.1-1198-క.,

[ ⇑ ] :382) కురు-1 ( -){సంజ్ఞా}[ప్రదేశం]:- ఉషాకుమారికి కలలో కనబడిన రాకుమారుని కముగొనుటకు, ఆమె నెచ్చెలి, మంత్రిపుత్రీ అయిన చిత్రరేఖ రాజుల చిత్రాలు అన్నీ వేసింది. అలా వేసిన చిత్రాలలో మాళవ, కొంకణ, ద్రవిడ, మత్స్య, పుళింద, కళింగ, భోజ, నేపాల, విదేహ, పాండ్య, కురు, బర్బర, సింధు, యుగంధర, ఆంధ్ర, బంగాళ, కరూశ, టేంకణ, త్రిగర్త, సుధేష్ణ, మరాట, లాట, పాంచాల, నిషాద, ఘూర్జర, సాళ్వ దేశాల ప్రభువులు ఉన్నారు చూడు అని చూపించింది. - :వంశం - ప్రదేశం;:::::::పద్య సం.(లు) - 10.2-348-ఉ.,

[ ⇑ ] :383) కురు-2 ( -){సంజ్ఞా}[మానవ యోని]:- కురువంశము - :వంశం - మానవ యోని;:::::::పద్య సం.(లు) - 1-79-సీ., 1-185-మ., ,

[ ⇑ ] :384) కురుక్షేత్రము- ( -){సంజ్ఞా}[ప్రదేశము]:- కురుక్షేత్రము నందు కౌరవపాండవుల యుద్ధం జరిగింది
శభకాముడైనవాడు సేవించవలసినవి కురుక్షేత్రము, గయాశీర్షము, ప్రయాగ మున్నగునవి.
ఋక్షకుని కొడుకైన సవంరణుడు తన భార్య సూర్యకన్య అయిన తపతి యందు పుట్టిన పుత్రుడు కురువు నిర్మించడం వలన ఇది కురుక్షేత్రము అని పేరుపొందినది. - :వంశం - ప్రదేశము;:::::::పద్య సం.(లు) - 1-206-వ., 1-243-వ., 7-451-వ., 9-659-వ.,

[ ⇑ ] :385) కురుజాంగలము- ( -){సంజ్ఞా}[ప్రదేశము]:- శుకబ్రహ్మ కురుజాంగల దేశములు దాటి వచ్చి, హస్తినలో ప్రాయోపవిష్టుడై ఉన్న పరీక్షిత్తు కడకు వచ్చాడు. - :వంశం - ప్రదేశము;:::::::పద్య సం.(లు) - 1-78-వ., 1-243-వ., 3-46-చ.,

[ ⇑ ] :386) కురుభూములు- ( - ){సంజ్ఞా}[ప్రదేశము]:- బ్రహ్మనగరం దక్షిణద్వారం నుండి వెలువడిన అలకనందా ప్రవాహం మిక్కిలి దుర్గమాలైన పర్వత పంక్తుల గుండా, హేమకూటం హిమకూటం అనే పర్వతాలు, భారతవర్షం మీదుగా వెళ్ళి దక్షిణ సముద్రంలో కలుస్తుంది. - :వంశం - ప్రదేశము;:::::::పద్య సం.(లు) - 5.2-34-వ.,

[ ⇑ ] :387) కురువర్షము- ( -){సంజ్ఞా}[ప్రదేశము]:- అగ్నీధ్రుని కొడుకు కురువు ఏలిన జంబూ ద్వీపములోని వర్షము కురువర్షము
మూడు సీమా పర్వతాల నడిమి ప్రదేశంలో రమ్యకం, హిరణ్మయం, కురు అనే మూడు వర్షాలు ఉన్నాయి. అవి ఒక్కొక్కటి తొమ్మిది వేల యోజనాల విస్తృతి కలిగి ఉన్నాయి. ఇవన్నీ సముద్రం దాకా వ్యాపించి ఉన్నాయి. ఆ మూడు వర్షాల పొడవు నీల శ్వేత శృంగవత్పర్వతాల పొడవుతో సమానంగా ఉంటుంది. - :వంశం - ప్రదేశము;:::::::పద్య సం.(లు) - 5-2-20-వ., 5.1-40-వ.,

[ ⇑ ] :388) కురువశుడు- (పురుష){సంజ్ఞా}[చంద్రవంశం]:- కురువశుడు చంద్ర వంశములో మధువునకు పుత్రుడు. ఇతని కొడుకు అనువు - :వంశం - చంద్రవంశం;:తండ్రి - మధువు;::::కొడుకు(లు) - అనువు;::పద్య సం.(లు) - 9-709-వ.,

[ ⇑ ] :389) కురువు-1 (పురుష){సంజ్ఞా}[మానవ యోని]:- కురువు అగ్నీధ్రుని తొమ్మిది కొడుకులలో ఏడవ వాడు. ఆ తొమ్మిది మంది ఆగ్నీధ్రుని కొడుకులు ఎవరంటే, నాభి, కింపురుషుడు, హరివర్షుడు, ఇలావృతుడు, రమ్యకుడు, హిరణ్మయుడు, కురువు, భద్రాశ్వుడు, కేతుమాలుడు. వీరు తండ్రి అనుమతితో జంబూద్వీపాన్ని వారివారి పేరులతో వర్షములుగా విభజించుకుని పరిపాలించారు. ఈ తొమ్మండుగురు ఆగ్నీధ్రుని కుమారులు మేరు కుమార్తెలైన మేరుదేవి, ప్రతిరూప, ఉగ్రదంష్ట్ర, లత, రమ్య, శ్యామ, నారి, భద్ర, దేవి అనేవాళ్ళను వరుసగా వివాహమాడారు. - :వంశం - మానవ యోని;:తండ్రి - అగ్నీధ్రుడు ;:తల్లి - పూర్వ చిత్తి;:భార్య - నారి;::::పద్య సం.(లు) - 5.1-40-వ.,

[ ⇑ ] :390) కురువు-2 (పురుష){సంజ్ఞా}[చంద్రవంశం]:- కురువు చంద్రవంశమువాడు. ఇతిని పేర కృరుక్షేత్రం అయింది, కౌరవ వంశ మూలపురుషుడు - :వంశం - చంద్రవంశం;:తండ్రి - సంవరణుడు;::::కొడుకు(లు) - పరీక్షిత్తు, సుధనువు, జహ్నవి, నిషదుడు;::పద్య సం.(లు) - 9-659-వ.,

[ ⇑ ] :391) కులకులు- (పురుష){జాతి}[మానవ యోని]:- కుశ వర్షంలో కుశలులు, కోవిదులు, అభియుక్తులు, కులకులు అనే నాలుగు వర్ణాలవారు ఉన్నారు. వారు యజ్ఞపురుషుని ఆరాధిస్తుంటారు. - :వంశం - మానవ యోని;:::::::పద్య సం.(లు) - 5.2-64-వ.,

[ ⇑ ] :392) కులశైలములు- ( -){జాతి}[ప్రదేశము]:- కులశైలము అంటే కులపర్వతము, కులపర్వతాలంత శరీరాలతో హిరణ్యాక్ష హిరణ్యకశిపులు మెలగుతున్నారట
వరాహావతారుడు ఒక్కక్కసారి కులపర్వతాలను చిమ్ముతున్నాడట.
సురాసుర యుద్ధంలో భేరీ వాద్యాలనుండి వెలువడే భం అనే శబ్దాలూ, ఏనుగుల ఘీంకారాలూ, గుఱ్ఱాల సకిలింపులూ, పెద్ద పెద్ద రథచక్రాల శబ్దాలూ ఎంత భయంకరంగా ఉన్నాయంటే, కులపర్వతాలు సైతం తలకిందులేపోతున్నాయి. - :వంశం - ప్రదేశము;:::::::పద్య సం.(లు) - 3-609-మ., 3-637-సీ., 8-327-క., నుండి 8-334-వ., వరకు,

[ ⇑ ] :393) కులిశము- ( -){జాతి}[ఆయుధము]:- కులిశము అంటే వజ్యాయుధము - :వంశం - ఆయుధము;:::::::పద్య సం.(లు) - 1-398-సీ., 3-55-మ., 3-481-తే.,.,.,.,

[ ⇑ ] :394) కుళికుడు- (పురుష){సంజ్ఞా}[నాగ జాతి]:- పాతాళలోకంలో వాసుకి, శంఖుడు, కుళికుడు, మహాశంఖుడు, శ్వేతుడు, ధనంజయుడు, ధృతరాష్ట్రుడు, శంఖచూడుడు, కంబళుడు, అశ్వతరుడు, దేవదత్తుడు మొదలైనవారు మహానాగులుఉంటారు. వారికి ఐదు, నూరు వేయి తలలు ఉంటాయి. వారి పడగల మీద మణులు మెరుస్తూ ఉంటాయి. ఆ మణుల కాంతులు పాతాళంలోని చీకట్లను పారద్రోలుతుంటాయి. - :వంశం - నాగ జాతి;:::::::పద్య సం.(లు) - 5.2-121-వ.,

[ ⇑ ] :395) కువలయము-1 ( -){సంజ్ఞా}[ప్రదేశము]:- కువలయము అంటే భూమండలము. హిరణ్యాక్షుని ఎదుట వరాహావతారుడైన విష్ణువు, తన కోరలపై భూమిని మోయడానికి సిద్ధంగా ఉన్నాడట - :వంశం - ప్రదేశము;:::::::పద్య సం.(లు) - 1-470-క., 3-633-క., 3-1054-మాలి., 9-31-ఆ., 9-230-వ.,

[ ⇑ ] :396) కువలయము-2 ( -){జాతి}[వృక్ష]:- కువలయము అంటే కలువ - :వంశం - వృక్ష;:::::::పద్య సం.(లు) - 3-817-వ., 5.2-107-వ.,

[ ⇑ ] :397) కువలయాక్షి- (స్త్రీ){సంజ్ఞా}[మానవ యోని]:- కువలయ (కలువల) వంటి అక్షి (కన్నులు గలామె), స్త్రీ - :వంశం - మానవ యోని;:::::::పద్య సం.(లు) - 3-817-వ.,

[ ⇑ ] :398) కువలయాపీడము- (పురుష){సంజ్ఞా}[జంతు]:- కువలయాపీడ అను పేరుగల గజము కంసుని వద్ద ఉండేది. దానిని శ్రీకృష్ణ బలరాములు మల్లరంగ ప్రవేశానికి పూర్వం సంహరించారు. - :వంశం - జంతు;:::::::పద్య సం.(లు) - 10.1-1155-శా., 10.1-1315-క., నుండి 10.1-1324-మ., వరకు,

[ ⇑ ] :399) కువలయాశ్వుడు-1 (పురుష){సంజ్ఞా}[సూర్య వంశం]:- రాజ్యమోహంతో గర్వాంధులైన రాజులను చూసి భూదేవి నవ్వుకుంటుంది అంటూ పేర్కొన్న ఇరవై ఎనిమిది రాజులలో ఇతను ఒకడు. - :వంశం - సూర్య వంశం;:::::::పద్య సం.(లు) - 12-18-వ.,

[ ⇑ ] :400) కువలయాశ్వుడు-2 (పురుష){సంజ్ఞా}[సూర్యవంశం]:- కువలయాశ్వుడు - ఇతని ఇంకొక పేరు ధుంధుమారుడు. ఇతను ఉదంకుడు అను విప్రుని ఆజ్ఞమేరకు, దుందుడు అనే రాక్షసుని సంహరించాడు. ఆ యుద్ధంలో అతని ఇరవైయొక్క వేయి కొడుకులలో దృఢాశ్వుడు, కపిలాశ్వడు, భద్రాశ్వుడు అను ముగ్గురు కొడుకులు మాత్రమే బ్రతికారు. - :వంశం - సూర్యవంశం;:తండ్రి - బృహదశ్వుడు;::::::పద్య సం.(లు) - 9-163-వ.,

[ ⇑ ] :401) కువలయాశ్వుడు-3 (పురుష){సంజ్ఞా}[చంద్రవంశం]:- చంద్రవంశంలోని ఈ కువలయాశ్వుడు తండ్రి ప్రతర్ధనుడు. ప్రతర్ధనునికి శత్రుజిత్తని, ఋతధ్వజుడని కూడ అంటారు. కువలయాశ్వుని కొడుకు అలర్కుడు. - :వంశం - చంద్రవంశం;:తండ్రి - ప్రతర్దనుడు;::::కొడుకు(లు) - అలర్కుడు;::పద్య సం.(లు) - 9-399-వ., 5-500-ఆ.,

[ ⇑ ] :402) కుశ ద్వీపము- ( - ){సంజ్ఞా}[ప్రదేశం]:- సప్తద్వీపాలలో ఒకటి. ఆ సప్తద్వీపాల పేర్లు 1.జంబూ ద్వీపము, 2.ప్లక్ష ద్వీపము, 3.శాల్మలీ ద్వీపము, 4.కుశ ద్వీపము, 5.క్రౌంచ ద్వీపము, 6.శాక ద్వీపము, 7.పుష్కర ద్వీపము వీటిని ప్రియవ్రతుడు విభాగించి, తన ఏడుగురు కొడుకులకు అప్పజెప్పాడు.
సురాసముద్రం ఆవల ఉన్న కుశద్వీపం ఎనిమిది లక్షల యోజనాల విస్తృతి కలిగనది. దాని మధ్య ఉన్న పెద్ద కుశస్తంబం వల్లనే దీనికి కుశద్వీపం అనే పేరు కలిగింది. ప్రియవ్రతుని పుత్రుడు హిరణ్యరేతసుడు అనేవాడు దీనికి అధిపతి. అతడు వసుదానుడు, దృఢరుచి, నాభి, గుప్తుడు, సత్యవ్రతుడు, విప్రుడు, వామదేవుడు అనే తన కుమారుల పేర్లతో ఆ ద్వీపాన్ని ఏడు వర్షాలుగా విభజించాడు.
కుశద్వీపంలోని నదులు రసకుల్య, మధుకుల్య, శ్రుతవింద, మిత్రవింద, దేవగర్భ, ఘృతచ్యుత, మంత్రమాల; పర్వతములు బభ్రువు, చతుశ్శృంగ, కపిల, చిత్రకూట, దేవానీక, ఊర్ధ్వరోమ, ద్రవిణము; చతుర్వర్ణములు కుశల, కోవిద, అభియుక్త, కులక. - :వంశం - ప్రదేశం;:::::::పద్య సం.(లు) - 5.2-17-వ., 5,2-63-సీ., 5,2-64-వ., 5.2-65-సీ.,

[ ⇑ ] :403) కుశధ్వజుడు- (పురుష){సంజ్ఞా}[సూర్యవంశం]:- కుశధ్వజుడు సీతాదేవి సోదరుడు. కుశధ్వజుడు సూర్యవంశములోని సీరధ్వజుని కుమారుడు. సీరధ్వజునికి నాగలి కొసనందు సీతాదేవి జనించి లభించింది. కనుక కుశధ్వజుడు సీతాదేవి సోదరుడు. . కుశధ్వజుని కొడుకు ధర్మధ్వజుడు - :వంశం - సూర్యవంశం;:తండ్రి - సీరధ్వజుడు;::::కొడుకు(లు) - ధర్మధ్వజుడు;::పద్య సం.(లు) - 9-373-ఆ., 9-374-వ.,

[ ⇑ ] :404) కుశనాభుడు- (పురుష){సంజ్ఞా}[చంద్రవంశం]:- చంద్రవంశంలోని అజకుని కొడుకైన కుశునికి కుశాంబువు, దూర్తయుడు, వసువు, కుశనాభుడు అని నలుగురు కొడుకులు - :వంశం - చంద్రవంశం;:తండ్రి - కుశుడు;::::::పద్య సం.(లు) - 9-422-వ.,

[ ⇑ ] :405) కుశలులు- (పురుష){జాతి}[మానవ యోని]:- కుశ వర్షంలో కుశలులు, కోవిదులు, అభియుక్తులు, కులకులు అనే నాలుగు వర్ణాలవారు ఉన్నారు. వారు యజ్ఞపురుషుని ఆరాధిస్తుంటారు. - :వంశం - మానవ యోని;:::::::పద్య సం.(లు) - 5.2-64-వ.,

[ ⇑ ] :406) కుశస్తంబం- ( -){జాతి}[వృక్ష]:- సురాసముద్రం ఆవల ఉన్న కుశద్వీపం ఎనిమిది లక్షల యోజనాల విస్తృతి కలిగనది. దాని మధ్య ఉన్న పెద్ద కుశస్తంబం వల్లనే దీనికి కుశద్వీపం అనే పేరు కలిగింది. - :వంశం - వృక్ష;:::::::పద్య సం.(లు) - 5,2-63-సీ., 5.2-64-వ.,

[ ⇑ ] :407) కుశస్థలి- ( - ){సంజ్ఞా}[ప్రదేశము]:- ఆనర్తుని కుమారుడైన రైవతుడు కుశస్థలి అను పురమును నిర్మించాడు.
ద్వారకానగరమునకు కుశస్థలి అని పేరు.
శుభకాముడైనవాడు కురుక్షేత్రము, గయాశీర్షము, ప్రాభాసము, కుశస్థలి మున్నగు పుణ్యక్షేత్రములను సేవించవలెను - :వంశం - ప్రదేశము;:::::::పద్య సం.(లు) - 9-70-సీ., 10.2-307-ఉ., 10.2-813-వ., 10.2-1202-చ., 7-451-వ.,

[ ⇑ ] :408) కుశాంబుడు- (పురుష){సంజ్ఞా}[చంద్రవంశం]:- చంద్రవంశంలోని అజకుని కొడుకైన కుశునికి కుశాంబువు, దూర్తయుడు, వసువు, కుశనాభుడు అని నలుగురు కొడుకులు. కుశాంబువు కుమారుడు గాధి. - :వంశం - చంద్రవంశం;:తండ్రి - కుశుడు;::::కొడుకు(లు) - గాధి;::పద్య సం.(లు) - 9-422-వ.,

[ ⇑ ] :409) కుశాగ్రుడు- (పురుష){సంజ్ఞా}[చంద్రవంశం]:- చంద్రవంశంలోని బృహద్రథుని కొడుకు కుశాగ్రుడు. కుశాగ్రుని కొడుకు ఋషభుడు. - :వంశం - చంద్రవంశం;:తండ్రి - బృహద్రథ;::::కొడుకు(లు) - ఋషభుడు;::పద్య సం.(లు) - 9-650-వ.,

[ ⇑ ] :410) కుశావర్తము- ( -){సంజ్ఞా}[ప్రదేశము]:- కుశావర్తము భారత వర్షమునందలి తొమ్మిది వర్షములలో ఒకటి. ఆ తొమ్మిది వర్షములు కుశావర్తము, ఇలావర్తము, బ్రహ్మావర్తము, ఆర్యావర్తము, మలయకేతువు, భద్రసేనము, ఇంద్రస్పృశము, విదర్భ, కీకటము. - :వంశం - ప్రదేశము;:::::::పద్య సం.(లు) - 5.1-63-సీ., 5.1-64-వ.,

[ ⇑ ] :411) కుశావర్తుడు- (పురుష){సంజ్ఞా}[ప్రియవ్రతుని వంశం]:- ఋషభుని వందమంది కొడుకులలో ఒకడు, భరతుడు ఇతనితో పాటు తొమ్మిది మంది తమ్ముళ్ళకు భరత వర్షంలోని వారి వారి పేర బరగు భాగాలను పంచి ఇచ్చాడు. వారు కుశావర్తుడు, ఇలావర్తుడు, బ్రహ్మావర్తుడు, ఆర్యావర్తుడు, మలయకేతువు, భద్రసేనుడు, ఇంద్రస్పృశుడు, విదర్భుడు, కీకటుడు - :వంశం - ప్రియవ్రతుని వంశం;:తండ్రి - ఋషభుడు;:తల్లి - జయంతి ;:::::పద్య సం.(లు) - 5.1-63-సీ., 5.1-64-వ.,

[ ⇑ ] :412) కుశుడు-1 (పురుష){సంజ్ఞా}[సూర్య వంశం]:- సీతా రాములకు కుశలవులని ఇద్దరు కొడుకులు సీతను అడవికి పంపినప్పుడు వాల్మీకి ఆశ్రమంలో పుట్టారు. కొంతకాలానికి రామకథాశ్లోకంబులు పాడుతూ రాముడు చేస్తున్న యాగం వద్దకు వెళ్ళారు. పిమ్మట సీత వారిని రామునికి అప్పజెప్పి భూవివరంలోకి వెళ్ళిపోయింది. ఆ కుశునికి కొడుకు అతిథి. - :వంశం - సూర్య వంశం;:తండ్రి - శ్రీరాముడు;:తల్లి - సీత;:::కొడుకు(లు) - అతిథి;::పద్య సం.(లు) - 9-347-వ., 9-364-వ.,

[ ⇑ ] :413) కుశుడు-2 (పురుష){సంజ్ఞా}[చంద్రవంశం]:- పూరుని మనుమడైన అజకునికి కుమారుడు కుశుడు. ఆ కుశునికి కుశాంబుడు, ధూర్తయుడు, వసువు, కుశనాభుడు అని నలుగురు కొడుకులు. - :వంశం - చంద్రవంశం;:తండ్రి - అజకుడు;::::కొడుకు(లు) - కుశాంబుడు, ధూర్తయుడు, వసువు, కుశనాభుడు;::పద్య సం.(లు) - 9-422-వ.,

[ ⇑ ] :414) కుశుడు-3 (పురుష){సంజ్ఞా}[చంద్రవంశం]:- చంద్రవంశంలోని సుహ్రోతుని ముగ్గురు కుమారులలో రెండవ వాడు కుశుడు. ఇతని అన్నదమ్ములు కాశ్యుడు, కృత్స్నమదుడు. - :వంశం - చంద్రవంశం;:తండ్రి - సుహ్రోతుడు;::::::పద్య సం.(లు) - 9-497-వ.,

[ ⇑ ] :415) కుశుడు-4 (పురుష){సంజ్ఞా}[చంద్రవంశం]:- సుహోత్రున రెండవ కొడుకైన కుశునికి ప్రీతి అను కుమారుడు కలిగాడు. - :వంశం - చంద్రవంశం;:తండ్రి - క్షత్రవృద్ధుడు;::::కొడుకు(లు) - ప్రీతి;::పద్య సం.(లు) - 9-497-వ.,

[ ⇑ ] :416) కుశుడు-5 (పురుష){సంజ్ఞా}[చంద్రవంశం]:- జ్యాముఖునకు శైబ్య యందు కలిగిన విదర్భుని కుమారుడు కుశుడు, క్రుథుడు, రోమపాదుడు పుట్టారు - :వంశం - చంద్రవంశం;:తండ్రి - విదర్భుడు;::::::పద్య సం.(లు) - 9-708-క., 9-709-వ.,

[ ⇑ ] :417) కుసుంభ- (పురుష){సంజ్ఞా}[చంద్రవంశం]:- చంద్రవంశంలో చ్యవనుని కుమారుడైన ఉపరిచరవసువునకు బృహద్రథుడు, మత్స్యుడు, కుసుంభుడు, ప్రత్యగ్రుడు, చేదిషుడు మున్నగు కుమారులు కలిగారు. - :వంశం - చంద్రవంశం;:తండ్రి - ఉపరిచరవసువు;::::::పద్య సం.(లు) - 9-659-వ.,

[ ⇑ ] :418) కుసుంభ పర్వతము- ( - ){సంజ్ఞా}[పర్వతం]:- మేరుపర్వతం తామరదుద్దు. దాని చుట్టూ కురంగం, కురరం, కుసుంభం, వైకంకతం, త్రికూటం, శిశిరం, పతంగం, రుచకం, విషధం, శితివాసం, కపిలం, శంఖం మొదలైన పర్వతాలు కేసరాలుగా ఉన్నాయి. - :వంశం - పర్వతం;:::::::పద్య సం.(లు) - 5.2-30-వ.,

[ ⇑ ] :419) కుసుమకోమలి- (స్త్రీ){జాతి}[మానవ యోని]:- పూలవంటి సుకుమారి - :వంశం - మానవ యోని;:::::::పద్య సం.(లు) - 8-50-వ.,

[ ⇑ ] :420) కుసుమశరుడు- (పురుష){సంజ్ఞా}[దైవ యోని]:- కుసుమశరుడు అంటే పువ్వుల బాణములు కలవాడు, మన్మథుడు అని అర్థం - :వంశం - దైవ యోని;:::::::పద్య సం.(లు) - 3-507-వ., 10.1-1003-వ., 10.1-1040ఆ., 10.1-1713-సీ.,

[ ⇑ ] :421) కుసుమాస్త్రుడు- (పురుష){సంజ్ఞా}[దైవ యోని]:- కుసుమాస్త్రుడు అంటే పువ్వుల బాణములు కలవాడు, మన్మథుడు అని అర్థం - :వంశం - దైవ యోని;:::::::పద్య సం.(లు) - 9-308-ఉ., 9-615-క., 10.2-676-క.,

[ ⇑ ] :422) కుసుమిత - ( -){జాతి}[వృక్ష]:- పూలు పూసిన (చెట్లు, తీగలు) - ఇవి అష్టమ స్కంధములోని త్రికూట పర్వతములో వర్ణించబడ్డాయి - :వంశం - వృక్ష;:::::::పద్య సం.(లు) - 8-23-సీ., 8-24-వ., 8-25-క., 10.1-719-వ., 10.1-1084-వ., 10.2-565-వ.,

[ ⇑ ] :423) కుహకుడు- (పురుష){సంజ్ఞా}[నాగ యోని]:- కశ్యపునికి కద్రువ యందు కలిగిన అనేక సర్పములలో, ఒక సాటిలేనిమేటి సర్పము, మహాతలంలో కుహకుడు, తక్షకుడు, కాళియుడు, సుషేణుడు మొదలైన సాటిలేని మేటిరూపం కల సర్ప ముఖ్యు లున్నారు. - :వంశం - నాగ యోని;:తండ్రి - కశ్యపుడు;:తల్లి - కద్రువ;:::::పద్య సం.(లు) - 5-2-118-క., 5.2-119-వ.,

[ ⇑ ] :424) కుహువు-1 (స్త్రీ){సంజ్ఞా}[దైవ యోని]:- సార్వోచిష మన్వంతరంలో, అంగిరసునికి శ్రద్ధ యను భార్య యందు సినీవాలి, కుహూ (కుహువు, కూహూ), రాక, అనుమతి అనెడు నలుగురు కుమార్తెలు.
ద్వాదశాదిత్యులు అను అదితి సంతానమైన పన్నెండుగురులోనూ ఏడవవాడైన ధాతకు కుహువు (చంద్రకళ కనిపించని అమావాస్య), సినీవాలి (చంద్రకళ కనిపించే అమావాస్య), రాక (పౌర్ణమి), అనుమతి (ఒక కళ తక్కువైన చంద్రుడున్న పౌర్ణమి) అని నలుగురు భార్యలు. వారిలో కుహూదేవికి సాయం(కాలం) అను పుత్రుడు కలిగాడు - :వంశం - దైవ యోని;:తండ్రి - అంగిరసుడు;:తల్లి - శ్రద్ధ ;::భర్త - ధాత ;:కొడుకు(లు) - సాయంకాలం;::పద్య సం.(లు) - 4-25-క., 6-507-వ.,

[ ⇑ ] :425) కుహువు-2 ( -){సంజ్ఞా}[నది]:- దేవబర్హ వర్షం శాల్మలీ మహాద్వీపంలో ఉంది. దీనిలో కుముదం అను పర్వతం, కుహువు అను మహానది ఉన్నాయి. - :వంశం - నది;:::::::పద్య సం.(లు) - 5.2-62-వ.,

[ ⇑ ] :426) కూటరం- ( -){సంజ్ఞా}[పర్వతం]:- భారతవర్షంలోని ప్రసిద్ధమైన అనేక పర్వతాలలో ఒకటి. - :వంశం - పర్వతం;:::::::పద్య సం.(లు) - 5.2-55-వ.,

[ ⇑ ] :427) కూపకర్ణుడు- (పురుష){సంజ్ఞా}[రాక్షస యోని]:- కుంభాండక, కూపకర్ణులు రాక్షసులు బలరాముని చేతిలో మరణించారు - :వంశం - రాక్షస యోని;:::::::పద్య సం.(లు) - 10.2-417-మ.,

[ ⇑ ] :428) కూర్మ- (పురుష){సంజ్ఞా}[దైవయోని]:- కూర్మావతారము ప్రథమ స్కంధములో వివరించిన వైష్ణవ అవతారాలలో ప్రధానమైన ఏకవింశ త్యవతారములు (21) అందలి 11 వ. అవతారం (1-63-వ.)
మఱియు, ద్వితీయ స్కంధములో అవతారముల వైభవంలో వివరించిన పంచవింశతి అవతారాలు (25) అందలి 13 వ. అవతారం. ఇది బ్రహ్మదేవుడు నారదునికి ఉపదేశించే నాటికి, జరిగిన పద్దెనిమిది అవతారాలులోనిది (2-144-మ).
మఱియు, ఏకాదశ స్కంధములో వివరించిన దశా వతారములు(10) అందలి 2 వ. అవతారం. - :వంశం - దైవయోని;:::::::పద్య సం.(లు) - 1-63-వ., 1-383-వ., 2-144-మ., 8-136-వ., 8-141-సీ., 8-143-మ., 8-202-సీ., 11-71-వ.,

[ ⇑ ] :429) కూర్మకులశేఖరుడు- (పురుష){సంజ్ఞా}[దైవ యోని]:- కూర్మావతారుడు కూర్మములు అన్నింటిలోనూ తలమానికమైనవాడు కనుక కూర్మకులశేఖరుడు - :వంశం - దైవ యోని;:::::::పద్య సం.(లు) - 7-285-వ.,

[ ⇑ ] :430) కూర్మము-1 ( -){జాతి}[నిధులు]:- కుబేరుని వద్ద ఉండే నవనిధులలో ఒకటి. ద్వారకకు తరలి వచ్చిన శ్రీకృష్ణునికి సకల లోకపాలకులు కానుకలు సమర్పించారు. వారిలో కుబేరుడు మత్స్యం, కూర్మం, పద్మం, మహాపద్మం, శంఖం, ముకుందం, కచ్ఛపం, నీలం, అనే పేర్లు కల ఎనిమిది నిధులను సమర్పించాడు. - :వంశం - నిధులు;:::::::పద్య సం.(లు) - 10.1-1613-వ.,

[ ⇑ ] :431) కూర్మము-2 (స్త్రీ){జాతి}[జంతు]:- కూర్మము అంటే పంది - :వంశం - జంతు;:::::::పద్య సం.(లు) - 3-344-వ.,

[ ⇑ ] :432) కూర్మము-3 (పురుష){సంజ్ఞా}[దైవ యోని]:- వీరు అంతులేని నరకాలనుండి కాపాడు గాక అని విశ్వరూపుడు దేవేంద్రునికి ఉపదేశించిన శ్రీమన్నారాయణ కవచంలో ఉన్న నలభైతొమ్మిది స్తుతులలో ఇది ఒకటి. - :వంశం - దైవ యోని;:::::::పద్య సం.(లు) - 6-300-చ., నుండి 6-307-వ.,

[ ⇑ ] :433) కూర్మరాజు- (పురుష){సంజ్ఞా}[దైవ యోని]:- ఆదికూర్మము కూర్మములలో శ్రేష్ఠమైనవాడు కనుక కూర్మరాజు - :వంశం - దైవ యోని;:::::::పద్య సం.(లు) - 8-114-వ.,

[ ⇑ ] :434) కూర్మావతారము- (పురుష){సంజ్ఞా}[దైవ యోని]:- హిరణ్మయ వర్షానికి దైవం కూర్మమూర్తి. అధిపతి అర్యముడు - :వంశం - దైవ యోని;:::::::పద్య సం.(లు) - 2-143-వ., 5.2-47-క.,

[ ⇑ ] :435) కూశ్మాండులు- (పురుష){జాతి}[పిశాచ యోని]:- కూశ్మాండులు పిశాచ భేదము. జీవులు తమ కర్మానుసారం దాల్చు జాతుల వర్ణనలో చెప్పినది కూశ్మాండులు ఒకటి.
నారాయణ కవచములో గదాయుధమును కూశ్మాండ మున్నగు వానిని పిండిపిండి చేయమని ప్రార్థన.
శ్రీకృష్ణుని పేర్కొనిన కూశ్మాండాది పిశాచభేదములు నశించును, అని గోపికలు బాలకృష్ణునికి రక్షచేసి దీవించిరి. - :వంశం - పిశాచ యోని;:::::::పద్య సం.(లు) - 2-274-సీ., 6-307-వ.,

[ ⇑ ] :436) కూహూ- (స్త్రీ){సంజ్ఞా}[దైవ యోని]:- సార్వోచిష మన్వంతరంలో, అంగిరసునికి శ్రద్ధ యను భార్య యందు సినీవాలి, కుహూ (కుహువు, కూహూ), రాక, అనుమతి అనెడు నలుగురు కుమార్తెలు.
ద్వాదశాదిత్యులు అను అదితి సంతానమైన పన్నెండుగురులోనూ ఏడవవాడైన ధాతకు కుహువు (చంద్రకళ కనిపించని అమావాస్య), సినీవాలి (చంద్రకళ కనిపించే అమావాస్య), రాక (పౌర్ణమి), అనుమతి (ఒక కళ తక్కువైన చంద్రుడున్న పౌర్ణమి) అని నలుగురు భార్యలు. వారిలో కుహూదేవికి సాయం(కాలం) అను పుత్రుడు కలిగాడు - :వంశం - దైవ యోని;:తండ్రి - అంగిరసుడు;:తల్లి - శ్రద్ధ ;:::::పద్య సం.(లు) - 4-25-క., 6-507-వ.,

[ ⇑ ] :437) కృత- (పురుష){సంజ్ఞా}[చంద్రవంశం]:- వసుదేవునికి రోహిణి యందు కలిగిన పుత్రులు బలరాముడు, గదుడు, సారణుడు, దుర్మదుడు, విపులుడు, ధృవుడు, కృత మున్నగువారు. - :వంశం - చంద్రవంశం;:తండ్రి - వసుదేవుడు;:తల్లి - రోహిణి;:::::పద్య సం.(లు) - 9-722-వ.,

[ ⇑ ] :438) కృతకుడు- (పురుష){సంజ్ఞా}[చంద్రవంశం]:- కృష్ణుని తండ్రియైన వసుదేవునికి మదిర యందు నందుడు, ఉపనందుడు, కృతకుడు, శ్రుతుడు, శూరుడు మున్నగు పుత్రులు కలిగారు. - :వంశం - చంద్రవంశం;:తండ్రి - వసుదేవుడు;:తల్లి - మదిర;:::::పద్య సం.(లు) - 9-722-వ.,

[ ⇑ ] :439) కృతఘ్నుడు- (పురుష){సంజ్ఞా}[మానవ యోని]:- కృతఘ్నునకు చేయు ఉపకారం నిష్పల మవుతుంది. - :వంశం - మానవ యోని;:::::::పద్య సం.(లు) - 2-133-వ.,

[ ⇑ ] :440) కృతద్యుతి- (స్త్రీ){సంజ్ఞా}[మానవ యోని]:- కృష్ణద్వైపాయన, నారద, దేవల మహర్షులు శుకమునికి ఎఱింగించిన చిత్రకేతోపాఖ్యానములోని చిత్రకేతు అగ్రమహిషి కృతద్యుతి. - :వంశం - మానవ యోని;::::భర్త - చిత్రకేతుడు;:::పద్య సం.(లు) - 6-449-వ.,

[ ⇑ ] :441) కృతధ్వజుడు- (పురుష){సంజ్ఞా}[సూర్యవంశం]:- కృతధ్వజుడు సూర్యవంశపు రాజు. కృతధ్వజుని తండ్రి ధర్మధ్వజుడు. కృతధ్వజుని తమ్ముడు మితధ్వజుడు. కృతధ్వజుని కొడుకు ఆత్మజ్ఞాన నేర్పరి యైన కేశిధ్వజుడు - :వంశం - సూర్యవంశం;:తండ్రి - ధర్మధ్వజుడు;::::కొడుకు(లు) - కేశిధ్వజుడు;::పద్య సం.(లు) - 9-374-వ.,

[ ⇑ ] :442) కృతమాల- ( -){సంజ్ఞా}[మహానది]:- భారతవర్షంలోని ప్రసిద్ధమైన పర్వతాలకు పుత్రికలవంటివి అయిన మహానదులలో ఒక నది. - :వంశం - మహానది;:::::::పద్య సం.(లు) - 5.2-55-వ.,

[ ⇑ ] :443) కృతమాలిక- ( -){సంజ్ఞా}[జల ప్రాంతం]:- సత్యవ్రతుడు కృతమాలిక అను ఏరు వద్ద జలతర్పణము చేయుచుండగా, అతని దోసిలి లోనికి చిన్న చేపపిల్ల రూపంలో మత్స్యావతారుడు వచ్చి చేరాడు. - :వంశం - జల ప్రాంతం;:::::::పద్య సం.(లు) - 6-695-వ.,

[ ⇑ ] :444) కృతయుగము- ( -){సంజ్ఞా}[కాలము]:- చతుర్యుగములు నాలుగింటిలో ప్రథమ యుగము కృతయుగము - :వంశం - కాలము;:::::::పద్య సం.(లు) - 1-430-వ., 3-349-సీ., 7-384-వ., 9-337-వ., 11-77-వ.,

[ ⇑ ] :445) కృతరయుడు- (పురుష){సంజ్ఞా}[సూర్యవంశం]:- కృతరయుడు సూర్యవంశపురాజు. కృతరయుని తండ్రి ప్రతిబంధకుడు, కృతరయుని కొడుకు దేవమీఢుడు - :వంశం - సూర్యవంశం;:తండ్రి - ప్రతింధకుడు;::::కొడుకు(లు) - దేవమీఢుడు;::పద్య సం.(లు) - 9-372-వ.,

[ ⇑ ] :446) కృతవర్మ-1 (పురుష){సంజ్ఞా}[చంద్రవంశం]:- చంద్రవంశంలోని హృదికునకు దేవమీఢుడు, శతధనువు, కృతవర్మ అను ముగ్గురు కొడుకులు కలిగారు.
బలరామ కృష్ణులు తీర్థయాత్రకు బయలుదేరుతూ కృతవర్మాది వీరులకు ద్వారకానగర రక్షణము అప్పజెప్పారు.
అక్రూర, కృతవర్మల అనుమతితో శతధన్వుడు నిద్రిస్తున్న సత్రాజిత్తును చంపి శ్యమంతకమణిని కొనిపోయాడు. - :వంశం - చంద్రవంశం;:తండ్రి - హృదికుడు;::::::పద్య సం.(లు) - 1-348-సీ., 9-714-వ., 10.2-84-సీ., 10.2-85-వ., 10.2-1039-వ.,

[ ⇑ ] :447) కృతవర్మ-2 (పురుష){సంజ్ఞా}[చంద్రవంశం]:- దుర్మదుని కుమారుడైన ధనికునికి కృతవీర్యుడు, కృతాగ్ని, కృతవర్మ, కృతౌజుడు అని నలుగురు పుట్టారు. - :వంశం - చంద్రవంశం;:తండ్రి - ధనికుడు;::::::పద్య సం.(లు) - 9-701-వ.,

[ ⇑ ] :448) కృతవీర్య- (పురుష){సంజ్ఞా}[చంద్రవంశం]:- దుర్మదుని కుమారుడైన ధనికునికి కృతవీర్యుడు, కృతాగ్ని, కృతవర్మ, కృతౌజుడు అని నలుగురు పుట్టారు. వారిలో కృతవీర్యునికి అర్జునుడు పుట్టాడు. అతను గొప్ప జ్ఞానశక్తితో కార్తవీర్యార్జునుడు అని పేరుపొందాడు. - :వంశం - చంద్రవంశం;:తండ్రి - ధనికుడు;::::కొడుకు(లు) - కార్తవీర్యార్జునుడు;::పద్య సం.(లు) - 9-701-వ.,

[ ⇑ ] :449) కృతస్థలి- (స్త్రీ){సంజ్ఞా}[దైవ యోని]:- ఈమె చైత్ర (మధు) మాసంలో సూర్యుని అనుచరులలోని అప్సరస.
సూర్యుడు ఈ మాసంలో ధాత అను పేరుతో, కృతస్థలి, పులస్త్యుడు, వాసుకి, హేతి, తుంబురుడు, రథకృత్తు మున్నగువారు అనుచరులుగా కలిగి సంచరిస్తాడు. - :వంశం - దైవ యోని;:::::::పద్య సం.(లు) - 12-41-వ., నుండి 12-45-వ., వరకు,

[ ⇑ ] :450) కృతాంతభటులు- (పురుష){జాతి}[దైవ యోని]:- కృతాంతభటులు అంటే యమభటులు. హరివిరహితులను కృతాంతభటులు గదలతో మొత్తుతారు, మంటలలో వేస్తారు, దేహాన్ని ముక్కలుముక్కలుగా నరుకుతారు, రసిపత్రికలకు హత్తుతారు. - :వంశం - దైవ యోని;:::::::పద్య సం.(లు) - 2-25-క., 3-562-ఉ.,

[ ⇑ ] :451) కృతాంతుడు- (పురుష){సంజ్ఞా}[దైవ యోని]:- కృతాంతుడు అంటే యముడు - :వంశం - దైవ యోని;:::::::పద్య సం.(లు) - 8-380-సీ., 8-443-క., 10.1-170-ఉ., 10.1-1334-మ.,

[ ⇑ ] :452) కృతాగ్ని- (పురుష){సంజ్ఞా}[చంద్రవంశం]:- దుర్మదుని కుమారుడైన ధనికునికి కృతవీర్యుడు, కృతాగ్ని, కృతవర్మ, కృతౌజుడు అని నలుగురు పుట్టారు. - :వంశం - చంద్రవంశం;:తండ్రి - ధనికుడు;::::::పద్య సం.(లు) - 9-701-వ.,

[ ⇑ ] :453) కృతాశ్వుడు- (పురుష){సంజ్ఞా}[సూర్యవంశం]:- కృతాశ్వుడు సూర్యవంశంలోని బర్హిణాశ్వుని కుమారుడు.కృతాశ్వుని కోడుకు సేనజిత్తు. - :వంశం - సూర్యవంశం;:తండ్రి - బర్హిణాశ్వుడు;::::కొడుకు(లు) - సేనజిత్తు;::పద్య సం.(లు) - 9-105-వ.,

[ ⇑ ] :454) కృతి-1 (పురుష){సంజ్ఞా}[సూర్యవంశం]:- సూర్యవంశంలోని మైథిలులగు రాజులలో కృతి యొకడు. కృతి బహుళాశ్వుని కొడుకు. కృతి కొడుకు మహావశి. - :వంశం - సూర్యవంశం;:తండ్రి - బహుళాశ్వుడు;::::కొడుకు(లు) - మహావశి;::పద్య సం.(లు) - 9-374-వ.,

[ ⇑ ] :455) కృతి-2 (పురుష){సంజ్ఞా}[చంద్రవంశం]:- కృతి చంద్రవంశపు రాజు. నహుషునకు గల యతి, యయాతి, సంయాతి, ఆయాతి, వియతి, కృతి అని ఆర్గురు కొడుకులులో ఆరవ కొడుకు, - :వంశం - చంద్రవంశం;:తండ్రి - నహుషుడు;::::::పద్య సం.(లు) - 9-506-వ.,

[ ⇑ ] :456) కృతి-3 (పురుష){సంజ్ఞా}[చంద్రవంశం]:- చంద్రవంశపు సన్నతిమంతుని కొడుకు కృతి. ఈ కృతి హిరణ్యనాభుని వలన యోగమార్గం పొందాడు. శోకమోహాలను విడిచాడు, తూర్పుదేశంలో సామసంహితను నేర్చాడు. ఈ కృతికి కొడుకు ఉగ్రాయుధుడు. - :వంశం - చంద్రవంశం;:తండ్రి - సన్నతిమంతుడు;::::కొడుకు(లు) - ఉగ్రాయుధుడు;::పద్య సం.(లు) - 9-655-వ.,

[ ⇑ ] :457) కృతి-4 (పురుష){సంజ్ఞా}[చంద్రవంశం]:- చంద్రవంశంలోని చ్యవనుని కుమారుడు కృతి. కృతి కుమారుడు ఉపరిచరవసువు. - :వంశం - చంద్రవంశం;:తండ్రి - చ్యవనుడు;::::కొడుకు(లు) - ఉపరిచరవసువు;::పద్య సం.(లు) - 9-659-వ.,

[ ⇑ ] :458) కృతి-5 (పురుష){సంజ్ఞా}[చంద్రవంశం]:- చంద్రవంశంలోని బభ్రువు కొడుకైన విభువువకు కొడుకు కృతి. కృతి కొడుకు ఉశికుడు. కృతి మనుమడు చైద్యాదుల తండ్రి యైన చేది. - :వంశం - చంద్రవంశం;:తండ్రి - విభువు;::::కొడుకు(లు) - ఉశికుడు;::పద్య సం.(లు) - 9-709-వ.,

[ ⇑ ] :459) కృతిమంతుడు- (పురుష){సంజ్ఞా}[చంద్రవంశం]:- కృతిమంతుడు చంద్రవంశపు రాజు. కృతిమంతుడు యమీనరుని కొడుకు. కృతిమంతుని కొడుకు సత్యధృతి. సత్యధృతి కొడుకు దృఢనేమి. - :వంశం - చంద్రవంశం;:తండ్రి - అమీనరుడు;::::కొడుకు(లు) - సత్యధృతి;::పద్య సం.(లు) - 9-637-వ.,

[ ⇑ ] :460) కృతుడు-1 (పురుష){సంజ్ఞా}[చంద్రవంశం]:- కృతుడు చంద్రవంశపు రాజు. కృతుని తండ్రి జయుడు. కృతుని కొడుకు హర్యధ్వనుడు - :వంశం - చంద్రవంశం;:తండ్రి - జయుడు;::::కొడుకు(లు) - హర్యధ్వనుడు;::పద్య సం.(లు) - 9-497-వ.,

[ ⇑ ] :461) కృతుడు-2 (పురుష){సంజ్ఞా}[చంద్రవంశం]:- కృతుడు గంభీరనకు కొడుకు. ఈ కృతునకు బ్రహ్మకులము పుట్టింది - :వంశం - చంద్రవంశం;:తండ్రి - గంభీరుడు;::::కొడుకు(లు) - బ్రహ్మకులము;::పద్య సం.(లు) - 9-503-వ.,

[ ⇑ ] :462) కృతేపువు- (పురుష){సంజ్ఞా}[చంద్రవంశం]:- చంద్రవంశపు రాజు రౌద్రాశ్వునికి ఘృతాచి అను అప్సరస యందు ఋతేపువు, కక్షేపువు, స్థలేపువు, కృతేపువు, జలేపువు, సన్నతేపువు, సత్యేపువు, ధర్మేపువు, వ్రతేపువు, వనేపువు అను పదిమంది కొడుకులు జన్మించిరి; - :వంశం - చంద్రవంశం;:తండ్రి - రౌద్రాశ్వుడు;:తల్లి - అప్సరస ఘృతాచి;:::::పద్య సం.(లు) - 9-593-వ.,

[ ⇑ ] :463) కృతౌజుడు- (పురుష){సంజ్ఞా}[చంద్రవంశం]:- దుర్మదుని కుమారుడైన ధనికునికి కృతవీర్యుడు, కృతాగ్ని, కృతవర్మ, కృతౌజుడు అని నలుగురు పుట్టారు. - :వంశం - చంద్రవంశం;:తండ్రి - ధనికుడు;::::::పద్య సం.(లు) - 9-701-వ.,

[ ⇑ ] :464) కృత్తిక-1 ( -){సంజ్ఞా}[భగణ విషయం]:- శింశుమారచక్రం ఎడమ ప్రక్క దక్షిణాయన నక్షత్రాలు, కుడిప్రక్క కృత్తిక, రోహిణి, మృగశిర అనే మూడు నక్షత్రాలు ఉన్నాయి. - :వంశం - భగణ విషయం;:::::::పద్య సం.(లు) - 5.2-97-వ.,

[ ⇑ ] :465) కృత్తిక-2 (స్త్రీ){సంజ్ఞా}[దైవ యోని]:- అగ్నికి దక్షపుత్రిక వసోర్ధార అనే భార్యవల్ల ద్రవిణకుడు మొదలైనవారు పుట్టారు. దక్షపుత్రిక కృత్తికలకు స్కందుడు జన్మించాడు. ఆ స్కందునకు విశాఖుడు మొదలైనవారు పుట్టారు. - :వంశం - దైవ యోని;::::భర్త - అగ్ని ;:కొడుకు(లు) - స్కంధుడు;::పద్య సం.(లు) - 6-254-వ.,

[ ⇑ ] :466) కృత్తిక-3 (స్త్రీ){సంజ్ఞా}[దైవ యోని]:- దక్షునికి అసిక్ని యందు కలిగిన ఇరవైయేడు నక్షత్రాలైన పుత్రికలలో కృత్తిక 23 [3] - 27 నక్షత్రాలలో 3వది, చంద్రుని భార్యలలో 23వది - :వంశం - దైవ యోని;:తండ్రి - దక్షుడు;:తల్లి - అసక్ని;::భర్త - చంద్రుడు;:::పద్య సం.(లు) - 6-254-వ.,

[ ⇑ ] :467) కృత్య-1 (స్త్రీ){సంజ్ఞా}[పిశాచ యోని]:- పౌండ్రక వాసుదేవునితో పాటు అతని మిత్రుడైన కాశీరాజు కూడ యుద్ధంలో మరణించాడు. ఆ కాశీరాజు కొడుకు సుదక్షిణుడు, తండ్రి మరణానికి పగకై కృత్యను శ్రీకృష్ణునిపైకి ప్రయోగించాడు. శ్రీకృష్ణుడు చక్రాయుధాన్ని ప్రయోగించి కృత్యతోపాటు సుదక్షిణుని కాశీపురాన్ని కూడ దహింపజేసాడు. - :వంశం - పిశాచ యోని;:తండ్రి - కాశీరాజు సుదక్షిణుడు;::::::పద్య సం.(లు) - 10.2-533-వ., నుండి 10.2-535-వ, వరకు,

[ ⇑ ] :468) కృత్య-2 (స్త్రీ){జాతి}[పిశాచ యోని]:- అంబరీషునిపై అలిగి దుర్వాసముని కృత్యను ప్రయోగించాడు. విష్ణుచక్రం ఏతెంచి. కృత్యను దహించివేసి, దూర్వాసుని వెంట పడింది. దుర్వాసుడు మహాభక్తుడైన అంబరీషుని ఏమీ చేయలేకపోయి చివరికి గర్వభంగము పొందాడు. అంబరీషుని శరణువేడి బ్రతికిబయటపడ్డాడు. - :వంశం - పిశాచ యోని;:తండ్రి - దూర్వాసుడు;::::::పద్య సం.(లు) - 9-102-చ., నుండి 9-148-ఆ., ,

[ ⇑ ] :469) కృత్స్నమదుడు- (పురుష){సంజ్ఞా}[చంద్రవంశం]:- కాశ్యుడు, కుశుడు, కృత్స్నమదుడు అను ముగ్గురు కృతవృద్ధుని పుత్రుడైన మహోత్రకుని కొడుకులు. కృత్స్నమదుని కొడుకు శునకుడు, శునకుని కొడుకు శౌనకుడు - :వంశం - చంద్రవంశం;:తండ్రి - సుహ్రోతుడు;::::కొడుకు(లు) - శునకుడు;::పద్య సం.(లు) - 9-497-వ.,

[ ⇑ ] :470) కృథుడు- (పురుష){సంజ్ఞా}[చంద్రవంశం]:- చంద్రవంశంలోని విదర్బునికి కుశుడు, కృథుడు అని ఇద్దరు కొడుకులు. విదర్భుని రెండవ కొడుకైన కృథుని కొడుకు కుంతి. - :వంశం - చంద్రవంశం;:తండ్రి - విదర్భుడు;::::కొడుకు(లు) - కుంతి;::పద్య సం.(లు) - 9-709-వ.,

[ ⇑ ] :471) కృపాచార్యుడు- (పురుష){సంజ్ఞా}[మానవ యోని]:- కృపాచార్యుడు మున్నగువారు ద్వారకకు బయలుదేరిన కృష్ణుని సాగనంప వచ్చిన వారిలో ఒకడు. శతానందుని కుమారుడు, ప్రముఖ వైద్యశాస్త్ర పండితుడు అయిన సత్యధృతి ఒకనాడు అడవిలో ఊర్వశిని చూడగా అతనికి ఇంద్రియ స్ఖలనం అయింది. ఆ ఇంద్రియం రెల్లుగడ్డిపై పడి కవల బిడ్డలుగా ఆడ, మగ శిశువులు అయ్యారు. ఆ సమయంలో, శంతనుడు వేటకు అడవికి వెళ్ళి ఆ కవలలను కృపతో చూసి తీసుకొచ్చి కృపి, కృపుడు అని పేర్లు పెట్టి తన ఇంటిలో పెంచుకున్నాడు. ఆ కృపుడే తరువాత కృపాచార్యుడుగా కౌరవపాండవులకు గురువుగా ప్రసిద్దుడు అయ్యాడు. - :వంశం - మానవ యోని;:తండ్రి - సత్యహితుడు;::::::పద్య సం.(లు) - 1-234-వ., 1-391-వ., 3-20-క., 3-28-ఉ., 9-657-వ., 9-658-క., 9-659-వ., 9-679-వ.,

[ ⇑ ] :472) కృపి- (స్త్రీ){సంజ్ఞా}[చంద్రవంశం]:- కృపి యందు ద్రోణునికి పుట్టిన కొడుకు అశ్వత్థామ. కృపి కృపాచార్యుని సోదరి. శతానందుని కుమారుడు, ప్రముఖ వైద్యశాస్త్ర పండితుడు అయిన సత్యధృతి ఒకనాడు అడవిలో ఊర్వశిని చూడగా అతనికి ఇంద్రియ స్ఖలనం అయింది. ఆ ఇంద్రియం రెల్లుగడ్డిపై పడి కవల బిడ్డలుగా ఆడ, మగ శిశువులు అయ్యారు. ఆ సమయంలో, శంతనుడు వేటకు అడవికి వెళ్ళి ఆ కవలలను కృపతో చూసి తీసుకొచ్చి కృపి, కృపుడు అని పేర్లు పెట్టి తన ఇంటిలో పెంచుకున్నాడు. ఆ కృపుడే తరువాత కృపాచార్యుడుగా కౌరవపాండవులకు గురువుగా ప్రసిద్దుడు అయ్యాడు. కృపి ద్రోణునితో వివాహమయ్యింది. వారి కొడుకు అశ్వత్థామ. - :వంశం - చంద్రవంశం;:తండ్రి - సత్యహితుడు;:::భర్త - ద్రోణుడు;:కొడుకు(లు) - అశ్వత్థామ;::పద్య సం.(లు) - 1-160-వ., 9-657-వ., 9-658-క., 9-659-వ., ,

[ ⇑ ] :473) కృపుడు-1 (పురుష){సంజ్ఞా}[మానవ యోని]:- శతానందుని కుమారుడు, ప్రముఖ వైద్యశాస్త్ర పండితుడు అయిన సత్యధృతి ఒకనాడు అడవిలో ఊర్వశిని చూడగా అతనికి ఇంద్రియ స్ఖలనం అయింది. ఆ ఇంద్రియం రెల్లుగడ్డిపై పడి కవల బిడ్డలుగా ఆడ, మగ శిశువులు అయ్యారు. ఆ సమయంలో, శంతనుడు వేటకు అడవికి వెళ్ళి ఆ కవలలను కృపతో చూసి తీసుకొచ్చి కృపి, కృపుడు అని పేర్లు పెట్టి తన ఇంటిలో పెంచుకున్నాడు. ఆ కృపుడే తరువాత కృపాచార్యుడుగా కౌరవపాండవులకు గురువుగా ప్రసిద్దుడు అయ్యాడు. - :వంశం - మానవ యోని;:తండ్రి - సత్యహితుడు;::::::పద్య సం.(లు) - 3-20-క., 3-28-ఉ., 9-657-వ., 9-658-క., 9-659-వ., 9-679-వ.,

[ ⇑ ] :474) కృపుడు-2 (పురుష){సంజ్ఞా}[ఋషి]:- సూర్య సావర్ణి పాలించే ఎనిమిదవ మన్వంతరంలో అతని కొడుకులైన నిర్మోహుడూ, విరజస్కుడూ మొదలైనవారు రాజులు అవుతారు. సుతపులూ, విరజులూ, అమృతప్రభులూ దేవతలు అవుతారు. గాలవుడూ, దీప్తిమంతుడూ, పరశురాముడు, ద్రోణుని కొడుకైన అశ్వత్థామ, కృపుడూ, శుకముని జనకుడైన వ్యాసుడు, ఋష్యశృంగుడు, సప్తఋషులు అవుతారు. ఇప్పుడు వారు తమతమ ఆశ్రమాలలో ఉన్నారు. విరోచనుని కొడుకైన బలిచక్రవర్తి ఇంద్రుడు అవుతాడు. - :వంశం - ఋషి;:::::::పద్య సం.(లు) - 8-415-వ.,

[ ⇑ ] :475) కృశాశ్వుడు-1 (పురుష){సంజ్ఞా}[మానవ యోని]:- దక్షునికి భార్య అసిక్ని యందు కలిగిన అరవై మంది పుత్రికలలో భూతునకు, ఆంగీరసునకు, కృశాశ్వునకు ఇద్దరేసి చొప్పున ఆరుగురు కుమార్తెలను ఇచ్చాడు. కృశాశ్వునికి దక్షపుత్రి అయిన అర్చి యందు ధూమ్రకేశుడు అను కొడుకు పుట్టాడు. - :వంశం - మానవ యోని;:::భార్య - అర్చి ;::కొడుకు(లు) - ధూమ్రకేశుడు;::పద్య సం.(లు) - 6-252-వ., 6-254-వ.,

[ ⇑ ] :476) కృశాశ్వుడు-2 (పురుష){సంజ్ఞా}[సూర్యవంశం]:- సూర్యవంశంలోని ధూమ్రాక్షుని కొడుకైన సహదేవునికి పుత్రుడు కృశాశ్వుడు. కృశాశ్వుని కుమారుడు దేవేంద్రుడు మెచ్చుకునేలా అశ్వమేథయాగం చేసిన సోమదత్తుడు. వీరు వైశాలులు అని ప్రసిద్దులైన రాజులలోని వారు. - :వంశం - సూర్యవంశం;:తండ్రి - సహదేవుడు;::::కొడుకు(లు) - సోమదత్తుడు;::పద్య సం.(లు) - 9-48-వ., 9-49-ఆ.,

[ ⇑ ] :477) కృష్ణ- (స్త్రీ){సంజ్ఞా}[దైవ యోని]:- కృష్ణ - మాయాదేవికి శ్రీకృష్ణుడు తన అవతార సందర్భంలో ఆ మాయాదేవికి ఒసగిన పద్నాలుగు (14) నామములలో ఈమెది ఒకటి - :వంశం - దైవ యోని;:::::::పద్య సం.(లు) - 10.1-61-వ.,

[ ⇑ ] :478) కృష్ణద్వైపాయనుడు-1 (పురుష){సంజ్ఞా}[ఋషి]:- శ్రీకృష్ణుని దర్శించుకోవడానికి వచ్చి వసుదేవునిచే క్రతువు చేయించిన మునీశ్వరులలో ఒక మునీశ్వరుడు. - :వంశం - ఋషి;:::::::పద్య సం.(లు) - 10.2-1179-వ.,

[ ⇑ ] :479) కృష్ణద్వైపాయనుడు-2 (పురుష){సంజ్ఞా}[దైవ యోని]:- వీరు అజ్ఞానం నుండి కాపాడు గాక అని విశ్వరూపుడు దేవేంద్రునికి ఉపదేశించిన శ్రీమన్నారాయణ కవచంలో ఉన్న నలభైతొమ్మిది స్తుతులలో ఇది ఒకటి. - :వంశం - దైవ యోని;:::::::పద్య సం.(లు) - 6-300-చ., నుండి 6-307-వ.,

[ ⇑ ] :480) కృష్ణవేణి- ( -){సంజ్ఞా}[మహానది]:- భారతవర్షంలోని ప్రసిద్ధమైన పర్వతాలకు పుత్రికలవంటివి అయిన మహానదులలో ఒక నది. - :వంశం - మహానది;:::::::పద్య సం.(లు) - 5.2-55-వ.,

[ ⇑ ] :481) కృష్ణసార-1 ( -){జాతి}[భూచర]:- కృష్ణసార అంటే నల్లజింకలు అని కృష్ణుని శక్తిసామర్థ్యములు అని నానార్ర్థాలు ఉన్నాయి. ఈ పదం ప్రథమ స్కంధలో నైమిశారణ్య వర్ణన సందర్భంలో నందుడి గొల్లపల్లి} కు ఉపమాన పదంగా వాడబడింది. - :వంశం - భూచర;:::::::పద్య సం.(లు) - 1-39-వ.,

[ ⇑ ] :482) కృష్ణసార-2 ( -){సంజ్ఞా}[దైవ యోని]:- కృష్ణసార అంటే కృష్ణుని శక్తిసామర్థ్యములు అని నల్లజింకలు అని నానార్ర్థాలు ఉన్నాయి. ఈ పదం ప్రథమ స్కంధలో నైమిశారణ్య వర్ణన సందర్భంలో నందుడి గొల్లపల్లి} ఉపమాన పదంగా వాడబడింది. - :వంశం - దైవ యోని;:::::::పద్య సం.(లు) - 1-39-వ.,

[ ⇑ ] :483) కృష్ణుడు-1 (పురుష){సంజ్ఞా}[చంద్రవంశం]:- శ్రీకృష్ణుడు వసుదేవునికి దేవకీ దేవి అష్టమ గర్భంలో విష్ణుమూర్తి అవతారుడై జన్మించాడు. పురిటిగడ్డగా వసుదేవుని వలన యమున దాటాడు. వ్రేపల్లెలో నందుడు, యశోదాదేవిల కుమారుడుగా పెరిగాడు. అనేక మానవాతీత కృత్యములు చేసాడు. దుష్టుడు మేనమామ అయిన కంసుని సంహరించాడు. రుక్మిణీ మున్నగు అష్టమహిషులను పెండ్లాడేడు. కౌరవ పాండవ యుద్ధము తోసహా అనేక విధములుగా భూభారము తగ్గించాడు. అసంఖ్యాకులైన పుత్రపౌత్రులను పొందాడు. సముద్రంలో ద్వారకానగరం నిర్మించాడు. అవతార సమాప్తి సమయంలో ముసలం మఱియు ద్వారక సముద్రంలో కలియుట పేరు చెప్పి అతి బలిష్ఠులు అయిపోయిన యాదవులను అందరిని సంహరింపజేసాడు. - :వంశం - చంద్రవంశం;:తండ్రి - వసుదేవుడు;:తల్లి - దేవకి;:భార్య - రుక్మిణి , సత్యభామ , జాంబవతి , మిత్రవింద , భద్ర , నాగ్నజిత్తి , కాళింది , లక్షణ + మంది;::కొడుకు(లు) - త్రివక్ర యందు ఉపశ్లోకుడు, భార్యల యందు అసంఖ్యాకులు;::పద్య సం.(లు) - 10.1-105-క., నుండి,

[ ⇑ ] :484) కృష్ణుడు-2 (పురుష){సంజ్ఞా}[దైవయోని]:- విష్ణువు కలియుగంలో నల్లనిరంగుతో కృష్ణుడు అనుపేరు కలిగి, భక్తులను రక్షించడానికి పుండరీకాక్షుడు యజ్ఞములందు కీర్తించబడతాడు. అప్పుడు ఆయనను హరి, రాముడు, నారాయణుడు, నృసింహుడు, కంసారి, నళినోదరుడు మున్నగు పేర్లతో బ్రహ్మవాదులైన మునీంద్రులు స్తుతిస్తూంటారు. అని కరభాజన ఋషి విదేహరాజుకు చెప్పాడు - :వంశం - దైవయోని;:::::::పద్య సం.(లు) - 11-77-వ.,

[ ⇑ ] :485) కృష్ణుడు-3 (పురుష){సంజ్ఞా}[రాజుల ఉత్పత్తి]:- కణ్వవంశంలో సుశర్ముడనే రాజు పుడతాడు. కాని, అతని భృత్యుడు, ఆంధ్ర జాతీయుడు అయిన వృషలుడు అధర్మమార్గంలో అతనిని వధిస్తాడు. రాజ్యాన్ని చేపట్టి అవక్రవిక్రమంతో పరిపాలిస్తాడు. అతని పిమ్మట, అతని తమ్ముడు కృష్ణుడు రాజవుతాడు. తరువాత శాంతకర్ణుడు, పౌర్ణమాసుడు, లంబోదరుడు, శిబిలకుడు, మేఘస్వాతి, దండమానుడు, నాగలి పట్టేవాడైన అరిష్టకర్మ, తిలకుడు, పురీషసేతుడు, సునందనుడు, వృకుడు, జటాపుడు, శివస్వాతి, అరిందముడు, గోమతి, పురీమంతుడు, దేవశీర్షుడు, శివస్కంధుడు, యజ్ఞశీలుడు, శ్రుతస్కంధుడు, యజ్ఞశత్రుడు, విజయుడు, చంద్రబీజుడు, సులోమధి అనే రాజులు వంశపారంపర్యంగా వచ్చిన రాజ్యాన్ని క్రమంగా అనుభవిస్తారు. వారందరు కలిసి పరిపాలించే కాలం నాలుగువందలయేభైఆరు సంవత్సరములు. - :వంశం - రాజుల ఉత్పత్తి;:::::కొడుకు(లు) - శాంతకర్ణుడు;::పద్య సం.(లు) - 12-8-వ.,

[ ⇑ ] :486) కృష్ణుడు-4 (పురుష){సంజ్ఞా}[హవిర్ధానుడు]:- హవిర్దానుడికి హవిర్దానికి కలిగిన ఆరుగురు కొడుకులలో నాలుగవ వాడు. విజితాశ్వుని కొడుకైన హవిర్ధానుడికి హవిర్ధాని అనే భార్య వల్ల బర్హిష్మదుడు, గయుడు, శుక్రుడు, కృష్ణుడు, సత్యుడు, జితవ్రతుడు అనే ఆరుగురు పుత్రులు కలిగారు. బర్హిష్మదుడు ప్రాచీనాగ్రంగా పరచిన దర్భలతో భూమండలం అంతా నిండిపోయేలా నిత్యయజ్ఞదీక్ష చేసాడు కనుక ప్రాచీనబర్హి అని పేరుపొందాడు. - :వంశం - హవిర్ధానుడు;:తండ్రి - హవిర్ధాని;::::::పద్య సం.(లు) - 4-679-వ., 6-680-సీ.,

[ ⇑ ] :487) కేకయ- ( -){సంజ్ఞా}[ప్రదేశము]:- కేకయ ఒక దేశము. కంసుని బాధ పడలేక కొందరు యదువులు తమ పదవులు వదలుకొని కేకయ మున్నగు దేశాలకు పోయారు.
శ్రీకృష్ణుడు పాండురాజు యాగానికి ఏతెంచి నగరప్రవేశం చేయు నపుడు, కేకయ సృంజయాది రాజులను మన్నించాడు.
ధర్మరాజు అశ్వమేథయాగంలో భీముని కేకయ, మద్ర రాజులను తోడిచ్చి దిగ్విజయానికి తూర్పు దిక్కునకు పంపారు.
శిశుపాలుడు సభలో కృష్ణుని తూలనాడుతుంటే కేకయ సృంజయ దేశపు రాజులు అదిల్చినా వినలేదు. కృష్ణుడు చక్రం ప్రయోగించి శిరస్సు ఖండించాడు. - :వంశం - ప్రదేశము;:::::::పద్య సం.(లు) - 10.1-56-వ., 10.2-687-వ., 10.2-711-ఆ., 10.2-794-వ., 10.2-802-వ., 10.2-1044-వ., 10.2-1179-వ.,

[ ⇑ ] :488) కేకయుడు-1 (పురుష){సంజ్ఞా}[చంద్రవంశం]:- చంద్రవంశంలోని శిబికి వృషదర్పుడు, సువీరుడు, మద్రుడు, కేకయుడు అని నలుగురు కొడుకులు. - :వంశం - చంద్రవంశం;:తండ్రి - శిబి;::::::పద్య సం.(లు) - 9-683-వ.,

[ ⇑ ] :489) కేకయుడు-2 (పురుష){సంజ్ఞా}[చంద్రవంశం]:- ఇతడు చంద్రవంశపు ధ్రుష్టకేతుడు అను రాజు. కేకయదేశాధీశుడు. కుంతి చెల్లెలు శ్రుతకీర్తిని వివాహమాడాడు. వారికి ప్రవర్ధనుడు మున్నగు వారు అయిదుగురు కొడుకులు. - :వంశం - చంద్రవంశం;:::భార్య - శ్రుతకీర్తి;::కొడుకు(లు) - ప్రవర్థనాదులు అయిదుగురు;::పద్య సం.(లు) - 9-722-వ.,

[ ⇑ ] :490) కేతకీ - ( -){జాతి}[వృక్ష]:- మొగలి - ఇవి అష్టమ స్కంధములోని త్రికూట పర్వతములో వర్ణించబడ్డాయి - :వంశం - వృక్ష;:::::::పద్య సం.(లు) - 8-23-సీ., 8-24-వ., 8-25-క., 10.1-757-వ., 10.1-1562-వ.,

[ ⇑ ] :491) కేతన/కేసయ- (పురుష){సంజ్ఞా}[బమ్మెర వంశం; కౌండిన్య గోత్రం; ఆపస్తంభ సూత్రం]:- బమ్మెర పోతన తండ్రి - :వంశం - బమ్మెర వంశం; కౌండిన్య గోత్రం; ఆపస్తంభ సూత్రం;:తండ్రి - ఎల్లన;:తల్లి - మాచమ;:భార్య - లక్కమాంబ;::కొడుకు(లు) - తిప్పన; పోతన ;::పద్య సం.(లు) - 1-24-సీ., 1-26-ఉ., 1-530-గ., 2-288-గ., 3-1055., 4-977-గ., 7-483-గ., 8-745-గ., 9-736., 10.1-1792-గ., 10.2-1343-గ., 11-127-గ., 12-54-గ.,

[ ⇑ ] :492) కేతనములు- (-){జాతి}[పరికరములు]:- కేతనములు అంటే జండాలు - :వంశం - పరికరములు;:::::::పద్య సం.(లు) - 3-941-సీ., 4-95-చ., 8-327-క., నుండి 8-334-వ., వరకు, 9-290-సీ., 10.1-652-వ.,

[ ⇑ ] :493) కేతుమంతుడు-1 (పురుష){సంజ్ఞా}[సూర్యవంశం]:- సూర్యవంశస్థుడైన అంబరీషునికి కేతుమంతుడు, శంభుడు, విరూపుడు అని ముగ్గురు కొడుకులు. కేతుమంతుడు, శంభుడు హరిని గూర్చి తపస్సు చేయుటకు అడవికి వెళ్ళిపోయారు. విరూపునికి బృహదశ్వుడు పుట్టాడు. - :వంశం - సూర్యవంశం;:తండ్రి - అంబరీషుడు;::::::పద్య సం.(లు) - 9-154-వ.,

[ ⇑ ] :494) కేతుమంతుడు-2 (పురుష){సంజ్ఞా}[చంద్రవంశం]:- వాసుదేవాంశ సంభూతుడు, యజ్ఞభాగానికి అర్హుడు అయిన ధన్వంతరికి కొడుకు కేతుమంతుడు. కేతుమంతుని కొడుకు భీమరథుడు. - :వంశం - చంద్రవంశం;:తండ్రి - ధన్వంతరి;::::కొడుకు(లు) - భీమరథుడు;::పద్య సం.(లు) - 9-499-వ.,

[ ⇑ ] :495) కేతుమాల వర్షం- ( - ){సంజ్ఞా}[ప్రదేశం]:- ఇలావృత వర్షానికి పడమట మాల్యవంతం, తూర్పున గంధమాదనం అనే సరిహద్దు పవతాలున్నాయి. అవి రెండూ కేతుమాల భద్రాశ్వ వర్షాలకు సరిహద్దు పర్వతాలుగా ఉన్నాయి.
బ్రహ్మపురం పడమటి ద్వారం నుండి వెలువడిన చక్షువు అనే నదీ ప్రవాహం మాల్యవంత పర్వతాన్ని దాటి, కేతుమూల వర్షంమీదుగా ప్రవహిస్తూ పడమటి సముద్రంలో కలుస్తుంది.
కేతుమాలవర్షంలో దేవుడు శ్రీదేవిని సంతోషపెట్టే కామదేవుడు. శ్రీదేవి ప్రజాపతి పుత్రికలు, పుత్రులు అయిన రాత్రులతో, పగళ్ళతో కూడి కామదేవుణ్ణి ఆరాధిస్తూ ఉంటుంది. - :వంశం - ప్రదేశం;:::::::పద్య సం.(లు) - 1-396-వ., 5.1-40-వ., 5.2-20-వ., 5.2-34-వ., 5.2-43-వ.,

[ ⇑ ] :496) కేతుమాలుడు- (పురుష){సంజ్ఞా}[మానవ యోని]:- కేతుమాలుడు అగ్నీధ్రునకు పూర్వచిత్తి అను అప్సరస యందు కలిగిన తొమ్మండుగురు పుత్రులలో తొమ్మిదవ వాడు. ఆ తొమ్మండుగురు పేర్లు ఏవంటే నాభి, కింపురుషుడు, హరివర్షుడు, ఇలావృతుడు, రమ్యకుడు, హిరణ్మయుడు, కురువు, భద్రాశ్వుడు. కేతమాలుడు. కేతుమాలుడు మేరు పుత్రిక దేవవతిని వివాహమాడాడు. - :వంశం - మానవ యోని;:తండ్రి - అగ్నీధ్రుడు ;:తల్లి - పూర్వ చిత్తి;:భార్య - దేవవతి;::::పద్య సం.(లు) - 5.1-40-వ.,

[ ⇑ ] :497) కేతువు-1 ( -){జాతి}[పరికరము]:- కేతువు అంటే ధ్వజము - :వంశం - పరికరము;:::::::పద్య సం.(లు) - 4-63-క.,

[ ⇑ ] :498) కేతువు-2 ( -){సంజ్ఞా}[గ్రహము]:- శింశుమార పురుషుని దేహము పుండరీకాక్షుని దివ్యదేహము. ఇందు గళమున రాహువు, సర్వాంగముల కేతుగ్రహము ఉండును.
విప్రచిత్తి సింహిక యందు రాహువు, కేతువు మున్నగు శతమును పొందాడు. - :వంశం - గ్రహము;:తండ్రి - విప్రచిత్తి;:తల్లి - సింహిక;:::::పద్య సం.(లు) - 5.2-97-వ., 6-258-వ.,

[ ⇑ ] :499) కేతువు-3 (పురుష){సంజ్ఞా}[మనువు వంశం]:- నాలుగవ వాడైన తామస మనవు కొడుకులు కేతువు, వృషుడు, నరుడు, ఖ్యాతి మొదలైన వారు పదిమంది. వారు బలవంతులైన రాజులు. - :వంశం - మనువు వంశం;:తండ్రి - తామస మనువు;::::::పద్య సం.(లు) - 8-18-సీ.,

[ ⇑ ] :500) కేదారతీర్థము- ( -){సంజ్ఞా}[ప్రదేశం]:- శకుని అనే రాక్షసుని కొడుకైన వృకాసురుడు ఈ కేదారతీర్థానికి వెళ్ళి మహేశ్వరుడిని గురించి ఘోరతపస్సు చేసాడు. తలతరిగికొనుటకు సిద్ధపడిన అతని తెగువకు సంతసించి శివుడు ప్రత్యక్షం కాగా, తన చేయి ఎవరి నెత్తిన పెడితే వారు మరణించేలా శివుని నుండి వరం పొందాడు. వరపరీక్షకు శివుని తలపైనే చెయ్యి పెట్టబోయాడు. చివరికి విష్ణువు వటువు వేషంలో వచ్చి మాటలలో పెట్టి వృకుడు తన తలపైనే పెట్టుకునేలా చేసి అతనిని అంతం చేసాడు. - :వంశం - ప్రదేశం;:::::::పద్య సం.(లు) - 10.2-1237-క., నుండి 10.2-1264-క., వరకు,

[ ⇑ ] :501) కేరళ భూపతి- (పురుష){సంజ్ఞా}[మానవ యోని]:- శ్యమంతకపంచక క్షేత్రానికి కృష్ణుడు వెళ్ళినప్పుడు అక్కడకు వచ్చిన రాజులలో ఒకడు. - :వంశం - మానవ యోని;:::::::పద్య సం.(లు) - 10.2-1044-వ.,

[ ⇑ ] :502) కేవలుడు- (పురుష){సంజ్ఞా}[సూర్యవంశం]:- సుధృతి కొడుకైన సౌధృతేయునికి కేవలుడు; కేవలునికి కొడుకు బంధుమంతుడు. - :వంశం - సూర్యవంశం;:తండ్రి - సౌధృతేయుడు;::::కొడుకు(లు) - బంధుమతుడు;::పద్య సం.(లు) - 9-46-వ.,

[ ⇑ ] :503) కేశవుడు- (పురుష){సంజ్ఞా}[దైవ యోని]:- కేశవుడు - విష్ణువు. వ్యు1. కేశాః ప్రశస్తాః అస్య – కేశ+ వ, త.ప్ర., చక్కని వెంట్రుకలు కలవాడు, వ్యు2. కేశమ్ (కేశి రాక్షసమ్) వాతి – హంతి, కేశ+వా+క, కృ.ప్ర. కేశుడు అను రాక్షసుని సంహరించినవాడు, విష్ణువు, 3.కశ్చ ఈశశ్చ కేశౌ అజ రుద్రౌ – కేశాస్తః సంబంధిత్వేన అస్య – కేశ+వ, త.ప్ర., బ్రహ్మ శివుడు సంబంధులై ఉన్నవాడు. కేశవుడు ఉదయం, మధ్యాహ్నం, పట్టపగలు, సాయంకలం, మునిమాపువేళ, అర్ధరాత్రి, అపరాత్రి, పత్యూషకాలం, సంధికాలాలు, ప్రభాతం అనే సకల సమయాలలో కాపాడు గాక అని విశ్వరూపుడు దేవేంద్రునికి ఉపదేశించిన శ్రీమన్నారాయణ కవచంలో ఉన్న నలభైతొమ్మిది స్తుతులలో ఇది ఒకటి. - :వంశం - దైవ యోని;:::::::పద్య సం.(లు) - 1-352-క., 3-436-ఉ., 6-300-చ., నుండి 6-307-వ., 10.2-477-ఆ.,

[ ⇑ ] :504) కేశి-1 (పురుష){సంజ్ఞా}[రాక్షస యోని]:- కేశి అను రాక్షసుడు గుఱ్ఱం రూపు వాడు కంసుని పంపున బలరామ కృష్ణులను కడతేర్చాలని భావించి మందకు వచ్చాడు. వానిని కృష్ణుడు సంహరించాడు. - :వంశం - రాక్షస యోని;:::::::పద్య సం.(లు) - 3-190-వ., 10.1-56-వ., 10.1-1167-సీ., నుండి 10.1-1178-క.,

[ ⇑ ] :505) కేశి-2 (పురుష){సంజ్ఞా}[చంద్రవంశం]:- కృష్ణుని తండ్రి అయిన వసుదేవునికి భార్య కౌసల్య యందు కేశి అను పుత్రుడు కలిగాడు. - :వంశం - చంద్రవంశం;:తండ్రి - వసుదేవుడు;:తల్లి - కౌసల్య;:::::పద్య సం.(లు) - 9-722-వ.,

[ ⇑ ] :506) కేశిధ్వజుడు- (పురుష){సంజ్ఞా}[సూర్యవంశం]:- సూర్యవంశంలోని ధర్మధ్వజునకు కృతధ్వజుడు, మితధ్వజుడు అని ఇద్దరు కొడుకులు. కృతధ్వజునకు పుత్రుడు ఆత్మవిద్యలో నేర్పరి అయిన కేశిధ్వజుడు. - :వంశం - సూర్యవంశం;:తండ్రి - కృతధ్వజుడు;::::::పద్య సం.(లు) - 9-374-వ.,

[ ⇑ ] :507) కేసన-1 (పురుష){సంజ్ఞా}[వెలిగందల]:- భాగవత ఆంధ్రీకరణలో ఏకాదశ, ద్వాదశ (11, 12) స్కంధాలను పూరించిన వెలిగందల నారయ తండ్రి కేసనమంత్రి. - :వంశం - వెలిగందల;:::::కొడుకు(లు) - నారయ;::పద్య సం.(లు) - 11-127-గ., 12-54-గ.,

[ ⇑ ] :508) కేసన-2 (పురుష){సంజ్ఞా}[బమ్మెర వంశం; కౌండిన్య గోత్రం; ఆపస్తంభ సూత్రం]:- కేసనమంత్రి భాగవత కర్త పోతన తండ్రి. కేసన మల్లన మాచమ్మల కుమారుడు. కేసనకు భార్య లక్కమాంబ యందు తిప్పన, పోతయ అని ఇద్దరు కుమారులు. - :వంశం - బమ్మెర వంశం; కౌండిన్య గోత్రం; ఆపస్తంభ సూత్రం;:తండ్రి - కేసన;:తల్లి - మాచమాంబ;:భార్య - లక్కమాంబ;::కొడుకు(లు) - తిప్పన, పోతన;::పద్య సం.(లు) - 1-24-సీ., 1-530-గ.,

[ ⇑ ] :509) కేసర-1 ( -){జాతి}[వృక్ష]:- కేసర అంటే పొన్న చెట్లు అని జూలు అని నానార్ర్థాలు ఉన్నాయి. ఈ పదం ప్రథమ స్కంధలో నైమిశారణ్య వర్ణన సందర్భంలో నరసింహుడి రూపం} కు ఉపమాన పదంగా వాడబడింది. - :వంశం - వృక్ష;:::::::పద్య సం.(లు) - 1-39-వ.,

[ ⇑ ] :510) కేసర-2 ( -){జాతి}[భూచర]:- కేసర అంటే జూలు అని పొన్న చెట్లు అని నానార్ర్థాలు ఉన్నాయి. ఈ పదం ప్రథమ స్కంధలో నైమిశారణ్య వర్ణన సందర్భంలో నరసింహుడి రూపం} ఉపమాన పదంగా వాడబడింది. - :వంశం - భూచర;:::::::పద్య సం.(లు) - 1-39-వ.,

[ ⇑ ] :511) కేసరి- (పురుష){సంజ్ఞా}[వానర యోని]:- హనుమంతుని తల్లి అంజని. ఈమె భర్త వానరయోధుడు కేసరి. - :వంశం - వానర యోని;:::భార్య - అంజని;::కొడుకు(లు) - హనుమ;::పద్య సం.(లు) - 5.2-52-ఆ.,

[ ⇑ ] :512) కైక- (స్త్రీ){సంజ్ఞా}[సూర్యవంశం]:- కైక దశరథుని భార్య. ఈమెకు తానిచ్చిన వరము వలన శ్రీరాముని అడవికి పంపించాడు. - :వంశం - సూర్యవంశం;::::భర్త - దశరథుడు;:కొడుకు(లు) - భరతుడు, లక్ష్మణుడు;::పద్య సం.(లు) - 9-265-క.,

[ ⇑ ] :513) కైకసి- (స్త్రీ){సంజ్ఞా}[రాక్షస యోని]:- పులస్త్య పుత్రుడైన విశ్రవసునికి భార్య కైకసి యందు రావణ, కుంభకర్ణ, విభీషణులను ముగ్గురు కొడుకులు పుట్టారు. - :వంశం - రాక్షస యోని;::::భర్త - విశ్రవసు ;:కొడుకు(లు) - రావణుడు; కుంభకర్ణుడు; విభీషణుడు;::పద్య సం.(లు) - 4-26-వ.,

[ ⇑ ] :514) కైటభ- (పురుష){సంజ్ఞా}[రాక్షస యోని]:- నైమిశారణ్యం పూదేనెతో చక్కగా; మధుడనే రాక్షస వీరునితో కూడిన కైటభుని కొలువు వలె మన్నింపదగి ఉంది.
విష్ణువు హయగ్రీవావతారంలో మధు కైటభులను రాక్షసులను సంహరించి, వేదాలను బ్రహ్మదేవునికి ఇచ్చాడు - :వంశం - రాక్షస యోని;:::::::పద్య సం.(లు) - 1-39-వ., 7-361-క., 10.1-1236-దం.,

[ ⇑ ] :515) కైటభారి- (పురుష){సంజ్ఞా}[దైవ యోని]:- కైటభారి అంటే విష్ణువు. హయగ్రీవావతారంలో కైటభాసురుని సంహరించిన వాడు కనుక కైటభారి. - :వంశం - దైవ యోని;:::::::పద్య సం.(లు) - 2-51-సీ.,

[ ⇑ ] :516) కైలకిలులు- (పురుష){జాతి}[యవన జాతి]:- రాబోయే కాలంలో మౌనవంశజులు పదకొండుమంది మూడువందల ఏళ్ళు ఏలాక, కైలికిలులు అను యవనులు భూపతులు అవుతారు. - :వంశం - యవన జాతి;:::::::పద్య సం.(లు) - 12-8-వ.,

[ ⇑ ] :517) కైలాసగిరి- ( -){సంజ్ఞా}[ప్రదేశము]:- శివుని నివాసమైన కొండ - :వంశం - ప్రదేశము;:::::::పద్య సం.(లు) - 8-384-సీ.,

[ ⇑ ] :518) కైలాసచలము- ( -){సంజ్ఞా}[ప్రదేశము]:- శివుని నివాసమైన కొండ - :వంశం - ప్రదేశము;:::::::పద్య సం.(లు) - 1-412-శా.,

[ ⇑ ] :519) కైలాసమహీధరము- ( -){సంజ్ఞా}[ప్రదేశము]:- శివుని నివాసమైన కొండ - :వంశం - ప్రదేశము;:::::::పద్య సం.(లు) - 6-326-వ.,

[ ⇑ ] :520) కైలాసము- ( -){సంజ్ఞా}[ప్రదేశము]:- శివుని నివాసము - :వంశం - ప్రదేశము;:::::::పద్య సం.(లు) - 4-132-వ., 8-219-మ., 9-112-వ.,

[ ⇑ ] :521) కైవల్యము- ( -){సంజ్ఞా}[ -]:- కైవల్యము అంటే ముక్తి - :వంశం - -;:::::::పద్య సం.(లు) - 1-1-శా., 1-192-వ., 1-390-క., 2-81-సీ.,.,.,

[ ⇑ ] :522) కొంకణ- ( -){సంజ్ఞా}[ప్రదేశం]:- ఉషాకుమారికి కలలో కనబడిన రాకుమారుని కముగొనుటకు, ఆమె నెచ్చెలి, మంత్రిపుత్రీ అయిన చిత్రరేఖ రాజుల చిత్రాలు అన్నీ వేసింది. అలా వేసిన చిత్రాలలో మాళవ, కొంకణ, ద్రవిడ, మత్స్య, పుళింద, కళింగ, భోజ, నేపాల, విదేహ, పాండ్య, కురు, బర్బర, సింధు, యుగంధర, ఆంధ్ర, బంగాళ, కరూశ, టేంకణ, త్రిగర్త, సుధేష్ణ, మరాట, లాట, పాంచాల, నిషాద, ఘూర్జర, సాళ్వ దేశాల ప్రభువులు ఉన్నారు చూడు అని చూపించింది. - :వంశం - ప్రదేశం;:::::::పద్య సం.(లు) - 10.2-348-ఉ.,

[ ⇑ ] :523) కొండచూలి- (స్త్రీ){సంజ్ఞా}[దైవ యోని]:- కొండచూలి అంటే హిమవంతుని కూతురు పార్వతి - :వంశం - దైవ యోని;:తండ్రి - హిమవంతుడు;:::భర్త - శివుడు;:::పద్య సం.(లు) - 9-514-సీ.,

[ ⇑ ] :524) కొండరాచూలి- (స్త్రీ){సంజ్ఞా}[దైవ యోని]:- కొండరాచూలి అంటే హిమవంతుని కూతురు పార్వతి - :వంశం - దైవ యోని;:తండ్రి - హిమవంతుడు;:::భర్త - శివుడు;:::పద్య సం.(లు) - 6-490-సీ.,

[ ⇑ ] :525) కొమ్ములు-1 ( -){జాతి}[అవయవము]:- పశువులకు కొన్ని జంతువులకు తలపై నుండు వాడి యైన అవయవములు - :వంశం - అవయవము;:::::::పద్య సం.(లు) - 5.1-106-చ., 10.1-299-వ., 10.1-1145-ఉ., 10.2-126-సీ.,

[ ⇑ ] :526) కొమ్ములు-2 ( -){జాతి}[అవయవము]:- ఏనుగు దంతములు - :వంశం - అవయవము;:::::::పద్య సం.(లు) - 8-39-సీ.,

[ ⇑ ] :527) కొలంకు- ( -){జాతి}[ప్రదేశము]:- మడుగు - :వంశం - ప్రదేశము;:::::::పద్య సం.(లు) - 1-369-చ., 8-55-వ.,

[ ⇑ ] :528) కొలకు- ( -){జాతి}[ప్రదేశము]:- మడుగు, చెఱువు - :వంశం - ప్రదేశము;:::::::పద్య సం.(లు) - 7-36-సీ., 8-35-మ.,

[ ⇑ ] :529) కోటర- (స్త్రీ){సంజ్ఞా}[రాక్షస యోని]:- కోటర బాణాసురుని తల్లి. కృష్ణునితో యుద్ధంలో బాణుడు నిలబడలేకపోతుంటే చూసి, బాణాసురుని కాపాడటానికి అతని తల్లి కోటర దిగంబర అయి వచ్చింది. - :వంశం - రాక్షస యోని;:::::::పద్య సం.(లు) - 10.2-424-సీ.,

[ ⇑ ] :530) కోటలకుఅధిష్టానదేవతలు- (స్త్రీ){సంజ్ఞా}[దైవ యోని]:- ధర్మునికి అతని భార్య, దక్షుని పుత్రిక అయిన జామిదేవి యందు దుర్గ భూములకు అధిష్ఠాన దేవతలు పుట్టారు. వారికి స్వర్గుడు, నంది పుట్టారు. - :వంశం - దైవ యోని;:తండ్రి - ధర్ముడు;:తల్లి - జామిదేవి ;:::కొడుకు(లు) - స్వర్గుడు; నంది;::పద్య సం.(లు) - 6-254-వ.,

[ ⇑ ] :531) కోట్లకొలదిరుద్రగణాలు- (పురుష){సంజ్ఞా}[దైవ యోని]:- శంకరుని అంశజుడు అయిన భూతునకు అతని భార్య, దక్షుని పుత్రిక అయిన సరూప యందు కోట్ల సంఖ్యలైన రుద్రగణములు పుట్టారు. మఱియు రైవతుడు, అజుడు, భవుడు, భీముడు, వాముడు, ఉగ్రుడు, వృషాకపి, అజైకపాత్తు, అహిర్బుధ్న్యుడు, బహురూపుడు, మహాంతుడు అనువారలును, రుద్రపారిషదులును, అతిభయంకరు లయిన ప్రేతులును వినాయకులును బుట్టిరి. - :వంశం - దైవ యోని;:తండ్రి - భూతుడు;:తల్లి - సరూప ;:::::పద్య సం.(లు) - 6-254-వ.,

[ ⇑ ] :532) కోయష్టిక - ( -){జాతి}[నీటిపక్షులు]:- చీకుకొక్కెరలు - ఇవి అష్టమ స్కంధములోని త్రికూట పర్వతములో వర్ణించబడ్డాయి - :వంశం - నీటిపక్షులు;:::::::పద్య సం.(లు) - 8-23-సీ., 8-24-వ., 8-25-క., 12-34-వ.,

[ ⇑ ] :533) కోరకిత - ( -){జాతి}[వృక్ష]:- మొగ్గలు తొడిగిన (చెట్లు, తీగలు) - ఇవి అష్టమ స్కంధములోని త్రికూట పర్వతములో వర్ణించబడ్డాయి - :వంశం - వృక్ష;:::::::పద్య సం.(లు) - 8-23-సీ., 8-24-వ., 8-25-క., 10.2-1323-వ.,

[ ⇑ ] :534) కోఱ- ( -){జాతి}[అవయవము]:- పన్ను, దంతము - :వంశం - అవయవము;:::::::పద్య సం.(లు) - 1-477-శా., 8-5వ.,3-చ., 10.1-299-,

[ ⇑ ] :535) కోవిదార - ( -){జాతి}[వృక్ష]:- కాంచనపుచెట్లు - ఇవి అష్టమ స్కంధములోని త్రికూట పర్వతములో వర్ణించబడ్డాయి - :వంశం - వృక్ష;:::::::పద్య సం.(లు) - 8-23-సీ., 8-24-వ., 8-25-క., 4-135-వ.,

[ ⇑ ] :536) కోవిదులు- (పురుష){జాతి}[మానవ యోని]:- కుశ వర్షంలో కుశలులు, కోవిదులు, అభియుక్తులు, కులకులు అనే నాలుగు వర్ణాలవారు ఉన్నారు. వారు యజ్ఞపురుషుని ఆరాధిస్తుంటారు.
కోవిదులు అంటే పండితులు - :వంశం - మానవ యోని;:::::::పద్య సం.(లు) - 5.2-64-వ, 1-391-వ., 3-842-క., ,

[ ⇑ ] :537) కోశసంకలిత ఖడ్గము (ఒరతో కూడిన కరవాము)- ( -){జాతి}[-]:- పృథుచక్రవర్తి పట్టాభిషిక్తుడు అయిన సందర్భంలో దేవతలు అందరు వివిధ బహుమానాలు ఇచ్చారు. వారిలో శివుడు, ఒరతో కూడిన కరవాము ఇచ్చెను - :వంశం - -;:::::::పద్య సం.(లు) - 4-442-సీ., 4-443-సీ.,

[ ⇑ ] :538) కోసల- ( -){సంజ్ఞా}[ప్రదేశము]:- కోసల ఒక దేశము పేరు, రాముడి రాజ్యం పేరు కోసల - :వంశం - ప్రదేశము;:::::::పద్య సం.(లు) - 2155-సీ., 9-362-ఆ., 10.1-56-వ., .,.,.,

[ ⇑ ] :539) కోసలుడు- (పురుష){సంజ్ఞా}[ఋషి]:- హిరణ్యనాభుడు అను కోసలుని పుత్రుడు, పౌష్పంజి అను సుకర్ముని పుత్రుడు, సుకర్ముడు సుమంతుని నుండి సామవేదాన్ని అభ్యసించారు. వారు బ్రహ్మవేత్తలయిన అవంత్యులూ ఉదీచ్యులూ అనే అయిదువందల మందికి ఉపదేశించి, వారిని సామవేదపారగులుగా తీర్చిదిద్దారు. - :వంశం - ఋషి;:::::::పద్య సం.(లు) - 12-30-వ.,

[ ⇑ ] :540) కౌండిన్యగోత్రము- ( -){జాతి}[మానవ యోని]:- బమ్మెఱ పోతనామాత్యుల వారిది కౌండిన్య గోత్రము - :వంశం - మానవ యోని;:::::::పద్య సం.(లు) - 1-24-సీ., 1-27-వ.,

[ ⇑ ] :541) కౌమారం- ( -){జాతి}[మానవ యోని]:- అయిదేండ్ల వయసు బాల్యము - :వంశం - మానవ యోని;:::::::పద్య సం.(లు) - 2-223-సీ., 4-371-వ., 7-213-వ., 10.1-487-వ., 10,1-488-సీ.,.,.,

[ ⇑ ] :542) కౌమారసర్గ- (పురుష){సంజ్ఞా}[దైవ యోని]:- కౌమారసర్గం అనేది దేవ సర్గంలో ఒక భాగమే అయినా ప్రాకృత వైకృతాలు రెంటి స్వభావమూ కలది. అందులో దైవత్వం మానుషత్వం కలిసి ఉంటాయి. ఇదే సనత్కుమారాది సర్గం. - :వంశం - దైవ యోని;:::::::పద్య సం.(లు) - 3-344-వ.,

[ ⇑ ] :543) కౌమారాఖ్య- (పురుష){సంజ్ఞా}[దైవయోని]:- కౌమారాఖ్య (సనకసనందన) అవతారము ప్రథమ స్కంధములో వివరించిన వైష్ణవ అవతారాలలో ప్రధానమైన ఏకవింశ త్యవతారములు (21) అందలి 1 వ. అవతారం (1-63-వ.)
మఱియు, ద్వితీయ స్కంధములో అవతారముల వైభవంలో వివరించిన పంచవింశతి అవతారాలు (25) అందలి 6 వ. అవతారం. ఇది బ్రహ్మదేవుడు నారదునికి ఉపదేశించే నాటికి, జరిగిన పద్దెనిమిది అవతారాలులోనిది (2-123-సీ) - :వంశం - దైవయోని;:తండ్రి - బ్రహ్మదేవుడు;::::::పద్య సం.(లు) - 1-63-వ.,2-123,

[ ⇑ ] :544) కౌమోదకీ గదాదండమా- ( -){సంజ్ఞా}[దైవ యోని]:- వీరు తండోపతండాలైన నా విరోధులను పిండి పిండి కావించు అని విశ్వరూపుడు దేవేంద్రునికి ఉపదేశించిన శ్రీమన్నారాయణ కవచంలో ఉన్న నలభైతొమ్మిది స్తుతులలో ఇది ఒకటి. - :వంశం - దైవ యోని;:::::::పద్య సం.(లు) - 3-937-వ., 6-300-చ., నుండి 6-307-వ., 8-98-మ., 11-91-వ.,

[ ⇑ ] :545) కౌరవులు- (పురుష){జాతి}[చంద్రవంశం]:- కురువంశలోని ధృతరాష్ట్రునికి గాంధారి యందు పుట్టిన వందమంది కొడుకులు. - :వంశం - చంద్రవంశం;:తండ్రి - ధృతరాష్ట్రుడు;:తల్లి - గాంధారి;:::::పద్య సం.(లు) - 1-243-వ.,

[ ⇑ ] :546) కౌర్మ్యం- ( -){జాతి}[ -]:- కౌర్మ్యం అంటే కూర్మపురాణం - :వంశం - -;:::::::పద్య సం.(లు) - 12-30-వ.,

[ ⇑ ] :547) కౌశంబి- ( -){సంజ్ఞా}[ప్రదేశము]:- కౌశంబి నగరం పేరు. ఆసీమకృష్ణుని కొడుకు నిచకుడు హస్తిన గంగానదిలో కొట్టుకుపోవడంతో కౌశంబి నగరంలో నివసిస్తాడు. - :వంశం - ప్రదేశము;:::::::పద్య సం.(లు) - 9-679-వ.,

[ ⇑ ] :548) కౌశిక-1 ( -){జాతి}[గగనచర]:- కౌశిక అంటే గుడ్లగూబలు అని కౌశిక మహర్షి అని నానార్ర్థాలు ఉన్నాయి. ఈ పదం ప్రథమ స్కంధలో నైమిశారణ్య వర్ణన సందర్భంలో నారాయణస్థానం} కు ఉపమాన పదంగా వాడబడింది. - :వంశం - గగనచర;:::::::పద్య సం.(లు) - 1-39-వ.,

[ ⇑ ] :549) కౌశిక-2 (పురుష){సంజ్ఞా}[ఋషి]:- కౌశిక అంటే కౌశికుడను మహర్షి అని గుడ్లగూబలు అని నానార్ర్థాలు ఉన్నాయి. ఈ పదం ప్రథమ స్కంధలో నైమిశారణ్య వర్ణన సందర్భంలో నారాయణస్థానం} ఉపమాన పదంగా వాడబడింది. - :వంశం - ఋషి;:::::::పద్య సం.(లు) - 1-39-వ., 1-206-వ., 1-208-వ., 9-200-సీ.,.,

[ ⇑ ] :550) కౌశికి- ( -){సంజ్ఞా}[మహానది]:- భారతవర్షంలోని ప్రసిద్ధమైన పర్వతాలకు పుత్రికలవంటివి అయిన మహానదులలో ఒక నది. ఋచికుని భార్య జమదగ్ని కూతురు అయిన సత్యవతి కౌశకీ నది యై లోకపావని అయినది. - :వంశం - మహానది;:::::::పద్య సం.(లు) - 5.2-55-వ., 1-473-వ., 9-426-వ.,

[ ⇑ ] :551) కౌశికుడు-1 (పురుష){సంజ్ఞా}[ఋషి]:- పూర్వం కౌశికుడను బ్రాహ్మణుడు నారాయణ కవచం విద్యను ధరించాడు. పిమ్మట యోగధారణతో తనువు విడిచాడు. పిమ్మట చిత్రరథుడన యక్షుడు ఆ ప్రాంతంపై విమానంలో వెళ్తుండగా ఆకాశంలోంచి తెళ్ళి నేలమీద పడ్డాడు. అతను కళవిళ పడుతుంటే వాలఖిల్యమౌని నారాయణకవచం ప్రభావం వివరించి. ఈ పుణ్య అస్తి తీసుకెళ్ళి సరస్వతీ నదిలో నిమజ్జనం చెయ్యి. స్నానం చేసి ఆచమనం చేసి రా అప్పుడు నీదోవను పోగలవు అని తెలుపుతాడు. ఆ విధంగాచేసి చిత్రరథుడు తన దారిని వెళ్ళిపోతాడు. - :వంశం - ఋషి;:::::::పద్య సం.(లు) - 6-308-సీ., నుండి 6-311-వ.,

[ ⇑ ] :552) కౌశికుడు-2 (పురుష){సంజ్ఞా}[ఋషి]:- కౌశికుడు అంటే కుశిక వంశమున పుట్టిన వాడు కనుక విశ్వామిత్రుడు. - :వంశం - ఋషి;:::::::పద్య సం.(లు) - 9-200-సీ.,

[ ⇑ ] :553) కౌసల్య-1 (స్త్రీ){సంజ్ఞా}[సూర్యవంశం]:- కౌసల్య దశరథుని భార్య, శ్రీరాముని కన్నతల్లి. - :వంశం - సూర్యవంశం;::::భర్త - దశరథుడు;:కొడుకు(లు) - రాముడు;::పద్య సం.(లు) - 9-259-మ., 9-332-వ.,

[ ⇑ ] :554) కౌసల్య-2 (స్త్రీ){సంజ్ఞా}[చంద్రవంశం]:- కౌసల్య యందు భర్త వసుదేవునికి కేశి అను కొడుకు పుట్టాడు. - :వంశం - చంద్రవంశం;::::భర్త - వసుదేవుడు;:కొడుకు(లు) - కేశి;::పద్య సం.(లు) - 9-722-వ.,

[ ⇑ ] :555) కౌస్తుభము- ( -){సంజ్ఞా}[పరికరము]:- కౌస్తుభము విష్ణుమూర్తి వక్షమున అలంకరించిన మణి. కౌస్తుభమణిని సముద్రుడు విష్ణువునకు ఇచ్చాడు. కౌస్తుభము మున్నగువానిని మంచి బుద్ధితో తలచినవానికి మరణానంతరం మంచి గతిని విష్ణువు ఇస్తాడు. - :వంశం - పరికరము;:::::::పద్య సం.(లు) - 2-26-వ., 3-148-మ., 8-161-సీ., 8-136-వ., .,.,

[ ⇑ ] :556) క్రతు (మూలం పర్జన్య)- (పురుష){సంజ్ఞా}[దైవ యోని]:- సూర్యుడు ఫాల్గుణ (తపస్య) మాసంలో క్రతు (మూలం పర్జన్య) అను పేరుతో సంచరిస్తాడు. ఈ మాసంలో అతనికి అప్సరస సేనజిత్తు; ఋషి భరద్వాజుడు; నాగుడు ఐరావతుడు; రాక్షసుడు వర్చసుడు; గంధర్వుడు విశ్వుడు; యక్షుడు పర్జన్యుడు (మూలం క్రతు) మున్నగువారు అనుచరులై ఉంటారు. - :వంశం - దైవ యోని;:::::::పద్య సం.(లు) - 12-41-వ., నుండి 12-45-వ., వరకు,

[ ⇑ ] :557) క్రతువు-1 (పురుష){సంజ్ఞా}[ఋషి]:- ఇతడు ధర్మరాజు చేసిన రాజసూయయాగంలో పాల్గొన్న మునీశ్వరులలో ఒకడు - :వంశం - ఋషి;:::::::పద్య సం.(లు) - 10.2-766-సీ.,

[ ⇑ ] :558) క్రతువు-2 (పురుష){సంజ్ఞా}[ఋషి]:- బ్రహ్మ దేవుని చేతి నుండి పుట్టాడు - :వంశం - ఋషి;:తండ్రి - బ్రహ్మదేవుడు;::::::పద్య సం.(లు) - 3-377-సీ.,

[ ⇑ ] :559) క్రతువు-3 (పురుష){సంజ్ఞా}[ఋషి]:- కర్దమ ముని తొమ్మండ్రు కుమార్తెలలో ఆరవదైన క్రియను, క్రతువునకు ఇచ్చెను. క్రతువునకు క్రియ యందు 60000 మంది వాలఖిల్యులు అను ఋషులు పుట్టారు. - :వంశం - ఋషి;:తండ్రి - బ్రహ్మదేవుడు;::భార్య - క్రియ ;::కొడుకు(లు) - వాలఖిల్యులు 60000 మంది;::పద్య సం.(లు) - 3-849-వ., 4-26-వ.,

[ ⇑ ] :560) క్రతువు-4 (పురుష){సంజ్ఞా}[మనువు వంశం]:- ఇతడు ధ్రువుని వంశపు ఉల్ముకునికి భార్య పుష్కరిణి యందు కలిగిన కొడుకులు ఆరుగురులో ఒకడు. వారు అంగుడు, సుమనసుడుు, ఖ్యాతి, క్రతువుు, అంగిరసుడు, గయుడు అను ఆరుగురు. - :వంశం - మనువు వంశం;:తండ్రి - ఉల్ముకుడు;:తల్లి - పుష్కరిణి ;:::::పద్య సం.(లు) - 4-390-వ.,

[ ⇑ ] :561) క్రతువు-5 (పురుష){సంజ్ఞా}[రాక్షస యోని]:- వైశ్వానరునికి నలుగురు కూతుళ్ళు ఉపదానవి, హయశిరస, పులోమ, కాలక. ఆ వైశ్వానరుని రెండవ కూతురు హయశిరసను క్రతువు పెండ్లాడెను. - :వంశం - రాక్షస యోని;:::భార్య - హయశిరస;::::పద్య సం.(లు) - 6-258-వ.,

[ ⇑ ] :562) క్రముక - ( -){జాతి}[వృక్ష]:- పోక - ఇవి అష్టమ స్కంధములోని త్రికూట పర్వతములో వర్ణించబడ్డాయి - :వంశం - వృక్ష;:::::::పద్య సం.(లు) - 3-764-ఉ., 8-23-సీ., 8-24-వ., 8-25-క., 10.1-1783-వ.,

[ ⇑ ] :563) క్రిమి- (పురుష){సంజ్ఞా}[చంద్రవంశం]:- ఉశీనరునకు శిబి వన క్రిమి దర్పుడు అని నలుగురు కొడుకులు. - :వంశం - చంద్రవంశం;:తండ్రి - ఉశీనరుడు;::::::పద్య సం.(లు) - 9-683-వ.,

[ ⇑ ] :564) క్రిమిభోజనం- ( -){సంజ్ఞా}[ప్రాంతం]:- నరకలోకంలో అనేక నరకాలు ఉన్నాయి. మహా భయంకరమైన ఆ నరకాలు తామిస్రం, అంధతామిస్రం, రౌరవం, మహారౌరవం, కుంభీపాకం, కాలసూత్రం, అసిపత్రవనం, సూకరముఖం, అంధకూపం, క్రిమిభోజనం, సందంశం, తప్తోర్మి, వజ్రకంటకశాల్మలి, వైతరణి, పూయోదం, ప్రాణరోధం, విశసనం, లాలాభక్షణం, సారమేయోదనం, అవీచిరయం, రేతఃపానం, క్షారమర్దమం, రక్షోగణభోజనం, శూలప్రోతం, దందశూకం, అవటనిరోధనం, అపర్యావర్తనం, సూచీముఖం అనే ఇరవై ఎనిమిది నరకాలు.
సంపదను తన బంధువులకు పెట్టకుండా, తానొక్కడే భక్షించిన వాడికి క్రిమిభోజన నరకం. - :వంశం - ప్రాంతం;:::::::పద్య సం.(లు) - 5.2-136-వ., నుండి 5.2-164-వ.,

[ ⇑ ] :565) క్రియ-1 (స్త్రీ){సంజ్ఞా}[కర్దమ వంశం]:- కర్దమునకు భార్య దేవహూతి యందు కలిగిన తొమ్మండుగురు పుత్రికలలో క్రియను క్రతువునకు వివాహము చేసారు. క్రియ యందు క్రతువునకు బ్రహ్మతేజో స్వరూపులు అయిన 60000 మంది వాలఖిల్యులు పుట్టారు. - :వంశం - కర్దమ వంశం;:తండ్రి - కర్దముడు;:తల్లి - దేవహూతి ;::భర్త - క్రతువు;:కొడుకు(లు) - వాలఖిల్యులు;::పద్య సం.(లు) - 3-849-వ., 4-26-వ.,

[ ⇑ ] :566) క్రియ-2 (స్త్రీ){సంజ్ఞా}[ఆదిత్య వంశం]:- అదితి కుమారులలో ఎనిమిదవవాడైన విధాత క్రియ అనే భార్య వల్ల పురీషాదులైన అగ్నులను కన్నాడు. - :వంశం - ఆదిత్య వంశం;::::భర్త - విధాత ;:కొడుకు(లు) - అగ్నిపురీష్యాదు లైన అగ్నులు;::పద్య సం.(లు) - 6-507-వ.,

[ ⇑ ] :567) క్రుధుడు- (పురుష){సంజ్ఞా}[చంద్రవంశం]:- విదర్భునకు కుశుడు, క్రుథుడు, రోమపాదుడు జన్మించారు; ఆ విదర్భునికి రెండవ కుమారుడు కృథునకు కుంతి; కుంతికి ధృష్టి; ధృష్టికి నిర్వృతి; నిర్వృతికి దశార్హుడు జన్మించారు. - :వంశం - చంద్రవంశం;:తండ్రి - విదర్భుడు;::::కొడుకు(లు) - కుంతి;::పద్య సం.(లు) - 9-709-వ.,

[ ⇑ ] :568) క్రోధనుడు- (పురుష){సంజ్ఞా}[చంద్రవంశం]:- చంద్రవంశంలో రథికుని కొడుకైన అయుతాయువునకు క్రోధనుడు పుట్టాడు. క్రోధనుని కొడుకు దేవాతిథి. - :వంశం - చంద్రవంశం;:తండ్రి - అయుతాయువు;::::కొడుకు(లు) - దేవాతిథి;::పద్య సం.(లు) - 9-661-వ.,

[ ⇑ ] :569) క్రోధవశ- (స్త్రీ){సంజ్ఞా}[దక్షుని వంశం]:- దక్షునికి అసిక్ని యందు కలిగిన అరవై మంది పుత్రికలలో ఏభైనాలుగవ ఆమె క్రోధవశ. దక్షుడు ఈమెతో పాటు తన కూతురులలో పదముగ్గురుని కశ్యపునికి ఇచ్చాడు. ఈ క్రోధవశ యందు కశ్యపునికి దుర్వార సర్పములు కలిగాయి. - :వంశం - దక్షుని వంశం;:తండ్రి - దక్షుడు;:తల్లి - అసిక్ని;::భర్త - కశ్యపుడు ;:కొడుకు(లు) - భయంకరమైన సర్పాలు;::పద్య సం.(లు) - 6-256-వ., 6-257-సీ.,

[ ⇑ ] :570) క్రోధవశులు- (పురుష){జాతి}[రాక్షస యోని]:- మహాతలమునందు కద్రువ సంతానం అయిన క్రోధవశులైన సర్పములు ఉంటాయి.
దక్షునికి అసిక్ని యందు పుట్టిన వినతు, కద్రువ, పతంగి, యామిని అను నలుగురను తార్క్ష్యునకు వివాహమైరి. వారిలో రెండవ భార్య అయిన కద్రువ యందు తార్క్ష్యునకు అనేక రకములైన సర్పములు పుట్టాయి.
సాగరమథనం తరువాత జరిగిన సురాసుర యుద్ధంలో క్రోధవశులు, రుద్రులతో యుద్ధం చేసారు. - :వంశం - రాక్షస యోని;:తండ్రి - తార్క్ష్యునకు;:తల్లి - కద్రువ;:::::పద్య సం.(లు) - 5-.,2-118-క., 6-254-వ., 8-327-క., నుండి 8-334-వ., వరకు,

[ ⇑ ] :571) క్రోధుడు- (పురుష){సంజ్ఞా}[దైవ యోని]:- వీరు సంసార హేతువైన అధర్మం అనే వృక్షానికి కొమ్మలై వ్యాపించారు. తన మేలు కోరే మానవు డెవ్వడూ ఏమాత్రం వారిని అనుసరించకూడదు. క్రోధుడుకి తండ్రి - లోభుడు; తల్లి - నికృతి; భార్య - హింస; కొడుకు - కలి - :వంశం - దైవ యోని;:తండ్రి - లోభుడు;:తల్లి - నికృతి;:భార్య - హింస ;::కొడుకు(లు) - కలి;:కూతురు(లు)- దురుక్తి;:పద్య సం.(లు) - 4-215-వ.,

[ ⇑ ] :572) క్రోష్ణువు- (పురుష){సంజ్ఞా}[చంద్రవంశం]:- యదువు వంశంవారు యాదవులు అనగా ప్రసిద్దులు అయ్యారు. యదువు కొడుకు క్రోష్టువు; అతనికి వృజినవంతుడు; వృజినవంతునకు శ్వాహితుడు పుట్టారు. - :వంశం - చంద్రవంశం;:తండ్రి - యదువు;::::కొడుకు(లు) - వృజినవంతుడు;::పద్య సం.(లు) - 9-703-వ.,

[ ⇑ ] :573) క్రౌంచ- ( -){జాతి}[గగనచర]:- క్రౌంచ పక్షి అంటే కొంగజాతికి చెందిన కొక్కిరాయి. - :వంశం - గగనచర;:::::::పద్య సం.(లు) - 10.1-602-సీ., 10.2-1323-వ., 11-65-వ., 12-34-వ.,

[ ⇑ ] :574) క్రౌంచ ద్వీపము- ( - ){సంజ్ఞా}[ప్రదేశం]:- సప్తద్వీపాలలో ఒకటి. ఆ సప్తద్వీపాల పేర్లు 1.జంబూ ద్వీపము, 2.ప్లక్ష ద్వీపము, 3.శాల్మలీ ద్వీపము, 4.కుశ ద్వీపము, 5.క్రౌంచ ద్వీపము, 6.శాక ద్వీపము, 7.పుష్కర ద్వీపము వీటిని ప్రియవ్రతుడు విభాగించి, తన ఏడుగురు కొడుకులకు అప్పజెప్పాడు.
కుశద్వీపం చుట్టూ ఎనిమిది లక్షల యోజనాల పరిమాణం కలిగిన ఘృత (నేతి) సముద్రం ఉన్నది. ఆ నేతి సముద్రం ఆవల పదునారు లక్షల యోజనాల విస్తృతి కలిగిన అందమైన క్రౌంచద్వీపం ఉన్నది.
క్రౌంచ ద్వీపం మధ్యభాగంలో ఉన్న క్రౌంచాద్రి వల్లనే ఆ పేరు వచ్చింది. ఒకసారి షణ్ముఖుడు దివ్యశరాన్ని ప్రయోగించగా అది ఆ క్రౌంచపర్వతానికి రంధ్రం చేస్తూ దూసుకుపోయింది. ఆ రంధ్రంగుండా పాలవెల్లి ప్రవాహం వెలువడింది. ఆ ప్రవాహమే ఆ క్రౌంచద్వీపాన్ని తడుపుతూ ఉంది. వరుణదేవుడు ఆ ప్రదేశాన్ని కాపాడుతూ ఉంటాడు.
ప్రియవ్రతుని కుమారుడైన ఘృతపృష్ఠుడు క్రౌంచద్వీపానికి అధిపతి. అతని కొడుకులు ఆమోదుడు, మధువహుడు, మేఘపృష్ఠుడు, సుదాముడు, ఋషిజ్యుడు, లోహితార్ణుడు, వనస్పతి ఏడుగురుకి క్రౌంచద్వీపాన్ని ఏడు వర్షాలుగా విభజించి ఇచ్చాడు. క్రౌంచద్వీపంలో గురువులు, ఋషభులు, ద్రవిణకులు, దేవకులు అనే నాలుగు వర్ణాలవారు ఉన్నారు. వారు వరుణదేవుని సేవిస్తూ ఉంటారు.
క్రౌంచద్వీపం చుట్టూ పదునారు వేల యోజనాల విస్తృతిలో పాలసముద్రం ఉంది. క్రౌంచద్వీపానికి ఆవల ముప్పదిరెండు లక్షల యోజనాల విస్తృతి కల శాకద్వీపం ఉంది. - :వంశం - ప్రదేశం;:::::::పద్య సం.(లు) - 5.2-17-వ., 5.2-19-సీ., 5.2-65-ఆ., 5.2-66-వ., 5.2-67-సీ.,

[ ⇑ ] :575) క్షత్రధర్ముడు- (పురుష){సంజ్ఞా}[చంద్రవంశం]:- చంద్రవంశలోని సంకృతి కుమారుడైన జయునికి క్షత్రధర్ముడు జనించాడు. వీరు క్షత్రవృద్ధుని వంశంలోని రాజులు. - :వంశం - చంద్రవంశం;:తండ్రి - జయుడు;::::::పద్య సం.(లు) - 9-497-వ,

[ ⇑ ] :576) క్షత్రబంధువు- (పురుష){జాతి}[మానవ యోని]:- క్షత్రబంధులు - బ్రష్టులైన క్షత్రియులకు వాడు జాతీయము. పరీక్షిత్తు క్షుధ్బాధా తప్తుడై వచ్చి తన ఆశ్రమంలో సమాధి నిష్ఠలో కూర్చుని తనకు సమాధానం చెప్పకుండా ఉన్న శమీకమునిని చూసి, "ఎప్పుడు వచ్చి పోతుండే క్షత్రబంధువులతో నాకేం పని అని దొంగ సమాధిలో ఉన్నాడా?" అని వృథారోషంతో వితర్కిస్తూ ఒక మృత సర్పాన్ని శమీకముని మూపున వెసి వెళ్ళిపోయాడు. - :వంశం - మానవ యోని;:::::::పద్య సం.(లు) - 1-465-వ., 10.2-726-వ., 10.2-1282-సీ.,

[ ⇑ ] :577) క్షత్రవృద్ధుడు- (పురుష){సంజ్ఞా}[చంద్రవంశం]:- పురూరవుని పుత్రుడైన ఆయువునకు నహుషుడు, క్షత్రవృద్దుడు, రజి, రంభుడు, అనేనసుడు జన్మించారు. వారిలో క్షత్రవృద్దునకు సుహోత్రుడు; సుహోత్రునకు కాశ్యుడు, కుశుడు, కృత్స్నమదుడు అని ముగ్గురు పుట్టారు.
క్షతవృద్దుని వంశంలో పుట్టిన కాశ్యుడు మొదలు భార్గభూమి వరకు కల రాజులు కాశులు అనే పేర లోకంలో వర్ధిల్లారు. - :వంశం - చంద్రవంశం;:తండ్రి - ఆయువు;::::::పద్య సం.(లు) - 9-497-వ., 9-502-ఆ.,

[ ⇑ ] :578) క్షత్రియాభాసులు- (పురుష){జాతి}[మానవ యోని]:- క్షత్రియాభాసులు - అభాసులైన క్షత్రియులు. ద్వారాలవద్ద పడి ఉండే కుక్కల వంటి ఈ ఆభాస క్షత్రియులను భూసురోత్తములు గృహరక్షకులుగా ఎలా నియమించుకున్నారు. అని కోపంతో శమీకముని కొడుకు శృంగి కోపంతో, తండ్రి మూపున మృతోరగము వేసిన పరీక్షిత్తు గురించి అంటాడు. - :వంశం - మానవ యోని;:::::::పద్య సం.(లు) - 1-467-వ.,

[ ⇑ ] :579) క్షత్రియులు- (పురుష){జాతి}[మానవ యోని]:- భరతవర్షంలోని చాతుర్వర్ణ వ్యవస్థలో రాజ్యాన్ని ఏలడం పౌరుషం కలిగి ఉండటం వంటి లక్షణాలు కల వర్ణస్థులు. - :వంశం - మానవ యోని;:::::::పద్య సం.(లు) - 2-16-వ., 2-89-వ., .,.,

[ ⇑ ] :580) క్షత్రోపేక్షుడు- (పురుష){జాతి}[చంద్రవంశం]:- శ్వఫల్కునికి భార్య గాందిని యందు కలిగిన పన్నెండు మంది కొడుకులలోఎనిమిదవవాడు క్షత్రోపేక్షుడు. క్రత్రోపేక్షునికి సుచారువు అను చెల్లెలు కలదు. వీరు పన్నెండుమంది అన్నదమ్ములు ఎవరంటే అక్రూరుడు, అనసంగుడు, సారమేయుడు, మృదుకుడు, మృదుపచ్చివుడు, వర్మదృక్కు, ధృష్టవర్ముడు, క్షత్రపేక్షుడు, అరిమర్దనుడు, శత్రుఘ్నుడు, గంధమాదనుడు, ప్రతిబాహువు . - :వంశం - చంద్రవంశం;:తండ్రి - శ్వఫల్కుడు;:తల్లి - గాంధిని;:::::పద్య సం.(లు) - 9-712-వ.,

[ ⇑ ] :581) క్షార- ( -){సంజ్ఞా}[జల ప్రాంతం]:- క్షార = కారపు సముద్రము; ఇక్షురస = చెరకురసముసముద్రము; సుర = సురాసముద్రము; ఆజ్య = నేయ్యిసముద్రము; క్షీర = పాలసముద్రము; దధి = పెరుగుసముద్రము; ఉదకంబులు = నీటిసముద్రము; కలుగు = ఉండెడి; సాగరములు = సముద్రములు {సప్తసముద్రములు - 1క్షార(కారపు సముద్రము) 2ఇక్షురస(చెరకురసముసముద్రము) 3సుర(సురాసముద్రము) 4ఆజ్య(నేయ్యిసముద్రము) 5క్షీర(పాలసముద్రము) 6దధి(పెరుగుసముద్రము) 7ఉదకంబులు(నీటిసముద్రము)}; ఏడున్ = ఏడు (7). ఒక ద్వీపంతో మరొక ద్వీపం కలిసిపోకుండా ఉండడానికి సముద్రాలు ఏర్పడ్డాయి. - :వంశం - జల ప్రాంతం;:::::::పద్య సం.(లు) - 5.1-19-సీ.,

[ ⇑ ] :582) క్షారకర్దమం- ( -){సంజ్ఞా}[ప్రాంతం]:- నరకలోకంలో అనేక నరకాలు ఉన్నాయి. మహా భయంకరమైన ఆ నరకాలు తామిస్రం, అంధతామిస్రం, రౌరవం, మహారౌరవం, కుంభీపాకం, కాలసూత్రం, అసిపత్రవనం, సూకరముఖం, అంధకూపం, క్రిమిభోజనం, సందంశం, తప్తోర్మి, వజ్రకంటకశాల్మలి, వైతరణి, పూయోదం, ప్రాణరోధం, విశసనం, లాలాభక్షణం, సారమేయోదనం, అవీచిరయం, రేతఃపానం, క్షారమర్దమం, రక్షోగణభోజనం, శూలప్రోతం, దందశూకం, అవటనిరోధనం, అపర్యావర్తనం, సూచీముఖం అనే ఇరవై ఎనిమిది నరకాలు.
తక్కువ కులం వాడు విద్యార్జనం చేస్తూ పెద్దలను అవమానిస్తే అటువంటివాణ్ణి క్షారకర్దమం అనే నరకంలో తలకిందులుగా వ్రేలాడదీసి బాధిస్తారు. - :వంశం - ప్రాంతం;:::::::పద్య సం.(లు) - 5.2-136-వ.,

[ ⇑ ] :583) క్షీర- ( -){సంజ్ఞా}[జల ప్రాంతం]:- క్షార = కారపు సముద్రము; ఇక్షురస = చెరకురసముసముద్రము; సుర = సురాసముద్రము; ఆజ్య = నేయ్యిసముద్రము; క్షీర = పాలసముద్రము; దధి = పెరుగుసముద్రము; ఉదకంబులు = నీటిసముద్రము; కలుగు = ఉండెడి; సాగరములు = సముద్రములు {సప్తసముద్రములు - 1క్షార(కారపు సముద్రము) 2ఇక్షురస(చెరకురసముసముద్రము) 3సుర(సురాసముద్రము) 4ఆజ్య(నేయ్యిసముద్రము) 5క్షీర(పాలసముద్రము) 6దధి(పెరుగుసముద్రము) 7ఉదకంబులు(నీటిసముద్రము)}; ఏడున్ = ఏడు (7). ఒక ద్వీపంతో మరొక ద్వీపం కలిసిపోకుండా ఉండడానికి సముద్రాలు ఏర్పడ్డాయి. - :వంశం - జల ప్రాంతం;:::::::పద్య సం.(లు) - 5.1-19-సీ.,

[ ⇑ ] :584) క్షీరపాథోధి- ( -){సంజ్ఞా}[జల ప్రాంతం]:- క్షీరపాథోధి అంటే క్షీరసాగరము. - :వంశం - జల ప్రాంతం;:::::::పద్య సం.(లు) - 1-63-వ.,

[ ⇑ ] :585) క్షీరసాగరం- ( -){సంజ్ఞా}[జల ప్రాంతం]:- క్రౌంచద్వీపం చుట్టూ పదునారు వేల యోజనాల విస్తృతిలో పాలసముద్రం ఉంది. క్రౌంచద్వీపానికి ఆవల ముప్పదిరెండు లక్షల యోజనాల విస్తృతి కల శాకద్వీపం ఉంది. - :వంశం - జల ప్రాంతం;:::::::పద్య సం.(లు) - 5.2-67-సీ.,

[ ⇑ ] :586) క్షుద్రకుడు- (పురుష){సంజ్ఞా}[సూర్యవంశం]:- లాంగలునకు ప్రసేనజిత్తు, ప్రసేనజిత్తునకు క్షుద్రకుడు, క్షుద్రకునకు ఋణకుడు పుట్టుదురు.[భవిష్యత్ సూర్యవంశరాజులు పరీక్షితుని కాలానికి] - :వంశం - సూర్యవంశం;:తండ్రి - ప్రసేనజిత్తు;::::కొడుకు(లు) - ఋణకుడు;::పద్య సం.(లు) - 9-366-వ.,

[ ⇑ ] :587) క్షేత్రజ్ఞుడు-1 (పురుష){సంజ్ఞా}[రాజల ఉత్పత్తి]:- రాజుల ఉత్పత్తి వివరిస్తూ క్షేమవర్మునికి క్షేత్రజ్ఞుడు, క్షేత్రజ్ఞునికి విధిసారుడు పుట్టెదరు. వీరు మూడువందల అరవై ఏళ్ళు పాలించే శైశనాగులు అను పదిమంది రాజులలోని వారు. - :వంశం - రాజల ఉత్పత్తి;:తండ్రి - క్షేమవర్మ;::::కొడుకు(లు) - విధిసారుడు;::పద్య సం.(లు) - 12-4-వ.,

[ ⇑ ] :588) క్షేత్రజ్ఞుడు-2 (పురుష){సంజ్ఞా}[దైవ యోని]:- దేహం క్షేత్రం అనుకుంటే, అందులో ఉండే జీవుడు క్షేత్రజ్ఞుడు, శ్రీహరి - :వంశం - దైవ యోని;:::::::పద్య సం.(లు) - 1-58-వ., 1-329-వ., 3-902-క.,7-448-వ., .,.,.,

[ ⇑ ] :589) క్షేమకుడు- (పురుష){సంజ్ఞా}[చంద్రవంశం]:- చంద్రవంశంలోని మితునకు క్షేమకుడు, క్షేమకునికి బ్రహ్మక్షత్రుడు పుట్టును. వాఁడు నిర్వంశుండై, దేవర్షి సత్కృతుండై, కలియుగంబు నందు జనంగలవాఁడు - :వంశం - చంద్రవంశం;:తండ్రి - మితుడు;::::కొడుకు(లు) - బ్రహ్మక్షత్రుడు;::పద్య సం.(లు) - 9-679-వ.,

[ ⇑ ] :590) క్షేమధన్వుడు- (పురుష){సంజ్ఞా}[సూర్యవంశం]:- శ్రీరామచంద్రుని తరువాతి తంరాలలోని వాడైన పుండరీకునకు క్షేమధన్వుడు పుట్టాడు. క్షేమధన్వునుకి దేవానీకుడు పుట్టాడు. - :వంశం - సూర్యవంశం;:తండ్రి - పుండరీకాక్షుడు;::::కొడుకు(లు) - దేవానీకుడు;::పద్య సం.(లు) - 9-364-వ.,

[ ⇑ ] :591) క్షేమము- (పురుష){సంజ్ఞా}[మానవ యోని]:- ధర్మునికి భార్య మరియు కర్దముని కూతురు అగు తితిక్ష యందు క్షేమము అనువాడు పుట్టెను. - :వంశం - మానవ యోని;:తండ్రి - ధర్ముడు;:తల్లి - తితిక్ష;:::::పద్య సం.(లు) - 4-28-వ.,

[ ⇑ ] :592) క్షేమవర్మ- (పురుష){సంజ్ఞా}[రాజల ఉత్పత్తి]:- రాజుల ఉత్పత్తి వివరిస్తూ కాకవర్ణునికి క్షేమవర్మ, క్షేమవర్మునికి క్షేత్రజ్ఞుడు, క్షేత్రజ్ఞునికి విధిసారుడు పుట్టెదరు. వీరు మూడువందల అరవై ఏళ్ళు పాలించే శైశనాగులు అను పదిమంది రాజులలోని వారు. - :వంశం - రాజల ఉత్పత్తి;:తండ్రి - కాకవర్ణుడు;::::కొడుకు(లు) - క్షేత్రజ్ఞుడు;::పద్య సం.(లు) - 12-4-వ.,

[ ⇑ ] :593) క్షేమవర్షం- ( -){సంజ్ఞా}[ప్రాంతం]:- క్షేమవర్షంనికి అధిపతి ఇధ్మజిహ్వుని కొడుకు క్షేముడు, ఈ వర్షంలో ధూమ్రవర్ణం అను కుల పర్వతము, సుప్రభాత అను మహానది ఉన్నాయి. హంసులు, పతంగులు, ఊర్ధ్వాయనులు, సత్యాంగులు అను నాలుగు వర్ణాల ప్రజలు ఉన్నారు. ప్లక్షద్వీపంలో నివసించే పురుషుల ఆయుర్దాయం వేయి సంవత్సరాలు. ప్లక్ష ద్వీపానికి దేవుడు సూర్యభగవానుడు. - :వంశం - ప్రాంతం;:::::::పద్య సం.(లు) - 5.2-60-వ.,

[ ⇑ ] :594) క్షేమాపి- (పురుష){సంజ్ఞా}[సూర్యవంశం]:- సూర్యవంశపు చిత్రరథునకు క్షేమాపి, క్షేమాపికి హేమరథుడు పుట్టారు. - :వంశం - సూర్యవంశం;:తండ్రి - చిత్రరథుడు;::::కొడుకు(లు) - హేమరథుడు;::పద్య సం.(లు) - 9-374-వ.,

[ ⇑ ] :595) క్షేముడు-1 (పురుష){సంజ్ఞా}[మానవ యోని]:- క్షేమవర్షంనికి అధిపతి ఇధ్మజిహ్వుని కొడుకు క్షేముడు, ఈ వర్షంలో ధూమ్రవర్ణం అను కుల పర్వతము, సుప్రభాత అను మహానది ఉన్నాయి. హంసులు, పతంగులు, ఊర్ధ్వాయనులు, సత్యాంగులు అను నాలుగు వర్ణాల ప్రజలు ఉన్నారు. ప్లక్షద్వీపంలో నివసించే పురుషుల ఆయుర్దాయం వేయి సంవత్సరాలు. ప్లక్ష ద్వీపానికి దేవుడు సూర్యభగవానుడు. - :వంశం - మానవ యోని;:తండ్రి - ఇధ్మజిహ్వుడు;::::::పద్య సం.(లు) - 5.2-60-వ.,

[ ⇑ ] :596) క్షేముడు-2 (పురుష){సంజ్ఞా}[చంద్రవంశం]:- జరాసంధుని తరువాతి తరాలలోని వాడైన శుచికి క్షేముడు, క్షేమునికి సువ్రతుడు పుట్టారు. - :వంశం - చంద్రవంశం;:తండ్రి - శుచి;::::కొడుకు(లు) - సువ్రతుడు;::పద్య సం.(లు) - 9-681-వ.,

[ ⇑ ] :597) క్షేమ్యుడు- (పురుష){సంజ్ఞా}[చంద్రవంశం]:- చంద్రవంశపు ఉగ్రాయుధుని పుత్రుడు క్షేమ్యుడు, క్షేమ్యుని పుత్రుడు సువీరుడు. - :వంశం - చంద్రవంశం;:తండ్రి - ఉగ్రాయుధుడు;::::కొడుకు(లు) - సువీరుడు;::పద్య సం.(లు) - 9-655-వ.,

[ ⇑ ] :598) క్షోణి- ( -){సంజ్ఞా}[ -]:- క్షోణి అంటే భూమి - :వంశం - -;:::::::పద్య సం.(లు) - 1-6-ఉ., 1-221-మ., .,.,.,

[ ⇑ ] :599) క్షోణిభర్త- (పురుష){జాతి}[మానవ యోని]:- క్షోణిభర్త అంటే రాజ్యం ఏలే రాజు - :వంశం - మానవ యోని;:::::::పద్య సం.(లు) - 11-126-మాలి.,

[ ⇑ ] :600) క్ష్మా- ( - ){సంజ్ఞా}[ -]:- క్ష్మా అంటే భూమి - :వంశం - -;:::::::పద్య సం.(లు) - 2-115-మ., 4-105-శా., .,.,

[ ⇑ ] :601) క్ష్మాజము- ( -){జాతి}[వృక్ష]:- క్ష్మాజము - అంటే భూమిని పుట్టునది, చెట్టు - :వంశం - వృక్ష;:::::::పద్య సం.(లు) - 2-212-మ.,

[ ⇑ ] :602) క్ష్మాధరము- ( -){జాతి}[ప్రదేశము]:- క్ష్మాధరము అంటే పర్వతము, కొండ - :వంశం - ప్రదేశము;:::::::పద్య సం.(లు) - 8-112-శా.,

[ ⇑ ] :603) క్ష్మాప- (పురుష){జాతి}[మానవ యోని]:- క్ష్మాపుడు అంటే రాజ్య ఏలే రాజు - :వంశం - మానవ యోని;:::::::పద్య సం.(లు) - 9-231-మ.,

[ ⇑ ] :604) క్ష్మాభృత్తు- (పురుష){జాతి}[మానవ యోని]:- క్ష్మాభృత్తు అంటే రాజు - :వంశం - మానవ యోని;:::::::పద్య సం.(లు) - 2-155-సీ., 3-37-క.,

[ ⇑ ] :605) క్ష్మారమణుడు- (పురుష){జాతి}[మానవ యోని]:- క్ష్మారమణుడు అంటే రాజు - :వంశం - మానవ యోని;:::::::పద్య సం.(లు) - 10.2-1341-క.,

[ ↑ ] 1) ఖగకులాధిపయానుడు- (పురుష){సంజ్ఞా}[దైవ యోని]:- ఖగకులాధిపయానుడు అంటే విష్ణువు - :వంశం - దైవ యోని;:::::::పద్య సం.(లు) - 10.2-979-సీ.,

[ ⇑ ] :2) ఖగనాథుడు- (పురుష){సంజ్ఞా}[దైవ యోని]:- ఖగనాథుడు అంటే గరుత్మంతుడు - :వంశం - దైవ యోని;:::::::పద్య సం.(లు) - 10.1-1682-మ.,

[ ⇑ ] :3) ఖగపతి- (పురుష){సంజ్ఞా}[దైవ యోని]:- ఖగపతి అంటే గజేంద్రుడు - :వంశం - దైవ యోని;:::::::పద్య సం.(లు) - 10.2-180-సీ.,

[ ↑ ] :4) ఖగము- ( -){జాతి}[గగనచర]:- ఖగము అంటే పక్షి - :వంశం - గగనచర;:::::::పద్య సం.(లు) - 2-112వ., 3-604-సీ., 4-440-క., 6-150-క., .,.,.,

[ ⇑ ] :5) ఖగవాహుడు- (పురుష){సంజ్ఞా}[దైవ యోని]:- ఖగవాహుడు అంటే విష్ణువు - :వంశం - దైవ యోని;:::::::పద్య సం.(లు) - 10.2-270-క.,

[ ⇑ ] :6) ఖగుడు- (పురుష){సంజ్ఞా}[దైవ యోని]:- ఖగుడు అంటే సూర్యుడు - :వంశం - దైవ యోని;:::::::పద్య సం.(లు) - 9-204-క.,

[ ⇑ ] :7) ఖగేంద్రుడు- (పురుష){సంజ్ఞా}[దైవ యోని]:- ఖగేశ్వరుడు అంటే గరుత్మంతుడు - :వంశం - దైవ యోని;:::::::పద్య సం.(లు) - 6-307-వ., 8-190-క., 8-327-క., 10.1-66-చ., 10.1-70-సీ., 10.1-1173-ఉ, .,.,.,

[ ⇑ ] :8) ఖగేశ్వరుడు- (పురుష){సంజ్ఞా}[దైవ యోని]:- ఖగేశ్వరుడు అంటే గరుత్మంతుడు - :వంశం - దైవ యోని;:::::::పద్య సం.(లు) - 3-62-మ., 10.2-147-చ.,

[ ⇑ ] :9) ఖట్వాంగము- ( - ){జాతి}[పరికరం]:- ఖట్వాంగము అంటే మంచంకోడు, కపాలం పిడిగా చెక్కబడిన చేతికఱ్ఱ. దేవహూతి నిర్వాణ సమయంలో ఆమే వదలిన సంపద్వైభవాలను వర్ణిస్తూ, పాలనురుగు వంటి ఏనుగు దంతాలతో చేసిన కోళ్ళు (ఖట్వాంగము), పరచిన పరుపులు కలిగిన మంచాలు ఉన్నాయని వర్ణించబడింది.
పృథువు యజ్ఞాలు చేస్తుంటే, ఇంద్రుడు మారువేషంలో వచ్చి యాగాశ్వాన్ని తీసుకుపోయాడు. పృథుమహారాజు పుత్రుడైన జితాశ్వుడు ఇంద్రుని వెన్నంటి వెళ్ళాడు. కాని పుఱ్ఱె, ఖట్వాంగములను ధరించి మారువేషంలో కనబడుతున్న ఇంద్రుని చూసి భ్రమసి ఇంద్రునిపై బాణం వేయడానికి సందేహించాడు. - :వంశం - పరికరం;:::::::పద్య సం.(లు) - 3-1046-సీ., 4-521-క.,

[ ⇑ ] :10) ఖట్వాంగుడు-1 (పురుష){సంజ్ఞా}[సూర్య వంశం]:- రాజ్యమోహంతో గర్వాంధులైన రాజులను చూసి భూదేవి నవ్వుకుంటుంది అంటూ పేర్కొన్న ఇరవై ఎనిమిది రాజులలో ఇతను ఒకడు. - :వంశం - సూర్య వంశం;:::::::పద్య సం.(లు) - 12-18-వ.,

[ ⇑ ] :11) ఖట్వాంగుడు-2 (పురుష){సంజ్ఞా}[సూర్యవంశం]:- ఖట్వాంగు డనే రాజు సప్తద్వీపాలనూ పరిపాలిస్తూ ఉండేవాడు. ఇంద్రాదిదేవతలు యుద్ధంలో భీకరులైన రాక్షసుల చేతుల్లో ఓడిపోయి, ఆయన దగ్గరకు వచ్చి తమకు సాయపడమని ప్రార్థించారు. ఆయన భూలోకం నుంచి స్వర్గలోకానికి వెళ్లి దానవరాజుల నందరినీ సంహరించాడు. అప్పడు దేవతలు సంతోషించి ఖట్వాంగుణ్ణి వరం కోరుకోమన్నారు. “నేనెంత కాలం బ్రతుకుతానో చెప్పండి. ఇదే నేను కోరే వరం, మరో వరం నా కక్కరలే” దన్నాడు ఆ మహానుభావుడు. “నీకు ఆయువు ఇక ఒక ముహూర్తకాలమే ఉంది.” అని వేల్పు లన్నారు. వెంటనే ఆ భూపాలుడు విమాన మెక్కి భూలోకానికి వచ్చాడు. సకలము త్యజుంచి, గోవిందనామకీర్తన చేపట్టి కౌవల్యం పొందాడు
సూర్యవంశంలో నారీకవచుడు, మూలకుడు అని ప్రసిద్ధుడైనవాని పుత్రుడైన విశ్వసహునికి ఖట్వాంగుడు పుట్టి చక్రవర్తి అయ్యాడు. ఆ ఖట్వాంగుడు సకల సంగములను బాసి వాసుదేవబ్రహ్మములో కలిసాడు. అట్టి ఖట్వాంగునకు దీర్ఘబాహువు, దీర్ఘబాహువునకు రఘువు పుట్టారు. ఈ రఘువు వంశానికి చెందుటచేత రఘురాముడయ్యాడు.. - :వంశం - సూర్యవంశం;:తండ్రి - విశ్వసహుడు;::::కొడుకు(లు) - దీర్ఘబాహుడు;::పద్య సం.(లు) - 2-9-సీ., నుండి 3-11-క., వరకు, 9-253-వ, నుండి 9-258-వ., వరకు,

[ ⇑ ] :12) ఖడ్గ-1 ( -){జాతి}[భూచర]:- ఖడ్గ అంటే ఖడ్గమృగము అని (నందకము) విష్ణుమూర్తి ఖడ్గము అని నానార్ర్థాలు ఉన్నాయి. ఈ పదం ప్రథమ స్కంధలో నైమిశారణ్య వర్ణన సందర్భంలో వైకుంఠపురం} కు ఉపమాన పదంగా వాడబడింది. - :వంశం - భూచర;:::::::పద్య సం.(లు) - 1-39-వ.,

[ ⇑ ] :13) ఖడ్గ-2 ( -){జాతి}[పరికర]:- ఖడ్గ అంటే (నందకము) విష్ణుమూర్తి ఖడ్గము అని ఖడ్గమృగము అని నానార్ర్థాలు ఉన్నాయి. ఈ పదం ప్రథమ స్కంధలో నైమిశారణ్య వర్ణన సందర్భంలో వైకుంఠపురం} ఉపమాన పదంగా వాడబడింది. - :వంశం - పరికర;:::::::పద్య సం.(లు) - 1-39-వ.,

[ ⇑ ] :14) ఖడ్గ - ( -){జాతి}[భూచర]:- ఖడ్గమృగములు - ఇవి అష్టమ స్కంధములోని త్రికూట పర్వతములో వర్ణించబడ్డాయి
ఖడ్గమృగములను బలి దేవేంద్రుల నేతృత్వంలో జరిగిన సురాసుర యుద్ధంలో రాక్షసులు వాహనాలుగా వాడారు. - :వంశం - భూచర;:::::::పద్య సం.(లు) - 8-23-సీ., 8-24-వ., 8-25-క., 8-327-క., నుండి 8-334-వ., వరకు,

[ ⇑ ] :15) ఖడ్గము- ( -){జాతి}[ఆయుధము]:- ఖడ్గము అంటే కత్తి - :వంశం - ఆయుధము;:::::::పద్య సం.(లు) - 1-58-వ., 4-164-చ., 4-443-సీ., .,.,.,

[ ⇑ ] :16) ఖద్యోత-1 ( -){జాతి}[ -]:- ఖద్యోతయు హవిర్ముఖియు నను నామంబులుగల ద్వారయుగంబున.
అందు నేకస్థల నిర్మితంబులైన ఖద్యోతా విర్ముఖులు నేత్రంబులు. - :వంశం - -;:::::::పద్య సం.(లు) - 4-768-వ., 4-853-వ.,

[ ⇑ ] :17) ఖద్యోత-2 ( - ){సంజ్ఞా}[ -]:- ఖద్యోత అంటే సూర్యుడు - :వంశం - -;:::::::పద్య సం.(లు) - 7-274-మ., 7-285-వ., ,

[ ⇑ ] :18) ఖద్యోతము- ( - ){జాతి}[కీటకము]:- ఖద్యోతము అంటే మిణుగురు పురుగు - :వంశం - కీటకము;:::::::పద్య సం.(లు) - 6-476-వ., 7-288-వ., .,.,.,

[ ⇑ ] :19) ఖనినేత్రుడు- (పురుష){సంజ్ఞా}[సూర్యవంశం]:- సూర్యవంశంలో వివింశతికి రంభుడు; రంభునికి ధార్మికుడు అయిన ఖనినేత్రుడు; అతనికి కరంధనుడు; కరంధనునికి అవిక్షిత్తు; ఆ అవిక్షిత్తునికి మరుత్తుడు పుట్టారు. - :వంశం - సూర్యవంశం;:తండ్రి - రంభుడు;::::కొడుకు(లు) - కరంధనుడు;::పద్య సం.(లు) - 9-44-వ.,

[ ⇑ ] :20) ఖమిత్రుడు- (పురుష){సంజ్ఞా}[సూర్యవంశం]:- సూర్యవంశంలో ప్రమతికి ఖమిత్రుడు; ఖమిత్రునికి చాక్షుసుడు; అతనికి వివింశతి; వివింశతికి రంభుడుపుట్టారు. - :వంశం - సూర్యవంశం;:తండ్రి - ప్రమతి;::::కొడుకు(లు) - జాక్షుషుడు;::పద్య సం.(లు) - 9-44-వ.,

[ ⇑ ] :21) ఖరకరుడు- (పురుష){సంజ్ఞా}[దైవ యోని]:- ఖరకరుడు అంటే సూర్యుడు - :వంశం - దైవ యోని;:::::::పద్య సం.(లు) - 6-17-సీ.,

[ ⇑ ] :22) ఖరము- ( -){జాతి}[భూచర]:- ఖరము అంటే గాడిద - :వంశం - భూచర;:::::::పద్య సం.(లు) - 3-344-వ., 7-445-వ.,

[ ⇑ ] :23) ఖరుడు- (పురుష){సంజ్ఞా}[రాక్షస యోని]:- ఖరాసురుడు (గాడిద రూపు రాక్షసుడు) శ్రీకృష్ణుడు చంపిన ఒక రాక్షసుడు - :వంశం - రాక్షస యోని;:::::::పద్య సం.(లు) - 2-190-చ., 4-974-చ., 6-306-సీ.,

[ ⇑ ] :24) ఖర్జూర - ( -){జాతి}[వృక్ష]:- ఖర్జూరము - ఇవి అష్టమ స్కంధములోని త్రికూట పర్వతములో వర్ణించబడ్డాయి - :వంశం - వృక్ష;:::::::పద్య సం.(లు) - 4-135-వ., 8-23-సీ., 8-24-వ., 8-25-క.,

[ ⇑ ] :25) ఖర్వటము- ( -){సంజ్ఞా}[ప్రదేశము]:- ఖర్వట - ఒకప్రక్క గ్రామము ఒకప్రక్క పట్టణము కలిగినది, కొండను ఆనుకొనిన గ్రామము, పేట - :వంశం - ప్రదేశము;:::::::పద్య సం.(లు) - 7-36-సీ.,

[ ⇑ ] :26) ఖర్వుడు- (పురుష){సంజ్ఞా}[దైవ యోని]:- ఖర్వుడు అంటే పొట్టివాడు, వామనుడు - :వంశం - దైవ యోని;:::::::పద్య సం.(లు) - 8-527-క., 8-577-వ.,

[ ⇑ ] :27) ఖాండవప్రస్థము- ( -){సంజ్ఞా}[ప్రదేశము]:- ఖాండవప్రస్థము అంటే ఇంద్రప్రస్థము - :వంశం - ప్రదేశము;:::::::పద్య సం.(లు) - 10.2-887-శా., 10.2-1174-వ.,

[ ⇑ ] :28) ఖాండవము- ( -){సంజ్ఞా}[ప్రదేశము]:- ఖాడవ వనము ఇంద్రుని వనము. ఒకానొక యజ్ఞంలో ఎక్కువ నేతిని తీసుకొన్నందువల్ల కలిగిన మాంద్యాన్ని పోగొట్టుకొనడానికి అగ్ని ఈ వనాన్ని కృష్ణార్జునుల సహాయంతో దహించాడు. - :వంశం - ప్రదేశము;:::::::పద్య సం.(లు) - 1-361-క., 10.2-121-క., 10.2-122-వ.,

[ ⇑ ] :29) ఖాండిక్యుడు- (పురుష){సంజ్ఞా}[సూర్యవంశం]:- ధర్మధ్వజునికి కృతధ్వజుడు, మితధ్వజుడు జన్మించారు. వారిలో కృతధ్వజునికి కేశిధ్వజుడు పుట్టాడు. అతను ఆత్మజ్ఞానం బాగా తెలిసినవాడు. మితధ్వజునకు ఖాండిక్యుడు పుట్టి తండ్రి నుండి కర్మకాండలు నేర్చుకున్నాడు. కేశిధ్వజుడికి భయపడి పారిపోయాడు. ఖాండిక్యునకు భానుమంతుడు పుట్టాడు. - :వంశం - సూర్యవంశం;:తండ్రి - మితధ్వజుడు;::::కొడుకు(లు) - భానుమంతుడు;::పద్య సం.(లు) - 9-374-వ.,

[ ⇑ ] :30) ఖురళీబంధము- ( -){సంజ్ఞా}[నృత్తము]:- పారిభాషిక పదము - రాసక్రీడ - నృత్తము
చెట్టాపట్టాలు వేసుకున్నట్లు చేతులను కూర్చుకొని గిరగిర తిరుగునది - :వంశం - నృత్తము;:::::::పద్య సం.(లు) - 10.1-1084-వ.,

[ ⇑ ] :31) ఖేచరులు - (పురుష){జాతి}[దైవ యోని]:- వృత్రాసుర సంహారఘట్టంలో దేవదానవ యుద్ధం జరుగుతు న్నప్పుడు ఇంద్రుని వైపు పాల్గొన్నవారిలో ఒకరు - :వంశం - దైవ యోని;:::::::పద్య సం.(లు) - 1-421-ఉ., 2-30-వ., 4-253-వ., 4-502-వ., 6-206-ఉ., 6-337-ఉ., 6-363-వ., ., ., ., .,

[ ⇑ ] :32) ఖేటకములు- (స్త్రీ){జాతి}[పరికరములు]:- ఖేటకములు అంటే డాళ్ళు. సాగరమథనం తరువాత జరిగిన సురాసుర యుద్ధంలో ఇరు పక్షాల వారు వీటిని వాడారు. - :వంశం - పరికరములు;:::::::పద్య సం.(లు) - 8-327-క., నుండి 8-334-వ., వరకు, 9-260-మ.,

[ ⇑ ] :33) ఖ్యాతి-1 ( -){జాతి}[ -]:- ఖ్యాతి అంటే కీర్తి - :వంశం - -;:::::::పద్య సం.(లు) - 1-177-శా., 4-25-క., 4-441-తే.,., ., .,

[ ⇑ ] :34) ఖ్యాతి-2 (స్త్రీ){సంజ్ఞా}[మనువు వంశం]:- కర్దమునికి దేవహూతి యందు పుట్టిన పదహారుమంది పుచ్రికలలో పద్నాలుగవ ఆమె అయిన ఖ్యాతి యందు భర్త భ-గునకు వివాహం అయింది. వారికి ధాత, విధాత అను పుత్రులు. భగవత్పరాయణ యగు శ్రీ అను పుత్రిక కలిగారు. - :వంశం - మనువు వంశం;:తండ్రి - కర్దముడు;:తల్లి - దేవహూతి ;::భర్త - భృగువు;:కొడుకు(లు) - ధాత; విధాత;:కూతురు(లు)- శ్రీ ;:పద్య సం.(లు) - 3-561-సీ., 4-26-వ.,

[ ⇑ ] :35) ఖ్యాతి-3 (పురుష){సంజ్ఞా}[ధ్రువుని వంశం]:- ఇతడు ధ్రువుని వంశపు ఉల్ముకునికి భార్య పుష్కరిణి యందు కలిగిన కొడుకులు ఆరుగురులో ఒకడు. ఆ ఆరుగురు కొడుకుల పేర్లు అంగుడు, సుమనసుడుు, ఖ్యాతి, క్రతువుు, అంగిరసుడు, గయుడు. - :వంశం - ధ్రువుని వంశం;:తండ్రి - ఉల్ముకుడు;:తల్లి - పుష్కరిణి ;:::::పద్య సం.(లు) - 4-390-వ.,

[ ⇑ ] :36) ఖ్యాతి-4 (పురుష){సంజ్ఞా}[మనువు వంశం]:- నాలుగవ వాడైన తామస మనవు కొడుకులు కేతువు, వృషుడు, నరుడు, ఖ్యాతి మొదలైన వారు పదిమంది. వారు బలవంతులైన రాజులు. - :వంశం - మనువు వంశం;:తండ్రి - తామస మనువు;::::::పద్య సం.(లు) - 8-18-సీ.,

[ ↑ ] 1) గంగ-1 ( -){సంజ్ఞా}[జలప్రాంతం]:- గంగ అంటే గంగానది.
సగరమహారాజు చేసిన ఒక యాగాశ్వాన్ని ఇంద్రుడు తీసుకెళ్ళి కపిలుని దగ్గర కట్టి వెళ్ళిపోయాడు. ఆ యాగాశ్వం కోసం సగరుని పుత్రులందరూ వెతుకుతూ వెళ్ళి నేలమీద దొరకక నేలను త్రవ్వి పాతాళంలో ఉన్న కపిలుని ఆశ్రమంలోని గుఱ్ఱాన్ని కనుగొన్నారు. ఉద్రేకంగా దొంగదొరికాడు అంటూ ఋషిమీదకు వెళ్ళబోయారు. కపిలుడు కన్నులు తెరవడంతో పుట్టిన అగ్నిలో కాలి బూడిద అయిపోయారు.సగరుని మనుమడు అంశుమంతుడు వెళ్ళి తన వినయంతో కపిలుని మెప్పు పొంది గంగాజలాన్ని తన తండ్రుల బూడిద కుప్పమీద ప్రవహింప జేస్తే వారికి ఉన్నతగతులు కలుగుతాయి అని వరాన్ని, గుఱ్ఱాన్ని పొందాడు. అలా యాగాశ్వాన్ని తెచ్చాడు. యాగం పూర్తి అయింది. అతను అతని కొడుకు దిలీపుడు కూడా గంగను భూమిమీదకు తేవాలని గొప్ప తపస్సులు చేసినా సాధించలేకపోయారు. దిలీపుని కొడుకు భగీరథుడు తపస్సు చేసి గంగను ప్రసన్నం చేసుకున్నాడు. కాని గంగ తను భూమండలానికి వచ్చే వేగం ఎవరు తట్టుకోగలరు అన్నది. దానితో సమర్థుడు శంకరుడే అని గ్రహించి శివుని తపస్సుచేసి మెప్పించాడు. అప్పుడు దేవలోకంలోని గంగ క్రిందకు ఉరకగా శివుని జటాజూటంలో పట్టాడు. అక్కడ నుండి జారి పడే గంగను ఆ హిమాలయాలనుండి. ముందుండి దారి చూపుతూ భగీరథుడు గంగను కపిలాశ్రమం తెచ్చాడు. అలా తండ్రుల బూడిద కుప్పలుపై గంగ ప్రవహించడంతో వారు ఉత్తమ గతులు పొందారు. అలా చేరిన నీరే ఇప్పటి సముద్రం. ఇలా భాగీరథుడు తేవడం వలన గంగకు భాగీరథి అని మరోపేరు.
విష్ణుపాదమున పుట్టి ఆకాశగంగగా పైలోకంలో ఉండే భూలోకానికి నదిరూపంలో వచ్చినది గంగ.
భరతవర్షంలోనిది ఈ పవిత్ర గంగానది.
స్వర్గంలో మందాకిని, భూలోకంలో గంగానది, పాకాళంలో భోగవతీ పేరులతో జగత్పవిత్రయై ప్రవహించే నది గంగ - :వంశం - జలప్రాంతం;:::::::పద్య సం.(లు) - 1-1-వ., 173-సీ., 1-176-వ., .,., 6-333-సీ., 8-136-వ., 9-215-క., నుండి 9-234-వ., 10.2-663-మ.,

[ ⇑ ] :2) గంగ-2 (స్త్రీ){సంజ్ఞా}[నది]:- మరీచి మహర్షికి కర్దముని కూతురైన కళ అనే భార్యవల్ల కశ్యపుడు అనే కొడుకు, పూర్ణిమ అనే కూతురు పుట్టారు. మరొకజన్మలో విష్ణువు యొక్క పాదప్రక్షాళన జలాలతో గంగగా పుట్టి, దేవకుల్య అనే కుమార్తెను, విరజుడు అనే కుమారుని కన్నది. - :వంశం - నది;:తండ్రి - కశ్యపుడు;:తల్లి - కళ;:::కొడుకు(లు) - విరజుడు;:కూతురు(లు)- దేవకుల్య;:పద్య సం.(లు) - 4-7-సీ., 4-977-గ.,

[ ↑ ] :3) గంగ-3 (స్త్రీ){సంజ్ఞా}[చంద్రవంశం]:- ప్రతీపుని కొడుకైన శంతనునకు గంగాదేవి యందు విష్ణుభక్తాగ్రజుడు, శత్రు భయంకరుడు అయిన భీష్ముడు జన్మించాడు. - :వంశం - చంద్రవంశం;:తండ్రి - శంతనుడు;::::కొడుకు(లు) - భీష్ముడు;::పద్య సం.(లు) - 9-658-క.,

[ ⇑ ] :4) గంగన- (పురుష){సంజ్ఞా}[మానవ యోని]:- భాగవత ఆంధ్రీకరణలో అయిదవ స్కంధము రెండు ఆశ్వాసములు పూరించిన వాడు, బొప్పనామాత్యుని పుత్రుడు గంగన. - :వంశం - మానవ యోని;:తండ్రి - బొప్పన;::::::పద్య సం.(లు) - 5.1-184-గ., 5.2-168-గ.,

[ ⇑ ] :5) గంగాత్మజుడు- (పురుష){సంజ్ఞా}[చంద్రవంశం]:- శంతనమహారాజునకు గంగాదేవి యందు పుట్టిన వాడు కనుక భీష్ముడు గంగాత్మజుడు. వరమహాద్భుతమైన వైష్ణవజ్ఞానమును గంగాత్మజుడు మున్నగు వారు తప్పించి ఎవరు తెలియగలరు - :వంశం - చంద్రవంశం;:తండ్రి - శంతనుడు;:తల్లి - గంగ;:::::పద్య సం.(లు) - 6-178-సీ.,

[ ⇑ ] :6) గంగాద్వారము- ( -){సంజ్ఞా}[ప్రదేశము]:- గంగాద్వారము అంటే హరిద్వారము, గంగానది హిమాలయాలనుండి మైదాన ప్రాంతంలోకి ప్రవేశించిన చోటు. అజామిళుడు యమదూతలు వాదములు విని, గొప్ప తత్త్వజ్ఞానియై, సంసార బంధాలన్నిటినీ పారద్రోలి గంగా ద్వారానికి తపస్సుచేసుకోవడానికి వెళ్ళిపోయాడు. - :వంశం - ప్రదేశము;:::::::పద్య సం.(లు) - 6-154-సీ.,

[ ⇑ ] :7) గంగానందనుడు- (పురుష){సంజ్ఞా}[చంద్రవంశం]:- శంతనమహారాజునకు గంగాదేవి యందు పుట్టిన వాడు కనుక భీష్ముడు గంగానందనుడు. - :వంశం - చంద్రవంశం;:తండ్రి - శంతనుడు;:తల్లి - గంగ;:::::పద్య సం.(లు) - 1-206-వ., 1-208-వ.,

[ ⇑ ] :8) గంగావతరణకరణము- ( -){సంజ్ఞా}[నృత్తము]:- పారిభాషిక పదము - రాసక్రీడ - నృత్తము
ముఖ కవళికలచేత ప్రవాహాది సూచకమైన అభినయంబులు చూపుట - :వంశం - నృత్తము;:::::::పద్య సం.(లు) - 10.1-1084-వ.,

[ ⇑ ] :9) గంగికుఱ్ఱి- (స్త్రీ){జాతి}[భూచర]:- గంగికుఱ్ఱి అంటే గంగిగోవులాంటిది. కల్మాషపాదుని విప్రంయువతి, నేను గంగికుఱ్ఱి లాంటిదానిని నా భర్తను వదులు అని వేడుకుంది. - :వంశం - భూచర;:::::::పద్య సం.(లు) - 9-246-శా.,

[ ⇑ ] :10) గండకము- (స్త్రీ){జాతి}[జలచర]:- చేప - :వంశం - జలచర;:::::::పద్య సం.(లు) - 8-55-వ., 8-701-వ., 9595-క.,

[ ⇑ ] :11) గండకీ- ( -){సంజ్ఞా}[నది]:- హిమాలయాలలోని పవిత్ర నది, ఈ నదిలో సాలగ్రామములలు లభిస్తాయి. ఈ నది ఒడ్డున పులహాశ్రమము కలదు. ఈ నది వద్దనే భరతుడు తపస్సు చేసాడు.
బలరాముడు తీర్థయాత్రలకు వెళ్ళినపుడు గండకీనదిని దాటాడు. - :వంశం - నది;:::::::పద్య సం.(లు) - 5.1-89-సీ., 10.2-848-వ.,

[ ⇑ ] :12) గండభాగము- ( -){జాతి}[అవయవము]:- చెక్కిలి - :వంశం - అవయవము;:::::::పద్య సం.(లు) - 1-286-సీ., 3-420-వ., .,.,.,.,

[ ⇑ ] :13) గండభేరుండములు- ( -){జాతి}[గగనచర]:- గండభేరుండ పక్షులు త్రికూటపర్వతం వర్ణనలో వచ్చాయి.
గండభేరుండ పక్షులను బలి దేవేంద్రుల నేతృత్వంలో జరిగిన సురాసుర యుద్ధంలో రాక్షసులు వాహనాలుగా వాడారు. - :వంశం - గగనచర;:::::::పద్య సం.(లు) - 8-24-వ., 8-331-వ., 10.1-1558.,

[ ⇑ ] :14) గండము- ( -){జాతి}[అవయవము]:- ఏనుగు చెక్కిలి - :వంశం - అవయవము;:::::::పద్య సం.(లు) - 8-36-క., 8-45-క.,

[ ⇑ ] :15) గండశైలము- ( -){జాతి}[ -]:- కొండరాయి - :వంశం - -;::::::కూతురు(లు)- ;:పద్య సం.(లు) - 3-408-సీ., 7-285-వ., 8-29-సీ., 10.1-230-సీ.,

[ ⇑ ] :16) గంధగజ - ( -){జాతి}[జంతు]:- మదపుటేనుగులు - ఇవి అష్టమ స్కంధములోని త్రికూట పర్వతములో వర్ణించబడ్డాయి - :వంశం - జంతు;:::::::పద్య సం.(లు) - 1-466-క., 6-2-ఉ, 8-24-వ., 8-25-క., 9-622-క., 10.1-819-శా., 10.1-1544-సీ.,

[ ⇑ ] :17) గంధమాదన పర్వతం- ( - ){సంజ్ఞా}[పర్వతం]:- ఇలావృత వర్షానికి పడమట మాల్యవంతం, తూర్పున గంధమాదనం అనే సరిహద్దు పర్వాలున్నాయి. అవి తూర్పు పడమరలకు పొడవూ, ఉత్తర దక్షిణాలకు వెడల్పూ కలిగి నీలపర్వత నిషధపర్వతాలను ఆనుకొని ఉన్నాయి. వాని విస్తృతి రెండు వేల యోజనాలు. ఈ మాల్యవంతం, గంధమాదనం పర్వతాలు కేతుమాల భద్రాశ్వ వర్షాలకు సరిహద్దు పర్వతాలుగా ఉన్నాయి.
సీత అనే నదీ ప్రవాహం బ్రహ్మపురం తూర్పుద్వారం నుంచి ప్రవహించి కేసరగిరి శిఖరాలను తడుపుతూ గంధమాదన పర్వతం మీదుగా, భద్రాశ్వ వర్షంమీదుగా సాగి తూర్పు లవణ సముద్రంలో కలుస్తుంది. - :వంశం - పర్వతం;:::::::పద్య సం.(లు) - 4-32-క., 5.1-8-వ., 5.2-20-వ., 5.2-34-వ., 10.1-1666-వ,

[ ⇑ ] :18) గంధమాదనుడు-1 (పురుష){సంజ్ఞా}[వానర]:- శ్రీరామ రావణ యుద్ధంలో పాల్గొన్న వానరవీరులులో గంధమాదనుడు ఒకడు - :వంశం - వానర;:::::::పద్య సం.(లు) - 9-291-వ.,

[ ⇑ ] :19) గంధమాదనుడు-2 (పురుష){సంజ్ఞా}[చంద్రవంశం]:- గంధమాదనుడు శ్వఫల్కుని పన్నెండుగురు కొడుకులలో పదకొండవవాడు. ఇతని సోదరి సుచారువు. వృష్ణి వంశంలోని అనమిత్రుని కొడుకు పృశ్మికి శఫల్కుడ, చిత్రకుడు అని ఇద్దరు కొడుకులు. వారిలో శ్వఫల్కునకు గాందిని అందు అక్రూరుడు, అనసంగుడు, సారమేయుడు, మృదుకుడు, మృదుపచ్చివుడు, వర్మదృక్కు, ధృష్టవర్ముడు, క్షత్రపేక్షుడు, అరిమర్దనుడు, శత్రుఘ్నుడు, గంధమాదనుడు, ప్రతిబాహువు అని పన్నెండుమంది కొడుకులు, సుచారువు అనె ఆడపిల్ల పుట్టారు. - :వంశం - చంద్రవంశం;:తండ్రి - శ్వఫల్కుడు;:తల్లి - గాంధిని;:::::పద్య సం.(లు) - 9-712-వ.,

[ ⇑ ] :20) గంధర్వులు- (పురుష){జాతి}[దైవ యోని]:- గంధర్వులు ఒక దేవయోని జాతి.
దుర్యోధనుని కాపాడటం కోసం అర్జునుడు గంధర్వులని పారదోలాడు,
శ్రీమహావిష్ణువు విరాడ్విగ్రహానికి షడ్జాదులైన స్వరవిశేషములు గంధర్వ, విద్యాధర, చారణ, అప్సరస సమూహంబులు.
సౌందర్య కాములు గంధర్వులను పూజించాలి.
వృత్రాసుర సంహారఘట్టంలో దేవదానవ యుద్ధం జరుగుతు న్నప్పుడు ఇంద్రుని వైపు పాల్గొన్నవారిలో ఒకరు - :వంశం - దైవ యోని;:::::::పద్య సం.(లు) - 1-353-శా., 2-16-వ., 2-38-వ., 2-211-వ., 6-363-వ., 8-24-వ.,

[ ⇑ ] :21) గంభీరుడు-1 (పురుష){సంజ్ఞా}[మనువు వంశం]:- రాబోయేకాలంలో పద్నాల్గవదైన ఇంద్రసావర్ణి మన్వంతరంలో మనువు కొడుకులైన గంభీరుడూ, వసువూ మొదలైనవారు రాజులు అవుతారు. పవిత్రులూ, చాక్షుషులూ దేవతలు అవుతారు. శుచి ఇంద్రుడు అవుతాడు. అగ్ని బాహువూ శుచీ, శుక్రుడూ, మాగధుడూ మొదలైనవారు సప్తఋషులు అవుతారు. విష్ణువు సత్రాయణునకూ వితానకూ బృహద్భానుడు అనే పేరుతో పుడతాడు. - :వంశం - మనువు వంశం;:::::::పద్య సం.(లు) - 8-427-వ.,

[ ⇑ ] :22) గంభీరుడు-2 (పురుష){సంజ్ఞా}[చంద్రవంశం]:- విశ్వామిత్రవంశంలో రంభునికి రభసుడు; రభసునికి గంభీరుడు పుట్టారు.గంభీరునికి కృతుడు పుట్టాడు. - :వంశం - చంద్రవంశం;:తండ్రి - రభసుడు;::::కొడుకు(లు) - కృతుడు;::పద్య సం.(లు) - 9-503-వ.,

[ ⇑ ] :23) గగనకేశ- (పురుష){సంజ్ఞా}[దైవ యోని]:- శివుడు - గగన (ఆకాశమే) కేశుడు (శిరోజములు కలవాడు) - :వంశం - దైవ యోని;:::::::పద్య సం.(లు) - 4-63-క.,

[ ⇑ ] :24) గగనచరులు (దేవతలు)- (పురుష){జాతి}[దైవ యోని]:- పృథుచక్రవర్తి పట్టాభిషిక్తుడు అయిన సందర్భంలో దేవతలు అందరు వివిధ బహుమానాలు ఇచ్చారు. వారిలో దేవతలు, యశోగీతాలు ఇచ్చెను - :వంశం - దైవ యోని;:::::::పద్య సం.(లు) - 4-442-సీ.,., 4-443-సీ., 6-484-వ., 10.1-1677-వ.,

[ ⇑ ] :25) గగనభూదేవతలు- (పురుష){జాతి}[దైవ యోని]:- ప్రతిష్ఠాకాములు గగనభూదేవతల నర్చించాలి. - :వంశం - దైవ యోని;:::::::పద్య సం.(లు) - 2-38-వ.,

[ ⇑ ] :26) గగనము- ( -){సంజ్ఞా}[ప్రదేశము]:- గగనము అంటే ఆకాశము - :వంశం - ప్రదేశము;:::::::పద్య సం.(లు) - 1-67-వ., 1-86-సీ., 1-223-సీ., 3-911-సీ.,

[ ⇑ ] :27) గగనయానము- ( -){జాతి}[ -]:- గగనయానము అంటే ఆకాశ మార్గమున వెళ్ళుట - :వంశం - -;:::::::పద్య సం.(లు) - 2-9-సీ.,

[ ⇑ ] :28) గగనవాణి- (స్త్రీ){సంజ్ఞా}[దైవ యోని]:- నూతన వధూవగు దేవకీని కంసుడు మార్గంలో ఆకాశవాణి పలుకులు విని చంపబోతుంటే, వసుదేవుడు సర్దిచెప్తూ ఇలా అన్నాడు "లలనకుఁ బుట్టిన కొమరుని వలనం దెగె దనుచు గగనవాణి పలికె నంచు అలిగెదేని" - :వంశం - దైవ యోని;:::::::పద్య సం.(లు) - 10.1-42-క.,

[ ⇑ ] :29) గగనాధిష్ఠానదేవత- (స్త్రీ){సంజ్ఞా}[దైవ యోని]:- వామనునికి వడుగు సమయంలో గగనాధిష్ఠాన దేవత ఛత్రము (గొడుగు) ఇచ్చెను - :వంశం - దైవ యోని;:::::::పద్య సం.(లు) - 8-517-వ.,

[ ⇑ ] :30) గజ-1 ( -){జాతి}[భూచర]:- గజ అంటే ఏనుగులు అని వానర వీరుడు గజుడు అని నానార్ర్థాలు ఉన్నాయి. ఈ పదం ప్రథమ స్కంధలో నైమిశారణ్య వర్ణన సందర్భంలో సుగ్రీవుడి సైన్యం} కు ఉపమాన పదంగా వాడబడింది. - :వంశం - భూచర;:::::::పద్య సం.(లు) - 1-39-వ.,

[ ⇑ ] :31) గజ-2 ( -){సంజ్ఞా}[వానర]:- గజ అంటే వానర వీరుడు గజుడు అని ఏనుగులు అని నానార్ర్థాలు ఉన్నాయి. ఈ పదం ప్రథమ స్కంధలో నైమిశారణ్య వర్ణన సందర్భంలో సుగ్రీవుడి సైన్యం} ఉపమాన పదంగా వాడబడింది. - :వంశం - వానర;:::::::పద్య సం.(లు) - 1-39-వ.,

[ ⇑ ] :32) గజనామధేయపురము- ( -){సంజ్ఞా}[ప్రదేశము]:- గజనామధేయపురము అంటే హస్తినాపురము - :వంశం - ప్రదేశము;:::::::పద్య సం.(లు) - 1-438-క.,

[ ⇑ ] :33) గజపురము- ( -){సంజ్ఞా}[ప్రదేశము]:- గజపురము అంటే హస్తినాపురము - :వంశం - ప్రదేశము;:::::::పద్య సం.(లు) - 1-228-వ., 1-234-వ.,

[ ⇑ ] :34) గజము- (-){జాతి}[భూచర]:- గజము అంటే ఏనుగు - :వంశం - భూచర;:::::::పద్య సం.(లు) - 1-217-శా., 1-247-శా., 1-466-క., 2-158-సీ., 3-136-క., 4-314-వ., 8-327-క., నుండి 8-334-వ., వరకు

[ ⇑ ] :35) గజరిపుపీఠము- ( - ){జాతి}[ఉపకరణం]:- గజరిపుపీఠము అంటే సింహాసనం - :వంశం - ఉపకరణం;:::::::పద్య సం.(లు) - 1-438-క.,

[ ⇑ ] :36) గజవల్లభుడు- (స్త్రీ){జాతి}[జంతు]:- గజేంద్రుడు - :వంశం - జంతు;:::::::పద్య సం.(లు) - 8-53-చ.,

[ ⇑ ] :37) గజవైరి- ( -){జాతి}[జంతు]:- గజవైరి అంటే సింహము - :వంశం - జంతు;:::::::పద్య సం.(లు) - 1-438-క.,

[ ⇑ ] :38) గజేంద్రము- (స్త్రీ){జాతి}[జంతు]:- గజేంద్రుడు - :వంశం - జంతు;:::::::పద్య సం.(లు) - 6-387-మ., 8-48-వ., 8-89-వ., 8-93-వ., 8-97-వ., 8-122-మ., 10.1-812-మ., 10.1-819-శా., 10.1-1387-సీ.,

[ ⇑ ] :39) గణము- ( -){జాతి}[ -]:- గుంపు (తుమ్మెదల గుంపు మొదలగునవి) - :వంశం - -;:::::::పద్య సం.(లు) - 1-201-శా., 2-38-వ., 2-82-మ., 8-31-క.,

[ ⇑ ] :40) గణిక-1 ( -){జాతి}[వృక్ష]:- గణిక అంటే అడవిమొల్లలు సన్నజాజి (అడవి మల్లె) అని దేవవేశ్యల అని నానార్ర్థాలు ఉన్నాయి. ఈ పదం ప్రథమ స్కంధలో నైమిశారణ్య వర్ణన సందర్భంలో ఇంద్రుడి ఇల్లు} కు ఉపమాన పదంగా వాడబడింది. - :వంశం - వృక్ష;:::::::పద్య సం.(లు) - 1-39-వ., 10.1-1014-సీ.,

[ ⇑ ] :41) గణిక-2 ( -){జాతి}[దైవ యోని]:- గణిక అంటే దేవవేశ్యల అని అడవిమొల్లలు సన్నజాజి (అడవి మల్లె) అని నానార్ర్థాలు ఉన్నాయి. ఈ పదం ప్రథమ స్కంధలో నైమిశారణ్య వర్ణన సందర్భంలో ఇంద్రుడి ఇల్లు} ఉపమాన పదంగా వాడబడింది. - :వంశం - దైవ యోని;:::::::పద్య సం.(లు) - 1-39-వ., 9-396., 11-101-వ.,

[ ⇑ ] :42) గణేశుడు-1 (పురుష){సంజ్ఞా}[ఋషి]:- గణేశుడు అంటే గణములకు అధిపతి. నారయణకవచంలో కర్మబంధములవలన గణేశుడైన కపిలుడు రక్షించుగాక అన్నారు. - :వంశం - ఋషి;:::::::పద్య సం.(లు) - 6-307-వ.,

[ ⇑ ] :43) గణేశుడు-2 (పురుష){సంజ్ఞా}[దైవ యోని]:- గణేశుడు అంటే వినాయకుడు - :వంశం - దైవ యోని;:::::::పద్య సం.(లు) - 6-4-ఉ., 6-282-వ.,

[ ⇑ ] :44) గతాగతతానకము- ( -){సంజ్ఞా}[నృత్తము]:- పారిభాషిక పదము - రాసక్రీడ - నృత్తము
తాళమానమును మీరక పోకరాకలు చేయుచు నటించుట - :వంశం - నృత్తము;:::::::పద్య సం.(లు) - 10.1-1084-వ.,

[ ⇑ ] :45) గతి-1 (స్త్రీ){సంజ్ఞా}[ఋషి]:- కర్దమునికి దేవహూతి యందు పుట్టిన పదహారుమంది పుచ్రికలలో అయిదవ ఆమె అయిన గతికి పులహునితో వివాహం అయింది. వారికి ధాత, విధాత అను పుత్రులు. భగవత్పరాయణ యగు శ్రీ అను పుత్రిక కలిగారు. గతి యందు భర్త పులహునకు కర్మశ్రేష్ఠుడు; వరీయాంసుడు; సహిష్ణుడు అని ముగ్గురు కొడుకులు కలిగారు. - :వంశం - ఋషి;:తండ్రి - కర్దముడు;:తల్లి - దేవహూతి ;::భర్త - పులహుడు;:కొడుకు(లు) - కర్మశ్రేష్ఠుడు; వరీయాంసుడు; సహిష్ణుడు ;::పద్య సం.(లు) - 4-26-వ.,

[ ⇑ ] :46) గతి-2 (స్త్రీ){సంజ్ఞా}[రాక్షస యోని]:- దైత్యులు అయిన హిరణ్యకశిపునకు జంభాసురుని పుత్రి గతి యందు కలిగిన నలుగురు కొడుకులలోనూ మూడవ వాడైన సంహ్లాదునికి గతి అను భార్య యందు పంచజనుడు పుట్టాడు. - :వంశం - రాక్షస యోని;::::భర్త - సంహ్లాదుడు ;:కొడుకు(లు) - పంచజనుడు;::పద్య సం.(లు) - 6-507-వ.,

[ ⇑ ] :47) గదలు- ( -){జాతి}[పరికరములు]:- గదాయుధములు - :వంశం - పరికరములు;:::::::పద్య సం.(లు) - 1-142-వ., 1-212-ఉ., 8-327-క., నుండి 8-334-వ., వరకు

[ ⇑ ] :48) గదుడు-1 (పురుష){సంజ్ఞా}[చంద్రవంశం]:- గదుడు ఒక యదుపుంగవుడు, వసుదేవునికి రోహిణి యందు పుట్టాడు. - :వంశం - చంద్రవంశం;:తండ్రి - వసుదేవుడు;:తల్లి - రోహిణి;:::::పద్య సం.(లు) - 1-256-వ., 3-58-మ., 9-722-వ.,

[ ⇑ ] :49) గదుడు-2 (పురుష){సంజ్ఞా}[మానవ యోని]:- సాల్వుడు ద్వారకపైకి దండెత్తి వచ్చినపుడు గొప్పగా యుద్ధంచేసిన వీరులలో ఒకడు. - :వంశం - మానవ యోని;:::::::పద్య సం.(లు) - 2-858-చ.,

[ ⇑ ] :50) గదుడు-3 ( -){సంజ్ఞా}[చంద్రవంశం]:- గదుడు బలరాముని సహోదరుడు. శ్రీకృష్ణుని ద్వారక ఆగమనం విని నిత్యకృత్యాలు కూడ పరిత్యజించి ఉగ్రసేనుడు, అక్రూరుడు, వసుదేవుడు, బలభద్రుడు మున్నగు పెద్దలు; ప్రద్యుమ్నుడు, సాంబుడు, చారుదేష్ణుడు, గదుడు మొదలైన యదువీరులు వచ్చారు.
వసుదేవునికి రోహిణి యందు బలుడు, గదుడు, సారణుడు, దుర్మదుడు, విపులుడు, ధ్రువుడు, కృతుడు మున్నగువారు పుట్టారు. అలా రోహిణీదేవి రెండవకొడుకు. - :వంశం - చంద్రవంశం;:తండ్రి - వసుదేవుడు;:తల్లి - రోహిణి;:::::పద్య సం.(లు) - 1-256-వ., 9-722-వ.,

[ ⇑ ] :51) గద్యము- ( -){జాతి}[భాష]:- ఛందస్సు, తెలుగు భాగవతములో ఉపయోగించిన ఛందోరీతులలో ఒకటి ఈ గద్యము.
ప్రతి స్కంధము చివర కవి గురించి ఆ స్కంధములోని సారాంశములను సూచించడానికి ఉపయోగించారు. ఆవిధంగా పద్నాలుగు గద్యలు తెలుగు భాగవతంలో ఉన్నాయి. - :వంశం - భాష;:::::::పద్య సం.(లు) - 6-122-ఆ.,1-530-గ., 2-288-గ.,

[ ⇑ ] :52) గయ- ( -){సంజ్ఞా}[ప్రదేశము]:- గయ ఒక ప్రముఖ పుణ్యక్షేత్రము. మహావిష్ణువు ఇరవై రెండవ పర్యాయం కల్కి రూపంతో విష్ణుయశుడనే విప్రునికి కుమారుడై జన్మించి, కలియుగాంతంలో కలుషాత్ములైన రాజులను కఠినంగా శిక్షిస్తాడు - :వంశం - ప్రదేశము;:::::::పద్య సం.(లు) - 1-63-వ.,

[ ⇑ ] :53) గయాశీర్షము- ( -){సంజ్ఞా}[ప్రదేశము]:- గయాశీర్షము ఒక ప్రముఖ పుణ్యక్షేత్రము దీనిని శుభకాముడు సేవింపవలయును. - :వంశం - ప్రదేశము;:::::::పద్య సం.(లు) - 7-451-వ.,

[ ⇑ ] :54) గయుడు-1 (పురుష){సంజ్ఞా}[రాజు]:- రాజ్యమోహంతో గర్వాంధులైన రాజులను చూసి భూదేవి నవ్వుకుంటుంది అంటూ పేర్కొన్న ఇరవై ఎనిమిది రాజులలో ఇతను ఒకడు.
వామనుడు "వైన్యగయాది మహారాజులు అయినా ఆశను వదులుకోగలిగారా" అన్నాడు - :వంశం - రాజు;:::::::పద్య సం.(లు) - 12-18-వ., 8-575-శా.,

[ ⇑ ] :55) గయుడు-2 (పురుష){సంజ్ఞా}[రాజు]:- నిర్మలమతులైన ఈ మహాత్ములందరూ భక్తితో ఆ దేవదేవుని సేవించారు దాటరాాని విష్ణుమాయను దాటారు. - :వంశం - రాజు;:::::::పద్య సం.(లు) - 2-204-సీ.,

[ ⇑ ] :56) గయుడు-3 (పురుష){సంజ్ఞా}[ధ్రువుని వంశం]:- ఇతడు ధ్రువుని వంశపు ఉల్ముకునికి భార్య పుష్కరిణి యందు కలిగిన కొడుకులు ఆరుగురిలో ఒకడు. - :వంశం - ధ్రువుని వంశం;:తండ్రి - ఉల్ముకుడు;:తల్లి - పుష్కరిణి ;:::::పద్య సం.(లు) - 4-390-వ.,

[ ⇑ ] :57) గయుడు-4 (పురుష){సంజ్ఞా}[మానవ యోని]:- హవిర్దానునికి భార్య హవిర్దాని యందు బర్హిష్మదుడు, గయుడు, శుక్లుడు, కృష్ణుడు, సత్యుడు, జితవ్రతుడు అను ఆరుగురు పుత్రులు పుట్టారు. వారిలో గయుడు రెండవవాడు. - :వంశం - మానవ యోని;:::::::పద్య సం.(లు) - 4-679-వ.,

[ ⇑ ] :58) గయుడు-5 (పురుష){సంజ్ఞా}[ప్రియవ్రతుని వంశం]:- ప్రియవ్రతుని వంశంలో ప్రసిద్ధ రాజర్షి అయిన గయుడు నక్తుని కొడుకు. ఇతనికి జయంతి యందు చిత్రరథుడు, స్వాతి, అవరోధనుడు అను ముగ్గురు కొడుకులు పుట్టారు. - :వంశం - ప్రియవ్రతుని వంశం;:తండ్రి - నక్తుడు;::భార్య - జయంతి;::కొడుకు(లు) - చిత్రరథుడు, స్వాతి, అవరోధనుడు;::పద్య సం.(లు) - 5.2-6-వ., నుండి 5.2-10-వ., వరకు

[ ⇑ ] :59) గయుడు-6 (పురుష){సంజ్ఞా}[సూర్యవంశం]:- సూర్యవంశములో మనువు పుట్టన కూతురు ఆరునెలలు ఆడదిగా ఇళ పేరుతోనూ ఆరునెలలు పురుషునిగా ఉండేది. అలా పురుషునిగా ఉన్న సుద్యుమ్నునికి ఉత్కళుడు, గయుడు, విమలుడు అని ముగ్గురు పుత్రులు జన్మించారు. - :వంశం - సూర్యవంశం;:తండ్రి - సుద్యుమ్నుడు;::::::పద్య సం.(లు) - 9-32-వ.,

[ ⇑ ] :60) గరుడగమనుడు- (పురుష){సంజ్ఞా}[దైవ యోని]:- గరుడగమనుడు విష్ణుమూర్తి - :వంశం - దైవ యోని;:::::::పద్య సం.(లు) - 2-50-సీ., 4-291-సీ.,

[ ⇑ ] :61) గరుడధ్వజుడు- (పురుష){సంజ్ఞా}[దైవ యోని]:- గరుడధ్వజుడు అంటే విష్ణువు - :వంశం - దైవ యోని;:::::::పద్య సం.(లు) - 3-1051-వ.,

[ ⇑ ] :62) గరుడుడు- (పురుష){సంజ్ఞా}[దైవ యోని]:- గరుడుడు అంటే గరుత్మంతుడు - :వంశం - దైవ యోని;:::::::పద్య సం.(లు) - 3-612-వ., 4-351-చ.,4-548-వ.,

[ ⇑ ] :63) గరుడులు- (పురుష){జాతి}[దైవ యోని]:- గరుడులు - మహతత్త్వసృష్టిలో ఒక రకం.
ఇవి అష్టమ స్కంధములోని త్రికూట పర్వతములో వర్ణించబడ్డాయి,
వృత్రాసుర సంహారఘట్టంలో దేవదానవ యుద్ధం జరుగుతు న్నప్పుడు ఇంద్రుని వైపు పాల్గొన్నవారిలోనివ వారు - :వంశం - దైవ యోని;:::::::పద్య సం.(లు) - 2-112-వ., 3-251-క., 6-207-క., 6-363-వ., 8-24-వ.,

[ ⇑ ] :64) గరుత్మంతుడు- (పురుష){సంజ్ఞా}[దైవ యోని]:- విష్ణువు వాహనం అయిన గరుత్మంతుడు, సూర్యునికి సారథి అయిన అనూరుండును తార్క్ష్యునికి పెద్ద భార్య అయిన వినతకు పుట్టారు.
ఈ ద్వీపంలోని శాల్మలీ వృక్షం (బూరుగు చెట్టు) వలన ఆ పేరు వచ్చింది. ఇది ప్లక్ష ద్వీపంలోని జువ్విచెట్టు అంత ఉంది. దీనిపై గరుత్మంతుడు ఉంటాడు.
మహాతలంలో కుహకుడు, తక్షకుడు, కాళియుడు, సుషేణుడు మొదలైన సర్ప ముఖ్యులు గరుత్మంతుని వల్ల భయంతో కలవరపడుతూ ఉంటారు.
వీరు రక్షాదక్షుడై నన్ను కటాక్షించుగాక! అని విశ్వరూపుడు దేవేంద్రునికి ఉపదేశించిన శ్రీమన్నారాయణ కవచంలో ఉన్న నలభైతొమ్మిది స్తుతులలో ఇది ఒకటి. - :వంశం - దైవ యోని;:తండ్రి - తార్క్ష్యుడు;:తల్లి - వినత ;:::::పద్య సం.(లు) - 6-254-వ.,5.2-62-వ., 5.2-119-వ.,6-300-చ., నుండి 6-307-వ.,

[ ⇑ ] :65) గర్గు- (పురుష){జాతి}[దైవ యోని]:- తొమ్మిదవదైన దక్షసావర్ణి మన్వంతరంలో వరుడు, మరీచులు, గర్గు దేవతలు, అద్భుతుడు ఇంద్రుడు, ద్యుతిమంతుడు మున్నగువారు సప్తర్షులు. - :వంశం - దైవ యోని;:::::::పద్య సం.(లు) - 8-417-వ.,

[ ⇑ ] :66) గర్గుడు-1 (పురుష){సంజ్ఞా}[మానవ యోని]:- ముచికుందుడు మున్ను తనకు గర్గుడు ఇరవైఎనిమిదవ మహాయుగములో నారాయణుడు అవతరించునని గుర్తుచేసుకున్నాడు. అది శ్రీకృష్ణుడే అని గ్రహించాడు. - :వంశం - మానవ యోని;:::::::పద్య సం.(లు) - 10.1-1654-వ.,

[ ⇑ ] :67) గర్గుడు-2 (పురుష){సంజ్ఞా}[మానవ యోని]:- యాదవుల పురోహితుడు గర్గుడు. గర్గుడు వసుదేవుని పనుపున నందుని ఇంటికి వచ్చి బలరామ కృష్ణులకు నామకరణం చేసాడు.
గర్గుడు మున్నగు భూసురోత్తములచే బలరామ కృష్ణులకు ఉపనయనం చేయబడింది. - :వంశం - మానవ యోని;:::::::పద్య సం.(లు) - 10.1-281-వ., 10.1-1407-క.,

[ ⇑ ] :68) గర్గుడు-3 (పురుష){సంజ్ఞా}[ఋషి]:- ఇతడు ధర్మరాజు చేసిన రాజసూయయాగంలో పాల్గొన్న మునీశ్వరులలో ఒకడు - :వంశం - ఋషి;:::::::పద్య సం.(లు) - 10.2-766-సీ.,

[ ⇑ ] :69) గర్గుడు-4 (పురుష){సంజ్ఞా}[చంద్రవంశం]:- వితథుని కొడుకైన మన్యువునకు బృహత్క్షత్త్రుడు, జయుడు, మహావీర్యుడు, నరుడు, గర్గుడు అను నలుగురు కొడుకులు కలిగారు. ఆ గర్గునకు శిని అనువాడు పుట్టాడు. శిని కొడుకు గార్గుడు. - :వంశం - చంద్రవంశం;:తండ్రి - మన్యువు;::::కొడుకు(లు) - శిని;::పద్య సం.(లు) - 9-641-వ., 9653-వ.,

[ ⇑ ] :70) గర్దభ- ( -){జాతి}[జంతు]:- గర్దభము అంటే గార్దభము, గాడిద - :వంశం - జంతు;:::::::పద్య సం.(లు) - 1-338-సీ.,

[ ⇑ ] :71) గర్దభాసురుడు- (పురుష){సంజ్ఞా}[రాక్షస యోని]:- గర్దభాసురుడు అంటే ధేనుకాసురుడు. వీనిని బలరాముడు తాటివనంలో సంహరించాడు. - :వంశం - రాక్షస యోని;:::::::పద్య సం.(లు) - 10.1-620-వ.,

[ ⇑ ] :72) గర్దభులు- (పురుష){జాతి}[మానవ యోని]:- పరీక్షిత్తుకు భవిష్యత్తు కాలంలో ఆంధ్రజాతీయులైన వారు నాలుగువందలఏభైయారు ఏళ్ళు పరిపాలిస్తారు. ఆ తరువాత నాభీరవంశం వారు ఏడుగురు, గర్దభవంశం వారు పదిమంది, కంకవంశం వారు పదహారుమంది రాజ్యభారాన్ని ధరించి పరిపాలిస్తారు. - :వంశం - మానవ యోని;:::::::పద్య సం.(లు) - 12-8-వ.,

[ ⇑ ] :73) గవయ-1 ( -){జాతి}[భూచర]:- గవయ అంటే కురుఁబోతులు అని వానర వీరుడు గవయడు అని నానార్ర్థాలు ఉన్నాయి. ఈ పదం ప్రథమ స్కంధలో నైమిశారణ్య వర్ణన సందర్భంలో సుగ్రీవుడి సైన్యం} కు ఉపమాన పదంగా వాడబడింది. - :వంశం - భూచర;:::::::పద్య సం.(లు) - 1-39-వ.,

[ ⇑ ] :74) గవయ-2 ( -){సంజ్ఞా}[వానర]:- గవయ అంటే వానర వీరుడు గవయడు అని కురుఁబోతులు అని నానార్ర్థాలు ఉన్నాయి. ఈ పదం ప్రథమ స్కంధలో నైమిశారణ్య వర్ణన సందర్భంలో సుగ్రీవుడి సైన్యం} ఉపమాన పదంగా వాడబడింది. - :వంశం - వానర;:::::::పద్య సం.(లు) - 1-39-వ.,

[ ⇑ ] :75) గవయ - ( -){జాతి}[జంతు]:- గురుపోతులు - ఇవి అష్టమ స్కంధములోని త్రికూట పర్వతములో వర్ణించబడ్డాయి - :వంశం - జంతు;:::::::పద్య సం.(లు) - 1-122-క., 1-456-క., 3-344-వ., 4-135-వ., 4-773-క., 8-24-వ., 8-331-వ.,

[ ⇑ ] :76) గవయుడు- (పురుష){సంజ్ఞా}[వానర]:- రామరావణ యుద్ధంలో పాల్గొన్న ఒక వానర యోధుడు. - :వంశం - వానర;:::::::పద్య సం.(లు) - 9-291-వ.,

[ ⇑ ] :77) గహ్వరము- ( -){జాతి}[ప్రదేశము]:- గుహ - :వంశం - ప్రదేశము;:::::::పద్య సం.(లు) - 1-123-వ., 5.1-166-త., 6-150-క., 8-55-వ.,

[ ⇑ ] :78) గహ్వుడు- (పురుష){సంజ్ఞా}[చంద్రవంశం]:- గహ్వుడు కంసుని సోదరులలో ఒకడు. గహ్వుడు మున్నగు కంససోదరులను బలరాముడు సంహరించాడు. - :వంశం - చంద్రవంశం;:::::::పద్య సం.(లు) - 10.1-1882-శా.,

[ ⇑ ] :79) గాండీవము- ( -){జాతి}[ఆయుధము]:- గాండీవము అర్జునుని విల్లు. ఇంద్రుని ఎదిరించి ఖాండవవనాన్ని అగ్నిదేవునికోసం సమర్పించగా, అగ్నిదేవుడు సంతసించి గాండీవమును ఇచ్చాడు. ఇంద్రుని ఎదిరించి ఖాండవవనాన్ని కృష్ణసహితుడై అగ్నిదేవునికి సమర్పించాడు. సంతసించిన అగ్నిదేవుడు గాండీవము అక్షయతూణీరములు ఇచ్చాడు.
గాండీవము - వ్యు. గాండి (ముడి, గ్రంథి) అస్తి అస్య - గాండీ వ, త.ప్ర., ముడిగలది., వివ. ఇది బ్రహ్మనిర్మితమైనది. క్రమముగా సోముడు, వరుణుడు పొందిరి. అగ్నిదేవుడు ప్రార్థింపగా వరుణుడు అర్జున కొసగెను., -(- ఆంధ్రశబ్దరత్నాకరము) - :వంశం - ఆయుధము;:::::::పద్య సం.(లు) - 1-144-మ., 1-145-వ., 1-361-క., 10.2-122-వ., 10.2-1174-వ., 10.2-1288-మ., 10.2-1298-క.,

[ ⇑ ] :80) గాండీవి- (పురుష){సంజ్ఞా}[చంద్రవంశం]:- గాండీవి అనగా అర్జునుడు. గాండీవము అని విల్లు ధరించిన వాడు కావున గాండీవి అయినాడు. - :వంశం - చంద్రవంశం;:::::::పద్య సం.(లు) - 1-417-క., 10.2-1307-సీ.,

[ ⇑ ] :81) గాందిని- (స్త్రీ){సంజ్ఞా}[చంద్రవంశం]:- గాందిని చంద్రవంశంలోని అనమిత్రుని పుత్రుడైన శ్వఫల్కుని భార్య. గాందిని భర్త శ్వఫల్కునితో సారమేయుడు, మృదుకుడు, మృదుపచ్ఛివుడు, వర్మదృక్కు, ధృష్టవర్ముడు, క్షత్రోపేక్షుడు, అరిమర్దనుడు, శత్రుఘ్నుడు, గంధమాదనుడు, ప్రతిబాహువు అను పన్నెండు మంది కొడుకులను, సుచారువు అను కూతురును కన్నది. - :వంశం - చంద్రవంశం;::::భర్త - శ్వఫల్కుడు;:కొడుకు(లు) - అక్రూరుడు, అసంగుడు, సారమేయుడు, మృదుకుడు, మృదుపచ్చివుడు, వర్మదృక్కు, దృష్టవర్ముడు, క్షత్రోపేక్షుడు, అరిమర్దనుడు, శత్రుఘ్నుడు, గంధమాదనుడు, ప్రతిబాహువు;:కూతురు(లు)- సుచారువు;:పద్య సం.(లు) - 9-712-వ.,

[ ⇑ ] :82) గాంధర్వక్షీరము- ( -){జాతి}[ -]:- మాధుర్య సౌందర్యాలతో కూడినది, సంగీత విషయక మగు ఒక వేదము, సంగీతము, పాట అయిన గాంధర్వము అనే క్షీరమును (ఫలితమును) అప్సరసలు గంధర్వులు విశ్వావసువును దూడగా (ఉత్ప్రేరకముగా) చేసుకొని పద్మమయమైన పాత్రలో పితికికొన్నారు సంపాదించుకున్నారు. పృథు చక్రవర్తి ప్రయత్నం వలన భూదేవి చెప్పిన సూత్రాన్ని బట్టి ఇలా అందరూ వారివారికి కావలసిన వాటిని పొందారు. - :వంశం - -;:::::::పద్య సం.(లు) - 4-501-సీ., 4-502-వ.,

[ ⇑ ] :83) గాంధర్వవిధి- ( -){జాతి}[ -]:- గాంధర్వవిధి అంటే వధూవరులు పరస్పరేచ్ఛతో చేసికొను పెండ్లి. (ఆంధ్రశబ్దరత్నాకరము). దుష్యంతుడు శకుంతలను అప్పుడు గాంధర్వవిధిని వరించెను. - :వంశం - -;:::::::పద్య సం.(లు) - 9-622-క.,

[ ⇑ ] :84) గాంధర్వవేదము- ( - ){జాతి}[ -]:- ఉపవేదాలలో ఆయుర్వేదం బ్రహ్మదేవుని యొక్క తూర్పుముఖం నుంచి, ధనుర్వేదం, దక్షిణ ముఖంనుంచి, గాంధర్వవేదం పశ్చిమ ముఖంనుంచి, విశ్వకర్మకు సంబంధించిన స్ధాపత్యమనే శిల్పవేదం ఉత్తర ముఖంనుంచి ఉత్పన్నమయినాయి అని మైత్రేయుడు విదురునికి చెప్పాడు. - :వంశం - -;:::::::పద్య సం.(లు) - 3-388-వ.,

[ ⇑ ] :85) గాంధర్వసంగీతము- ( -){జాతి}[ -]:- బృందావనంలో కృష్ణుడు పరబ్రహ్మము తానైన గాంధర్వవేదంలోని గీతం వాయిస్తున్నాడు. ఆ మురళీగానలోలులైన గోపికలు ఒకరిని ఒకరు రమ్మని హెచ్చరించుకుంటున్నారు.
మౌళిపింఛముఁ గంఠదామము.. అను 10.1-770-శా. పద్యం అద్భుతమైనది. - :వంశం - -;:::::::పద్య సం.(లు) - 10.1-773-శా., 10.1-770-సీ.,

[ ⇑ ] :86) గాంధారక్తినాథకూతురు- (స్త్రీ){సంజ్ఞా}[చంద్రవంశం]:- గాంధారక్తినాథకూతురు అంటే గాంధారి. - :వంశం - చంద్రవంశం;:తండ్రి - పాండురాజు;:తల్లి - కుంతి;:::::పద్య సం.(లు) - 1-318-శా.,

[ ⇑ ] :87) గాంధారి- (స్త్రీ){సంజ్ఞా}[చంద్రవంశం]:- గాంధారి అంధుడైన ధృతరాష్ట్రుని భార్య. భర్త అంధుడు కనుక తన కళ్ళకు గంతలు కట్టుకుని జీవితాంతం గడిపిన మహా ఇల్లాలు. గాంధారదేశపు రాకుమారి కనుక గాంధారి. గాంధారికి ధృతరాష్ట్రునితో దుర్యోధనాది కౌరవులు వందమంది కొడుకులు, దుశ్శల అను కూతురు పుట్టారు. కురుక్షేత్రంలో తన కొడుకులందరూ చనిపోగా, భర్తతోపాటు పాండవుల వద్ద ఉంది. తరువాత ధృతరాష్ట్రుడు విదురునితో పాటు వనవాసానికి వెళ్ళగా, గాంధారి భర్తతోపాటు ధైర్యంగా వెళ్ళి. అతను దేహం విడిచేకా సహగమనం చేసిన సతీమణి. గాంధారి నూరుగురు కౌరవుల పేర్లు ఇక్కడ చూడగలరు. - :వంశం - చంద్రవంశం;:తండ్రి - గాంధారరాజు;:::భర్త - ధృతరాష్ట్రుడు;:కొడుకు(లు) - కౌరవులు వీరు దుర్యోధనుడు ఆదులు వంద మంది;:కూతురు(లు)- దుశ్శల;:పద్య సం.(లు) - 1-176-వ., 1-228-వ., 1-234-వ., 1-320-వ., 1-324-వ., 1-330-మ., 9-673-వ., 10.2-83-వ., 10.2-1044-వ., 10.2-1114-సీ.,

[ ⇑ ] :88) గాంధారీవిభుడు- (పురుష){సంజ్ఞా}[చంద్రవంశం]:- గాంధారీవిభుడు అంటే గాంధారి భర్త, దుర్యోధనుడు. - :వంశం - చంద్రవంశం;:::::::పద్య సం.(లు) - 1-300-క.,

[ ⇑ ] :89) గాంధారుడు- (పురుష){సంజ్ఞా}[చంద్రవంశం]:- కర్ణుని వంశంలో బభ్రుసేతువు కొడుకైన ఆరబ్ధుని కొడుకు గాందారుడు. గాంధారునకు ఘర్ముడు పుట్టాడు. ఘర్మునికి ఘృతుడు పుట్టాడు. - :వంశం - చంద్రవంశం;:తండ్రి - ఆరబ్దుడు;::::కొడుకు(లు) - ఘర్ముడు;::పద్య సం.(లు) - 9-699-వ.,

[ ⇑ ] :90) గాంధారేయుడు- (పురుష){సంజ్ఞా}[చంద్రవంశం]:- గాంధారేయుడు అంటే గాంధారి పుత్రుడు, దుర్యోధనుడు. ఇతడు బలరాముని వద్ద గదాయుద్ధం నైపుణ్యాలు నేర్చుకున్నాడు. - :వంశం - చంద్రవంశం;:తండ్రి - ధృతరాష్ట్రుడు;:తల్లి - గాంధారి;:::::పద్య సం.(లు) - 10.2-94-క.,

[ ⇑ ] :91) గాధి-1 (పురుష){సంజ్ఞా}[సూర్య వంశం]:- రాజ్యమోహంతో గర్వాంధులైన రాజులను చూసి భూదేవి నవ్వుకుంటుంది అంటూ పేర్కొన్న ఇరవై ఎనిమిది రాజులలో ఇతను ఒకడు. - :వంశం - సూర్య వంశం;:::::::పద్య సం.(లు) - 12-18-వ.,

[ ⇑ ] :92) గాధి-2 (పురుష){సంజ్ఞా}[రాజు]:- నిర్మలమతులైన ఈ మహాత్ములందరూ భక్తితో ఆ దేవదేవుని సేవించారు దాటరాాని విష్ణుమాయను దాటారు. - :వంశం - రాజు;:::::::పద్య సం.(లు) - 2-204-సీ.,

[ ⇑ ] :93) గాధి-3 (పురుష){సంజ్ఞా}[చంద్రవంశం]:- కుశాంబువు కొడుకు గాధి. గాధి కూతురు సత్యవతి, అల్లుడు ఋచికుడు అను విప్రుడు. గాధి కొడుకు విశ్వామిత్రుడు - :వంశం - చంద్రవంశం;:తండ్రి - కుశాంబుడు;::భార్య - సత్యవతి;::కొడుకు(లు) - విశ్వామిత్రుడు;:కూతురు(లు)- సత్యవతి;:పద్య సం.(లు) - 9-422-వ., 9-423-సీ., 9-424-వ., 9-492-వ.,

[ ⇑ ] :94) గాయత్రి-1 ( -){సంజ్ఞా}[మంత్ర]:- గాయత్రి అంటే గాయత్రీ మంత్రము., సత్యం పరం ధీమహి” పరమమైన సత్యమునే ధ్యానము చేసెదము అనే గాయత్రీ మహామంత్రంతో ఆరంభించటం వల్ల గాయత్రి పరదేవతాస్వరూప మైనది. గాయత్రిని అతిశయింపజేస్తూ, ధర్మ ప్రస్తారాన్నీ, వృత్రాసుర సంహారాన్నీ అభివర్ణించే గ్రంథాన్ని భాగవతం అంటారు అని మత్స్యపురాణంలో చెప్పి ఉండటంవల్ల ఈ మహా గ్రంథం శ్రీ మహాబాగవతం అని ప్రసిద్ధి గాంచింది. - :వంశం - మంత్ర;:::::::పద్య సం.(లు) - 1-35-వ., 3-386-వ., 3-471-వ., 5.1-122-వ., 7-421-వ.,

[ ⇑ ] :95) గాయత్రి-2 ( -){సంజ్ఞా}[భగణ విషయం]:- సూర్యుని రథానికి పూన్చిన సప్తాశ్వాలులో ఒకటి - :వంశం - భగణ విషయం;:::::::పద్య సం.(లు) - 5.2-82-సీ., 5.2-83-వ.,

[ ⇑ ] :96) గాయత్రీ-1 ( -){సంజ్ఞా}[వృక్ష]:- గాయత్రీ అంటే చండ్ర చెట్లు అని గాయత్రీ మంత్రం అని నానార్ర్థాలు ఉన్నాయి. ఈ పదం ప్రథమ స్కంధలో నైమిశారణ్య వర్ణన సందర్భంలో వేదములు} కు ఉపమాన పదంగా వాడబడింది. - :వంశం - వృక్ష;:::::::పద్య సం.(లు) - 1-39-వ.,

[ ⇑ ] :97) గాయత్రీ-2 ( -){సంజ్ఞా}[మంత్ర]:- గాయత్రీ అంటే గాయత్రీ మంత్రం అని చండ్ర చెట్లు అని నానార్ర్థాలు ఉన్నాయి. ఈ పదం ప్రథమ స్కంధలో నైమిశారణ్య వర్ణన సందర్భంలో వేదములు} ఉపమాన పదంగా వాడబడింది. - :వంశం - మంత్ర;:::::::పద్య సం.(లు) - 1-39-వ.,

[ ⇑ ] :98) గారుడము- ( -){జాతి}[విద్య]:- గారుడము అంటే గరుడ పురాణము. ఇది పద్దెనిమిది మహాపురాణములలో ఒకటి. దీని గ్రంథ సంఖ్య పంతొమ్మిది వేలు. - :వంశం - విద్య;:::::::పద్య సం.(లు) - 12-30-వ., 12-48-వ.,

[ ⇑ ] :99) గార్గ్యుండు- (పురుష){సంజ్ఞా}[చంద్రవంశం]:- చంద్రవంశపు గర్గుని కొడుకైన శినికి గార్గుడని పుత్రుడు పుట్టాడు. అతని యందు బ్రాహ్మణకులం అయినది. - :వంశం - చంద్రవంశం;:తండ్రి - శిని;::::::పద్య సం.(లు) - 9-653-వ.,

[ ⇑ ] :100) గార్గ్యుడు-1 (పురుష){సంజ్ఞా}[ఋషి]:- శ్రీకృష్ణుని దర్శించుకోవడానికి వచ్చి వసుదేవునిచే క్రతువు చేయించిన మునీశ్వరులలో ఒక మునీశ్వరుడు. - :వంశం - ఋషి;:::::::పద్య సం.(లు) - 10.1-1117-ఉ.,

[ ⇑ ] :101) గార్గ్యుడు-2 (పురుష){సంజ్ఞా}[ఋషి]:- గార్గ్యుడు, బాలాయని, కాసారుడు అనే ముగ్గురు బాష్కలుని కుమారుడైన బాష్కలుని నుండి ఋగ్వేద వాలఖిల్య సంహితను పొందారు. - :వంశం - ఋషి;:::::::పద్య సం.(లు) - 12-30-వ.,

[ ⇑ ] :102) గార్ధభము- ( -){జాతి}[జంతు]:- గార్దభము అంటే గాడిద - :వంశం - జంతు;:::::::పద్య సం.(లు) - 3-605-క., 10.1-622-ఉ.,

[ ⇑ ] :103) గార్ధభాసురుడు- (పురుష){సంజ్ఞా}[రాక్షస యోని]:- తాటవనంలో బలరామకృష్ణులు తాటిపళ్ళు రాలగొడుతున్న శబ్దం విని కోపంతో వారిమీదకు వచ్చాడు. పిమ్మట బలరాముని చేతిలో మరణించాడు - :వంశం - రాక్షస యోని;:::::::పద్య సం.(లు) - 10.1-617-వ.,

[ ⇑ ] :104) గాలవ-1 ( -){సంజ్ఞా}[వృక్ష]:- గాలవ అంటే లొద్దుగ చెట్లు అని గాలవముని అని నానార్ర్థాలు ఉన్నాయి. ఈ పదం ప్రథమ స్కంధలో నైమిశారణ్య వర్ణన సందర్భంలో శివుడి సభ} కు ఉపమాన పదంగా వాడబడింది. - :వంశం - వృక్ష;:::::::పద్య సం.(లు) - 1-39-వ.,

[ ⇑ ] :105) గాలవ-2 ( -){సంజ్ఞా}[ఋషి]:- గాలవ అంటే గాలవముని అని లొద్దుగ చెట్లు అని నానార్ర్థాలు ఉన్నాయి. ఈ పదం ప్రథమ స్కంధలో నైమిశారణ్య వర్ణన సందర్భంలో శివుడి సభ} ఉపమాన పదంగా వాడబడింది. - :వంశం - ఋషి;:::::::పద్య సం.(లు) - 1-39-వ.,

[ ⇑ ] :106) గాలవుడు-1 (పురుష){సంజ్ఞా}[ఋషి]:- శ్రీకృష్ణుని దర్శించుకోవడానికి వచ్చి వసుదేవునిచే క్రతువు చేయించిన మునీశ్వరులలో ఒక మునీశ్వరుడు. - :వంశం - ఋషి;:::::::పద్య సం.(లు) - 10.2-1117-ఉ.,

[ ⇑ ] :107) గాలవుడు-2 (పురుష){సంజ్ఞా}[ఋషి]:- ఎనిమిదవదైన సూర్య సావర్ణి మన్వంతరంలో గాలవుడూ, దీప్తిమంతుడూ, పరశురాముడు, అశ్వత్థామ, కృపుడూ, వ్యాసుడు, ఋష్యశృంగుడు, సప్తఋషులు అవుతారు. ఇప్పుడు వారు తమతమ ఆశ్రమాలలో ఉన్నారు. సుతపులూ, విరజులూ, అమృతప్రభులూ దేవతలు అవుతారు. బలిచక్రవర్తి ఇంద్రుడు అవుతాడు. - :వంశం - ఋషి;:::::::పద్య సం.(లు) - 8-415-వ.,

[ ⇑ ] :108) గిరి- ( -){జాతి}[ప్రదేశము]:- కొండ - :వంశం - ప్రదేశము;:::::::పద్య సం.(లు) - 3-38-క., 4-433-సీ., 8-55-వ.,

[ ⇑ ] :109) గిరిజ- (స్త్రీ){సంజ్ఞా}[దైవ యోని]:- గిరిజ అంటే పర్వత పుత్రి పార్వతీదేవి - :వంశం - దైవ యోని;:::::::పద్య సం.(లు) - 6-488-శా.,

[ ⇑ ] :110) గిరిభిత్- (పురుష){సంజ్ఞా}[దైవ యోని]:- గిరిభిత్ అంటే ఇంద్రుడు - :వంశం - దైవ యోని;:::::::పద్య సం.(లు) - 10.2-215-మ.,

[ ⇑ ] :111) గిరిభేది- (పురుష){సంజ్ఞా}[దైవ యోని]:- గిరిభేది అంటే గిరుల రెక్కలు కత్తిరించిన వాడు ఇంద్రుడు.. - :వంశం - దైవ యోని;:::::::పద్య సం.(లు) - 10.1-926-వ.,

[ ⇑ ] :112) గిరివ్రజం- ( -){సంజ్ఞా}[ప్రదేశము]:- గిరవ్రజం జరాసంధుని రాజథాని - :వంశం - ప్రదేశము;:::::::పద్య సం.(లు) - 9-660.,

[ ⇑ ] :113) గిరిశుడు- (పురుష){సంజ్ఞా}[దైవ యోని]:- గిరిశుడు - గిరీశుడు అంటే పార్వతీదేవి భర్త, పరమశివుడు - :వంశం - దైవ యోని;:::::::పద్య సం.(లు) - 3-61-వ., 4-47-వ.,

[ ⇑ ] :114) గిరిసుత- (స్త్రీ){సంజ్ఞా}[దైవ యోని]:- గిరి (హిమవంతుడు) యొక్క కూతురు కనుక గిరిసుత - :వంశం - దైవ యోని;:::::::పద్య సం.(లు) - 1-11-మ.,

[ ⇑ ] :115) గీత- ( -){జాతి}[ -]:- గీత అంటే పాట - :వంశం - -;:::::::పద్య సం.(లు) - 1-86-సీ., 1-135-క., 4-443-సీ.,

[ ⇑ ] :116) గీతములు (యశోగీతాలు)- ( -){జాతి}[ -]:- పృథుచక్రవర్తి పట్టాభిషిక్తుడు అయిన సందర్భంలో దేవతలు అందరు వివిధ బహుమానాలు ఇచ్చారు. వారిలో దేవతలు, యశోగీతాలు ఇచ్చెను - :వంశం - -;:::::::పద్య సం.(లు) - 4-442-సీ.,., 4-443-సీ.,

[ ⇑ ] :117) గీతలు- ( -){జాతి}[ -]:- గీతలు అంటే భగవద్గీతా వాక్యములు - :వంశం - -;:::::::పద్య సం.(లు) - 1-381-వ.,

[ ⇑ ] :118) గీతావచనము- ( -){జాతి}[ -]:- గీతావచనము అంటే భగవద్గీత లోని బోధ పలుకు - :వంశం - -;:::::::పద్య సం.(లు) - 11-107-వ.,

[ ⇑ ] :119) గీతాశాస్త్రము- ( -){సంజ్ఞా}[గ్రంథ]:- గీతాశాస్త్రము అంటే భగవద్గీత - :వంశం - గ్రంథ;:::::::పద్య సం.(లు) - 9-230-వ.,

[ ⇑ ] :120) గీయమానుడు- (పురుష){జాతి}[దైవ యోని]:- గీయమానుడు కీర్తింపదగినవాడు, విష్ణువు - :వంశం - దైవ యోని;:::::::పద్య సం.(లు) - 1-39-వ., 4-509-సీ.,

[ ⇑ ] :121) గీర్వాణారి- (పురుష){సంజ్ఞా}[రాక్షస యోని]:- గీర్వాణులు (దేవతలు) యొక్క అరి శత్రువు, అసురుడు, బలి. - :వంశం - రాక్షస యోని;:::::::పద్య సం.(లు) - 8-335-శా.,

[ ⇑ ] :122) గీర్వాణులు- (పురుష){జాతి}[దైవ యోని]:- గీర్వాణులు అంటే దేవతలు - :వంశం - దైవ యోని;:::::::పద్య సం.(లు) - 3-502-క., 4-156-క., 4-235-క., 6-271-క.,

[ ⇑ ] :123) గీష్పతి- (పురుష){సంజ్ఞా}[దైవ యోని]:- గీష్పతి (గీర్పతికి రూపాంతరం) అంటే బృహస్పతి - :వంశం - దైవ యోని;:::::::పద్య సం.(లు) - 6-263-చ.,

[ ⇑ ] :124) గున్న- (స్త్రీ){జాతి}[జంతు]:- గున్న అంటే ఏనుగుపిల్ల - :వంశం - జంతు;:::::::పద్య సం.(లు) - 8-28-క., 10.291-సీ.,

[ ⇑ ] :125) గుప్త వర్షం- ( -){సంజ్ఞా}[ప్రాంతం]:- గుప్త వర్షం కుశద్వీపంలోని వర్షం. దీనికి అధిపతి హిరణ్యరేతసుని కొడుకు గుప్తుడు ఈ వర్షంలో చిత్రకూటం అను గిరి, మిత్రవింద అను మహానది ఉన్నాయి. ఇక్కడ ఉండే కుశలులు, కోవిదులు, అభియుక్తులు, కులకులు అనే నాలుగు వర్ణాలవారు యజ్ఞపురుషుని ఆరాధిస్తుంటారు. - :వంశం - ప్రాంతం;:::::::పద్య సం.(లు) - 5.2-64-వ,

[ ⇑ ] :126) గుప్తుడు- (పురుష){సంజ్ఞా}[మానవ యోని]:- కుశద్వీపాధిపతి హిరణ్యరేతసునికి గల వసుదానుడు, దృఢరుచి, నాభి, గుప్తుడు, సత్యవ్రతుడు, విప్రుడు, వామదేవుడు అను ఏగుగురు కొడుకులలో నాలుగవవాడు గుప్తుడు. వీరు ఏడుగురు తమ పేర ఏడు వర్షాలు ఏర్పరచుకుని పాలించారు. అందులో గుప్తుడు గుప్తవర్షము పాలించాడు. - :వంశం - మానవ యోని;:తండ్రి - హిరణ్య రేతసుడు ;::::::పద్య సం.(లు) - 5.2-64-వ.,

[ ⇑ ] :127) గురుజిత్తు- (పురుష){సంజ్ఞా}[సూర్యవంశం]:- సూర్యవంశములోని అజునకు పుత్రుడు గురుజిత్తు. గురుజిత్తునకు కొడుకు అరిష్టనేమి. - :వంశం - సూర్యవంశం;:తండ్రి - అజుడు;::::కొడుకు(లు) - అరిష్టనేమి;::పద్య సం.(లు) - 9-374-వ.,

[ ⇑ ] :128) గురుడు- (పురుష){సంజ్ఞా}[చంద్రవంశం]:- చంద్రవంశంలోని సంకృతికి గురుడు, రంతిదేవుడు అని ఇద్దరు కొడుకులు - :వంశం - చంద్రవంశం;:తండ్రి - సంకృతి;::::::పద్య సం.(లు) - 9-641-వ.,

[ ⇑ ] :129) గురునందనుడు- (పురుష){సంజ్ఞా}[మానవ యోని]:- గురువు కృపాచార్యుని కొడుకు కనుక అశ్వత్థామ గురునందనుడు - :వంశం - మానవ యోని;:::::::పద్య సం.(లు) - 1-158-వ., 1-277-సీ.,

[ ⇑ ] :130) గురుమతి- (పురుష){జాతి}[మానవ యోని]:- గురుమతి గొప్పజ్ఞానము కలవారు - :వంశం - మానవ యోని;:::::::పద్య సం.(లు) - 1-59-క., 4-928-చ.,

[ ⇑ ] :131) గురువు- (పురుష){జాతి}[మానవ యోని]:- గురువు అంటే ఉపాధ్యాయుడు, పెద్దవాడు, బృహస్పతి - :వంశం - మానవ యోని;:::::::పద్య సం.(లు) - 1-23-వ., 1-42-క., 6-262-క., 9-376-సీ.,

[ ⇑ ] :132) గురువులు- (పురుష){జాతి}[మానవ యోని]:- క్రౌంచద్వీపంలోని గురువులు, ఋషభులు, ద్రవిణకులు, దేవకులు అనే నాలుగు వర్ణాలవారి లోని వారు. - :వంశం - మానవ యోని;:::::::పద్య సం.(లు) - 5.2-66-వ.,

[ ⇑ ] :133) గురుసుతుడు- (పురుష){సంజ్ఞా}[మానవ యోని]:- గురువు కృపాచార్యుని కొడుకు కనుక అశ్వత్థామ గురుసుతుడు - :వంశం - మానవ యోని;:::::::పద్య సం.(లు) - 1-145-వ.,

[ ⇑ ] :134) గుల్ల- ( -){జాతి}[జలచర]:- నత్తగుల్లలు - :వంశం - జలచర;:::::::పద్య సం.(లు) - 8-55-వ.,

[ ⇑ ] :135) గుహుడు- (పురుష){సంజ్ఞా}[దైవ యోని]:- గుహుడు సాగరమథనం తరువాత జరిగిన యుద్ధంలో ఇంద్రుని వైపు ఉండి తారకునితో యుద్ధము చేసాడు. - :వంశం - దైవ యోని;:::::::పద్య సం.(లు) - 8-334-వ.,

[ ⇑ ] :136) గుహ్యకులు- (పురుష){జాతి}[రాక్షస యోని]:- గుహ్యకులు ఒక పిశాచ యోని. వీరి నాయకుడు కుబేరుడు. బ్రహ్మదేవుడు కునుకుపాటులు, ఉన్మాదం,ఆవులింత, నిద్రలతో కూడిన శరీరాన్ని ధరించి పిశాచాలనూ, గుహ్యకులనూ, సిద్ధులనూ, భూతాలనూ పుట్టించగా వాళ్ళు దిగంబరులై వెండ్రుకలు విరబోసుకొని ఉండడం చూచి బ్రహ్మ కన్నులు మూసుకొని అప్పటి తన శరీరాన్ని వదలి వేయగా దానిని పిశాచులు గ్రహించారు.
వీరు రుద్రపారిషదులు అయిన ప్రమథ గుహ్యక గణములలోని వారు. సిద్దులతో పాటు వీరి నివాసము కైలాసము. వీరు సాధ్యులు, రాక్షసులు, యక్షులు, కుబేరునితో పాటు శివుని సేవిస్తూ ఉంటారు.
ధ్రువుడు సోదరుని మరణానికి కోపించి గుహ్యకుల మీద యుద్దం చేసాడు.. పిమ్మట తాత చెప్తే కోపం వదిలాడు. దానికి సంతసించి కుబేరుడు విష్ణుభక్తిని వరంగా ఇచ్చాడు..
పృథుని అశ్వమేథ.గానికి విచ్చేసినవారిలో గుహ్యకులు కూడా ఉన్నరు.
నలకూబర, మణిగ్రీవులు అను గుహ్యకులు జంటమద్దులై పడి ఉన్నారు. కృష్ణుడు తనను కట్టిన ఱోలు ఈడ్చుకుంటూ వచ్చి కూల్చి, నారద శాపగ్రస్తులు అయిన వారిని శాపవిముక్తులను చేసాడు.
కుబేరుని భటుడు శంఖచూడుడు అను గుహ్యకుడు వచ్చి గోపికలను ఎత్తుకుపోతుంటే బలరామకృష్ణులు అడ్డుకుని వానిని శిక్షించారు.
శంబరాసురుడు మయుడు నేర్పన మాయలను యుద్ధంలో ప్రద్యుమ్నుని మీద భుజగ, గుహ్యక, పిశాచ మాయలను ప్రయోగించాడు. వాటన్నిటినీ ప్రద్యుమ్నుడు తప్పించాడు.
శివకృష్ణుల యుద్ధంలో గుహ్యకులు కూడా పాల్గొన్నారు.
అర్జునుడు విప్రుని మృతశిశువుకై గుహ్యకాది అందరి నివాస ప్రాంతాలు వెతికి విఫలుడు అయ్యాడు. - :వంశం - రాక్షస యోని;:::::::పద్య సం.(లు) - 1-206-వ., 3-738-వ., 4-104-వ., 4-133-ఉ., 4-138-సీ., 4-322-వ., నుండి 4-353-వ., వరకు, 4-509-సీ., 10.1-391-వ., నుండి 10.1-409-వ., వరకు 10.1-1123-వ., నుండి 10.1-1126-శా., వరకు 10.2-20-వ., 10.2-405., 10.2-1302-వ.,

[ ⇑ ] :137) గుహ్యకేంద్రుడు- (పురుష){సంజ్ఞా}[రాక్షస యోని]:- గుహ్యకేంద్రుడు అంటే కుబేరుడు. ఇతడు కూడా ధర్మరాజు రాజసూయయాగాన్ని చూసి మెచ్చుకున్నాడు. - :వంశం - రాక్షస యోని;:::::::పద్య సం.(లు) - 10.2-1302-చ.,

[ ⇑ ] :138) గృధ్రము- (స్త్రీ){జాతి}[గగనచర]:- గృధ్రము అంటే గ్రద్ద అనే విహంగము. తామ్రయందు కశ్యపునకు డేగలు, గ్రద్దలు మున్నగు పక్షులు పుచ్చా..
బలి దేవేంద్రుల నేతృత్వంలో జరిగిన సురాసుర యుద్ధంలో రాక్షసులు వీటిని వాహనాలుగా వాడారు.
వసిష్టుడు విశ్వామిత్రుని గ్రద్దవు కమ్మని శాపమిచ్చాడు. విశ్వామిత్రుడు వసిష్టుని కొంగవు కమ్మని శాపమిచ్చాడు. - :వంశం - గగనచర;:::::::పద్య సం.(లు) - 1-338-సీ., 3-344-వ., 5.2-160-క., 6-257-సీ., 6-393-చ., 8-331-వ., 8-334-వ., 9-193-వ., 10.2-513-మ.,

[ ⇑ ] :139) గొడుగులు- (స్త్రీ){జాతి}[పరికరములు]:- గొడుగులను, బలి దేవేంద్రుల నేతృత్వంలో జరిగిన సురాసుర యుద్ధంలో రాక్షసులు వాడారు. - :వంశం - పరికరములు;:::::::పద్య సం.(లు) - 8-331-వ., 8-447-వ., 10.1-92-క., 10.2-1253-సీ.,

[ ⇑ ] :140) గొబ్భిళ్ళాడు- ( -){క్రియా}[ ]:- కుప్పిగంతులువేయు, {గొబ్బిళ్ళుగోరాడు - గొబ్బిళ్ళు (బాలక్రీడావిశేషము) వలె గోరాడు (ఎగురుకుంటు ఆడు)}. గజేంద్రుని అనుయాయులైన ఏనుగులు కిరులపై గొబ్భిళ్ళుగోరాడుచున్నాయి. - :వంశం - ;:::::::పద్య సం.(లు) - 8-35-మ.,

[ ⇑ ] :141) గొఱ్ఱియలు- ( -){జాతి}[భూచర]:- కృష్ణుడు లేకపోవడంతో, కాపరిలేని గొఱ్ఱల వలె లోకం చీకాకులు పడుతుంటే వచ్చి మన మహారాజు సమర్థవంతంగా పాలుస్తున్నాడు. ఇంత చిన్న అపరాధానికి అంత పెద్ద శాపం ఇచ్చావయ్యా అని శృంగిని తండ్రి శమీకముని ప్రశ్నిస్తున్నాడు. - :వంశం - భూచర;:::::::పద్య సం.(లు) - 1-483-ఉ.,

[ ⇑ ] :142) గోకర్ణము- ( -){సంజ్ఞా}[ప్రదేశము]:- బలరాముడు దక్షిణభారత యాత్రలో గోర్ణము అను ప్రసిద్ధ పుణ్యక్షేత్రము నందు పరమేశ్వరుని దర్శించుకున్నాడు. - :వంశం - ప్రదేశము;:::::::పద్య సం.(లు) - 10.2-953-వ.,

[ ⇑ ] :143) గోకులము- ( -){సంజ్ఞా}[ప్రదేశం]:- కృష్ణుడు వసించిన వాడ గోకులము. - :వంశం - ప్రదేశం;:::::::పద్య సం.(లు) - 1-29-ఉ., 2-186-వ., 3-114-వ., 4-648-సీ., 5.1-1-క., 5.2-1-క., 8-585-ఆ., 10.1-198-వ.,10.1-210-క., 10,1-266-వ., 10.1-1190-వ.,

[ ⇑ ] :144) గోత్రభిత్సూనుడు- (పురుష){సంజ్ఞా}[చంద్రవంశం]:- గోత్రభిత్సూనుడు అంటే గోత్రభిత్ (ఇంద్రుడు) కు సూనుడు, అర్జునుడు - :వంశం - చంద్రవంశం;:::::::పద్య సం.(లు) - 10.2-731-ఉ.,

[ ⇑ ] :145) గోత్రము-1 ( -){జాతి}[ప్రదేశము]:- గోత్రము అంటే కొండ - :వంశం - ప్రదేశము;:::::::పద్య సం.(లు) - 10.1-822-సీ., 8-919-వ., 10.2-601-వ.,

[ ⇑ ] :146) గోత్రము-2 ( -){జాతి}[మానవ యోని]:- గోత్రము ఋషిపరంపరా వంశము - :వంశం - మానవ యోని;:::::::పద్య సం.(లు) - 1-24-సీ., 1-499-వ., 2-285-ఉ.,

[ ⇑ ] :147) గోత్రాచలము- ( -){జాతి}[ప్రదేశము]:- గోత్రాచలము అంటే కులపర్వతము. - :వంశం - ప్రదేశము;:::::::పద్య సం.(లు) - 9-267-క., 3-438-క.,

[ ⇑ ] :148) గోదానము- ( -){జాతి}[ -]:- గోదానము పవిత్ర దానములలో ఒకటి. - :వంశం - -;:::::::పద్య సం.(లు) - 10.2-470-వ.,

[ ⇑ ] :149) గోదావరి- (స్త్రీ){సంజ్ఞా}[నది]:- భారతవర్షంలోని ప్రసిద్ధమైన పర్వతాలకు పుత్రికలవంటివి అయిన మహానదులలో ఒక నది. - :వంశం - నది;:::::::పద్య సం.(లు) - 5.2-55-వ., 6-135-సీ., 10.2-950-ఆ.,

[ ⇑ ] :150) గోదేవి- (స్త్రీ){సంజ్ఞా}[చంద్రవంశం]:- బ్రహ్మదత్తుడు జైగిషముని ఉపదేశం ప్రకారం యోగతంత్రము అనుసరించి, భార్య గోదేవి యందు విష్వక్సేనుడు అను కుమారుని కనెను. - :వంశం - చంద్రవంశం;:::::::పద్య సం.(లు) - 9-655-వ.,

[ ⇑ ] :151) గోపధ్వజుడు- (పురుష){సంజ్ఞా}[దైవ యోని]:- గోపధ్వజుడు అంటే గోప (వృషభము) ధ్వజముగా కలవాడు, శివుడు - :వంశం - దైవ యోని;:::::::పద్య సం.(లు) - 7-399-క.,

[ ⇑ ] :152) గోమతి-1 (పురుష){సంజ్ఞా}[ఆంధ్రజాతీయులు]:- ఆంధ్రజాతీయుడు శివస్వాతి కొడుకైన అరిందముని పుత్రుడు గోమతి. గోమతి పుత్రుడు పురీమంతుడు. - :వంశం - ఆంధ్రజాతీయులు;:తండ్రి - అరిందముడు;::::కొడుకు(లు) - పురీమంతుడు;::పద్య సం.(లు) - 12-8-వ.,

[ ⇑ ] :153) గోమతి-2 ( -){సంజ్ఞా}[నది]:- భారతవర్షంలోని ప్రసిద్ధమైన పర్వతాలకు పుత్రికలవంటివి అయిన మహానదులలో ఒక నది.
బసరాముడు దక్షిణాది యాత్రలో గోమతీ నది దర్శించాడు. - :వంశం - నది;:::::::పద్య సం.(లు) - 5.2-55-వ., 10.2-948-వ.,

[ ⇑ ] :154) గోముఖము- ( -){జాతి}[ -]:- గోముఖము ఒక వాద్య విశేషము. - :వంశం - -;:::::::పద్య సం.(లు) - 8-269-సీ., 10.2-801-సీ., 10.2-1100-చ.,

[ ⇑ ] :155) గోముఖుడు- (పురుష){సంజ్ఞా}[ఋషి]:- గోముఖుడు శాకల్యుని శిష్యుడు. ఋగ్వేదము దాల్చిన పైలమహర్షి శిష్యప్రశిష్య పరంపరలోని వాడైన సౌభరి పుత్రుడు శాకల్యుడు. శాకల్యుడు తాను అభ్యసించిన ఋగ్వేద శాఖను అయిదు శాఖలుగా భజించి; గోముఖుడు, వాత్స్యుడు, మౌద్గల్యుడు, శాలీయుడు, శిశురుడు అనువారికి ఉపదేశించాడు. వారు జాతుకర్ణికి ఉపదేశించారు. - :వంశం - ఋషి;:::::::పద్య సం.(లు) - 12-30-వ.,

[ ⇑ ] :156) గోమేధిక - ( -){జాతి}[మణులు]:- గోమేధికమలు - ఇవి అష్టమ స్కంధములోని త్రికూట పర్వతములో వర్ణించబడ్డాయి - :వంశం - మణులు;:::::::పద్య సం.(లు) - 8-24-వ.,

[ ⇑ ] :157) గోయాగం- ( -){జాతి}[ -]:- కృష్ణుడు ఇంద్రోత్సవమును మానిపించి గోయాగమును చేసెను. - :వంశం - -;:::::::పద్య సం.(లు) - 3-113-మ.,

[ ⇑ ] :158) గోల్లం- ( -){సంజ్ఞా}[పర్వతం]:- భారతవర్షంలోని ప్రసిద్ధమైన అనేక పర్వతాలలో ఒకటి. - :వంశం - పర్వతం;:::::::పద్య సం.(లు) - 5.2-55-వ.,

[ ⇑ ] :159) గోవర్ధనం- ( -){సంజ్ఞా}[పర్వతం]:- భారతవర్షంలోని ప్రసిద్ధమైన అనేక పర్వతాలలో ఒకటి.
ఇది బృందావనం సమీపమున గల ఒక కొండ.
కృష్ణుడు ఏడేడ్ల వయసులో ఇంద్రయాగం ఆపించి ఈ పర్వతానికి పూజలు చేయించాడు. అది కోపించిన ఇంద్రుడు ఏడురోజులపాటు కురిపించిన రాళ్ళ వాననుండి గోకులాన్ని గోవర్థన గిరిని ఏడురోజులూ ఎత్తి పట్టుకుని రక్షించాడు. - :వంశం - పర్వతం;:::::::పద్య సం.(లు) - 3116-మ., 5.2-55-వ., 10.1-522-వ., 10.1-915-క., 10.1-926-వ.,

[ ⇑ ] :160) గోవిందుడు- (పురుష){సంజ్ఞా}[దైవ యోని]:- గోవిందుడు అంటే విష్ణువు, కృష్ణుడు.
వీరు ఉదయం, మధ్యాహ్నం, పట్టపగలు, సాయంకలం, మునిమాపువేళ, అర్ధరాత్రి, అపరాత్రి, పత్యూషకాలం, సంధికాలాలు, ప్రభాతం అనే సకల సమయాలలో కాపాడు గాక అని విశ్వరూపుడు దేవేంద్రునికి ఉపదేశించిన శ్రీమన్నారాయణ కవచంలో ఉన్న నలభైతొమ్మిది స్తుతులలో ఇది ఒకటి. - :వంశం - దైవ యోని;:::::::పద్య సం.(లు) - 1-49-మ., 1-58-వ., 6-300-చ., నుండి 6-307-వ.,

[ ⇑ ] :161) గోవు- (పురుష){జాతి}[భూచర]:- గోవు అంటే ఆవు, ఎద్దు అను జంతువులు. - :వంశం - భూచర;:::::::పద్య సం.(లు) - 1-392-క., 1-78-వ., 1-233-సీ., 1-341-క.,

[ ⇑ ] :162) గౌతమి- (స్త్రీ){సంజ్ఞా}[నది]:- రామచంద్రులవారు దండకారణ్యం వచ్చి గౌతమీ నదిని అను గోదావరీ నదిని దర్శించాడు. - :వంశం - నది;:::::::పద్య సం.(లు) - 9-268-ఉ.,

[ ⇑ ] :163) గౌతమీగంగ- (స్త్రీ){సంజ్ఞా}[భూచర]:- కృష్ణుడు పిల్చిన గోవులలో ఒక గోవు పేరు గౌతమీగంగ. - :వంశం - భూచర;:::::::పద్య సం.(లు) - 10.1-604-సీ.,

[ ⇑ ] :164) గౌతముడు-1 (పురుష){సంజ్ఞా}[ఋషి]:- శ్రీకృష్ణుని దర్శించుకోవడానికి వచ్చి వసుదేవునిచే క్రతువు చేయించిన మునీశ్వరులలో ఒక మునీశ్వరుడు.
కృష్ణుని పంపున హస్తిన కేగిన అక్రూరుడు కలసిన వారిలో గౌతముడు ఒకరు.
ధర్మరాజు రాజసూయయాగానికి విచ్చేసిన ఋషులలో ఒకరు.
- :వంశం - ఋషి;:::::::పద్య సం.(లు) - 10.1-1513-వ., 10.2-766-సీ., 10.2-1117-ఉ.,

[ ⇑ ] :165) గౌతముడు-2 (పురుష){సంజ్ఞా}[ఋషి]:- పరమాణువులే ఈ సృష్టికి కారణమని భావించే ఋషి - :వంశం - ఋషి;:::::::పద్య సం.(లు) - 10.2-1220-వ

[ ⇑ ] :166) గౌతముడు-3 (పురుష){సంజ్ఞా}[ఋషి]:- ఇతడు మాఘ (తపో) మాసంలో సూర్యుని అనుచరులలోని ఋషి.
సూర్యుడు ఈ మాసంలో పూష అను పేరుతో, ఘృతాచి, గౌతముడు, ధనంజయుడు, వాతుడు, సుషేణుడు, సురుచి మున్నగువారు అనుచరులుగా కలిగి సంచరిస్తాడు. - :వంశం - ఋషి;:::::::పద్య సం.(లు) - 12-43-వ.,

[ ⇑ ] :167) గౌతముడు-4 (పురుష){సంజ్ఞా}[ఋషి]:- పరీక్షిత్తు గంగానది ఒడ్డున ప్రాయోపవిష్టుడై ఉన్నాడని విని, వచ్చిన ఋషులలో ఈయన ఒకరు. - :వంశం - ఋషి;:::::::పద్య సం.(లు) - 1-499-వ.,

[ ⇑ ] :168) గౌతముడు-5 (పురుష){సంజ్ఞా}[ఋషి]:- చిత్రకేతుమహారాజు వచ్చిన నారద అంగిరసులను మీరెవరు అంటూ మహర్షులందరి పేర్లు చెప్తూ, శుక గౌతములా అని కూడా అడిగాడు. - :వంశం - ఋషి;:::::::పద్య సం.(లు) - 6-458-సీ.,

[ ⇑ ] :169) గౌతముడు-6 (పురుష){సంజ్ఞా}[ఋషి]:- గౌతముడూ, కశ్యపుడూ, అత్రీ, విశ్వామిత్రుడు, జమదగ్నీ, భరద్వాజుడూ, వసిష్టుడూ ఏడవవదీ ప్రస్తుతపుది అయిన వైవశ్వతమన్వంతరంలో సప్త ఋషులు. - :వంశం - ఋషి;:::::::పద్య సం.(లు) - 8-412-వ.,

[ ⇑ ] :170) గౌతముడు-7 (పురుష){సంజ్ఞా}[ఋషి]:- ముద్గలుని పుత్రికైన అహల్యకు గౌతమునికి శతానందుడు పుట్టాడు. - :వంశం - ఋషి;:::::::పద్య సం.(లు) - 9-657-వ.,

[ ⇑ ] :171) గౌరమాంబ- (స్త్రీ){సంజ్ఞా}[బమ్మెర వంశం; కౌండిన్య గోత్రం; ఆపస్తంభ సూత్రం]:- బమ్మెర పోతన తాతకి తాతాగారి భార్య, వీరికి సూర్యుని వరం వలన సోమనమంత్రి జన్మించాడు. - :వంశం - బమ్మెర వంశం; కౌండిన్య గోత్రం; ఆపస్తంభ సూత్రం;::::భర్త - అన్నయ;:కొడుకు(లు) - సోమన మంత్రి;::పద్య సం.(లు) - 1-24-సీ.,

[ ⇑ ] :172) గౌరి-1 (స్త్రీ){సంజ్ఞా}[దైవ యోని]:- గౌరీదేవి అంటే పార్వతీదేవి. రుక్మిణి స్వయంవరం సమయంలో గౌరిని తలచుకుంది, పూజించింది. - :వంశం - దైవ యోని;:::::::పద్య సం.(లు) - 6-489-క., 10.1-1720-ఉ., 10.1-1743-వ., 10.1-1745-వ., 10.2-318-వ., 12-38-చ.,

[ ⇑ ] :173) గౌరి-2 (స్త్రీ){సంజ్ఞా}[నది]:- గౌరీ గంగా మున్నగు పుణ్యనదులను, పుణ్యులను అవసానకాలమువ తలచు వారికి తన యొక్క గతిని ఇస్తాను అని హృషీకేశుడు ఆనతిచ్చెను. - :వంశం - నది;:::::::పద్య సం.(లు) - 8-136-వ.,

[ ⇑ ] :174) గౌరీశుడు- (పురుష){సంజ్ఞా}[దైవ యోని]:- గౌరీశుడు అంటే శివుడు - :వంశం - దైవ యోని;:::::::పద్య సం.(లు) - 4-48-మ., 10.1-1710-మ.,

[ ⇑ ] :175) గౌరీశ్వరుడు- (పురుష){సంజ్ఞా}[దైవ యోని]:- గౌరీశ్వరుడు అంటే శివుడు - :వంశం - దైవ యోని;:::::::పద్య సం.(లు) - 10.1-1107-క.,

[ ⇑ ] :176) గ్రహము- ( -){జాతి}[ -]:- సూర్యుడు, చంద్రుడు, అంగారకుడు, బుధుడు, బృహస్పతి, శుక్రుడు, శని, రాహువు, కేతువు ఈ తొమ్మిదింటిని గ్రహములు అంటారు - :వంశం - -;:::::::పద్య సం.(లు) - 1-340-క., 2-16-వ., 3-606-క., 3-774-సీ., 7-95-సీ., 8-620-ఆ., 10.1280-సీ., 10.2-1261-క., 12-12-క.,

[ ⇑ ] :177) గ్రామకము- ( -){జాతి}[ -]:- పడమటి వాకిళ్ళు రెంటి యందును ఆసురీ నామకంబు ఐన వాకిట దుర్మదసమేతుండై గ్రామక నామకంబైన విషయంబును, నిరృతి నామకంబు అయిన వాకిట యందు లుబ్దక యుక్తుండై వైశసంబు అను విషయంబును పొందుచుండును.
సురతమునకు సంకేతంగా గ్రామకము అనబడింది. - :వంశం - -;:::::::పద్య సం.(లు) - 4-768-వ., 4-853-వ.,

[ ⇑ ] :178) గ్రాహ- (స్త్రీ){జాతి}[జలచర]:- మొసలి - :వంశం - జలచర;:::::::పద్య సం.(లు) - 2-167-మ., 5.2-151-వ., 7-9-శా., 8-18-సీ., నుండి 8-121-సీ., వరకు, 8-332-సీ., 8-707-వ., 9-279-శా.

[ ⇑ ] :179) గ్రుడ్డి- (పురుష){జాతి}[చంద్రవంశం]:- గ్రుడ్డి అంటే అంధుడు, ధృతరాష్ట్రుడు. యుద్ధానంతంరం పాండవుల పంచను చేరిన ధృతరాష్ట్రుని గ్రుడ్డికి పిండము పెట్టండి అని భీముడు అన్నాడు. - :వంశం - చంద్రవంశం;:::::::పద్య సం.(లు) - 1-314-క.,

[ ↑ ] :1) ఘటోత్కచుడు- (పురుష){సంజ్ఞా}[చంద్రవంశం]:- పాండవులలో వాడైన భీమసేనునికి హిడింబి యందు పుట్టినవాడు ఘటోత్కచుడు - :వంశం - చంద్రవంశం;:తండ్రి - భీముడు;:తల్లి - హిడింబ;:::::పద్య సం.(లు) - 9-673వ.,

[ ⇑ ] :2) ఘట్టితపాదకర్మలు- ( -){సంజ్ఞా}[నృత్తము]:- పారిభాషిక పదము - రాసక్రీడ - నృత్తము
రెండు అడుగులను చేర బెట్టుట - :వంశం - నృత్తము;:::::::పద్య సం.(లు) - 10.1-1084-వ.,

[ ⇑ ] :3) ఘర్మము- ( -){జాతి}[ -]:- ఘర్మము అనగా చెమట. - :వంశం - -;:::::::పద్య సం.(లు) - 1-414-శా., 8-244-మ., 8-396-వ., 10.1-73-సీ.,

[ ⇑ ] :4) ఘర్ముడు- (పురుష){సంజ్ఞా}[కర్ణుని వంశం]:- కర్ణుని వంశంలో గాధారునికి పుట్టినవు ఘర్ముడు. ఘర్మునికి పుట్టినవాడు ఘృతుడు. - :వంశం - కర్ణుని వంశం;:తండ్రి - గాంధారుడు;::::కొడుకు(లు) - ఘృతుడు;::పద్య సం.(లు) - 9-699-వ.,

[ ⇑ ] :5) ఘీంకారములు- (స్త్రీ){క్రియా}[ధ్వని]:- ఘీంకారములు అంటే ఏనుగులు చేయు ధ్వనులు. బలి దేవేంద్రులు సురాసుర యుద్ధములో వీటిని వాడారు. - :వంశం - ధ్వని;:::::::పద్య సం.(లు) - 8-119-క., 8-333-క., 10.1-1757-వ., 10.2-404.,

[ ⇑ ] :6) ఘూక - ( -){జాతి}[పక్షి]:- ఘూక అంటే గుడ్లగూబలు - ఇవి అష్టమ స్కంధములోని త్రికూట పర్వతములో వర్ణించబడ్డాయి - :వంశం - పక్షి;:::::::పద్య సం.(లు) - 1-122-క., 1-343-క., 8-25-క., 11-87-సీ.,

[ ⇑ ] :7) ఘూర్జర- ( -){జాతి}[ప్రదేశం]:- ఉషాకుమారికి కలలో కనబడిన రాకుమారుని కముగొనుటకు, ఆమె నెచ్చెలి, మంత్రిపుత్రీ అయిన చిత్రరేఖ రాజుల చిత్రాలు అన్నీ వేసింది. అలా వేసిన చిత్రాలలో మాళవ, కొంకణ, ద్రవిడ, మత్స్య, పుళింద, కళింగ, భోజ, నేపాల, విదేహ, పాండ్య, కురు, బర్బర, సింధు, యుగంధర, ఆంధ్ర, బంగాళ, కరూశ, టేంకణ, త్రిగర్త, సుధేష్ణ, మరాట, లాట, పాంచాల, నిషాద, ఘూర్జర, సాళ్వ దేశాల ప్రభువులు ఉన్నారు చూడు అని చూపించింది. - :వంశం - ప్రదేశం;:::::::పద్య సం.(లు) - 10.2-348-ఉ.,

[ ⇑ ] :8) ఘృత సముద్రము- ( -){సంజ్ఞా}[జల ప్రాంతం]:- కుశద్వీపం చుట్టూ ఎనిమిది లక్షల యోజనాల పరిమాణం కలిగిన ఘృత (నేతి) సముద్రం ఉన్నది. ఆ నేతి సముద్రం ఆవల పదునారు లక్షల యోజనాల విస్తృతి కలిగిన అందమైన క్రౌంచద్వీపం ఉన్నది. - :వంశం - జల ప్రాంతం;:::::::పద్య సం.(లు) - 5.2-65-ఆ.,

[ ⇑ ] :9) ఘృతచ్యుత- ( - ){సంజ్ఞా}[నది]:- సప్తద్వీపములలోని కుశద్వీపము నందలి విప్ర వర్షంలో ఊర్ధ్వరోమము అను గిరి, ఘృతచ్యుత అను మహానది ఉన్నాయి. - :వంశం - నది;:::::::పద్య సం.(లు) - 5.2-63-సీ., 5.2-64-వ,

[ ⇑ ] :10) ఘృతపర్ణుడు- (పురుష){సంజ్ఞా}[మనువు వంశం]:- ప్రియవ్రతుని కుమారుడైన ఘృతపృష్ఠుడు క్రౌంచద్వీపానికి అధిపతి. అతని కొడుకులు ఆమోదుడు, మధువహుడు, మేఘపృష్ఠుడు, సుదాముడు, ఋషిజ్యుడు, లోహితార్ణుడు, వనస్పతి ఏడుగురుకి క్రౌంచద్వీపాన్ని ఏడు వర్షాలుగా విభజించి ఇచ్చాడు. - :వంశం - మనువు వంశం;:తండ్రి - ప్రియవ్రతుడు;::::::పద్య సం.(లు) - 5.2-66-వ.,

[ ⇑ ] :11) ఘృతపృష్ణుడు- (పురుష){సంజ్ఞా}[ -]:- ఘృతపృష్టుడు క్రౌంచ ద్వీప అధిపతి. ఘృతపృష్టుడు ప్రియవ్రతునికి అతని భార్య, విష్వకర్మ ప్రజాపతి పుత్రిక యగు బర్హిష్మతి యందు కలిగిన ఆగ్నీధ్రుడు, ఇధ్మజిహ్వుడు, యజ్ఞబాహువు, మహావీరుడు, హిరణ్యరేతసుడు, ఘృతపృష్ఠుడు, సవనుడు, మేధాతిథి, వీతిహోత్రుడు, కవి అనే పదిమంది కొడుకులులోనూ అయిదవ వాడ. ఊర్జస్వతి వీరికి సోదరి.
ప్రియవ్రతుడు జంబూద్వీపం, ప్లక్షద్వీపం, శాల్మలీద్వీపం, కుశద్వీపం, క్రౌంచద్వీపం, శాకద్వీపం, పుష్కరద్వీపం అనే సప్తద్వీపాలు ఏర్పరచి వాటికి ఆగ్నీధ్రుడు, ఇధ్మజిహ్వుడు, యజ్ఞబాహువు, హిరణ్యరేతసుడు, ఘృతపృష్ఠుడు, మేధాతిథి, వీతిహోత్రుడు అనే తన పుత్రులను పరిపాలకులనుగా చేసాడు. వాటిలో క్రౌంచద్వీపమునకు ఘృతపృష్ఠుని ఏలికగా చేసాడు.
ప్రియవ్రతుని కుమారుడు క్రౌంచద్వీపాధిపతి అయిన ఘృతపృష్ఠుడు; ఆమోదుడు, మధువహుడు, మేఘపృష్ఠుడు, సుదాముడు, ఋషిజ్యుడు, లోహితార్ణుడు, వనస్పతి అను తన ఏడుగురు కుమారుల పేరు మీదుగా క్రౌంచద్వీపాన్ని ఏడు వర్షాలుగా విభజించి ఒక్కొక్క వర్షానికి ఒక్కొక్కని రాజుగా నియమించాడు. తరువాత శ్రీహరి పాదపద్మాలను సేవిస్తూ తపస్సు చేసుకున్నాడు. - :వంశం - -;:తండ్రి - ప్రియవ్రత ;:తల్లి - బర్హిష్మతి ;:::కొడుకు(లు) - ఆమోదుడు; మధువృష్టుడు; మేఘవృష్టుడు; సుదాముడు; ఋషిజ్యుడు; లోహితార్జుడు; వనస్పతి ;::పద్య సం.(లు) - 5.1-16-వ., 5.1-20-వ., 5.2-66-వ.,

[ ⇑ ] :12) ఘృతము- (స్త్రీ){జాతి}[ -]:- ఘృతము అంటే నెయ్యి - :వంశం - -;:::::::పద్య సం.(లు) - 1-29-ఉ., 3-560-చ., 5.1-155-వ., 5.2-28.,

[ ⇑ ] :13) ఘృతాచి- (స్త్రీ){సంజ్ఞా}[దైవ యోని]:- ఈమె మాఘ (తపో) మాసంలో సూర్యుని అనుచరులలోని అప్సరస.
సూర్యుడు ఈ మాసంలో పూష అను పేరుతో, ఘృతాచి, గౌతముడు, ధనంజయుడు, వాతుడు, సుషేణుడు, సురుచి మున్నగువారు అనుచరులుగా కలిగి సంచరిస్తాడు.
రౌద్రాశ్వునకు అప్సరస ఘృతాచి అందు; ఋతేపువు, కక్షేపువు, స్థలేపువు, కృతేపువు, జలేపువు, సన్నతేపువు, సత్యేపువు, ధర్మేపువు, వ్రతేపువు, వనేపువు అని పదిమంది పుత్రులు పుట్టారు. వారిలో ఋతేపువునకు అంతిసారుడు పుట్టాడు - :వంశం - దైవ యోని;:::::::పద్య సం.(లు) - 12-43-వ., 9-593-వ.,

[ ⇑ ] :14) ఘృతాబ్ధి- (పురుష){సంజ్ఞా}[జల ప్రాంతం]:- ఘృతాబ్ది 1 లవణసముద్రము, 2 ఇక్షుసముద్రము, 3. సురాసముద్రము, 4. ఘృతసముద్రము, 5. దధిసముద్రము, 6. క్షీరసముద్రము, 7. జలసముద్రము అను సప్తమహాసముద్రాలలో నాలుగవది. ఎనిమిది లక్షల యోజనాల విస్తృతి గల కుశద్వీపం చుట్టూ ఎనిమిది లక్షల యోజనాల పరిణామం కలిగిన ఘృత (నెయ్యి) సముద్రం ఉంటుంది. ఘతాబ్ధి కావల పదహారు లక్షల యోజనాల విస్తృతి కలిగిన క్రౌంచ ద్వీపం ఉంటుంది - :వంశం - జల ప్రాంతం;:::::::పద్య సం.(లు) - 5.2-65-సీ.,

[ ⇑ ] :15) ఘృతుడు- (పురుష){సంజ్ఞా}[కర్ణుని వంశం]:- కర్ణుని వంశంలో గాధారునికొడుకైన ఘర్మునికి పుట్టినవాడు ఘృతుడు. ఘతునికి దుర్మదుడు పుట్టాడు. - :వంశం - కర్ణుని వంశం;:తండ్రి - ఘర్ముడు;::::కొడుకు(లు) - దుర్మదుడు;::పద్య సం.(లు) - 9-699-వ.,

[ ⇑ ] :16) ఘోటకదానవుడు- (పురుష){సంజ్ఞా}[రాక్షస యోని]:- ఘోటకదానవుడు అంటే కృష్ణుని చేతిలో మరణించిన కేశిని అనే రాక్షసుడు - :వంశం - రాక్షస యోని;:::::::పద్య సం.(లు) - 10.1-1169-క.,

[ ⇑ ] :17) ఘోటకము- (స్త్రీ){జాతి}[భూచర]:- ఘోటకము అంటే గుఱ్ఱము. - :వంశం - భూచర;:::::::పద్య సం.(లు) - 1-224-మ., 7-465-వ., 10.1-1225-చ.,

[ ⇑ ] :18) ఘోటకవదనుడు- (పురుష){సంజ్ఞా}[దైవ యోని]:- ఘోటకవదనుడు అంటే హసగ్రీవుడు. విష్ణువు హయగ్రీవావతారంలో మధుకైటభులను సంహరిచాడు - :వంశం - దైవ యోని;:::::::పద్య సం.(లు) - 7-361-సీ.,

[ ⇑ ] :19) ఘోటకాసురేంద్రుడు- (పురుష){సంజ్ఞా}[రాక్షస యోని]:- ఘోటకసురేంద్రుడు అంటే కృష్ణుని చేతిలో మరణించిన కేశిని అనే రాక్షసుడు - :వంశం - రాక్షస యోని;:::::::పద్య సం.(లు) - 10.1-1169-క.,

[ ⇑ ] :20) ఘోష- ( -){జాతి}[మానవ యోని]:- ఘోష, ఘోషము అంటే గొల్లపల్లె, ఆవుల మంద. - :వంశం - మానవ యోని;:::::::పద్య సం.(లు) - 1-29-ఉ., 1-39-ఉ.,

[ ⇑ ] :21) ఘోషము- ( -){జాతి}[మానవ యోని]:- ఘోష, ఘోషము అంటే గొల్లపల్లె, ఆవుల మంద. - :వంశం - మానవ యోని;:::::::పద్య సం.(లు) - 1-29-ఉ., 1-39-ఉ.,

[ ⇑ ] :22) ఘోషుడు- (పురుష){సంజ్ఞా}[శుంగ వంశం]:- నూటపన్నెండేండ్లు పాలించిన పదిమంది శుంగవంశ రాజులలో పుళిందుని కొడుకు ఘోషుడు. ఘోషుని కొడుకు భాగవతుడు. - :వంశం - శుంగ వంశం;:తండ్రి - పుళిందుడు;::::కొడుకు(లు) - భాగవంతుడు;::పద్య సం.(లు) - 12-4-వ.,

[ ↑ ] :1) చంచూపుట - ( -){జాతి}[పక్షి]:- చంచూపుట అంటే పక్షుల ముక్కుల కొనలు - ఇవి అష్టమ స్కంధములోని త్రికూట పర్వతములో వర్ణించబడ్డాయి - :వంశం - పక్షి;:::::::పద్య సం.(లు) - 8-24-వ., 10.2-1323-వ., 11-65-వ.,

[ ⇑ ] :2) చండకర తనయుడు- (పురుష){సంజ్ఞా}[దైవ యోని]:- చండకర తనయుడు - చండకర (తీవ్రమైన కిరణములు గల సూర్యుని) తనయుడు, యముడు - :వంశం - దైవ యోని;:తండ్రి - సూర్యుడు;::::::పద్య సం.(లు) - 6-166-క.,

[ ⇑ ] :3) చండప్రభారాశి- (పురుష){సంజ్ఞా}[దైవ యోని]:- చండప్రభారాశి - తీవ్రమైన కాంతుల సమూహము కలవాడు, అగ్ని - :వంశం - దైవ యోని;:::::::పద్య సం.(లు) - 10.1-1648-మ.,

[ ⇑ ] :4) చండభమార్గము- ( -){జాతి}[ప్రదేశము]:- చండభమార్గము అంటే ఆకాశము - :వంశం - ప్రదేశము;:::::::పద్య సం.(లు) - 8-47-మ.,

[ ⇑ ] :5) చండభానుడు- (పురుష){సంజ్ఞా}[దైవ యోని]:- చండభానుడు అంటే సూర్యుడు - :వంశం - దైవ యోని;:::::::పద్య సం.(లు) - 8-495-క.,

[ ⇑ ] :6) చండవేగుడు- (పురుష){సంజ్ఞా}[దైవ యోని]:- ఇతడొక గంధర్వరాజు. ఈతని వెంట మూడువందలమంది గంధర్వ పురుషులు, గంధర్వ స్త్రీల, తెలుపు నలుపు రంగులతో జంటలుజంటలుగా వచ్చి నవద్వార పురాన్ని ఆక్రమించారు. ఇలా పురంజనోపాఖ్యానంలో కాలపురుషుడు,పగలు రాత్రులను, దేహిని సంకేతిస్తూ చెప్పబడింది. - :వంశం - దైవ యోని;:::::::పద్య సం.(లు) - 4-810.వ., 4-853-వ.,

[ ⇑ ] :7) చండాంశుడు- (పురుష){సంజ్ఞా}[దైవ యోని]:- చండాశుడు అంటే సూర్యుడు - :వంశం - దైవ యోని;:::::::పద్య సం.(లు) - 8-533-శా.,

[ ⇑ ] :8) చండామార్కులు- (పురుష){సంజ్ఞా}[రాక్షస యోని]:- చండామార్కులు శుక్రాచార్యుల పుత్రులు, ప్రహ్లాదునికి ఉపాధ్యాయులు - :వంశం - రాక్షస యోని;:తండ్రి - శుక్రాచార్యుడు;::::::పద్య సం.(లు) - 7-131-వ., 7-205-వ.,

[ ⇑ ] :9) చండార్చి- (పురుష){సంజ్ఞా}[దైవ యోని]:- చండార్చి అంటే అగ్నిదేవుడు. - :వంశం - దైవ యోని;:::::::పద్య సం.(లు) - 1-361-క.,

[ ⇑ ] :10) చండాలి- (స్త్రీ){సంజ్ఞా}[దైవ యోని]:- వృత్రాసుర సంహారంతో ఇంద్రునికి బ్రహ్మహత్యాపాపం వెనుక తగుల్కుంది. దానిని తప్పించుకోడానికి, ఇంద్రుడు దిగంతాలకు పారిపోతున్న విడువక వెనుదగిలి రాసాగింది. చివరికి ఈశాన్యదిక్కుకు పారిపోయి, మానససరోవరంలో ఒక కమల నాళపు తంతువులలో దాగి వెయ్యి సంవత్సరాలు ఉన్నాడు. అది ఈశ్వరుని దిక్కు కనుక ప్రవేశించలేక, అన్నాళ్ళు ఆ "చండాలి" (బహు చెడ్డది) అయిన బ్రహ్మహత్యపాపం కాచుకుని ఉండిపోయింది. - :వంశం - దైవ యోని;:::::::పద్య సం.(లు) - 6-437-వ.,

[ ⇑ ] :11) చండాలురు- (పురుష){జాతి}[మానవ యోని]:- విష్ణుమూర్తిని సేవించి, భాగవతశ్రేష్ఠులతో చేరినచో అందరూ పరిశుద్ధులు, మంగళాకారులు అవుతారు అంటూ నిర్ణయిస్తూ వీరిని కూడా పేర్కొన్నారు. - 2-63-మ. - :వంశం - మానవ యోని;:::::::పద్య సం.(లు) - 2-63-మ.,

[ ⇑ ] :12) చండిక- (స్త్రీ){సంజ్ఞా}[దైవ యోని]:- భరతుడు తన చివరి జన్మలో విప్రుని ఇంట పుట్టాడు. జడునివలె కనబడుతూ ఉండేవాడు. ఒకమారు అతనిని తీసుకు వెళ్ళి చండిక గుడిలో బలి ఇవ్వబోతే చండిక ఉగ్రరూపం దాల్చి వారిని సంహరించిది. అది ఏమీపట్టని విప్రుడు గుడినుండి బయటకు వచ్చి తన ఇంటికి వెళ్ళిపోయాడు.
చండిక - ఈమె శ్రీకృష్ణుడు తన అవతార సందర్భంలో ఆ మాయాదేవికి ఒసగిన పద్నాలుగు (14) నామములలో ఈమెది ఒకటి [ మాయాదేవి 14 పేర్లు ]
చండిక - చండుడను దనుజుని సంహరించిన దేవి, పార్వతి శరీరమునుండి పుట్టిన దేవి, దుర్గ - :వంశం - దైవ యోని;:::::::పద్య సం.(లు) - 5.1-18-వ., 10.1-61-వ., 10.2-73-k.,

[ ⇑ ] :13) చండీశుడు- (పురుష){సంజ్ఞా}[దైవ యోని]:- దక్షాధ్వరధ్వంసంలో మణిమంతుడు భృగువును, వీరభద్రుడు దక్షుని, చండీశుడు పూషుని, భగుని నందీశ్వరుండును పట్టుకున్నారు. ఆనాడు దక్షుడు కోపంతో శివుని శపించినప్పుడు పరిహాసం చేసిన పూషుని దంతాలను చండీశ్వరుడు రాలగొట్టాడు. - :వంశం - దైవ యోని;:::::::పద్య సం.(లు) - 4-118-వ., 4-205-తే.,

[ ⇑ ] :14) చందన-1 ( -){సంజ్ఞా}[ఆహార్యం]:- చందన అంటే మంచిగంథము అని చందనవృక్షాలు చందన (మంచి గంధము) చెట్టు అని నానా్ర్థాలు ఉన్నాయి. ఈ పదం ప్రథమ స్కంధలో నైమిశారణ్య వర్ణన సందర్భంలో పార్వతీదేవి నుదురు} ఉపమాన పదంగా వాడబడింది. - :వంశం - ఆహార్యం;:::::::పద్య సం.(లు) - 1-39-వ., 1-279-తే., 2-158-సీ., 3-288-వ,

[ ⇑ ] :15) చందన-2 ( -){సంజ్ఞా}[వృక్ష]:- చందన అంటే చందనవృక్షాలు చందన (మంచి గంధము) చెట్టు అని మంచిగంధము అని నానార్థాలు ఉన్నాయి. ఈ పదం ప్రథమ స్కంధలో నైమిశారణ్య వర్ణన సందర్భంలో పార్వతీదేవి నుదురు} కు ఉపమాన పదంగా వాడబడింది. - :వంశం - వృక్ష;:::::::పద్య సం.(లు) - 1-39-వ., 8-24-వ., 3-108-చ., 3-289-ఉ.,

[ ⇑ ] :16) చంద్ర-1 ( -){సంజ్ఞా}[వృక్ష]:- చంద్ర అంటే పెద్ద ఏలకి చెట్లు క్యేలకి పూలు అని చంద్రుడు అని నానార్ర్థాలు ఉన్నాయి. ఈ పదం ప్రథమ స్కంధలో నైమిశారణ్య వర్ణన సందర్భంలో శివుడి సభ} కు ఉపమాన పదంగా వాడబడింది. - :వంశం - వృక్ష;:::::::పద్య సం.(లు) - 1-39-వ.,

[ ⇑ ] :17) చంద్ర-2 ( -){సంజ్ఞా}[దైవ యోని]:- చంద్ర అంటే చంద్రుడు అని పెద్ద ఏలకి చెట్లు క్యేలకి పూలు అని నానార్ర్థాలు ఉన్నాయి. ఈ పదం ప్రథమ స్కంధలో నైమిశారణ్య వర్ణన సందర్భంలో శివుడి సభ} ఉపమాన పదంగా వాడబడింది.
మోహిని అమృతం పంచుతుంటే రాహువు దేవతల వరుసలో కూర్చుని అమృతం అందుకుంటుంటే చంద్రభాస్కరులు సంజ్ఞలు చేసారు. విష్ణువు చక్రం ప్రయోగించి వారితలలు నరికాడు. ఆ వైరంతోనే రాహువు గ్రహణ సమయాలలో భానుచంద్రములను పట్టుతుంటాడు - :వంశం - దైవ యోని;:::::::పద్య సం.(లు) - 1-39-వ., 1-293-వ., 2-16-వ., 2-82-మ., 8-322-మ., 8-323-ఆ.,

[ ⇑ ] :18) చంద్ర-3 ( -){సంజ్ఞా}[ప్రదేశము]:- చంద్రబింబము - :వంశం - ప్రదేశము;:::::::పద్య సం.(లు) - 1-9-ఉ., 2-16-సీ., 1-27-మ., 8-40-సీ.,

[ ⇑ ] :19) చంద్రకాంత- ( -){జాతి}[ -]:- చంద్రకాంత అంటే ఒకరకమైన తెల్లని చల్లని రాయి. - :వంశం - -;:::::::పద్య సం.(లు) - 3-929-సీ.,

[ ⇑ ] :20) చంద్రకాంతోపల- ( -){జాతి}[ -]:- చంద్రకాంతోపల అంటే చంద్రకాంత శిలలు - :వంశం - -;:::::::పద్య సం.(లు) - 3-132-సీ., 3-1046-సీ.,

[ ⇑ ] :21) చంద్రకేతుడు-1 (పురుష){సంజ్ఞా}[ధ్రువుని వంశం]:- వత్సరునికి సర్వర్థి యను భార్య యందు కలిగిన పుష్పార్ణుడు, చంద్రకేతుడు, నిషుడు, ఊర్జుడు, వసువు, జయుడు అను ఆరుగురు కొడుకులలో రెండవవాడు చంద్రకేతుడు. - :వంశం - ధ్రువుని వంశం;:తండ్రి - వత్సరుడు;:తల్లి - సర్వర్థి ;:::::పద్య సం.(లు) - 4-390-వ.,

[ ⇑ ] :22) చంద్రకేతుడు-2 (పురుష){సంజ్ఞా}[సూర్యవంశం]:- శ్రీరాముని తమ్ముడైన లక్ష్మణునికి అంగదుడు, చంద్రకేతుడు అని ఇరువురు కొడుకులు కలిగారు. - :వంశం - సూర్యవంశం;:తండ్రి - లక్ష్మణుడు;:తల్లి - ఊర్మిళ;:::::పద్య సం.(లు) - 9-347-వ.,

[ ⇑ ] :23) చంద్రగుప్తుడు- (పురుష){సంజ్ఞా}[రాజు]:- నవనందులు అనెడి కార్ముకుడు మున్నగు తొమ్మిందిమంది రాజులను ఒక విప్రశ్రేష్ఠుడు నిర్మూలిస్తాడు. నందులు లేకపోవడంచేత కొంతకాలం మౌర్యులు పరిపాలన చేస్తారు. నందులను తొలగించిన ఆ విప్రోత్తముడు చంద్రగుప్తుని అభిషేక్తుని చేసి రాజ్యాన్ని అప్పగిస్తాడు. ఆ చంద్రగుప్తునికి వారిసారుడు పుడతాడు. - :వంశం - రాజు;::తల్లి - ముర;:::కొడుకు(లు) - వారిసారుడు;::పద్య సం.(లు) - 12-4-వ.,

[ ⇑ ] :24) చంద్రగ్రహణ- ( -){సంజ్ఞా}[కాలము]:- చంద్రుని రాహుకేతువులు పట్టుటచేత, భూమి నీడలోకి చంద్రుడు రావడం వలన, పూర్ణిమనాడు చంద్రుడు పూర్తిగా కనబడకపోవుట. - :వంశం - కాలము;:::::::పద్య సం.(లు) - 7-448-వ.,

[ ⇑ ] :25) చంద్రచూడుడు- (పురుష){సంజ్ఞా}[దైవ యోని]:- చంద్రచూడుడు అంటే శివుడు. - :వంశం - దైవ యోని;:::::::పద్య సం.(లు) - 8-220-క.,

[ ⇑ ] :26) చంద్రధరుడ- (పురుష){సంజ్ఞా}[దైవ యోని]:- చంద్రధరుడు అంటే శివుడు - :వంశం - దైవ యోని;:::::::పద్య సం.(లు) - 4-216-క., 8-399-ఆ.,

[ ⇑ ] :27) చంద్రబీజుడు- (పురుష){సంజ్ఞా}[మానవ యోని]:- ఆంధ్రజాతీయుడు అయిన విజయుడి పుత్రుడు చంద్రబీజుడు, అతని పుత్రుడు సులోమధి. ఆంధ్రజాతీయులు అయిన వీరు చాలా మంది ఆంధ్రజాతీయ రాజులు కలిసి నాలుగువందలయేభైఆరు సంవత్సరముల కాలం పరిపాలిస్తారు. - :వంశం - మానవ యోని;:తండ్రి - విజయుడు;::::కొడుకు(లు) - సులోమధి;::పద్య సం.(లు) - 12-8-వ.,

[ ⇑ ] :28) చంద్రభాగ- ( -){సంజ్ఞా}[మహానది]:- భారతవర్షంలోని ప్రసిద్ధమైన పర్వతాలకు పుత్రికలవంటివి అయిన మహానదులలో ఒక నది. - :వంశం - మహానది;:::::::పద్య సం.(లు) - 5.2-55-వ.,

[ ⇑ ] :29) చంద్రమండలము- ( -){సంజ్ఞా}[ -]:- చంద్రమండలము అంటే ఆకాశంలోని చంద్రుడు - :వంశం - -;:::::::పద్య సం.(లు) - 5.2-33-సీ., 5.2-101-సీ., 6-307-వ.,

[ ⇑ ] :30) చంద్రమస- (స్త్రీ){సంజ్ఞా}[నది]:- చంద్రమస ఒక నది. పురంజనుడు తరువాతి జన్మలో వైదర్భిగా జన్మించి, పాండ్యభూపాలు డయిన మలయకేతనుని వివాహాడాడు. ఆ మలయకేతనుడు తపస్సుచేయుటకు భార్యతో బయలుదేరి వెళ్ళి చంద్రమస, తామ్రపర్ణి, నవోదక అను నదులలో స్నానాలు చేసాడు. - :వంశం - నది;:::::::పద్య సం.(లు) - 4-834-వ.,

[ ⇑ ] :31) చంద్రరేఖ- ( -){సంజ్ఞా}[ప్రదేశము]:- చంద్రరేఖ అంటే చంద్రవంక - :వంశం - ప్రదేశము;:::::::పద్య సం.(లు) - 7-285-వ., 7-299-వ.,

[ ⇑ ] :32) చంద్రలోకము- ( -){సంజ్ఞా}[ప్రదేశము]:- దేవతలకూ పితరులకూ సంబంధించిన సత్కర్మలను ఆచరించడంలోనే నేర్పరులై, కోర్కెలు నిండిన చిత్తం గలవారై ఉండువారు మోక్షాన్ని అందుకోలేరు. వారు ధూమ్రాది మార్గాలలో చంద్రలోకం చేరి అచ్చట సుఖాలు అనుభవించి పుణ్యం తరిగి నశింపగా మళ్ళీ జన్మ ఎత్తడం కోసం భూలోకానికి వస్తారు. - :వంశం - ప్రదేశము;:::::::పద్య సం.(లు) - 3-1013-సీ.,

[ ⇑ ] :33) చంద్రవంశము- ( -){సంజ్ఞా}[చంద్రవంశం]:- బహు పుణ్యవంతమైన చంద్రవంశంలో స్వచ్ఛమైన కీర్తివంతులైన పురూరవాదులు జన్మించారు. - :వంశం - చంద్రవంశం;:::::::పద్య సం.(లు) - 9-375-ఆ.,

[ ⇑ ] :34) చంద్రవట- ( -){సంజ్ఞా}[మహానది]:- భారతవర్షంలోని ప్రసిద్ధమైన పర్వతాలకు పుత్రికలవంటివి అయిన మహానదులలో ఒక నది. - :వంశం - మహానది;:::::::పద్య సం.(లు) - 5.2-55-వ.,

[ ⇑ ] :35) చంద్రశాలలు- ( -){జాతి}[ప్రదేశము]:- చంద్రశాలలు అంటే చంద్రకాంత రాళ్ళతో కట్టిన ఇళ్ళు. - :వంశం - ప్రదేశము;:::::::పద్య సం.(లు) - 6-185-ఉ.,

[ ⇑ ] :36) చంద్రశుక్లం- ( -){సంజ్ఞా}[ప్రదేశం]:- ఉపద్వీపం. జంబూద్వీపంలోని సగరుని కుమారులు అపహరింపబడిన అశ్వమేధాశ్వాన్ని వెదకుతూ నలువైపులా భూమిని త్రవ్వినపుడు స్వర్ణప్రస్థం, చంద్రశుక్లం, ఆవర్తనం, రమణకం, మందేహారుణం, పాంచజన్యం, సింహళం, లంక అనే ఎనిమిది ఉపద్వీపాలు ఏర్పడ్డాయి. - :వంశం - ప్రదేశం;:::::::పద్య సం.(లు) - 5.2-55-వ.,

[ ⇑ ] :37) చంద్రశేఖరుడు- (పురుష){సంజ్ఞా}[దైవ యోని]:- దంద్రశేఖరుడు అంటే శివుడు. - :వంశం - దైవ యోని;:::::::పద్య సం.(లు) - 4-117-తే.

[ ⇑ ] :38) చంద్రార్ధధరుడు - (పురుష){సంజ్ఞా}[దైవ యోని]:- చంద్రధరుడు అంటే శివుడు. పృథుచక్రవర్తి పట్టాభిషిక్తుడు అయిన సందర్భంలో దేవతలు అందరు వివిధ బహుమానాలు ఇచ్చారు. వారిలో శివుడు, ఒరతో కూడిన కరవాము ఇచ్చెను - :వంశం - దైవ యోని;:::::::పద్య సం.(లు) - 4-443-సీ.,

[ ⇑ ] :39) చంద్రావతంసుడు- (పురుష){సంజ్ఞా}[దైవ యోని]:- చంద్రావతంసుడు అంటే చంద్రుని సిగబంతిగా కలవాడు, శివుడు. - :వంశం - దైవ యోని;:::::::పద్య సం.(లు) - 3-561-సీ.,

[ ⇑ ] :40) చంద్రిక- ( -){సంజ్ఞా}[ -]:- చంద్రిక అంటే వెన్నెల - :వంశం - -;:::::::పద్య సం.(లు) - 1-9-ఉ., 226-వ., 2-51-సీ., 2-188-సీ.,

[ ⇑ ] :41) చంద్రుకేతుడు- (పురుష){సంజ్ఞా}[ధ్రువుని వంశం]:- ఇతడు ధ్రువపుత్రుడు వత్సరుని రెండవ కొడుకు. - :వంశం - ధ్రువుని వంశం;:తండ్రి - వత్సరుడు;:తల్లి - సర్వర్థి ;:::::పద్య సం.(లు) - 4-390-వ.,

[ ⇑ ] :42) చంద్రుడు-1 (పురుష){సంజ్ఞా}[దైవ యోని]:- దక్షపుత్రికలైన కృత్తికాది నక్షత్రములను ఇరవైఏడుగురును చంద్రుని భార్యలు. అయినను రోహిణియందు మాత్రము మోహితుడు అయి ఉండుటచేత దక్షునిచేత క్షయరోగగ్రస్తుడు. మరల దక్షుని అనుగ్రహం వలన క్షయించడం అనే లక్షణంతో కూడినవి అయిన షోడశకళలను పొందాడు. వాటికి అనుగుణమైనవి తిథులు.
బ్రహ్మదేవుని అంశతో చంద్రుడు పుట్టాడు, బ్రహ్మదేవుని ఆనతి ప్రకారం బ్రాహ్మణులకు, ఓషధులకు, నక్షత్రాలకు రాజు అయ్యాడు. బృహస్పతి భార్యను తీసుకుపోయి బుధుని కొడుకుగా కన్నాడు.
భోగకాములైనవారు చంద్రుని సేవించాలి.
చంద్రుడు మనసునకు అధిదేవత.
శ్రీహరి నిత్యవిభూతి వర్ణనలో "విరాట్పురుషుడు తన మాయను ధ్యానించేటప్పుడు కామానికి, సంకల్పాదులకు స్థానమైన హృదయం పుట్టింది. ఆ హృదయం నుండి మనస్సు, చంద్రుడు, కాముడు, సంకల్పము పుట్టాయి" అని చెప్పబడింది - :వంశం - దైవ యోని;:తండ్రి - అత్రి మహర్షి;:తల్లి - అనసూయ ;:భార్య - కృత్తిక; + నక్షత్రాలు; రోహిణి ;::కొడుకు(లు) - తార యందు బుధుడు;::పద్య సం.(లు) - 1-28-ఉ., 6-254-వ., 4-23-ఉ., 9-376-సీ., 9-379-వ., 9-385-వ., 2-38-వ., 2-86-వ., 2-269-వ.,

[ ⇑ ] :43) చంద్రుడు-2 ( -){సంజ్ఞా}[భగణ విషయం]:- శింశుమారచక్రం మనసులో చంద్రుడు ఉన్నాడు. - :వంశం - భగణ విషయం;:::::::పద్య సం.(లు) - 2-16-వ., 5.2-86-వ., 5.2-97-వ.,

[ ⇑ ] :44) చంద్రుడు-3 (పురుష){సంజ్ఞా}[స్థలం]:- ఏకాదశ రుద్రులకు బ్రహ్మదేవుడు నిద్రేశించిన స్థానలలో ఒకటి. రుద్రుడు మన్యువు నామం కలిగి భార్య ధీతో, చంద్రుడు స్థానంగా కలిగి ఉంటాడు. - :వంశం - స్థలం;:::::::పద్య సం.(లు) - 3-369-క.,., 3-370-వ.,

[ ⇑ ] :45) చంద్రుడు-4 (పురుష){సంజ్ఞా}[దైవ యోని]:- పృథుచక్రవర్తి పట్టాభిషిక్తుడు అయిన సందర్భంలో దేవతలు అందరు వివిధ బహుమానాలు ఇచ్చారు. వారిలో చంద్రుడు, తెల్లని గుఱ్ఱాలు ఇచ్చెను - :వంశం - దైవ యోని;:::::::పద్య సం.(లు) - 4-442-సీ.,., 4-443-సీ.,

[ ⇑ ] :46) చంద్రుడు-5 (పురుష){సంజ్ఞా}[సూర్యవంశం]:- సూర్యవంశంలోని శశాదునివంశంలో విశ్వగంధుని కొడుకు చంద్రుడు. చంద్రుని కొడుకు యవనాశ్వుడు. - :వంశం - సూర్యవంశం;:తండ్రి - విశ్వగంధుడు;::::కొడుకు(లు) - యవనాశ్వుడు;::పద్య సం.(లు) - 9-103-వ.,

[ ⇑ ] :47) చంపక - ( -){జాతి}[వృక్ష]:- చంపకము అంటే సంపెంగ - ఇవి అష్టమ స్కంధములోని త్రికూట పర్వతములో వర్ణించబడ్డాయి - :వంశం - వృక్ష;:::::::పద్య సం.(లు) - 3-726-సీ., 4-135., 8-24-వ., 8-266-సీ., 10.1-35-వ., 10.1-426-వ., -

[ ⇑ ] :48) చంపకమాల- ( -){సంజ్ఞా}[భాష]:- ఛందస్సు, తెలుగు భాగవతములో ఉపయోగించిన ఒక ఛందోరీతి వృత్తము ఈ చంపకమాల. వీటిని గ్రంధములో 486 పద్యాలకు ఉపయోగించారు. - :వంశం - భాష;:::::::పద్య సం.(లు) - 1-44-చ.,

[ ⇑ ] :49) చంపానగరము- ( -){సంజ్ఞా}[ప్రదేశము]:- సూర్యవంశంలోని హరితునికి చంపుడు పుట్టాడు. చంపుని కొడుకు సుదేవుడు. చంపుడు తన పేర చంపానగరం నిర్మించాడు. - :వంశం - ప్రదేశము;:::::::పద్య సం.(లు) - 9-201-వ.,

[ ⇑ ] :50) చంపుడు- (పురుష){సంజ్ఞా}[సూర్యవంశం]:- సూర్యవంశంలోని హరితునికి చంపుడు పుట్టాడు. చంపుని కొడుకు సుదేవుడు. చంపుడు తన పేర చంపానగరం నిర్మించాడు. - :వంశం - సూర్యవంశం;:తండ్రి - హరితుడు;::::కొడుకు(లు) - సుదేవుడు;::పద్య సం.(లు) - 9-201-వ.,

[ ⇑ ] :51) చక్ర-1 (స్త్రీ){జాతి}[గగనచర]:- చక్రవాకము - :వంశం - గగనచర;:::::::పద్య సం.(లు) - 2-167-మ., 8-42-మ., 2-167-తే.,

[ ⇑ ] :52) చక్ర-2 ( -){జాతి}[ఆయుధము]:- చక్రాయుధము - :వంశం - ఆయుధము;:::::::పద్య సం.(లు) - 1-30-ఉ., 1-184మ., 1-344-మ., 1-406., 2-152-వ., 3-55-మ., 8-327-క., నుండి 8-334-వ., వరకు

[ ⇑ ] :53) చక్ర-3 ( -){జాతి}[ -]:- గుండ్రముగా ఉండునది, వాహనమునకు ఉండే చక్రము, గుడ్రముగా తిరుగునది - :వంశం - -;:::::::పద్య సం.(లు) - 4-855-వ., 3-181-వ., 3-203-దం., 3-256-సీ.,

[ ⇑ ] :54) చక్రమండలకరణము- ( -){ -}[నృత్తము]:- పారిభాషిక పదము - రాసక్రీడ - నృత్తము
పాదములను కుడియెడమలుగా మార్చి ఉంచుకొని రెండుమోకాళ్ళను కౌగలించుకొనుట - :వంశం - నృత్తము;:::::::పద్య సం.(లు) - 10.1-1084-వ.,

[ ⇑ ] :55) చక్రము-1 ( -){ -}[ప్రదేశము]:- మండలము - :వంశం - ప్రదేశము;:::::::పద్య సం.(లు) - 1-137-వ., 1-367-మ., 10.1-1084-వ., 2-115-మ., 3-126-సీ.,

[ ⇑ ] :56) చక్రము-2 ( - ){ - }[ -]:- సమూహము - :వంశం - -;:::::::పద్య సం.(లు) - 1-369.,

[ ⇑ ] :57) చక్రము-3 ( - ){ - }[అవయవము]:- మానవదేహలోని చక్రములు - :వంశం - అవయవము;:::::::పద్య సం.(లు) - 2-29-సీ.,

[ ⇑ ] :58) చక్రవర్తి- (పురుష){జాతి}[మానవ యోని]:- భూచక్రవర్తి అంటే రారాజు, సార్వభౌముడు. - :వంశం - మానవ యోని;:::::::పద్య సం.(లు) - 1-63-వ., 1-293-వ., 2-150-సీ.,2-171-సీ.,

[ ⇑ ] :59) చక్రవాక - ( -){జాతి}[గగనచర]:- చక్రవాకములు - ఇవి అష్టమ స్కంధములోని త్రికూట పర్వతములో వర్ణించబడ్డాయి - :వంశం - గగనచర;:::::::పద్య సం.(లు) - 3-83-సీ., 3-344-వ., 8-23-సీ., 8-24-వ., 8-25-క.,

[ ⇑ ] :60) చక్రవాకుడు- (పురుష){సంజ్ఞా}[రాక్షస యోని]:- శ్రీకృష్ణుడు సంహరించిన రాక్షసులలో చక్రవాకుడు ఒకడు. - :వంశం - రాక్షస యోని;:::::::పద్య సం.(లు) - 10.1-1331-సీ.,

[ ⇑ ] :61) చక్రవాళబంధము- ( -){ -}[నృత్తము]:- పారిభాషిక పదము - రాసక్రీడ - నృత్తము
తాళమాత్రపు కాలములోపల నృత్యమండలమును చుట్టివచ్చి హస్య విన్యాసాదులను చూపునట్టిది - :వంశం - నృత్తము;:::::::పద్య సం.(లు) - 10.1-1084-వ.,

[ ⇑ ] :62) చక్రసమీరదైత్యుడు- (పురుష){సంజ్ఞా}[రాక్షస యోని]:- శ్రీకృష్ణుడు సంహరించిన రాక్షసులలో చక్రసమీరదైత్యుడు ఒకడు. - :వంశం - రాక్షస యోని;:::::::పద్య సం.(లు) - 1-29-ఉ., 10.1-271-శా.,

[ ⇑ ] :63) చక్రాయుధుడు- (పురుష){సంజ్ఞా}[దైవ యోని]:- చక్రాయుధము కలవాడు కనుక చక్రాయుధుడు, విష్ణువు, కృష్ణుడు - :వంశం - దైవ యోని;:::::::పద్య సం.(లు) - 1-399-మ., 3-253-క., 5.1-175-వ., 7-391-క., 8-100-వ., 10.2-101-క., 10.2-198-వ.,

[ ⇑ ] :64) చక్రి- (పురుష){సంజ్ఞా}[దైవ యోని]:- చక్రాయుధము కలవాడు కనుక చక్రి, విష్ణువు, కృష్ణుడు - :వంశం - దైవ యోని;:::::::పద్య సం.(లు) - 1-68-చ., 1-212-ఉ., 1-353-శా., 1-376-శా, 1-404-క., 1-445-సీ., 1-525-మ., 2-155-సీ., 7-16-శా., 7-25-శా.,

[ ⇑ ] :65) చక్షువు-1 (పురుష){సంజ్ఞా}[మనువు వంశం]:- చక్షువు కొడుకు చాక్షుషుడు ఆరవ (6వ) మనువు అయ్యాడు. - :వంశం - మనువు వంశం;:::::కొడుకు(లు) - చాక్షస మనువు;::పద్య సం.(లు) - 8-141-సీ.,

[ ⇑ ] :66) చక్షువు-2 (పురుష){సంజ్ఞా}[చంద్రవంశం]:- యయాతి కొడుకైన అనువునకు సభానురుడు, చక్షువు, పరోక్షుడు అని ముగ్గురు కొడుకులు. - :వంశం - చంద్రవంశం;:తండ్రి - అనువు;::::::పద్య సం.(లు) - 9-683-వ.,

[ ⇑ ] :67) చక్షువు నది- ( - ){సంజ్ఞా}[నది]:- బ్రహ్మపురం పడమటి ద్వారం నుండి వెలువడిన చక్షువు అనే దీర్ఘప్రవాహము కల నదీ ప్రవాహం మాల్యవంత పర్వతాన్ని దాటి, కేతుమూల వర్షంమీదుగా ప్రవహిస్తూ పడమటి సముద్రంలో కలుస్తుంది. - :వంశం - నది;:::::::పద్య సం.(లు) - 5.2-34-వ.,

[ ⇑ ] :68) చక్షుస్సంజ్ఞుడు- (పురుష){సంజ్ఞా}[ధ్రువుని వంశం]:- ధ్రువుని వంశపు వ్యుష్టునికి భార్య పుష్కరిణి యందు కలిగిన కొడుకు సర్వతేజుడు, ఇతనికి బార్య ఆకూతి యందు పుట్టిన కొడుకు చక్షుస్సంజ్ఞుడు. చక్షుసంజ్ఞుని భార్య అడ్వల యందు పురువు, కుత్సుడు, త్రితుడు, ద్యుమ్నుడు, సత్యవంతుడు, ఋతుడు, వ్రతుడు, అగ్నిష్టోముడు, అతిరాత్రుడు, సుద్యుమ్నుడు, శిబి, ఉల్ముకుడు అని పన్నెండుగురు (12) కొడుకులు కలిగిరి. వారిలో ఉల్ముకునికి పుష్కరిణి యందు అంగుడు, సుమనసుడు, ఖ్యాతి, క్రతువు, అంగిరసుడు, గయుడు అని ఆరుగురు (6)కొడుకులు కలిగారు. - :వంశం - ధ్రువుని వంశం;:తండ్రి - సర్వతేజుడు;:తల్లి - ఆకూతి;:భార్య - అడ్వల;::కొడుకు(లు) - పురువు, కుత్సుడు, త్రితుడు, ద్యుమ్నుడు, సత్యవంతుడు, ఋతుడు, వ్రతుడు, అగ్నిష్టోముడు, అతిరాత్రుడు, సుద్యుమ్నుడు, శిబి, ఉల్ముకుడు;::పద్య సం.(లు) - 4-390-వ.,

[ ⇑ ] :69) చతురంగుడు- (పురుష){సంజ్ఞా}[చంద్రవంశం]:- చతురంగుడు చంద్రవంశంలోని రోమపాదుని కుమారుడు. ఇతని కొడుకు పృథులాక్షుడు - :వంశం - చంద్రవంశం;:తండ్రి - రోమపాదుడు;::::కొడుకు(లు) - పృథులాక్షుడు;::పద్య సం.(లు) - 9-697-వ.,

[ ⇑ ] :70) చతురాననుడు- (పురుష){సంజ్ఞా}[దైవ యోని]:- చతురాననుడు అంటే చతుర్ముఖబ్రహ్మ - :వంశం - దైవ యోని;:::::::పద్య సం.(లు) - 3-224-క., 3-275-సీ., 3-276-తే., 3-720-సీ., 3-1018-వ., 4-452-వ., 5.2-11-వ., 8-170-శా., 8-503-సీ., 8-672-సీ., 8-681-వ., 10.1-542-శా., 10.2-623-క.,

[ ⇑ ] :71) చతుర్బాహులు- (పురుష){సంజ్ఞా}[దైవ యోని]:- చతుర్బాహులు అంటే నాలుగు చేతులు కలవారు వైకుంఠ ద్వారపాలకులైన జయవిజయులు - :వంశం - దైవ యోని;:::::::పద్య సం.(లు) - 3-518-సీ.,

[ ⇑ ] :72) చతుర్భద్రబంధము- ( -){సంజ్ఞా}[నృత్తము]:- పారిభాషిక పదము - రాసక్రీడ - నృత్తము
నాలుగు మూలలందును వెనుక మొగముగా నిలిచి హస్త విన్యాసదులను కనుపింప చేయునది - :వంశం - నృత్తము;:::::::పద్య సం.(లు) - 10.1-1084-వ.,

[ ⇑ ] :73) చతుర్భుజుడు- (పురుష){సంజ్ఞా}[దైవ యోని]:- చతుర్భుజుడు అంటే నాలుగు భుజముల వాడు, విష్ణువు, పూతన సంహారానంతరము గోపికలు శైశవకృష్ణునికి దిష్టి తీస్తూ భుజములను చతుర్భుజుడైన విష్ణువు కాపాడు గాక అని పలికారు. - :వంశం - దైవ యోని;:::::::పద్య సం.(లు) - 1-218-వ., 2-237-మ., 8-507-వ., 10.1-236-వ.,

[ ⇑ ] :74) చతుర్భుజులు- (పురుష){జాతి}[దైవ యోని]:- విష్ణుకింకంరులను అజామిళుని తీసుకువెళ్ళడానికి వచ్చినప్పుడు ఇలా వర్ణించారు - :వంశం - దైవ యోని;:::::::పద్య సం.(లు) - 4-371-వ., 6-78-సీ.,

[ ⇑ ] :75) చతుర్ముఖబంధము- ( -){సంజ్ఞా}[నృత్తము]:- పారిభాషిక పదము - రాసక్రీడ - నృత్తము
నాలుగు వైపులకు ముఖములను తిప్పి లయబద్ధముగా తిరుగుచు హస్త విన్యాసాదులను కనుపింప చేయునది - :వంశం - నృత్తము;:::::::పద్య సం.(లు) - 10.1-1084-వ.,

[ ⇑ ] :76) చతుశ్శృంగం- ( - ){సంజ్ఞా}[పర్వతం]:- కుశద్వీపంలోని దృఢరుచి వర్షంలో చతుశ్శృంగం అను గిరి, మధుకుల్య అను మహానది ఉన్నాయి. - :వంశం - పర్వతం;:::::::పద్య సం.(లు) - 5.2-64-వ,

[ ⇑ ] :77) చమర - ( -){జాతి}[జంతు]:- చమర అంటే చమరీమృగములు - ఇవి అష్టమ స్కంధములోని త్రికూట పర్వతములో వర్ణించబడ్డాయి - :వంశం - జంతు;:::::::పద్య సం.(లు) - 1-456-క., 3-344-వ., 3-770-క., 4-773, 8-23-సీ., 8-24-వ., 8-25-క.,

[ ⇑ ] :78) చమరీమృగము- ( -){జాతి}[జంతు]:- చమరీమృగము - :వంశం - జంతు;:::::::పద్య సం.(లు) - 6-277-క., 8-29-సీ., 8-327-క., నుండి 8-334-వ., వరకు

[ ⇑ ] :79) చమసుడు- (పురుష){సంజ్ఞా}[ప్రియవ్రతుని వంశం]:- ఋషభుని వందమంది కొడుకులలో ఒకడు, వీరిలో ఇతనితోపాటు తొమ్మిది మంది పరమ భాగవతులు అయ్యారు వీరు తరువాతి కాలంలో విదేహ రాజుకు తత్వం చెప్పారు. వారు కవి, హరి, అంతరిక్షుడు, ప్రబుద్ధుడు, పిప్పలాయనుడు, అవిర్హోత్రుడు, ద్రమీఢుడు, చమనుడు, కరభాజనుడు. - :వంశం - ప్రియవ్రతుని వంశం;:తండ్రి - ఋషభుడు;:తల్లి - జయంతి ;:::::పద్య సం.(లు) - 5.1-63-సీ.,., 5.1-64-వ., 11-35-వ.,

[ ⇑ ] :80) చర్మణ్వతి- ( -){సంజ్ఞా}[మహానది]:- భారతవర్షంలోని ప్రసిద్ధమైన పర్వతాలకు పుత్రికలవంటివి అయిన మహానదులలో ఒక నది. - :వంశం - మహానది;:::::::పద్య సం.(లు) - 5.2-55-వ.,

[ ⇑ ] :81) చర్యుడు- (పురుష){సంజ్ఞా}[రాక్షస యోని]:- ఇతడు శ్రావణ (నభో) మాసంలో సూర్యుని అనుచరులలోని రాక్షసుడు.
సూర్యుడు ఈ మాసంలో ఇంద్రుడు అను పేరుతో, ప్లమోచ, అంగిరసుడు, ఏలాపుత్రుడు, చర్యుడు, విశ్వవసువు, శ్రోతుడు మున్నగువారు అనుచరులుగా కలిగి సంచరిస్తాడు. - :వంశం - రాక్షస యోని;:::::::పద్య సం.(లు) - 12-41-వ., నుండి 12-45-వ., వరకు

[ ⇑ ] :82) చర్షణి- (స్త్రీ){సంజ్ఞా}[దైవ యోని]:- తొమ్మిదవ ఆదిత్యుడైన వరుణుడు చర్షిణి అనే భార్య వల్ల పూర్వం బ్రహ్మ కుమారుడైన భృగువును, వల్మీకం నుండి పుట్టిన వాల్మీకిని కన్నాడు. - :వంశం - దైవ యోని;::::భర్త - వరుణుడు ;:కొడుకు(లు) - భృగువు; వాల్మీకి ;::పద్య సం.(లు) - 6-507-వ.,

[ ⇑ ] :83) చర్షణులు- (పురుష){జాతి}[దైవ యోని]:- ఆర్యమునికి మాతృక అనే భార్య వల్ల చర్షణులు జన్మించారు. వారివల్ల మానవ జాతి ఈలోకంలో స్థిరంగా ఉండేవిధంగా బ్రహ్మ ఏర్పాటు చేసాడు. - :వంశం - దైవ యోని;:తండ్రి - ఆర్యముడు ;:తల్లి - మాత్రుక;:::కొడుకు(లు) - మనుష్యజాతి;::పద్య సం.(లు) - 6-258-వ.,

[ ⇑ ] :84) చలివెలుగు- ( -){సంజ్ఞా}[ -]:- చలివెలుగు అంటే చంద్రుడు - :వంశం - -;:::::::పద్య సం.(లు) - 9-171-క.,

[ ⇑ ] :85) చలుడు-1 (పురుష){సంజ్ఞా}[మానవ యోని]:- కృష్ణుడు ద్వారకలోని మల్లరంగం ప్రవేశించినప్పుడు వచ్చిన కంసుని చలుడు మల్లులలో ఒకడు. అల వచ్చిన మల్లులు చాణూరుడు, ముష్టికుడు, కూటుడు, చలుడు, కోసలుడు. - :వంశం - మానవ యోని;:::::::పద్య సం.(లు) - 10.1-1312-మ.,

[ ⇑ ] :86) చలుడు-2 (పురుష){సంజ్ఞా}[సూర్యవంశం]:- శ్రీరాముని తరువాతి తరాలలోని బలుని కొడుకు చలుడు; చలుని కొడుకు సూర్యాంశతో పుట్టిన వజ్రనాభుడు. - :వంశం - సూర్యవంశం;:తండ్రి - బలుడు;::::కొడుకు(లు) - వజ్రనాభుడు;::పద్య సం.(లు) - 9-364-వ.,

[ ⇑ ] :87) చలుడు-3 (పురుష){సంజ్ఞా}[సూర్యవంశం]:- శ్రీరామచంద్రుని తరువాతి సూర్యవంశరాజులలో, బలునికి చలుడు; చలునికి సూర్యాంశతో పుట్టిన వజ్రనాభుడు; వజ్రనాభునికి శంఖణుడు; శంఖణునికి విధృతి; విధృతికి హిరణ్యనాభుడు పుట్టారు. అతడు జైమిని శిష్యుడైన యజ్ఞవల్క మహర్షి నుండి అధ్యాత్మయోగం నేర్చుకొని హృదయంలోని కలతలు అన్నీ విడిచిపెట్టి యోగం ఆచరించాడు. - :వంశం - సూర్యవంశం;:తండ్రి - బలుడు;::::కొడుకు(లు) - వజ్రనాభుడు;::పద్య సం.(లు) - 9-364-వ.

[ ⇑ ] :88) చాక్షుష మనువు- (పురుష){సంజ్ఞా}[మనువు వంశం]:- చక్షువు కొడుకు చాక్షుషుడు పద్నాలుగురు మనువులలో ఆరవ వాడు. ఆరవదైన చాక్షుస మన్వంతరంలో, చాక్షుషమనువు కొడుకులు అయిన పురుడు, పురుషుడు , సుద్యుమ్నుడు మున్నగువారు రాజులు అయ్యారు; మంత్రద్యుముడు ఇంద్రుడు అయ్యాడు; ఆప్యాదులు దేవతలు అయ్యారు. హవిష్మంతుడు, వీరకుడు మున్నగువారు సప్తర్షులు అయ్యారు; వైరాజుకీ సంభాతికీ “అజితుడు” అనే పేరుతో విష్ణువు పుట్టాడు. అతడే కూర్మరూపం ధరించి మంథర పర్వతాన్ని సముద్రంలో మునిగిపోకుండా మోసాడు. అలా చాక్షుష మన్వంతరంలో క్షీరసాగరమథనం జరిగింది. దీని పిమ్మట ప్రస్తుతం నడుస్తున్న వైవశ్వతన్వంతరం మొదలైంది. - :వంశం - మనువు వంశం;:తండ్రి - చక్షువు;::::కొడుకు(లు) - పురుడు, పురుషుడు , సుద్యుమ్నుడు మున్నగువారు;::పద్య సం.(లు) - 8-141-సీ.,

[ ⇑ ] :89) చాక్షుషమనువు- (పురుష){సంజ్ఞా}[మనువు వంశం]:- వస్తువుకు ఆంగిరస అనే భార్య వల్ల విశ్వకర్మ అనే శిల్పాచార్యుడు పుట్టాడు. ఆ విశ్వకర్మకు ఆకృతి అనే భార్య వల్ల చాక్షుషుడు అనే మనువు జన్మించాడు. ఆ మనువు వల్ల విశ్వుడు, సాధ్యులు అనే వాళ్ళు పుట్టారు. - :వంశం - మనువు వంశం;:తండ్రి - విశ్వకర్ముడు;:తల్లి - ఆకృతి;:::కొడుకు(లు) - విశ్వులు; సాధ్యులు ;::పద్య సం.(లు) - 6-254-వ.,

[ ⇑ ] :90) చాక్షుషమన్వంతరం- ( -){సంజ్ఞా}[కాలం]:- చాక్షుషమన్వంతరం పద్నాలుగు మన్వంతరాలలో ఆరవది ప్రస్తుత మన్వంతరానికి ముందుది.
మత్స్యావతారం దాల్చి చాక్షుష మన్వంతరంలో సంభవించిన జలప్రళయంలో నావపై నెక్కించి వైవస్వత మనువును కాపాడాడు.
చాక్షుష మన్వంతరంలో శివదూషణం చేసిన కారణం చేత దక్షుడు మనుష్యుడై ప్రచేతసులకు, మారిషకు పుట్టాడు.
చాక్షుస మనువు ఏలుటవలన చాక్షుషమన్వంతరం అయింది. - :వంశం - కాలం;:::::::పద్య సం.(లు) - 1-63-వ., 4-945-వ., 8-141-సీ.,

[ ⇑ ] :91) చాక్షుషుడు-1 (పురుష){సంజ్ఞా}[సూర్యవంశం]:- ఖమిత్రునికి చాక్షుసుడు; అతనికి వివింశతి; వివింశతికి రంభుడు - :వంశం - సూర్యవంశం;:తండ్రి - ఖమిత్రుడు;::::కొడుకు(లు) - వివింశతుడు;::పద్య సం.(లు) - 9-44-వ.,

[ ⇑ ] :92) చాక్షుషుడు-2 (పురుష){సంజ్ఞా}[సూర్యవంశం]:- సూర్యవంశంలోని దిష్టుని వంశంలోని ఖమిత్రుని కొడుకుఇతని కొడుకు వివింశతి - :వంశం - సూర్యవంశం;:తండ్రి - ఖమిత్రుడు;::::కొడుకు(లు) - వివింశతి;::పద్య సం.(లు) - 9-44-వ.

[ ⇑ ] :93) చాక్షుషులు- (పురుష){జాతి}[దైవ యోని]:- రాబోయేకాలంలో పద్నాల్గవదైన ఇంద్రసావర్ణి మన్వంతరంలో పవిత్రులూ, చాక్షుషులూ దేవతలు అవుతారు. శుచి ఇంద్రుడు అవుతాడు. మనువు కొడుకులైన గంభీరుడూ, వసువూ మొదలైనవారు రాజులు అవుతారు. అగ్ని బాహువూ శుచీ, శుక్రుడూ, మాగధుడూ మొదలైనవారు సప్తఋషులు అవుతారు. విష్ణువు సత్రాయణునకూ వితానకూ బృహద్భానుడు అనే పేరుతో పుడతాడు. - :వంశం - దైవ యోని;:::::::పద్య సం.(లు) - 8-427-వ.,

[ ⇑ ] :94) చాణూరుడు- (పురుష){సంజ్ఞా}[రాక్షస యోని]:- చాణూరుడు కంసుని ఆస్తాన మల్లులలో ఒకడు. మల్లరంగంలో కృష్ణుని చేతిలో మరణించాడు.
రాజ్యాన్ని ఆక్రమించిన కంసుడు అనేకులైన రాక్షసులను అనుచరులుగా కూడకట్టుకున్నాడు. బాణుడు, భౌముడు, మాగధుడూ, మహాశనుడూ, కేశి, ధేనుకుడు, బకుడు, ప్రలంబుడు, తృణావర్తుడు, చాణూరుడు, ముష్టికుడు అరిష్టుడు ద్వివిదుడు పూతన మొదలైన రాక్షసులను కలుపుకున్నవాడై యుద్ధాలు చేసి యాదవులను ఓడించాడు. - :వంశం - రాక్షస యోని;:::::::పద్య సం.(లు) - 2-190-చ., 10.1-56-వ., 10.1-1151-వ., 10.1-1154-శా., 10.1-1333-మ.,

[ ⇑ ] :95) చాపాచార్యుడు- (పురుష){సంజ్ఞా}[మానవ యోని]:- చాపాచార్యుడు అంటే కౌరవ పాండవులుకు విలువిద్య నేర్పిన గురువు ద్రోణుడు. - :వంశం - మానవ యోని;:::::::పద్య సం.(లు) - 3-28-క.,

[ ⇑ ] :96) చామరము- ( -){జాతి}[పరికరము]:- కృష్ణుడు ద్వారకకు బయలుదేరినప్పుడు వర్ణించిన శోభలో ఉద్దవసాత్యకులు రత్నఖచిత చామరములను వీచసాగారు. విసనకఱ్ఱ వలె ఉపయోగించు చమరీ మృగపు తోకకుచ్ఛు
జలజాతాక్షుడు సూడనొప్పె పద్యంలో చామరముల వంటి చంద్రుడు అని వర్ణించారు. - :వంశం - పరికరము;:::::::పద్య సం.(లు) - 1-235-సీ., 1-259-ఉ., 3-535-చ., 4-166-త., 6-280-సీ., 8-29-సీ.,

[ ⇑ ] :97) చారణ - (స్త్రీ){జాతి}[దైవ యోని]:- చారణుల - దైవయోని విశేషము. ఇవి అష్టమ స్కంధములోని త్రికూట పర్వతములో వర్ణించబడ్డాయి - :వంశం - దైవ యోని;:::::::పద్య సం.(లు) - 2-16-వ., 2-91-సీ., 3-344-వ., 4-689-సీ., 5.1-8-వ., 6-259-సీ., 7-95-సీ., 7-327-వ., 8-24-వ., 10.1-107-క.,

[ ⇑ ] :98) చారణులు- (స్త్రీ){జాతి}[భగణ విషయం]:- రాహువుకు దిగువ సిద్ధులు, చారణులు, విద్యాధరులు తిరుగుతూ ఉంటారు. - :వంశం - భగణ విషయం;:::::::పద్య సం.(లు) - 5.2-102-క.,

[ ⇑ ] :99) చారుగుప్తుడు- (పురుష){సంజ్ఞా}[చంద్రవంశం]:- చారుగుప్తుడు కృష్ణునికి రుక్మిణి యందు కలిగిన పదిమంది పుత్రులలో ఒకడు. రుక్మిణీదేవి వలన శ్రీకృష్ణునకు “ప్రద్యుమ్నుడు, చారుధేష్ణుడు, చారుదేవుడు, సుధేష్ణుడు, సుచారువు, చారుగుప్తుడు, భద్రచారువు, చారుభద్రుడు, విచారువు, చారువు” అనే పదిమంది పుత్రులు కలిగారు. - :వంశం - చంద్రవంశం;:తండ్రి - కృష్ణుడు;:తల్లి - రుక్మిణి;:::::పద్య సం.(లు) - 10.2-275-వ.,

[ ⇑ ] :100) చారుడు- (పురుష){సంజ్ఞా}[చంద్రవంశం]:- చారుడు కృష్ణునికి రుక్మిణి యందు కలిగిన పదిమంది పుత్రులలో ఒకడు. రుక్మిణీదేవి వలన శ్రీకృష్ణునకు “ప్రద్యుమ్నుడు, చారుధేష్ణుడు, చారుదేవుడు, సుధేష్ణుడు, సుచారువు, చారుగుప్తుడు, భద్రచారువు, చారుభద్రుడు, విచారువు, చారువు” అనే పదిమంది పుత్రులు కలిగారు. - :వంశం - చంద్రవంశం;:తండ్రి - కృష్ణుడు;:తల్లి - రుక్మిణి;:::::పద్య సం.(లు) - 10.2-275-వ.,

[ ⇑ ] :101) చారుదేవుడు- (పురుష){సంజ్ఞా}[చంద్రవంశం]:- చారుదేవుడు కృష్ణునికి రుక్మిణి యందు కలిగిన పదిమంది పుత్రులలో ఒకడు. రుక్మిణీదేవి వలన శ్రీకృష్ణునకు “ప్రద్యుమ్నుడు, చారుధేష్ణుడు, చారుదేవుడు, సుధేష్ణుడు, సుచారువు, చారుగుప్తుడు, భద్రచారువు, చారుభద్రుడు, విచారువు, చారువు” అనే పదిమంది పుత్రులు కలిగారు. - :వంశం - చంద్రవంశం;:తండ్రి - కృష్ణుడు;:తల్లి - రుక్మిణి;:::::పద్య సం.(లు) - 10.2-275-వ.,

[ ⇑ ] :102) చారుధేష్ణుడు- (పురుష){సంజ్ఞా}[చంద్రవంశం]:- చారుధేష్ణుడు కృష్ణునికి రుక్మిణి యందు కలిగిన పదిమంది పుత్రులలో ఒకడు. రుక్మిణీదేవి వలన శ్రీకృష్ణునకు “ప్రద్యుమ్నుడు, చారుధేష్ణుడు, చారుదేవుడు, సుధేష్ణుడు, సుచారువు, చారుగుప్తుడు, భద్రచారువు, చారుభద్రుడు, విచారువు, చారువు” అనే పదిమంది పుత్రులు కలిగారు. - :వంశం - చంద్రవంశం;:తండ్రి - కృష్ణుడు;:తల్లి - రుక్మిణి;:::::పద్య సం.(లు) - 1-256-మత్త., 3-58-తే., 10.2-275-వ.,

[ ⇑ ] :103) చారుభద్రుడు- (పురుష){సంజ్ఞా}[చంద్రవంశం]:- చారుభద్రుడు కృష్ణునికి రుక్మిణి యందు కలిగిన పదిమంది పుత్రులలో ఒకడు. రుక్మిణీదేవి వలన శ్రీకృష్ణునకు “ప్రద్యుమ్నుడు, చారుధేష్ణుడు, చారుదేవుడు, సుధేష్ణుడు, సుచారువు, చారుగుప్తుడు, భద్రచారువు, చారుభద్రుడు, విచారువు, చారువు” అనే పదిమంది పుత్రులు కలిగారు. - :వంశం - చంద్రవంశం;:తండ్రి - కృష్ణుడు;:తల్లి - రుక్మిణి;:::::పద్య సం.(లు) - 10.2-275-వ.,

[ ⇑ ] :104) చారుభానుడు- (పురుష){సంజ్ఞా}[చంద్రవంశం]:- చారుభానుడు కృష్ణుని కొడుకులలో ఒకడు. - :వంశం - చంద్రవంశం;:తండ్రి - కృష్ణుడు;::::::పద్య సం.(లు) - 10.2-454.1-సీ.,

[ ⇑ ] :105) చారుమతి- (స్త్రీ){సంజ్ఞా}[చంద్రవంశం]:- చారుమతి అను రుక్మి యొక్క కూతురును కృతవర్మ కుమారుడు వివాహమాడెను. - :వంశం - చంద్రవంశం;:తండ్రి - రుక్మి;::::::పద్య సం.(లు) - 10.2-285-క.,

[ ⇑ ] :106) చారువు- (పురుష){సంజ్ఞా}[చంద్రవంశం]:- చంద్రవంశంలోని ప్రాచీనాంశ్వుని కొడుకైన ప్రవిరోధనమన్యువు యొక్క పుత్రుడు చారువు. చారువు కొడుకు సుద్యువు. - :వంశం - చంద్రవంశం;:తండ్రి - ప్రవిరోధనమన్యువు;::::కొడుకు(లు) - సుద్యువు;::పద్య సం.(లు) - 9-593-వ.,

[ ⇑ ] :107) చింతామణి-1 ( -){ -}[సంపద]:- చింతామణి అంటే కోరిన కోరికలు ప్రసాదించే రత్నం. అక్రూరుడు కృష్ణుని భక్తులపాలిటి చింతామణి అని పలికాడు.
రుక్మిణి కృష్ణుని తీసుకువచ్చిన విప్రుని సద్భక్త చింతామణి అని పొగిడింది. - :వంశం - సంపద;:::::::పద్య సం.(లు) - 10.1-1507-శా., 10.1-1738-మ., 1-269-సీ., 6-22-ఆ.,

[ ⇑ ] :108) చింతామణి-2 (స్త్రీ){సంజ్ఞా}[భూచర]:- కృష్ణుడు చల్దులు కుడుస్తూ గోవులను వెతుకుతూ వెళ్ళి పిలిచిన గోవులలో ఒకటి చింతామణి. - :వంశం - భూచర;:::::::పద్య సం.(లు) - 10.1-604-సీ.

[ ⇑ ] :109) చిత్త- ( -){సంజ్ఞా}[భగణ విషయం]:- శింశుమారచక్రం కుడి ఎడమ చెవులలో మఘ, పుబ్బ, ఉత్తర, హస్త, చిత్త, స్వాతి, విశాఖ, అనూరాధ నక్షత్రాలు ఉన్నాయి. - :వంశం - భగణ విషయం;:::::::పద్య సం.(లు) - 5.2-97-వ.,

[ ⇑ ] :110) చిత్తజుడు- (పురుష){సంజ్ఞా}[దైవ యోని]:- చిత్తజుడు అంటే మన్మథుడు - :వంశం - దైవ యోని;:::::::పద్య సం.(లు) - 3-452-చ., 11-27-క.,

[ ⇑ ] :111) చిత్తి- (స్త్రీ){సంజ్ఞా}[ఋషి]:- అథర్వునికి చిత్తి అనే భార్యవల్ల ధృతవ్రతుడూ, అశ్వశిరస్కుడూ అయిన దధ్యంచుడు జన్మించారు - :వంశం - ఋషి;:::::కొడుకు(లు) - ధృతవ్రతుడూ, అశ్వశిరస్కుడూ అయిన దధ్యంచుడు;::పద్య సం.(లు) - 4-26-వ.,

[ ⇑ ] :112) చిత్రకుడు- (పురుష){సంజ్ఞా}[చంద్రవంశం]:- వృష్ణివంశంలోని అనమిత్రుని కొడుకైన పృశ్ని యొక్క రెండవ పుత్రుడు చిత్రకుడు. శ్వఫల్కుడు పెద్ద కొడుకు. - :వంశం - చంద్రవంశం;:తండ్రి - ప్రుశ్ని;::::కొడుకు(లు) - పృథువు, విదూరథుడు మున్నగువారు పెక్కండ్రు. వీరు వృష్ణివంశులు;::పద్య సం.(లు) - 9-712-వ.

[ ⇑ ] :113) చిత్రకూటం-1 ( -){సంజ్ఞా}[పర్వతం]:- భారతవర్షంలోని ప్రసిద్ధమైన అనేక పర్వతాలలో ఒకటి. - :వంశం - పర్వతం;:::::::పద్య సం.(లు) - 5.2-55-వ., 9-267-క.,

[ ⇑ ] :114) చిత్రకూటం-2 ( - ){సంజ్ఞా}[పర్వతం]:- కుశద్వీపంలోని గుప్త వర్షంలో చిత్రకూటం అను గిరి, మిత్రవింద అను మహానది ఉన్నాయి. - :వంశం - పర్వతం;:::::::పద్య సం.(లు) - 5.2-64-వ,

[ ⇑ ] :115) చిత్రకేతు- (పురుష){సంజ్ఞా}[చంద్రవంశం]:- వసుదేవుని తమ్ముడు దేవభాగునికి భార్య దేవకుని కూతురు దేవకి సోదరి అయిన కంస యందు చిత్రకేతుడు, బృహద్బలుడు అని ఇద్దరు పుట్టారు - :వంశం - చంద్రవంశం;:తండ్రి - దేవభాగుడు;:తల్లి - కంస;:::::పద్య సం.(లు) - 9-722-వ.,

[ ⇑ ] :116) చిత్రకేతుడు-1 (పురుష){సంజ్ఞా}[ఋషి]:- వసిష్ఠునికి భార్య ఊర్జ యందు చిత్రకేతుడు, సురోచి, విరజుడు, మిత్రుడు, ఉల్బణుడు, వసుభృద్ధ్యానుడు, ద్యుమంతుడు అనే ఏడుగురు ఋషులు జన్మించారు. వారిలో చిత్రకేతుడు ప్రథముడు. - :వంశం - ఋషి;:తండ్రి - వసిష్ఠుడు;:తల్లి - ఊర్జ / అరుంధతి ;:::::పద్య సం.(లు) - 4-26-వ.

[ ⇑ ] :117) చిత్రకేతుడు-2 (పురుష){సంజ్ఞా}[మానవ యోని]:- వృత్రాసురుడు పూర్వజన్మలో చిత్రకేతుడు. చితిరకేతుడు మహారాజు కొడుకు మరణంతో కుమిలిపోతుండగా నారదుని ఉపదేశం లభించింది. ఆ నారాయణ మంత్ర ప్రభావముతో విద్యదర చక్రవర్తి పదవి గొప్ప విమానం లభించాయి. కాలప్రభావం వలన పార్వతీ దేవి శాపం పొంది. రాక్షసజన్మగా వృత్రాసురుడు అయ్యాడు. చిత్రకేతుని పవిత్ర చరిత్రను భక్తితో విన్నవారికి, చదివిన వారికి పాపాలన్నీ నాశనమై చెదరిపోతాయి. సమస్త వైభవాలు సమకూరుతాయి. కోరిన కోరికలు తమంత తామే తీరుతాయి. వారు నిర్మల హృదయులై, నిత్య సత్య వ్రతులై, తొలగిన పాపాలు కలవారై బంధువులతోనూ మిత్రులతోనూ పుత్రులతోనూ, పౌత్రులతోనూ కూడి ఉండి అధిక సుఖాలను అనుభవిస్తారు. - :వంశం - మానవ యోని;:::::::పద్య సం.(లు) - 6-444-వ. నుండి 6-505-సీ.,

[ ⇑ ] :118) చిత్రబాహువు- (పురుష){సంజ్ఞా}[కృష్ణుడు]:- శ్రీకృష్ణుని పుత్రులలో ప్రసిద్ధుడైనవాడు. కృష్ణునికి అష్టపట్టమహిషల యందు కలిగిన పుత్రులలో ప్రసిద్ధులైనవారు పద్దెనిమిది మంది, వారు 1.ప్రద్యుమ్నుడు, 2.అనిరుద్ధుడు, 3.దీప్తిమంతుడు, 4.భానుడు, 5.సాంబుడు, 6,బృహద్భానుడు, 7.మధుడు, 8.మిత్రవిందుడు, 9.వృకుడు, 10.అరుణుడు, 11.పుష్కరుడు, 12.దేవబాహుడు, 13.శ్రుతదేవుడు, 14.సునందుడు, 15.చిత్రబాహువు, 16.వరూధుడు, 17.కవి, 18.న్యగ్రోధుడు అనేవారు. - :వంశం - కృష్ణుడు;:::::::పద్య సం.(లు) - 10.2-1331-క.

[ ⇑ ] :119) చిత్రరథ వర్షం- ( -){సంజ్ఞా}[ప్రాంతం]:- చిత్రరథ వర్షం శాకద్వీపాన్ని మేధాతిథి విభాగించిన సప్త వర్షాలలోది. ఈ వర్షానికి అదిపతి చిత్రరథుడు. ఈ వర్షంలో సహస్రస్రోతం, అను సరిహద్దు పర్వతము, పంచపరి అను నది ఉన్నాయి. శాకద్వీపవాసులు ద్వీపవాసులు ఆ నదీ జలాలను సేవిస్తూ ప్రాణాయామం చేస్తూ రజోగుణ, తమోగుణాలను నశింపజేసికొని సమాధి నిష్ఠులై వాయురూపుడైన భగవంతుని ఆరాధిస్తారు. అక్కడ ఋతవ్రతులు, సత్యవ్రతులు, దానవ్రతులు, సువ్రతులు అనే నాలుగు వర్ణాలవారు ఉన్నారు. - :వంశం - ప్రాంతం;:::::::పద్య సం.(లు) - 5.2-68-వ.,

[ ⇑ ] :120) చిత్రరథుడు-1 (పురుష){సంజ్ఞా}[ఉత్తానపాదుడు]:- ధ్రువునికి చిత్రరథుడు అను పేరు కలదు. యక్షులతో యుద్దము చేయునప్పుడు ఈ పేరు వినబడెను. - :వంశం - ఉత్తానపాదుడు;:తండ్రి - సునీతి;:తల్లి - భ్రమి, ఇల;::భర్త - ఉత్కలుడు, వత్సరుడు;:::పద్య సం.(లు) - 4-342-వ.,

[ ⇑ ] :121) చిత్రరథుడు-2 (పురుష){సంజ్ఞా}[ప్రియవ్రతుని వంశం]:- ఇతడు గయుని పెద్ద కొడుకు, తల్లి జయంతి, భార్య ఊర్ణ, కొడుకు సమ్రాట్టు. - :వంశం - ప్రియవ్రతుని వంశం;:తండ్రి - గయుడు;:తల్లి - జయంతి;:భార్య - ఊర్ణ;::కొడుకు(లు) - సమ్రాట్టు;::పద్య సం.(లు) - 5.2-10-వ.,

[ ⇑ ] :122) చిత్రరథుడు-3 (పురుష){సంజ్ఞా}[మానవ యోని]:- ప్రియవ్రతుని కుమారుడైన మేధాతిథి తన కుమారుడైన చిత్రరథునికి, అతని పేర శాకద్వీప భాగాన్ని వర్షంగా విభజించి, అతనికి పట్టంగట్టాడు. అలా చిత్రరథ వర్షానికి అదిపతి చిత్రరథుడు. ఈ వర్షంలో సహస్రస్రోతం, అను సరిహద్దు పర్వతము, పంచపరి అను నది ఉన్నాయి. క్రౌంచద్వీపవాసులు వాయురూపుడైన భగవంతుని ఆరాధిస్తారు. వీరిలో ఋతవ్రతులు, సత్యవ్రతులు, దానవ్రతులు, సువ్రతులు అనే నాలుగు వర్ణాలవారు ఉన్నారు. - :వంశం - మానవ యోని;:తండ్రి - మేధాతిథి ;::::::పద్య సం.(లు) - 5.2-68-వ.,

[ ⇑ ] :123) చిత్రరథుడు-4 (పురుష){సంజ్ఞా}[దైవయోని]:- చిత్రరథుడు ఒక గంథర్వుడు. ఒకమారు విమానంలో తన ఇంతులతో వెళ్తున్నాడు. అనుకోకుండా కౌశికుడనే బ్రాహ్మణుని అస్తికలపై అతని విమాన నీడ పడింది. ఆ విప్రుడు కౌశికుడు శ్రీమన్నారాయణ కవచం మిక్కిలి భక్తిగా ధారణ చేసినవాడు. అతని అస్తికలపై విమానం రాగానే తుళ్ళిపోయింది. చిత్రరథుడు వనితలతో పాటు పడిపోయాడు. ఏమిటో తెలియక అయోమయంలో పడ్డాడు.వాలఖిల్యుడను ఋషివచ్చి విషయం చెప్పి అస్తికలను సరస్వతీనదిలో కలిపి ఐచమనం చేసి రా అని చెప్పాడు. ఆ ప్రకారం చేసి తన విమానం ఎక్కి వెళ్ళిపోయాడు. నారాయణకవచం అంత ప్రభావవంతమైనది - :వంశం - దైవయోని;:::::::పద్య సం.(లు) - 6-308-సీ., నుండి 6-311-వ.,

[ ⇑ ] :124) చిత్రరథుడు-5 (పురుష){సంజ్ఞా}[సూర్యవంశం]:- సూర్యవంశంలోని బార్స్వకుని కొడుకు చిత్రరథుడు. చిత్రరథుని కొడుకు క్షేమాపి. - :వంశం - సూర్యవంశం;:తండ్రి - బార్స్వకుడు;::::కొడుకు(లు) - క్షేమాపి;::పద్య సం.(లు) - 9-374-వ.,

[ ⇑ ] :125) చిత్రరథుడు-6 (పురుష){సంజ్ఞా}[దైవయోని]:- చిత్రరథుడు ఒక గంథర్వరాజు. అనుకోకుండా గంగానదిలో ఒకనాడు అతనిని చూసిన జమదగ్ని భార్య రేణుక మంచినీటిని తీసుకురావడం ఆలస్యం చేసింది. అందుకని ఋషి జమదగ్ని ఆమెను నరకమని కొడుకులను పరశురాముని అన్నలను ఆదేశించాడు. వారు అంగీకరించలేదు. ఇంతలో వచ్చిన పరశురాముని తల్లిని అన్నలను నరకమన్నాడు. పరశురాముడు అలా చేయగా సంతోషించి వరంకోరుకోమన్నాడు తండ్రి. పరశురాముడు తల్లిని అన్నలను బతికించమని కోరి వారిని పునరుజ్జీవులను చేశాడు. - :వంశం - దైవయోని;:::::::పద్య సం.(లు) - 9-466-ఉ.

[ ⇑ ] :126) చిత్రరథుడు-7 (పురుష){సంజ్ఞా}[చంద్రవంశం]:- చంద్రవంశంలో పరీక్షిత్తుకు భవిష్యత్తుకాలంలోని చిత్రరథుడు ఉప్తుని కుమారుడు. ఇతనికి పుత్రుడు శుచిరథుడు. - :వంశం - చంద్రవంశం;:తండ్రి - ఉప్తుడు;::::కొడుకు(లు) - శుచిరథుడు;::పద్య సం.(లు) - 9-679-వ.,

[ ⇑ ] :127) చిత్రరథుడు-8 (పురుష){సంజ్ఞా}[చంద్రవంశం]:- చంద్రవంశంలోని వృష్ణివంశపు భేరుశేకుని కొడుకు చిత్రరథుడు. చిత్రరథుని కొడుకు శశిబిందుడు. - :వంశం - చంద్రవంశం;:తండ్రి - భేరుశేకుడు;::::కొడుకు(లు) - శశిబిందుడు;::పద్య సం.(లు) - 9-703-వ.,

[ ⇑ ] :128) చిత్రరథుడు (రోమపాదుడు)- (పురుష){సంజ్ఞా}[చంద్రవంశం]:- చంద్రవంశంలోని దివిరథుని కొడుకు. ఇతనికి పిల్లలు లేరని స్నేహితుడైన దశరథుడు తన కూతురు శాంతను ఇతనికి పెంపకానికి ఇచ్చాడు.. ఇతనికి తరువాత చతురంగుడు అనే కొడుకు పుట్టాడు. - :వంశం - చంద్రవంశం;:తండ్రి - దివిరథుడు;::::కొడుకు(లు) - చతురంగుడు;:కూతురు(లు)- శాంత స్నేహితుడు దశరథుడు ఇచ్చిన పెంపుడు పుత్రిక;:పద్య సం.(లు) - 6-683-వ., 6-685-వ.,

[ ⇑ ] :129) చిత్రరేఖ-1 ( -){జాతి}[ -]:- చిత్రరేఖ అంటే నుదుటి బొట్టు. కృష్ణుడు ఒక భామకు చిత్రరేఖకు అంటిన ముంగురులు సవరించెను. - :వంశం - -;:::::::పద్య సం.(లు) - 10.1-1096-సీ.,

[ ⇑ ] :130) చిత్రరేఖ-2 (స్త్రీ){సంజ్ఞా}[రాక్షస యోని]:- చిత్రరేఖ ఉషాకన్య అనుంగుచెలికత్తె, కుంభాండుని కూతురు. కుంభాండడు బలి కొడుకు, ఉషాకన్య తండ్రి అయిన బాణుని మంత్రి.
కలలో కనిపించిన అందగానికై తపిస్తున్న ఉషాకన్య మనోరథం అడిగి తెలుసుకున్నది. నానాదేశాల రాజుల రాకుమారుల చిత్రాలు గీసి ఉషాకన్యకు చూపింది. ఆమె గుర్తించిన అనిరుద్ధుని రాత్రి సమయంలో రహస్యంగా వెళ్ళి తీసుకువచ్చి ఉషాకన్య వద్దకు చేర్చింది. - :వంశం - రాక్షస యోని;:తండ్రి - కుంభాండుడు;::::::పద్య సం.(లు) - 10.2-337-తే., నుండి 10.2-371-వ.,

[ ⇑ ] :131) చిత్రసేనుడు-1 (పురుష){సంజ్ఞా}[మనువు వంశం]:- రాబోయే కాలంలో వచ్చే దేవసావర్ణి మన్వంతరంలో అతని కొడుకులైన చిత్రసేనుడూ విచిత్రుడూ మొదలైనవారు రాజులు అవుతారు. - :వంశం - మనువు వంశం;:తండ్రి - దేవసావర్ణిమనువు;::::::పద్య సం.(లు) - 8-425-వ.,

[ ⇑ ] :132) చిత్రసేనుడు-2 (పురుష){సంజ్ఞా}[సూర్యవంశం]:- సూర్యవంశంలోని చిత్రసేనుడు అరిష్యంతుని కొడుకు. నృగుని వంశంవారు వీరు. ఇతని కొడుకు దక్షుడు - :వంశం - సూర్యవంశం;:తండ్రి - నరిష్యంతుడు;::::కొడుకు(లు) - దక్షుడు;::పద్య సం.(లు) - 9-42-వ.,

[ ⇑ ] :133) చిత్రస్వనుడు- (పురుష){సంజ్ఞా}[నాగుడు]:- ఇతడు ఆషాఢ (శుచి) మాసంలో సూర్యుని అనుచరులలోని నాగుడు.
సూర్యుడు ఈ మాసంలో వరుణుడు అను పేరుతో, రంభ, వసిష్టుడు, చిత్రస్వనుడు, శుక్రుడు, హూహువు, సహజన్యుడు మున్నగువారు అనుచరులుగా కలిగి సంచరిస్తాడు. - :వంశం - నాగుడు;:::::::పద్య సం.(లు) - 12-41-వ.,

[ ⇑ ] :134) చిత్రాంగద- (స్త్రీ){సంజ్ఞా}[చంద్రవంశం]:- మణలూరు రాకుమారి - :వంశం - చంద్రవంశం;::::భర్త - అర్జునుడు;:కొడుకు(లు) - బబ్రువాహనుడు;::పద్య సం.(లు) - 9673-వ.,

[ ⇑ ] :135) చిత్రాంగదుడు- (పురుష){సంజ్ఞా}[చంద్రవంశం]:- చిత్రాంగదుడు భీష్ముని తండ్రి యైన శంతనునికి దాశరాజు కూతురు సత్యవతి యందు పుట్టిన పెద్దకొడుకు. ఇతను గంధర్వుల చేతిలో మరణించాడు. - :వంశం - చంద్రవంశం;:తండ్రి - శంతనుడు;:తల్లి - సత్యవతి ;:::::పద్య సం.(లు) - 9-668-వ.,

[ ⇑ ] :136) చిప్ప- ( -){జాతి}[జలచర]:- చిప్ప అంటే ఆల్చిప్పలు - :వంశం - జలచర;:::::::పద్య సం.(లు) - 8-55-వ.,

[ ⇑ ] :137) చిప్పలు-1 ( -){జాతి}[అవయవము]:- చిప్పలు అంటే పొలుసులు - :వంశం - అవయవము;:::::::పద్య సం.(లు) - 8-53-చ.,

[ ⇑ ] :138) చిప్పలు-2 ( -){జాతి}[అవయవము]:- చిప్పలు అంటే ఎముకలు - :వంశం - అవయవము;:::::::పద్య సం.(లు) - 8-55-వ.,

[ ⇑ ] :139) చీకటిగొంగ- (పురుష){సంజ్ఞా}[సూర్యవంశం]:- చీకటిగొంగ - చీకటికి గొంగ (శత్రువు), సూర్యుడు. కశ్యపునికి అతని భార్య అదితికి సూర్యుడు, వివశ్వంతుడు పుట్టాడు. సూర్యవంశానికి ఆదిపురుషుడు అయ్యాడు. సూర్యునికి శ్రాద్ధదేవుడు అను వైవశ్వత మనువు పుట్టెను. - :వంశం - సూర్యవంశం;:తండ్రి - కశ్యపుడు;:తల్లి - అదితి;:భార్య - సంజ్ఞాదేవి;::కొడుకు(లు) - వైవశ్వతమనువు;::పద్య సం.(లు) - 9-8-సీ.,

[ ⇑ ] :140) చూడ్కులు- ( -){సంజ్ఞా}[నృత్తము]:- పారిభాషిక పదము - రాసక్రీడ - నృత్తము
చూసెడి విధానాలు - :వంశం - నృత్తము;:::::::పద్య సం.(లు) - 10.1-1084-వ.,

[ ⇑ ] :141) చూత - ( -){జాతి}[వృక్ష]:- మామిడి - ఇవి అష్టమ స్కంధములోని త్రికూట పర్వతములో వర్ణించబడ్డాయి - :వంశం - వృక్ష;:::::::పద్య సం.(లు) - 8-23-సీ., 8-24-వ., 8-25-క.,

[ ⇑ ] :142) చెరలాడు- ( -){జాతి}[ -]:- విహరించు (ఏనుగులు విహరించు) - :వంశం - -;:::::::పద్య సం.(లు) - 8-35-మ.,

[ ⇑ ] :143) చెఱకవిలుతుడు- (పురుష){సంజ్ఞా}[దైవయోని]:- చెఱకు విలుతుడు అంటే చెఱకుగడ ధనుస్సుగా కలవాడు, మన్మథుడు - :వంశం - దైవయోని;:::::::పద్య సం.(లు) - 8-396-వ., 8-447-వ., 10.1-1747-వ.,

[ ⇑ ] :144) చెఱకువింటిజోదు- (పురుష){సంజ్ఞా}[దైవయోని]:- చెఱకువింటిజోదు అంటే చెఱుకుగడ విల్లుగా కల యోధుడు, మన్మథుడు - :వంశం - దైవయోని;:::::::పద్య సం.(లు) - 9-540-వ.,

[ ⇑ ] :145) చెఱకువింటివాడు- (పురుష){సంజ్ఞా}[దైవయోని]:- చెఱకు వింటి వాడు అంటే చెఱుకుగడ వింటివాడు (విల్లుగగ లవాడు), మన్మథుడు - :వంశం - దైవయోని;:::::::పద్య సం.(లు) - 9-391-వ.,

[ ⇑ ] :146) చేది-1 (పురుష){సంజ్ఞా}[చంద్రవంశం]:- చంద్రవంశలోని చేది ఉశికుని కొడుకు. చేది కొడుకులు చైద్యులు. - :వంశం - చంద్రవంశం;:తండ్రి - నుశికుడు;::::కొడుకు(లు) - చైద్యాదులు;::పద్య సం.(లు) - 9-709-వ.,

[ ⇑ ] :147) చేది-2 ( -){సంజ్ఞా}[ప్రాంతం]:- చేది ఒక దేశము పేరు. దమఘోషుడు, శిశుపాలుడు మున్నగువారు ఏలారు. - :వంశం - ప్రాంతం;:::::::పద్య సం.(లు) - 9-722-వ.,

[ ⇑ ] :148) చేది-3 (పురుష){సంజ్ఞా}[చంద్రవంశం]:- దమఘోషుడు చేదిదేశాధీశుడు. ఇతడు వసుదేవుని సోదరి అయిన శ్రుతశ్రవస యందు శిశిపాలుని కనెను. - :వంశం - చంద్రవంశం;:::::కొడుకు(లు) - చైద్యుడు (శిశుపాలుడు);::పద్య సం.(లు) - 9-722-వ.,

[ ⇑ ] :149) చేదిషుడు- (పురుష){సంజ్ఞా}[చంద్రవంశం]:- చంద్రవంశంలోని చేదిషుడు ఉపరిచరవసువు కుమారుడు. ఇతను బృహద్రథ, కుసుంభ, మత్స్య, ప్రత్యగ్ర, చేదిషాదులు అను వసువు కుమారులలో అయిదవవాడు. - :వంశం - చంద్రవంశం;:తండ్రి - ఉపరిచరవసువు;::::::పద్య సం.(లు) - 9-659-వ.,

[ ⇑ ] :150) చైత్ర (మధు)- ( -){సంజ్ఞా}[కాలం]:- సూర్యుడు చైత్ర మాసంలో ధాత అను పేరుతో, కృతస్థలి, పులస్త్యుడు, వాసుకి, హేతి, తుంబురుడు, రథకృత్తు మున్నగువారు అనుచరులుగా కలిగి సంచరిస్తాడు. - :వంశం - కాలం;:::::::పద్య సం.(లు) - 12-41-వ., నుండి 12-45-వ., వరకు

[ ⇑ ] :151) చైత్రరథం- ( -){సంజ్ఞా}[ప్రాంతం]:- చైత్రరథం అంటే కుబేరుని తోట. కర్దమ మహర్షి విమానం ఎక్కి, దేవహూతితోపాటు చైత్రరథం అనే కుబేరుని తోట మున్నుగు వాటిని విహరించాడు. - :వంశం - ప్రాంతం;:::::::పద్య సం.(లు) - 3-822-వ., 5.2-20-వ.

[ ⇑ ] :152) చైద్యుడు- (పురుష){సంజ్ఞా}[చంద్రవంశం]:- చైద్యుడు అంటే శిశుపాలుడు, దమఘోషుడు చేదిదేశాధీశునికి వసుదేవుని సోదరి అయిన శ్రుతశ్రవస యందు కలిగిన కొడుకు, కృష్ణునికి మేనల్లుడు, కృష్ణనిపై పగ పెట్టుకున్నవాడు. కృష్ణుని చేతిలో మరణించి ముక్తుడు అయ్యాడు. కృష్ణుడు చైద్యుడు మున్నగువారిని జయించి రుక్మిణిని చేపట్టాడు. రుక్మిణి అన్న రుక్మి తన చెల్లెలును ఇతనికి ఇవ్వాలని పట్టుపట్టాడు. అతడు ఎంతో ఉత్సాహం చూపాడు. కాని రుక్మిణి కృష్ణుని వరించి పెండ్లాడెను. - :వంశం - చంద్రవంశం;:తండ్రి - చేది;::::::పద్య సం.(లు) - 7-11-ఉ., 10.1-973-మ., 10.1-1682-మ., 10.1-1697-ఉ. 10.1-794-వ.,

[ ⇑ ] :153) చ్యవనుడు-1 (పురుష){సంజ్ఞా}[ఋషి]:- శ్రీకృష్ణుని దర్శించుకోవడానికి వచ్చి వసుదేవునిచే క్రతువు చేయించిన మునీశ్వరులలో ఒక మునీశ్వరుడు. శ్రీకృష్ణుడు బహుళాశ్వుడు శ్రుతదేవుడు లను చూడాలని వెళ్ళినప్పుడు కూడా వెళ్ళిన ఋషులలో ఒకడు. - :వంశం - ఋషి;:::::::పద్య సం.(లు) - 10.1-1117-ఉ., 10.2-1179-వ.,

[ ⇑ ] :154) చ్యవనుడు-2 (పురుష){సంజ్ఞా}[ఋషి]:- పరీక్షిత్తు గంగానది ఒడ్డున ప్రాయోపవిష్టుడై ఉన్నాడని విని, వచ్చిన ఋషులలో ఈయన ఒకరు. - :వంశం - ఋషి;:::::::పద్య సం.(లు) - 1-499-వ.,

[ ⇑ ] :155) చ్యవనుడు-3 (పురుష){సంజ్ఞా}[ఋషి]:- చిత్రకేతుమహారాజు వచ్చిన నారద అంగిరసులను మీరెవరు అంటూ మహర్షులందరి పేర్లు చెప్తూ, చ్యవనమహర్షియా అని కూడా అడిగాడు. - :వంశం - ఋషి;:::::::పద్య సం.(లు) - 6-458-సీ.,

[ ⇑ ] :156) చ్యవనుడు-4 (పురుష){సంజ్ఞా}[ఋషి]:- శర్యాతి పుత్రిక సుకన్యక. ఆమె తన తండ్రితో చ్యవనుని ఆశ్రమానికి వెళ్ళి, అక్కడ ఒక పుట్టలో ప్రకాశిస్తున్న చ్యవన మహర్షి కన్నులు రెండింటిని ముగ్ధత్వము మరిచి మిణుగురు పురుగుల జంట అంటూ, సూదిగా ఉన్న ముల్లుతో పొడిచింది. పిమ్మట తండ్రి వచ్చి ఆమెను చ్యవనుకు ఇచ్చెను. చ్యవనుడు భర్గుని కొడుకు. చ్యవనమహర్షి అశ్వనీ దేవతలకు హవిర్భాగములో సోమపాన యోగ్యత కలిగిస్తాను అని మాట యిచ్చి వారివలన యౌవనం పొందాడు. భార్య సుకన్యతో సంసారం చేసాడు. పిమ్మట మామగారైన శర్యాతి చేత పుత్రకామేష్టి యాగం చేయించి, అశ్వనీ దేవతలకు హవిర్భాగాలు ఇప్పించాడు. ఇంద్రుడు కోపించి ప్రయోగించిన వజ్రాయుధాన్ని నిరోధించాడు. మామగారైన శర్యాతికి ఉత్తానబర్హి, ఆనర్తుడు, భూరిషేణుడు అని ముగ్గురు పుత్రులు పుట్టారు. - :వంశం - ఋషి;:తండ్రి - భర్గుడు;::భార్య - సుకన్యక;::::పద్య సం.(లు) - 9-51-సీ., నుండి 9-70-సీ., వరకు

[ ⇑ ] :157) చ్యవనుడు-5 (పురుష){సంజ్ఞా}[చంద్రవంశం]:- చంద్రవంశంలోని చ్యవనుడు సుహోత్రకుని కొడుకు. ,యవనుని కొడుకు కృతి అనువాడు. - :వంశం - చంద్రవంశం;:తండ్రి - సుహ్రోతుడు;::::కొడుకు(లు) - కృతి;::పద్య సం.(లు) - 9-659-వ.,

[ ⇑ ] :158) చ్యవనుడు-6 (పురుష){సంజ్ఞా}[చంద్రవంశం]:- చంద్రంశంలోని చ్యవనుడు మిత్రాయువు కొడుకు. ఇతని కొడుకు సుదాసుడు - :వంశం - చంద్రవంశం;:తండ్రి - మిత్రాయువు;::::కొడుకు(లు) - సుధాసుడు;::పద్య సం.(లు) - 9-659-వ.,

[ ↑ ] :1) ఛత్రము- (-){జాతి}[పరికరములు]:- ఛత్రములు అంటే గొడుగు - :వంశం - పరికరములు;:::::::పద్య సం.(లు) - 1-259-ఉ., 2-187-శా., 3-55మ., 3-920., 8-327-క., నుండి 8-334-వ., వరకు

[ ⇑ ] :2) ఛాయాదేవి- (స్త్రీ){సంజ్ఞా}[మనువు వంశం]:- ఛాయాదేవి విశ్వకర్మ కూతురు, భర్త సూర్యుని వలన కొడుకులు సావర్ణి, శనైశ్చరులను, కూతురు తపతిని పొందింది. - :వంశం - మనువు వంశం;:తండ్రి - విశ్వకర్మ;:::భర్త - సూర్యుడు;:కొడుకు(లు) - సావర్ణి, శనైశ్చరుడు;:కూతురు(లు)- తపతి;:పద్య సం.(లు) - 6-258-వ., 8-413-సీ.,

[ ↑ ] :1) జంఘాలుడు- (పురుష){సంజ్ఞా}[దైవ యోని]:- జంఘాలుడు అంటే వేగంగా నడచువాడు అని అర్థం. ఇక్కడ జంఘాలుడు కలిపురుషుడు. పరీక్షిన్మహారాజు జైత్రయాత్ర పిమ్మట తిరిగి వెళ్తు, జంఘాలుని రూపంలో ఉన్న కలిపురుషుడు ఎద్దు రూపంలో ఉన్న ధర్మదేవతను తన్నటం చూసాడు. - :వంశం - దైవ యోని;:::::::పద్య సం.(లు) - 1-412-శా.,

[ ⇑ ] :2) జంతువు- (పురుష){సంజ్ఞా}[చంద్రవంశం]:- చంద్రవంశంలోని సుజన్మకృత్తునకు వందమంది పుత్రులు పుట్టారు. వారిలో జంతువు జ్యేష్ఠుడు, పృషతుడు కనిష్ఠుడు; పృషతునకు ద్రుపదుడు; ద్రుపదునకు దృష్టద్యుమ్నుడు మున్నగు పుత్రులు, ద్రౌపది అను పుత్రిక పుట్టారు. - :వంశం - చంద్రవంశం;:తండ్రి - సుజన్మకృత్తు;::::::పద్య సం.(లు) - 9-659-వ.,

[ ⇑ ] :3) జంబీర - ( -){జాతి}[వృక్ష]:- నిమ్మ - ఇవి అష్టమ స్కంధములోని త్రికూట పర్వతములో వర్ణించబడ్డాయి - :వంశం - వృక్ష;:::::::పద్య సం.(లు) - 3-160-మ., 8-24-వ., 10.2-495-సీ., 10.1-1323-వ.,

[ ⇑ ] :4) జంబుకములు- (పురుష){జాతి}[భూచర]:- జంబుకములు అంటే నక్కలు అను జంతువులు. బలి దేవేంద్రుల నేతృత్వంలో జరిగిన సురాసుర యుద్ధంలో రాక్షసులు వీటిని వాహనాలుగా వాడారు. - :వంశం - భూచర;:::::::పద్య సం.(లు) - 8-331-వ.,

[ ⇑ ] :5) జంబూ - ( -){జాతి}[వృక్ష]:- నేరేడు - ఇవి అష్టమ స్కంధములోని త్రికూట పర్వతములో వర్ణించబడ్డాయి - :వంశం - వృక్ష;:::::::పద్య సం.(లు) - 4-135-వ., 8-23-సీ., 8-24-వ., 8-25-క.,

[ ⇑ ] :6) జంబూ ద్వీపము- ( - ){సంజ్ఞా}[ప్రదేశం]:- సప్తద్వీపాలలో ఒకటి. ఆ సప్తద్వీపాల పేర్లు 1.జంబూ ద్వీపము, 2.ప్లక్ష ద్వీపము, 3.శాల్మలీ ద్వీపము, 4.కుశ ద్వీపము, 5.క్రౌంచ ద్వీపము, 6.శాక ద్వీపము, 7.పుష్కర ద్వీపము వీటిని ప్రియవ్రతుడు విభాగించి, తన ఏడుగురు కొడుకులకు అప్పజెప్పాడు..
పద్మాకారమైన భూమి మధ్య జంబూద్వీపం తామరరేకు వలె గుండ్రంగా కనిపిస్తుంది. అది లక్ష యోజనాల పొడవు, లక్షయోజనాల వెడల్పు కలిగి ఉంటుంది. దానిలో గుండ్రటి ఆకారాలతో తొమ్మిది వేల యోజనాల విస్తీర్ణం కలిగిన తొమ్మిది వర్షాలు ఉన్నాయి. వాటి నన్నిటినీ విభజించే సరిహద్దులుగా ఎనిమిది పర్వతాలు ఉన్నవి. ఆ తొమ్మిది వర్షాలలో నట్టనడుమ ఇలావృతం అనే వర్షం ఉంది. దాని నడుమ బంగారు రంగుతో కూడిన మేరుపర్వతం భూమి అనే పద్మానికి కర్ణిక వలె ప్రకాశిస్తున్నది.
జంబూద్వీపానికి చుట్టూ అంతే ప్రమాణం గల లవణసముద్రం ఉంటుంది. - :వంశం - ప్రదేశం;:::::::పద్య సం.(లు) - 5.2-19-వ., 1-278-వ., 5.1-21-సీ., నుండి, 5.1-25-క., 5.1-40-వ.,

[ ⇑ ] :7) జంబూనది- ( - ){సంజ్ఞా}[నది]:- సుమేరు పర్వతానికి దక్షిణాన మేరుమందర పర్వతం ఉంది, ఈ పర్వత శిఖరం మీద పతాకాల లాగా పెద్ద పెద్ద నేరేడు చెట్లు ఉంటాయి.
ఈ మేరుమందర పర్వతం మీద రాలిన పెద్దపెద్ద నేరేడు పండ్లు యొక్క రసం జాలువారుతూ జంబూనది పారుతుంటుంది., ఈ జంబూనది ఇలావృతవర్షాన్ని తడుపుతూ ఉంటుంది.
ఆ జంబూనదీ జలంతో బాగా నానిన మట్టి వాయు సూర్య సంపర్కంవల్ల పరిపక్వమై బంగారంగా మారిపోతుంది. ఆ కారణంగా బంగారానికి జాంబూనదం అనే పేరు వచ్చింది. - :వంశం - నది;:::::::పద్య సం.(లు) - 5.2-20-వ., 5.2-24-ఆ., 5.2-25-క., 5.2-26-ఉ.,

[ ⇑ ] :8) జంభ-1 ( -){జాతి}[వృక్ష]:- జంభ అంటే నిమ్మ చెట్లు అని జంభాసురుడు అని నానార్ర్థాలు ఉన్నాయి. ఈ పదం ప్రథమ స్కంధలో నైమిశారణ్య వర్ణన సందర్భంలో రాక్షసుల యుద్ధాలు} కు ఉపమాన పదంగా వాడబడింది. - :వంశం - వృక్ష;:::::::పద్య సం.(లు) - 1-39-వ.,

[ ⇑ ] :9) జంభ-2 ( -){జాతి}[రాక్షస యోని]:- జంభ అంటే జంభాసురుడు అని నిమ్మ చెట్లు అని నానార్ర్థాలు ఉన్నాయి. ఈ పదం ప్రథమ స్కంధలో నైమిశారణ్య వర్ణన సందర్భంలో రాక్షసుల యుద్ధాలు} ఉపమాన పదంగా వాడబడింది. - :వంశం - రాక్షస యోని;:::::::పద్య సం.(లు) - 1-39-వ.,

[ ⇑ ] :10) జంభవైరి- (పురుష){సంజ్ఞా}[దైవ యోని]:- జంభవైరి అంటే ఇంద్రుడు.
పృథుచక్రవర్తి పట్టాభిషిక్తుడు అయిన సందర్భంలో దేవతలు అందరు వివిధ బహుమానాలు ఇచ్చారు. వారిలో ఇంద్రుడు, కిరీటము ఇచ్చెను - :వంశం - దైవ యోని;:::::::పద్య సం.(లు) - 4-442-సీ.,., 4-443-సీ., 4-467-సీ., 10.1-905-వ.,

[ ⇑ ] :11) జంభాంతకుడు- (పురుష){సంజ్ఞా}[దైవ యోని]:- జంభాంతకుడు అంటే ఇంద్రుడు - :వంశం - దైవ యోని;:::::::పద్య సం.(లు) - 10.1-946-మ.,

[ ⇑ ] :12) జంభారి- (పురుష){సంజ్ఞా}[దైవ యోని]:- జంభారి అంటే ఇంద్రుడు - :వంశం - దైవ యోని;:::::::పద్య సం.(లు) - 6-397-సీ., 6-420-వ., 8-690-మ., 11-67-క.,

[ ⇑ ] :13) జంభాసుర- (పురుష){సంజ్ఞా}[రాక్షస యోని]:- జంభాసురుని కూతురు దత్త అనునామెను హిరణ్యకశిపుడు పెండ్లాడెను. ఇంద్రుని జంభావైరి అని అంటారు.
విష్ణవు ఆజ్ఞమేరకు. సముద్రమథనానకి ఒప్పించడం కోసం బలి చక్రవర్తి కొలువులో చేరి ఇచ్చకాలు నడుపుతున్న దేవతలు జంభాసురుని ఒప్పుకోలు సంపాదించారు.
జంభాసురుడు సురాసర యుద్ధంలో బలి తరఫున యుద్ధం చేసాడు. బలి ఓడిన పిమ్మట ఇంద్రునిపైకి వెళ్ళి భీకర యుద్ధం చేసి ఇంద్రుని చేతిలో మరణించాడు.
జంభాసురుని సోదరులు మహా బలవంతులైన బలుడు, పాకుడు, నముచి ఇతని పిమ్మట ఇంద్రునితో భీకర యుద్ధం చేసి మరణించారు. - :వంశం - రాక్షస యోని;::::::కూతురు(లు)- దత్త;:పద్య సం.(లు) - 6-507-వ., 1-39-వ., 8-182-వ., 8-331-వ., నుండి 8-379-వ. వరకు, 10.1905-వ.,

[ ⇑ ] :14) జగతి- ( -){సంజ్ఞా}[భగణ విషయం]:- సూర్యుని రథానికి పూన్చిన సప్తాశ్వాలులో ఒకటి - :వంశం - భగణ విషయం;:::::::పద్య సం.(లు) - 5.2-82-సీ.,

[ ⇑ ] :15) జగత్పతి- (పురుష){సంజ్ఞా}[దైవ యోని]:- జగత్పతి అంటే విష్ణువు - :వంశం - దైవ యోని;:::::::పద్య సం.(లు) - 1-190-మత్త., 1-389-వ., 2-236-మ.,

[ ⇑ ] :16) జగదదధీశ్వరుడు- (పురుష){సంజ్ఞా}[దైవ యోని]:- జగదధీశ్వరుడు అంటే జగత్తునకు అధీశ్వరుడు, విష్ణువు, కృష్ణుడు - :వంశం - దైవ యోని;:::::::పద్య సం.(లు) - 10.1-350-ఆ., 4-13-క.,

[ ⇑ ] :17) జగదీశుడు- (పురుష){సంజ్ఞా}[దైవ యోని]:- జగదీశ అంటే జగత్తునకు ఈశుడు - :వంశం - దైవ యోని;:::::::పద్య సం.(లు) - 1-374-చ., 4-555-సీ., 6-307-వ., 6-344-క., 6-438-చ., 7-193-ఉ., 8-385-సీ., 8-477-మ., 10.1-622-ఉ., 10.1-1180-సీ.,

[ ⇑ ] :18) జగదీశ్వరి- (స్త్రీ){సంజ్ఞా}[దైవ యోని]:- జగదీశ్వరి - అంటే జగత్తుకు ఈశ్వరి, లక్ష్మీదేవి. - :వంశం - దైవ యోని;:::::::పద్య సం.(లు) - 4-4-వ.,

[ ⇑ ] :19) జగదీశ్వరుడు- (పురుష){సంజ్ఞా}[దైవ యోని]:- జగదీశ్వరుడు అంటే జగత్తునకు ఈశ్వరుడు, విష్ణువు, కృష్ణుడు. - :వంశం - దైవ యోని;:::::::పద్య సం.(లు) - 1-436-వ., 4-276-చ., 4-421-వ., 7-108-ఉ., 7-334-క., 8-653-వ., 10.1-716-వ., 10.1-869-క., 10.1-869-వ., 10.2-227-వ., 10.2-256-వ., 11-8-వ.,

[ ⇑ ] :20) జగన్నాథుడు- (పురుష){సంజ్ఞా}[దైవ యోని]:- జగత్పతి అంటే విష్ణుమూర్తి - :వంశం - దైవ యోని;:::::::పద్య సం.(లు) - 2-203-దం., 6-221-వ., 7-12-మ., 7-271-శా., 8-633-క., 8-659-సీ., 9-226-మ., 8376-సీ., 10.2-220-సీ., 11-57-సీ.,

[ ⇑ ] :21) జగన్మయ- (పురుష){సంజ్ఞా}[దైవ యోని]:- జగన్మయ అంటే జగత్తు అంతా తానైన వాడు, విష్ణువు, - :వంశం - దైవ యోని;:::::::పద్య సం.(లు) - 8-385-సీ.,

[ ⇑ ] :22) జగన్మోహిని-1 (స్త్రీ){సంజ్ఞా}[దైవయోని]:- జగన్మోహినీ అవతారము ప్రథమ స్కంధములో వివరించిన వైష్ణవ అవతారాలలో ప్రధానమైన ఏకవింశ త్యవతారములు (21) అందలి 13 వ. అవతారం (1-63-వ.)
అమృతమథన సమయంలో విష్ణుమూర్తి జగన్మోహన అవతారమెత్తి అసురుల శాంతింపజేసి, అమృతము అంతా దేవతలకు పంచాడు. - :వంశం - దైవయోని;:::::::పద్య సం.(లు) - 1-63-వ., 8-301-సీ., 8-320-ఆ.,

[ ⇑ ] :23) జగన్మోహిని-2 (స్త్రీ){సంజ్ఞా}[దైవయోని]:- జగన్మోహినీ రూపాన్ని విష్ణుమూర్తి, పరమశివుని కోరినట్లు ఎత్తి అలరించాడు. - :వంశం - దైవయోని;:::::::పద్య సం.(లు) - 8-396-వ.,

[ ⇑ ] :24) జటాపుడు- (పురుష){సంజ్ఞా}[మానవ యోని]:- పరీక్షిత్తునకు భవిష్యత్తు కాలంలోని రాజుల యుత్పత్తిలో ఆంధ్రుడైన వృకునకు జటాపుడు పుత్రుడు. జటాపుని పుత్రుడు శివస్వాతి. అతనికి అరిందముడు పుట్టేను. - :వంశం - మానవ యోని;:తండ్రి - వృకుడు;::::కొడుకు(లు) - శివస్వాతి;::పద్య సం.(లు) - 12-8-వ.,

[ ⇑ ] :25) జటాయువు- ( -){సంజ్ఞా}[గగనచర]:- రావణాసురుడు సీతను కొనిపోతుంటే, జటాయువు గొప్ప పరాక్రమంతో అడ్డుకుని రావణుని చేతిలో దెబ్బతింది. శ్రీరాముడు సీతను వెతుకుతూ వచ్చి జటాయువును చూసి పరలోకక్రియలు చేసాడు. - :వంశం - గగనచర;:::::::పద్య సం.(లు) - 9-270-ఉ., 9-271-వ.,

[ ⇑ ] :26) జటి పటల-1 ( -){జాతి}[వృక్ష]:- జటి పటల అంటే జువ్వి చెట్లు అని ముని సమూహముల అని నానార్ర్థాలు ఉన్నాయి. ఈ పదం ప్రథమ స్కంధలో నైమిశారణ్య వర్ణన సందర్భంలో శివుడి సభ} కు ఉపమాన పదంగా వాడబడింది. - :వంశం - వృక్ష;:::::::పద్య సం.(లు) - 1-39-వ.,

[ ⇑ ] :27) జటి పటల-2 ( -){జాతి}[ఋషి]:- జటి పటల అంటే ముని సమూహముల అని జువ్వి చెట్లు అని నానార్ర్థాలు ఉన్నాయి. ఈ పదం ప్రథమ స్కంధలో నైమిశారణ్య వర్ణన సందర్భంలో శివుడి సభ} ఉపమాన పదంగా వాడబడింది. - :వంశం - ఋషి;:::::::పద్య సం.(లు) - 1-39-వ.,

[ ⇑ ] :28) జఠరగిరి పర్వతం- ( - ){సంజ్ఞా}[పర్వతం]:- మేరుపర్వతానికి తూర్పుభాగంలో జఠరగిరి, దేవకూటం అనే పర్వతాలున్నాయి. పడమట పవనగిరి, పారియాత్రం అనే పర్వతాలున్నాయి. ఈ నాలుగు పర్వతాలు ఒక్కొక్కటి దక్షిణం నుండి ఉత్తరం వరకు పద్దెనిమిది యోజనాల పొడవు, తూర్పు నుండి పడమటి వరకు రెండువేల యోజనాల వెడల్పు కలిగి ఉంటాయి. - :వంశం - పర్వతం;:::::::పద్య సం.(లు) - 5.2-30-వ.,

[ ⇑ ] :29) జతుగృహము- ( -){జాతి}[ ]:- జతుగృహము అంటే లక్కయిల్లు, కుంతి స్తుతిలో, జతుగృహము (లక్కయింటి)లో మేము కాలిపోకుండా కాపాడావు అని కుంతి అంటుంది - :వంశం - ;:::::::పద్య సం.(లు) - 1-189-క.

[ ⇑ ] :30) జనకజ- (స్త్రీ){సంజ్ఞా}[సూర్యవంశం]:- జనకజ అంటే సీతాదేవి. - :వంశం - సూర్యవంశం;:::::::పద్య సం.(లు) - 9-266-క., 9-319-సీ.,

[ ⇑ ] :31) జనకనందన- (స్త్రీ){సంజ్ఞా}[సూర్యవంశం]:- జనకనందన అంటే సీత - :వంశం - సూర్యవంశం;:::::::పద్య సం.(లు) - 9-269-సీ.,

[ ⇑ ] :32) జనకసుత- (స్త్రీ){సంజ్ఞా}[సూర్యవంశం]:- జనకసుత అంటే జనకమహారాజు పుత్రిక సీతాదేవి. - :వంశం - సూర్యవంశం;:::::::పద్య సం.(లు) - 3-1052-చ., 4-975-క., 9-734-క., 12-52-క.,

[ ⇑ ] :33) జనకాత్మజ- (స్త్రీ){సంజ్ఞా}[సూర్యవంశం]:- లక్ష్మణుడు, సీత రాముడి వెంట అడవులకు వెళ్ళారు. - :వంశం - సూర్యవంశం;:::::::పద్య సం.(లు) - 2-162-చ.,

[ ⇑ ] :34) జనకుడు-1 (పురుష){సంజ్ఞా}[చంద్రవంశం]:- జనకుడు చంద్రవంశపు రాజు. శ్యమంతకమణి కోసం వెతుకుతూ బలరాముడు మిథిలానగరానికి వైదేహుడైన రాజు జనకుని కోసం వెళ్ళాడు. కొద్ది రోజులు జనకుని కోరికమేర అక్కడ ఉన్నాడు. ఆ సమయంలో దుర్యోధనుడు వచ్చి బలరాముని వద్ద గధాయుద్ధం నేర్చుకున్నాడు. - :వంశం - చంద్రవంశం;:::::::పద్య సం.(లు) - 10.2-92-సీ.,

[ ⇑ ] :35) జనకుడు-2 (పురుష){సంజ్ఞా}[సూర్యవంశం]:- వైష్ణవ జ్ఞానాన్ని స్థిరంగా తెలుసుకున్నవారిలో జనకుడు ఒకరు. - :వంశం - సూర్యవంశం;:::::::పద్య సం.(లు) - 6-178-సీ.,

[ ⇑ ] :36) జనకుడు-3 (పురుష){సంజ్ఞా}[సూర్యవంశం]:- జనకుడు సూర్యవంశపు రాజు. నిమి మరణానంతరం రాజులేమి చూసి, మునులు నిమి కళేబరాన్ని మథించంచగా పుట్టిన వాడిని జనకుడు అన్నారు. విదేహానికి పుట్టినవాడు కనుక వైదేహుడు, మథించుట వలన పుట్టినవాడు కనుక మిథిలుడు అని పేర్లు పొందాడు. మిథిలానగరాన్ని నిర్మించాడు. సీరధ్వజుడు, మన సీతమ్మతల్లికి తండ్రి, ఇతని వంశస్థుడే. - :వంశం - సూర్యవంశం;:::::::పద్య సం.(లు) - 9-371-ఆ.,

[ ⇑ ] :37) జనమేజయుడు-1 (పురుష){సంజ్ఞా}[చంద్రవంశం]:- చంద్రవంశపు జనమేజయుడు, తండ్రి అర్జున పౌత్రుడు పరీక్షిత్తు మహారాజు తల్లి ఇరావతి. జనమేజయునికి రాజ్యం అప్పజెప్పి, శృంగిశాపం వినిన పరీక్షిత్తు ప్రాయోపవేశంలో కూర్చున్నాడు.
జనమేజయునకు శ్రుతసేనుడు, భీమసేనుడు, ఉగ్రసేనుడు అని ముగ్గురు తమ్ముళ్ళు ఉన్నారు. జనమేజయుడు తండ్రి మరణానికి పగబట్టి సర్పయాగం చేసాడు. ఇంకా జనమేజయుడు సమస్త భూమండలం జయించి కావషేయుడిని పురోహితునిగా పెట్టుకుని అశ్వమేధయాగం చేస్తాడు. జనమేజయుని కొడుకు శతానీకుడు. జనమేజయుడు చేసిమ సర్పయాగంలో వేల వేలు పాములు నాశనమై పోయాయి. తక్షకుడు రాకుండా ఇంద్రుని మందిరంలో ఉండటం తెలుసుకుని ఋత్విజుడు (సహేంద్రతక్షకాయానుబ్రూహి) అని పలికడం తోటి తక్షకుని తోపాటు ఇంద్రుడు కూడ విమానంతో సహా తన స్థానం నుంచి పడుతుండగా, ఆ సమయానికి అంగీరసుడు వచ్చి శాంతించి కోపాన్ని విడచిపెట్టు. ఇప్పటికే లెక్కలేనన్ని సర్పాలు మృతిచెందాయి. అని చెప్పాడు. గురువు ఉపదేశం ప్రకారం జనమేజయుడు సర్పయాగాన్ని ఆపివేశాడు. - :వంశం - చంద్రవంశం;:తండ్రి - పరీక్షిత్తు;:తల్లి - ఇరావతి;:::కొడుకు(లు) - శతానీకుడు;::పద్య సం.(లు) - 1-391-వ., 1-508-వ., 9-677-వ., 9-678-ఆ., 9-679-వ., 12-26-వ., 12-28-వ.,

[ ⇑ ] :38) జనమేజయుడు-2 (పురుష){సంజ్ఞా}[తృణబిందు వంశం]:- జనమేజయుడు వైశాలురు అని పేరుపడ్డ రాజులలో ఒకరు. వీరి తండ్రి గొప్ప అశ్వమేధయాగం చేసిన సోమదత్తుని కొడుకు సుమతి. - :వంశం - తృణబిందు వంశం;:తండ్రి - సుమతి;::::::పద్య సం.(లు) - 6-49-ఆ.,

[ ⇑ ] :39) జనమేజయుడు-3 (పురుష){సంజ్ఞా}[చంద్రవంశం]:- జనమేజయుడు చంద్రవంశంలోని పూరువు కొడుకు. ఈ పూరువు పేరనే పురువంశం ఏర్పడింది. జనమేజయునకి కొడుకు ప్రాచీన్వాంసుడు. ఆ ప్రాచీన్వాంసునకు ప్రవిరోధనమన్యువు పుట్టాడు. - :వంశం - చంద్రవంశం;:తండ్రి - పూరువు;::::కొడుకు(లు) - ప్రాచీనాంస్వుడు;::పద్య సం.(లు) - 9-593-వ.,

[ ⇑ ] :40) జనమేజయుడు-4 (పురుష){సంజ్ఞా}[చంద్రవంశం]:- జనమేజయుడు చంద్రవంశంలోని సృంజయుని కొడుకు పురంజయునకు కొడుకు. జనమేజయుని కొడుకు మహాశాలుడు. మహాశాలునికి మహామనసుడు పుట్టాడు. - :వంశం - చంద్రవంశం;:తండ్రి - పురంజయుడు;::::కొడుకు(లు) - మహాశాలుడు;::పద్య సం.(లు) - 9-683-వ.,

[ ⇑ ] :41) జనలోకం- ( -){సంజ్ఞా}[ప్రాంతం]:- జనలోకం అంటే చతుర్దశ లోకాలలో ఉండే ఊర్ధ్వలోకాలలో నొకటి.
విరాట్పురుషుని విగ్రహంలో జనలోకం ముఖము. శ్రీమహావిష్ణువు దేహంలో కంఠం జనలోకం.,
బ్రహ్మదేవుని రాత్రి సమయంలో లోకాలన్నీ చీకట్లో మునిగిపోతాయి. అప్పుడు మహర్లోకవాసులు జనలోకానికి వెళ్తారు.
జనలోకవాసులు స్తుతిస్తుండగా విష్ణువు శేషతల్పశాయి అయి ఉంటాడు. - :వంశం - ప్రాంతం;:::::::పద్య సం.(లు) - 2-16-వ., 2-89-వ., 3-357-క.,

[ ⇑ ] :42) జనార్దనుడు- (పురుష){సంజ్ఞా}[దైవయోని]:- జనార్దనుడు అంటే విష్ణువు, కృష్ణుడు. బ్రహ్మదేవుడు జనార్దనుని గురించి ధ్యానం చేసాడు
హిరణ్యాక్షుడు జనార్దునునితో యుద్దానికి వైకుంఠం బయలుదేరుతుంటే, నారదుడు వచ్చి అతను ఇప్పుడు రసాతలంలో ఉన్నాడు అక్కడకే వెళ్ళు అతనితో యుద్ధం జరుగుతుంది, నీపని అవుతుంది అనిచెప్పాడు.
జనార్దనుడు ప్రత్యక్షమై కర్దమునికి స్వాయంభువ మనువు వచ్చి కూతురు శతరూపను ఇస్తాడు, ఆమెను వివాహమాడి సంతానం కనుమని చెప్పాడు
పిమ్మట, శతరూప పుత్రుడులేడని విచారిస్తుంటే, కర్దముడు జనార్దనుడు నీకు కొడుకై పుడతాడు. అని చెప్పి ఓదార్చాడు. అలాగే కపిలుడు పుట్టాడు.
జనార్దనుడు ఉదయం, మధ్యాహ్నం, పట్టపగలు, సాయంకలం, మునిమాపువేళ, అర్ధరాత్రి, అపరాత్రి, పత్యూషకాలం, సంధికాలాలు, ప్రభాతం అనే సకల సమయాలలో కాపాడు గాక అని విశ్వరూపుడు దేవేంద్రునికి ఉపదేశించిన శ్రీమన్నారాయణ కవచంలో ఉన్న నలభైతొమ్మిది స్తుతులలో ఇది ఒకటి.
విష్ణువు ద్వాపరయుగంలో నీలవర్ణంతో, పసుపుపచ్చని బట్టలు కట్టుకుని, రెండు చేతులతో, దివ్యమైన ఆయుధాలు పట్టుకుని, శ్రీవత్సం కౌస్తుభం వనమాలికల ప్రకాశిస్తూ; మహారాజ లక్షణాలు కలిగి జనార్ధునుడు, వాసుదేవుడు, సంకర్షుణుడు, ప్రద్యుమ్నుడు, అనిరుద్ధుడు, నారాయణుడు, విశ్వరూపుడు, సర్వభూతాత్మకుడు మున్నగు పేర్లతో వెలసి చక్రవర్తులచేత సన్నుతించబడతాడు. అని కరభాజన ఋషి విదేహరాజుకు చెప్పాడు - :వంశం - దైవయోని;:::::::పద్య సం.(లు) - 2-35-వ., 3-626-ఉ., 3-666-చ., 3-759., 3-833-క., 4-51-సీ., 4-592-వ., 4-877-సీ., 6-9-చ., 6-307-వ., 7-217-వ., 7-386-మ., 8-340-క., 8-477-మ., 10.1-195-మ., 10.1-922-వ., 10.1-1118-చ., 10.1-1145-ఉ., 10.1-1488-మ., 10.2-165-వ., 11-48-వ., 11-60-వ., 11-77-వ., 11-94-వ., 11-112-క., 12-13-వ., 11-18-వ., 11-26-వ.,

[ ⇑ ] :43) జమదగ్ని- (పురుష){సంజ్ఞా}[ఋషి]:- జమదగ్ని పరశురాముని తండ్రి.
జమదగ్నీ, గౌతముడూ, కశ్యపుడూ, అత్రీ, విశ్వామిత్రుడు, భరద్వాజుడూ, వసిష్టుడూ ఏడవవదీ ప్రస్తుతపుది అయిన వైవశ్వతమన్వంతరంలో సప్త ఋషులు.
హరిశ్చంద్రుని కొడుకు తండ్రి యాగంకోసం బలిపశువుగా శునశ్శేపుని తీసుకొచ్చాడు. ఆ యాగానికి హోత విశ్వామిత్రుడు; అధ్వర్యుడు భృగువు; ఋత్వికుడు జమదగ్ని.
ఋషి ఋచికుడు తన అత్తగారికి క్షత్రియ పుత్రుడు, భార్య సత్యవతికి బ్రాహ్మణ పుత్రుడు కలగాలని యజ్ఞం చేసి రెండు చరువులు చేసాడు. పొరపాటున మారిపోవడంతో సత్యవతికి నీ కొడుకు కాదు గాని నీ మనుమడు క్రూరుడౌతాడు అని ఋచికుడు అనుగ్రహించాడు. అలా సత్యవతికి జమదగ్ని పుట్టాడు.ఆ సత్యవతి కౌశకీనది అయింది. జమదగ్ని రేణువు కూతురు రేణుకను వివాహమాడి వసుమనాది పుత్రులను కన్నాడు. అలా జమదగ్ని రేణుకలకు పుట్టినవారిలో పరశురాముడు కడపటివాడు. ఆ పరశురాముడు లోకంలోని రాజులను ఇరవైయేడు మార్లు సంహరించాడు. ఒకమారు కార్తవీర్యార్జునుడు వేటకు వచ్చి జమదగ్ని ఆశ్రమానికి వచ్చి భోజనం తిని, బలవంతంగా కామధేనువైన హోమధేనువును తీసుకుపోయాడు. పరశురాముడు వచ్చి కోపించి కార్తవీర్యార్జుని సంహరించి గోవును వెనక్కి తెచ్చాడు. అప్పుడు జమదగ్ని "దేశాన్నేలే రాజు బ్రహ్మహత్యా కంటే పెద్ద తప్పు" అని చెప్పి ఆ పాపానికి పరిహారంగా తీర్థయాత్రలు చేయమన్నాడు. ఆ ప్రకారం పరశురాముడు ఏడాదిపాటు తీర్థయాత్రలు చేసాడు. ఒకనాడు జమదగ్ని భార్య రేణుక నీటికై ఏటికి వెళ్ళి, అక్కడ గంధర్వరాజు వైభోగం చూస్తూ నీరు తేవడంలో ఆలస్యం చేసింది. అది తెలిసిన జమదగ్ని తన కొడుకులను పిలిచి తల్లిని నరకమన్నాడు. వారు అంగీకరించలేదు. ఈలోగా వచ్చిన పరశురాముని తల్లిని అన్నలను నరకమని జమదగ్ని చెప్పాడు. పరశురాముడు అలాగ నరికేశాడు. సంతోషించిన తండ్రి వరం కోరుకోమంటే. తల్లిని అన్నలను బ్రతికించ మని వరంకోరి, తల్లిని అన్నలను మరల పునరుజ్జీవులను చేశాడు. పగ పట్టిన కార్యవీర్యార్జుని రాకుమారులు అదను చూసి జమదగ్నిని నరికేసారు. రేణుక పరశురాముని పిలిచి ఇరవైఏడు మారులు మొరలు పెట్టుకుంది, దానితో పగబట్టి పరశురాముడు రాజులను అందరిని ఇరవైఏడు మార్లు సంహరించాడు. ఇంకా. ఆ పరశురాముడు శమంత పంచకం వద్ద క్షత్రియ రక్తాలతో తొమ్మిది మడుగులు చేసాడు. తండ్రి తలను తీసుకొని వచ్చి శరీరంతో చేర్చాడు. అలా కుమారుని వలన సంకల్ప శరీరం పొంది జమదగ్ని తన తపో శక్తివలన ఆకాశంలో సప్తర్షిమండలంలో ఏడవ ఋషిగా ప్రకాశిస్తున్నాడు. రాబోయే మన్వంతరంలో ఈ జమదగ్ని కుమారుడైన పరశురాముడు సప్తర్షు లలో ఒకడు అవుతాడు.
ఆశ్వయుజమాసంలో సూర్యుడు త్వష్ట్ర అనే పేరుతో సంచరిస్తుంటే ఋచీక తనయుడైన జమదగ్ని, కంబళాశ్వుడు అనే నాగుడు మున్నగు పరిచరులు కూడా సంచరిస్తారు. - :వంశం - ఋషి;:తండ్రి - ఋచికుడు;:తల్లి - సత్యవతి;:భార్య - రేణుక;::కొడుకు(లు) - పరశురాముడు, వసుమనాదులు;::పద్య సం.(లు) - 2-153-మ., 8-412-వ., 9-200-సీ., 9-426-వ., నుండి 9-491-క., 10.2-1037-సీ., 12-43-వ.,

[ ⇑ ] :44) జమదగ్నిరాముడు- (పురుష){సంజ్ఞా}[ఋషి]:- జమదగ్నిరాముడు అంటే పరశురాముడు, జమదగ్నికి రేణుక కుమారులలో చిన్నవాడు. పరశురాముడు రాజులను అందరిని ఇరవైఏడు మార్లు సంహరించి శమంత పంచకం వద్ద వారి రక్తాలతో తొమ్మిది మడుగులు చేసాడు. అది శ్యమంతకపంచకము అని పుణ్యక్షేత్రముగా ప్రసిద్ది పొందింది. బలరామకృష్ణులు సూర్యగ్రహణ సమయంలో ఈ క్షేత్రానికి విచ్చేసారు. - :వంశం - ఋషి;:తండ్రి - జమదగ్ని;:తల్లి - రేణుక;:::::పద్య సం.(లు) - 10.2-1037-సీ.

[ ⇑ ] :45) జముడు- (పురుష){సంజ్ఞా}[దేవయోని]:- యముడు (ప్ర) - జముడు (వి) - :వంశం - దేవయోని;:::::::పద్య సం.(లు) - 1-145-వ., 4-140-సీ., 6-76-క., 7-326-క., 10.1-1502-క.

[ ⇑ ] :46) జయంతి- (స్త్రీ){సంజ్ఞా}[ప్రియవ్రతుని వంశం]:- జయంతి నక్తుని కుమారుడైన గయుని భార్య, “జయంతి” యందు భర్త గయునికి “చిత్రరథుడు”, “స్వాతి”, “అవరోధకుడు” అనే ముగ్గురు కొడుకులు పుట్టారు. - :వంశం - ప్రియవ్రతుని వంశం;::::భర్త - గయుడు;:కొడుకు(లు) - చిత్రరథుడు; స్వాతి; అవరోధనుడు;::పద్య సం.(లు) - 5.2-11-క.,

[ ⇑ ] :47) జయంతి (స్త్రీ)- (స్త్రీ){సంజ్ఞా}[ప్రియవ్రతుని వంశం]:- ఋషభుని భార్య. దేవంద్రుని కూతురు." భరతుడు" మున్నగు వందమంది (100) మంది కొడుకులకు తల్లి. ఆ భరతుని పేరనే భారతదేశం అని పేరు వచ్చింది... - :వంశం - ప్రియవ్రతుని వంశం;:తండ్రి - దేవేంద్రుడు;:::భర్త - ఋషభుడు;:కొడుకు(లు) - భరతుడు, కుశావర్తుడు, ఇలావర్తుడు, బ్రహ్మావర్తుడు, ఆర్యావర్తుడు, మలయకేతువు, భద్రసేనుడు, ఇంద్రస్పృశుడు, విదర్భుడు, కీకటుడు, కవి, హరి, అంతరిక్షుడు, ప్రబుద్ధుడు, పిప్పలాయనుడు, అవిర్హోత్రుడు, ద్రమీఢుడు, చమనుడు, కరభాజనుడు మున్నగు వందమంది పుత్రులు;::పద్య సం.(లు) - 5.1-63-సీ.,., 5.1-64-వ.,

[ ⇑ ] :48) జయంతుడు-1 (పురుష){సంజ్ఞా}[దేవయోని]:- త్రేతాయుగములో శ్రీమహావిష్ణువును జంయంతుడు అని కూడా ఆరాధిస్తారు. కృతయుగంలో తెల్లని రంగుతో నాలుగుచేతులు కలిగి ఉంటాడు; జడలు నారచీరలు జింకచర్మం జపమాలిక దండం కమండలము దాల్చి నిర్మలమైన తపస్సు ధ్యానము అనుష్టానము గల మునిశ్రేష్ఠులచేత హంసుడు, సుపర్ణుడు, వైకుంఠుడు, ధర్ముడు, అమలుడు, యోగీశ్వరుడు, ఈశ్వరుడు, పురుషుడు, అవ్యక్తుడు, పరమాత్ముడు అనే దివ్య నామాలతో ప్రశంసింపబడుతూ ప్రసిద్ధి చెందుతాడు. త్రేతాయుగంలో ఎఱ్ఱనిరంగుతో, నాలుగుచేతులు బంగరురంగు జుట్టు కలిగి, మూడు పేటల మేఖలలు ధరించి, మూడువేదాల ఆకృతి ధరించి, స్రుక్కు స్రువము మొదలైన ఉపలక్షణాలతో శోభిల్లుతూ; విష్ణువు, యజ్ఞుడు, పృశ్నిగర్భుడు, సర్వదేవుడు, ఉరుక్రముడు, వృషాకపి, జయంతుడు, ఉరుగాయుడు అనే పేర్లతో బ్రహ్మవాదులచేత నుతింపబడతాడు. ద్వాపరయుగంలో నీలవర్ణంతో, పసుపుపచ్చని బట్టలు కట్టుకుని, రెండు చేతులతో, దివ్యమైన ఆయుధాలు పట్టుకుని, శ్రీవత్సం కౌస్తుభం వనమాలికల ప్రకాశిస్తూ; మహారాజ లక్షణాలు కలిగి జనార్ధునుడు, వాసుదేవుడు, సంకర్షుణుడు, ప్రద్యుమ్నుడు, అనిరుద్ధుడు, నారాయణుడు, విశ్వరూపుడు, సర్వభూతాత్మకుడు మున్నగు పేర్లతో వెలసి చక్రవర్తులచేత సన్నుతించబడతాడు. కలియుగంలో నల్లనిరంగుతో కృష్ణుడు అనుపేరు కలిగి, భక్తులను రక్షించడానికి పుండరీకాక్షుడు యజ్ఞములందు కీర్తించబడతాడు. అప్పుడు ఆయనను హరి, రాముడు, నారాయణుడు, నృసింహుడు, కంసారి, నళినోదరుడు మున్నగు పేర్లతో బ్రహ్మవాదులైన మునీంద్రులు స్తుతిస్తూంటారు. - :వంశం - దేవయోని;:::::::పద్య సం.(లు) - 11-77-వ.

[ ⇑ ] :49) జయంతుడు-2 (పురుష){సంజ్ఞా}[దైవయోని]:- విష్ణువు త్రేతాయుగంలో ఎర్రనిరంగుతో, నాలుగుచేతులు బంగరురంగు జుట్టు కలిగి, మూడు పేటల మేఖలలు ధరించి, మూడువేదాల ఆకృతి ధరించి, స్రుక్కు స్రువము మొదలైన ఉపలక్షణాలతో శోభిల్లుతూ; విష్ణువు, యజ్ఞుడు, పృశ్నిగర్భుడు, సర్వదేవుడు, ఉరుక్రముడు, వృషాకపి, జయంతుడు, ఉరుగాయుడు అనే పేర్లతో బ్రహ్మవాదులచేత నుతింపబడతాడు. అని కరభాజన ఋషి విదేహరాజుకు చెప్పాడు - :వంశం - దైవయోని;:::::::పద్య సం.(లు) - 11-77-వ.,

[ ⇑ ] :50) జయంతుడు-3 (పురుష){సంజ్ఞా}[దేవయోని]:- ద్వాదశాదిత్యులలో పదకొండవవా డైన ఇంద్రునికి శచీదేవి వల్ల జయంతుడు, ఋషభుడు, విదుషుడు అనే కుమారులు కలిగారు.ఈ జయంతుడు గొప్ప అందగాడు.
అదితి భర్త కశ్యపునితో బలి, దైత్యులు వలన దేవతలు పలుబాధలు పడుతున్నారు. సచీదేవీ ఇంద్రుల కొడుకు జయంతుడు మున్నగు వారు బోయపిల్లల వెంట తిరుగుతున్నారు. అంటూ తన బాధ చెప్పుకుంది.
మాంధాత మహారాజుకి 50 మంది కూతుళ్ళు. 50 మంది సుందరీమణులు అందరూ అలా చూడ వచ్చిన సౌభరిమునిని చూసి ఇతడు నలకూబరుడొ, మన్మథుడొ, "జయంతుడొ" పొరపాటున వచ్చాడు అనుకున్నారు, వరించారు, తండ్రి వారందరినీ ఆ మునికి ఇచ్చి వివాహం చేసాడు. - :వంశం - దేవయోని;:తండ్రి - ఇంద్రుడు;:తల్లి - సచీదేవి;:::::పద్య సం.(లు) - 6-507-వ., 8-471-సీ., 9-177-ఉ.

[ ⇑ ] :51) జయంతుడు-4 (పురుష){సంజ్ఞా}[దేవయోని]:- వామనుడు త్రివిక్రమావతారం ఎత్తాక, బలిచక్రవర్తిను బంధింపజేస్తుంటే, రాక్షసులు ఆయనమీదకి వెళ్ళడానికి సమాయత్తం కాసాగారు. అప్పడు విష్ణుసేవకులైన జయంతుడూ, సునందుడూ, నందుడూ, జయుడూ, విజయుడూ, ప్రబలుడూ, ఉద్బలుడూ, కుముదుడూ, కుముదాక్షుడూ, గరుడుడూ, పుష్పదంతుడూ, విష్వక్సేనుడూ, శ్రుతదేవుడూ, సాత్వతుడూ మొదలైన వారు రాక్షసులను ఎదుర్కోడానికి సమాయత్తం అయ్యారు - :వంశం - దేవయోని;:::::::పద్య సం.(లు) - 8-634-వ.

[ ⇑ ] :52) జయంతుడు-5 (పురుష){సంజ్ఞా}[విశ్వామిత్రుడు]:- ఈ జయంతుడు విశ్వామిత్రుని వందమంది కుమారులలో ఒకడు. తండ్రి మాట వినక. ఆయన పెంపుడప కొడుకు శునశ్శేపుని అన్నగా అంగీకరించక వెళ్ళిపోయిన ఏభైమందిలో కొడుకులలో ఒకడు. విశ్వామిత్రుని ఆదేశంగా అతని కుమారులలో మధుచ్ఛదుడు మున్నగు ఏభైమంది ఆ దేవరాతునికి తమ్ముళ్ళు అయ్యారు. పెద్దవాళ్ళు అయిన అష్టకుడు, హారితుడు, జయంతుడు, సుమదుడు మున్నగువారు ఏభైమంది విడిపోయి వెళ్ళిపోయారు. అలా విశ్వామిత్రుని పుత్రులు రెండు తెగలుగా కాగా గోత్రభేదం కలిగింది. - :వంశం - విశ్వామిత్రుడు;:::::::పద్య సం.(లు) - 9-497-వ.

[ ⇑ ] :53) జయంతుడుఉపేంద్రుడు- (పురుష){సంజ్ఞా}[దక్ష వంశం]:- జయంతుడు ధర్ముని కొడుకు. దక్షుడు తన భార్య అసిక్ని యందు కలిగిన అరవై మంది కూతుర్లలో పదిమందిని ధర్మునకు ఇచ్చాడు. వారిలో ఏడవయామె మరుత్వతి. ధర్మునకు భార్య మరుత్వతి యందు మరుత్వంతుడు జయంతుడు అని ఇద్దరు పుత్రులు పుట్టారు. ఈ జయంతుడు వాసుదేవాంశుడు కనుక ఉపేంద్రుడు అని కూడా అంటారు. - :వంశం - దక్ష వంశం;:తండ్రి - ధర్ముడు;:తల్లి - మరుత్వతి ;:::::పద్య సం.(లు) - 6-254-వ.,

[ ⇑ ] :54) జయత్సేనుడు-1 (పురుష){సంజ్ఞా}[చంద్రవంశం]:- జయత్సేనుడు చంద్రవంశపు కృతవృద్ధుని వంశంలోని భీమునకు పుత్రుడు. జయత్సేనునకు సంకృతి; సంకృతికి జయుడు; జయునికి క్షత్రధర్ముడు జనించారు. వీరంతా క్షత్రవృద్ధుని వంశంలోని రాజులు. - :వంశం - చంద్రవంశం;:తండ్రి - భీముడు;::::కొడుకు(లు) - సంకృతి;::పద్య సం.(లు) - 9-503-వ.,

[ ⇑ ] :55) జయత్సేనుడు-2 (పురుష){సంజ్ఞా}[చంద్రవంశం]:- జయత్సేనుడు చంద్రంశంలోని సార్వభౌముడు అనువాని కొడుకు. జయతిసేనుని కొడుకు రథికుడు, రథికుని కొడుకు అయుతాయువు. వీరు శంతనుని పూర్వీకులు - :వంశం - చంద్రవంశం;:తండ్రి - సార్వభౌముడు;::::కొడుకు(లు) - రథికుడు;::పద్య సం.(లు) - 9-660-సీ., 9-661-వ.,

[ ⇑ ] :56) జయత్సేనుడు-3 (పురుష){సంజ్ఞా}[చంద్రవంశం]:- శ్రీకృష్ణుని మేనత్త రాజాధిదేవి భర్త జయత్సేనుడు. వీరికి విందానునిందులు పుట్టారు. - :వంశం - చంద్రవంశం;:::భార్య - రాజాధిదేవి;::కొడుకు(లు) - విందుడు, అనువిందుడు;::పద్య సం.(లు) - 9-722-వ.,

[ ⇑ ] :57) జయద్రథుడు-1 (పురుష){సంజ్ఞా}[చంద్రవంశం]:- చంద్రవంశంలోని బృహద్దనువు కొడుకైన బృహత్కాయునికి పుత్రుడు జయద్రథుడు; జయద్రథునికి విశ్వజిత్తు; విశ్వజిత్తునకు సేనజిత్తు; సేనజిత్తునకు రుచిరాశ్వుడు, దృఢహనువు, కాశ్యుడు, వత్సుడు అనగా నలుగురు కుమారులు పుట్టారు. - :వంశం - చంద్రవంశం;:తండ్రి - బృహత్కాయుడు;::::కొడుకు(లు) - విశ్వజిత్తు;::పద్య సం.(లు) - 9-653-వ.,

[ ⇑ ] :58) జయద్రథుడు-2 (పురుష){సంజ్ఞా}[చంద్రవంశం]:- జయద్రథుడు చందంరవంశంలోని బృహద్రథుని కుమారుడైన బృహన్మనసునకు కొడుకు; జయద్రథునకు విజయుడు; విజయునకు భార్య సంభూతి యందు ధృతి జన్మించారు. - :వంశం - చంద్రవంశం;:తండ్రి - బృహన్మనసుడు;::::కొడుకు(లు) - విజయుడు;::పద్య సం.(లు) - 9-697-వ.,

[ ⇑ ] :59) జయధ్వజుడు- (పురుష){సంజ్ఞా}[చంద్రవంశం]:- చంద్రవంశంలోని యదువువంశంలోని జయధ్వజుడు కార్తవీర్యార్జునుడు అని ప్రసిద్దుడైనవాని కొడుకు. ఆ కార్తవీర్యార్జునకు వెయ్యిమంది కుమారులు. ఆ వెయ్యిమందిలో పరశురాముని దెబ్బ తప్పించుకొని జయద్వజుడు, శూరసేనుడు, వృషణుడు, మధువు, ఊర్జితుడు అనెడి ఐదుగురు మాత్రమే బతికిబట్టకట్టారు. ఆ అయిదుగురులో ఒకడైన జయద్వజునకు తాళజంఘుడు; తాళజంఘునకు ఔర్వముని తేజస్సు వలన వందమంది పుత్రులు పుట్టారు. వారిలో మొదటివాడు వీతిహోత్రుడు; - :వంశం - చంద్రవంశం;:తండ్రి - కార్తవీర్యార్జునుడు;::::కొడుకు(లు) - తాళజంఘుడు;::పద్య సం.(లు) - 9-703-వ.,

[ ⇑ ] :60) జయభ్రాజిష్ణులు- (పురుష){జాతి}[ -]:- బలరామ కృష్ణులను జయభ్రాజిష్ణులు, డిష్ణుసు అని కీర్తించారు - :వంశం - -;:::::::పద్య సం.(లు) - 10.2-1141-మ.

[ ⇑ ] :61) జయస్తంభము- ( -){జాతి}[ -]:- రాజులు యుద్దంలో తాము సాధించిన ఘన విజయానికి చిహ్నంగా స్తంభము ప్రతిష్టిస్తారు. దానిని జయస్తంభము టారు.జరాసంధుని ఓడించి రా కృష్ణులు మధురకు తిరిగి వచ్చిన సందర్భంలో మధురను వర్ణిస్తూ జయస్తంభములకు కట్టిన తోరణములు.. అన్నారు. - :వంశం - -;:::::::పద్య సం.(లు) - 10.1-1579-వ

[ ⇑ ] :62) జయుడు-1 (పురుష){సంజ్ఞా}[దేవయోని]:- జయ విజయులు విష్ణుమూర్తి పార్షదులు. ఒకమారు సనకసనందాదులు విష్ణుమూర్తి దర్శనార్థము ఐదేండ్ల బారురువలెనై వైకుంఠ నగరి ద్వారం వద్దకు వస్తుంటే, ద్వారపాలకులైన ఆ జయవిజయులు వారిని అడ్డగించారు. దానితో కోపించిన సనకసనందాదులు "మూడు జన్మలు రాక్షసయోనిలో పుడతా" రనీ. "విష్ణుమూర్తిపై విపరీత వైరభక్తితో మెలగి, అతనిచేతిలోనే మరణిస్తా" రనీ శపించారు. ఆ ప్రకారం వారు మొదటిజన్మలో హిరణ్యాక్ష హిరణ్యకశిపులుగానూ, రెండవ జన్మలో రావణ కుంభకర్ణులుగానూ, మూడవ జన్మలో శిశుపాల దంతవక్తృలు గానూ అయ్యి, విష్ణువు చేతిలోనే మరణించారు. శ్రీవరాహ శ్రీనరసింహావతారము, శ్రీరామావతారము, శ్రీకృష్ణావతారము చేతులలో మరణించారు.పిమ్మట యథాస్తానమునకు చేరుకున్నారు. వామనుడు త్రివిక్రమావతారం ఎత్తాక, బలిచక్రవర్తిను బంధింపజేస్తుంటే, రాక్షసులు ఆయనమీదకి వెళ్ళడానికి సమాయత్తం కాసాగారు. అప్పడు విష్ణుసేవకులైన జయుడూ, జయంతుడూ, సునందుడూ, నందుడూ, విజయుడూ, ప్రబలుడూ, ఉద్బలుడూ, కుముదుడూ, కుముదాక్షుడూ, గరుడుడూ, పుష్పదంతుడూ, విష్వక్సేనుడూ, శ్రుతదేవుడూ, సాత్వతుడూ మొదలైన వారు రాక్షసులను ఎదుర్కోడానికి సమాయత్తం అయ్యారు - :వంశం - దేవయోని;:::::::పద్య సం.(లు) - 2-524-వ. నుండి 2-592-, 8-624-వ., 8-634-వ.

[ ⇑ ] :63) జయుడు-2 (పురుష){సంజ్ఞా}[ధ్రువుని వంశం]:- ఇతడు ధ్రువపుత్రుడు వత్సరు, భార్య సర్వర్థి ల ఆరవ కొడుకు. - :వంశం - ధ్రువుని వంశం;:తండ్రి - వత్సరుడు;:తల్లి - సర్వర్థి ;:::::పద్య సం.(లు) - 4-390-వ.,

[ ⇑ ] :64) జయుడు-3 (పురుష){సంజ్ఞా}[సూర్యవంశం]:- సూర్యవంశంనకు చెందిన సావనునకు సువర్చసుడు పుట్టారు. అతడినే సుభూషణుడు అని కూడ అంటారు. ఆ సుభాషణునకు జయుడు; జయునకు విజయుడు; విజయునకు ధృతుడు పుట్టారు.. - :వంశం - సూర్యవంశం;:తండ్రి - సువర్చసుడు (సుభూషణుడు);::::కొడుకు(లు) - విజయుడు;::పద్య సం.(లు) - 9-374-వ.,

[ ⇑ ] :65) జయుడు-4 (పురుష){సంజ్ఞా}[చంద్రవంశం]:- జయుడు చంద్రవంశంలోని పురూరవునికి ఊర్వశి యందు పుట్టాడు. - :వంశం - చంద్రవంశం;:తండ్రి - పురూరవుడు;:తల్లి - ఊర్వశి;:::కొడుకు(లు) - అమితుడు;::పద్య సం.(లు) - 9-422-వ.,

[ ⇑ ] :66) జయుడు-5 (పురుష){సంజ్ఞా}[చంద్రవంశం]:- జయుడు చంద్రవంశపు కృతవృద్ధుని వంశంలోని సంజయుని కొడుకు. జయునికి కొడుకు కృతుడు. కృతునికి హర్యధ్వనుడు; హర్యధ్వనునకు సహదేవుడు; సహదేవునికి భీముడు; భీమునకు జయత్సేనుడు; జయత్సేనునకు సంకృతి; సంకృతికి జయుడు; జయునికి క్షత్రధర్ముడు జనించారు. వీరంతా క్షత్రవృద్ధుని వంశంలోని రాజులు. - :వంశం - చంద్రవంశం;:తండ్రి - సంజయుడు;::::కొడుకు(లు) - కృతుడు;::పద్య సం.(లు) - 9-503-వ.,

[ ⇑ ] :67) జయుడు-6 (పురుష){సంజ్ఞా}[చంద్రవంశం]:- జయుడు చంద్రవంశపు కృతవృద్ధుని వంశంలోని సంకృతికి జయుడు; జయునికి క్షత్రధర్ముడు జనించారు. వీరంతా క్షత్రవృద్ధుని వంశంలోని రాజులు. - :వంశం - చంద్రవంశం;:తండ్రి - సంకృతి;::::కొడుకు(లు) - కృతధర్ముడు;::పద్య సం.(లు) - 9-503-వ.,

[ ⇑ ] :68) జయుడు-7 (పురుష){సంజ్ఞా}[చంద్రవంశం]:- జయుడు మన్యువు కొడుకు. బృహస్పతి మమత పుట్టిన భరద్వాజుడిని వదిలేసి ఎవరి దారిన వారు వెళ్ళిపోగా, మరుత్తులు అతడిని పెంచి, కొడుకును కోసం తపిస్తున్న భరతునికి ఇచ్చారు. అలా భరతుడు స్వీకరించిన ఆ భరద్వాజుడు సంతులేని భరతవంశాన్ని నిలబెట్టాడు. కనుక, వితథుడు అని ప్రసిద్ధుడు అయ్యాడు. ఆ వితథునికి మన్యవు, మన్యువునకు బృహత్క్షత్రుడు, జయుడు, మహావీర్యుడు, నరుడు, గర్గుడు అని ఐదుమంది కొడుకుల పుట్టారు. వారిలో నరునికి సంకృతి; సంకృతికి గురుడు, రంతిదేవుడు అని ఇద్దరు పుట్టారు. - :వంశం - చంద్రవంశం;:తండ్రి - మన్యువు;::::::పద్య సం.(లు) - 9-641-వ.,

[ ⇑ ] :69) జయుడు-8 (పురుష){సంజ్ఞా}[చంద్రవంశం]:- జయుడు చంద్రవంశలోని భోజులనే రాజులలోని వాడు. సత్యకుని కొడుకైన యుయుధానుడు అనబడెడి సాత్యకి పుత్రుడు జయుడు. జయుని కొడుకు కుణి అనువాడు. - :వంశం - చంద్రవంశం;:తండ్రి - యుయుధానుడు (సాత్యకి);::::కొడుకు(లు) - కుణి;::పద్య సం.(లు) - 9-712-వ.,

[ ⇑ ] :70) జయుడు-9 (పురుష){సంజ్ఞా}[చంద్రవంశం]:- శ్రీకృష్ణునికి సోదరునివవరుస అవుతాడు. శ్రీకృష్ణుని తండ్రి వసుదేవుని ఒక సోదరుడు ఆనకుడు. అతనికి భార్య కర్ణిక యందు జయుడు ఋతుదాముడు అని ఇద్దరు కొడుకులు. - :వంశం - చంద్రవంశం;:తండ్రి - ఆనకుడు;:తల్లి - కర్ణిక;:::::పద్య సం.(లు) - 9-722-వ.

[ ⇑ ] :71) జర-1 ( -){జాతి}[ -]:- జర అనగా ముసలితనము.. " అని పలికి...మహానుభావుడు దేవతల కోరిక తీర్చడానికి వసుదేవుని ఇంట్లో జన్మించి రాక్షసత్వం పెరిగిపోయిన కంసుడు హింసిస్తాడేమో అనే భయంతో, వెళ్ళి నందుని ఇంట్లో చాటుమాటుగా పెరగటమూ; కాలయవనుడూ, జరాసంధుడూ మొదలైన వారిని కదనరంగంలో ఎదిరించకుండా తప్పుకొని మంచివారి చేత పొగడబడే మథురా నగరాన్ని కూడా వదలిపెట్టి ఎక్కడో దాక్కోవటమూ; ఈ రెండు సన్నివేశాలను తలచినప్పుడు నా మనస్సు దుఃఖంతో కుమిలి పోతుంది - :వంశం - -;:::::::పద్య సం.(లు) - 2-31-సీ., 2-266-సీ., 3-306-మ., ....

[ ⇑ ] :72) జర-2 (స్త్రీ){సంజ్ఞా}[రాక్షస యోని]:- జర గిరివ్రజపురములోని ఒక దైత్యస్త్రీ. ఆ గిరివ్రజపురము రాజు బృహద్రథుడు. అతనికి ఇతర భార్య కడుపులో రెండు భాగాలు అయిన శిశువు పుట్టింది. ముక్కలై పోయిందని ఆ శిశువును తల్లి పారవేసింది. ఆ దైత్య స్త్రీ జర ఆ రెండు భాగాలను సంధించింది. అలా బ్రతికిన వాడు కనుక జరాసంధుడు అన్నారు. అతను గిరివ్రజపురాన్ని పరిపాలించాడు. - :వంశం - రాక్షస యోని;:::::::పద్య సం.(లు) - 9-660-సీ.

[ ⇑ ] :73) జరత్- ( - ){జాతి}[ -]:- జరత్ అనగా వృద్దుడు, పురంజనోపాఖ్యానంలో జరత్పన్నగము అని ప్రయోగించారు - :వంశం - -;:::::::పద్య సం.(లు) - 4-817-వ.

[ ⇑ ] :74) జరభి- (స్త్రీ){జాకి}[రాక్షస యోని]:- జరభి అంటే దుష్టురాలు. పూతనను వర్ణిస్తూ జరభితెఱవ వెరవున జనుదెంచి (10.1-224-వ.), జరభిరండ రక్కసి నైజశరీరంబు నేల నలియంబడినన్ (10.1-229-క.) అని పోతనగారు ప్రయోగించారు - :వంశం - రాక్షస యోని;:::::::పద్య సం.(లు) - 10.1-224-వ., 10.1-229-క.

[ ⇑ ] :75) జరాయువు- ( -){జాతి}[ -]:- జరాయువు అనగా మావి, ప్రాణి పుట్టిన తరువాత క్షీణించునది. - :వంశం - -;:::::::పద్య సం.(లు) - 3-992-వ.

[ ⇑ ] :76) జరాసంధుడు- (పురుష){సంజ్ఞా}[చంద్రవంశం]:- మగధదేశము రాజులలో ఉపరిచరవసువు కుమారుడు, గిరివ్రజపురము రాజు బృహద్రథుడు. అతనికి ఇతర భార్య కడుపులో రెండు భాగాలు అయిన శిశువు పుట్టింది. ముక్కలై పోయిందని ఆ శిశువును తల్లి పారవేసింది. జర అను దైత్య స్త్రీ ఆ రెండు భాగాలను సంధించింది. అలా బ్రతికిన వాడు కనుక జరాసంధుడు అన్నారు. అతను గిరివ్రజపురాన్ని పరిపాలించాడు. అతనికి సహదేవుడు; అతనికి సోమాపి; అతనికి శ్రుతశ్రవుడు పుట్టారు.
మగధ దేశ రాజులు జరాసంథుడు మున్నగువారు మిక్కిలి కీర్తిమంతులు. వీరు కలియుగంలో వెయ్యి సంవత్సరముల లోగానే జనించి నశిస్తారు.
ధనుర్యాగానికి బలరామ కృష్ణులను పిలుచుకుని రమ్మని అక్రూరుని పంపు సందర్భంలో, కంసుడు "శత్రువుల ప్రాణాలు తీస్తాను. జరాసంధుడు, నరకుడు, బాణుడు, శంబరుడు మొదలైన నా చెలికాండ్రతో గూడి ఈ భూమండలాన్నిపరిపాలిస్తాను." అన్నాడు.
కంసుడి భార్యలు అస్తి. ప్రాస్తి. వీరు జరాసంధుని కుమార్తెలు. అస్తి ప్రాస్తులు దుఃఖిస్తూ తండ్రి ఐన జరాసంధుని వద్దకు వెళ్ళి కృష్ణుడు కంసాదుల సంహరించాడు. కనుక మాకు వైధవ్యం సంభవించింది అని పిర్యాదు చేసారు..అంత జరాసంధుడు ఇరవైమూడు అక్షౌహిణుల సైన్యంతో కృష్ణుని మీదకు వెళ్ళాడు. వెళ్ళి మథురను ముట్టడించాడు. ఆ యుద్ధంలో చేతికి చిక్కిని జరాసంధుని కృష్ణుని మాట ప్రకారం బలరాముడు వదిలిపెట్టాడు.. జరాసంధుడు అలా కృష్ణుని మీదకు పదిహేడుమారులు దండెత్తి వచ్చి ఓడిపోయాడు. పద్దెనిమిదో సారి జరాసంధుడు మథురను ముట్టడించిన సమయంలోనే కాలయవనుడు కూడ ముట్టడించాడు. అంత వీరిద్దరూ మిక్కిలి బలవంతులు కనుక సముద్రం మద్యలో ద్వారకానదరం నిర్మించి తనవారందరినీ విచిత్రంగా తరలించాడు.
అలా తరలిస్తుంటే, జరాసంథుడు మరల మథురమీదకు దండెత్తివచ్చాడు. అప్పుడు బలరాముడు కృష్ణుడు వంటరిగా కోటనుండి బయటకు వచ్చి పారిపోయి ప్రవర్షణ పర్వతము పైన దాగారు. కోపంతో జరాసంధుడు కొండకు నిప్పంటించగా. శత్రువులకు తెలియకుండా దూకి పారిపోయారు. కాని జరాసంధుడు బలరామ కృష్ణులు మంటలలో ఆహుతి అయిపోయారు అనుకున్నాడు.
రుక్మిణీ కరగ్రహణ సమయంసో జరాసంధాదులు కృష్ణునిపైకి వెళ్ళి పరాజయం పొందారు.
ఉషాకన్యకు చిత్రరేఖ చూపిన బొమ్మలలో, జరాసంధుని బొమ్మకూడా ఉంది.
జరాసంధుడు చెరపట్టిన రాజులు పంపిన దూత వచ్చి కృష్ణుని సాయం వేడాడు.
ధర్మరాజు రాజసూయయాగం సందర్భంలో భీముని ద్వారా జరాసంధుని వధింపించి బంధీలను విడిపింపమని నారదుడు కృష్ణునికి చెప్పాడు. ఆ ప్రకారం భీమార్జునులతో విప్రవేషధారులై గిరివ్రజం వెళ్ళి జరాసంధుని యుద్ధ భిక్ష వేడారు. అంత జరిగినభీమజరాసంధుల యుద్ధంలో, గడ్డిపరక చీల్చి ఇలా చీల్చి చంపమని కృష్ణుడు భీమునికి సూచించాడు. భీముడు ఆ ప్రకారం నిలువుగా చీల్చి జరాసంధుని సంహరించాడు.. - :వంశం - చంద్రవంశం;:తండ్రి - బృహద్రథుడు;::::కొడుకు(లు) - సహదేవుడు;::పద్య సం.(లు) - 9-660-సీ., 9-681-వ., 9-682-ఆ., 10.1-1163-సీ., 10.1-1524-వ,, 10.1-1592-వ., 10.1-1672-ఉ., 10.1-1751-వ., 10.2-348-ఉ., 1-.2-644-తే.,10.1-668-వ., నుండి 10.2-742-వ.,

[ ⇑ ] :77) జరాసుతుడు- (పురుష){సంజ్ఞా}[చంద్రవంశం]:- జరాసుతుడు అనగా జరాసంధుడు. ఉద్ధవుడు శ్రీకృష్ణనిర్యాణ చెప్తూ విదురునతో ఇలా అన్నాడు. - :వంశం - చంద్రవంశం;:::::::పద్య సం.(లు) - 3-92-చ., 10.1-1708-ఉ.

[ ⇑ ] :78) జఱభుడు- (పురుష){జాతి}[సూర్యవంశం]:- జరభు అంటే దుష్టుడు. భూమిని తవ్వి వెళ్ళివెళ్ళి సగరుని పుత్రులు పాతాళలోకంలో కపిలమహర్షి దగ్గర ఉన్న గుఱ్ఱాన్ని కనుగొని,. అప్పుడు "...గుఱ్ఱపుదొంగ చిక్కె; నీ జఱభుని బట్టి చంపుఁ…." అని ఆ మహర్షి గురించి అన్నారు. - :వంశం - సూర్యవంశం;:::::::పద్య సం.(లు) - 9-207-చ.

[ ⇑ ] :79) జలకము- ( -){సంజ్ఞా}[ -]:- జలకము అంటే స్నానము. - :వంశం - -;:::::::పద్య సం.(లు) - 3-819-సీ., 8-270-క.

[ ⇑ ] :80) జలకుక్కుట - ( -){జాతి}[నీటిపక్షులు]:- జలజకుక్కుటము అంటే నీటికోడి - :వంశం - నీటిపక్షులు;:::::::పద్య సం.(లు) - 3-768-క., 4-135-వ., 8-23-సీ., 8-24-వ., 8-25-క.,

[ ⇑ ] :81) జలగ్రహము- (స్త్రీ){జాతి}[జలచర]:- మొసలి, నీటపట్టునది - :వంశం - జలచర;:::::::పద్య సం.(లు) - 2-148., 3-182-మ., 8-53-చ., 10.1-100-మ,

[ ⇑ ] :82) జలగ్రాహము- ( -){జాతి}[జలచర]:- మొసలి, నీటపట్టునది - :వంశం - జలచర;:::::::పద్య సం.(లు) - 5.2-151-వ.

[ ⇑ ] :83) జలచరావతారము- ( -){సంజ్ఞా}[దేవయోని]:- జలచరావతారము అనగా మత్స్యావతారము - :వంశం - దేవయోని;:::::::పద్య సం.(లు) - 8-740-క.

[ ⇑ ] :84) జలజగర్భుడు- (పురుష){సంజ్ఞా}[దేవయోని]:- జలజగర్భుడు అంటే పద్మమున పుట్టినవాడు, బ్రహ్మదేవుడు - :వంశం - దేవయోని;:::::::పద్య సం.(లు) - 2-241-ఆ., 3-716-సీ., 10.1-1234-సీ.,

[ ⇑ ] :85) జలజదళాక్షుడు- (పురుష){సంజ్ఞా}[దేవయోని]:- జలజదళాక్షుడు అనగా కృష్ణుడు. - :వంశం - దేవయోని;:::::::పద్య సం.(లు) - 10.2-906-క.

[ ⇑ ] :86) జలజనయనుడు-1 (పురుష){సంజ్ఞా}[దేవయోని]:- జలజనయనుడు అంటే పద్మాక్షుడైన విష్ణువు - :వంశం - దేవయోని;:::::::పద్య సం.(లు) - 3-254-తే., 4-210-సీ., 4-254-సీ.,

[ ⇑ ] :87) జలజనయనుడు-2 (పురుష){సంజ్ఞా}[దేవయోని]:- జలజనయనుడు అంటే పద్మాక్షుడైన కృష్ణుడు - :వంశం - దేవయోని;:::::::పద్య సం.(లు) - 10.1-691-వ., 10.1-693-సీ., 10.1-1713-సీ.

[ ⇑ ] :88) జలజనాభుడు- (పురుష){సంజ్ఞా}[దేవయోని]:- జలజనాభుడు అంటే పద్మనాభుడైన విష్ణుమూర్తి - :వంశం - దేవయోని;:::::::పద్య సం.(లు) - 2-263-తే., 10.2-260-ఆ.

[ ⇑ ] :89) జలజనేత్రుడు- (పురుష){సంజ్ఞా}[దేవయోని]:- జలజనేత్రుడు అనగా పద్మాక్షుడైన విష్ణువు - :వంశం - దేవయోని;:::::::పద్య సం.(లు) - 3-790-ఆ., 4-69-సీ., 9-161-సీ., 10.1-592-సీ.

[ ⇑ ] :90) జలజబంధుడు- (పురుష){సంజ్ఞా}[దేవయోని]:- జలజబంధువు అనగా సూర్యుడు - :వంశం - దేవయోని;:::::::పద్య సం.(లు) - 9-8-సీ.,

[ ⇑ ] :91) జలజభవసుతుడు- (పురుష){సంజ్ఞా}[ఋషి]:- జలజభవసుతుడు అనగా బ్రహ్మపుత్రుడు ఐన నారదుడు. - :వంశం - ఋషి;:::::::పద్య సం.(లు) - 10.2-626-క.

[ ⇑ ] :92) జలజభవుడు- (పురుష){సంజ్ఞా}[దేవయోని]:- జలజాతభవుడు అంటే పద్మసంభవుడు, బ్రహ్మదేవుడు. పృథుచక్రవర్తి పట్టాభిషిక్తుడు అయిన సందర్భంలో దేవతలు అందరు వివిధ బహుమానాలు ఇచ్చారు. వారిలో బ్రహ్మదేవుడు, కవచము ఇచ్చెను - :వంశం - దేవయోని;:::::::పద్య సం.(లు) - 1-294-సీ., 3-779-క., 4-442-సీ.,., 4-443-సీ., 5-2-165-చ., 8-228-క.,. . ,

[ ⇑ ] :93) జలజలోచనుడు- (పురుష){సంజ్ఞా}[దేవయోని]:- జలజలోచనుడు అనగా పద్మాక్షుడు ఐన విష్ణువు - :వంశం - దేవయోని;:::::::పద్య సం.(లు) - 8-434-ఆ., 9-333-సీ., 10.2-603-తే., 10.2-675-తే.

[ ⇑ ] :94) జలజసంభవుడు- (పురుష){సంజ్ఞా}[దేవయోని]:- జలజసంభవుడు అనగా బ్రహ్మదేవుడు. - :వంశం - దేవయోని;:::::::పద్య సం.(లు) - 10.1-594-సీ.

[ ⇑ ] :95) జలజాక్షుడు- (పురుష){సంజ్ఞా}[దేవయోని]:- జలజాక్షుడు అంటే పద్మములవంటి కన్నులు కలవాడు, విష్ణువు - :వంశం - దేవయోని;:::::::పద్య సం.(లు) - 1-265-క., 2-188-సీ., 3-311-సీ., 3-663-క., 8-738-క., . . . 12-36-మ.

[ ⇑ ] :96) జలజాతనేత్రుడు- (పురుష){సంజ్ఞా}[దేవయోని]:- జలజాతనేత్రుడు పద్మాక్షుడైన విష్ణువు - :వంశం - దేవయోని;:::::::పద్య సం.(లు) - 6-485-శా.

[ ⇑ ] :97) జలజాతప్రభవుడు- (పురుష){సంజ్ఞా}[దేవయోని]:- జలజాతప్రభవుడు పద్మసంభవుడైన బ్రహ్మదేవుడు. - :వంశం - దేవయోని;:::::::పద్య సం.(లు) - 7-186-మ,

[ ⇑ ] :98) జలజాతముఖి- (పురుష){సంజ్ఞా}[బ్రహ్మణ]:- జలజాతముఖి అనగా పద్మముఖి ఐన దేవయాని - :వంశం - బ్రహ్మణ;:::::::పద్య సం.(లు) - 9583-క.

[ ⇑ ] :99) జలజాతాక్షుడు-1 (పురుష){సంజ్ఞా}[దేవయోని]:- జలజాతాక్షుడు అంటే పద్మముల వంటి కలవాడు, విష్ణువు - :వంశం - దేవయోని;:::::::పద్య సం.(లు) - 1-244-మ., 1-259-ఉ., 8-604.,

[ ⇑ ] :100) జలజాతాక్షుడు-2 (పురుష){సంజ్ఞా}[దేవయోని]:- జలజాతాక్షుడు అంటే పద్మముల వంటి కలవాడు, కృష్ణుడు - :వంశం - దేవయోని;:::::::పద్య సం.(లు) - 10.1-1195-మ.

[ ⇑ ] :101) జలజాతేక్షణుడు- (పురుష){సంజ్ఞా}[దేవయోని]:- జలజాతేక్షణుడు అనగా కృష్ణుడు - :వంశం - దేవయోని;:::::::పద్య సం.(లు) - 10.1-1737-వ.

[ ⇑ ] :102) జలజాప్తుడు- (పురుష){సంజ్ఞా}[దేవయోని]:- జలజాప్తుడు అంటే పద్మములకు ఆప్తుడైన సూర్యుడు - :వంశం - దేవయోని;:::::::పద్య సం.(లు) - 3-275-సీ.

[ ⇑ ] :103) జలజేక్షణుడు- (పురుష){సంజ్ఞా}[దేవయోని]:- జలజేక్షణుడు అనగా విష్ణువు - :వంశం - దేవయోని;:::::::పద్య సం.(లు) - 10.1-592-సీ.

[ ⇑ ] :104) జలతర్పణము- ( -){ -}[ -]:- జలతర్పణము అనగా తిలోదకము - :వంశం - -;:::::::పద్య సం.(లు) - 8-695-వ., 10.1-698-క.,

[ ⇑ ] :105) జలదకాలము- ( -){సంజ్ఞా}[కాలం]:- జలదకాలము అంటే వానాకాలము - :వంశం - కాలం;:::::::పద్య సం.(లు) - 1-39-వ.

[ ⇑ ] :106) జలదవర్ణుడు- (పురుష){సంజ్ఞా}[దేవయోని]:- జలదవర్ణుడు అంటే మేఘశ్యాముడు ఐన విష్ణువు. - :వంశం - దేవయోని;:::::::పద్య సం.(లు) - 8-104-సీ.

[ ⇑ ] :107) జలదాగమము- ( -){సంజ్ఞా}[కాలం]:- జలదాగమము అంటే వర్షాకాలము. - :వంశం - కాలం;:::::::పద్య సం.(లు) - 4-498

[ ⇑ ] :108) జలదాభుడు- (పురుష){సంజ్ఞా}[దేవయోని]:- జలదాభుడు అనగా మేఘము వంటి వాడు, కృష్ణుడు. - :వంశం - దేవయోని;:::::::పద్య సం.(లు) - 10.2-626-క.

[ ⇑ ] :109) జలధరదేహుడు- (పురుష){సంజ్ఞా}[దేవయోని]:- జలధరదేహుడు అనగా విష్ణువు - :వంశం - దేవయోని;:::::::పద్య సం.(లు) - 10.1-112-సీ.,

[ ⇑ ] :110) జలధికన్యక- (స్త్రీ){సంజ్ఞా}[దేవయోని]:- జలధికన్యక అంటే సముద్రమున జనించినామె, లక్ష్మీదేవి. - :వంశం - దేవయోని;:::::::పద్య సం.(లు) - 6-6-క.

[ ⇑ ] :111) జలధిపతి- (పురుష){సంజ్ఞా}[దేవయోని]:- జలధిపతి అంటే వరుణుడు. రాజు శరీరంలో సకల దేవతలు వసిస్తారు అని చెప్తూ జలధిపతికూడా చెప్పబడెను. - :వంశం - దేవయోని;:::::::పద్య సం.(లు) - 4-426-క.

[ ⇑ ] :112) జలధిసుత- (స్త్రీ){సంజ్ఞా}[దేవయోని]:- జలధిసుత అనగా సముద్రమున జనించినామె, లక్ష్మీదేవి. - :వంశం - దేవయోని;:::::::పద్య సం.(లు) - 11-65-వ.

[ ⇑ ] :113) జలపతి- (పురుష){సంజ్ఞా}[దేవయోని]:- జలపతి అంటే వరుణదేవుడప. పృథుచక్రవర్తి పట్టాభిషిక్తుడు అయిన సందర్భంలో దేవతలు అందరు వివిధ బహుమానాలు ఇచ్చారు. వారిలో వరుణదేవుడు, తెల్లగొడుగు ఇచ్చెను - :వంశం - దేవయోని;:::::::పద్య సం.(లు) - 4-442-సీ.,., 4-443-సీ.,

[ ⇑ ] :114) జలము- ( -){జాతి}[స్థలం]:- జలము అంటే నీరు. ఏకాదశ రుద్రులకు బ్రహ్మదేవుడు నిద్రేశించిన స్థానలలో ఒకటి. రుద్రుడు శివుడు నామం కలిగి భార్య నియుతితో, జలము స్థానంగా కలిగి ఉంటాడు. - :వంశం - స్థలం;:::::::పద్య సం.(లు) - 1-45-సీ., 3-369-క.,., 3-370-వ.,

[ ⇑ ] :115) జలరుహగర్భుడు- (పురుష){సంజ్ఞా}[దేవయోని]:- జలరుహగర్భుడు అంటే బ్రహ్మదేవుడు. పృథుమహారాజునకు పృథ్వి తను యెందుకు కృశించి యన్నది చెప్పు సందర్భంలో, భూమాత బ్రహ్మదేవుని జలరుహగర్భుడు అనెను. - :వంశం - దేవయోని;:::::::పద్య సం.(లు) - 4-492-చ.

[ ⇑ ] :116) జలరుహజాతాండము- ( -){సంజ్ఞా}[ -]:- జలరుహజాతాండము అనగా బ్రహ్మాండము - :వంశం - -;:::::::పద్య సం.(లు) - 3-206-క.,

[ ⇑ ] :117) జలరుహనయనుడు- (పురుష){సంజ్ఞా}[దేవయోని]:- జలరుహనయనుడు అనగా విష్ణువు - :వంశం - దేవయోని;:::::::పద్య సం.(లు) - 9-171-క.,

[ ⇑ ] :118) జలరుహనాభుడు- (పురుష){సంజ్ఞా}[దేవయోని]:- జలరుహనాభుడు అంటే పద్మనాభుడైన విష్ణువు - :వంశం - దేవయోని;:::::::పద్య సం.(లు) - 3-173-సీ., 8-738-క., 10.2-105-చ.

[ ⇑ ] :119) జలరుహపత్రనేత్రుడు- (పురుష){సంజ్ఞా}[దేవయోని]:- జలరుహపత్రనేత్రుడు - :వంశం - దేవయోని;:::::::పద్య సం.(లు) - 10.2-1170-చ.

[ ⇑ ] :120) జలరుహలోచనుడు- (పురుష){సంజ్ఞా}[దేవయోని]:- జలరుహలోచనుడు అనగా కృష్ణుడు. - :వంశం - దేవయోని;:::::::పద్య సం.(లు) - 10.2-920-చ., 10.2-1132-చ.

[ ⇑ ] :121) జలరుహసంజాతుడు- (పురుష){సంజ్ఞా}[దేవయోని]:- జలరుహసంజాతుడు - :వంశం - దేవయోని;:::::::పద్య సం.(లు) - 10.2-1269-క.

[ ⇑ ] :122) జలరుహాక్షుడు- (పురుష){సంజ్ఞా}[దేవయోని]:- జలరుహాక్షుడు అంటే పద్మాక్షుడైన విష్ణువు - :వంశం - దేవయోని;:::::::పద్య సం.(లు) - 6-342-ఆ.,

[ ⇑ ] :123) జలవిహంగ - ( -){ -}[నీటిపక్షులు]:- నీటిపక్షుల - ఇవి అష్టమ స్కంధములోని త్రికూట పర్వతములో వర్ణించబడ్డాయి - :వంశం - నీటిపక్షులు;:::::::పద్య సం.(లు) - 5.2-107-వ., 8-23-సీ., 8-24-వ., 8-25-క.,

[ ⇑ ] :124) జలవృత్తులు- ( -){ -}[ -]:- తనలో చేరిన ద్రవ్యాల మార్పులనుబట్టి ఆర్ద్రం కావడం, ముద్ద గట్టడం, తృప్తినివ్వడం, జీవనం, అందలి మాలిన్యాన్ని నివారించడం, మెత్తపరచడం, తాపాన్ని పోగొట్టడం, బావిలో జలలు ఏర్పడి అడుగున ఉన్న జలం పైకెగయడం అనేవి ఈ జలవృత్తులు. - :వంశం - -;:::::::పద్య సం.(లు) - 3-896-వ.

[ ⇑ ] :125) జలాన్నములు- ( -){ -}[ -]:- జలాన్నములు అంటే అన్నపానీయములు. ప్రత్యక్షమైన బ్రహ్మదేవుడు హిరణ్యకశిపుని అన్నపానీయాలు తీసుకోకుండా ఇన్నేళ్ళు యెలా ఉన్నావో అని ప్రశంసించాడు. - :వంశం - -;:::::::పద్య సం.(లు) - 7-83-ఉ.

[ ⇑ ] :126) జలూకము- ( -){జాతి}[జంతు]:- జలూకము అనగా జలగ. - :వంశం - జంతు;:::::::పద్య సం.(లు) - 10.2-884-వ.

[ ⇑ ] :127) జలేపువు- (పురుష){సంజ్ఞా}[చంద్రవంశం]:- శర్యాతిమనుమడైన రౌద్రాశ్వునకు ఘృతాచి యను అప్సరస యందు ఋతేపువుఁ, కక్షేపువు, స్థలేపువుఁ, కృతేపువు, జలేపువు, సన్నతేపువు, సత్యేపువు, ధర్మేపువు, వ్రతేపువు, వనేపువు అనువారు పజిమంది కొడుకులు. - :వంశం - చంద్రవంశం;:తండ్రి - రౌద్రాశ్వుడు;:తల్లి - అప్సరస ఘృతాచి;:::::పద్య సం.(లు) - 9-593-వ.

[ ⇑ ] :128) జలేశుడు- (పురుష){సంజ్ఞా}[దేవయోని]:- జలేశుడు అనగా వరుణుడు - :వంశం - దేవయోని;:::::::పద్య సం.(లు) - 8-224-సీ., 8-624-వ.

[ ⇑ ] :129) జలోన్నయనదారుయంత్రములు- ( -){సంజ్ఞా}[ -]:- జలోన్నయన దారుయంత్రములు = నీటిని పైకి తోడుతున్న చెక్క యంత్రములు - :వంశం - -;:::::::పద్య సం.(లు) - 10.1-1532-వ.

[ ⇑ ] :130) జల్ఫము- ( -){ -}[భాష]:- జల్పములు అనగా పొసగని మాటలు, డంబములు - :వంశం - భాష;:::::::పద్య సం.(లు) - 10.2-300-వ., 10.2-578-వ., 10.2-1297-వ.

[ ⇑ ] :131) జవనిక- ( -){జాతి}[ -]:- జవనిక అంటే తెర. జవనిక మఱుపున నాట్యంబు సలుపు నటుని చందంబున మాయా యవనికాంతరాళంబున నిలువంబడి - :వంశం - -;:::::::పద్య సం.(లు) - 1-188-వ., 10.1-1746-ఆ., 10.2-1122-వ.

[ ⇑ ] :132) జవరాలు- (స్త్రీ){జాతి}[ -]:- జవరాలు అంటే స్త్రీ - :వంశం - -;:::::::పద్య సం.(లు) - 6-400-ఉ., 6-58-క., 9-72-ఆ., 9-541-ఉ.

[ ⇑ ] :133) జవ్వని- (స్త్రీ){జాతి}[ -]:- జవ్వని అంటే స్త్రీ. - :వంశం - -;:::::::పద్య సం.(లు) - 6-102-క.

[ ⇑ ] :134) జహ్నవి- (స్త్రీ){సంజ్ఞా}[ -]:- జాహ్నవి అనగా గంగానది. జహ్నుడు అను రాజర్షి తన యజ్ఞవాటమున గంగ ప్రవేశించినప్పుడు దానిని పానముచేసి భగీరథుని ప్రార్థనచే మరల తన చెవిగుండ వెడల విడిచెను. కనుక గంగకు జాహ్నవి అను నామము కలిగెను. - :వంశం - -;:::::::పద్య సం.(లు) - 9-422-వ.,

[ ⇑ ] :135) జహ్నుడు- (పురుష){సంజ్ఞా}[చంద్రవంశం]:- ఈ జహ్నుడు ఒక రాజర్షి. వీరి పేరుననే గంగగకు జాహ్నవి అని పెరు వచ్చినది. పురూరవునకు ఊర్వశి నందు కలిగిన శ్రుతాయువు వంశంలో హోత్రకుని పుత్రుడు. ఇతఁడు తన యజ్ఞవాటమున గంగ ప్రవేశించినప్పుడు దానిని పానముచేసి భగీరథుని ప్రార్థనచే మరల తన చెవిగుండ వెడల విడిచెను. కనుక గంగకు జాహ్నవి అను నామము కలిగెను. ఈతని కొడుకు పూరుడు.పూరునకు బాలకుడు; బాలకునకు అజకుడు; అజకునకు కుశుడు; కుశునకు కుశాంబువు, ధూర్తయుడు, వసువు, కుశనాభుడు అని నలుగురు పుట్టారు. వారిలో కుశాంబునికి గాధి పుట్టాడు. - :వంశం - చంద్రవంశం;:తండ్రి - హోత్రకుడు;::::కొడుకు(లు) - పూరుడు;::పద్య సం.(లు) - 9-422-వ.,

[ ⇑ ] :136) జహ్నువు-1 (పురుష){సంజ్ఞా}[చంద్రవంశం]:- జహ్నువు కురువు మూడవ పుత్రుడు. కురువు పేరుమీద కురుక్షేత్రం ఏర్పడింది. ఆ కురువునకు పరీక్షిత్తు (ఇతను శుక శిష్యుడైన పరీక్షిత్తు కాదు), సుధనువు, జహ్నవు, నిషదుడు, అని నలుగురు కొడుకులు. వారిలో సుధనువునకు సుహోత్రుడు; అతనికి చ్యవనుడు; చ్యవనునకు ఉపరిచరవసువు; వసువునకు బృహద్రథుడు, కుసుంభుడు, మత్స్యుడు, ప్రత్యగ్రుడు, చేదిషుడు మున్నగు కుమారులు జన్మించారు. వారిలో బృహద్రథునకు కుశాగ్రుడు; కుశాగ్రునికి ఋషభుడు; ఋషభునికి సత్యహితుడు; సత్యహితునికి పుష్పవంతుడు; పుష్పవంతునకు జహ్నవు పుట్టారు. - :వంశం - చంద్రవంశం;:తండ్రి - కురువు;::::::పద్య సం.(లు) - 9-660-వ.

[ ⇑ ] :137) జహ్నువు-2 (పురుష){సంజ్ఞా}[చంద్రవంశం]:- ఈ జహ్నువు కరువు మూడవకొడపకైన జహ్నువు వంశస్థుడు. సత్యహితుని కొడుకైన పుష్పవంచుతుని కొడుకు ఇతడు. ఈ జహ్నువు పుత్రుడు సురథుడు; అతని పుత్రుడు విదూరథుడు; అతని పుత్రుడు సార్వభౌముడు; అతని పుత్రుడు జయత్సేనుడు. అతను నిర్మలకీర్తి పొందాడు. వీరు శంతనుని పూర్వీకులు - :వంశం - చంద్రవంశం;:తండ్రి - పుష్పవంతుడు;::::కొడుకు(లు) - సురథుడు;::పద్య సం.(లు) - 9-659-వ., 9-660-సీ., 9-653-సీ.

[ ⇑ ] :138) జాంబవంతుడు- (పురుష){సంజ్ఞా}[ -]:- శ్రీకృష్ణునికి, శ్యమంతకమణి వెదకుచూ వచ్చినప్పుడు తన కూతురు జాంబవతిని, మణిని ఇచ్చిన వాడు.
వామనుడు త్రివిక్రమావతారుడు అయినప్పుడు, బ్రహ్మాది దేవతలు కొలిచారు, వనచరుడగు జాంబవంతుడు లోకమెల్ల చాటింపు వేసాడు.
శ్రీరామునికి సీతాన్వేషణలోనూ, రావణునితో యుద్ధములోనూ ప్రముఖ పాత్ర వహించిన మహావీరుడు, రామభక్తుడు ఈ జాంబవంతుడు - :వంశం - -;::::::కూతురు(లు)- జాంబవతి;:పద్య సం.(లు) - 3-53-చ., 8-632-సీ..9-291-వ., 10.2-55-చ. నుండి 10.2-69-వ. వరకు,

[ ⇑ ] :139) జాంబవతి- (స్త్రీ){సంజ్ఞా}[చంద్రవంశం]:- జాంబవతి జాంబవంతుని కూతురు. శ్రీకృష్ణుని అష్టమహిషలలో ఒకతె.సాంబుడు , సుమిత్రుడు , పురజిత్తు , శతజిత్తు , సహస్రజిత్తు , విజయుడు , చిత్రకేతుడు , వసుమంతుడు , ద్రవిడుడు , క్రతువు ఈమె కుమారులు. - :వంశం - చంద్రవంశం;:తండ్రి - జాంబవంతుడు;:::భర్త - కృష్ణుడు;:కొడుకు(లు) - సాంబుడు , సుమిత్రుడు , పురజిత్తు , శతజిత్తు , సహస్రజిత్తు , విజయుడు , చిత్రకేతుడు , వసుమంతుడు , ద్రవిడుడు , క్రతువు ;::పద్య సం.(లు) - 3-53-చ., 10.2-148-వ., 8-632-సీ..9-291-వ., 10.2-55-చ. నుండి 10.2-69-వ. వరకు,

[ ⇑ ] :140) జాంబవతీనందనుడు- (పురుష){సంజ్ఞా}[చంద్రవంశం]:- ఈ జాంబవతీనందనుడు సాంబుడు, దుర్యోధనుని కూతురు లక్ష్మణను వరించి, వెళ్ళి తెచ్చుకున్నాడు. ఆసమయంలో గొప్ప పరాక్రమం చూపాడు. ఐనా కౌరవుల చేత చిక్కడంతో బలరాముడు వచ్చి విడిపించాడు. లక్ష్మణతో కలిసి అలా తమ నగరానికి వచ్చాడు. - :వంశం - చంద్రవంశం;:తండ్రి - కృష్ణుడు;:తల్లి - జాంబవతి;:భార్య - లక్ష్మణ;::::పద్య సం.(లు) - 10.2-562-తే.

[ ⇑ ] :141) జాంబవతీసంభవుడు- (పురుష){సంజ్ఞా}[చంద్రవంశం]:- ఇతను సాంబుడు, సాల్వునితో జరిగిన యుద్దములో వీరత్వం చూపిన వీరుడు - :వంశం - చంద్రవంశం;:తండ్రి - కృష్ణుడు;:తల్లి - జాంబవతి;:భార్య - లక్ష్మణ;::::పద్య సం.(లు) - 10.2-857-ఉ.

[ ⇑ ] :142) జాతకర్ణుడు- (పురుష){సంజ్ఞా}[సూర్యవంశం]:- శూరుడికి దేవదత్తుడు; ఆ పండితుడికి అగ్నివేశుడు పుట్టారు. అగ్నివేశుడు కన్యకకొడుకు అనబడి, జాతకర్ణుండు అను పేర గొప్పఋషిగా విలసిల్లాడు. అతని వలన అగ్నివేశ్యాయనం అను బ్రాహ్మణకులం ఏర్పడింది - :వంశం - సూర్యవంశం;::తల్లి - దేవదత్తుడు;:::::పద్య సం.(లు) - 9-42-వ.,

[ ⇑ ] :143) జాతవేదుడు- (పురుష){సంజ్ఞా}[దైవ యోని]:- విష్ణువు బ్రహ్మాది దేవతలు కీర్తిస్తూ, జాతవేదుడవు అనికూడా అంటారు - :వంశం - దైవ యోని;:::::::పద్య సం.(లు) - 8-155-వ.

[ ⇑ ] :144) జాతవేదుడు అగ్ని- (పురుష){సంజ్ఞా}[దైవ యోని]:- జాతవేదుడు అనే అగ్ని పురూరవుని కొడుకుగా కల్పించబడింది. పురూరవుడు ఊర్వశిని వదలలేక గంధర్వులను అడిగాడు. వారు కుంపటిని ఇచ్చారు. కొన్నాళ్ళకు అది ఊర్వశి కాదు కుంపటి అని తెలుసుకుని దానిని పారేసాడు. పిమ్మట పారవేసిన చోటికి పోయి. రెండు ఆరణి కఱ్ఱలను చేసి పై ఆరణి తాను అని క్రింద ఆరణి కొడుకు అని, మధ్యన ఉన్న పుల్ల కొడుకు అని మంత్రాలు చదువుతూ మథింస్తుంటే జాతవేదుడు అనే అగ్ని పుట్టింది. అది ఆహవనీయాది రూపి అయి పురూరవుని కొడుకుగా కల్పించబడింది. అతనిని సుగతులకు పంపడానికి సమర్థం అయింది - :వంశం - దైవ యోని;:తండ్రి - పురూరవుడు;::::::పద్య సం.(లు) - 9-419-వ.,

[ ⇑ ] :145) జాతిసౌమనస్యంబు-1 ( -){జాతి}[వృక్ష]:- జాతిసౌమనస్యంబు అంటే జాజిపూలు కలది అని జాతీయ భావాలు కలది అని నానార్ర్థాలు ఉన్నాయి. ఈ పదం ప్రథమ స్కంధలో నైమిశారణ్య వర్ణన సందర్భంలో వానాకాలపు సంధ్యాసమయం} కు ఉపమాన పదంగా వాడబడింది. - :వంశం - వృక్ష;:::::::పద్య సం.(లు) - 1-39-వ.,

[ ⇑ ] :146) జాతిసౌమనస్యంబు-2 ( -){జాతి}[మానవ యోని]:- జాతిసౌమనస్యంబు అంటే జాతీయ భావాలు కలది అని జాజిపూలు కలది అని నానార్ర్థాలు ఉన్నాయి. ఈ పదం ప్రథమ స్కంధలో నైమిశారణ్య వర్ణన సందర్భంలో వానాకాలపు సంధ్యాసమయం} ఉపమాన పదంగా వాడబడింది. - :వంశం - మానవ యోని;:::::::పద్య సం.(లు) - 1-39-వ.,

[ ⇑ ] :147) జాతుకర్ణి- (పురుష){సంజ్ఞా}[ఋషి]:- జాతుకర్ణి వాత్స్యుడు, మౌద్గల్యుడు, శాలీయుడు, గోముఖుడు, శిశురుడు శాకల్యుల నుండి తమ తమ ఋగ్వేద శాఖలను ఉపదేశం పొందాడు. జాతుకర్ణి బలాకుడు, పైంగుడు, వైతాళుడు, విరజుడు అనే నలుగురికి ఋగ్వేద శాఖలను ఉపదేశించాడు.
చిత్రకేతోపాఖ్యనంలో పుత్రదుఖంలో ఉన్న చిత్రకేతుడు వద్దకు నారదాదుల వచ్చినప్పుడు, వారిని మీరెవ్వరని అనేక మునులపేర్లు చెప్తూ జాతకర్ణుని పేరుకూడా తలుస్తాడు. - :వంశం - ఋషి;:::::::పద్య సం.(లు) - 6-458-సీ., 12-30-వ.,

[ ⇑ ] :148) జానువర్తనలు- ( -){జాతి}[నృత్తము]:- పారిభాషిక పదము - రాసక్రీడ - నృత్తము
కాలు మడచు విధములు - :వంశం - నృత్తము;:::::::పద్య సం.(లు) - 10.1-1084-వ.,

[ ⇑ ] :149) జాబాలి- (పురుష){సంజ్ఞా}[ఋషి]:- జాబాలి,కుముదుడు, శునకుడు, బభ్రువు, అంగిరసుడు, సైంధవాయునుడు పథ్యుడు నుండి తమ తమ అధర్వవేద శాఖలను నేర్చుకున్నారు.
ప్రచేతసులు తపస్సుకు జాబాలి తపస్సు చేసిన ప్రాంతమునకు వెళ్ళారు. ఇతడు పశ్చిమ తీరమున ప్రసిద్దుడైన సిద్దుడు - :వంశం - ఋషి;:::::::పద్య సం.(లు) - 12-30-వ., 4-946-సీ.

[ ⇑ ] :150) జామిదేవి- (స్త్రీ){సంజ్ఞా}[ఋషి]:- ఈ జామిదేవి దక్షునకు అసక్నియందు పుట్టినామె. దక్షుడు ధర్మునకు భార్యలుగా ఇచ్చిన పదిమందిలో నాలుగవామె. ఆ ధర్మునికి జామిదేవియందు దుర్గ భూముల కధిష్ఠాన దేవతలు జనియించిరి - :వంశం - ఋషి;:తండ్రి - దక్షుడు;:తల్లి - అసక్ని;::భర్త - ధర్ముడు;:కొడుకు(లు) - కోటలకు అధిష్టాన దేవతలు;::పద్య సం.(లు) - 6-254-వ.

[ ⇑ ] :151) జాహ్నవి- (స్త్రీ){సంజ్ఞా}[నది]:- బలరాముడు తీర్థయాత్రలకు వెళ్ళినప్పుడు ఈ తీర్థం సేవించాడు. జాహ్నవి అనగా గంగానది. జహ్నుడు అను రాజర్షి తన యజ్ఞవాటమున గంగ ప్రవేశించినప్పుడు దానిని పానముచేసి భగీరథుని ప్రార్థనచే మరల తన చెవిగుండ వెడల విడిచెను. కనుక గంగకు జాహ్నవి అను నామము కలిగెను. - :వంశం - నది;:::::::పద్య సం.(లు) - 10.2-927-వ.

[ ⇑ ] :152) జితవ్రతుడు- (పురుష){సంజ్ఞా}[మనువు వంశం]:- ఇతడు హవిర్దానునికి భార్య హవిర్థాని యందు పుట్టిన పుత్రులు ఆరుగురిలో చిన్నవాడు. - :వంశం - మనువు వంశం;:తండ్రి - హవిర్దానుడు;:తల్లి - హవిర్థాని;:::::పద్య సం.(లు) - 4-679-వ.

[ ⇑ ] :153) జితాశ్వుడు- (పురుష){సంజ్ఞా}[మనువు వంశం]:- ఇతడు పృథువు పెద్దకుమారుడు, తండ్రి చేస్తున్న అశ్వమేధయాగంలో, అశ్వాన్ని ఇంద్రుడు ఎత్తుకుపోతే ఇతను వెళ్ళి తీసుకువచ్చాడు. కనుక జితాశ్వుడు, విజితాశ్వుడు అను పేరులు వచ్చినవి. ఇతడు పృథివుకు అర్చియందు కలిగిన ముగ్గురు కొడుకులలో పెద్దవాడు. అతనికి నభస్వతి అనెడి రెండవ భార్య యందు హవిర్దానుడు పుట్టెను. - :వంశం - మనువు వంశం;:తండ్రి - పృథువు;::::::పద్య సం.(లు) - 4-519-వ., 4-640-వ., 4-675-క.

[ ⇑ ] :154) జిత్తి/శాంతి- (స్త్రీ){సంజ్ఞా}[ఋషి]:- ఈమె కర్దమునికి దేవహూతి యందు కలిగిన పుచ్రికలలో ఒకామె. అథర్వుం డనువానికిఁ భార్య జిత్తి యందు ధృతవ్రతుండు నశ్వ శిరస్కుండు నయిన దధ్యంచుండు పుట్టె - :వంశం - ఋషి;:తండ్రి - కర్దముడు;:తల్లి - దేవహూతి ;::భర్త - అధర్వుడు;:కొడుకు(లు) - ధృతవ్రతుడు; దధ్యంచుడు అశ్వశిరస్కుడు ;::పద్య సం.(లు) - 4-26-వ.

[ ⇑ ] :155) జినుడు- (పురుష){సంజ్ఞా}[దైవయోని]:- జైనావతారము ప్రథమ స్కంధములో వివరించిన వైష్ణవ అవతారాలలో ప్రధానమైన ఏకవింశ త్యవతారములు (21) అందలి 21 వ. అవతారం (1-63-వ.) - :వంశం - దైవయోని;:తండ్రి - జినుడు;::::::పద్య సం.(లు) - 1-63-వ.,

[ ⇑ ] :156) జిఱజిఱ- ( - ){సంజ్ఞా}[ -]:- జిఱజిఱ అంటే గిరగిర, గుండ్రంగా తిరుగట యందలి ధన్వనుకరణు - :వంశం - -;:::::::పద్య సం.(లు) - 10.1-663-చ.

[ ⇑ ] :157) జిష్ణుడు- (పురుష){సంజ్ఞా}[దైవ యోని]:- జిష్ణుడు అంటే విష్ణువు జయించు శీలము గలవాడు కనుక జిష్ణువు, - :వంశం - దైవ యోని;:::::::పద్య సం.(లు) - 1-207-క., 2-236-మ., 3-148-మ., ....

[ ⇑ ] :158) జిహ్మగులు- (పురుష){జాతి}[దేవయోని]:- జిహ్మగములు అంటే వంకరగా పోవునవి, సర్పములు. ఇది యొక దేవ యోని - :వంశం - దేవయోని;:::::::పద్య సం.(లు) - 6-259-సీ.

[ ⇑ ] :159) జీమూత- (పురుష){జాతి}[దేవయోని]:- జీమూతులు ఒక దేవయోని - :వంశం - దేవయోని;:::::::పద్య సం.(లు) - 2-91-సీ.

[ ⇑ ] :160) జీమూతుడు- (పురుష){సంజ్ఞా}[చంద్రవంశం]:- చంద్రంశంలోని రోమపాదుని తరువాతతరపు వ్యోముని పుత్రుడు ఈ జీమూతుడు. ఇతనికి వికృతి అని పుత్రుడు కలడు. - :వంశం - చంద్రవంశం;:తండ్రి - వ్యోముడు;::::కొడుకు(లు) - వికృతి;::పద్య సం.(లు) - 9-709-వ.

[ ⇑ ] :161) జీవనము-1 ( -){జాతి}[ -]:- జీవిక - :వంశం - -;:::::::పద్య సం.(లు) - 8-61-ఆ.,

[ ⇑ ] :162) జీవనము-2 ( -){జాతి}[ -]:- నీరు - :వంశం - -;:::::::పద్య సం.(లు) - 8-61-ఆ.,

[ ⇑ ] :163) జృంభణశరము- ( -){జాతి}[ఆయుధము]:- జృంభణశరము అంటే సమ్మోహనాస్త్రము, మోహనబాణము. పరమశివునికి కృష్ణునికి జరిగిన యుద్ధంలో, శివునిపై జృంభణశరము కృష్ణుడు వేసెను. - :వంశం - ఆయుధము;:::::::పద్య సం.(లు) - 10.2-413-క.

[ ⇑ ] :164) జేష్ఠ- (స్త్రీ){సంజ్ఞా}[]:- జేష్ఠ 38 [18] - 27 నక్షత్రాలలో 18వది] - :se:తండ్రి - దక్షుడు;:తల్లి - అసక్ని;::భర్త - చంద్రుడు;:::పద్య సం.(లు) - 6-254-వ.

[ ⇑ ] :165) జైగిష- (పురుష){సంజ్ఞా}[ఋషి]:- శుకుని పుత్రిక సత్కృతి యందు నీపరాజు బ్రహ్మదత్తుని పొందాడు.ఆ బ్రహ్మదత్తుడు జైగిషుని యొక్క ఉపదేశం పొంది, యోగతంత్రంతో భార్య గోదేవి అందు విష్వక్సేనుడు అనే పుత్రుని పొందాడు. విష్వక్సేనునకు ఉదక్సేనుడు; ఉదక్సేనునకు భల్లాదుడు పుట్టారు. వీరు బార్షదిషువులు అనే రాజులు - :వంశం - ఋషి;:::::::se [ ⇑ ] :166) జైనులు- (పురుష){జాతి}[మానవ యోని]:- శుకుని పుత్రిక సత్కృతి యందు నీపరాజు బ్రహ్మదత్తుని పొందాడు.ఆ బ్రహ్మదత్తుడు జైగిషుని యొక్క ఉపదేశం పొంది, యోగతంత్రంతో భార్య గోదేవి అందు విష్వక్సేనుడు అనే పుత్రుని పొందాడు. విష్వక్సేనునకు ఉదక్సేనుడు; ఉదక్సేనునకు భల్లాదుడు పుట్టారు. వీరు బార్షదిషువులు అనే రాజులు - :వంశం - మానవ యోని;:::::::పద్య సం.(లు) - 4-524-సీ

[ ⇑ ] :167) జైమిని-1 (పురుష){సంజ్ఞా}[ఋషి]:- ఇతడు ధర్మరాజు చేసిన రాజసూయయాగంలో పాల్గొన్న మునీశ్వరులలో ఒకడు - :వంశం - ఋషి;:::::::పద్య సం.(లు) - 10.2-766-సీ.,

[ ⇑ ] :168) జైమిని-2 (పురుష){సంజ్ఞా}[ఋషి]:- జైమినిమహర్షి సామవేదాన్ని వేదవ్యాసుని నుండి అభ్యసించి, తన కుమారుడైన సుమంతునికి బోధించాడు. - :వంశం - ఋషి;:::::::పద్య సం.(లు) - 12-30-వ.,

[ ⇑ ] :169) జైవాతృకకులము- (పురుష){జాతి}[మానవ యోని]:- కలి నష్టమైపోయేక దేవాపి జైవాతృకకులము స్థాపించును. - :వంశం - మానవ యోని;:::::::పద్య సం.(లు) - 9-664-క.

[ ⇑ ] :170) జొఱజొఱ- ( -){సంజ్ఞా}[ -]:- జొఱజొఱ అంటే మిణుగురులు రాలటంలో ధ్వనికి ధన్వనుకరణమి. - :వంశం - -;:::::::పద్య సం.(లు) - 10.1-663-చ.

[ ⇑ ] :171) జోడుఁగైదువలు- (స్త్రీ){జాతి}[పరికరములు]:- జోడుఁగైదువులను ఆయుధములను, బలి దేవేంద్రుల నేతృత్వంలో జరిగిన సురాసుర యుద్ధంలో రాక్షసులు వాడారు. - :వంశం - పరికరములు;:::::::పద్య సం.(లు) - 8-327-క., నుండి 8-334-వ., వరకు

[ ⇑ ] :172) జ్యాముఖుడు- (పురుష){సంజ్ఞా}[చంద్రవంశం]:- రుచికునకు పురుజిత్తు, రుక్ముడు, రుక్మేషువు, పృథువు, జ్యాముఖుడు అని ఐదుగురు పుత్రులు జన్మించారు. ఆ జ్యాముఖుడు శైబ్య యందలి గాఢమైన ప్రేమ వలన, పిల్లలులేకపోయినా మరింకొక భార్యను చేపట్టలేదు. పిమ్మట ఒక ఆజపిల్లను పట్టుకువచ్చాడు. తరువాత, అతనికి శైబ్యయందు విదర్భుడు పుట్టాడు. పుత్రుని చూసి జ్యాముఖుడు తను తెచ్చిన యువతిని తీసుకొని వచ్చి పుత్రునికిచ్చి వివాహం చేసాడు. - :వంశం - చంద్రవంశం;:తండ్రి - రుచికుడు;:తల్లి - శైబ్య;:::కొడుకు(లు) - విదర్భుడు;::పద్య సం.(లు) - 9-705-వ.

[ ⇑ ] :173) జ్యేష్ఠ- (స్త్రీ){సంజ్ఞా}[దేవయోని]:- జ్యేష్ఠ మాత్రుకలలో ఒకరు. కృష్ణునికి దృష్టి తీస్తూ గోపికలు తలుస్తారు. - :వంశం - దేవయోని;:::::::పద్య సం.(లు) - 10.1-236-వ.

[ ⇑ ] :174) జ్యేష్ఠ (శుక్ర)- ( -){సంజ్ఞా}[కాలం]:- సూర్యుడు ఈ మాసంలో మిత్రుడు అను పేరుతో, మేనక, అత్రి, తక్షకుడు, పౌరుషేయుడు, హాహా, రథస్వనుడు మున్నగువారు అనుచరులుగా కలిగి సంచరిస్తాడు. - :వంశం - కాలం;:::::::పద్య సం.(లు) - 12-41-వ., నుండి 12-45-వ., వరకు

[ ⇑ ] :175) జ్యేష్ఠం- ( -){సంజ్ఞా}[భగణ విషయం]:- శింశుమారచక్రం ఎడమ కుడివైపుల మూపులయందు శతభిషం, జ్యేష్ఠం నక్షత్రాలున్నాయి. - :వంశం - భగణ విషయం;:::::::పద్య సం.(లు) - 5.2-97-వ.,

[ ⇑ ] :176) జ్యోతిర్గణములు- ( -){సంజ్ఞా}[భగణ విషయం]:- జ్యోతిస్వరూపంతో ఆకాశంలో ఉండెడివి జ్యోతిర్గణములు. అవన్నీ శింశుమార చక్రంలో ఉన్నాయి. - :వంశం - భగణ విషయం;:::::::పద్య సం.(లు) - 5.2-96-క.,

[ ⇑ ] :177) జ్యోతిర్వ్యోముడు- (పురుష){సంజ్ఞా}[ఋషి]:- నాలుగవదైన తామస మన్వంతరంలో జ్యోతిర్వ్యోముడు మున్నగువారు సప్తర్షులు - :వంశం - ఋషి;:::::::పద్య సం.(లు) - 8-18-సీ.,

[ ⇑ ] :178) జ్యోతిష్మంతం- ( -){సంజ్ఞా}[పర్వతం]:- ప్లక్షద్వీపంలోని శాంతవర్షంలో జ్యోతిష్మంతం అను కుల పర్వతము, సౌమిత్రి అను మహానది ఉన్నాయి. - :వంశం - పర్వతం;:::::::పద్య సం.(లు) - 5.2-60-వ.,

[ ↑ ] :1) ఝంఝానిలము- ( -){జాతి}[ -]:- భయంకరమైన గాలి - :వంశం - -;:::::::పద్య సం.(లు) - 8-51-సీ.,

[ ⇑ ] :2) ఝిల్లీ - ( -){జాతి}[కీటక]:- ఈలపురుగు - ఇవి అష్టమ స్కంధములోని త్రికూట పర్వతములో వర్ణించబడ్డాయి - :వంశం - కీటక;:::::::పద్య సం.(లు) - 8-23-సీ., 8-24-వ., 8-25-క.,

[ ↑ ] :1) టేంకణ- ( -){సంజ్ఞా}[ప్రదేశం]:- ఉషాకుమారికి కలలో కనబడిన రాకుమారుని కముగొనుటకు, ఆమె నెచ్చెలి, మంత్రిపుత్రీ అయిన చిత్రరేఖ రాజుల చిత్రాలు అన్నీ వేసింది. అలా వేసిన చిత్రాలలో మాళవ, కొంకణ, ద్రవిడ, మత్స్య, పుళింద, కళింగ, భోజ, నేపాల, విదేహ, పాండ్య, కురు, బర్బర, సింధు, యుగంధర, ఆంధ్ర, బంగాళ, కరూశ, టేంకణ, త్రిగర్త, సుధేష్ణ, మరాట, లాట, పాంచాల, నిషాద, ఘూర్జర, సాళ్వ దేశాల ప్రభువులు ఉన్నారు చూడు అని చూపించింది. - :వంశం - ప్రదేశం;:::::::పద్య సం.(లు) - 10.2-348-ఉ.,

[ ↑ ] :1) డాకినీ- (స్త్రీ){జాతి}[రాక్షస యోని]:- కృష్ణునికి దృష్టి తీస్తూ ఈ పిశాచబేధమును తలచిరి. - :వంశం - రాక్షస యోని;:::::::పద్య సం.(లు) - 10.1-236-వ.

[ ⇑ ] :2) డోలాపాదవ్యోమాచారి- ( -){సంజ్ఞా}[నృత్తము]:- పారిభాషిక పదము - రాసక్రీడ - నృత్తము
కాలు పైకి ఎత్తి ఊపిఊపి అడుగులుంచుట - :వంశం - నృత్తము;:::::::పద్య సం.(లు) - 10.1-1084-వ.,