శ్రీరామ

up-arrow

ఓం నమో భగవతే వాసుదేవాయ
తెలుగు భాగవతములోని పేర్ల కోశము
(నిర్మాణంలో ఉంది - సవరణలు సూచనలు అందించండి)


అక్షరాలుఇతరులవిపురుషులవిస్త్రీలవిమొత్తం పేర్లు
అచ్చులు15349393739
6722429320
అం12451269
23501285
16451475
17210
216815104
18716
626133
0202
47011
2406
0314
0404

అం

  1) అంకురిత - ( -){జాతి}[వృక్ష]:- మొలకలెత్తుచున్న (మొలకలు, విత్తనాలు) - ఇవి అష్టమ స్కంధములోని త్రికూట పర్వతములో వర్ణించబడ్డాయి - వంశం - వృక్ష; పద్య సం.(లు) - 8-23-సీ., 8-24-వ., 8-25-క.,

  2) అంగదుడు-1 (పురుష){సంజ్ఞ}[దైవ యోని]:- మన్మథుడు - వంశం - దైవ యోని; పద్య సం.(లు) - 5.2-28-ఉ., 5.2-29-క., 6-29-క., 6-90-క.6-278-ఉ., 6-269.1-తే., 10.1-804-క.,. 10.1-1013-ఉ., 10.1-1044-క.,. 10.1-1465-మ., 10.1-1488-మ., 10.2-370-సీ.,

  3) అంగదుడు-2 (పురుష){సంజ్ఞ}[వానర యోని]:- రామ రావణ యుద్ధంలో పాల్గొన్న వానర వీరుడు, వాలికి తారయందు పుట్టినవాడు - వంశం - వానర యోని; తండ్రి - వాలి; తల్లి - తార; పద్య సం.(లు) - 9-291-వ., 9-319-సీ.,

  4) అంగదుడు-3 (పురుష){సంజ్ఞ}[సూర్యవంశం]:- లక్ష్మణుని పెద్దకొడుకు, రెండవవాడు చంద్రకేతుడు. - వంశం - సూర్యవంశం; తండ్రి - లక్ష్మణుడు; తల్లి - ఊర్మిళ; పద్య సం.(లు) - 9-947-వ.,

  5) అంగహారములు- ( -){జాతి}[నృత్తము]:- పారిభాషిక పదము - రాసక్రీడ - నృత్తము
చరణ కటి కర కంఠాది అవయవముల కదలికలచే వ్యక్తపరచు భావ సూచక విధములు - వంశం - నృత్తము; పద్య సం.(లు) - 10.1-1084-వ.,

  6) అంగారకుడు- ( -){జాతి}[భగణ విషయం]:- బుధునికంటే పైన రెండు లక్షల యోజనాల దూరంలో అంగారకుడు ఉన్నాడు. అతడు మూడు పక్షాల కాలంలో ఒక్కొక్క రాశి దాటుతూ సంచారం చేస్తాడు. ఈ విధంగా పన్నెండు రాసులలో రాజసంతో సంచరిస్తూ ఉంటాడు. శింశుమారచక్రం ముఖంలో అంగారకుడు ఉన్నాడు. - వంశం - భగణ విషయం; పద్య సం.(లు) - 5.2-89-సీ., 5.2-97-వ.,

  7) అంగిరస- (స్త్రీ){సంజ్ఞ}[ఋషి]:- దక్షుని 8వ కూతురు, వసువునందు ధర్మునికి పుట్టిన 7వ కొడుకు వస్తువు యొక్క భార్య. వీరికి పుత్రుడు విశ్వకర్ముడు. - వంశం - ఋషి; తండ్రి - దక్షుడు; తల్లి - అసిక్ని; భర్త - వస్తువు ; కొడుకు(లు) - విశ్వకర్ముడు; పద్య సం.(లు) - 6-254-వ.,

  8) అంగిరసి- ( -){సంజ్ఞ}[నది]:- ప్లక్షద్వీపంలోని సుభద్రవర్షంలో ఇంద్రసేనం అను కుల పర్వతము, అంగిaరసి అను మహానది ఉన్నాయి. - వంశం - నది; పద్య సం.(లు) - 5.2-60-వ.,

  9) అంగిరసుడు-1 (పురుష){సంజ్ఞ}[ఋషి]:- శ్రీకృష్ణుని దర్శించి, వసుదేవునిచే యాగం చేయించిన ఋషులలో ఒకరు.. అలా వచ్చిన ఋషులు ద్వితుడు, త్రితుడు, దేవలుడు, వ్యాసుడు, కణ్వుడు, నారదుడు, గౌతముడు, చ్యవనుడు, వాల్మీకి, గార్గ్యుడు, వసిష్టుడు, గాలవుడు, అంగిరసుడు, కశ్యపుడు, అసితుడు, మార్కండేయుడు, అగస్త్యుడు, యాజ్ఞవల్క్యుడు, మృగుడు, శృంగుడు, అంగీరులు. - వంశం - ఋషి; పద్య సం.(లు) - 10.2-1117-ఉ.,

  10) అంగిరసుడు-2 (పురుష){సంజ్ఞ}[ఋషి]:- ఋషి, రంగపతితుడైన భీష్ముడిని దర్శించడానికి ధర్మరాజు వెళ్ళినప్పుడు బృహదశ్వుడు, భరద్వాజుడు, పరశురాముడు, పర్వతుడు, నారదుడు, వేదవ్యాసుడు, కశ్యపుడు, ఆంగిరసుడు, కౌశికుడు, ధౌమ్యుడు, సుదర్శనుడు, శుకుడు, వసిష్ఠుడు మొదలైన పెక్కుమంది రాజర్షులు, బ్రహ్మర్షులు తమతమ శిష్యులతో కూడి వచ్చారు. వారిలో ఈయ నొకరు. - వంశం - ఋషి; పద్య సం.(లు) - 1-206-వ., ,

  11) అంగిరసుడు-3 (పురుష){సంజ్ఞ}[ఋషి]:- అంగిరసుడు, కుముదుడు, శునకుడు, జాబాలి, బభ్రువు, సైంధవాయునుడు పథ్యుడు నుండి తమ తమ అధర్వవేద శాఖలను నేర్చుకున్నారు. - వంశం - ఋషి; పద్య సం.(లు) - 12-30-వ.,

  12) అంగిరసుడు-4 (పురుష){సంజ్ఞ}[ఋషి]:- ఇతడు శ్రావణ (నభో) మాసంలో సూర్యుని అనుచరులలోని ఋషి.
సూర్యుడు ఈ మాసంలో ఇంద్రుడు అను పేరుతో, ప్లమోచ, అంగిరసుడు, ఏలాపుత్రుడు, చర్యుడు, విశ్వవసువు, శ్రోతుడు మున్నగువారు అనుచరులుగా కలిగి సంచరిస్తాడు. - వంశం - ఋషి; పద్య సం.(లు) - 12-41-వ. నుండి 12-45-వ. వరకు,

  13) అంగిరసుడు-5 (పురుష){సంజ్ఞ}[ఋషి]:- మహర్షి, బ్రహ్మ దేవుని ముఖం నుండి పుట్టాడు.
ఋషి, కర్దముని 3వ కూతురు శ్రద్ధని వివాహం చేసుకున్నాడు. వీరి కొడుకులు - ఉచథ్యుడు; బృహస్పతి; కూతుర్లు- సినీవాలీ; కూహూ; రాకా; అనుమతి ; - వంశం - ఋషి; తండ్రి - బ్రహ్మదేవుడు; భార్య - శ్రద్ధ ; కొడుకు(లు) - ఉచథ్యుడు; బృహస్పతి; కూతురు(లు)- సినీవాలీ; కూహూ; రాకా; అనుమతి ; పద్య సం.(లు) - 3-377-సీ., 3-849-వ., 4-24-క.,

  14) అంగిరసుడు-6 (పురుష){సంజ్ఞ}[ధ్రువుని వంశం]:- ఇతడు ధ్రువుని వంశపు ఉల్ముకునికి భార్య పుష్కరిణి యందు కలిగిన కొడుకులు ఆరుగురిలో ఒకడు. వారు అంగుడు, సుమనసుడు, ఖ్యాతి, క్రతువు, అంగిరసుడు, గయుడు - వంశం - ధ్రువుని వంశం; తండ్రి - ఉల్ముకుడు; తల్లి - పుష్కరిణి ; పద్య సం.(లు) - 4-390-వ.,

  15) అంగిరసుడు-7 (పురుష){సంజ్ఞ}[విప్ర]:- భరతుడు అంగిరసునికి కనిష్ఠ భార్య యందు తన కడమ జన్మ ఐన విప్రుడుగా పుట్టాడు. - వంశం - విప్ర; పద్య సం.(లు) - 5.1-119-సీ., 5.1-120-వ., 5.1-121-మ.,

  16) అంగిరసుడు-8 (పురుష){సంజ్ఞ}[ప్రజాపతి వంశం]:- ప్రజాపతి, వీరికి దక్షుడు అసక్ని యందు తనకు కలిగిన స్వధ, సతి అను 13వ, 14వ కూతురులను ఇచ్చెను. - వంశం - ప్రజాపతి వంశం; భార్య - స్వధ ; సతి ; కొడుకు(లు) - పిత్రుగణములు; అధర్వ వేదాభిమాన దేవతలు; పద్య సం.(లు) - 6-252-వ., 6-254-వ.,

  17) అంగిరసుడు-9 (పురుష){సంజ్ఞ}[విప్ర]:- చిత్రకేతోపాఖ్యానంలోని చిత్రకేతు మహారాజుని అనుగ్రహించి, పుత్రకామేష్టిశేషాన్ని అతని పెద్ద భార్య కృతద్యుతికి ప్రసాదించి పుత్రుడు కలిగేలా చేసాడు. చివరకు నారదునితో కలిసి కుమారుని మరణదుఃఖంతో అలమటిస్తున్న రాజుకు తత్వం అనుగ్రహించారు. - వంశం - విప్ర; పద్య సం.(లు) - 6-449-వ., 6-455-వ., 6-461-వ.,

  18) అంగిరసుడు-10 (పురుష){సంజ్ఞ}[ఋషి]:- మరుత్తుడి యాగానికి నిర్వాహకుడు అయిన సంవర్తుని తండ్రి - వంశం - ఋషి; కొడుకు(లు) - సంవర్తుడు; పద్య సం.(లు) - 9-45-సీ.,

  19) అంగిరసుడు-11 (పురుష){సంజ్ఞ}[విప్ర]:- అంబరీషుని వంశంలోని రథీతరునికి సంతతి లేకున్నఅంగిరసు డను మునీంద్రుండు అతని భార్యయందు బ్రహ్మతేజస్సుతో కూడిన కొడుకులను కలిగించెను. వారలు రథీతరగోత్రులు ఆంగిరసులను బ్రాహ్మణులునై యితరులు కంటె ముఖ్యులయి ప్రవర్తిల్లారు. - వంశం - విప్ర; పద్య సం.(లు) - 9-51-వ.,

  20) అంగీరుడు- (పురుష){సంజ్ఞ}[ఋషి]:- శ్రీకృష్ణుని దర్శించుకోవడానికి వచ్చి వసుదేవునిచే క్రతువు చేయించిన మునీశ్వరులలో ఒక మునీశ్వరుడు.
ద్వారకకు శ్రీకృష్ణుని చూడటానికి వచ్చినప్పుడు, సాంబుని గర్భవతిగా చూపి ఆడపిల్ల పుడుతుందా మగపిల్లాడు పుడతాడా అని అడిగిన యాదవులకు ముసలం పుడుతుందని శపించిన వారిలో ఈయనొకడు - వంశం - ఋషి; పద్య సం.(లు) - 10.2-1117-ఉ.,10.2-1129-వ., 11-11-వ., 11-18-వ., 11-22-క.,

  21) అంగుడు-1 (పురుష){సంజ్ఞ}[ధ్రువుని వంశం]:- ఇతడు ధ్రువుని వంశపు ఉల్ముకునికి భార్య పుష్కరిణి యందు కలిగిన కొడుకులు ఆరుగురిలో ఒకడు. వారు అంగుడు, సుమనసుడు, ఖ్యాతి, క్రతువు, అంగిరసుడు, గయుడు. ఇతనికి బార్య సునీథ యందు పుట్టిన కొడుకు వేనుడు. - వంశం - ధ్రువుని వంశం; తండ్రి - ఉల్ముకుడు; తల్లి - పుష్కరిణి ; భార్య - సునీథ; కొడుకు(లు) - వేనుడు; పద్య సం.(లు) - 4-390-వ.,

  22) అంగుడు-2 (పురుష){సంజ్ఞ}[చంద్రవంశం]:- బలి అనే రాజుకు అతని భార్య సుధేష్ణయందు కలిగిన ఆరుగురు కొడుకులలో పెద్ద కొడుకు. మిగతా వారు వంగుడు, కళింగుడు, సింహుడు, పుండ్రుడు, ఆంధ్రుడు. వీరు 6గురు వారి వారి పేర ఉన్న భారతవర్షంలోని తూర్పు దేశాలకు రాజులై పాలించారు, - వంశం - చంద్రవంశం; తండ్రి - బలి; తల్లి - సుధేష్ణ; పద్య సం.(లు) - 9-663-వ.,

  23) అంజన- (స్త్రీ){సంజ్ఞ}[దైవయోని]:- ఈశాన్య దిగ్గజమైన సుప్రతీకము భార్య అయిన అంజనావతి - వంశం - దైవయోని; పద్య సం.(లు) - 8-40-సీ.,

  24) అంజనావతి- ( -){సంజ్ఞ}[దిగ్గజము]:- దిగ్గజముల భార్యలలో ఒకటి, ఈశాన్య దిక్కు దిగ్గజము సుప్రతీకం భార్య అంజనావతి లేదా అంజనం. - వంశం - దిగ్గజము; భర్త - సుప్రతీకం; పద్య సం.(లు) - 8-40.1-తే.,

  25) అంజనీదేవి-1 (స్త్రీ){సంజ్ఞ}[దైవ యోని]:- కింపురుష వర్షానికి సీతా లక్ష్మణ సమేతుడైన శ్రీరామచంద్రుడు అధిదేవత. అధిపతి అంజనీదేవి పుత్రుడైన ఆంజనేయుడు, ప్రజలు కింపురుష గణాలు - వంశం - దైవ యోని; పద్య సం.(లు) - 5,2-51-క., 5.2-52-ఆ.,

  26) అంజనీదేవి-2 (స్త్రీ){సంజ్ఞ}[వానర యోని]:- కేసరి అనే వానర నాయకునికి భార్య అంజనీదేవి యందు కలిగిన పుత్రుడు ఆంజనేయుడు. - వంశం - వానర యోని; భర్త - కేసరి; కొడుకు(లు) - ఆంజనేయుడు; పద్య సం.(లు) - 5.2-52-ఆ.,

  27) అంజనీసుతుడు- (పురుష){సంజ్ఞ}[వానర యోని]:- పరమ రామభక్తుడు హనుమంతుడు, వాయుదేవుని అనుగ్రహంతో, కేసరి అనే వానర నాయకుని భార్య అంజనీదేవి పుత్రుడు. సుగ్రీవుని మంత్రి. సీతాన్వేషణలో లంకకు లంఘింజిన వానర యోధుడు. - వంశం - వానర యోని; తండ్రి - కేసరి; తల్లి - అంజనీదేవి; పద్య సం.(లు) - 11-105-వ.,

  28) అంతకుడు- (పురుష){సంజ్ఞ}[దైవ యోని]:- యముడు - వంశం - దైవ యోని; తండ్రి - సూర్యుడు; పద్య సం.(లు) - 8-226.1-తే.,

  29) అంతరిక్షుడు-1 (పురుష){సంజ్ఞ}[రాక్షస యోని]:- మురాసురుని అనంతరం కృష్ణునితో పోరి మరణించిన అతని కొడుకులు తామ్రుండు, అంతరిక్షుండు, శ్రవణుడు, విభావసుడు, వసుడు, నభస్వంతుడు, అరుణుండు. ఆ ఏడుగురులో వాడు - వంశం - రాక్షస యోని; తండ్రి - మురాసురుడు; పద్య సం.(లు) - 10.2-165-వ.,

  30) అంతరిక్షుడు-2 (పురుష){సంజ్ఞ}[ప్రియవ్రతుని వంశం]:- ఋషభుని వందమంది కొడుకులలో ఒకడు. తల్లి జయంతి, వీరిలో ఇతనితోపాటు తొమ్మిది మంది పరమ భాగవతులు అయ్యారు వీరు తరువాతి కాలంలో విదేహ రాజుకు తత్వం చెప్పారు. వారు కవి, హరి, అంతరిక్షుడు, ప్రబుద్ధుడు, పిప్పలాయనుడు, అవిర్హోత్రుడు, ద్రమీఢుడు, చమనుడు, కరభాజనుడు. - వంశం - ప్రియవ్రతుని వంశం; తండ్రి - ఋషభుడు; తల్లి - జయంతి ; పద్య సం.(లు) - 5.1-63-సీ., 5.1-64-వ., 11-35-వ., 1-50-వ.,

  31) అంతరిక్షుడు-3 (పురుష){సంజ్ఞ}[సూర్యవంశం]:- భవిష్యద్రాజు పరీక్షితుని కాలానికి చెందిన ఋక్షకుని కొడుకు, - వంశం - సూర్యవంశం; తండ్రి - ఋక్షకుడు; కొడుకు(లు) - సుతపుడు; పద్య సం.(లు) - 9-366-వ.,

  32) అంతర్ధానుడు / జితాశ్వుడు- (పురుష){సంజ్ఞ}[రాజు]:- పృథుచక్రవర్తి భార్య అర్చిల పుత్రులు విజితాశ్వుడు, ధూమ్రకేశుడు, హర్యశ్వుడు, ద్రవిణుడు, వృకుడు అనే ఐదుగురులో ప్రథముడు విజితాశ్వుడు. ఇంద్రుడు అంతర్ధానం చెంది అశ్వాన్ని అపహరించిన సందర్భంలో తానుకూడా అంతర్ధాన విద్యతో ఇంద్రుణ్ణి జయించినందువల్ల విజితాశ్వుడు అంతర్ధానుడు అన్న పేర్లతో ప్రసిద్ధుడయ్యాడు. - వంశం - రాజు; తండ్రి - పృథుచక్రవర్తి; తల్లి - అర్చి; పద్య సం.(లు) - 4-640-వ.,

  33) అంతిసారుడు- (పురుష){సంజ్ఞ}[చంద్రవంశం]:- పూరువు వంశంలోని ఋతేపువు కొడుకు, ఇతని ఒక కొడుకులు సుమతి, ధ్రువుడు, అప్రతిరథుడు. - వంశం - చంద్రవంశం; తండ్రి - ఋతేపువు; కొడుకు(లు) - సుమతి, ధ్రువుడు, అప్రతిరథుడు; పద్య సం.(లు) - 9-593-వ.,

  34) అంధకారవైరి- (పురుష){సంజ్ఞ}[దైవ యోని]:- సూర్యుడు - వంశం - దైవ యోని; పద్య సం.(లు) - 1-255-ఆ.,

  35) అంధకారారాతి- (పురుష){సంజ్ఞ}[దైవ యోని]:- సూర్యుడు - వంశం - దైవ యోని; పద్య సం.(లు) - 10.1-1137-సీ.,

  36) అంధకుడు- (పురుష){సంజ్ఞ}[చంద్రవంశం]:- సాత్వతుని 7గురు కొడుకులలో 6వ వాడు - వంశం - చంద్రవంశం; తండ్రి - సాత్వతుడు; కొడుకు(లు) - భజమానుడు, కుకురుడు, శుచి, కంబళబర్హిషుడు; పద్య సం.(లు) - 9-709-వ.,

  37) అంధకులు- (పురుష){సంజ్ఞ}[చంద్రవంశం]:- యందువంశంలోని అంధకుని వంశస్థులు - వంశం - చంద్రవంశం; పద్య సం.(లు) - 1-256-వ., 1-349.10.1-1401-వ., 10.2-277-తే., 10.2-293-వ., 10.2-396., 10.2-1050తే., 10.2-1333-వ., 10.2-1343-గ.,

  38) అంధకూపం- ( -){సంజ్ఞ}[ప్రాంతం]:- నరకలోకంలో అనేక నరకాలు ఉన్నాయి. మహా భయంకరమైన ఆ నరకాలు తామిస్రం, అంధతామిస్రం, రౌరవం, మహారౌరవం, కుంభీపాకం, కాలసూత్రం, అసిపత్రవనం, సూకరముఖం, అంధకూపం, క్రిమిభోజనం, సందంశం, తప్తోర్మి, వజ్రకంటకశాల్మలి, వైతరణి, పూయోదం, ప్రాణరోధం, విశసనం, లాలాభక్షణం, సారమేయోదనం, అవీచిరయం, రేతఃపానం, క్షారమర్దమం, రక్షోగణభోజనం, శూలప్రోతం, దందశూకం, అవటనిరోధనం, అపర్యావర్తనం, సూచీముఖం అనే ఇరవై ఎనిమిది నరకాలు.
తమ బ్రతుకు తాము బ్రతికే జీవుల హింసించువాడికి అంధకూప నరకం. - వంశం - ప్రాంతం; పద్య సం.(లు) - 5.1-21-సీ., 5.2-136-వ. నుండి 5.2-164-వ., 10.2-1191-చ.,

  41) అంధతామిస్రం- ( -){సంజ్ఞ}[ప్రాంతం]:- నరకలోకంలో అనేక నరకాలు ఉన్నాయి. మహా భయంకరమైన ఆ నరకాలు తామిస్రం, అంధతామిస్రం, రౌరవం, మహారౌరవం, కుంభీపాకం, కాలసూత్రం, అసిపత్రవనం, సూకరముఖం, అంధకూపం, క్రిమిభోజనం, సందంశం, తప్తోర్మి, వజ్రకంటకశాల్మలి, వైతరణి, పూయోదం, ప్రాణరోధం, విశసనం, లాలాభక్షణం, సారమేయోదనం, అవీచిరయం, రేతఃపానం, క్షారమర్దమం, రక్షోగణభోజనం, శూలప్రోతం, దందశూకం, అవటనిరోధనం, అపర్యావర్తనం, సూచీముఖం అనే ఇరవై ఎనిమిది నరకాలు.
పరస్త్రీని మొఱగి పొందినవానికి అంధతామిస్ర నరకం - వంశం - ప్రాంతం; పద్య సం.(లు) - - 3-367-వ., 3-721-సీ., 3-990-వ., 5.2-136-వ., 5.2-139-క.,

  42) అంబ- (స్త్రీ){సంజ్ఞ}[చంద్రవంశం]:- కాశీరాజు ముగ్గురు కుమార్తెలలో పెద్ద కుమార్తె, ఈమెను అంబిక, అంబాలికలతో తీసుకువచ్చినా మరొకనికి మనసిచ్చిందని తెలిసి వెనక్కి పంపించాడు. కాని ప్రియుడు అంగీకరించ లేదు. దానితో భీష్ముని పెళ్ళిచేసుకోమంది, అతను ఒప్పుకోలేదు. అంత కోపించి తపస్సు చేసి మరుజన్మలో భీష్ముని మరణానికి కారణభూతుడైన శిఖండి అయింది - వంశం - చంద్రవంశం; తండ్రి - కాశీ రాజు; పద్య సం.(లు) - 9-671-వ.,

  43) అంబరీషుడు-1 (పురుష){సంజ్ఞ}[సూర్యవంశం]:- మాంధాత పెద్దకొడుకు అంబరీషుడు పితామహుడు యవనాశ్వునికి దత్తత వెళ్ళాడు, మాధాత గోత్రమునకు ప్రవరులు అంబరీష, యౌవనాశ్వ, హారితులు - వంశం - సూర్యవంశం; తండ్రి - మాంధాత; తల్లి - బిందుమతి; పద్య సం.(లు) - 9-191-వ.,

  44) అంబరీషుడు-2 (పురుష){సంజ్ఞ}[సూర్యవంశం]:- పరమ విష్ణుభక్తుడు. నాభాగుని కొడుకు, ఇతని ఎడల దుర్వాసుని కోపము, కృత్య నిరర్థకం అయ్యాయి. అతిథిగా వచ్చిన దూర్వాసుని వలన ద్వాదశి పారాయణకు కాలాతీతం అవుతోందని విప్రుల సలహా ప్రకారం జలం తీసుకున్నాడు. దుర్వాసుడు కోపం వచ్చి కృత్యను ప్రయోగించాడు. విష్ణుచక్రం వచ్చి కృత్యను సంహరించి వెంటపడగా త్రిమూర్తుల శరణు జొచ్చి విఫలుడై, చివరకు అంబరీషుని వేడి బయటపడ్డాడు.
ఈ నిర్మలమతి మహాత్ముడు భక్తితో ఆ దేవదేవుని సేవించి దాటరాని విష్ణుమాయను దాటాడు. - వంశం - సూర్యవంశం; తండ్రి - నాభాగుడు; కొడుకు(లు) - విరూపుడు; కేతుమంతుడు; శంభుడు; పద్య సం.(లు) - 9-80-వ., 9-736-గ., 2-240-సీ.;

  45) అంబరుడు- (పురుష){సంజ్ఞ}[రాక్షస యోని]:- వృత్రాసురునితో పాటు దేవతలతో యుద్ధం చేసిన అసంఖ్యాక రాక్షస వీరులలో ఒకడు. - వంశం - రాక్షస యోని; పద్య సం.(లు) - 6-363-వ.,

  46) అంబాలిక- (స్త్రీ){సంజ్ఞ}[చంద్రవంశం]:- కాశీరాజు ముగ్గురు కుమార్తెలలో మూడవ కుమార్తె, ఈమెను భీష్ముడు బలవంతాన తీసుకొచ్చి తన తమ్ముడు విచిత్రవీర్యుడికిచ్చి పెళ్ళి చేశాడు. విచిత్రవీర్యుడు మరణించాకా వ్యాసుని అనుగ్రహంతో పాండురాజును కన్నది. - వంశం - చంద్రవంశం; తండ్రి - కాశీ రాజు; భర్త - విచిత్రవీర్యుడు; కొడుకు(లు) - పాండురాజు; పద్య సం.(లు) - 9-671-వ.,

  47) అంబిక-1 (స్త్రీ){సంజ్ఞ}[దైవ యోని]:- మాయాదేవి. కృష్ణుడు మాయాదేవికి ఇచ్చిన 14 నామనులలో ఒకటి. అవి దుర్గ, భద్రకాళి, విజయ, వైష్ణవి, కుముద, చండిక, కృష్ణ, మాధవి, కన్యక, మాయ, నారాయణి, ఈశాన, శారద, అంబిక - వంశం - దైవ యోని; పద్య సం.(లు) - 10.1-61-వ.,

  48) అంబిక-2 (స్త్రీ){సంజ్ఞ}[దైవయోని]:- ఏకాదశ రుద్రులకు బ్రహ్మదేవుడు నిర్దేశించిన భార్యలలో ఒకామె. రుద్రుడు భవుడు నామం కలిగి భార్య అంబికతో, ప్రాణము స్థానంగా కలిగి ఉంటాడు. - వంశం - దైవయోని; భర్త - భవుడు; పద్య సం.(లు) - 3-369-క., 3-370-వ.,

  49) అంబిక-3 (స్త్రీ){సంజ్ఞ}[దైవ యోని]:- పార్వతీదేవి - వంశం - దైవ యోని; భర్త - శివుడు; పద్య సం.(లు) - 4-16-చ., 4-443-సీ., 5.2-23-ఆ., 5-2-38-సీ., 5.2-111-సీ. 6-4-ఉ., 8-516-క., 10.1-1113-వ., 10.2-10-mr., 10.2-445-వ., 10.2-1242-వ.,

  50) అంబిక-4 (స్త్రీ){}[చంద్రవంశం]:- కాశీరాజు ముగ్గురు కుమార్తెలలో రెండవ కుమార్తె, ఈమెను భీష్ముడు బలవంతాన తీసుకొచ్చి తన తమ్ముడు విచిత్రవీర్యుడికిచ్చి పెళ్ళి చేశాడు. విచిత్రవీర్యుడు మరణించాక వ్యాసుని అనుగ్రహంతో ధృతరాష్ఠ్రుని కన్నది. - వంశం - చంద్రవంశం; తండ్రి - కాశీ రాజు; భర్త - విచిత్రవీర్యుడు; కొడుకు(లు) - ధృతరాష్ట్రుడు; పద్య సం.(లు) - 9-671-వ.,

  51) అంబిక / పార్వతీదేవి- (స్త్రీ){}[దైవ యోని]:- పృథుచక్రవర్తి పట్టాభిషిక్తుడు అయిన సందర్భంలో దేవతలు అందరు వివిధ బహుమానాలు ఇచ్చారు. వారిలో పార్వతీదేవి , శతచంద్రం అనే డాలు ఇచ్చెను - వంశం - దైవ యోని; పద్య సం.(లు) - 4-442-సీ., 4-443-సీ.,

  52) అంబికాతనయుడు- (పురుష){}[దైవ యోని]:- వినాయకుడు - వంశం - దైవ యోని; తండ్రి - శివుడు; తల్లి - పార్వతి; పద్య సం.(లు) - 6-4-ఉ.,

  53) అంబికాధీశుడు- (పురుష){}[దైవ యోని]:- శివుడు - వంశం - దైవ యోని; భార్య - పార్వతి; పద్య సం.(లు) - 5.2-111-సీ.,

  54) అంబికావనం- ( -){}[క్షేత్రం]:- నందాదులు జాతరకు వెళ్ళిన వనము - వంశం - క్షేత్రం; పద్య సం.(లు) - 10.1-1113-వ.,

  55) అంబికావరుడు- (పురుష){}[దైవ యోని]:- శివుడు - వంశం - దైవ యోని; భార్య - పార్వతి; పద్య సం.(లు) - 10.2-445-వ., 10.2-1242-వ.,

  56) అంబికేయుడు- (పురుష){}[చంద్రవంశం]:- ధృతరాష్ట్రుడు అంబిక గర్భంలో వ్యాసభగవానుని వలన పుట్టిన వాడు దుర్యోధనాది కౌరవుల తండ్రి - వంశం - చంద్రవంశం; తండ్రి - విచిత్రవీర్యుడు; తల్లి - అంబిక; కొడుకు(లు) - కౌరవులు 100 మంది; కూతురు(లు)- దుశ్శల; పద్య సం.(లు) - 10.2-573-వ., 10.2-766.1-ఆ.,

  57) అంబికేశుడు- (పురుష){}[దైవ యోని]:- శివుడు - వంశం - దైవ యోని; భార్య - పార్వతి; పద్య సం.(లు) - 4-16-చ.,

  58) అంబుజనాభుడు- (పురుష){}[దైవ యోని]:- విష్ణువు - వంశం - దైవ యోని; భార్య - లక్ష్మీదేవి; పద్య సం.(లు) - 3-683-చ., 4-366-వ., 10.2-626-క.,

  59) అంబుజపత్రనేత్రుడు- (పురుష){}[చంద్రవంశం]:- కృష్ణుడు - వంశం - చంద్రవంశం; తండ్రి - వసుదేవుడు; తల్లి - దేవకి; భార్య - అష్టమహిషలు + 16000 మంది; కొడుకు(లు) - సాంబుడు మున్నగువారు అనేకులు; పద్య సం.(లు) - 1-351-శా.,

  60) అంబుజబంధుడు- (పురుష){}[దైవ యోని]:- సూర్యుడు (పద్మములకు మిత్రుడు) - వంశం - దైవ యోని; పద్య సం.(లు) - 1-248-క.,

  61) అంబుజభవుడు- (పురుష){}[దైవ యోని]:- బ్రహ్మదేవుడు - వంశం - దైవ యోని; పద్య సం.(లు) - 7-292-శా.,

  62) అంబుజసంభవుడు- (పురుష){}[దైవ యోని]:- బ్రహ్మదేవుడు - వంశం - దైవ యోని; భార్య - సరస్వతి; పద్య సం.(లు) - 10.1-507-శా.,

  63) అంబుజోదరుడు- (పురుష){}[దైవ యోని]:- విష్ణువు - వంశం - దైవ యోని; భార్య - లక్ష్మీదేవి; పద్య సం.(లు) - 1-305-సీ., 6-126-ఉ., 7-150.1-తే., 10.2-508-సీ., 10.2-1218-చ.,

  64) అంబుధార- (స్త్రీ){}[మనువు వంశం]:- దక్షసావర్ణి అనే తొమ్మిదవ మనువు కాలంలో ఈమె యందు ఆయుష్మంతునకు విష్ణువు పుడతాడు. అతని రక్షణలో "అద్భుతుడు" అనేవాడు ఇంద్రుడు అయి ముల్లోకాలనూ సంతోషంగా ఏలతాడు. - వంశం - మనువు వంశం; భర్త - ఆయుష్మంతుడు; పద్య సం.(లు) - 8-417-వ., 8-418-ఆ.,

  65) అంబోరుహము- ( -){}[వృక్ష]:- పద్మము - వంశం - వృక్ష; పద్య సం.(లు) - 8-44-సీ.,

  66) అంభోజము- ( -){}[వృక్ష]:- కమలము - వంశం - వృక్ష; పద్య సం.(లు) - 8-42-మ.,

  67) అంశుమంతుడు-1 (పురుష){}[దైవ యోని]:- సూర్యుడు, కిరణములు కలవాడు కనుక అంశుమంతుడు - వంశం - దైవ యోని; పద్య సం.(లు) - 10.2-1001-క.,

  68) అంశుమంతుడు-2 (పురుష){}[సూర్యవంశం]:- సగరుని కుమారుడైన అసమంజసుని పుత్రుడు, సగరునికి వద్ద పెరిగాడు. సగరుని అశ్వమేధ యాగాశ్వాన్ని కపిలుని వద్ద కనుగొన్నాడు. దానిని తెచ్చి సగరునికి ఇచ్చాడు. గంగను భూమికి తేవడానికి తపస్సుచేసి సాధించకుండానే మరణించాడు. ఇతని మనుమడు భగీరథుడు సాధించాడు. - వంశం - సూర్యవంశం; తండ్రి - అసమంజసుడు; కొడుకు(లు) - దిలీపుడు; పద్య సం.(లు) - 9-212-వ., సగరుని కథ,

  69) అంశువు- (పురుష){}[చంద్రవంశం]:- ఇతడు చంద్రవంశంలోని పురుహోత్రుడి కొడుకు, ఇతడి కొడుకు సాత్వతుడు. - వంశం - చంద్రవంశం; తండ్రి - పురుహోత్రుడు; కొడుకు(లు) - సాత్వతుడు; పద్య సం.(లు) - 9-709-వ.,

  [ ↑ ] 1) అకృతవ్రణుడు-1 (పురుష){}[మునీశ్వరుడు]:- ధర్మరాజు రాజసూయ యజ్ఞానికి విచ్చేసిన మునీశ్వరులలో ఒకడు. - వంశం - మునీశ్వరుడు; పద్య సం.(లు) - 10.2-766-సీ.,

  2) అకృతవ్రణుడు-2 (పురుష){}[ఋషి]:- అకృతవ్రణుడు, త్రయ్యారుణి, కశ్యపుడు, సావర్ణి, వైశంపాయనుడు, హరీతుడు అనే ఆరుగురు రోమహర్షణుని నుండి పురాణాలు నేర్చుకుని, పురాణ ప్రవక్తలుగా ప్రసిద్ధులు అయ్యారు. - వంశం - ఋషి; పద్య సం.(లు) - 12-30-వ.,

  3) అక్రూరుడు- (పురుష){}[చంద్రవంశం]:- పరమ కృష్ణ భక్తుడు,యాదవులలోని శఫల్కుని పన్నెండు మంది కొడుకులలోను పెద్దవాడు, ఈతని సోదరి సుచారువు, కంసుని పనుపున ధనుర్యాగం చూడటానికి కృష్ణుని మధురకు తీసుకువెళ్ళిన వాడు, దారిలో యమున నీటిలో వైకుంఠ దర్శనం పొందాడు, కంసవధానంతరం కృష్ణుని ఆదేశం మేరకు హస్తినకు కౌరవ పాండవులను చూచినవాడు, శతధన్వుడు, కతవర్మ అక్రూరుల ప్రోత్సాహంతో సత్రాజిత్తును సంహరించి శ్యమంతక మణిని అక్రూరుని వద్ద ఉంచి పారిపోయాడు. శతధన్వుని మరణంతో భయపడి అక్రూరుడు ద్వారక విడిచి పారిపోయాడు. అక్రూరుడు లేని ద్వారకలో వర్షాలు కురవకలేదు. కృష్ణుడు వానిని రప్పించాకా వర్షాలు పడ్డాయి. అతని వద్ద మణిని అందరికి చూపి, మరల అతనికే మణిని ఇచ్చేసాడు. - వంశం - చంద్రవంశం; తండ్రి - శ్వఫల్కుడు; తల్లి - గాంధిని; కొడుకు(లు) - దేవలుడు, అనుపదేవుడు; పద్య సం.(లు) - 1-142-వ., 1-348-సీ. 3-55-వ., 9-712-వ., 10.1-963-వ., 10.1-988-మ., 10.1-1157-వ., 10.1-1158-శా., 10.1-1161-శా. 10.1-1190-వ., 10.1-1218-శా., 10.1-1238-వ., 10.1-1524-వ., 10.2-89-వ., 10.2-96-సీ. ,

  4) అక్షకుమారుడు- (పురుష){}[రాక్షస యోని]:- ఇతడు రావణుని కుమారులలో ఒకడు. హనుమంతుడు సీతను చూసి వెనుదిరిగి పోయేటప్పుడు ఈతనిని చంపాడు. - వంశం - రాక్షస యోని; తండ్రి - రావణుడు; పద్య సం.(లు) - 9-276-వ.,

  5) అక్షహృదయము- ( -){}[విద్య]:- ఇదొక విద్య. ఇది కలవాడు చూడగానే చూచిన వస్తువుల సంఖ్యను చెప్పగలడు. ఆ విద్యను అయోధ్యరాజు ఋతుపర్ణుడు నలునికి చెప్పాడు. బదులుగా నలుడు ఇతనికి అశ్వహృదయం అనే విద్యను చెప్పాడు. - వంశం - విద్య; పద్య సం.(లు) - 9-235-అ., 9-236-వ.,

  6) అఖిలాత్ముడు- (పురుష){}[దైవ యోని]:- విష్ణువు - వంశం - దైవ యోని; పద్య సం.(లు) - 1-327-ఆ., 3-874-వ., 7-14-ఆ., 9-40-సీ., ,

  7) అగజ- (స్త్రీ){}[దైవ యోని]:- పార్వతీదేవి - వంశం - దైవ యోని; పద్య సం.(లు) - 7-395-క.,

  8) అగజాధీశుడు- (పురుష){}[దైవ యోని]:- శివుడు - వంశం - దైవ యోని; పద్య సం.(లు) - 7-395-క.,

  9) అగస్త్యుడు-1 (పురుష){}[ఋషి]:- ఇతను పులస్త్యుని కొడుకు. వేరొక జన్మలో జఠరాగ్ని అయ్యాడు, కుబేరుడు, రావణుడు ఇతని వంశంలోని వారే, - వంశం - ఋషి; తండ్రి - పులస్త్యుడు; తల్లి - హవిర్భుక్కు ; కొడుకు(లు) - విశ్రావసుడు; పద్య సం.(లు) - 4-26-వ.,

  10) అగస్త్యుడు-2 (పురుష){}[ఋషి]:- పురంజనేపాఖ్యానం లోని పాండ్యరాజైన మలయధ్వజుడు ప్రమదోత్తమ అనే విదర్భరాజ పుత్రికల కుమార్తె, అసితేక్షణ ఈ అగస్త్యుని వరించింది. - వంశం - ఋషి; పద్య సం.(లు) - 4-830.1-తే.,

  11) అగస్త్యుడు-3 ( -){}[భగణ విషయం]:- శింశుమారచక్రం పైదవడ ప్రదేశంలో అగస్త్యుడు ఉంటాడు. - వంశం - భగణ విషయం; పద్య సం.(లు) - 5.2-97-వ.,

  12) అగస్త్యుడు-4 (పురుష){}[ఋషి]:- ద్వాదశాదిత్యులు లోని 10,9 మిత్రావరుణులకు ఊర్వశి వలన రేతస్సు స్ఖలనం కాగా దానిని ఒక కుండలో ఉంచారు. అందులోనుండి అగస్త్యుడు, వసిష్ఠుడు జన్మించారు. కనుక అగస్త్యుని కూడ కుంభసంభవుడు అంటారు,
వాతాపి ఇల్వలుడు రాక్షసులను అగస్త్యుడు భక్షించాడు.
ఇంద్రుడు బ్రహ్మహత్యాపాతకుండయి మానససరస్సున ప్రవేశించాడు. ఆ కాలంలో నహుషుడు శతాశ్వమేధంబులు చేసి ఇంద్రాధిపతుడు అయ్యాడు. ఆ నహుషుడు అగస్త్యుని శాపం వలన ఇంద్రపదవి కోల్పోయి, అజగరము అయి భూమ్మీద పడ్డాడు.
బలరాముడు తన యాత్రలలో మలయాచలంపైన ఉండే అగస్త్యుని దర్శించాడు.
అజామిళ ఇతిహాసాన్ని మలయపర్వతంపైన సర్వజ్ఞుడైన అగస్త్య మహర్షి శుకబ్రహ్మకు తెలియజేసాడు.
శ్రీకృష్ణుని దర్శించుకోవడానికి వచ్చి వసుదేవునిచే క్రతువు చేయించిన మునీశ్వరులలో అగస్త్యుడు ఒకడు. - వంశం - ఋషి; తండ్రి - మిత్రావరుణులు; తల్లి - ఊర్వశి (అప్సరస); పద్య సం.(లు) - 6-192-వ., 6-507-వ., 6-437-వ., 6-531-గ. .10.2-953-వ., 10.2-1117-ఉ., 10.2-1343-గ.,

  13) అగ్ని-1 ( -){}[స్థలం]:- ఏకాదశ రుద్రులకు బ్రహ్మదేవుడు నిర్దేశించిన స్థానలలో ఒకటి. రుద్రుడు మహాకాలుడు నామం కలిగి భార్య అశనతో, అగ్ని స్థానంగా కలిగి ఉంటాడు. - వంశం - స్థలం; పద్య సం.(లు) - 3-369-క., 3-370-వ.,

  14) అగ్ని-2 ( -){}[నక్షత్ర]:- ధృవునికి సర్వోన్నతమైన ధ్రువక్షితి అనుగ్రహిస్తున్నాను అని చెప్పేటప్పుడు విష్ణుమూర్తి జ్యోతిశ్చక్రంలోని ధర్మ, అగ్ని, కశ్యప, శక్రు, సప్తర్షులును, తారకలు అను నక్షత్రాలను పేర్కొన్నాడు. - వంశం - నక్షత్ర; పద్య సం.(లు) - 4-290-వ.,

  15) అగ్ని-3 ( -){}[భగణ విషయం]:- శింశుమారచక్రం తోకభాగంలో ప్రజాపతి, అగ్ని, ఇంద్రుడు, ధర్ముడు ఉన్నారు. - వంశం - భగణ విషయం; పద్య సం.(లు) - 5.2-97-వ.,

  16) అగ్ని-4 (పురుష){}[దైవ యోని]:- ఇతను ధర్మునికి వసువునందు కలిగిన ఎనిమిది మందిలో ఐదవవాడు. వారు ద్రోణుడు, ప్రాణుడు, ధ్రువుడు, అర్కుడు, అగ్ని, దోషుడు, వస్తువు, విభావసువు;
ఇతనికి భార్య వసుధార యందు ధ్రవిణాదులు, కృత్తిక యందు స్కంధుడు జన్మించారు. - వంశం - దైవ యోని; తండ్రి - ధర్ముడు; తల్లి - వసువు ; భార్య - వసుధార; కృత్తిక; కొడుకు(లు) - ద్రవిణకుడు మొదలైనవారు; స్కంధుడు; పద్య సం.(లు) - 6-254-వ.,

  17) అగ్ని-5 (పురుష){}[దేవ యోని]:- వృత్రాసుర సంహారఘట్టంలో దేవదానవ యుద్ధం జరుగుతు న్నప్పుడు ఇంద్రుని వైపు పాల్గొన్నవారిలో ఒకరు - వంశం - దేవ యోని; పద్య సం.(లు) - 6-363-వ.,

  18) అగ్ని-6 (పురుష){}[ఋషి]:- పద్నాలుగవ (14) ఇంద్రసావర్ణి మన్వంతరంలో అగ్ని సప్తర్షులలో ఒకడు - వంశం - ఋషి; పద్య సం.(లు) - 8-427-వ.,

  19) అగ్నిదేవుడు-1 (పురుష){}[దైవ యోని]:- అగ్నిదేవునకు దక్షుని కుమార్తె అయిన స్వాహాదేవి అనే భార్య వల్ల పావకుడు, పవమానుడు, శుచి అనే ముగ్గురు కొడుకులు కలిగారు. ఆ ముగ్గురివల్ల నలభైఐదు విధాలైన అగ్నులు ఉద్భవించాయి. తాత, తండ్రులతో కూడి మొత్తం నలభైతొమ్మిది అగ్నులు అయినాయి. అగ్నిష్వాత్తులు, బర్హిషదులు, సౌమ్యులు, పితలు, ఆజ్యపులు, సాగ్నులు, విరగ్నులు అని ఏడు విధాలైన ఆ అగ్నుల నామాలతో బ్రహ్మవాదులైనవారు యజ్ఞకర్మలలో ఇష్టులు నిర్వహిస్తూ ఉంటారు. దక్ష ప్రజాపతి పుత్రిక అయిన స్వధ అనే భార్యవల్ల ఆ అగ్నులకు వయున, ధారిణి అనే ఇద్దరు కన్యలు పుట్టారు. వారిద్దరూ జ్ఞాన విజ్ఞాన పరాయణలు. బ్రహ్మనిష్ఠ కలవారు.
ప్లక్షద్వీపంలో నివసించే వారికి అగ్నిదేవుడు అధిదేవత.
అభ్యాగతుడు అగ్నిదేవ స్వరూపం.
శ్రీమన్నారాయణ కవచంలో జనాపవాదంబు వలన అగ్నిదేవుడు రక్షించు గాక అనేది స్తోత్రం ఒకటి.
చంద్రవంశంలో ఉపగురువునకు అగ్నిదేవుని ప్రసాదం వలన ఉపగర్వుడు పుట్టాడు.
అగ్ని విష్ణుమూర్తి వదనం,
తేజస్సుకోరేవారు పూజించదగిన దేవత అగ్ని - వంశం - దైవ యోని; భార్య - స్వాహాదేవి; పద్య సం.(లు) - 4-28-వ., 4-34-వ., 5.2-59.1-ఆ., 6-286-సీ., 6-307-వ., 9-374-వ., 3-38-వ.,

  20) అగ్నిదేవుడు-2 (పురుష){}[దైవ యోని]:- ప్రక్షద్వీపానికి అగ్నిదేవుడు అధిదేవత. ప్రియవ్రతుని కుమారుడైన ఇధ్మజిహ్వుడు అధిపతి. - వంశం - దైవ యోని; పద్య సం.(లు) - 5.2-59-సీ.,

  21) అగ్నిదేవుడు-3 (పురుష){}[దైవ యోని]:- రెండవ మనువు స్వారోచిషుడు అగ్ని కుమారుడు. - వంశం - దైవ యోని; కొడుకు(లు) - స్వారోచిషమనువు; పద్య సం.(లు) - 8-14-సీ.,

  22) అగ్నిదేవుడు - (పురుష){}[దైవ యోని]:- వీరు లోకుల నిందల నుండి కాపాడు గాక అని విశ్వరూపుడు దేవేంద్రునికి ఉపదేశించిన శ్రీమన్నారాయణ కవచంలో ఉన్న నలభైతొమ్మిది స్తుతులలో ఇది ఒకటి. - వంశం - దైవ యోని; పద్య సం.(లు) - 6-300-చ. నుండి 6-307-వ.,

  23) అగ్నిద్యోతనుడు- (పురుష){}[విప్ర]:- రుక్మిణి సందేశాన్ని సుసంపన్నంగా శ్రీకృష్ణునికి అందించి స్వయంవరానికి తీసుకువచ్చిన విప్రుడు. - వంశం - విప్ర; పద్య సం.(లు) - 10.1-1726-శా.,

  24) అగ్నిపురీష్యాదులైన అగ్నులు- (పురుష){}[దైవ యోని]:- విధాత క్రియ యందు అగ్నిపురీష్యాదులను కన్నాడు. - వంశం - దైవ యోని; తండ్రి - విధాత ; తల్లి - క్రియ; పద్య సం.(లు) - 6-507-వ.,

  25) అగ్నిబాహువు- (పురుష){}[ఋషి]:- రాబోయేకాలంలో పద్నాల్గవదైన ఇంద్రసావర్ణి మన్వంతరంలో అగ్ని బాహువూ శుచీ, శుక్రుడూ, మాగధుడూ మొదలైనవారు సప్తఋషులు అవుతారు. మనువు కొడుకులైన గంభీరుడూ, వసువూ మొదలైనవారు రాజులు అవుతారు. పవిత్రులూ, చాక్షుషులూ దేవతలు అవుతారు. శుచి ఇంద్రుడు అవుతాడు. విష్ణువు సత్రాయణునకూ వితానకూ బృహద్భానుడు అనే పేరుతో పుడతాడు. - వంశం - ఋషి; పద్య సం.(లు) - 8-427-వ.,

  26) అగ్నిమిత్రుడు-1 (పురుష){}[ఋషి]:- అగ్నిమిత్రుడు, భోధ్యుడు, యాఙ్ఞవల్క్యుడు తమ తమ ఋగ్వేద శాఖలను భాష్కలుని నుండి నేర్చుకున్నారు. - వంశం - ఋషి; పద్య సం.(లు) - 12-30-వ.,

  27) అగ్నిమిత్రుడు-2 (పురుష){}[చంద్రవంశం]:- పరీక్షిత్తు కాలానికి భవిష్యత్తులో శుంగవంశపు పుష్యమిత్రుడుకి అగ్నిమిత్రుడు పుట్టి రాజు అవుతాడు. - వంశం - చంద్రవంశం; తండ్రి - పుష్యమిత్రుడు; పద్య సం.(లు) - 12-4-వ.,

  28) అగ్నివర్ణుడు- (పురుష){}[సూర్యవంశం]:- అగ్నివర్ణుడు సూర్యవంశంలో శ్రీరామానంతర రాజు సుదర్శనుని కొడుకు. ఇతని కొడుకు శీఘ్రుడు. - వంశం - సూర్యవంశం; తండ్రి - సుదర్శనుడు; కొడుకు(లు) - శీఘ్రుడు; పద్య సం.(లు) - 9-364-వ.,

  29) అగ్నివేశుడు- (పురుష){}[సూర్యవంశం]:- సూర్యవంశంలోని దేవదత్తుడు అనే పండితుడికి అగ్నివేశుడు పుట్టాడు. అగ్నివేశుడు కానీనుడు (కన్యకకొడుకు) అనబడి, జాతకర్ణుండు అను పేర గొప్పఋషిగా విలసిల్లాడు. అతని వలన అగ్నివేశ్యాయనం అను బ్రాహ్మణకులం ఏర్పడింది. - వంశం - సూర్యవంశం; తండ్రి - దేవదత్తుడు; పద్య సం.(లు) - 9-42-వ.,

  30) అగ్నివేశ్యాయనం- (పురుష){}[బ్రాహ్మణ వంశం]:- సూర్యవంశంలోని దేవదత్తుని కొడుకు అగ్నివేశుడు. అగ్నివేశుడు కానీనుడు (కన్యకకొడుకు) అనబడి, జాతకర్ణుండు అను పేర గొప్పఋషిగా విలసిల్లాడు. అతని వలన అగ్నివేశ్యాయనం అను బ్రాహ్మణకులం ఏర్పడింది. - వంశం - బ్రాహ్మణ వంశం; పద్య సం.(లు) - 9-42-వ.,

  31) అగ్నిష్టోమము- ( -){}[యాగం]:- ఇది ఒక కర్మతంత్రము. వసంతకాలమందు అయిదు దినములలో చేసి ముగించెడి హోమము - వంశం - యాగం; పద్య సం.(లు) - 3-388-వ.,

  32) అగ్నిష్టోముడు- (పురుష){}[ధ్రువుని వంశం]:- ఇతడు ధ్రువుని వంశపు చక్షుస్సంజ్ఞునికి భార్య అడ్వల యందు కలిగిన కొడుకులు పన్నిండుగురులో ఒకడు. - వంశం - ధ్రువుని వంశం; తండ్రి - చక్షుస్సంజ్ఞుడు; తల్లి - అడ్వల; పద్య సం.(లు) - 4-390-వ.,

  33) అగ్నిష్వాత్తు- (పురుష){}[దైవ యోని]:- ఇతను పితృగణములలో ఒకరు. - వంశం - దైవ యోని; పద్య సం.(లు) - 5.2-136-వ.,

  34) అగ్నిష్వాత్తులు-1 (పురుష){}[దైవ యోని]:- అగ్నిదేవునకు దక్షుని కుమార్తె అయిన స్వాహాదేవి అనే భార్య వల్ల పావకుడు, పవమానుడు, శుచి అనే ముగ్గురు కొడుకులు కలిగారు. ఆ ముగ్గురివల్ల నలభైఐదు విధాలైన అగ్నులు ఉద్భవించాయి. తాత, తండ్రులతో కూడి మొత్తం నలభైతొమ్మిది అగ్నులు అయినాయి. అగ్నిష్వాత్తులు, బర్హిషదులు, సౌమ్యులు, పితలు, ఆజ్యపులు, సాగ్నులు, విరగ్నులు అని ఏడు విధాలైన ఆ అగ్నుల నామాలతో బ్రహ్మవాదులైనవారు యజ్ఞకర్మలలో ఇష్టులు నిర్వహిస్తూ ఉంటారు. దక్ష ప్రజాపతి పుత్రిక అయిన స్వధ అనే భార్యవల్ల ఆ అగ్నులకు వయున, ధారిణి అనే ఇద్దరు కన్యలు పుట్టారు. వారిద్దరూ జ్ఞాన విజ్ఞాన పరాయణలు. బ్రహ్మనిష్ఠ కలవారు - వంశం - దైవ యోని; పద్య సం.(లు) - 4-34-వ.,

  35) అగ్నిష్వాత్తులు-2 (పురుష){}[దైవ యోని]:- నరకలోకంలో అనేక నరకాలు ఉన్నాయి. మహా భయంకరమైన ఆ నరకాలు ముల్లోకాలకు ఆవల దక్షిణ దిక్కులో భూమ్యాకాశాల మధ్య ఉన్నాయి. ఆ దక్షిణంలో అగ్నిష్వాత్తులు మొదలైన పితృదేవతలు ఉన్నారు. వారు తమ తమ గోత్రాలలో పుట్టిన వారికి సత్యమైన దీవెన లిస్తుంటారు. అక్కడ పితృపతి అయిన యముడు తన లోకం చేరుకొనే జీవులకు వారి కర్మలకు తగినట్లు శిక్షిస్తుంటాడు.. - వంశం - దైవ యోని; పద్య సం.(లు) - 5.2-136-వ.,

  36) అగ్నిస్థాలి- ( -){}[ఉపకరణం]:- కుంపటి, పురూరవుడు ఊర్వశిని కోరగా గంధర్వులు అగ్నిస్థాలి (కుంపటి, అగ్ని స్థాపించునది) ఇచ్చారు. కొంతకాలం వరకు దానిని ఊర్వశి అనే అనుకున్నాడు. - వంశం - ఉపకరణం; పద్య సం.(లు) - 9-419-వ.,

  37) అగ్నిహోత్రి- ( -){}[జంతు]:- సురభి, సాగరమథనంలో జనించిన సురభిని అగ్నిహోత్రి అనుచు దేవమునులు పుచ్చుకొనిరి. - వంశం - జంతు; పద్య సం.(లు) - 8-253-ఆ.,

  38) అగ్నిహోత్రుడు- (పురుష){}[ఆదిత్యులు]:- పన్నెండుమంది ఆదిత్యులలో అయిదవ వాడైన సవిత్రుడు, పృశ్ని, సావిత్రి, వ్యాహృతి అనే భార్యల యందు అగ్నిహోత్ర, పశుయాగ, సోమయాగ, పంచ మహాయజ్ఞాలు అనే కుమారులను కన్నాడు. - వంశం - ఆదిత్యులు; తండ్రి - సవిత ; తల్లి - పృశ్ని ; పద్య సం.(లు) - 9-506-సీ.,

  39) అగ్నీధ్రకుడు- (పురుష){}[ఋషి]:- పన్నెండవదైన భద్ర సావర్ణి మన్వంతరంలో ఋతుధాముడు ఇంద్రుడు. హరితులు మొదలైనవారు దేవతలు. అగ్నీధ్రకుడు మొదలైనవారు సప్తఋషులు అవుతారు. - వంశం - ఋషి; పద్య సం.(లు) - 8-423-వ.,

  40) అగ్నీధ్రుడు- (పురుష){}[ప్రజాపతి వంశం]:- ప్రియవ్రతుడు విశ్వకర్మ ప్రజాపతి కుమార్తె అయిన బర్హిష్మతి యందు ఆగ్నీధ్రుడు, ఇధ్మజిహ్వుడు, యజ్ఞబాహువు, మహావీరుడు, హిరణ్యరేతసుడు, ఘృతపృష్ఠుడు, సవనుడు, మేధాతిథి, వీతిహోత్రుడు, కవి అనే పదిమంది కొడుకులను, ఊర్జస్వతి అనే కుమార్తెను కన్నాడు. పిమ్మట కాలంలో అగ్నీధ్రుడు జంబూద్వీప అధిపతి అయ్యాడు, ఇతని పుత్రులు నాభి [1]; కింపురుషుడు [2]; హరివర్షుడు [3]; ఇలావృతుడు [4]; రమ్యకుడు [5]; హిరణ్మయుడు [6]; కురువు [7]; భద్రాశ్వుడు [8]; కేతుమాలుడు [9]; అగ్నీధ్రుని కోడళ్ళు వరుసగా మేరుదేవి [1], ప్రతిరూప[2], ఉగ్రదంష్ట్ర[3], లతయు[4], రమ్య[5], శ్యామ[6], నారి[7], భద్ర[8], దేవవతి[9]; వరుసగా వారు ఏలిన జంబూద్వీప వర్షములు నాభి [1]; కింపురుషము [2]; హరివర్షము [3]; ఇలావృతము [4]; రమ్యకము [5]; హిరణ్మయము [6]; కురువు [7]; భద్రాశ్వము [8]; కేతుమాల [9]. - వంశం - ప్రజాపతి వంశం; తండ్రి - ప్రియవ్రతుడు; తల్లి - బర్హిష్మతి ; భార్య - పూర్వ చిత్తి (అప్సరస); కొడుకు(లు) - నాభి ; కింపురుష ; హరివర్షుడు ; ఇలావ్రతుడు ; రమ్యకుడు; హిరణ్మయుడు; కురువు; భద్రాశ్వుడు; కేతుమాలుడు; పద్య సం.(లు) - 5.1-16-వ. నుండి 5.1-54 వరకు మఱియు 5.1-184-గ.,

  41) అఘమర్షణము- ( -){}[పుణ్యతీర్థం]:- దక్షుడు వింధ్యపర్వత పాదప్రదేశానికి వెళ్ళి అక్కడ సమస్త పాపాలను హరించే అఘమర్షణం అనే తీర్థంలో నిత్యం స్నానం చేస్తూ మిక్కిలి ఘోరమైన తపస్సు చేస్తూ శ్రీహరిని ప్రసన్నుని చేసికొని, అతనిని హంసగుహ్యం అనే స్తోత్రంతో స్తుతించాడు. - వంశం - పుణ్యతీర్థం; పద్య సం.(లు) - 6-212-వ.,

  42) అఘసంహారి- (పురుష){}[చంద్రవంశం]:- అఘాసురుని సంహరించిన శ్రీకృష్ణుడు - వంశం - చంద్రవంశం; తండ్రి - వసుదేవుడు; తల్లి - దేవకీదేవి; భార్య - రుక్మిణాది అష్టమహిషలు, 16000 మంది భార్యలు; కొడుకు(లు) - ప్రద్యుమ్నుడు, భానుడు, సాంబుడు మున్నగు అనేకమంది....; పద్య సం.(లు) - 10.1-1486-క.,

  43) అఘుడు- (పురుష){}[రాక్షస యోని]:- కృష్ణుని చేతిలో చచ్చిన సర్పరూప రాక్షసుడు. ఇతను బకుని తమ్ముడు. కొండచిలువ రూపులో వచ్చి గోపబాలురను, గోవులతో సహా మ్రింగాడు. కృష్ణుని కూడ మింగబోయాడు కాని కృష్ణుడు దాని గొంతుకలో ప్రవేశించి తన శరీరాన్ని పెంచి, దానికి ఊపిరాడకుండా చేసి సంహరించాడు. దాని తల చీల్చుకొని గోగోపకులతో బయటకు వచ్చాడు. కృష్ణుడు తన అయిదవ ఏట అఘాసురుని సంహరించాడు... - వంశం - రాక్షస యోని; పద్య సం.(లు) - 10.1-463-వ. మొదలు అఘాసుర వధ,

  44) అచ్యుతుడు- (పురుష){}[చంద్రవంశం]:- కృష్ణుడు, విష్ణువు, ప్రపంచశరీరునిగా విష్ణుని వర్ణిచుట యందు విష్ణుని వర్ణించు సమయలో, ఇంకా అనేక సందర్భాలలో విష్ణు సంబంధంగా, కృష్ణ సంబంధంగా ప్రయోగించారు - వంశం - చంద్రవంశం; పద్య సం.(లు) - 1-185-మ., 1-269.1-ఆ., 1-294-సీ., 1-299-వ., 1-380-మ., 1-381-వ., 2-681.1-తే., 2-68.1-తే., 2-89-వ.,.,.,.,., ,

  45) అజకుడు- (పురుష){}[చంద్రవంశం]:- ఇతను పురూరవుని వంశంలోని బాలకుని కొడుకు. ఇతని పుత్రుడు కుశుడు. - వంశం - చంద్రవంశం; తండ్రి - బాలకుడు; కొడుకు(లు) - కుశుడు; పద్య సం.(లు) - 9-422-వ.,

  46) అజగరుడు- (పురుష){}[ఋషి]:- అజగరు డని మరొక పేరు గల “సునయుడు” అనెడి మునీశ్వరునికి, హిరణ్యకశిపుని కుమారుడైన “ప్రహ్లాదుడికి” సంవాదం జరిగింది. ఈ సునయుడు అయాచితం, అవాంఛితం, అనింద్యం, అక్రోధనం, మొదలైన నియమాలు పాటిస్తూ; అజగరం అంటే కొండచిలువ వలె ఉండడం ఆచరిస్తూ ఉండగా; తనను కలిసిన ప్రహ్లాదునికి గొప్ప వేదాంత విషయాలు చర్చించాడు. - వంశం - ఋషి; పద్య సం.(లు) - 7-430-క. నుండి అజగర సంవాదం.,.,

  47) అజనాభం- ( -){}[వర్షం, దేశం]:- నాభికి మేరుదేవి యందు కలిగిన కొడుకూ, విష్ణుమూర్తి అవతారము అయిన ఋషభుడు ఏలిన వర్షము అజనాభము.
ఈ అజనాభము వర్షము భరతుడు పరిపాలించిన కారణం చేత భరత వర్షము అనే పేర పిలవబడుతోంది. - వంశం - వర్షం, దేశం; పద్య సం.(లు) - 5.1-60-వ., 5.1-93-వ.,

  48) అజనుడు- (పురుష){}[దైవ యోని]:- పూతనను చంపిన కృష్ణశిశువును గోపికలు రక్షచదువుతూ ఎడమ ప్రక్క రక్షించమని ఖడ్గధారుడైన ఈ అజనుని వేడారు. - వంశం - దైవ యోని; పద్య సం.(లు) - 10.1-236-వ.,

  49) అజమీఢుడు-1 (పురుష){}[చంద్రవంశం]:- హస్తినాపురము నిర్మించిన హస్తికి ముగ్గురు కొడుకులు వారిలోపెద్దవాడు ఈ అజమీఢుడు, ఇతని తమ్ములు ద్విమీఢుడు, పురుమీఢుడు. ఇతని వంశంలో ప్రియ, మేధ మొదలగువారు బ్రాహ్మణులు అయ్యారు. ఇతని పుత్రుడు బృహదిషుడు.
అజమీఢునకు భార్య నళిని యందు నీలుడు పుట్టాడు. - వంశం - చంద్రవంశం; తండ్రి - హస్తి; కొడుకు(లు) - ప్రియ, మేధ మొదలగువారు, బృహదిషుడు, ఋక్షుడు; పద్య సం.(లు) - 9-653-వ., 9-655-వ.,

  50) అజమీఢుడు-2 (పురుష){}[చంద్రవంశం]:- ఈ అజమీఢుని కొడుకు ఋక్షుడు. అతనికి సంవరణుడు, అతని భార్య సూర్య పుత్రిక యందు కురువు ను కన్నాడు. ఈ కురువు పేరనే కురుక్షేత్రము ఏర్పడింది. - వంశం - చంద్రవంశం; కొడుకు(లు) - ఋక్షుడు; పద్య సం.(లు) - 9-659-వ.,

  51) అజయ- ( -){}[మాయ]:- బంధితుడై ఉన్న బలి చక్రవర్తిని విష్ణుమూర్తి ఇతను జ్ఞానియై గెలవడానికి సాధ్యంకాని అజయ అని పేరు పడ్డ మాయను గెలిచాడు. ఇతడు చాలా గొప్ప మహానీయుడు. అని పొగిడాడు. - వంశం - మాయ; పద్య సం.(లు) - 8-662-శా.,

  52) అజయుడు- (పురుష){}[చంద్రవంశం]:- ఇతడు పరీక్షిత్తు కాలానికి భవిష్యత్తు కాలంలోని రాజు అజయుడు. ఇతని తండ్రి దర్భకుడు, తాత అజాతశత్రువు, కొడుకు నందివర్థనుడు, మనుమడు మహానంది. - వంశం - చంద్రవంశం; తండ్రి - దర్భకుడు; కొడుకు(లు) - నందివర్ధనుడు; పద్య సం.(లు) - 12-4-వ.,

  53) అజాతశత్రువు- (పురుష){}[చంద్రవంశం]:- ఇతడు పరీక్షిత్తు కాలానికి భవిష్యత్తు కాలంలోని రాజు అజాతశత్రుడు. ఇతని తండ్రి విధిసారుడు, కొడుకు దర్భకుడు, మనుమడు నందివర్థనుడు. - వంశం - చంద్రవంశం; తండ్రి - విధిసారుడు; కొడుకు(లు) - దర్భకుడు; పద్య సం.(లు) - 12-4-వ.,

  54) అజామిళుడు- (పురుష){}[బ్రాహ్మణ వంశం]:- కన్యాకుబ్జ పురమున ఉత్తమ బ్రాహ్మణ జన్మ ఎత్తిన అజామిళుడు నష్ట సదాచారి అయి, జూదం, దుర్వాదం, చౌర్యం, మచ్చరం పెంచుకున్నాడు. స్త్రీలోలుడై జీవించాడు. ముసలితనంలో మరణించే సమయంలో తన కొడుకు పేరు నారాయణ అని ప్రలాపించి, పరమపదం పొందాడు. - వంశం - బ్రాహ్మణ వంశం; పద్య సం.(లు) - 6-60-సీ. నుండి అజామిళోపాఖ్యానము,

  55) అజితుడు- (పురుష){}[దైవ యోని]:- ఆరవదైన చాక్షుస మన్వంతరంలో వైరాజుకు భార్య సంభాతి యందు “అజితుడు” అనే పేరుతో విష్ణువు పుట్టాడు. అతడే కూర్మరూపం ధరించి మంథర పర్వతాన్ని సముద్రంలో మునిగిపోకుండా మోసాడు. అలా చాక్షుష మన్వంతరంలో క్షీరసాగరమథనం జరిగింది. దీని పిమ్మట ప్రస్తుతం నడుస్తున్న వైవశ్వతన్వంతరం మొదలైంది. - వంశం - దైవ యోని; తండ్రి - వైరాజు; తల్లి - సంభాతి; పద్య సం.(లు) - 8-141-సీ.,

  56) అజీగర్తుడు- (పురుష){}[భృగు]:- రోహితుడు ఇంటికి తిరిగి వస్తూ దారిలో అజీగర్తుని నడిమి కొడుకు అయిన శునశ్శేపుడిని తెలివిగా తీసుకువచ్చి, తన తండ్రి హరిశ్చంద్రునికి బలిపశువుగా ఇచ్చాడు.
బ్రహ్మర్షి అయిన విశ్వామిత్రునికి 101 కొడుకులు. భృగువంశంలో పుట్టిన ఈ అజీగర్తుని కొడుకు శునేపుని, హరిశ్చంద్రుని యాగానికి బలిపశువుగా పోయి, బ్రహ్మాది దేవతలను స్తుతించి మెప్పించి విదలి పెట్టబడ్డాడు. ఆ శునశ్శేపుని విశ్వామిత్రుడు కొడుకుగా స్వీకరించి తనతో తీసుకు వెళ్ళాడు. - వంశం - భృగు; కొడుకు(లు) - శునశ్శేపుడు; పద్య సం.(లు) - 9-200-సీ., 9-492-వ.,

  57) అజుడు-1 (పురుష){}[దైవ యోని]:- బ్రహ్మదేవుడు - వంశం - దైవ యోని; పద్య సం.(లు) - 1-196-క., 2-221.1-తే., 3-338-క., 9-738-వ., 4-53-సీ., 4-126-తే., 4-138-క., 4-155-వ., 4-241-వ., 8-147-క., 8-380.1-తే., 8-624-వ., 8-630-మ., 8-714-మ., 9-71-వ., 10.1-546-క., 10.1-559-క., 10.2-1269-క., 12-30-వ.,

  58) అజుడు-2 (పురుష){}[దైవ యోని]:- విష్ణువు, కృష్ణుడు - వంశం - దైవ యోని; పద్య సం.(లు) - 3-293.1-తే., 3-304.1-తే., 3-861-క., 3-1048-సీ., 4-953-సీ., 5.1-119-సీ., 8-88-క., 9-170-సీ., 10.1975-వ., 10.2-202.1-ఆ.,

  59) అజుడు-3 (పురుష){}[దైవ యోని]:- సూర్యుడు - వంశం - దైవ యోని; పద్య సం.(లు) - 5.2-84-క.,

  60) అజుడు-4 (పురుష){}[ఋషి]:- శంకర అంశజుడైన భూతునకు సరూప యందు కోట్ల సంఖ్యలైన రుద్రగణాలు మఱియు రైవతుడు, అజుడు, భవుడు, భీముడు, వాముడు, అగ్రుడు, వృషాకపి, అజైకపాత్తు, అహిర్బుధ్న్యుడు, బహురూపుడు, మహాంతుడు అనేవాళ్ళు, రుద్రపారిషదులు, మిక్కిలి భయంకరాకారులైన ప్రేతలు, వినాయకులు జన్మించారు. వారిలో ఇతను ఒకడు. - వంశం - ఋషి; తండ్రి - భూతుడు; తల్లి - సరూప ; పద్య సం.(లు) - 6-254-వ.,

  61) అజుడు-5 (పురుష){}[సూర్యవంశం]:- ఈ అజుడు శ్రీరాముని పితామహుడు; సూర్యవంశంలో రఘువుకు పృథుశ్రవణుడు, పృథుశ్రవణునికి అజుడు, అజునికి దశరథుడు జన్మించారు. - వంశం - సూర్యవంశం; తండ్రి - పృథుశ్రవణుడు; కొడుకు(లు) - దశరథుడు; పద్య సం.(లు) - 9-258-వ.,

  62) అజుడు-6 (పురుష){}[సూర్యవంశం]:- సూర్యవంశంలోని సనధ్వాజునికి ఊర్ధ్వకేతుడు; ఊర్ధ్వకేతునికి అజుడు; అజునికి కురుజిత్తు; కురుజిత్తునకు అరిష్టనేమి పుట్టారు - వంశం - సూర్యవంశం; తండ్రి - ఊర్ధ్వకేతుడు; కొడుకు(లు) - కురుజిత్తు; పద్య సం.(లు) - 9-374-వ.,

  63) అజైకపాత్తు- (పురుష){}[ఋషి]:- శంకర అంశజుడైన భూతునకు సరూప యందు కోట్ల సంఖ్యలైన రుద్రగణాలు మఱియు రైవతుడు, అజుడు, భవుడు, భీముడు, వాముడు, అగ్రుడు, వృషాకపి, అజైకపాత్తు, అహిర్బుధ్న్యుడు, బహురూపుడు, మహాంతుడు అనేవాళ్ళు, రుద్రపారిషదులు, మిక్కిలి భయంకరాకారులైన ప్రేతలు, వినాయకులు జన్మించారు. వారిలో ఇతను ఒకడు. - వంశం - ఋషి; తండ్రి - భూతుడు; తల్లి - సరూప ; పద్య సం.(లు) - 6-254-వ.,

  64) అడ్వల - (స్త్రీ){}[ధ్రువుని వంశం]:- ఈమె ధ్రువుని వంశపు చక్షుస్సంజ్ఞుని భార్య. కొడుకులు పురువు, కుత్సుడు, త్రితుడు, ద్యుమ్నుడు, సత్యవంతుడు, ఋతుడు, వ్రతుడు, అగ్నిష్టోముడు, అతిరాత్రుడు, సుద్యుమ్నుడు, శిబి, ఉల్ముకుడు. - వంశం - ధ్రువుని వంశం; భార్య - చక్షుస్సంజ్ఞుడు; కొడుకు(లు) - పురువు, కుత్సుడు, త్రితుడు, ద్యుమ్నుడు, సత్యవంతుడు, ఋతుడు, వ్రతుడు, అగ్నిష్టోముడు, అతిరాత్రుడు, సుద్యుమ్నుడు, శిబి, ఉల్ముకుడు; పద్య సం.(లు) - 4-390-వ.,

  65) అణిమ- ( -){}[విభూతులు]:- అష్ట సిద్ధులలో, అష్టైశ్వర్యాలలో, అష్ట విభూతులలో ఒకటి - వంశం - విభూతులు; పద్య సం.(లు) - 2-30-వ., 2-222-వ., 3-774.1-తే., 3-919-వ., 4-93., 4-502., 7-316-క., 9431., 10.1-537-వ., 11-105-వ.,

  66) అతనుడు- (పురుష){}[దైవ యోని]:- మన్మథుడు, ముక్కంటి చూపుకి భస్మమగుటచే తనువు లేని వాడు,
ఉషాకన్య స్వప్నంలో అతునుడైన మన్మథుని ఆరవ బాణంలా ఉన్న వాడిని (అనిరుద్ధుని) చూసిందట. - వంశం - దైవ యోని; పద్య సం.(లు) - 10.2-327-సీ.,

  67) అతలం- ( -){}[పాతాళ లోకములు]:- విష్ణుమూర్తి తొడలు యందు అతలము.
భూలోకానికి పైన ఏడు క్రింద ఏడు ఉండే లోకాలలోస భూలోకానికి క్రింద అతల లోకము, దాని క్రింద వితలము కలవు. సప్త పాతాళ లోకాలలో మొదటిది . ఈ ఏడు భూమండలం క్రింద ఒకదాని క్రింద ఒకటిగా ఉంటాయి. ఒక్కొక్కదానికి మధ్య పదివేల యోజనాల దూరం ఉంటుంది. ఇవి క్రింద ఉన్నా స్వర్గం వంటివే. ఈ క్రింది స్వర్గాలు పైనున్న స్వర్గం కంటే ఎంతో గొప్పవి. ఇక్కడ దైత్యులు, దానవులు, నాగులు మొదలైన దేవజాతికి చెందినవాళ్ళు ఉంటారు. వాళ్ళందరూ ఐశ్వర్యం వల్ల సంక్రమించిన ఆనందానుభవంతో సుఖభోగాలతో తులతూగుతూ జీవిస్తారు.
అతలలోకంలో మయుని కుమారుడైన బలాసురుడు స్వేచ్ఛగా విహరిస్తూ ఉంటాడు. అతడు తొంభై ఆరు విధాలైన మాయలతో వినోదిస్తూ ఉంటాడు. ఈ మాయలకు భూలోకంలోని వారు కొందరు లొంగిపోయి సమ్మోహితులై చరిస్తుంటారు.
అతని ఆవులింతల నుండి స్వైరిణులు, కామినులు, పుంశ్చలులు అనే స్త్రీ సమూహాలు పుట్టారు. ఆ స్త్రీలు పాతాళంలో ప్రవేశించిన పురుషునికి హాటకరసం అనే సిద్ధ రసఘుటికను ఇచ్చి అతనిని వాడుకుంటారు - వంశం - పాతాళ లోకములు; పద్య సం.(లు) - 2-16-వ., 5.2-105-వ., 5.2-106-సీ., 5.2-109-చ., 5.2-110-వ., 8-54-క.,

  68) అతికాయుడు- (పురుష){}[రాక్షస యోని]:- లంకలోని రావణుని అనుచరుడు, కొండంత దేహం కలవాడు, దేవతలు సైతం జయుంచ లేని మాయలు కలవాడు. ఇతనిని రాముని తమ్ముడు లక్ష్మణుడు సంహరించాడు. - వంశం - రాక్షస యోని; పద్య సం.(లు) - 9-292-క.,

  69) అతిథి- (పురుష){}[సూర్యవంశం]:- ఇతను శ్రీరాముని మనుమడు, కుశుని కొడుకు. - వంశం - సూర్యవంశం; తండ్రి - కుశుడు; కొడుకు(లు) - నిషదుడు; పద్య సం.(లు) - 9-364-వ.,

  70) అతిరథుడు- (పురుష){}[చంద్రవంశం]:- ఇతను సత్యకర్ముని కొడుకు,
కుంతి చిన్నప్పుడు సూర్యుని కోరి పొందిన బిడ్డడిని గంగలో వదిలితే ఇతను పెంచాడు.
అలా కానీనుడైన కర్ణుడు, అతిరథుని కొడుకు అయ్యాడు. - వంశం - చంద్రవంశం; తండ్రి - సత్యకర్ముడు; కొడుకు(లు) - పెంపుడు కొడుకు కర్ణుడు; పద్య సం.(లు) - 9-697-వ., 9-698-ఆ., 6-699-వ.,

  71) అతిరాత్రుడు- (పురుష){}[ధ్రువుని వంశం]:- ఇతడు ధ్రువుని వంశపు చక్షుస్సంజ్ఞునికి భార్య అడ్వల యందు కలిగిన కొడుకులు పన్నిండుగురులో ఒకడు. - వంశం - ధ్రువుని వంశం; తండ్రి - చక్షుస్సంజ్ఞుడు; తల్లి - అడ్వల; పద్య సం.(లు) - 4-390-వ.,

  72) అత్రి-1 (పురుష){}[ఋషి]:- శ్రీకృష్ణుని దర్శించుకోవడానికి వచ్చి వసుదేవునిచే క్రతువు చేయించిన మునీశ్వరులలో ఒక మునీశ్వరుడు. - వంశం - ఋషి; పద్య సం.(లు) - 10.2-1129-వ.,

  73) అత్రి-2 (పురుష){}[ఋషి]:- శ్రీకృష్ణునితో బహుళాశ్వుడు, శ్రుతదేవులను చూడటానికి వెళ్ళిన మునీశ్వరులలో ఒకడు. - వంశం - ఋషి; పద్య సం.(లు) - 10.2-1179-వ.,

  74) అత్రి-3 (పురుష){}[ఋషి]:- ద్వారకకు శ్రీకృష్ణుని చూడటానికి వచ్చినప్పుడు, సాంబుని గర్భవతిగా చూపి ఆడపిల్ల పుడుతుందా మగపిల్లాడు పుడతాడా అని అడిగిన యాదవులకు ముసలం పుడుతుందని శపించిన వారిలో ఈయనొకడు - వంశం - ఋషి; పద్య సం.(లు) - 11-11-వ., 11-18-వ., 11-22-క.,

  75) అత్రి-4 (పురుష){}[ఋషి]:- ఇతడు జ్యేష్ఠ (శుక్ర) మాసంలో సూర్యుని అనుచరులలోని ఋషి.
సూర్యుడు ఈ మాసంలో మిత్రుడు అను పేరుతో, మేనక, అత్రి, తక్షకుడు, పౌరుషేయుడు, హాహా, రథస్వనుడు మున్నగువారు అనుచరులుగా కలిగి సంచరిస్తాడు. - వంశం - ఋషి; పద్య సం.(లు) - 12-41-వ. నుండి 12-45-వ. వరకు,

  76) అత్రి-5 (పురుష){}[ఋషి]:- పరీక్షిత్తు గంగ ఒడ్డున ప్రాయోపవేశంలో ఉండగా వచ్చిన మునీశ్వరులలో ఈయన ఒకడు. - వంశం - ఋషి; పద్య సం.(లు) - 1-499-వ.,

  77) అత్రి-6 (పురుష){}[ఋషి]:- కర్దముని పుత్రికను ఈ అత్రిఋషికి ఇచ్చాడు.
ఈయన భార్యా సమేతుడై ఋక్ష కులాద్రిపై తపస్సుచేసాడు.
ఈయనకు భార్య అనసూయ యందు బ్రహ్మదేవుని అంశ వలన చంద్రుడు, విష్ణుమూర్తి అంశతో దత్తుడు, మహేశ్వరుని అంశతో దుర్వాసుడులను ముగ్గురు కొడుకులను పొందాడు.
బ్రహ్మ దేవుని కన్నుల నుండి ఈయన పుట్టాడు.
చంద్రవంశారంభంలో విష్ణువు నాభి యందు పుట్టిన బ్రహ్మదేవునికి అత్రి పుట్టాడు. అత్రి కడగంటి చూపులలో చంద్రుడు పుట్టాడు - వంశం - ఋషి; తండ్రి - బ్రహ్మదేవుడు; భార్య - అనసూయ ; కొడుకు(లు) - చంద్రుడు; దత్తుడు; దూర్వాసుడు ; పద్య సం.(లు) - 1-63-వ., 1-121-సీ., 3-849-వ., 4-9-క., 4-11-సీ., 4-16-చ., 4-23-ఉ.,

  78) అత్రి-7 (పురుష){}[ఋషి]:- పృథుచక్రవర్తి నూరు యజ్ఞాలు చేస్తుండగా, ఓర్వలేని ఇంద్రుడు పాషండ వేషం ధరించి యజ్ఞాశ్వాన్ని అపహరించుకు పోసాగాడు.
అత్రి మహాముని గమనించి పృథు చక్ర కొడుకును హెచ్చరించగా అతను వెంబడించగా ఇంద్రుడు అశ్వాన్ని వదిలి మాయమైపోయాడు. ఇలా మరొకమారు అయింది.
అతనిని జితాశ్వుడు అన్నారు. - వంశం - ఋషి; పద్య సం.(లు) - 5-513-క., 5-515-సీ., 4-524-సీ., 4-872-సీ., 4-977-గ.,

  79) అత్రి-8 (పురుష){}[ఋషి]:- అత్రీ, గౌతముడూ, కశ్యపుడూ, విశ్వామిత్రుడు, జమదగ్నీ, భరద్వాజుడూ, వసిష్టుడూ ఏడవదీ ప్రస్తుతపుది అయిన వైవశ్వతమన్వంతరంలో సప్త ఋషులు. - వంశం - ఋషి; పద్య సం.(లు) - 8-412-వ.,

  80) అధర్వణవేదం- (పురుష){}[ఋషి]:- వ్యాసుడు సమగ్రమైన వేదరాశిని క్రమముగా ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అధర్వణవేదము అని నాలుగు విధాలుగా విడదీసి క్రమముగా వాటిని పైల మహర్షికి, వైశంపాయన మహర్షికి, జైమిని మహర్షికి, సుమంతు మహర్షికి బోధించాడు.
అధర్వణవేదాన్ని అభ్యసించిన సుమంతు మహర్షి దానిని తన శిష్యునికి బోధించాడు. ఆ శిష్యుడు వేదదర్శుడు, పథ్యుడు అనే తన ఇద్దరు శిష్యులకు ఉపదేశించాడు. - వంశం - ఋషి; పద్య సం.(లు) - 12-30-b.,

  81) అదితి (స్త్రీ){}[దైవ యోని]:- దక్షుని అరవై (60) మంది పుత్రికలలో ఒకతె,
కశ్యపుని పదముగ్గురు (13) భార్యలలో ఒకతె,
వామనుని తల్లి
దేవతలకు తల్లి
ద్వాదశదిత్యులకు తల్లి.
కశ్యపుని భార్య అదితే తరువాత జన్మలో కృష్ణుని తల్లి దేవకీ దేవి
అదితి కర్ణకుండలాలు నరకుడు అపహరించాడు,
కృష్ణుడు నరకుని వధించి కర్ణకుండలాలు అదితి తిరిగి ఇచ్చాడు. - వంశం - దైవ యోని; తండ్రి - దక్షుడు; తల్లి - అసిక్ని; భర్త - కశ్యపుడు ; కొడుకు(లు) - ద్వాదశాదిత్యులు పన్నెండు (12) మంది వివశ్వంతుడు ; ఆర్యముడు ; పూషుడు ; త్వష్ట ; సవిత ; భగుడు ; ధాత ; విధాత ; వరుణుడు ; మిత్రుడు ; శక్రుడు ; ఉరుక్రముడు (వాముడు) (వామనుడు); పద్య సం.(లు) - 1-150-సీ., 5.2-112-సీ., 6-256-తే. 8-412-వ., 8-491-ఆ., 8-492-క., 8-502-వ., 8-504-క., 8-512-ఆ., 8-536-తే., 9-8-సీ., 10.1-132-క., 10.2-150-వ.,102.214-వ., 110.2-1343-గ.,

  83) అద్భుతుడు- (పురుష){}[దైవ యోని]:- తొమ్మిదవదైన (9) దక్షసావర్ణి మన్వంతరంలో ఇతడు ఇంద్రుడు అవుతాడు.
ఆ కాలంలో విష్ణువు ఆయుష్మంతుడికీ అంబుధారకూ జన్మిస్తాడుప. అతని రక్షణలో దేవేంద్రుడైన అద్భుతుడు మూడు లోకాలను సంతోషంగా పరిపాలిస్తాడు. - వంశం - దైవ యోని; పద్య సం.(లు) - 8-417-వ., 8-418-ఆ.,

  84) అద్రి-1 ( -){}[వృక్ష]:- అద్రి అంటే చెట్లని, కొండలని నానార్థాలు ఉన్నాయి. ఈ పదం ప్రథమ స్కంధలో నైమిశారణ్య వర్ణన సందర్భంలో రామసేతువు నిర్మాణంకు ఉపమాన పదంగా వాడబడింది. - వంశం - వృక్ష; పద్య సం.(లు) - 1-39-వ.,

  85) అద్రి-2 ( -){}[ప్రాంత]:- అద్రి అంటే కొండలని చెట్లని నానార్థాలు ఉన్నాయి. ఈ పదం ప్రథమ స్కంధలో నైమిశారణ్య వర్ణన సందర్భంలో రామసేతువు నిర్మాణం} ఉపమాన పదంగా వాడబడింది. - వంశం - ప్రాంత; పద్య సం.(లు) - 1-39-వ., 2-178-మ., 6-305-క., 8-27-ఆ.,

  86) అద్రి-3 ( -){}[ప్రదేశము]:- కొండ - వంశం - ప్రదేశము; పద్య సం.(లు) - 8-28-క.,

  87) అద్రినందన- (స్త్రీ){}[దైవ యోని]:- ఉమాదేవి. పర్వతపుత్రి పార్వతి.. సందర్భం,బాణుడు ఈశ్వరుని వరాలు కోరే సందర్భం - వంశం - దైవ యోని; పద్య సం.(లు) - 10.2-317-ఉ.,

  88) అద్రిసుత- (స్త్రీ){}[దైవ యోని]:- ఉమాదేవి. పర్వతపుత్రి పార్వతి - వంశం - దైవ యోని; తండ్రి - హిమవంతుడు; భర్త - పరమశివుడు; పద్య సం.(లు) - 1-5-ఉ.,

  89) అధర్ముడు- (పురుష){}[దైవ యోని]:- వీరు సంసార హేతువైన అధర్మం అనే వృక్షానికి కొమ్మలై వ్యాపించారు. తన మేలు కోరే మానవు డెవ్వడూ ఏమాత్రం వారిని అనుసరించకూడదు. అధర్ముడుకి; భార్య - మృష; కొడుకు - దంభుడు - వంశం - దైవ యోని; భార్య - మృష; కొడుకు(లు) - దంభుడు; కూతురు(లు)- మాయ ; పద్య సం.(లు) - 4-215-వ,

  90) అధర్వవేదము- ( -){}[విద్య]:- నాలుగవ వేదము - వంశం - విద్య; పద్య సం.(లు) - 1-83-సీ., 3-388-వ.,

  91) అధర్వవేదాభిమానదేవతలు- (పురుష){}[ఋషి]:- అంగిరసుం డను ప్రజాపతికి కర్దమ పుత్రి స్వధ యను భార్యయందుఁ బిత్రుగణంబులు పుట్టిరి; కర్దమ మరొక పుత్రి సతి యను భార్యకు నధ్వర వేదాభిమాన దేవతలు పుట్టరి; - వంశం - ఋషి; తండ్రి - అంగిరసుడు; తల్లి - సతి ; పద్య సం.(లు) - 6-254-వ.,

  92) అధర్వుడు -1 (పురుష){}[ఋషి]:- ధర్మరాజు రాజసూయ యజ్ఞానికి విచ్చేసిన మునీశ్వరులలో ఒకడు. - వంశం - ఋషి; పద్య సం.(లు) - 10.2-766-సీ.,

  93) అధర్వుడు -2 (పురుష){}[ఋషి]:- కర్దమ దేవహూతిల పుత్రి శాంతిని అధ్వర్యునకు ఇచ్చి తన కులాచారం ప్రకారం వివాహం చేసారు.
అధర్వునికి కర్దమ దేవహూతిల పుత్రి చిత్తి అనే భార్యవల్ల ధృతవ్రతుడూ, అశ్వశిరస్కుడూ అయిన దధ్యంచుడు జన్మించాడు.
- వంశం - ఋషి; భార్య - జిత్తి / శాంతి ; కొడుకు(లు) - ధృతవ్రతుడు; దధ్యంచుడు; అశ్వశిరస్కుడు ; పద్య సం.(లు) - 4-26-వ., 3-849-వ.,

  94) అధ్వర్వులు- (పురుష){}[ఋషి]:- అధ్వర్వులు వైశంపాయన మహర్షి నుండి యజుర్వేదము నేర్చిన శిష్యులు అందరూ యజ్ఞములు అన్నింటిలో పాల్గొంటూ అధ్వర్వులుగా ఉంటూ ప్రసిద్ధి పొందారు. - వంశం - ఋషి; పద్య సం.(లు) - 12-30-వ.,

  95) అధోక్షజుడు- (పురుష){}[దైవ యోని]:- విష్ణువు - వంశం - దైవ యోని; పద్య సం.(లు) - 1-61-వ., 2-89-వ., 3-213., 3-373., 3-697-వ., 4-220-క., 4-232-వ.,., ఇలా 70 + చోట్ల ప్రయోగించబడింది,

  96) అనంగవిద్య- ( -){}[విద్య]:- కామకళావిద్య - వంశం - విద్య; పద్య సం.(లు) - 8-50-వ.,

  97) అనంతుడు-1 (పురుష){}[దైవ యోని]:- విష్ణువు - వంశం - దైవ యోని; పద్య సం.(లు) - 1-62-1.తే., 1-452-సీ.,.,. అనేక మార్లు అనంతుడు (విష్ణువు) పదం ప్రయోగింపబడింది.,

  98) అనంతుడు-2 (పురుష){}[దైవ యోని]:- ఆదిశేషుడు. పాతాళలోకం అడుగున ఆదిశేషుడు ఉన్నాడు. ఆదిశేషునికే అనంతుడు, సంకర్షణుడు, అవ్యయుడు అని పేర్లు. అనంతుని తలమీద ఆవగింజలాగా ఈ భూమండలం ఉన్నది. ప్రళయకాలంలో ఆదిశేషుడు ప్రచండమైన కోపంతో ఏకాదశరుద్రులను సృష్టిస్తాడు. - వంశం - దైవ యోని; పద్య సం.(లు) – 1-62-సీ., 5.2-122-సీ., - 5.2-128-వ., 10.1-622-ఉ., 10.2-959-వ.

  100) అనంతుడు-4 (పురుష){}[దైవ యోని]:- శివుడు - వంశం - దైవ యోని; పద్య సం.(లు) - 7-39-సీ.,

  101) అనఘ-1 ( -){}[నది]:- శాకద్వీపంలో ఏడు నదులలో ఒకటి అనఘ, పురోజన వర్షంలో ఈశానం అను సరిహద్దు పర్వతము, అనఘ అను నది ఉన్నాయి. - వంశం - నది; పద్య సం.(లు) - 5.2-68-వ.,

  103) అనఘుడు- (పురుష){}[సూర్యవంశం]:- సూర్యవంశపు ధృతునకు అనఘుడు; అనఘునకు వీతిహవ్యుడు జన్మించారు - వంశం - సూర్యవంశం; తండ్రి - ధృతుడు; కొడుకు(లు) - వీతిహవ్యుడు; పద్య సం.(లు) - 9-374-వ.,

  104) అనమిత్రుడు- (పురుష){}[చంద్రవంశం]:- చంద్రవంశంలోని యుథాజిత్తుకు ఇతను రెండవ కొడుకు, మొదటి కొడుకు శిని; ఈ అనమిత్రునికి నిమ్నుడు, శిని, పృశ్ని అను కొడుకులు గలరు. నిమ్నుని కొడుకులు సత్రాజితు, ప్రసేనుడు. శినికి కొడుకుసత్యకుడు వానికి సాత్యకి, పృశ్నికి కొడుకులు శవ్ఫల్కుడు, చిత్రకుడు - వంశం - చంద్రవంశం; తండ్రి - యుధాజిత్తుడు; కొడుకు(లు) - నిమ్నుడు, శిని, పృశ్ని; పద్య సం.(లు) - 9-712-వ.,

  105) అనరణ్యుడు- (పురుష){}[సూర్యవంశం]:- సూర్యవంశంలోని పురుక్సుతుని కొడుకు త్రసదస్యుడు. త్రసదస్యుని కొడుకు ఈ అనరణ్యుడు, ఇతని కొడుకు హర్యశ్వుడు. - వంశం - సూర్యవంశం; తండ్రి - త్రసదస్యుడు; కొడుకు(లు) - హర్యశ్వుడు; పద్య సం.(లు) - 9-190-వ.,

  106) అనర్వుడు- (పురుష){}[రాక్షస యోని]:- దేవతలతో జరిగిన యుద్ధంలో వృతుని సైన్యంలోని ఒక వీరుడు - వంశం - రాక్షస యోని; పద్య సం.(లు) - 6-363-వ.,

  107) అనలశిఖ-1 ( -){}[వృక్ష]:- అనలశిఖ అంటే శక్రపుష్పి పూవులు అని అగ్నిజ్వాలలు అని నానార్థాలు ఉన్నాయి. ఈ పదం ప్రథమ స్కంధలో నైమిశారణ్య వర్ణన సందర్భంలో రాముడి యుద్ధం} కు ఉపమాన పదంగా వాడబడింది. - వంశం - వృక్ష; పద్య సం.(లు) - 1-39-వ.,

  108) అనలశిఖ-2 ( -){}[పంచభూత]:- అనలశిఖ అంటే అగ్నిజ్వాలలు అని శక్రపుష్పి పూవులు అని నానార్థాలు ఉన్నాయి. ఈ పదం ప్రథమ స్కంధలో నైమిశారణ్య వర్ణన సందర్భంలో రాముడి యుద్ధం} ఉపమాన పదంగా వాడబడింది. - వంశం - పంచభూత; పద్య సం.(లు) - 1-39-వ., 10.1-1734-మ.,

  109) అనసూయ- (స్త్రీ){}[ఋషి]:- ఈమె యందు అత్రిమహామునికి కుమారుడై విష్ణువు ఏకవింశతి (21) అవతారాలలో ఆరవది (6) అయిన దత్తుడై అవతరించాడు.
ఈమె కర్దమ దేవహూతి కుమార్తెలలో రెండవ (2) ఆమె. ఈమెకు అత్రికి వివాహమైంది.
వీరికి బ్రహ్మదేవుని అంశతో చంద్రుడు, విష్ణుమూర్తి అంశతో దత్తాత్రేయుడు, శివుని అంశతో దుర్వాసుడు పుట్టారు. - వంశం - ఋషి; తండ్రి - కర్దముడు; తల్లి - దేవహూతి ; భర్త - అత్రి; కొడుకు(లు) - చంద్రుడు; దత్తుడు; దూర్వాసుడు ; పద్య సం.(లు) - 1-63-వ., 4-8-క., 4-10-క. 4-977-గ.,

  110) అనిరుద్దుడు- (పురుష){}[దైవ యోని]:- విష్ణువు చతుర్వూహములు వాసుదేవ, ప్రద్యుమ్న, సంకర్షణ, అనిరుద్ధలలో నాలుగవది. నారదుడు పూర్వజన్మలో దాసీపుత్రుడుగా ప్రణవ పూర్వకంగా ఈ వాసుదేవ, ప్రద్యుమ్న, సంకర్షణ, అనిరుద్ధ మూర్తి నామములు పలికి నమస్కరించాడు. - వంశం - దైవ యోని; పద్య సం.(లు) - 1-110-వ., 3-57-వ., 3-896-వ., 4-703.1-తే., 10.1-683-వ., 11-77-వ.,

  111) అనిరుద్ధుడు-1 (పురుష){}[దైవయోని]:- విష్ణువు ద్వాపరయుగంలో నీలవర్ణంతో, పసుపుపచ్చని బట్టలు కట్టుకుని, రెండు చేతులతో, దివ్యమైన ఆయుధాలు పట్టుకుని, శ్రీవత్సం కౌస్తుభం వనమాలికల ప్రకాశిస్తూ; మహారాజ లక్షణాలు కలిగి జనార్ధునుడు, వాసుదేవుడు, సంకర్షుణుడు, ప్రద్యుమ్నుడు, అనిరుద్ధుడు, నారాయణుడు, విశ్వరూపుడు, సర్వభూతాత్మకుడు మున్నగు పేర్లతో వెలసి చక్రవర్తులచేత సన్నుతించబడతాడు. - వంశం - దైవయోని; పద్య సం.(లు) - 11-77-వ.,

  112) అనిరుద్ధుడు-2 (పురుష){}[చంద్రవంశం]:- ధర్మరాజు మున్నగు పాండవులు మహాప్రస్థానానికి బయలుదేరుతూ అనిరుద్ధుని కొడుకైన వజ్రుని మధురకు పట్టాభిషేకం చేసారు
ఇతను కృష్ణుని కొడుకు ప్రద్యుమ్నునికి రుక్మి కూతురు శుబాంగికి పుట్టాడు.
ఇతనికి, భీష్మకుని మనవరాలు రుక్మకాంతి వివాహం జరుగుతున్న సందర్భంలో, బలరాముడు రుక్మిని సంహరించాడు.
బాణాసురుని కూతురు ఉషాకన్య స్వప్నంలో ఇతనిని చూసి మోహించింది. కాని అతను ఎవరో తెలియదు.
చెలికత్తె చిత్రరేఖ సుందరాంగుల చిత్రాలు అన్నీ గీసి చూపిస్తే చివరకు అనిరుద్ధుని గుర్తుపడుతుంది. అంత చిత్రరేఖ అతనిని తెచ్చి ఉషాకన్యకు ఇస్తే రహస్యంగా వరించి గర్భవతి అవుతుంది
విషయం తెలిసి కృద్ధుడైన బాణుడు యుద్ధంలో అనిరుద్ధుని బంధించాడు
నారదుని వలన సమాచారం తెలుసుకొని, కృష్ణుడు వచ్చి బాణుని శివుని ఓడించి ఉషా అనిరుద్ధుల తీసుకువెళ్ళాడు. ఇతను శ్రీకృష్ణుని ప్రసిద్ధులైన 18 మంది సంతానంలో ఒకడు. - వంశం - చంద్రవంశం; తండ్రి - ప్రద్యుమ్నుడు; తల్లి - శుభాంగి; భార్య - రుక్మవతి, ఉషాకన్య ; కొడుకు(లు) - వజ్రుడు; పద్య సం.(లు) - 1-385-సీ. 10.2-279-వ., 10.2-285-మ., 10.2-327.1-తే., 10.2-361., 10.2-363-చ. 10.2-367-క., 10.2-380-సీ., 10.2-393-వ., 10.2-446-క.10.2-1039-వ., 10.2-1330., 10.2-1333-వ., 102-1343-గ.,

  113) అనిలుడు-1 (పురుష){}[చంద్రవంశం]:- శ్రీకృష్ణునికి మిత్రవింద యందు పుట్టిన కొడుకు. - వంశం - చంద్రవంశం; తండ్రి - కృష్ణుడు; తల్లి - మిత్రవింద; పద్య సం.(లు) - 10.2-275-వ.,

  114) అనిలుడు-2 (పురుష){}[దైవయోని]:- వాయుదేవుడు, సాగరమథనం తరువాత జరిగిన సురాసుర యుద్ధంలో అనిలుడు, పులోమునితో యుద్ధం చేసాడు. - వంశం - దైవయోని; పద్య సం.(లు) - 8-327-క. నుండి 8-34-వ. వరకు,

  115) అనీకుడు- (పురుష){}[చంద్రవంశం]:- శ్రీకృష్ణుని చిన్నాన్న. కృష్ణుని తాత దేవమీఢుడు. ఇతనికి శూరుడు అని మరొక పేరు ఉంది. శూరునికి భార్యలు మారిష అందు కలిగిన పదిమంది (10) కొడుకులలో ఎనిమిదవ (8) వాడు. వసుదేవుడు పెద్దవాడు.
ఈ అనీకుడు భార్య సుదామని అందు సుమిత్రానీకుడు, బాణుడు మున్నగు పుత్రులను పొందాడు. - వంశం - చంద్రవంశం; తండ్రి - దేవమీఢుడు శూరుడు; తల్లి - మారిష; భార్య - సుదామని; కొడుకు(లు) - సుమత్రానీక, బాణుడు మున్నగువారు; పద్య సం.(లు) - 9-714-వ., 9-722-వ.,

  116) అనుతాపకుడు- (పురుష){}[రాక్షస యోని, [దానవులు]]:- కశ్యపునికి దనువు నందు పుట్టిన కొడుకులు దానవులు. వీరు పద్దెనిమిది (18) మంది
ఇతను వీరిలో పద్నాలుగవ (14) వాడు. - వంశం - రాక్షస యోని, [దానవులు]; తండ్రి - కశ్యపుడు ; తల్లి - దనువు ; పద్య సం.(లు) - 6-257.1-తే., 6-258-వ.,

  117) అనుపదేవుడు- (పురుష){}[చంద్రవంశం]:- ఇతను అక్రూరుని కొడుకులు ఇద్దరిలో రెండవ (2) వాడు, పెద్దవాడు దేవలుడు. - వంశం - చంద్రవంశం; తండ్రి - అక్రూరుడు; పద్య సం.(లే) - 9-712-వ.,

  118) అనుభద్రుడు- (పురుష){}[దైత్యులు]:- కశ్యపునికి దితి యందు పుట్టిన వారు దైత్యులు.
ఇతను దితి కొడుకులలో ఒకడు. మఱియు రుద్రుని అనుచరులు అయిన భద్రానుభద్రులు వీరే హిరణ్యాక్ష హిరణ్యకశిపులుగా పుట్టారు. ఇతను వీరిలో రెండవ (2) వాడు.
ఇతనిని హరి వరహావతారం ఎత్తి సంహరించాడు.
ఇతని బిడ్డలు శకుని, శంబరడు, కాలనాభుడు, మదోత్కచుడు మున్నగువారు - వంశం - దైత్యులు; తండ్రి - కశ్యపుడు ; తల్లి - దితి; కొడుకు(లు) - శకుని, శంబరుడు, కాలనాభుడు, మదోత్కచుడు మున్నగువారు; పద్య సం.(లు) - 3-479-క., 6-507-వ., 7-24-వ., 7-37-వ.,

  119) అనుభవ- (పురుష){}[[ఆదిత్యులు]]:- ఇతడు భగునికి భార్య సిద్ధికి అందు కలిగిన ఇద్దరులో రెండవ (2) కొడుకు.
కశ్యపునికి అదితి యందు కలిగిన ద్వాదశాదిత్యులలో ఆరవ (6)వాడు ఈ భగుడు. - వంశం - [ఆదిత్యులు]; తండ్రి - భగుడు ; పద్య సం.(లు) - 6-506-సీ.,

  120) అనుమతి-1 (స్త్రీ){}[ఋషి]:- కర్దముని పుత్రిక శ్రద్ధ యందు ముని అంగిరసుడు పొందిన నలుగురు కూతురులలో నాలుగవ (4) ఆమె ఈ అనుమతి,
అనుమతి అనగా నిఘంటు అర్థం ఒక కళ తక్కువైన చంద్రుడుగల పౌర్ణమి.
ఈమె భర్త ధాత, కొడుకు పూర్ణిముడు. - వంశం - ఋషి; తండ్రి - అంగిరసుడు; తల్లి - శ్రద్ధ ; భర్త - ధాత ; కొడుకు(లు) - పూర్ణిముడు; పద్య సం.(లు) - 4-24-క., 4-25-క., 6-507-సీ.,

  121) అనుమతి-2 ( -){}[నది]:- సురోచన వర్షం శాల్మలీద్వీపంలో ఉంది. దీనిలో స్వరసం అను పర్వతం, అనుమతి అను మహానది ఉన్నాయి. - వంశం - నది; పద్య సం.(లు) - 5.2-62-వ.,

  122) అనుమ్లోచ- (స్త్రీ){}[అప్సరస]:- ఈమె భాద్రపద (నభోస్వీ) మాసంలో సూర్యుని అనుచరులలోని అప్సరస.
సూర్యుడు ఈ మాసంలో వివస్వంతుడు అను పేరుతో, అనుమ్లోచ, భృగువు, శంఖపాలుడు, వ్యాఘ్రుడు, ఉగ్రసేనుడు, ఆసారణుడు మున్నగువారు అనుచరులుగా కలిగి సంచరిస్తాడు. - వంశం - అప్సరస; పద్య సం.(లు) - 12-41-వ. నుండి 12-45-వ. వరకు,

  123) అనువత్సరం- ( -){}[కాలం]:- ఇది ఒక సంవత్సర భేదము. సూర్యగమనం వలన సౌరమానం చంద్రమానం నక్షత్రమానం, అనే భేదాలతో సంవత్సర కాలము ఏర్పడుచున్నది. ఇది సంవత్సరము, వరీవత్సరం, ఇడావత్సరం, అనువత్సరం, వత్సరం అనే భేదాలు కలిగి ఉంటుంది.
పన్నెండు (12) రాసులన్నిటిలోను సూర్యుడు పూర్తిగా తిరిగే కాలాన్ని సంవత్సరం అంటారు. ఆ సమగ్ర రాశి సంచారంలో మూడు రకాలైన గమనాలు ఉంటాయి. మొదటిది శ్రీఘ్రగతి. రెండవది మందగతి. మూడవది సమగతి. ఈ గతుల కారణంగా సంవత్సరంలో కలిగిన మార్పులను వరుసగా వత్సరం, పరివత్సరం, ఇడావత్సరం, అనువత్సరం, ఇద్వత్సరం అని ఐదు విధాలుగా చెబుతారు. - వంశం - కాలం; పద్య సం.(లు) - 3-346-వ., 5.2-86-వ.,

  124) అనువిందుడు- (పురుష){}[చంద్రవంశం]:- ఇతను కృష్ణుని మేనత్త, శూరుని కూతురు ఐన రాజాధిదేవి కొడుకు. రాజాధిదేవి యందు జయత్సేనునికి కలిగిన కొడుకులు వింద, అనువిందులు.
దుర్యోధనవశులై అంవంతీ పురాధీశ్వరులైన, విందానువిందులు తమ చెల్లెలు మిత్రవిందను వివాహం చేయడంకోసం స్వయంవరం చాటించారు. కృష్ణుడు తన పరాక్రమంతో ఆమెను చేపట్టాడు. - వంశం - చంద్రవంశం; తండ్రి - జయత్సేనుడు; తల్లి - రాజాధిదేవి; పద్య సం.(లు) - 9-722-వ., 10.2-124-వ., 10.2-275-వ.,

  125) అనువు-1 (స్త్రీ){}[ఋషి]:- కశ్యపునకు భార్య అనువు నందు సిద్ధులు పుట్టారు - వంశం - ఋషి; భర్త - కశ్యపుడు ; కొడుకు(లు) - సిద్ధులు; పద్య సం.(లు) - -,

  126) అనువు-2 (పురుష){}[చంద్రవంశం]:- ఇతడు యయాతి భార్య దేవయానికి తెలియకుండా శర్మిష్ట యందు కన్న ముగ్గురు కొడుకులలో ఒకడు.
ఇతను తండ్రి తన ముసలితనాన్ని తీసుకోమంటే ఒప్పుకోలేదు.
అతని కొడుకులు సభానరుడు, చక్షువు, పరోక్షుడు. - వంశం - చంద్రవంశం; తండ్రి - యయాతి; తల్లి - శర్మిష్ఠ; కొడుకు(లు) - సభానరుడు, చక్షువు, పరోక్షుడు; పద్య సం.(లు) - 9-546-వ., 9-561-వ.,

  127) అనువు-3 (పురుష){}[చంద్రవంశం]:- మథువు కొడుకు కురువశుడు, కురువశుని కొడుకు అనువు, అనువు కొడుకు పురుహోత్రుడు, అతని కొడుకు అంశువు, అతని కొడుకు సాత్వతుడు. - వంశం - చంద్రవంశం; తండ్రి - కురువశుడు; కొడుకు(లు) - పురుహోత్రుడు; పద్య సం.(లు) - 9-709-వ.,

  128) అనువు-4 (పురుష){}[చంద్రవంశం]:- ఇతడు కపోతరోముని కొడుకు, తుంబురుడి సఖుడు, ఇతని కొడుకు దుందుభి. - వంశం - చంద్రవంశం; తండ్రి - కపోతరోముడు; కొడుకు(లు) - దుందుభి; పద్య సం.(లు) - 9-712-వ.,

  129) అనుష్టుప్- ( -){}[భగణ విషయం]:- సూర్యుని రథానికి పూన్చిన సప్తాశ్వాలులో ఒకటి - వంశం - భగణ విషయం; పద్య సం.(లు) - 5.2-82-సీ.,

  130) అనుహ్లాదుడు- (పురుష){}[రాక్షసులు [దైత్యులు]]:- ఇతను దైత్యుడు, దితి కొడుకు హిరణ్యకశిపునకు జంభాసురుని కూతురు దత్త యందు కలిగిన నలుగురు కొడుకులలో రెండవ (2) వాడు, ప్రహ్లాదుని తమ్ముడు, ఇతని భార్య సూర్మి యందు బాష్కలుడు, మహిషుడు అను కొడుకులు కలిగిరి - వంశం - రాక్షసులు [దైత్యులు]; తండ్రి - హిరణ్యకశిపుడు; తల్లి - దత్త; భార్య - సూర్మి; కొడుకు(లు) - బాష్కలుడు; మహిషుడు ; పద్య సం.(లు) - 6-507-వ.,

  131) అనూరాధ-1 ( -){}[భగణ విషయం]:- శింశుమారచక్రం కుడి ఎడమ చెవులలో మఘ, పుబ్బ, ఉత్తర, హస్త, చిత్త, స్వాతి, విశాఖ, అనూరాధ నక్షత్రాలు ఉన్నాయి. - వంశం - భగణ విషయం; పద్య సం.(లు) - 5.2-97-వ.,

  132) అనూరాధ-2 (స్త్రీ){}[నక్షత్ర]:- ఈమె అనురాధ దక్షుని కుమార్తె 37 [17] - 27 నక్షత్రాలలో 17వది], చంద్రునికు దక్షుని కుమార్తెలు కృత్తికాదులు ఇరవైఏడుగురు (27) భార్యలు అయినను, చంద్రుడు తన భార్యలలో రోహిణిని అధిక మోహంతో చూచి మిగిలిన భార్యలను నిర్లక్ష్యం చేసి దక్షుని శాపం వల్ల క్షయరోగాన్ని పొంది సంతానం లేనివాడైనాడు. తరువాత దక్షుని దయవల్ల క్షయవల్ల నష్టపోయిన కళలను తిరిగి పొందాడు. - వంశం - నక్షత్ర; తండ్రి - దక్షుడు; తల్లి - అసక్ని; భర్త - చంద్రుడు; పద్య సం.(లు) - 6-254-వ.,

  133) అనూరుడు- (పురుష){}[దైవ యోని]:- అనూరుడు (సూర్యుని సారథి); తన భర్త తార్క్ష్యుడు (కశ్యపుడు)తో వినత తనకు సాక్షాత్కరించిన యజ్ఞాధిపతికి వాహనమైన గరుత్మంతుని, సూర్యునికి సారథి అయిన అనూరుని కన్నది. - వంశం - దైవ యోని; తండ్రి - తార్క్ష్యుడు; తల్లి - వినత ; పద్య సం.(లు) - 6-254-వ.,

  134) అనేకపము- ( -){}[జంతు]:- ఏనుగు - వంశం - జంతు; పద్య సం.(లు) - 8-26-శా.,

  135) అనేనసుడు-1 (పురుష){}[సూర్యవంశం]:- పురంజయుని కొడుకు అనేనసుడు. అతని పుత్రుడు పృథువు. - వంశం - సూర్యవంశం; తండ్రి - పురంజయుడు / అమరేంద్రవాహుడు / కకుత్సుడు; కొడుకు(లు) - పృథుడు; పద్య సం.(లు) - 9-163-వ.,

  136) అనేనసుడు-2 (పురుష){}[చంద్రవంశం]:- ఇతను ఆయువునకు కుమారుడు. పురూరవుని పుత్రుడైన ఆయువునకు ఊర్వశి యందు పుట్టిన కొడుకులు నహుషుడు, క్షత్రవృద్దుడు, రజి, రంభుడు, అనేనసుడు - వంశం - చంద్రవంశం; తండ్రి - ఆయువు; కొడుకు(లు) - శుద్ధుడు; పద్య సం.(లు) - 9-497-వ.,

  137) అన్నయ- (పురుష){}[బమ్మెర వంశం; కౌండిన్య గోత్రం; ఆపస్తంభ సూత్రం]:- బమ్మెర పోతన తాతకి తాతగారు - వంశం - బమ్మెర వంశం; కౌండిన్య గోత్రం; ఆపస్తంభ సూత్రం; తండ్రి - భీమనమంత్రి; భార్య - గౌరమాంబ; కొడుకు(లు) - సోమనమంత్రి; పద్య సం.(లు) - 1-24-సీ.,

  138) అన్నాదుడు- (పురుష){}[చంద్రవంశం]:- ఇతడు కృష్ణునికు మిత్రవిందకు పుట్టిన పదిమంది (10) కొడుకులలో ఆరవ (6)వ వాడు - వంశం - చంద్రవంశం; తండ్రి - కృష్ణుడు; తల్లి - మిత్రవింద; పద్య సం.(లు) - 10.2-275-వ.,

  139) అపక్రాంతవ్యోమాచారి- ( -){}[నృత్తము]:- పారిభాషిక పదము - రాసక్రీడ - నృత్తము
కాలు పైకి ముందరికి చాచి మరల యథాస్థానమునందు అడుగులుంచుట - వంశం - నృత్తము; పద్య సం.(లు) - 10.1-1084-వ.,

  140) అపగాత్మజాతుడు- (పురుష){}[చంద్రవంశం]:- భీష్ముడు, దేవవ్రతుడు, శంతనునకు, గంగాదేవి యందు జన్మించినవాడు, అపగ (నది) అనగా గంగ కొడుకు కనుక అపగాత్మజాతుడు. - వంశం - చంద్రవంశం; తల్లి - గంగ; పద్య సం.(లు) - 3-28-క.,

  141) అపరాజిత-1 ( -){}[నది]:- శాకద్వీపంలోని ధూమ్రానీక వర్షంలో శతకేసరం, అను సరిహద్దు పర్వతము, అపరాజిత అను నది ఉన్నాయి. - వంశం - నది; పద్య సం.(లు) - 5.2-68-వ.,

  142) అపరాజిత-2 ( -){}[దిగ్గజము]:- చతుర్దిశల దిగ్గజములలో ఒకటి, నాలుగు దిక్కులలోని నాలుగు దిగ్గజాలు:- ఋషభము, పుష్కరచూడము, వామనము, అపరాజితము. - వంశం - దిగ్గజము; పద్య సం.(లు) - 5.2-73-వ.,

  143) అపరాజితాంగహారము- ( -){}[నృత్తము]:- పారిభాషిక పదము - రాసక్రీడ - నృత్తము
ఉత్సాహవర్ధక సూచకము - వంశం - నృత్తము; పద్య సం.(లు) - 10.1-1084-వ.,

  144) అపరాజితుడు- (పురుష){}[చంద్రవంశం]:- ఇతడు కృష్ణునికు లక్షణకు పుట్టిన పదిమంది (10) కొడుకులలో ఆరవ (10)వ వాడు - వంశం - చంద్రవంశం; తండ్రి - కృష్ణుడు; తల్లి - లక్షణ; పద్య సం.(లు) - 10.2-275-వ.,

  145) అపర్యావర్తనం- ( -){}[ప్రాంతం]:- నరకలోకంలో అనేక నరకాలు ఉన్నాయి. మహా భయంకరమైన ఆ నరకాలు తామిస్రం, అంధతామిస్రం, రౌరవం, మహారౌరవం, కుంభీపాకం, కాలసూత్రం, అసిపత్రవనం, సూకరముఖం, అంధకూపం, క్రిమిభోజనం, సందంశం, తప్తోర్మి, వజ్రకంటకశాల్మలి, వైతరణి, పూయోదం, ప్రాణరోధం, విశసనం, లాలాభక్షణం, సారమేయోదనం, అవీచిరయం, రేతఃపానం, క్షారమర్దమం, రక్షోగణభోజనం, శూలప్రోతం, దందశూకం, అవటనిరోధనం, అపర్యావర్తనం, సూచీముఖం అనే ఇరవై ఎనిమిది నరకాలు. - వంశం - ప్రాంతం; పద్య సం.(లు) - 5.2-136-వ.,

  146) అప్రతిరథుడు- (పురుష){}[చంద్రవంశం]:- ఇతడు చంద్రవంశంలోని అంతిసారుని ముగ్గరు కొడుకులు సుమతి, ధ్రువుడు, అప్రతిరథుడు లలో మూడవ వాడు; ఈ అప్రతిరథుని కొడుకు కణ్వుడు, అతని కొడుకు మేధాతిథి. - వంశం - చంద్రవంశం; తండ్రి - అంతిసారుడు; కొడుకు(లు) - కణ్వుడు; పద్య సం.(లు) - 9-593-వ.,

  147) అప్సరసలు- (స్త్రీ){}[అప్సరస]:- వీరు గంధర్వులు బ్రహ్మదేవుడు తన చేతిని వాసన చూడగా పుట్టారు.
దక్షుని పుత్రిక ముని యందు కశ్యపునికి అప్సర్సల సమూహం పుటింది,
గంధర్వుడు చిత్రకేతుడు విష్ణుని వినుతిస్తూ, యక్షులు, విద్యాధరులు, అప్సరసలు సేవిస్తుండగా హిమాలయాలలో విహరించాడు,
శివుడు త్రిపురములను భస్మము చేసినప్పుడు వీరు నర్తించిరి.
వృకాసురుని వధకు సంతోషించి అప్సరసలు నాట్యాలు చేసారు.
సూర్యుడు ప్రతి కల్పము నందు ద్వాదశాదిత్య నామధేయాలతో అప్సరసలు ముందు భాగాన ఆడుతుండగా కాలయాపనము చేస్తుంటాడు - వంశం - అప్సరస; పద్య సం.(లు) - 4-737-క., 6-257-సీ., 6-487-మ., 7-405-వ., 10.2-1261-క., 12-45-వ.,

  148) అబ్జనాభుడు- (పురుష){}[దైవ యోని]:- విష్ణువు, కమలము నాభి యందు కలవాడు - వంశం - దైవ యోని; పద్య సం.(లు) - 4-313.1-తే.,

  149) అబ్జపాణి / లక్ష్మీదేవి- (స్త్రీ){}[దైవ యోని]:- పృథుచక్రవర్తి పట్టాభిషిక్తుడు అయిన సందర్భంలో దేవతలు అందరు వివిధ బహుమానాలు ఇచ్చారు. వారిలో లక్ష్మీదేవి, తరిగిపోని సంపద ఇచ్చెను - వంశం - దైవ యోని; పద్య సం.(లు) - 4-442-సీ., 4-443-సీ.,

  150) అబ్జభవుడు- (పురుష){}[దైవ యోని]:- బ్రహ్మదేవుడు - వంశం - దైవ యోని; పద్య సం.(లు) - 3-408.1-తే.,

  151) అబ్జాక్షుడు- (పురుష){}[దైవ యోని]:- విష్ణువు, అబ్జము వంటి కన్నులు ఉన్నవాడు. - వంశం - దైవ యోని; పద్య సం.(లు) - 3-203-దం., 3-753-సీ., 6-421-క., 6487-మ., 8-557-మ., 9-84-సీ., 10.1-488-సీ., 10.1-103.1-ఆ.,

  152) అభయ-1 (పురుష){}[ఋషి]:- ఇతడు దయ అను దక్షప్రజాపతి కుమార్తె యందు ధర్మునికి పుట్టిన కొడుకు - వంశం - ఋషి; తండ్రి - ధర్ముడు; తల్లి - దయ ; పద్య సం.(లు) - 4-28-వ.,

  153) అభయ-2 ( -){}[రాజు]:- ప్లక్షద్వీపంలో అభయవర్షం ఉంది, దీని అధిపతి అభయుడు. ఇతడు ప్రియవ్రతుని పుత్రుడైన ఇధ్మజిహ్వుని ఏడుగురు కొడుకులలో ఆరవవాడు, ఈ వర్షంలో హిరణ్యగ్రీవం అను కుల పర్వతము, ఋతంభర అను మహానది ఉన్నాయి. హంసులు, పతంగులు, ఊర్ధ్వాయనులు, సత్యాంగులు అను నాలుగు వర్ణాల ప్రజలు ఉన్నారు. ప్లక్షద్వీపంలో నివసించే పురుషుల ఆయుర్దాయం వేయి సంవత్సరాలు. ప్లక్ష ద్వీపానికి దేవుడు సూర్యభగవానుడు. - వంశం - రాజు; తండ్రి - ఇధ్మజిహ్వుడు ; పద్య సం.(లు) - 5.2-60-వ.,

  154) అభయ-3 ( -){}[నది]:- ఇది క్రౌంచ ద్వీపమున కల సప్త నదులలో ఒకటి - వంశం - నది; పద్య సం.(లు) - 5.2-66-వ.,

  155) అభయ-4 ( -){}[నది]:- క్రౌంచద్వీపంలోని ఆమోద వర్షంలో శుక్లం అను పర్వతము, అభయ అను నది ఉన్నాయి. - వంశం - నది; పద్య సం.(లు) - 5.2-66-వ.,

  156) అభయవర్షం- ( -){}[ప్రాంతం]:- ప్లక్షద్వీపంలోని, అభయవర్షంనికి అధిపతి ఇధ్మజిహ్వుని కొడుకు అభయుడు, ఈ వర్షంలో హిరణ్యగ్రీవం అను కుల పర్వతము, ఋతంభర అను మహానది ఉన్నాయి. హంసులు, పతంగులు, ఊర్ధ్వాయనులు, సత్యాంగులు అను నాలుగు వర్ణాల ప్రజలు ఉన్నారు. ప్లక్షద్వీపంలో నివసించే పురుషుల ఆయుర్దాయం వేయి సంవత్సరాలు. ప్లక్ష ద్వీపానికి దేవుడు సూర్యభగవానుడు. - వంశం - ప్రాంతం; పద్య సం.(లు) - 5.2-60-వ.,

  157) అభయుడు-1 (పురుష){}[దైవ యోని]:- విష్ణువు, పరమేశ్వరుడు - వంశం - దైవ యోని; పద్య సం.(లు) - 2- 207-క.,

  158) అభయుడు-2 (పురుష){}[మానవ యోని]:- అభయుడు ప్లక్షద్వీపంలోని అభయవర్షానికి అధిపతి, ఇతడు ప్రియవ్రతుని పుత్రుడైన ఇధ్మజిహ్వుని ఏడుగురు కొడుకులలో ఆరవవాడు, ఈ వర్షంలో హిరణ్యగ్రీవం అను కుల పర్వతము, ఋతంభర అను మహానది ఉన్నాయి. హంసులు, పతంగులు, ఊర్ధ్వాయనులు, సత్యాంగులు అను నాలుగు వర్ణాల ప్రజలు ఉన్నారు. ప్లక్షద్వీపంలో నివసించే పురుషుల ఆయుర్దాయం వేయి సంవత్సరాలు. ప్లక్ష ద్వీపానికి దేవుడు సూర్యభగవానుడు. - వంశం - మానవ యోని; తండ్రి - ఇధ్మజిహ్వుడు; పద్య సం.(లు) - 5.2-60-వ.,

  159) అభవుడు-1 (పురుష){}[దైవ యోని]:- విష్ణువు - వంశం - దైవ యోని; పద్య సం.(లు) - 1-194-క., 2-98-క., 3-198-సీ., 3-200-క., 3-293.1-తే., 3-897.1-తే., 6-172-చ., 10.2-1321-మ., ,

  160) అభవుడు-2 (పురుష){}[దైవ యోని]:- బ్రహ్మదేవుడు - వంశం - దైవ యోని; పద్య సం.(లు) - 4-157-క.,

  161) అభవుడు-3 (పురుష){}[దైవ యోని]:- శివుడు - వంశం - దైవ యోని; పద్య సం.(లు) - 4-28-వ., 4-76-వ., 4-104-వ., . 4-108-తే., 4-144-తే., ,

  162) అభిజిత్తు-1 ( -){}[భగణ విషయం]:- నక్షత్రాలన్నీ అభిజిత్తుతో కూడా కలిసి మేరుపర్వతానికి ప్రదక్షిణం చేస్తూ ఉంటాయి. - వంశం - భగణ విషయం; పద్య సం.(లు) - 5.2-87-క.,

  163) అభిజిత్తు-2 ( -){}[భగణ విషయం]:- శింశుమారచక్రం కుడిపాదంలో అభిజిత్తు ఉంది - వంశం - భగణ విషయం; పద్య సం.(లు) - 5.2-97-వ.,

  164) అభిజ్ఞాత వర్షం- ( -){}[ప్రాంతం]:- అభిజ్ఞాత వర్షం శాల్మలీద్వీపంలో ఉంది. దీనికి అధిపతి యజ్ఞబాహు కొడుకైన అభిజ్ఞాతుడు. దీనిలో శతశ్రుతి అను పర్వతం, రాక అను మహానది ఉన్నాయి. ఇక్కడి పురుషులను శ్రుతధరులు, విద్యధరులు, ఇధ్మధర్ములు అంటారు. వారు సోముణ్ణి ఆరాధిస్తారు." - వంశం - ప్రాంతం; పద్య సం.(లు) - 5.2-62-వ.,

  165) అభిజ్ఞాతుడు- (పురుష){}[మానవ యోని]:- అభిజ్ఞాత వర్షం శాల్మలీద్వీపంలో ఉంది. దీనికి అధిపతి ప్రియవ్రత పుత్రుడైన యజ్ఞబాహు ఏడుగురు కొడుకులలోనూ ఏడవవాడైన అభిజ్ఞాతుడు. దీనిలో శతశ్రుతి అను పర్వతం, రాక అను మహానది ఉన్నాయి. ఇక్కడి పురుషులను శ్రుతధరులు, విద్యధరులు, ఇధ్మధర్ములు అంటారు. వారు సోముణ్ణి ఆరాధిస్తారు." - వంశం - మానవ యోని; తండ్రి - యజ్ఞబాహువు; పద్య సం.(లు) - 5.2-62-వ.,

  166) అభిమతి- (స్త్రీ){}[ఋషి]:- ఈమె వసువు అనే దక్షుని పుత్రిక కొడుకు అయిన ద్రోణుని భార్య. వీరికి హర్షుడు, శోకుడు, భయుడు మొదలైనవారు పుట్టారు. - వంశం - ఋషి; భర్త - ద్రోణుడు ; కొడుకు(లు) - హర్షం; శోకం; భయం మొదలైనవారు; పద్య సం.(లు) - 6-254-వ.,

  167) అభిమన్యుడు- (పురుష){}[చంద్రవంశం]:- ఇతను అర్జునుడికి సుభద్ర యందు కలిగిన పుత్రుడు. భారత యుద్ధంలో పద్యవ్యూహం ఛేదించడం తెలిసినా, బయటకు రావడం తెలియని వాడు, కౌరవులు మూకుమ్మడిగా ముట్టడించి ఇతనిని చంపారు. ఇతనికి ఉత్తర యందు పుట్టిన కొడుకు పరీక్షిన్మహారాజు.
పాండవుల కాలంనాటి సూర్యవంశపు రాజు బృహద్బలుడుని భారత యుద్ధంలో అభిమన్యుడు సంహరించాడు.,
తల్లి గర్భంలో ఉండగా బ్రహ్మాస్త్రం బారి నుండి శ్రీకృష్ణునిచే కాపాడబడిన పరీక్షిత్తు ఇతనికి కొడుకు పరీక్షిత్తు, భార్య ఉత్తర.
అభిమన్యాది మహాత్ములు భక్తితో దాటరాని విష్ణుమాయను దాటగలిగారు.
పాండవుల వంశం నిలబెట్టడానికి శ్రీకృష్ణుడు, ఉత్తర గర్భాన్ని నిలబెట్టాడు
పాండవ మధ్యముడు అర్జునకు కృష్ణసోదరి సుభద్ర యందు ఈ అభిమన్యుడు జన్మించాడు. - వంశం - చంద్రవంశం; తండ్రి - అర్జునుడు; తల్లి - సుభద్ర; భార్య - ఉత్తర; కొడుకు(లు) - పరీక్షిత్తు; పద్య సం.(లు) - 1-280-వ., 2-204-సీ., 3-130-వ., 9-673-వ., 9-675-వ., ,

  168) అభిమన్యువు- (పురుష){}[చంద్రవంశం]:- పాండవులకు పూర్వజుడైన రాజు. - వంశం - చంద్రవంశం; పద్య సం.(లు) - 2-204-సీ.,

  169) అభియుక్తులు- (పురుష){}[మానవ యోని]:- కుశ వర్షంలో కుశలులు, కోవిదులు, అభియుక్తులు, కులకులు అనే నాలుగు వర్ణాలవారు ఉన్నారు. వారు యజ్ఞపురుషుని ఆరాధిస్తుంటారు. - వంశం - మానవ యోని; పద్య సం.(లు) - 5.2-64-వ,

  170) అభ్రగపతి- (పురుష){}[దైవ యోని]:- గరుత్మంతుడు - వంశం - దైవ యోని; తండ్రి - కశ్యపుడు; తల్లి - వినత; పద్య సం.(లు) - 6-254-వ., 8-96-మ.,

  171) అభ్రము- (స్త్రీ){}[దైవయోని]:- తూర్పు దిగ్గజమైన ఐరావతము భార్య అయిన అభ్రవతి - వంశం - దైవయోని; పద్య సం.(లు) - 8-40-సీ.,

  172) అమరులు- (పురుష){}[దైవ యోని]:- దేవతలు - వంశం - దైవ యోని; పద్య సం.(లు) - 1-35-సీ., 7-402-ఆ., 8-14-సీ., 8-738-ఆ., 9-192-సీ., 10.1-464-క., 8-334-వ., 10.1-15-క.,

  173) అమరేంద్రతనయుడు-1 (పురుష){}[రాజు]:- అర్జునుడు - వంశం - రాజు; పద్య సం.(లు) - 10.2-1093-క.,

  174) అమరేంద్రతనయుడు-2 (పురుష){}[వానర యోని]:- వాలి - వంశం - వానర యోని; పద్య సం.(లు) - 2-286-క.,

  175) అమరేంద్రవాహుడు- (పురుష){}[రాజు]:- శశాదుని కొడుకు పురంజయుడు. ఇతనికి అమరేంద్రవాహడు,కుకుత్సుడు అని పేర్లు ఉన్నాయి. - వంశం - రాజు; పద్య సం.(లు) - 9-160-చ.,

  176) అమరేంద్రుడు- (పురుష){}[దైవ యోని]:- ఇంద్రుడు - వంశం - దైవ యోని; పద్య సం.(లు) - 8-203-మ., 10.2-429-సీ., 10.1-880-సీ.,

  177) అమర్కుడు- (పురుష){}[ఋషి]:- శుక్రాచార్యుని కొడుకులలో ఒకడు. ప్రహ్లాదునికి చదువు చెప్పమని హిరణ్యకశిపుడు పుత్తెంచిన గురువులలో ఒకడు - వంశం - ఋషి; తండ్రి - శుక్రాచార్యుడు; పద్య సం.(లు) - 7-131-వ., 7-205-వ.,

  178) అమర్షణుడు- (పురుష){}[సూర్యవంశం]:- ఇతడు సూర్యవంశంలో శ్రీరామునికి భవిష్యతరంవాడు, భారతయుద్ధానికంటె ముందరి కాలం వాడు. ఇతని తండ్రి సంధి, కొడుకు మహస్వతుడు. - వంశం - సూర్యవంశం; తండ్రి - సంధి; కొడుకు(లు) - మహస్వతుడు; పద్య సం.(లు) - 9-364-వ.,

  179) అమలక - ( -){}[వృక్ష]:- ఉసిరి - ఇవి అష్టమ స్కంధములోని త్రికూట పర్వతములో వర్ణించబడ్డాయి - వంశం - వృక్ష; పద్య సం.(లు) - 8-23-సీ., 8-24-వ., 8-25-క.,

  180) అమలుడు-1 (పురుష){}[దైవ యోని]:- విష్ణుమూర్తి కృతయుగంలో తెల్లని రంగుతో నాలుగుచేతులు కలిగి ఉంటాడు; జడలు నారచీరలు జింకచర్మం జపమాలిక దండం కమండలము దాల్చి నిర్మలమైన తపస్సు ధ్యానము అనుష్టానము గల మునిశ్రేష్ఠులచేత హంసుడు, సుపర్ణుడు, వైకుంఠుడు, ధర్ముడు, అమలుడు, యోగీశ్వరుడు, ఈశ్వరుడు, పురుషుడు, అవ్యక్తుడు, పరమాత్ముడు అనే దివ్య నామాలతో ప్రశంసింపబడుతూ ప్రసిద్ధి చెందుతాడు. - వంశం - దైవ యోని; పద్య సం.(లు) - 11-77-వ.,

  181) అమలుడు-2 (పురుష){}[దైవ యోని]:- భగవంతుడు - వంశం - దైవ యోని; పద్య సం.(లు) - 7-39-సీ.,

  182) అమితుడు- (పురుష){}[చంద్రవంశం]:- ఇతను జయుని కొడుకు. పురూరవునికి ఊర్వశి యందు కలిగిన ఆరుగురు (6) కొడుకులలోనూ అయిదవ వాడైన జయుని కొడుకు కనుక పురూరవుని మనుమడు. - వంశం - చంద్రవంశం; తండ్రి - జయుడు; పద్య సం.(లు) - 9-422-వ.,

  183) అమిత్రజిత్తు- (పురుష){}[సూర్యవంశం]:- ఇతడు పరీక్షితుకి భవిష్యత్తు కాలానికి చెందిన రాజు. తండ్రి సుతపుడు, కొడుకు బృహద్వాజి. - వంశం - సూర్యవంశం; తండ్రి - సుతపుడు; కొడుకు(లు) - బృహద్వాజి; పద్య సం.(లు) - 9-366-వ.,

  184) అమీనరుడు- (పురుష){}[చంద్రవంశం]:- ఇతడు చంద్రవంశపు రాజు ద్విమీఢుని కొడుకు. ఇతని కొడుకు కృతిమంతుడు. - వంశం - చంద్రవంశం; తండ్రి - ద్విమీఢుడు; కొడుకు(లు) - కృతిమంతుడు; పద్య సం.(లు) - 9-655-వ.,

  185) అమృత-1 ( -){}[వృక్ష]:- అమృత అంటే ఉసిరిక చెట్లు అని అమృతము అని నానార్థాలు ఉన్నాయి. ఈ పదం ప్రథమ స్కంధలో నైమిశారణ్య వర్ణన సందర్భంలో ఇంద్రుడి ఇల్లు} కు ఉపమాన పదంగా వాడబడింది. - వంశం - వృక్ష; పద్య సం.(లు) - 1-39-వ.,

  186) అమృత-2 ( -){}[ఆహార]:- అమృత అంటే అమృతము అని ఉసిరిక చెట్లు అని నానార్థాలు ఉన్నాయి. ఈ పదం ప్రథమ స్కంధలో నైమిశారణ్య వర్ణన సందర్భంలో ఇంద్రుడి ఇల్లు} ఉపమాన పదంగా వాడబడింది. - వంశం - ఆహార; పద్య సం.(లు) - 1-39-వ., 1-63-వ,

  187) అమృతప్రభులు- (పురుష){}[దైవ యోని]:- ఎనిమిదవదైన సూర్య సావర్ణి మన్వంతరంలో సుతపులూ, విరజులూ, అమృతప్రభులూ దేవతలు అవుతారు. గాలవుడూ, దీప్తిమంతుడూ, పరశురాముడు, అశ్వత్థామ, కృపుడూ, వ్యాసుడు, ఋష్యశృంగుడు, సప్తఋషులు అవుతారు. ఇప్పుడు వారు తమతమ ఆశ్రమాలలో ఉన్నారు. బలిచక్రవర్తి ఇంద్రుడు అవుతాడు. - వంశం - దైవ యోని; పద్య సం.(లు) - 8-415-వ.,

  188) అమృతవర్షం- ( -){}[ప్రాంతం]:- అమృతవర్షానికి అధిపతి ఇధ్మజిహ్వుని కొడుకు అమృతుడు, ఇది ప్లక్షద్వీపంలో ఉంది. ఈ వర్షంలో మేఘమాలం అను కుల పర్వతము, సత్యంభర అను మహానది ఉన్నాయి. హంసులు, పతంగులు, ఊర్ధ్వాయనులు, సత్యాంగులు అను నాలుగు వర్ణాల ప్రజలు ఉన్నారు. ప్లక్షద్వీపంలో నివసించే పురుషుల ఆయుర్దాయం వేయి సంవత్సరాలు. ప్లక్ష ద్వీపానికి దేవుడు సూర్యభగవానుడు. - వంశం - ప్రాంతం; పద్య సం.(లు) - 5.2-60-వ.,

  189) అమృతుడు- (పురుష){}[మానవ యోని]:- ఇతడు ప్లక్షద్వీపంలోని అమృతవర్షానికి అధిపతి. ప్రియవ్రతపుత్రుడైన ఇధ్మజిహ్వుని ఏడుగురు కొడుకులలో అమృతుడు ఏడవవాడు, ఈ వర్షంలో మేఘమాలం అను కుల పర్వతము, సత్యంభర అను మహానది ఉన్నాయి. హంసులు, పతంగులు, ఊర్ధ్వాయనులు, సత్యాంగులు అను నాలుగు వర్ణాల ప్రజలు ఉన్నారు. ప్లక్షద్వీపంలో నివసించే పురుషుల ఆయుర్దాయం వేయి సంవత్సరాలు. ప్లక్ష ద్వీపానికి దేవుడు సూర్యభగవానుడు. - వంశం - మానవ యోని; తండ్రి - ఇధ్మజిహ్వుడు; పద్య సం.(లు) - 5.2-60-వ.,

  190) అమృతౌఘ- ( -){}[నది]:- క్రౌంచద్వీపంలోని మధువహ వర్షంలో వర్దమానం అను పర్వతము, అమృతౌఘ అను నది ఉన్నాయి. - వంశం - నది; పద్య సం.(లు) - 5.2-66-వ.,

  191) అయుతజిత్తు- (పురుష){}[చంద్రవంశం]:- ఇతడు చంద్ర వంశంలోని భజమానునికి కలిగిన ఆరుగురు (6) కొడుకులలో ఆరవ వాడు, భజమానుని రెండవ భార్య యందు కలిగిన వారిలో మూడవ కొడుకు. - వంశం - చంద్రవంశం; తండ్రి - భజమానుడు; పద్య సం.(లు) - 9-709-వ.,

  192) అయుతాయువు-1 (పురుష){}[సూర్యవంశం]:- ఇతడు చంద్రవంశంలోని భగీరథుని తరువాతి తరాలకు చెందిన సింధుద్వీపుని కొడుకు, ఇతని కొడుకు ఋతుపర్ణుడు. ఇతడు నలమహారాజుతో మిత్రత్వం జేసి నలునికి అక్షహృదయం అనే విద్య ఇచ్చాడు. నలుని నుండి అశ్వహృదయం అనే విద్య పొందాడు - వంశం - సూర్యవంశం; తండ్రి - సింధుద్వీపుడు; కొడుకు(లు) - ఋతుపర్ణుడు; పద్య సం.(లు) - 9-234-వ.,

  193) అయుతాయువు-2 (పురుష){}[చంద్రవంశం]:- ఇతడు చంద్రవంశంలోని రథికుని కొడుకు, ఇతని కొడుకు క్రోధనుడు. - వంశం - చంద్రవంశం; తండ్రి - రథికుడు; కొడుకు(లు) - క్రోధనుడు; పద్య సం.(లు) - 9-661-వ.,

  194) అయుతాయువు-3 (పురుష){}[చంద్రవంశం]:- ఇతడు చంద్రవంశంలోని జరాసంధుని మనుమడైన శ్రుతశ్రవుని కొడుకు, ఇతని కొడుకు నిరమిత్రుడు. - వంశం - చంద్రవంశం; తండ్రి - శ్రుతశ్రవుడు; కొడుకు(లు) - నిరమిత్రుడు; పద్య సం.(లు) - 9-681-వ.,

  195) అయోముఖుడు- (పురుష){}[రాక్షస యోని]:- ఇతడు దానవుడు, కశ్యపుడికి దనువు నందు కలిగిన కొడుకులు పద్దెనిమిది మంది (18) దానవులు. వారిలో ఆరవ (6) వాడు అయోముఖుడు.
దేవాసురుల యుద్ధాలలో బలిచక్రవర్తికి, వృత్రుడుకి తోడుగా యుద్ధాలు చేసాడు. - వంశం - రాక్షస యోని; తండ్రి - కశ్యపుడు ; తల్లి - దనువు ; పద్య సం.(లు) - 6-28-వ., 6-363-వ., 8-327-క. నుండి 8-334-వ. వరకు,

  196) అరణ్యాటము- ( -){}[జంతు]:- ఏనుగు, అడవిలో చరించునది - వంశం - జంతు; పద్య సం.(లు) - 8-57-శా.,

  197) అరదములు- ( -){}[పరికరములు]:- రథములు (ప్ర) అరదములు (వి) . బలి దేవేంద్రుల నేతృత్వంలో జరిగిన సురాసుర యుద్ధంలో రాక్షసులు వీటిని వాహనాలుగా వాడారు. - వంశం - పరికరములు; పద్య సం.(లు) - 8-327-క. నుండి 8-34-వ. వరకు,

  198) అరవిందనందనుడు- (పురుష){}[దైవ యోని]:- బ్రహ్మదేవుడు - వంశం - దైవ యోని; పద్య సం.(లు) - 3-501--వ., 4-167-చ.,

  199) అరవిందనయనుడు- (పురుష){}[దైవ యోని]:- విష్ణుమూర్తి - వంశం - దైవ యోని; పద్య సం.(లు) - 3-507-వ.,

  200) అరవిందనాభుడు- (పురుష){}[దైవ యోని]:- విష్ణుమూర్తి - వంశం - దైవ యోని; పద్య సం.(లు) - 3-189-సీ.,

  201) అరవిందభవుడు- (పురుష){}[దైవ యోని]:- బ్రహ్మదేవుడు - వంశం - దైవ యోని; పద్య సం.(లు) - 1-71-ఉ., 3-449-తే., 3-778-క., 4-135-వ.,

  202) అరవిందమందిర- (స్త్రీ){}[దైవ యోని]:- లక్మీదేవి, పద్మములు నివాసముగా కల యామె. - వంశం - దైవ యోని; పద్య సం.(లు) - 8-131-వ.,

  203) అరవిందలోచనుడు- (పురుష){}[దైవ యోని]:- విష్ణుమూర్తి - వంశం - దైవ యోని; పద్య సం.(లు) - 3-156-వ.,

  204) అరవిందసంభవుడు- (పురుష){}[దైవ యోని]:- బ్రహ్మదేవుడు - వంశం - దైవ యోని; పద్య సం.(లు) - 3-367-వ. 3-377-సీ.,

  205) అరవిందాక్షుడు- (పురుష){}[దైవ యోని]:- విష్ణుమూర్తి - వంశం - దైవ యోని; పద్య సం.(లు) - 4-201-మ.,

  206) అరవిందోదర- (పురుష){}[దైవ యోని]:- విష్ణుమూర్తి - వంశం - దైవ యోని; పద్య సం.(లు) - 3-429-మ., 4-177-మ.4-283-మ.,

  207) అరిందముడు- (పురుష){}[చంద్రవంశం]:- ఇతడు చంద్రవంశంలో పరీక్షిత్తునకు భవిష్యకాలపు రాజు. ఇతని తండ్రి శివస్వాతి, ఇతని కొడుకు గోమతి. - వంశం - చంద్రవంశం; తండ్రి - శివస్వాతి; కొడుకు(లు) - గోమతి; పద్య సం.(లు) - 12-8-వ.,

  208) అరిజిత్తు- (పురుష){}[చంద్రవంశం]:- శ్రీకృష్ణునికి అష్టమహిషలలో ఒకరైన భద్ర యందు పుట్టిన కొడుకు. - వంశం - చంద్రవంశం; తండ్రి - కృష్ణుడు; తల్లి - భద్ర; పద్య సం.(లు) - 10.2-275-వ.,

  209) అరిమర్దనుడు- (పురుష){}[చంద్రవంశం]:- ఇతడు చంద్రవంశంలోని శ్వఫల్కునికి గాంధిని యందు కలిగిన పన్నెండు (12) మంది కొడుకులలో తొమ్మిదవ (9) వాడు. వీరి సోదరి సుచారువు. - వంశం - చంద్రవంశం; తండ్రి - శ్వఫల్కుడు; తల్లి - గాంధిని; పద్య సం.(లు) - 9-712-వ.,

  210) అరిష్ట-1 ( -){}[వృక్ష]:- అరిష్ట అంటే వేప చెట్లు అని అరిష్టాసురుడు అని నానార్థాలు ఉన్నాయి. ఈ పదం ప్రథమ స్కంధలో నైమిశారణ్య వర్ణన సందర్భంలో రాక్షసుల యుద్ధాలు} కు ఉపమాన పదంగా వాడబడింది. - వంశం - వృక్ష; పద్య సం.(లు) - 1-39-వ.,

  211) అరిష్ట-2 (పురుష){}[రాక్షస యోని]:- అరిష్ట అంటే అరిష్టాసురుడు అని వేప చెట్లు అని నానార్థాలు ఉన్నాయి. ఈ పదం ప్రథమ స్కంధలో నైమిశారణ్య వర్ణన సందర్భంలో రాక్షసుల యుద్ధాలు} ఉపమాన పదంగా వాడబడింది. - వంశం - రాక్షస యోని; పద్య సం.(లు) - 1-39-వ.,

  212) అరిష్ట-3 (స్త్రీ){}[ఋషి]:- కశ్యపునికి భార్య దక్షుని కూతురు అయిన అరిష్ట యందు గంధర్వులు జన్మించారు. - వంశం - ఋషి; తండ్రి - దక్షుడు; తల్లి - అసక్ని; భర్త - కశ్యపుడు ; కొడుకు(లు) - గంధర్వులు; పద్య సం.(లు) - 6-256-త., 6-257.1-తే.,

  213) అరిష్టకర్మ- (పురుష){}[రాజు]:- ఇతడు పరీక్షిత్తుకు భవిష్యత్కాలపు రాజు. ఇతని తండ్రి దండమానుడు, కొడుకు తిలకుడు. ఇతనిని హాలేయుడు (నాగలి పట్టువాడు) అని కూడా అంటారు. - వంశం - రాజు; తండ్రి - దండమానుడు; కొడుకు(లు) - తిలకుండు; పద్య సం.(లు) - 12-38-వ.,

  214) అరిష్టనేమి-1 (పురుష){}[గంధర్వుడు]:- ఇతడు పుష్య మాసంలో సూర్యుని అనుచరులలోని గంధర్వుడు.
సూర్యుడు ఈ మాసంలో భగుడు అను పేరుతో, పూర్వచిత్తి, ఆయువు, కర్కోటకుడు, స్పూర్జుడు, అరిష్టనేమి, ఊర్ణుడు మున్నగువారు అనుచరులుగా కలిగి సంచరిస్తాడు. - వంశం - గంధర్వుడు; పద్య సం.(లు) - 12-41-వ. నుండి 12-45-వ. వరకు,

  215) అరిష్టనేమి-2 (పురుష){}[రాక్షస యోని]:- క్షీరసాగరమథనానికి దానవులను, దైత్యులను ఒప్పించడానికి దేవతలు మిత్రత్వం నెరిపిన రాక్షస వీరులలో ఒకడు. - వంశం - రాక్షస యోని; తండ్రి - గురుజిత్తు; కొడుకు(లు) - శ్రుతాయువు; పద్య సం.(లు) - 8-182-వ., 9-374-వ.,

  216) అరిష్టనేమి-3 (పురుష){}[రాక్షసయోని]:- అరిష్టనేమి మున్నగు రాక్షసవీరులు సురాసుర యుద్ధములో బలి పక్షమున పోరాడాడు. - వంశం - రాక్షసయోని; పద్య సం.(లు) - 8-327-క. నుండి 8-334-వ. వరకు,

  217) అరిష్టుడు-1 (పురుష){}[రాక్షస యోని]:- ఇతడు వృషభాకారంతో కృష్ణునికి కీడుచేయడానికి వచ్చి మరణించిన రాక్షసుడు. - వంశం - రాక్షస యోని; పద్య సం.(లు) - 10.1-1138-వ.,

  218) అరిష్టుడు-2 (పురుష){}[రాక్షస యోని]:- కంసుడు, నారదుని వలన నందుడు, వసుదేవుడు మున్నగువారందరు దేవతలు తాను రాక్షసుడను మున్నగునవి. వినిన పిమ్మట అరిష్టుడు, బాణుడు, పూతన మున్నగు రాక్షసులతో కూడి యుద్ధాలు చేసి యాదవులను అందరిని ఓడించి తానే ఏలసాగాడు - వంశం - రాక్షస యోని; పద్య సం.(లు) - 10.1-56-వ.,

  219) అరిష్టుడు-3 (పురుష){}[రాక్షస యోని]:- దానవ సంగ్రామంలోని ఒక దానవుడు
కశ్యపునికి భార్య దక్షుని కూతురు అయిన దనువు యందు పద్దెనిమిది (18) మంది దానవులు పుట్టారు. వారిలో ఈ అరిష్టుడు ఒకడు.
దేవదానవ యుద్ధంలో బలి తరఫున యుద్ధం చేసిన రాక్షసుడు
220) అరిష్టుడు-4 (పురుష){}[మానవయోని]:-ఇతడు సూర్యవంశంలోని గురుజిత్తు కుమారుడు, ఇతని కుమారుడు శ్రుతాయువు. - వంశం - రాక్షస యోని; తండ్రి - కశ్యపుడు ; తల్లి - దనువు ; పద్య సం.(లు) - 1-39-వ., 6-258-వ., 8-331-వ.,

  220) అరిష్టుడు-4 (పురుష){}[సవితృ వంశం]:- ఆదిత్యస్వరూపుడైన మిత్రునకు రేవతి యందు ఇద్దరు కొడుకులు అరిష్టుడు, పిప్పలుడు - వంశం - సవితృ వంశం; తండ్రి - మిత్రుడు ; తల్లి - రేవతి; పద్య సం.(లు) - 6-507,

  221) అరిష్టుడు-5 (పురుష){}[రాక్షసయోని]:- అరిష్టుడు మున్నగు రాక్షసవీరులు సురాసుర యుద్ధములో బలి పక్షమున పోరాడాడు. - వంశం - రాక్షసయోని; పద్య సం.(లు) - 8-327-క. నుండి 8-34-వ. వరకు,

  222) అరిష్యంతుడు- (పురుష){}[రాజు]:- ఇతడు వైవశ్వత మనువుకు భార్య శ్రద్ధ యందు కలిగిన పదిమంది (10) కొడుకులలోను ఒకడు (5). - వంశం - రాజు; తండ్రి - వైవశ్వతమనువు; తల్లి - శ్రద్ధ ; కొడుకు(లు) - చిత్రసేనుడు; పద్య సం.(లు) - 8-412-పవ., 9-9-వ., 9-42-వ., 9-43-క.,

  223) అరుంధతి- (స్త్రీ){}[ఋషి]:- కర్దమునికి అతని భార్య దేవహూతి యందు కలిగిన తొమ్మిదిమంది కుమార్తెలలో ఎనిమిదవ కుమార్తె. ఈమె వసిష్ఠుని భార్య, శక్తి మున్నగు కొడుకులు కలరు - వంశం - ఋషి; తండ్రి - కర్దముడు; తల్లి - దేవహూతి ; భర్త - వసిష్ఠుడు; పద్య సం.(లు) - 3-826-క., 3-849-వ., 4-26-వ.,

  224) అరుణ- ( -){}[నది]:- ప్లక్షద్వీపంలోని శివవర్షంలో మణికూటం అను కుల పర్వతము, అరుణ అను మహానది ఉన్నాయి. - వంశం - నది; పద్య సం.(లు) - 5.2-60-వ.,

  225) అరుణి-1 (పురుష){}[ఋషి]:- ఇతడు బ్రహ్మదేవుని కుమారులలో ఒకడు. నైష్ఠికులై గృహస్తులు కాకపోవడం వలన వంశాలు కొనసాగని బ్రహ్మదేవుని పుత్రులలోని వాడు. అలా సనకుడు, సనందనుడు, సనత్సుజాతుడు, సనత్కుమారుడు, నారదుడు, హంసుడు, అరుణి, ఋభుడు, యతి అను ఈ బ్రహ్మదేవుని పుత్రుల వంశాలు కొనసాగలేదు. - వంశం - ఋషి; తండ్రి - బ్రహ్మదేవుడు; పద్య సం.(లు) - 4-214-క.,

  226) అరుణి-2 (పురుష){}[రాక్షస యోని]:- ఇతను కశ్యపుడికి భార్య దనువు నందు పుట్టిన పద్దెనిమిది (18) మంది కొడుకులలో పదవ వాడు (10). - వంశం - రాక్షస యోని; తండ్రి - కశ్యపుడు; తల్లి - దనువు ; పద్య సం.(లు) - 6-257.1-తే., 6-288-వ.,

  227) అరుణుడు-1 (పురుష){}[ఋషి]:- విదేహ రాజు బృహదశ్వుడు, విప్తుడు శ్రుతదేవుడులను చూడబోయిన కృష్ణుని వెంట వెళ్ళిన మునీశ్వరులలో ఇతను ఒకడు. - వంశం - ఋషి; పద్య సం.(లు) - 10.1-1179,

  228) అరుణుడు-2 (పురుష){}[చంద్రవంశం]:- ఇతడు ప్రసిద్ధులైన శ్రీకృష్ణుని పద్దెనిమిది మంది (18) పుత్రులలో ఒకడు - వంశం - చంద్రవంశం; పద్య సం.(లు) - 10.1-1330-వ.,

  229) అరుణుడు-3 (పురుష){}[ఋషి]:- శ్రీకృష్ణుని దర్శించుకోవడానికి వచ్చి వసుదేవునిచే క్రతువు చేయించిన మునీశ్వరులలో ఒక మునీశ్వరుడు. - వంశం - ఋషి; పద్య సం.(లు) - 10.2-1179-వ.,

  230) అరుణుడు-4 (పురుష){}[రాక్షస యోని]:- కృష్ణుని చేతిలో మరణించిన మురాసురుని 7గురు పుత్రులలోని వాడు. మిగతా వారు తామ్రుండు, అంతరిక్షుండు, శ్రవణుడు, విభావసుడు, వసుడు, నభస్వంతుడు. - వంశం - రాక్షస యోని; తండ్రి - మురాసురుడు; పద్య సం.(లు) - 10.2-165-వ.,

  231) అరుణుడు-5 (పురుష){}[ఋషి]:- పరీక్షిత్తు గంగానది ఒడ్డున ప్రాయోపవిష్టుడై ఉన్నాడని విని, వచ్చిన ఋషులలో ఈయన ఒకరు. - వంశం - ఋషి; పద్య సం.(లు) - 1-499-వ.,

  232) అరుణుడు-6 (పురుష){}[దైవ యోని]:- ఇతడు సూర్యునికి రథసారథి. తార్క్ష్యునికి (కాశ్యపుడు) పెద్దభార్య అయిన వినత యందు ఇతను రెండవ కొడుకు. ఇతనికి ఊరువులు లేకపోవుటచేత అనూరుడు అని మరొక పేరు కలదు. ఇతని అన్న గరుత్మంతుడు. - వంశం - దైవ యోని; తండ్రి - కశ్యపుడు; తల్లి - వినత; పద్య సం.(లు) - 5.2-82-సీ., 5.2-83-వ., 6-254-వ.,

  233) అరుణుడు-7 (పురుష){}[ఋషి]:- పదకొండవదైన (11)ధర్మసావర్ణి మన్వంతరం కాలంలో ఇతడు ఒక ఋషి. - వంశం - ఋషి; పద్య సం.(లు) - 8-421-వ.,

  234) అరుణుడు-8 (పురుష){}[సూర్యవంశం]:- ఇతడు సూర్యవంశంలోని హర్యశ్వుని కొడుకు. ఇతని కొడుకు త్రిబంధనుడ. ఈ త్రిబంధనుడి మనుమడు త్రిశంకుడు అనబడే సత్యవ్రతుడు. - వంశం - సూర్యవంశం; తండ్రి - హర్యశ్వుడు; కొడుకు(లు) - త్రిబంధనుడు; పద్య సం.(లు) - 9-191-వ.,

  235) అరుణోదం నది- ( - ){}[నది]:- సుమేరు పర్వతానికి తూర్పున మందర పర్వతం ఉంది. ఈ పర్వత శిఖరాల మీద పతాకాల లాగా పెద్ద పెద్ద మామిడి చెట్లు ఉంటాయి. ఈ వృక్షరాజాలు ఒక్కొక్కటి పదకొండు వందల యోజనాల పొడవు, నూరు యోజనాల వెడల్పు కలిగి ఉంటాయి.
మందర పర్వతం మీద రాలిన పర్వత శిఖరాలంత పెద్ద మామిడి పండ్లరసం అద్భుతమైన మహాప్రవాహమై అరుణోదం అనే నదిగా ప్రవహిస్తుంది.
ఆ నది మందరాచలం నుండి బయలుదేరి తూర్పు వైపుగా ఇలావృత వర్షాన్ని ఒరుసుకుంటూ సాగిపోతుంది.
ఆ నదీజలాలలో పార్వతీదేవి చెలికత్తెలు స్నానం చేస్తారు. - వంశం - నది; పద్య సం.(లు) - 5.2-20-వ., 5.2-21-ఉ., 5.2-22-చ., 5.2-23-ఆ.,

  236) అర్క- SSSSSS (పురుష){}[దైవ యోని]:- సూర్యుడు. వైకారికంబైన సాత్త్వికాహంకారంబు వలనఁ జంద్రదైవతంబయిన మనంబు గలిగె; మఱియు దిక్కులును వాయువును నర్కుండును బ్రచేతసుండును నాశ్వినులును వహ్నియు నింద్రుండు నుపేంద్రుండును మిత్రుండునుఁ బ్రజాపతియు ననియెడి దశదేవతలు గలిగిరి;
సూర్యవంశంలోని జలునికి సూర్యుని అంశతో వజ్రనాభుడు పుట్టాడు. వజ్రనాభుని కొడుకు శంఖణుడు. - వంశం - దైవ యోని; పద్య సం.(లు) – 2-86-వ., 2-238-వ, 3-345-సీ., 5.1-147-సీ., 7-342-సీ., 7-421-వ., 9-364-వ.,

  236) అర్క- (){}[వృక్ష]:- అర్క అనగా జిల్లేడు మొక్కలు. హిరణ్యాక్షుడు దాడిచేసినప్పుడు, దేవతలు బ్రహ్మ వరాన్ని గుర్తుకు తెచ్చుకొని భయపడి గరుత్మంతుని చూచి పారిపోయే పాములవలె తమ మందిరాలను జిల్లేళ్ళకు, ఉమ్మెత్తలకు నివాసాలుగా చేసి ఎక్కడెక్కడికో పారిపోయారు. 237) అర్కుడు-1 (పురుష){}[వసువులు]:- ధర్మునికి వసువునందు కలిగిన ఎనిమిది మందిలో నాలుగవవాడు. వారు ద్రోణుడు, ప్రాణుడు, ధ్రువుడు, అర్కుడు, అగ్ని, దోషుడు, వస్తువు, విభావసువు; - వంశం - వసువులు; తండ్రి - ధర్ముడు; తల్లి - వసువు ; భార్య - వాసన; కొడుకు(లు) - తర్షుడు మొదలైనవారు; పద్య సం.(లు) - 6-254-వ.,

  238) అర్కుడు-2 (పురుష){}[చంద్రవంశం]:- ఇతడు చంద్రవంశంలోనివాడు. ఇతని తండ్రి పురుజుడు. కొడుకు భర్మాశ్వుడు - వంశం - చంద్రవంశం; తండ్రి - పురుజుడు; కొడుకు(లు) - భర్మ్యాశ్వుడు; పద్య సం.(లు) - 9-655-వ.,

  239) అర్చి-1 (స్త్రీ){}[ధ్రువుని వంశం]:- చెడుమార్గాలు పట్టిన అంగరాజుపుత్రుడైన వేనుని మునులు మరణించమని శపించగా. దేశానికి రాజు కావాలి కనుక తల్లి సునీథి అనుమతితో అతని శరీంరంలోని తొడభాగాన్ని మథించగా నిషాదుడు పుట్టాడు. అతను రాజార్హుడు కాడని, కుడిభుజాన్ని మథించగా నారాయణాంశతో పృథువు, లక్ష్మీదేవి అంశంతో అర్చి జన్మించారు. వారిరువురు మిథునమయ్యారు. అంగరాజ్యానికి పృథువు పట్టాభిక్తుడు అయ్యాడు.పృథుచక్రవర్తికి భార్య అర్చి యందు అయిదుగురు కొడుకులు కలిగారు. వారు విజితాశ్వుడు, హర్యశ్వుడు, వృకుడు, ధూమ్రకేశుడు, ద్రవిణుడు. - వంశం - ధ్రువుని వంశం; తండ్రి - వేనుడు; భర్త - పృథువు ; కొడుకు(లు) - విజితాశ్వుడు, హర్యశ్వుడు, వృకుడు, ధూమ్రకేశుడు, ద్రవిణుడు.; పద్య సం.(లు) - 4-390-వ., 4-401-వ., 4-434-క., 4-435-వ.,

  240) అర్చి-2 (స్త్రీ){}[ఋషి]:- ఈమె దక్షునికి అసిక్ని యందు పుట్టిన కుమార్తె, ఈమె భర్త కృశాశ్వుడు, కొడుకు ధూమ్రకేశుడు. - వంశం - ఋషి; తండ్రి - దక్షుడు; తల్లి - అసక్ని; భర్త - కృశాశ్వుడు; కొడుకు(లు) - ధూమ్రకేశుడు; పద్య సం.(లు) - 6-254-వ.,

  241) అర్జున-1 ( -){}[వృక్ష]:- అర్జున అంటే మద్ధి చెట్లు అని అర్జునుడు అని నానార్థాలు ఉన్నాయి. ఈ పదం ప్రథమ స్కంధలో నైమిశారణ్య వర్ణన సందర్భంలో కురుపాండవుల యుద్ధం} కు ఉపమాన పదంగా వాడబడింది. - వంశం - వృక్ష; పద్య సం.(లు) - 1-39-వ.,

  242) అర్జున-2 (పురుష){}[రాజు]:- అర్జున అంటే అర్జునుడు అని మద్ధి చెట్లు అని నానార్థాలు ఉన్నాయి. ఈ పదం ప్రథమ స్కంధలో నైమిశారణ్య వర్ణన సందర్భంలో కురుపాండవుల యుద్ధం} ఉపమాన పదంగా వాడబడింది. - వంశం - రాజు; పద్య సం.(లు) - 1-39-వ.,

  243) అర్జునుడు-1 (పురుష){}[గోపకులు]:- గోపకన్యలను అనుగ్రహించి బృందావనం దాటి వెళ్ళి గోవులను మేపుతున్న కృష్ణునితోపాటు ఉన్న ఒక గోపకుడు. - వంశం - గోపకులు; పద్య సం.(లు) - 10.1-850-వ.,

  244) అర్జునుడు-2 (పురుష){}[చంద్రవంశం]:- ఇతడు పంచపాండవ మధ్యముడు. ఇతనికి శ్రీకృష్ణుడు రథ సారథ్యం చేసాడు. పాండురాజునకు కుంతి యందు ఇంద్రుని వరం వలన మూడవ కొడుకుగా పుట్టాడు. ఇతని భార్యలు ద్రౌపది, ఉలూపి, చింత్రంగద, సుభద్ర. ఇతనికి ద్రౌపది వలన శ్రుతకీర్తి, ఉలూపి యందు ఇలావంతుడు, చిత్రాంగద యందు బబ్రువాహనుడు, సుభద్ర యందు అభిమన్యుడు. అభిమన్యుడి పుత్రుడు పరీక్షిన్మహారాజు. ఇతనికే శుకమునిచేత భాగవతం చెప్పబడింది. ఇతను సవ్యసాచి, పార్థ, విజయుడు మున్నగు సార్థకనామధేయాలు కల మహా వీరుడు.
ఈ నిర్మలమతి మహాత్ముడు భక్తితో ఆ దేవదేవుని సేవించి దాటరాని విష్ణుమాయను దాటాడు. - వంశం - చంద్రవంశం; తండ్రి - పాండురాజు; తల్లి - కుంతి; భార్య - ద్రౌపది, ఉలూపి నాగకన్య, చిత్రాంగద, సుభద్ర; కొడుకు(లు) - ద్రౌపది వలన శ్రుతకీర్తి, ఉలూపి యందు ఇలావంతుడు, చిత్రాంగద యందు బబ్రువాహనుడు, సుభద్ర యందు అభిమన్యుడు; పద్య సం.(లు) - 1-147-వ., 1-152-వ., 1-223.1-తే., 1-224-మ., 2-240-సీ.; 9-673-వ., 9-722-వ.,

  245) అర్జునుడు-3 (పురుష){}[చంద్రవంశం]:- రాజ్యమోహంతో గర్వాంధులైన రాజులను చూసి భూదేవి నవ్వుకుంటుంది అంటూ పేర్కొన్న ఇరవై ఎనిమిది రాజులలో ఇతను ఒకడు. - వంశం - చంద్రవంశం; పద్య సం.(లు) - 12-18-వ.,

  246) అర్జునుడు-4 (పురుష){}[రాజు]:- అయిదవ (5) మనువు రైవతమనువు ప్రతివిందుడు, అర్జునుడు మున్నగు కొడుకులలో ఒకడు. వీరు రైవతమన్వంతరంలో రాజులు అయ్యారు. - వంశం - రాజు; తండ్రి - రైవత మనువు; పద్య సం.(లు) - 8-138-క.,

  247) అర్జునోద్భేదంబు-1 ( -){}[వృక్ష]:- అర్జునోద్భేదంబు అంటే మద్ది అంకురాలు కలది అని కార్తవీర్యార్జుని సంహారం కలది అని నానార్థాలు ఉన్నాయి. ఈ పదం ప్రథమ స్కంధలో నైమిశారణ్య వర్ణన సందర్భంలో పరశురాముడి యుద్ధం} కు ఉపమాన పదంగా వాడబడింది. - వంశం - వృక్ష; పద్య సం.(లు) - 1-39-వ.,

  248) అర్జునోద్భేదంబు-2 ( -){}[వర్ణన]:- అర్జునోద్భేదంబు అంటే కార్తవీర్యార్జుని సంహారం కలది అని మద్ది అంకురాలు కలది అని నానార్థాలు ఉన్నాయి. ఈ పదం ప్రథమ స్కంధలో నైమిశారణ్య వర్ణన సందర్భంలో పరశురాముడి యుద్ధం} ఉపమాన పదంగా వాడబడింది. - వంశం - వర్ణన; పద్య సం.(లు) - 1-39-వ.,

  249) అర్థచంద్రకరభావము- ( -){}[నృత్తము]:- పారిభాషిక పదము - రాసక్రీడ - నృత్తము
అర్థచంద్రునివలె అన్నివేళ్ళు చాచి పట్టునది, శ్లో. అర్ధచంద్రకరస్సోయం పతాకేంగుష్ట సారణాత్ - వంశం - నృత్తము; పద్య సం.(లు) - 10.1-1084-వ.,

  250) అర్థపతి- (పురుష){}[దైవ యోని]:- కుబేరుడు - వంశం - దైవ యోని; పద్య సం.(లు) - 9-637-క.,

  251) అర్థము- (స్త్రీ){}[విప్ర]:- ధర్మునికి దక్షుని కుమార్తె బుద్ధి యందు అర్థం పుట్టెను - వంశం - విప్ర; తండ్రి - ధర్ముడు; తల్లి - . బుద్ధి ; పద్య సం.(లు) - 4-28-వ.,

  252) అర్థసిద్ధి- (పురుష){}[ఋషి]:- ధర్మునికి దక్షుని పుత్రిక సాధ్య యందు సాధ్యగణములు, వానికి ఈ అర్థసిద్ధి పుట్టారు - వంశం - ఋషి; తండ్రి - సాధ్యులు; పద్య సం.(లు) - 6-254-వ.,

  253) అర్ధరాత్రము- ( -){}[భగణ విషయం]:- సూర్యగమనం వలన ఏర్పడు దినములోని కాలభేదములు - వంశం - భగణ విషయం; పద్య సం.(లు) - 5.2-81-వ.,

  254) అర్యమ (మూలం అంశువు)- (పురుష){}[దైవ యోని]:- సూర్యుడు మార్గశీర్ష (సహో) మాసంలో అర్యమ (మూలం అంశువు) అను పేరుతో సంచరిస్తాడు. ఈ మాసంలో అతనికి అప్సరస ఊర్వశి ; ఋషి కశ్యపుడు ; నాగుడు మహాశంఖుడ ; రాక్షసుడు విద్యుచ్ఛత్రుడు ; గంధర్వుడు ఋతసేనుడు ; యక్షుడు తార్క్ష్యుడు మున్నగువారు అనుచరులై ఉంటారు. - వంశం - దైవ యోని; పద్య సం.(లు) - 12-41-వ. నుండి 12-45-వ. వరకు,

  255) అర్యముడు- (పురుష){}[దైవ యోని]:- పూర్వం మాండవ్యముని శాపం వలన యముడు శూద్రయోనిలో విదురుడై జన్మించి ఉన్న నూఱు (100) సంవత్సరములు, అర్యముడు యథాప్రకారం పాపకర్ములను దండించాడు.
హిరణ్మయ వర్షానికి పాపరహితుడు, పితృదేవతలు అధిపతి, మహాత్ముడు అయిన అర్యముడు పరిపాలకుడు. విష్ణువు కూర్మావతారునిగా అధిదేవత.
ఇతడు ద్వాదశాత్యులలో ఒకడు. కాశ్యపునికి దక్షుని కుమార్తె ఐన అదితి యందు కలిగిన పన్నెండు మంది ఆదిత్యులు అనబడతారు. వీరు వివస్వంతుడు, అర్యముండును పూషుండు, ద్వష్ట, సవిత, భగుండు, ధాత, విధాత, వరుణుండు, మిత్రుండు, శక్రుండు, నురుక్రముండు; అర్యమునికి భార్య మాత్రుక యందు చర్షణులు జన్మించారు.
సూర్యుడు; ఇతనితో పాటు అగ్ని, ఆకాశం, గాలి, గోవులు, చంద్రుడు, సంధ్యలు, పగళ్ళు, రాత్రులు, కాలాలు, భూమి మొదలైనవి ఈ దేహధారుడైన జీవుని సర్వ కర్మలకు సాక్షులు.
సూర్యుడు వైశాఖ (మాధవం) మాసంలో అర్యముడు అను పేరుతో సంచరిస్తాడు. ఈ మాసంలో అతనికి అప్సరస పుంజికస్థలి ; ఋషి పులహుడు ; నాగుడు కంజనీరుండు ; రాక్షసుడు ప్రహేతి ; గంధర్వుడు నారదుండు ; యక్షుడు ఓజుడు మున్నగువారు అనుచరులై ఉంటారు. - వంశం - దైవ యోని; తండ్రి - కశ్యపుడు; తల్లి - అదితి; భార్య - మాత్రుక; కొడుకు(లు) - చర్షణులు; పద్య సం.(లు) - 4-108-వ. 5.2-47-క., 5.2-48-క., 6-258-వ., 6-85.1-సీ., 12-41-వ. నుండి 12-45-వ. వరకు,

  256) అర్హణుడు- (పురుష){}[దైవ యోని]:- విష్ణుమూర్తి పార్శ్వచరులలో ఒకడు - వంశం - దైవ యోని; పద్య సం.(లు) - 2-230.1-తే.,

  257) అర్హుడు- (పురుష){}[రాజు]:- అర్హుడు దక్షిణ కర్ణాట రాష్ట్రాధికారి. సన్యసించిన ఋషభుడు లింగ శరీరాన్ని వదలిపెట్టినా యోగమాయా వాసనల కారణంగా లౌకికంగా దేహధారిగా చరించాడు. అతడు ఒకరోజు కోంకణ, వంగ, పట, కుటకాలు అనే దక్షిణ కర్ణాట దేశానికి అప్రయత్నంగా వెళ్ళి కుటక పర్వత సమీపంలోని ఉపవనం చేరుకున్నాడు. అక్కడ శిలాఖండాలను నోటిలో పెట్టుకొంటూ పిచ్చివానిలాగా చెదరిన జుట్టుతో దిగంబరుడై సంచరించాడు. అప్పుడు వీచిన సుడిగాలి విసురుకు వెదురుకర్రలు రాపిడి చెంది భయంకరమైన కార్చిచ్చు రేగింది. ఆ మంటలలో ఋషభుడు కాలిపోయాడు. ఋషభుని చేతలను ఆ ప్రాంతంవారు చెప్పుకోగా అర్హుడు అనే పేరుగల ఆ రాష్ట్రాధికారి విని, స్వధర్మం వదలిపెట్టి స్వదేశస్థులతో ఆ ఆచారానికి ఆమోదం తెలిపాడు. - వంశం - రాజు; పద్య సం.(లు) - 5.1-89-వ., ,

  259) అలంబుస- (స్త్రీ){}[అప్సరస]:- అలంబుస ఒక అప్సరస. ఈమె తృణబిందుని వరించింది. వారికుమార్తె ఇలబిల. ఈ ఇలబిలకు భర్త విశ్రవసుని వలన కుబేరుడు పుట్టాడు. - వంశం - అప్సరస; పద్య సం.(లు) - 9-47-క,

  260) అలకనందా నది- ( - ){}[నది]:- బ్రహ్మనగరం దక్షిణద్వారం నుండి వెలువడిన అలకనందా ప్రవాహం మిక్కిలి దుర్గమాలైన పర్వత పంక్తుల గుండా, హేమకూటం హిమకూటం అనే పర్వతాలు, భారతవర్షం మీదుగా వెళ్ళి దక్షిణ సముద్రంలో కలుస్తుంది. - వంశం - నది; పద్య సం.(లు) - 5.2-34-వ.,

  261) అలర్కబింబము- (పురుష){}[ప్రాంతం]:- సూర్య బింబము - వంశం - ప్రాంతం; పద్య సం.(లు) - 10.2-845-క.,

  262) అలర్కుడు- (పురుష){}[విశ్వామిత్ర వంశం]:- విష్ణువు ఆరవ అవతారంలో అత్రి అనసూయలకు దత్తాత్రేయుడై పుట్టి అలర్కుడు, ప్రహ్లాదుడు మొదలైవారికి ఆత్మవిద్య ప్రబోధించాడు.
ఇతను మరికొందరు మహాత్ములు విష్ణుమాయను దాటగలిగారు.
ఇతను అరవైఆరేళ్ళు సాటిలేని విధంగా భూమిని ఏలాడు, ఇతని తండ్రి కువలయాశ్వుడు, కొడుకు సన్నతి. - వంశం - విశ్వామిత్ర వంశం; తండ్రి - కువలయాశ్వుడు; కొడుకు(లు) - సన్నతి; పద్య సం.(లు) - 1-63-వ., 2-204-సీ., 9-500-ఆ., 9-501-వ.,

  263) అలాతదైవమండలము- ( -){}[నృత్తము]:- పారిభాషిక పదము - రాసక్రీడ - నృత్తము
కొరవి తిప్పినట్లు రెండు చేతులను పైకెత్తి ఒకదానికొకటి తగులకుండ కిందికిమీదికి తిప్పుట - వంశం - నృత్తము; పద్య సం.(లు) - 10.1-1084-వ.,

  264) అల్పహృదయజ్ఞానదీపము- ( -){}[విద్య]:- అల్పుని హృదయములోని జ్ఞానము అనే దీపము - వంశం - విద్య; పద్య సం.(లు) - 8-64-వ.,

  265) అవంత్యులు- (పురుష){}[ఋషి]:- అవంత్యులూ ఉదీచ్యులూ అనే బ్రహ్మవేత్తలయిన అయిదువందల మందికి హిరణ్యనాభుడు అను కోసలుని పుత్రుడు, కుమారుడైన పౌష్పంజి అను సుకర్ముని పుత్రుడు సామవేదశాఖలను ఉపదేశించి వారిని సామవేదపారగులుగా తీర్చిదిద్దారు. - వంశం - ఋషి; పద్య సం.(లు) - 12-30-వ.,

  266) అవటనిరోధనం- ( -){}[ప్రాంతం]:- నరకలోకంలో అనేక నరకాలు ఉన్నాయి. మహా భయంకరమైన ఆ నరకాలు తామిస్రం, అంధతామిస్రం, రౌరవం, మహారౌరవం, కుంభీపాకం, కాలసూత్రం, అసిపత్రవనం, సూకరముఖం, అంధకూపం, క్రిమిభోజనం, సందంశం, తప్తోర్మి, వజ్రకంటకశాల్మలి, వైతరణి, పూయోదం, ప్రాణరోధం, విశసనం, లాలాభక్షణం, సారమేయోదనం, అవీచిరయం, రేతఃపానం, క్షారమర్దమం, రక్షోగణభోజనం, శూలప్రోతం, దందశూకం, అవటనిరోధనం, అపర్యావర్తనం, సూచీముఖం అనే ఇరవై ఎనిమిది నరకాలు. - వంశం - ప్రాంతం; పద్య సం.(లు) - 5.2-136-వ.,

  267) అవటోద- ( -){}[మహానది]:- భారతవర్షంలోని ప్రసిద్ధమైన పర్వతాలకు పుత్రికలవంటివి అయిన మహానదులలో ఒక నది. - వంశం - మహానది; పద్య సం.(లు) - 5.2-55-వ.,

  268) అవధూత-1 (పురుష){}[చంద్రవంశం]:- అవధూత యదు సంవాదం అను ఇతిహాసంలో అవధూత తనకు ఇరవై నలుగురు గురువులని వివరించాడు. - వంశం - చంద్రవంశం; పద్య సం.(లు) - 11-91-వ.,

  269) అవధూత-2 (పురుష){}[ఋషి]:- శుకబ్రహ్మ అవధూత ప్రాయోపవేశంలో ఉన్న పరీక్షిన్మహారాజు వద్దకు వచ్చాడు - వంశం - ఋషి; పద్య సం.(లు) - 1-517.1-తే.,

  270) అవధూత-3 (పురుష){}[చంద్రవంశం]:- విదురుడు యాత్రలు వెళ్ళినప్పుడు అవధూతవేషంలో సంచరించాడు. - వంశం - చంద్రవంశం; పద్య సం.(లు) - 3-39-క.,

  271) అవధూత-4 (పురుష){}[ఇంద్రియం]:- నవద్వారపురంలో పురంజయుడు, ఆ పుర తూర్పు ద్వారాలు రెంటి నుండి ఇతడికి సఖుడై విషయములను పొందుతాడు. - వంశం - ఇంద్రియం; పద్య సం.(లు) - 4-768-వ.,

  272) అవధూత-5 (పురుష){}[చంద్రవంశం]:- విప్రజన్మనొంది ఉన్న భరతుని, సింధుపతి అవధూత అంటూ స్తుతించాడు. - వంశం - చంద్రవంశం; పద్య సం.(లు) - 5.1-178-వ.,

  273) అవధూత-6 (పురుష){}[చంద్రవంశం]:- ఋషభుడు తన పెద్ద కుమారుడు భరతునికి రాజ్యం అప్పచెప్పి అవధూత వేషధారుడై సంచరించాడు. - వంశం - చంద్రవంశం; పద్య సం.(లు) - 5.1-78-వ.,

  274) అవనిదేవి / భూదేవి- (స్త్రీ){}[దైవ యోని]:- పృథుచక్రవర్తి పట్టాభిషిక్తుడు అయిన సందర్భంలో దేవతలు అందరు వివిధ బహుమానాలు ఇచ్చారు. వారిలో భూదేవి, కాలిజోళ్ళజత ఇచ్చెను - వంశం - దైవ యోని; పద్య సం.(లు) - 4-442-సీ., 4-443-సీ.,

  275) అవరోధనుడు- (పురుష){}[ప్రియవ్రతుని వంశం]:- ఇతడు గయుని మూడవ కొడుకు, తల్లి జయంతి - వంశం - ప్రియవ్రతుని వంశం; తండ్రి - గయుడు; తల్లి - జయంతి; పద్య సం.(లు) - 5.2-10-వ.,

  276) అవిక్షిత్తు- (పురుష){}[సూర్యవంశం]:- ఇతను సూర్యవంశంలోని కరంధనుని కొడుకు, ఇతనికి మరుత్తు పుట్టాడు. - వంశం - సూర్యవంశం; తండ్రి - కరంధనుడు; కొడుకు(లు) - మరుత్తు; పద్య సం.(లు) - 9-44-వ.,

  277) అవిజ్ఞాతుడు- (పురుష){}[దైవ యోని]:- పురంజయుని పూర్వ సఖుడు, ఇద్దరూ హంసరూపులై విహరించెడివారు. - వంశం - దైవ యోని; పద్య సం.(లు) - 4-742-సీ., ,

  278) అవిద్ధఅంగహారము- ( -){}[నృత్తము]:- పారిభాషిక పదము - రాసక్రీడ - నృత్తము
మనసునందు నాటుటను సూచకము - వంశం - నృత్తము; పద్య సం.(లు) - 10.1-1084-వ.,

  279) అవిర్హోత్రుడు- (పురుష){}[ప్రియవ్రతుని వంశం]:- ఋషభుని వందమంది కొడుకులలో ఒకడు. తల్లి జయంతి, వీరిలో ఇతనితోపాటు తొమ్మిది మంది పరమ భాగవతులు అయ్యారు వీరు తరువాతి కాలంలో విదేహ రాజుకు తత్వం చెప్పారు. వారు కవి, హరి, అంతరిక్షుడు, ప్రబుద్ధుడు, పిప్పలాయనుడు, అవిర్హోత్రుడు, ద్రమీఢుడు, చమనుడు, కరభాజనుడు. - వంశం - ప్రియవ్రతుని వంశం; తండ్రి - ఋషభుడు; తల్లి - జయంతి ; పద్య సం.(లు) - 5.1-63-సీ., 5.1-64-వ., 11-35-వ.,

  280) అవిశ్వుడు- (పురుష){}[దైవ యోని]:- విష్ణుమూర్తి - వంశం - దైవ యోని; పద్య సం.(లు) - 8-88-క.,

  281) అవీచిరయం- ( -){}[ప్రాంతం]:- నరకలోకంలో అనేక నరకాలు ఉన్నాయి. మహా భయంకరమైన ఆ నరకాలు తామిస్రం, అంధతామిస్రం, రౌరవం, మహారౌరవం, కుంభీపాకం, కాలసూత్రం, అసిపత్రవనం, సూకరముఖం, అంధకూపం, క్రిమిభోజనం, సందంశం, తప్తోర్మి, వజ్రకంటకశాల్మలి, వైతరణి, పూయోదం, ప్రాణరోధం, విశసనం, లాలాభక్షణం, సారమేయోదనం, అవీచిరయం, రేతఃపానం, క్షారమర్దమం, రక్షోగణభోజనం, శూలప్రోతం, దందశూకం, అవటనిరోధనం, అపర్యావర్తనం, సూచీముఖం అనే ఇరవై ఎనిమిది నరకాలు.
లంచాలు మఱిగడం, దొంగ సాక్ష్యాలకు పాల్పడటం వంటి పాపాలు చేసినవానిని అవీచిరయం అనే నరకంలో పడవేస్తారు. - వంశం - ప్రాంతం; పద్య సం.(లు) - 5.2-136-వ. నుండి 5.2-164-వ.,

  282) అవీనర- (పురుష){}[చంద్రవంశం]:- ఇతడు చంద్రవంశంలోని భర్మాశ్వునికి కలిగిన అయిదుగురు (5) కొడుకులలో రెండవ వాడు (2). - వంశం - చంద్రవంశం; తండ్రి - భర్మ్యాశ్వుడు; పద్య సం.(లు) - 9-55-వ.,

  283) అవ్యక్తుడు- (పురుష){}[దైవ యోని]:- విష్ణువు కృతయుగంలో తెల్లని రంగుతో నాలుగుచేతులు కలిగి ఉంటాడు; జడలు నారచీరలు జింకచర్మం జపమాలిక దండం కమండలము దాల్చి నిర్మలమైన తపస్సు ధ్యానము అనుష్టానము గల మునిశ్రేష్ఠులచేత హంసుడు, సుపర్ణుడు, వైకుంఠుడు, ధర్ముడు, అమలుడు, యోగీశ్వరుడు, ఈశ్వరుడు, పురుషుడు, అవ్యక్తుడు, పరమాత్ముడు అనే దివ్య నామాలతో ప్రశంసింపబడుతూ ప్రసిద్ధి చెందుతాడు. - వంశం - దైవ యోని; పద్య సం.(లు) - 11-77-వ.,

  284) అవ్యయుడు-1 (పురుష){}[దైవ యోని]:- విష్ణువు - వంశం - దైవ యోని; పద్య సం.(లు) - 1-187-క., 2-56-సీ., 2-68.1-తే., 3-1017-సీ., 4-249.1-తే., 6-172-చ., 7-217-వ., ,

  285) అవ్యయుడు-2 (పురుష){}[దైవ యోని]:- ఆదిశేషుడు. పాతాళలోకం అడుగున ఆదిశేషుడు ఉన్నాడు. ఆదిశేషునికే అనంతుడు, సంకర్షణుడు, అవ్యయుడు అని పేర్లు. అనంతుని తలమీద ఆవగింజలాగా ఈ భూమండలం ఉన్నది. ప్రళయకాలంలో ఆదిశేషుడు ప్రచండమైన కోపంతో ఏకాదశరుద్రులను సృష్టిస్తాడు. - వంశం - దైవ యోని; పద్య సం.(లు) - 5.2-122-సీ., 5.2-126.1-తే.,

  286) అవ్యయుడు-3 (పురుష){}[దైవ యోని]:- శివుడు - వంశం - దైవ యోని; పద్య సం.(లు) - 7-406-ఆ.,

  287) అవ్యాహతైశ్వర్యము (తరిగిపోని సంపద) - ( -){}[పరికరాలు]:- పృథుచక్రవర్తి పట్టాభిషిక్తుడు అయిన సందర్భంలో దేవతలు అందరు వివిధ బహుమానాలు ఇచ్చారు. వారిలో లక్ష్మీదేవి, తరిగిపోని సంపద ఇచ్చెను - వంశం - పరికరాలు; పద్య సం.(లు) - 4-442-సీ., 4-443-సీ.,

  288) అశన-1 (స్త్రీ){}[దైవయోని]:- ఏకాదశ రుద్రులకు బ్రహ్మదేవుడు నిర్దేశించిన భార్యలలో ఒకామె. రుద్రుడు మహాకాలుడు నామం కలిగి భార్య అశనతో, అగ్ని స్థానంగా కలిగి ఉంటాడు. - వంశం - దైవయోని; భర్త - మహాకాలుడు; పద్య సం.(లు) - 3-369-క., 3-370-వ.,

  289) అశన-2 (స్త్రీ){}[రాక్షస యోని]:- ఈమె బలి దైత్యుని భార్య. బలికి ఈమె యందు వందమంది (100) పుత్రులు కలిగారు, వారిలో బాణుడు పెద్దవాడు. - వంశం - రాక్షస యోని; భర్త - బలి; కొడుకు(లు) - బాణాసురుడు మొదలైన మంది; పద్య సం.(లు) - 6-507-వ.,

  290) అశనుడు- (పురుష){}[రాజు]:- ఇతను పృథుశ్రవుడికి పుట్టాడు, వంద అశ్వమేథయాగాలు చేసాడు, ఇతని కొడుకు రుచికుడు. - వంశం - రాజు; తండ్రి - ధర్ముడు; కొడుకు(లు) - రుచికుడు; పద్య సం.(లు) - 7-255-వ.,

  291) అశోక- ( -){}[వృక్ష]:- అశోక అంటే అశోక చెట్లు అశోకము అని శుభము అని నానార్థాలు ఉన్నాయి. ఈ పదం ప్రథమ స్కంధలో నైమిశారణ్య వర్ణన సందర్భంలో శివ భజన} కు ఉపమాన పదంగా వాడబడింది., ఇవి అష్టమ స్కంధములోని త్రికూట పర్వతములో వర్ణించబడ్డాయి - వంశం - వృక్ష; పద్య సం.(లు) - 1-39-వ., 9-311-వ., 10.1-861-వ., 8-23-సీ., 8-24-వ., 8-25-క.,

  292) అశోకవర్ధనుడు- (పురుష){}[చంద్రవంశం]:- ఇతను పరీక్షిత్తుకు భవిష్యత్తు కాలపు చక్రవర్తి చంద్రగుప్తుని మనుమడు, ఇతని తండ్రి వారిసారుడు, కొడుకు సుయశస్సు. - వంశం - చంద్రవంశం; తండ్రి - వారిసారుడు; కొడుకు(లు) - సుయశస్సు; పద్య సం.(లు) - 12-4-వ.,

  293) అశ్మకుడు- (పురుష){}[సూర్యవంశం]:- ఇతడు సుదాసుని భార్య మదయంతికి వసిష్ఠుని వలన కలిగిన కుమారుడు. మదయంతి ప్రసవానికి సంకటపడుతుంటే వాడిగా ఉన్న రాతితో (అశ్మము) చీరగా ఇతడు పుట్టాడు కనుక అశ్మకుడు అని సార్థకనామము.
ఇతని కొడుకు మూలకుడు. ఇతనిని నారీజనములు పరశురాముని బారి నుండి దాచిన కారణముచేత నారీకవచుడు అంటారు - వంశం - సూర్యవంశం; తండ్రి - సుదాసుడు; తల్లి - మదయంతి; పద్య సం.(లు) - 9-251-వ., 9-252-క.,

  294) అశ్వతరుడు-1 (పురుష){}[నాగుడు]:- ఇతడు కార్తిక (ఊర్జ) మాసంలో సూర్యుని అనుచరులలోని నాగుడు.
సూర్యుడు ఈ మాసంలో విష్ణువు అను పేరుతో, రంభ, విశ్వామిత్రుడు, యశ్వతరుడు, మఘాపేతుడు, సూర్యవర్చసుడు, సత్యజిత్తు మున్నగువారు అనుచరులుగా కలిగి సంచరిస్తాడు. - వంశం - నాగుడు; పద్య సం.(లు) - 12-41-వ. నుండి 12-45-వ. వరకు,

  295) అశ్వతరుడు-2 (పురుష){}[దైవ యోని]:- కశ్యపుని భార్య కద్రువ కనిన అనేకులైన నాగులలో ఇతను ఒకడు.
పాతాళలోకంలోని ప్రముఖ నాగులలో ఒకడు.
వీరు వాసుకి, శంఖుడు, కుళికుడు, మహాశంఖుడు, శ్వేతుడు, ధనంజయుడు, ధృతరాష్ట్రుడు, శంఖచూడుడు, కంబళుడు, అశ్వతరుడు, దేవదత్తుడు మొదలైనవారు (అధోలోకం అయిన) పాతాళలోక వాసులైన మహానాగులు. వారిలో కొందరు ఐదు తలలవారు, కొందరు నూరు తలలవారు, వేయి తలలవారూ ఉన్నారు. వారి పడగల మీద మణులు మెరుస్తూ ఉంటాయి. ఆ మణుల కాంతులు పాతాళంలోని చీకట్లను పారద్రోలుతుంటాయి. - వంశం - దైవ యోని; తండ్రి - కశ్యపుడు; తల్లి - కద్రువ; పద్య సం.(లు) - 5.2-118-క., 5.2-121-వ.,

  296) అశ్వత్థామ-1 (పురుష){}[విప్ర]:- ఇతడు ద్రౌపది పుత్రులను క్రూరంగా సంహరించాడు, పిమ్మట బ్రహ్మశిరోనామక అస్త్రం అభిమన్యుని భార్య ఉత్తర గర్భంలో పరీక్షిత్తు ఉండగా వేసాడు. శ్రీకృష్ణుడు రక్షించాడు.
ఇతడు ద్రోణునికి కృపియందు పుట్టాడు.
సూర్యసావర్ణి మన్వంతరంలో ఇతను సప్తర్షులలో ఒకడు కాగలడు. - వంశం - విప్ర; తండ్రి - ద్రోణుడు; తల్లి - కృపి; పద్య సం.(లు) - 1-142-వ., 8-415-వ.,

  297) అశ్వత్థామ-2 (పురుష){}[ఋషి]:- ఎనిమిదవదైన సూర్య సావర్ణి మన్వంతరంలో గాలవుడూ, దీప్తిమంతుడూ, పరశురాముడు, అశ్వత్థామ, కృపుడూ, వ్యాసుడు, ఋష్యశృంగుడు, సప్తఋషులు అవుతారు. ఇప్పుడు వారు తమతమ ఆశ్రమాలలో ఉన్నారు. సుతపులూ, విరజులూ, అమృతప్రభులూ దేవతలు అవుతారు. బలిచక్రవర్తి ఇంద్రుడు అవుతాడు. - వంశం - ఋషి; పద్య సం.(లు) - 8-415-వ.,

  298) అశ్వని - (స్త్రీ){}[దైవ యోని]:- ఈమె దక్షునికి అసక్ని యందు పుట్టిన కృత్తికాది నక్షత్రములు అందరిని చంద్రునికి వివాహమయ్యారు. వారు ఇరవైఏడు (27) మందిలోను ఈ అశ్వని ఇరవై ఒకటవ ఆమె (21) - వంశం - దైవ యోని; తండ్రి - దక్షుడు; తల్లి - అసక్ని; భర్త - చంద్రుడు; పద్య సం.(లు) - 6-254-వ.,

  299) అశ్వనీదేవతలు-1 (పురుష){}[సూర్యవంశం]:- హరి విరాడ్విగ్రహంనందు ముక్కుపుటాలలోనుండి అశ్వనీదేవతలు పుట్టారు.
ఆయుస్సు కోరేవారు అశ్వనీదేవతలను పూజిస్తారు,
అశ్వనీదేవతలు ఇద్దరూ (నాసత్యుడు, దస్రుడు) వివస్వంతునకు బడబా (ఆడుగుఱ్ఱం) రూపం ధరించిన సంజ్ఞాదేవి యందు వీరు పుట్టారు.
ఏడవదైన వైవశ్వత (ప్రస్తుత) మన్వంతరంలో దేవతలలోని వారు. - వంశం - సూర్యవంశం; తండ్రి - వివశ్వంతుడు ; తల్లి – సంజ్ఞాదేవి; పద్య సం.(లు) - 2-16-వ., 2-38-వ., 4-155-వ., 6-258-వ., 8-413-సీ.,

  301) అశ్వమేధజుడు- (పురుష){}[చంద్రవంశం]:- పరీక్షిత్తు తరువాతి తరాల వాడైన శతానీకునికి ఇతడు పుట్టగలడు. ఇతనికి ఆసీమకృష్ణు కొడుకు జన్మిస్తాడు. - వంశం - చంద్రవంశం; తండ్రి - సహస్రానీకుడు; కొడుకు(లు) - ఆసీమకృష్ణుడు; పద్య సం.(లు) - 9-679-వ.,

  302) అశ్వసేనుడు- (పురుష){}[చంద్రవంశం]:- ఇతను శ్రీకృష్ణునికి అష్టమహిషలలో ఒకరైన నాగ్నజిత్తు యందు పుట్టిన కొడుకు. - వంశం - చంద్రవంశం; తండ్రి - కృష్ణుడు; తల్లి - నాగ్నజిత్తి; పద్య సం.(లు) - 10.2-275-వ.,

  303) అశ్విదేవతలు- (పురుష){}[దైవ యోని]:- సృష్టి ఆరంభంలో సాత్వికాహంకారం నుండి పుట్టిన పదిమంది దేవతలో అశ్వినులు ఒకరు; ఇంద్రియాధిపతులలో ఘ్రాణేంద్రియానికి అధిపతులు ఈ అశ్వనీదేవతలు.
వృత్రాసుర సంహారఘట్టంలో దేవదానవ యుద్ధం జరుగుతు న్నప్పుడు ఇంద్రుని వైపు పాల్గొన్నవారిలో ఒకరు
వృత్రాసురుని దెబ్బకు అశ్వినులు కూలారు.
సాగరమథనం తరువాత జరిగిన సురాసుర యుద్ధంలో అశ్విదేవతలు, వృషపర్వునితో యుద్ధం చేసారు.
ఏడవవదీ ప్రస్తుతపుది అయిన వైవశ్వతమన్వంతరంలో పురందరుడు ఇంద్రుడు. ఆదిత్యులూ, మరుత్తులూ, అశ్వినులూ, వసువులూ, రుద్రులు దేవతలు. - వంశం - దైవ యోని; పద్య సం.(లు) - 2-86-వ., 6-363-వ., 6-385లగ్రా., 8-327-క. నుండి 8-34-వ. వరకు, 8-413-వ.,

  304) అశ్వినులు- ( -){}[భగణ విషయం]:- శింశుమారచక్రం స్తనాభాగాలలో అశ్వినులు ఉన్నారు. - వంశం - భగణ విషయం; పద్య సం.(లు) - 5.2-97-వ.,

  305) అష్టకుడు- (పురుష){}[సూర్యవంశం]:- విశ్వామిత్రుని నూటొక్క (101) కొడుకులలో ఒకడు, విశ్వామిత్రునికి వందమంది (100) కొడుకులు ఉండగా దేవతలచే బలివ్వబడకుండా విడిపించబడి దేవరాతుడు అని పేరుబడిన శునశ్శేపుని దత్తత తీసుకున్నాడు. తండ్రి నిర్ణయాన్ని అంగీకరించి అతనిని సోదరునిగా మధుచ్ఛదుడు మున్నగు చిన్న వాళ్ళు 50 మంది అంగీకరించారు. పెద్దవారైన అష్టక, హారీత, జయంత, సునందాదులు వేఱైపోయారు. అందుచేత, గోత్రభేదం కలిగింది. - వంశం - సూర్యవంశం; తండ్రి - విశ్వామిత్రుడు; పద్య సం.(లు) - 9-497-వ.,

  306) అష్టవసువులు- (పురుష){}[దైవ యోని]:- వీరు ఎనిమిది మంది వసువులు, వస్తువు యందు ధర్మునికి పుట్టారు. ధనాభిలాషులు వీరిని పూజిస్తారు. {అష్టవసువులు - ఆవుడు, ధ్రువుడు, సోముడు,అధ్వరుడు, అనిలుడు, ప్రత్యూషుడు, అనలుడు, ప్రభాసుడు} - వంశం - దైవ యోని; తండ్రి - ధర్ముడు; తల్లి - వసువు ; పద్య సం.(లు) - 6-254-వ., 2-38-వ.,

  307) అసంగుడు- (పురుష){}[చంద్రవంశం]:- ఇతడు శ్వఫల్కునికి గాందిని యందు పుట్టిన పన్నెండు మంది (12) పుత్రులలో రెండవ వాడు. అక్రూరునికి తమ్ముడు. - వంశం - చంద్రవంశం; తండ్రి - శ్వఫల్కుడు; తల్లి - గాంధిని; పద్య సం.(లు) - 9-712-వ.,

  308) అసిక్ని-1 - (స్త్రీ){}[విప్ర]:- ఈమె పంచజనుడు అను ప్రజాపతి కూతురు. కనుక పాంచజని అని కూడ అంటారు. ఈమె దక్షుని భార్య వీరికి దాంపత్య విధానంలో హర్యశ్వులు, శబళాశ్వులు అనెడి అనేకులు కలిగి మోక్షమార్గాన్ని పట్టిపోయారు. పిమ్మట భానువు, లంబ మున్నగు అరవై (60) మంది కుమార్తెలు పుట్టారు. వారి సంతానంతో ముల్లోకాలు నిండాయి. - వంశం - విప్ర; తండ్రి - పంచజనుడు; భర్త - దక్షుడు; కొడుకు(లు) - హర్యశ్వులు, శబళాశ్వులు; కూతురు(లు)- (అ) ధర్ముడు పదిమంది భార్యలు : 1. (1) భానువు, 2. (2) లంబ, 3. (3) కకుప్పు, 4. (4) జామి, 5. (5) విశ్వ, 6. (6) సాధ్య, 7. (7) మరుత్వతి, 8. (7) వసువు, 9. (9) ముహూర్త, 10. (10) సంకల్ప, (ఆ) భూతుడు భార్య : 11. సురూప, (ఇ) శివుడు భార్య : 12. ఉమ, (ఉ) అంగిరసుడు భార్యలు: 13. స్వధ, 14. సతి, (ఊ) ధూమ్రకేతుడు భార్య: 15. అర్చి, (ఎ) వేదశిస్సుడు భార్య : 16. ధిషణ, (ఏ) కశ్యపుడు / తార్క్ష్యుడు భార్యలు : 17. (1) వినత, 18. (2) కద్రువ,19. (3) పతంగి,20. (4) యామిని, (ఐ) చంద్రుడు భార్యలు : 21. (1) అశ్విని, 22. (2) భరణి, 23. (3) కృత్తిక, 24. (4) రోహిణి, 25. (5) మృగశిర, 26. (6) ఆర్ద్ర, 27. (7) పునర్వసు, 28. (8) పుష్యమి, 29. (9) ఆశ్లేష, 30. (10). మఘ, 31. (11) పుబ్బ(పూర్వ ఫల్గుణి), 32. (12) ఉత్తర(ఉత్తర ఫల్గుణి), 33. (13) హస్త, 34. (14) చిత్త, 35. (15) స్వాతి, 36. (16) విశాఖ, 37. (17) అనూరాధ, 38. (18) జ్యేష్ఠ, 39. (19) మూల, 40. (20) పూర్వాషాఢ, 41. (21) ఉత్తరాషాఢ, 42. (22) శ్రవణం, 43. (23) ధనిష్ఠ, 44. (24) శతభిషం, 45. (25) పూర్వాభాద్ర, 46. (26) ఉత్తరాభాద్ర, 47. (27) రేవతి, (ఒ) కశ్యపుడు భార్యలు : 48. (1) అదితి, 49. (2) దితి, 50. (3) కాష్ఠ, 51. (4) దనువు, 52. (5) అరిష్ట, 53. (6) తామ్ర, 54. (7) క్రోధవశ, 55. (8) సురస, 56. (9) సురభి, 57. (10) ముని, 58. (11) తిమి, 59. (12) ఇళ, 60. (13) సరమ.; పద్య సం.(లు) - 6-224-వ., 6-241-చ., 6-252-వ., 6-253-ఆ., 6-254-వ.,

  309) అసమంజసుడు- (పురుష){}[సూర్యవంశం]:- ఇతడు సూర్యవంశంలోని వాడు. సగరునికి కేశిని యందు జన్మించాడు. ఇతని కొడుకు అంశుమంతుడు. పూర్వజన్మలో యోగభ్రష్ఠుడైన యోగీశ్వరుడు. ఈ జన్మలో లోకులకు అప్రియమైన నడవడికతో మెలగే వాడు. ఒకనాడు నగరంలో ఆడుకునే పిల్లలను సరయూనదిలో వేసేసాడు. ప్రజలు తిడుతుంటే పిమ్మట తన యోగబలంతో వారిని తిరిగి తెచ్చి వారికి ఇచ్చాడు. - వంశం - సూర్యవంశం; తండ్రి - సగరుడు; తల్లి - కేశిని; కొడుకు(లు) - అంశుమంతుడు; పద్య సం.(లు) - 9-210.వ. 9-212-వ.,

  310) అసమాస్త్రుడు- (పురుష){}[దైవ యోని]:- మన్మథుడు, సరి సంఖ్య కాని (బేసి సంఖ్య అయిన) అయిదు బాణాలు కలవాడు. - వంశం - దైవ యోని; పద్య సం.(లు) - 6-446-సీ., 10.2-676-క.,

  311) అసిక్ని-2- ( -){}[మహానది]:- భారతవర్షంలోని ప్రసిద్ధమైన పర్వతాలకు పుత్రికలవంటివి అయిన మహానదులలో ఒక నది. - వంశం - మహానది; పద్య సం.(లు) - 5.2-55-వ.,

  312) అసితుడు-1 (పురుష){}[ఋషి]:- శ్రీకృష్ణుని దర్శించుకోవడానికి వచ్చి వసుదేవునిచే క్రతువు చేయించిన మునీశ్వరులలో ఒక మునీశ్వరుడు.
శ్రీకృష్ణుడు విదేహరాజు, శ్రుతదేవులను చూడబోయినపుడు కూడా వెళ్ళిన మునీశ్వరులలో కడు.
ద్వారకకు శ్రీకృష్ణుని చూడటానికి వచ్చినప్పుడు, సాంబుని గర్భవతిగా చూపి ఆడపిల్ల పుడుతుందా మగపిల్లాడు పుడతాడా అని అడిగిన యాదవులకు ముసలం పుడుతుందని శపించిన వారిలో ఈయనొకడు.
ఇతడు ధర్మరాజు చేసిన రాజసూయయాగంలో పాల్గొన్న మునీశ్వరులలో ఒకడు - వంశం - ఋషి; పద్య సం.(లు) - 10.2-1117-ఉ.,10.2-1129-వ., 10.2-1179-వ., 11-11-వ., 11-18-వ., 11-22-క., 10.2-766-సీ.,

  313) అసితుడు-2 (పురుష){}[దైవ యోని]:- మన్మథుడు - వంశం - దైవ యోని; పద్య సం.(లు) - 11-99-వ.,

  314) అసిపత్రవనం- ( -){}[ప్రాంతం]:- నరకలోకంలో అనేక నరకాలు ఉన్నాయి. మహా భయంకరమైన ఆ నరకాలు తామిస్రం, అంధతామిస్రం, రౌరవం, మహారౌరవం, కుంభీపాకం, కాలసూత్రం, అసిపత్రవనం, సూకరముఖం, అంధకూపం, క్రిమిభోజనం, సందంశం, తప్తోర్మి, వజ్రకంటకశాల్మలి, వైతరణి, పూయోదం, ప్రాణరోధం, విశసనం, లాలాభక్షణం, సారమేయోదనం, అవీచిరయం, రేతఃపానం, క్షారమర్దమం, రక్షోగణభోజనం, శూలప్రోతం, దందశూకం, అవటనిరోధనం, అపర్యావర్తనం, సూచీముఖం అనే ఇరవై ఎనిమిది నరకాలు.
వేదమార్గాన్ని వదలిపెట్టి పాషండమార్గం అవలంబించే పురుషుణ్ణి అసిపత్రవనం అనే నరకంలో పడవేస్తారు. - వంశం - ప్రాంతం; పద్య సం.(లు) - 5.2-136-వ. నుండి 5.2-164-వ.,

  315) అసురులు- (స్త్రీ){}[రాక్షస యోని]:- అసురులు అంటే రాక్షసులు. నరుల, అసురుల, సురల రూపాలను బలి దేవేంద్రుల నేతృత్వంలో జరిగిన సురాసుర యుద్ధంలో రాక్షసులు ధరించి యుద్ధం చేసారు. - వంశం - రాక్షస యోని; పద్య సం.(లు) - 8-327-క. నుండి 8-34-వ. వరకు,

  316) అస్తమయము- ( -){}[భగణ విషయం]:- సూర్యగమనం వలన ఏర్పడు దినములోని కాలభేదములు - వంశం - భగణ విషయం; పద్య సం.(లు) - 5.2-81-వ.,

  317) అస్తి- (స్త్రీ){}[చంద్రవంశం]:- అస్తి, ప్రాస్తి కంసుని భార్యలు వీరు జరాసంధుని కుమార్తెలు. కంసుని మరణాంతరం వీరు తండ్రి వద్దకు వెళ్ళి మొరపెట్టుకోగా, జరాసంధుడు కృష్ణుని సంహరిస్తానని యుద్ధానికి బయలుదేరాడు. - వంశం - చంద్రవంశం; పద్య సం.(లు) - 10.1-1524-వ., 1525-శా.,

  318) అహల్య- (స్త్రీ){}[ఋషి]:- ముద్గలగోత్రం మూలపురుషుడైన ముద్గలుని కుమార్తె ఈ అహల్య, ఈమె యందు గౌతమునికి శతానందుడు పుట్టాడు. - వంశం - ఋషి; తండ్రి - ముద్గల; భర్త - గౌతముడు; కొడుకు(లు) - శతానందుడు; పద్య సం.(లు) - 9-657-వ.,

  319) అహిర్భుధ్న్యుడు- (పురుష){}[దైవ యోని]:- ఇతడు భూతునికి సరూప యందు పుట్టిన వారిలో ఒకడు. దక్షుని కుమార్తె అగు సరూప యందు శంకరాంశజుడు అయిన భర్త భూతునికి కోట్ల మంది ఐన రుద్రగణాలు పుట్టారు. అంతేకాక రైవతుడు, అజుడు, భవుడు, భీముడు, వాముడు, అగ్రుడు, వృషాకపి, అజైకపాత్తు, అహిర్బుధ్న్యుడు, బహురూపుడు, మహాంతుడు అనేవాళ్ళు, రుద్రపారిషదులు, మిక్కిలి భయంకరాకారులైన ప్రేతలు, వినాయకులు జన్మించారు. - వంశం - దైవ యోని; తండ్రి - భూతుడు; తల్లి - సరూప ; కొడుకు(లు) - రుద్రగణములు; పద్య సం.(లు) - 6-254-వ.,

  320) అహీనుడు- (పురుష){}[సూర్యవంశం]:- ఇతడు శ్రీరాముని తరువాత తరం వాడు.ఇతడు క్షేమధన్యునికి కొడుకు, ఈ అహీనునకు కొడుకు పారియాత్రుడు - వంశం - సూర్యవంశం; తండ్రి - దేవానీకుడు; కొడుకు(లు) - పారియాత్రుడు; పద్య సం.(లు) - 9-364-వ.,

  [ ↑ ] 1) ఆంగీరస- (స్త్రీ){}[దక్ష వంశం]:- ఈమె వస్తువు భార్య. వీరి కొడుకు విశ్వకర్మ. ఇతడు శిల్పాచార్యుడు. - వంశం - దక్ష వంశం; భర్త - వస్తువు; కొడుకు(లు) - విశ్వకర్మ; పద్య సం.(లు) - 9-254-వ.,

  2) ఆంగీరసులు- (పురుష){}[విప్ర]:- రథీతరుని భార్య యందు అంగిరసుడు అను మునీశ్వరుడు కొడుకులను కలిగించిన వారు రథీతరగోత్రులు ఆంగీరసులు అను బ్రాహ్మణులయ్యారు. - వంశం - విప్ర; పద్య సం.(లు) - 9-154-వ.,

  3) ఆంగీరుడు- (పురుష){}[విప్ర]:- ఇతడు చరమ జన్మమునందు భరతుడు విప్రశరీరం పొందినపుడు అతని తండ్రి. ఇతనికి మొదటి భార్య యందు తొమ్మిది (9) మంది కొడుకులు, రెండవ (2) భార్య యందు భరతుడు ఒక కుమార్తె కలిగారు. - వంశం - విప్ర; భార్య - ఇద్దరు భార్యలు; భర్త - 1 భార్య యందు తొమ్మిది మంది కొడుకులు, 1 భార్య యందు భరతుని చరమ జన్మ; కొడుకు(లు) - 1 కుమార్తె; పద్య సం.(లు) - 5.1-120-వ.,

  4) ఆంజనేయుడు-1 (పురుష){}[వానర యోని]:- పరమ రామభక్తుడు హనుమంతుడు, వాయుదేవుని అనుగ్రహంతో, కేసరి అనే వానర నాయకుని భార్య అంజనీదేవి పుత్రుడు. సుగ్రీవుని మంత్రి. సీతాన్వేషణలో లంకకు లంఘించిన వానర యోధుడు. - వంశం - వానర యోని; తండ్రి - కేసరి; తల్లి - అంజనీదేవి; పద్య సం.(లు) - 11-105-వ.,

  5) ఆంజనేయుడు-2 (పురుష){}[దైవ యోని]:- కింపురుష వర్షానికి సీతా లక్ష్మణ సమేతుడైన శ్రీరామచంద్రుడు అధిదేవత. అధిపతి అంజనీదేవి పుత్రుడైన ఆంజనేయుడు, ప్రజలు కింపురుష గణాలు - వంశం - దైవ యోని; పద్య సం.(లు) - 5,2-51-క., 5.2-52-ఆ.,

  6) ఆంధ్ర- ( -){}[ప్రదేశం]:- ఉషాకుమారికి కలలో కనబడిన రాకుమారుని కనుగొనుటకు, ఆమె నెచ్చెలి, మంత్రిపుత్రీ అయిన చిత్రరేఖ రాజుల చిత్రాలు అన్నీ వేసింది. అలా వేసిన చిత్రాలలో మాళవ, కొంకణ, ద్రవిడ, మత్స్య, పుళింద, కళింగ, భోజ, నేపాల, విదేహ, పాండ్య, కురు, బర్బర, సింధు, యుగంధర, ఆంధ్ర, బంగాళ, కరూశ, టేంకణ, త్రిగర్త, సుధేష్ణ, మరాట, లాట, పాంచాల, నిషాద, ఘూర్జర, సాళ్వ దేశాల ప్రభువులు ఉన్నారు చూడు అని చూపించింది. - వంశం - ప్రదేశం; పద్య సం.(లు) - 10.2-348-ఉ.,

  7) ఆంధ్రుడు- (పురుష){}[చంద్రవంశం]:- బలి అనే రాజుకు అతని భార్య సుధేష్ణయందు కలిగిన ఆరుగురు కొడుకులలో 6వ కొడుకు. వీరు 6గురు అంగుడు, వంగుడు, కళింగుడు, సింహుడు, పుండ్రుడు, ఆంధ్రుడు. వీరు 6గురు వారి వారి పేర ఉన్న భారతవర్షంలోని తూర్పు దేశాలకు రాజులై పాలించారు, - వంశం - చంద్రవంశం; తండ్రి - బలి; తల్లి - సుధేష్ణ; పద్య సం.(లు) - 9-683-వ.,

  8) ఆకంపితశిరోభావాలు- (పురుష){}[నృత్తము]:- పారిభాషిక పదము - రాసక్రీడ - నృత్తము
సమముగా నిలిపిన శిరస్సులు కలవి - వంశం - నృత్తము; పద్య సం.(లు) - 10.1-1084-వ.,

  9) ఆకాశం- ( -){}[స్థలం]:- ఏకాదశ రుద్రులకు బ్రహ్మదేవుడు నిర్దేశించిన స్థానలలో ఒకటి. రుద్రుడు ఋతధ్వజుడు నామం కలిగి భార్య సర్పితో, ఆకాశము స్థానంగా కలిగి ఉంటాడు. - వంశం - స్థలం; పద్య సం.(లు) - 3-369-క., 3-370-వ.,

  10) ఆకాశగంగ-1 ( -){}[నది]:- ఆకాశగంగ అంటే మందాకినీ నది - వంశం - నది; పద్య సం.(లు) - 1-329-వ.,

  11) ఆకాశగంగ-2 ( - ){}[నది]:- భగవత్పాది, నారాయణుని త్రివిక్రమావతారంలో కాలిగోటిచేత బ్రహ్మాండం పైకప్పుకు ఏర్పడిన రంధ్రం నుండి వెలుపలి జలధార లోపలికి వచ్చి, వారి పాదాలను తాకుతూ ఆకాశగంగ భగవత్పాది అనే పేరుతో స్వర్గంలో ప్రవహించింది. - వంశం - నది; పద్య సం.(లు) - 5.2-32-వ.,

  12) ఆకాశగంగ - ( -){}[భగణ విషయం]:- శింశుమారచక్రం వీపుమీద దేవమార్గం అనబడే తారకాసముదాయం, అక్కడే ఆకాశగంగ ఉన్నాయి. - వంశం - భగణ విషయం; పద్య సం.(లు) - 5.2-97-వ.,

  13) ఆకుంచితశిరోభావాలు- ( -){}[నృత్తము]:- పారిభాషిక పదము - రాసక్రీడ - నృత్తము
నిగుడించిన శిరస్సు కలవి} - వంశం - నృత్తము; పద్య సం.(లు) - 10.1-1084-వ.,

  14) ఆకూతి-1 (స్త్రీ){}[మనువు వంశం]:- సర్వతేజునికి భార్య అయిన ఈమె యందు చక్షుస్సంజ్ఞుడగు మనువు జన్మించాడు
ఈమె ధ్రువుని వంశపు సర్వతేజుని భార్య. కొడుకు చక్షుస్సంజ్ఞుడు. - వంశం - మనువు వంశం; భర్త - సర్వతేజుడు; కొడుకు(లు) - చక్షుస్సంజ్ఞుడయిన మనువు; పద్య సం.(లు) - 4-390-వ., 4-390-వ.,

  15) ఆకూతి-2 (స్త్రీ){}[మను వంశం]:- ఈమె భర్త పృథుషేనుడు. వీరికి నక్తుడు అను కొడుకు, రాజర్షిశ్రేష్ఠుడైన గయుడు అను మనుమడు కలిగారు. - వంశం - మను వంశం; భర్త - పృథుషేణుడు; కొడుకు(లు) - నక్తుడు; పద్య సం.(లు) - 5.2-6-వ.,

  16) ఆకూతి-3 (స్త్రీ){}[మనువు వంశం]:- ఆకూతి స్వాయంభువ మనువు ఇద్దరు కూతురులలో పెద్దామె. ఈమె చెల్లెలు దేవహూతి.
ఈమె యందు రుచిప్రజాపతికి విష్ణువు ఏడవ (7) అవతారంలో యజ్ఞుడు / సుయజ్ఞుడుగా అవతరించాడు.
ఈమె స్వాయంభువ మనువుకు శతరూప యందు జన్మించింది.
ఈమెకు ప్రియవ్రత, ఉత్తానపాదులు సోదరులు మఱియు దేవహూతి, ప్రసూతులు చెల్లెళ్ళు. - వంశం - మనువు వంశం; తండ్రి - స్వాయంభువమనువు; తల్లి - శతరూప; భర్త - రుచి ప్రజాపతి; కొడుకు(లు) - యజ్ఞుడు; పద్య సం.(లు) - 8-7-వ., 1-63-వ., 2-117-సీ., 3-388-వ., 4-3-సీ., 4-4-వ.,

  17) ఆకృతి- (స్త్రీ){}[దక్ష వంశం]:- ఈమెకు విశ్వకర్మ అను శిల్పాచార్యుడు భర్త. వీరికి చాక్షుష మనువు జన్మించాడు. - వంశం - దక్ష వంశం; భర్త - విశ్వకర్మ; కొడుకు(లు) - చాక్షుష మనువు; పద్య సం.(లు) - 6-254-వ.,

  18) ఆఖండలుడు-1 (పురుష){}[చంద్రవంశం]:- అర్జునుడు - వంశం - చంద్రవంశం; పద్య సం.(లు) - 10.2-143-ఉ., 10.2-1174-వ.,

  19) ఆఖండలుడు-2 (పురుష){}[దైవ యోని]:- ఇంద్రుడు - వంశం - దైవ యోని; పద్య సం.(లు) - 1-361-క., 3-595-ఉ., 7-33-క.,

  20) ఆగ్నీధ్రకుడు- (పురుష){}[ఋషి]:- పన్నెండవదైన భద్రసావర్ణి మన్వంతరంలో ఒక ఋషి కాగలడు - వంశం - ఋషి; పద్య సం.(లు) - 8-423-వ.,

  21) ఆగ్నీధ్రుడు- (పురుష){}[రాజు]:- ఇతడు ప్రియవ్రతునికి బర్హిష్మతి అను భార్య యందు కలిగిన పది (10) మంది కొడుకులో పెద్దవాడు, ఊర్జస్వతి ఇతని చెల్లెలు. ఇతడు జంబూద్వీపాధిపతి. ఇతనిని బ్రహ్మదేవుడు పంపగా వచ్చిన పూర్వచిత్తి అను అప్సరస వరించింది. ఈమె యందు ఇతడు నాభి, కింపురుష, హరివర్ష, ఇలావృత, రమ్యక, హిరణ్మయ, కురు, భద్రాశ్వ, కేతుమాల అను తొమ్మిదిమంది (9) కొడుకులు పుట్టారు. తండ్రి అనుమతితో వారు తమతమ పేర్లతో జంబూద్వీపాన్ని విభజించుకుని పాలించారు. - వంశం - రాజు; తండ్రి - ప్రియవ్రత ; తల్లి - బర్హిష్మతి ; కొడుకు(లు) - నాభి, కింపురుష, హరివర్ష, ఇలావృత, రమ్యక, హిరణ్మయ, కురు, భద్రాశ్వ, కేతుమాల; పద్య సం.(లు) - 5.1-16-వ., 5.1-26-వ., 5.1-40-వ.,

  22) ఆచరణుడు- (పురుష){}[ప్రియవ్రతుని వంశం]:- ఇతడు భరతుని అయిదుగురు కొడుకులలో నాలుగవవాడు. - వంశం - ప్రియవ్రతుని వంశం; తండ్రి - భరతుడు; తల్లి - పంచజని ; పద్య సం.(లు) - 5.1-92-మ., 5.1-93-వ.,

  23) ఆజ్య- ( -){}[జల ప్రాంతం]:- క్షార = కారపు సముద్రము; ఇక్షురస = చెరకురసముసముద్రము; సుర = సురాసముద్రము; ఆజ్య = నేయ్యిసముద్రము; క్షీర = పాలసముద్రము; దధి = పెరుగుసముద్రము; ఉదకంబులు = నీటిసముద్రము; కలుగు = ఉండెడి; సాగరములు = సముద్రములు {సప్తసముద్రములు - 1క్షార(కారపు సముద్రము) 2ఇక్షురస(చెరకురసముసముద్రము) 3సుర(సురాసముద్రము) 4ఆజ్య(నేయ్యిసముద్రము) 5క్షీర(పాలసముద్రము) 6దధి(పెరుగుసముద్రము) 7ఉదకంబులు(నీటిసముద్రము)}; ఏడున్ = ఏడు (7). ఒక ద్వీపంతో మరొక ద్వీపం కలిసిపోకుండా ఉండడానికి సముద్రాలు ఏర్పడ్డాయి. - వంశం - జల ప్రాంతం; పద్య సం.(లు) - 5.1-19-సీ.,

  24) ఆజ్యపులు- (పురుష){}[దైవ యోని]:- అగ్నిదేవునకు దక్షుని కుమార్తె అయిన స్వాహాదేవి అనే భార్య వల్ల పావకుడు, పవమానుడు, శుచి అనే ముగ్గురు కొడుకులు కలిగారు. ఆ ముగ్గురివల్ల నలభైఐదు విధాలైన అగ్నులు ఉద్భవించాయి. తాత, తండ్రులతో కూడి మొత్తం నలభైతొమ్మిది అగ్నులు అయినాయి. అగ్నిష్వాత్తులు, బర్హిషదులు, సౌమ్యులు, పితలు, ఆజ్యపులు, సాగ్నులు, విరగ్నులు అని ఏడు విధాలైన ఆ అగ్నుల నామాలతో బ్రహ్మవాదులైనవారు యజ్ఞకర్మలలో ఇష్టులు నిర్వహిస్తూ ఉంటారు. దక్ష ప్రజాపతి పుత్రిక అయిన స్వధ అనే భార్యవల్ల ఆ అగ్నులకు వయున, ధారిణి అనే ఇద్దరు కన్యలు పుట్టారు. వారిద్దరూ జ్ఞాన విజ్ఞాన పరాయణలు. బ్రహ్మనిష్ఠ కలవారు - వంశం - దైవ యోని; పద్య సం.(లు) - 4-34-వ.,

  25) ఆటవెలది- ( - ){}[భాష]:- ఛందస్సు, తెలుగు భాగవతములో ఉపయోగించిన ఉపజాతి ఛందోరీతి ఆటవెలది. వీటిని గ్రంధములో 427 పద్యాలకు ఉపయోగించారు. అంతేకాక సీసపద్యం క్రింద ఉపపద్యంగా 276 మార్లు ఉపయోగించారు - వంశం - భాష; పద్య సం.(లు) - 1-16.1-ఆ.,

  26) ఆతపుడు- (పురుష){}[దక్ష వంశం]:- వసువు కొడుకైన విభావసువు భార్య ఉష యందు కలిగిన ముగ్గురు (3) కొడుకులలో ఒకడు. ఇతని కొడుకు పంచయాముడు. ఇతడు దివసాభిమాన దేవత, ఆతపునికి వ్యుష్టి, రోచి అన్నలు. - వంశం - దక్ష వంశం; తండ్రి - విభావసువు ; తల్లి - ఉష; కొడుకు(లు) - పంచయాముడు దినాధిదేవత; పద్య సం.(లు) - 6-254-వ.,

  27) ఆత్తచక్రుడు- (పురుష){}[చంద్రవంశం]:- కృష్ణుడు, ఆత్త (పొందిన) చక్రుడు (చక్రము కలవాడు), - వంశం - చంద్రవంశం; పద్య సం.(లు) - 10.1-7-క.,

  28) ఆదిత్యగణాలు- (పురుష){}[దైవ యోని]:- వీరు, దేవతలకు వృత్రాసురునికి జరిగిన యద్ధంలో దేవతల పక్షంలో పోరాడిన వారు - వంశం - దైవ యోని; పద్య సం.(లు) - 6-636-వ.,

  29) ఆదిత్యుడు- (పురుష){}[దైవ యోని]:- సూర్యుడు.
శింశుమారచక్రం వక్షస్థల ప్రదేశంలో ఆదిత్యుడు ఉంటాడు.
విరాట్పురుషునిలో జన్మించిన ఆకాశం మొదలైన పంచభూతాదులు తమలో తాము సమైక్యం పొందనందువల్ల జీవుణ్ణి ప్రవర్తింపజేయలేక పోయాయి. అలాగ సూర్యుడ చక్షురింద్రియంతో కూడి వర్తించినా వ్యర్థమే అయింది. - వంశం - దైవ యోని; పద్య సం.(లు) - 1-335-సీ., 5.2-97-వ., 12-41-వ. నుండి 12-45-వ. వరకు, 3-903-వ.,

  30) ఆదిత్యులు-1 (పురుష){}[దైవ యోని]:- స్వర్గము కోరువారు ఆదిత్యాదులను పూజిస్తారు - వంశం - దైవ యోని; పద్య సం.(లు) - 2-38-వ., ,

  31) ఆదిత్యులు-2 (పురుష){}[దైవ యోని]:- వీరిని ద్వాదశాదిత్యులు అంటారు. వీరు పన్నెండు మంది కశ్యపునికి అదితికి జన్మించారు. వీరు 1వివస్వతుడు 2అర్యముడు 3పూషుడు 4త్వష్ట 5సవిత 6భగుడు 7ధాత 8విధాత 9వరుణుడు 10మిత్రుడు 11శుక్రుడు 12ఉరుక్రముడు అనెడు పన్నెడుమంది అదితి పుత్రులు
దేవదానవుల యుద్ధంలో బలి చక్రవర్తి పన్నిన రకరకాల మాయా జాలాలకు విరుగుడు తెలియని వజ్రాయుధధారి అయిన ఇంద్రుడు మున్నగు ఆదిత్యులు దిక్కుతోచక చిక్కులలో పడ్డారు.
శ్రీకృష్ణుడు ఉద్దవునికి బోధిస్తూ ఆదిత్యులందు విష్ణువును, ఆదిగా ఇవి అన్నియు నా విభూతులు అని ఎరుగుము అని చెప్పాడు.
ఏడవవదీ ప్రస్తుతపుది అయిన వైవశ్వతమన్వంతరంలో పురందరుడు ఇంద్రుడు. ఆదిత్యులూ, మరుత్తులూ, అశ్వినులూ, వసువులూ, రుద్రులు దేవతలు. - వంశం - దైవ యోని; తండ్రి - కశ్యపుడు; తల్లి - అదితి; పద్య సం.(లు) - 6-258-వ., 8-338-క., 8-412-వ., 11-105-వ.,

  32) ఆదిపురుషుడు-1 (పురుష){}[దైవ యోని]:- విష్ణువు, పాపరహితుడు వేల తలలు, వేల నేత్రాలు, వేల పాదాలు కలిగి ప్రకృతిని ప్రవర్తింపజేసే ఆదిపురుషుని రూపమే మహాతేజస్వి అయిన ఆ దేవదేవుని విష్ణుమూర్తి మొదటి అవతారం. - వంశం - దైవ యోని; పద్య సం.(లు) - 2-112-వ., 5.2-119-వ., 6-335-ఆ., 6-343-వ., 6-501-క., 9-731-సీ., 10.2-202-సీ., 10.2-1232-సీ.,

  33) ఆదిపురుషుడు-2 (పురుష){}[దైవ యోని]:- సూర్యుడు - వంశం - దైవ యోని; పద్య సం.(లు) - 5.2-86-వ.,

  34) ఆదిమూల అవతారుడు- (పురుష){}[దైవయోని]:- ఆదిమూలావతారము ద్వితీయ స్కంధములో అవతారముల వైభవంలో వివరించిన పంచవింశతి అవతారాలు (25) అందలి 15 వ. అవతారం. ఇది బ్రహ్మదేవుడు నారదునికి ఉపదేశించే నాటికి, జరిగిన పద్దెనిమిది అవతారాలులోనిది (2-148-మ) - వంశం - దైవయోని; పద్య సం.(లు) - 2-148-మ.,

  35) ఆదిశేషుడు-1 (పురుష){}[దైవ యోని]:- పాతాళలోకం అడుగున ఆదిశేషుడు ఉన్నాడు. ఆదిశేషునికే అనంతుడు, సంకర్షణుడు, అవ్యయుడు అని పేర్లు. అనంతుని తలమీద ఆవగింజలాగా ఈ భూమండలం ఉన్నది. ప్రళయకాలంలో ఆదిశేషుడు ప్రచండమైన కోపంతో ఏకాదశరుద్రులను సృష్టిస్తాడు. - వంశం - దైవ యోని; పద్య సం.(లు) - 5.2-122-సీ.,

  36) ఆదిశేషుడు-2 (పురుష){}[దైవ యోని]:- వీరు ఉపద్రవాల నన్నింటిని దూరంగా తొలగించుగాక! అని విశ్వరూపుడు దేవేంద్రునికి ఉపదేశించిన శ్రీమన్నారాయణ కవచంలో ఉన్న నలభైతొమ్మిది స్తుతులలో ఇది ఒకటి. - వంశం - దైవ యోని; పద్య సం.(లు) - 6-300-చ. నుండి 6-307-వ.,

  37) ఆనందం- ( -){}[పర్వతం]:- క్రౌంచద్వీపంలోని ఋషిజ్య వర్షంలో ఆనందం అను పర్వతము, తృప్తిరూప అను నది ఉన్నాయి. - వంశం - పర్వతం; పద్య సం.(లు) - 5.2-66-వ.,

  38) ఆనకదుందుభి- (పురుష){}[చంద్రవంశం]:- వసుదేవుడు. ఇతడు పుట్టిన వెంటనే "విష్ణువు ఇతని పుత్రుడు అయి పుడతాడు" అని ఆనకములు దుందుభులు మ్రోగాయి. అందుచేత, వాసుదేవుడు ఆనకదుందుభి అయ్యాడు. - వంశం - చంద్రవంశం; తండ్రి - శూరుడు; తల్లి - మారిష; పద్య సం.(లు) - 3-104-క., 9-715-ఉ., 10.1-51-వ., 10.1-1159., 10.2-1505-క., 10.2-900-తే., 10.2-1100-చ., 10.2-1123-సీ.,

  39) ఆనకుడు- (పురుష){}[చంద్రవంశం]:- ఇతడు శూరుడు అను దేవమీఢునకు మారిష యందు కలిగిన పదిమంది (10) కొడుకులు, అయిదుగురు (5) కుమార్తెలలో, నాలుగవ (4) కొడుకు. కృష్ణుని పిన తండ్రి.
ఋతుధాముడు, జయుడు ఇతని కొడుకులు - వంశం - చంద్రవంశం; తండ్రి - దేవమీఢుడు శూరుడు; తల్లి - మారిష; భార్య - కర్ణిక; కొడుకు(లు) - ఋతుధామ, జయుడు; పద్య సం.(లు) - 9-714-వ., 9-722-వ.,

  40) ఆనర్తుడు- (పురుష){}[సూర్యవంశం]:- ఆనర్తుడు, శర్యాతికి కల ముగ్గురు కొడుకులలో రెండవవాడు. ఇతని అన్న ఉత్తానబర్హి, తమ్ముడు భూరిషేణుడు.
ఆనర్తుని కొడుకు రైవతుడు. రైవతుడు తన కూతురు రేవతిని బలరాముడుకు ఇచ్చాడు. - వంశం - సూర్యవంశం; తండ్రి - శర్యాతి; కొడుకు(లు) - రైవతుడు; పద్య సం.(లు) - 9-69-వ., 9-70-సీ.,

  41) ఆపస్తంభసూత్రుడు- (పురుష){}[బమ్మెర వంశం; కౌండిన్య గోత్రం; ఆపస్తంభ సూత్రం]:- ఆపస్తంబ సూత్రం కలవాడు, తెలుగుభాగవతం కర్త (వారి మాటలలో ప్రణీతం చేసినవాడు) బమ్మెర పోతనామాత్యుడు వారి కుటుంబము - వంశం - బమ్మెర వంశం; కౌండిన్య గోత్రం; ఆపస్తంభ సూత్రం ; పద్య సం.(లు) - 1-24-సీ.,

  42) ఆప్యాదులు- (పురుష){}[దైవ యోని]:- ఆరవదైన చాక్షుస మన్వంతరంలో ఆప్యాదులు దేవతలు అయ్యారు. మంత్రద్యుముడు ఇంద్రుడు అయ్యాడు; హవిష్మంతుడు, వీరకుడు మున్నగువారు సప్తర్షులు అయ్యారు. - వంశం - దైవ యోని; పద్య సం.(లు) - 8-141-సీ.,

  43) ఆప్యాయన వర్షం- ( -){}[ప్రాంతం]:- ఆప్యాయన వర్షం ప్లక్షద్వీపంలో ఉంది. దీనికి అధిపతి యజ్ఞబాహు కొడుకైన ఆప్యాయనుడు. దీనిలో పుష్పవర్షం అను పర్వతం, నంద అను మహానది ఉన్నాయి. ఇక్కడి పురుషులను శ్రుతధరులు, విద్యధరులు, ఇధ్మధర్ములు అంటారు. వారు సోముణ్ణి ఆరాధిస్తారు." - వంశం - ప్రాంతం; పద్య సం.(లు) - 5.2-62-వ.,

  44) ఆప్యాయనుడు- (పురుష){}[ప్రజాపతి వంశం]:- ప్రియవ్రత కుమారుడైన యజ్ఞబాహువు శాల్మలీ ద్వీపాధిపతికి ఏడుగుర (7) కొడుకులలో ఆరవవాడు ఈ ఆప్యాయనుడు. తన సోదరులతోపాటు తమతమ పేరులతో శాల్మలీ ద్వీపమును వర్షములుగా విభజించుకుని ఏలారు
ఆప్యాయము, ఆప్యాయనము అంటే నిఘంటు అర్థం బంధువులను చేరుట.
ఆప్యాయన వర్షం ప్లక్షద్వీపంలో ఉంది. దీనికి అధిపతి యజ్ఞబాహు కొడుకైన ఆప్యాయనుడు. దీనిలో పుష్పవర్షం అను పర్వతం, నంద అను మహానది ఉన్నాయి. ఇక్కడి పురుషులను శ్రుతధరులు, విద్యధరులు, ఇధ్మధర్ములు అంటారు. వారు సోముణ్ణి ఆరాధిస్తారు. - వంశం - ప్రజాపతి వంశం; తండ్రి - యజ్ఞబాహువు ; పద్య సం.(లు) - 5.2-62-వ.,

  45) ఆభీరులు-1 (పురుష){}[యాదవ]:- గొల్లవారు - వంశం - యాదవ; పద్య సం.(లు) - 10.1-476-శా., 10.1-892-మ., 10.1-900-మ., 1-.1-1155-శా., 10.1-1158-శా. 10.1-1161-శా., 10.1-1187-ఉ.,

  46) ఆభీరులు-2 (పురుష){}[రాజు]:- పరీక్షిత్తు తరువాతి కాలానికి చెందిన రాజులు. ఈ వంశంలో వారు ఏడుగురు ఏలతారు. - వంశం - రాజు; పద్య సం.(లు) - 12-8-వ.,

  47) ఆభీరులు-3 (పురుష){}[మానవ యోని]:- పాపవర్తనులు; విష్ణుమూర్తిని సేవించి, భాగవతశ్రేష్ఠులతో చేరినచో అందరూ పరిశుద్ధులు, మంగళాకారులు అవుతారు అంటూ నిర్ణయిస్తూ వీరిని కూడా పేర్కొన్నారు. - వంశం - మానవ యోని; పద్య సం.(లు) - 2-63-మ.,

  48) ఆమోద వర్షం- ( -){}[ప్రాంతం]:- ఆమోద వర్షం క్రౌంచద్వీపంలోని సప్తవర్షాలలోది. దీనికి అధిపతి ఘృతపర్ణుని కొడుకైన ఆమోదుడు. ఈ వర్షంలో శుక్లం అను పర్వతము, అభయ అను నది ఉన్నాయి. క్రౌంచ ద్వీపంలో నాలుగు వర్ణాలవారు గురువులు, ఋషభులు, ద్రవిణకులు, దేవకులు. వారు వరుణదేవుని సేవిస్తూ ఉంటారు. - వంశం - ప్రాంతం; పద్య సం.(లు) - 5.2-66-వ.,

  49) ఆమోదము- ( -){}[జంతు]:- పరిమళము, సువాసన - వంశం - జంతు; పద్య సం.(లు) - 8-30-క., 8-44-సీ.,

  50) ఆమోదుడు- (పురుష){}[మానవ యోని]:- ఆమోద వర్షం క్రౌంచద్వీపంలోని సప్తవర్షాలలోది. దీనికి అధిపతి ఆమోదుడు. ఇతను ప్రియవ్రతుని కొడుకైన ఘృతపృష్ఠుని ఏడుగురు కొడుకులలో పెద్దవాడు. ఈ వర్షంలో శుక్లం అను పర్వతము, అభయ అను నది ఉన్నాయి. క్రౌంచ ద్వీపంలో నాలుగు వర్ణాలవారు గురువులు, ఋషభులు, ద్రవిణకులు, దేవకులు. వారు వరుణదేవుని సేవిస్తూ ఉంటారు. - వంశం - మానవ యోని; తండ్రి - ఘృతపర్ణుడు; పద్య సం.(లు) - 5.2-66-వ.,

  51) ఆమ్రాతక - ( -){}[వృక్ష]:- అంబాళము - ఇవి అష్టమ స్కంధములోని త్రికూట పర్వతములో వర్ణించబడ్డాయి - వంశం - వృక్ష; పద్య సం.(లు) - 8-23-సీ., 8-24-వ., 8-25-క.,

  52) ఆయతి - (స్త్రీ){}[కర్దముని వంశం]:- భృగువు పుత్రులైన ధాత, విధాత అనేవారు మేరువు కుమార్తెలయిన ఆయతి, నియతి అనేవారిని పెండ్లాడారు. ధాతకు ఆయతి వల్ల మృకండుడు పుట్టాడు. విధాతకు నియతి వల్ల ప్రాణుడు జన్మించాడు. మృకండునకు మార్కండేయుడు కలిగాడు. - వంశం - కర్దముని వంశం; తండ్రి - మేరువు; భర్త - ధాత ; కొడుకు(లు) - మృకండుడు; పద్య సం.(లు) - 4-26-వ.,

  53) ఆయాతి- (పురుష){}[చంద్రవంశం]:- నహుషునికి కల ఆరుగురు కొడుకులలో ఇతడు ఐయిదవ (5) వాడు. - వంశం - చంద్రవంశం; తండ్రి - నహుషుడు; పద్య సం.(లు) - 9-506-వ,

  54) ఆయుర్ద- ( -){}[నది]:- శాకద్వీపంలోని మనోజన వర్షంలో ఉరుశృంగం, అను సరిహద్దు పర్వతము, ఆయుర్ద అను నది ఉన్నాయి. - వంశం - నది; పద్య సం.(లు) - 5.2-68-వ.,

  55) ఆయువు-1 (పురుష){}[చంద్రవంశం]:- ఇతడు కృష్ణునికు భద్రకు పుట్టిన పదిమంది (10) కొడుకులలో తొమ్మిదవ (9)వ వాడు - వంశం - చంద్రవంశం; తండ్రి - కృష్ణుడు; తల్లి - భద్ర; పద్య సం.(లు) - 10.2-275-వ.,

  56) ఆయువు-2 (పురుష){}[ఋషి]:- ఇతడు పుష్య మాసంలో సూర్యుని అనుచరులలోని ఋషి.
సూర్యుడు ఈ మాసంలో భగుడు అను పేరుతో, పూర్వచిత్తి, ఆయువు, కర్కోటకుడు, స్పూర్జుడు, అరిష్టనేమి, ఊర్ణుడు మున్నగువారు అనుచరులుగా కలిగి సంచరిస్తాడు. - వంశం - ఋషి; పద్య సం.(లు) - 12-41-వ. నుండి 12-45-వ. వరకు,

  57) ఆయువు-3 (పురుష){}[దైవ యోని]:- వసువు కొడుకు ఐన ప్రాణునకు భార్య ఊర్జస్వతి అందు కలిగిన ముగ్గరు కొడుకులలో రెండవ వాడు ఆయువు. ఇతని సోదరులు సహుడు, పురోజవుడు. - వంశం - దైవ యోని; తండ్రి - ప్రాణుడు ; తల్లి - ఊర్జస్వతి; పద్య సం.(లు) - 6-554-వ.,

  58) ఆయువు-4 (పురుష){}[చంద్రవంశం]:- ఆయువు పురూరవునకు ఊర్వశి గర్భమునందు పుట్టిన ఆరుగురు పుత్రులలో పెద్దవాడు.
ఇతని కొడుకులు నహుషుడు, క్షత్త్రవృద్ధుడు, రజియు, రంభుండు, అనేనసుడు అని అయిదుగురు - వంశం - చంద్రవంశం; తండ్రి - పురూరవుడు; తల్లి - ఊర్వశి; కొడుకు(లు) - నహుషుడు, క్షత్రవృద్ధుడు, రజి, రంభుడు, అనేనసుడు; పద్య సం.(లు) - 9-422-వ., 9-497-వ.,

  59) ఆయుష్మంతుడు- (పురుష){}[మనువు వంశం]:- తొమ్మిదవదైన దక్షసావర్ణి మన్వంతరంలో విష్ణువు ఆయుష్మంతుడికీ అంబుధారకూ జన్మిస్తాడు. అతని రక్షణలో దేవేంద్రుడైన అద్భుతుడు మూడు లోకాలను సంతోషంగా పరిపాలిస్తాడు. - వంశం - మనువు వంశం; పద్య సం.(లు) - 8-417-వ., 8-418-ఆ.,

  60) ఆరట్ట భూపతి- (పురుష){}[రాజు]:- బలరామ కృష్ణులు శ్యమంతకపంచక పుణ్యతీర్థానికి వెళ్ళినప్పుడు. అక్కడకు వచ్చి ఉన్న రాజులలో ఆరట్ట భూపతి ఒకరు - వంశం - రాజు; పద్య సం.(లు) - 10.2-1044-వ.,

  61) ఆరబ్ధుడు- (పురుష){}[కర్ణుని వంశం]:- కర్ణుని వంశంలో బభ్రుసేతువు కొడుకు ఇతడు, గాందారుడు ఇతని కొడుకు. - వంశం - కర్ణుని వంశం; తండ్రి - బభ్రుసేతువు; కొడుకు(లు) - గాంధారుడు; పద్య సం.(లు) - 9-699-వ.,

  62) ఆరుద్ర - (స్త్రీ){}[దక్ష వంశం]:- ఆరుద్ర 26 [6] - 27 నక్షత్రాలలో 6వది. వీరు దక్షునికి అసిక్ని యందు జన్మించారు. దక్షుడు వీరు ఏడుగురిని చంద్రుడికిచ్చాడు. - వంశం - దక్ష వంశం; తండ్రి - దక్షుడు; తల్లి - అసక్ని; భర్త - చంద్రుడు; పద్య సం.(లు) - 6-254-వ.,

  63) ఆర్ద్ర- ( -){}[భగణ విషయం]:- శింశుమారచక్రం దక్షిణభాగంలో ఆర్ద్ర, ఆశ్లేషలు ఉన్నాయి - వంశం - భగణ విషయం; పద్య సం.(లు) - 5.2-97-వ.,

  64) ఆర్యక- ( -){}[నది]:- క్రౌంచద్వీపంలోని మేఘపృష్ఠ వర్షంలో భోజనం అను పర్వతము, ఆర్యక అను నది ఉన్నాయి. - వంశం - నది; పద్య సం.(లు) - 5.2-66-వ.,

  65) ఆర్యముడు- (పురుష){}[మానవ యోని]:- అర్యమునకు పత్ని మాత్రుక యందు చర్షణులు కలిగారు. వారి మూలమున మనుష్యజాతి స్థిరపడినది. ఇతని తల్లి అదితి, తండ్రి కశ్యపుడు - వంశం - మానవ యోని; తండ్రి - కశ్యపుడు ; తల్లి - అదితి ; భార్య - మాత్రుక; కొడుకు(లు) - చర్షణులు; పద్య సం.(లు) - 6-258-వ.,

  66) ఆర్యామహాదేవి - (స్త్రీ){}[దైవ యోని]:- పార్వతీదేవి - వంశం - దైవ యోని; భర్త - పరమశివుడు; కొడుకు(లు) - కుమారస్వామి, వినాయకుడు; పద్య సం.(లు) - 10.1-1727-మ.,

  67) ఆర్యావర్తుడు- (పురుష){}[ప్రియవ్రతుని వంశం]:- ఋషభుని వందమంది కొడుకులలో ఒకడు. తల్లి జయంతి, భరతుడు ఇతనితో పాటు తొమ్మిది మంది తమ్ముళ్ళకు భరత వర్షంలోని వారి వారి పేర బరగు భాగాలను పంచి ఇచ్చాడు. వారు కుశావర్తుడు, ఇలావర్తుడు, బ్రహ్మావర్తుడు, ఆర్యావర్తుడు, మలయకేతువు, భద్రసేనుడు, ఇంద్రస్పృశుడు, విదర్భుడు, కీకటుడు - వంశం - ప్రియవ్రతుని వంశం; తండ్రి - ఋషభుడు; తల్లి - జయంతి ; పద్య సం.(లు) - 5.1-63-సీ., 5.1-64-వ.,

  68) ఆర్ష్ణిషేణుడు- (పురుష){}[ఋషి]:- దాటరాని విష్ణుమాయను దాటగలిగినవారిలో ఈ ఆర్ష్ణిషేనుడు ఒకడు. - వంశం - ఋషి; పద్య సం.(లు) - 2-204-సీ.,

  69) ఆవర్తనం- ( -){}[ప్రదేశం]:- ఉపద్వీపం. జంబూద్వీపంలోని సగరుని కుమారులు అపహరింపబడిన అశ్వమేధాశ్వాన్ని వెదకుతూ నలువైపులా భూమిని త్రవ్వినపుడు స్వర్ణప్రస్థం, చంద్రశుక్లం, ఆవర్తనం, రమణకం, మందేహారుణం, పాంచజన్యం, సింహళం, లంక అనే ఎనిమిది ఉపద్వీపాలు ఏర్పడ్డాయి. - వంశం - ప్రదేశం; పద్య సం.(లు) - 5.2-55-వ.,

  70) ఆవర్తము- ( -){}[ప్రదేశము]:- సుడిగుండము - వంశం - ప్రదేశము; పద్య సం.(లు) - 8-51-సీ.,

  71) ఆశిష- (స్త్రీ){}[భగుని వంశం]:- అదితికి జన్మించిన పన్నెండు (12) మంది ఆదిత్యులలోను ఆరవవాడైన భగుని కుమార్తె ఈ ఆశిష. ఈమె సువ్రత, పుణ్యశీలి, సుగుణవతి, సుచరిత్ర, అఖిల లోకాలకు ఆరాధ్యురాలు. ఈమెకు మహిముడు, అనుభవుడు మఱియు విభవుడు అని ముగ్గురు సోదరులు. - వంశం - భగుని వంశం; తండ్రి - భగుడు ; తల్లి - సిద్ధికి; పద్య సం.(లు) - 6-506.1-ఆ.,

  72) ఆశ్లేష- ( -){}[భగణ విషయం]:- శింశుమారచక్రం దక్షిణభాగంలో ఆర్ద్ర, ఆశ్లేషలు ఉన్నాయి - వంశం - భగణ విషయం; పద్య సం.(లు) - 5.2-97-వ.,

  73) ఆశ్లేష - (స్త్రీ){}[దక్షుని వంశం]:- ఈమె ఆశ్లేష దక్షుని కుమార్తె ఆశ్లేష 29 [9] - 27 నక్షత్రాలలో 9వది, చంద్రునికు దక్షుని కుమార్తెలు కృత్తికాదులు ఇరవైఏడుగురు (27) భార్యలు అయినను, చంద్రుడు తన భార్యలలో రోహిణిని అధిక మోహంతో చూచి మిగిలిన భార్యలను నిర్లక్ష్యం చేసి దక్షుని శాపం వల్ల క్షయరోగాన్ని పొంది సంతానం లేనివాడైనాడు. తరువాత దక్షుని దయవల్ల క్షయవల్ల తొలగిన కళలను తిరిగి పొందాడు. - వంశం - దక్షుని వంశం; తండ్రి - దక్షుడు; తల్లి - అసక్ని; భర్త - చంద్రుడు; పద్య సం.(లు) - 6-254-వ.,

  74) ఆశ్వయుజ (ఇషము)- ( -){}[కాలం]:- సూర్యుడు ఈ మాసంలో త్వష్ట అను పేరుతో, తిలోత్తమ, ఋచీకతనయ (జమదగ్ని), కంబళాశ్వుడు, బ్రహ్మపేతుడు,, ధృతరాష్ట్రుడు, శతజిత్తు, ఇషంబరుడు మున్నగువారు అనుచరులుగా కలిగి సంచరిస్తాడు. - వంశం - కాలం; పద్య సం.(లు) - 12-41-వ. నుండి 12-45-వ. వరకు,

  75) ఆషాఢ (శుచి)- ( -){}[కాలం]:- సూర్యుడు ఈ మాసంలో వరుణుడు అను పేరుతో, రంభ, వసిష్టుడు, చిత్రస్వనుడు, శుక్రుడు, హూహువు, సహజన్యుడు మున్నగువారు అనుచరులుగా కలిగి సంచరిస్తాడు. - వంశం - కాలం; పద్య సం.(లు) - 12-41-వ. నుండి 12-45-వ. వరకు,

  76) ఆసారణుడు- (పురుష){}[యక్షుడు]:- ఇతడు భాద్రపద (నభోస్వీ) మాసంలో సూర్యుని అనుచరులలోని యక్షుడు.
సూర్యుడు ఈ మాసంలో వివస్వంతుడు అను పేరుతో, అనుమ్లోచ, భృగువు, శంఖపాలుడు, వ్యాఘ్రుడు, ఉగ్రసేనుడు, ఆసారణుడు మున్నగువారు అనుచరులుగా కలిగి సంచరిస్తాడు. - వంశం - యక్షుడు; పద్య సం.(లు) - 12-41-వ. నుండి 12-45-వ. వరకు,

  77) ఆసీమకృష్ణుడు- (పురుష){}[చంద్రవంశం]:- ఇతడు, పాండవకౌరవుల వంశంలో జనమేజయుని తరువాత వారిలో అశ్వమేధజుని కొడుకు. ఇతడి కొడుకు నిచకుడు. - వంశం - చంద్రవంశం; తండ్రి - అశ్వమేధజుడు; కొడుకు(లు) - నిచకుడు; పద్య సం.(లు) - 9-679-వ.,

  78) ఆసురి-1 (పురుష){}[ఋషి]:- ధర్మరాజు యాగానికి విచ్చేసిన మునీశ్వరులలో ఒకడు. - వంశం - ఋషి; పద్య సం.(లు) - 10.2-766-సీ.,

  79) ఆసురి-2 (పురుష){}[దైవ యోని]:- విష్ణువు ఏకవింశతి (21) అవతారాలలో పంచమావతారమైన (5) కపిలుడిగా ఆసురి అను బ్రాహ్మణునకు తత్త్వ గ్రామ నిర్ణయం కల సాంఖ్యాన్ని ఉపదేశించాడు. - వంశం - దైవ యోని; పద్య సం.(లు) - 1-63-వ.,

  80) ఆసురి-3 (స్త్రీ){}[ప్రియవ్రతుని వంశం]:- ఈమె దేవతాజిత్తు భార్య, కొడుకు దేవద్యుమ్నుడు - వంశం - ప్రియవ్రతుని వంశం; భర్త - దేవతాజిత్తు; కొడుకు(లు) - దేవద్యుమ్నుడు; పద్య సం.(లు) - 5.2-6-వ.,

  81) ఆసురి-4 (పురుష){}[ఋషి]:- ఈ మునీశ్వరుడు, పుత్రుని నష్టపోయి బాధపడుతున్న చిత్రకేతు, తన వద్దకు వచ్చిన అంగిరస, నారదులను మీరెవ్వరు అని అడుగుతూ ఉదహరించిన మునీశ్వరులలో ఒకడు. - వంశం - ఋషి; పద్య సం.(లు) - 6-458.1-తే.,

  82) ఆస్కందితజానువర్తన- ( -){}[నృత్తము]:- పారిభాషిక పదము - రాసక్రీడ - నృత్తము
మోకాళ్ళను సమముగా నేలమోపి నటించుట - వంశం - నృత్తము; పద్య సం.(లు) - 10.1-1084-వ.,

  83) ఆహుకి- (స్త్రీ){}[చంద్రవంశం]:- ఈమె చంద్రవంశంలోని పునర్వసు కూతురు. ఈమె సోదరుడు ఆహుకుడు. - వంశం - చంద్రవంశం; తండ్రి - పునర్వసువు; పద్య సం.(లు) - 9-12-వ.,

  84) ఆహుకుడు- (పురుష){}[చంద్రవంశం]:- ఇతడు చంద్రవంశంలోని పునర్వసు కుమారుడు. ఇతని సోదరి ఆహుకి. ఇతని కొడుకులు దేవకుడు, ఉగ్రసేనుడు. ఆ దేవకుని కూతురు దేవకి గర్భాన్న కృష్ణుడు అవతరించాడు. కంసుడు ఈ ఉగ్రసేనుని కొడుకు - వంశం - చంద్రవంశం; తండ్రి - పునర్వసువు; కొడుకు(లు) - దేవకుడు, ఉగ్రసేనుడు; పద్య సం.(లు) - 9-12-వ.,

  85) ఇందిందిర- ( -){}[కీటకము]:- తుమ్మెద - వంశం - కీటకము; పద్య సం.(లు) - 8-42-మ.,

  1) ఇందిర - (స్త్రీ){}[దైవ యోని]:- లక్మీదేవి. - వంశం - దైవ యోని; పద్య సం.(లు) - 8-99-వ., 3-288-వ., 3-507,

  2) ఇందిరాచిత్తచోర- (పురుష){}[దైవ యోని]:- విష్ణువు - వంశం - దైవ యోని; పద్య సం.(లు) - 3-423.1-తే., 3-573.1-తే., 4-2013.1-తే,

  3) ఇందిరాధీశ్వర- (పురుష){}[దైవ యోని]:- విష్ణువు - వంశం - దైవ యోని; పద్య సం.(లు) - 3-436-ఉ.,

  4) ఇందిరారమణుడు- (పురుష){}[దైవ యోని]:- విష్ణువు - వంశం - దైవ యోని; పద్య సం.(లు) - 6-188-సీ.,

  5) ఇందిరావరుడు- (పురుష){}[దైవ యోని]:- విష్ణువు - వంశం - దైవ యోని; పద్య సం.(లు) - 3-629-చ.,

  6) ఇందిరావిభుడు- (పురుష){}[దైవ యోని]:- విష్ణువు - వంశం - దైవ యోని; పద్య సం.(లు) - 1-294-సీ., 3-288-వ.,

  7) ఇందీవరము- ( -){}[వృక్ష]:- నల్ల కలువ - వంశం - వృక్ష; పద్య సం.(లు) - 8-44-సీ.,

  8) ఇందుజూటుడు- (పురుష){}[దైవ యోని]:- శివుడు - వంశం - దైవ యోని; పద్య సం.(లు) - 8-547-ఆ.,

  9) ఇందుడు- (పురుష){}[దైవ యోని]:- చంద్రుడు - వంశం - దైవ యోని; పద్య సం.(లు) - 10.1-112.1-తే.,

  10) ఇందుధరసుందరి - (స్త్రీ){}[దైవ యోని]:- పార్వతీదేవి - వంశం - దైవ యోని; పద్య సం.(లు) - 8-671-వ., 10.1-1743-వ.,

  11) ఇందుధరుడు- (పురుష){}[దైవ యోని]:- శివుడు - వంశం - దైవ యోని; పద్య సం.(లు) - 2-155-ఉ., 8-671-వ.,

  12) ఇందుమంతుడు- (పురుష){}[గయుని వంశం]:- ఇతను గయుని వంశంలో మరీచి కొడుకు, ఇతని సోదరి ఇందుమతి - వంశం - గయుని వంశం; తండ్రి - మరీచి; పద్య సం.(లు) - 5.2-10-వ.,

  13) ఇందుమతి-1 (స్త్రీ){}[గయుని వంశం]:- ఈమె గయుని వంశంలో మరీచి కూతురు, ఈమె సోదరుడు ఇందుమంతుడు - వంశం - గయుని వంశం; తండ్రి - మరీచి; పద్య సం.(లు) - 5.2-10-వ.,

  14) ఇందుమతి-2 (స్త్రీ){}[సూర్యవంశం]:- ఈమె సూర్యవంశంలో మాంధాత భార్య, శతబిందుని కూతురు. ఈమెకు పురుక్సుతుడు, అంబరీషుడు, ముచుకుందుడు అని ముగ్గురు (3) పుత్రులు, ఏభైమంది (50) పుత్రికలు - వంశం - సూర్యవంశం; తండ్రి - శతబిందుడు; భర్త - మాంధాత; కొడుకు(లు) - పురుక్సుతుడు, అంబరీషుండు, ముచుకుందుండు.; కూతురు(లు)- మంది పుత్రికలు; పద్య సం.(లు) - 9-172-వ.,

  15) ఇందుమౌళి- (పురుష){}[దైవ యోని]:- శివుడు - వంశం - దైవ యోని; పద్య సం.(లు) - 4-152-చ., 10.2-953-వ.,

  16) ఇందుశేఖరుడు- (పురుష){}[దైవ యోని]:- శివుడు - వంశం - దైవ యోని; పద్య సం.(లు) - 3-144-చ.,

  17) ఇంద్రకీలం- ( -){}[పర్వతం]:- భారతవర్షంలోని ప్రసిద్ధమైన అనేక పర్వతాలలో ఒకటి. - వంశం - పర్వతం; పద్య సం.(లు) - 5.2-55-వ.,

  18) ఇంద్రద్యుమ్నుడు- (పురుష){}[రాజు]:- గజేంద్రుని పూర్వ జన్మలో ఇంద్రద్యుమ్నుడు అను ద్రవిళదేశ ప్రభువు, వైష్ణవముఖ్యుడు. ఒకమారు కొండపై తపస్సు చేసుకుంటున్నాడు. అప్పుడు అక్కడకు అగస్త్య మునీశ్వరుడు వచ్చాడు. ఇతను లేవలేదని ఏనుగు కమ్మని శపించాడు. అతడు గజేంద్రుడుగా పుట్టాడు. మొసలిచేత పట్టుబడి, విష్ణువుచేత రక్షింపబడ్డాడు... - వంశం - రాజు; పద్య సం.(లు) - 8-122-మ., 8-124-క.,

  19) ఇంద్రప్రమితి- (పురుష){}[ఋషి]:- ఇంద్రప్రమితి పైలుని నుండి తను నేర్చుకున్న ఋగ్వేద సంహితను మాండూకేయుడికి ఉపదేశించాడు. అతడు దేవమిత్రుడికి ఉపదేశించాడు - వంశం - ఋషి; పద్య సం.(లు) - 12-30.వ.,

  20) ఇంద్రబాణాసన- ( -){}[వృక్ష]:- ఇంద్రబాణాసన అంటే మరువం నల్లగోరింట వేగిస చెట్లు అని ఇంద్రధనస్సు అని నానార్థాలు ఉన్నాయి. ఈ పదం ప్రథమ స్కంధలో నైమిశారణ్య వర్ణన సందర్భంలో వర్షాకాలం రాక} కు ఉపమాన పదంగా వాడబడింది. - వంశం - వృక్ష; పద్య సం.(లు) - 1-39-వ.,

  21) ఇంద్రమానిని- (స్త్రీ){}[దైవ యోని]:- ఇంద్రుని భార్య, సచీదేవి. - వంశం - దైవ యోని; పద్య సం.(లు) - 9-509-క.,

  22) ఇంద్రవజ్రము- ( - ){}[భాష]:- ఛందస్సు, తెలుగు భాగవతములో ఉపయోగించిన ఒక ఛందోరీతి వృత్తము ఈ ఇంద్ర వజ్రము.
గ్రంథములో ఈ ఛందస్సు నాలుగు (4) పద్యములకు వాడారు. - వంశం - భాష; పద్య సం.(లు) - 6-310-ఇ.,

  23) ఇంద్రవాహనుడు- (పురుష){}[సూర్యవంశం]:- శశాదుని కుమారుడు రాక్షసుల పురాలను జయించుటచే పురంజయుడు అని, ఆబోతు రూపుడైన ఇంద్రుడుని ఎక్కి రాక్షసుల జయించుట వలన ఇంద్రవాహనుడు అని; అతని మూపురంను ఎక్కి యుద్దం చేసినందు వలన కకుత్స్థుడు అని మూడు (3) పేర్లతోను పేరుపొందాడు. - వంశం - సూర్యవంశం; తండ్రి - శశాదుడు; పద్య సం.(లు) - 9-163-వ.,

  24) ఇంద్రసావర్ణిమనువు - (పురుష){}[మనువు వంశం]:- రాబోయేకాలంలో ఇంద్రసావర్ణి పద్నాల్గవ మనువు అవుతాడు. అతని కొడుకులైన గంభీరుడూ, వసువూ మొదలైనవారు రాజులు అవుతారు. పవిత్రులూ, చాక్షుషులూ దేవతలు అవుతారు. శుచి అనేవాడు ఇంద్రుడు అవుతాడు. అగ్ని బాహువూ శుచీ, శుక్రుడూ, మాగధుడూ మొదలైనవారు సప్తఋషులు అవుతారు. విష్ణువు సత్రాయణునకూ వితానకూ బృహద్భానుడు అనేపేరుతో పుడతాడు. - వంశం - మనువు వంశం; కొడుకు(లు) - గంభీరుడు; వసువు మొదలైనవారు; పద్య సం.(లు) - 8-427-వ., 8-428-తే.,

  25) ఇంద్రసావర్ణిమన్వంతరం- ( -){}[కాలం]:- ఇంద్రసావర్ణిమన్వంతరం పద్నాలుగు మన్వంతరాలలో పద్నాలుగవది. - వంశం - కాలం; పద్య సం.(లు) - 8-427-వ.,

  26) ఇంద్రసేన- (పురుష){}[దైవ యోని]:- త్రివిక్రమావతారుని ఊరువుల యందు ఇంద్రసేన, మరుద్గణములు జనించారు - వంశం - దైవ యోని; పద్య సం.(లు) - 8-624-వ,

  27) ఇంద్రసేనం- ( -){}[పర్వతం]:- ప్లక్షద్వీపంలోని సుభద్రవర్షంలో ఇంద్రసేనం అను కుల పర్వతము, అంగిరసి అను మహానది ఉన్నాయి. - వంశం - పర్వతం; పద్య సం.(లు) - 5.2-60-వ.,

  28) ఇంద్రసేనుడు-1 (పురుష){}[ఋషి]:- ఇతడు దక్ష తనూజ భానువు పుత్రుడైన వేదఋషభుని కొడుకు. - వంశం - ఋషి; తండ్రి - వేదఋషభుడు; పద్య సం.(లు) - 6-254--వ.,

  29) ఇంద్రసేనుడు-2 (పురుష){}[రాక్షస యోని]:- బలిచక్రవర్తిని, వామనుడు సుతలలోకానికి వెళ్ళమని చెప్పేటప్పుడు, బలిని ఇంద్రసేన మహారాజా అన్నాడు.
దేవకీదేవి తన మృతశిశువులను చూడగోరగా, సుతలలోకానికి వచ్చిన బలరామ కృష్ణులను, ఈ ఇంద్రసేనుడు (బలి) దర్శించుకున్నాడు. - వంశం - రాక్షస యోని; పద్య సం.(లు) - 8-667-సీ., 10.2-1141-మ.,

  30) ఇంద్రసేనుడు-3 (పురుష){}[సూర్యవంశం]:- సూర్యవంశంలోని శర్వునికి ఇతడు కొడుకు, ఇతని కొడుకు వీతిహోత్రుడు. - వంశం - సూర్యవంశం; తండ్రి - శర్వుడు; కొడుకు(లు) - వీతిహోత్రుడు; పద్య సం.(లు) - 9-42-వ.,

  31) ఇంద్రస్పృశుడు- (పురుష){}[ప్రియవ్రతుని వంశం]:- ఋషభుని వందమంది కొడుకులలో ఒకడు. తల్లి జయంతి, భరతుడు ఇతనితో పాటు తొమ్మిది మంది తమ్ముళ్ళకు భరత వర్షంలోని వారి వారి పేర బరగు భాగాలను పంచి ఇచ్చాడు. వారు కుశావర్తుడు, ఇలావర్తుడు, బ్రహ్మావర్తుడు, ఆర్యావర్తుడు, మలయకేతువు, భద్రసేనుడు, -ఇంద్రస్పృశుడు, విదర్భుడు, కీకటుడు - వంశం - ప్రియవ్రతుని వంశం; తండ్రి - ఋషభుడు; తల్లి - జయంతి ; పద్య సం.(లు) - 5.1-63-సీ., 5.1-64-వ.,

  32) ఇంద్రియాలు- ( -){}[స్థలం]:- ఏకాదశ రుద్రులకు బ్రహ్మదేవుడు నిర్దేశించిన స్థానలలో ఒకటి. రుద్రుడు ధృతవ్రతుడు నామం కలిగి భార్య దీక్షతో, ఇంద్రియాలు స్థానంగా కలిగి ఉంటాడు. - వంశం - స్థలం; పద్య సం.(లు) - 3-369-క., 3-370-వ.,

  33) ఇంద్రుడు-1 (పురుష){}[దైవ యోని]:- సూర్యుడు శ్రావణ (నభో) మాసంలో ఇంద్రుడు అను పేరుతో సంచరిస్తాడు. ఈ మాసంలో అతనికి అప్సరస ప్లమోచ ; ఋషి అంగిరసుడు ; నాగుడు ఏలాపుత్రుడు ; రాక్షసుడు చర్యుడు ; గంధర్వుడు విశ్వవసువు ; యక్షుడు శ్రోతుడు మున్నగువారు అనుచరులై ఉంటారు. - వంశం - దైవ యోని; పద్య సం.(లు) - 12-41-వ. నుండి 12-45-వ. వరకు,

  34) ఇంద్రుడు-2 (పురుష){}[దైవ యోని]:- ఇంద్రుడు దేవతలకు రాజు,
ఇతని రాజధాని అమరావతి. ఇది మానసోత్తర పర్వతము నందు తూర్పున దేవధాని అయి ఉంటుంది.
ఇంద్రియశక్తి కాంక్షించేవాడు ఇంద్రుణ్ణి సేవించాలి.
సాత్వికాహంకారం వలన దిక్కులు, వాయువు, సూర్యుడు, వరుణుడు, అశ్వినీ దేవతలు, అగ్ని, ఇంద్రుడు, ఉపేంద్రుడు, మిత్రుడు, ప్రజాపతి అనే పదిమంది దేవతలు పుట్టారు.
వ్రేపల్లె కలతపడేటట్టు జోరున ఎడతెరపిలేని వాన వెంటనే కురవండి అంటూ ఇంద్రుడు మేఘాలను ఆదేశించాడు.
ప్రధాన పూరుషుడు, భగవంతుడు ఐన విష్ణు ఆజ్ఞానుసారం ఇంద్రుడు వర్షిస్తాడు.
పృథుని యజ్ఞంచేస్తుంటే ఇంద్రుడు మాయావేషంతో యజ్ఞాశ్వాన్ని ఎత్తుకుపోతే ఇంద్రుని అడ్డగించి జయించి అశ్వాన్ని తీసుకెళ్ళాడు.
ఇంద్రునిచే ప్రేరేపింపబడిన అప్సరస ప్లమోచ కండుమహాముని వలన గర్భం ధరించి స్వర్గానికి వెళ్ళిపోతూ, మారిష అను పుత్రికను కని వృక్షాలలో వదిలింది.
దానవులు ఐన పౌలోమ కార్తికేయులు యజ్ఞవిఘాతలు కాగా ఇంద్రునికి ప్రితి కలుగునట్లు వారిని అర్జునుడు వధించాడు.
ఇంద్రుడు గర్వంతో దేవగురువు బృహస్పతి రాగా లేవలేదు. బృహస్పతి దేవతలకు దూరమయ్యాడు. ఈ అవకాశం తెలిసి శుక్రుని గురవుగా చేసుకుని రాక్షసులు రెచ్చిపోయి. దేవతలను ఓడించసాగారు. త్వష్ట కుమారుడు విశ్వరూపుడు ఇంద్రునికి శ్రీమన్నారాయణ కవచం ఉపదేశించాడు. దాని సాయంతో ఇంద్రుడు రాక్షసులను వృత్రాసురుని జయించాడు.
విశ్వరూపుడు యాగభాగాలు రాక్షసులకు రహస్యంగా ఇస్తున్నాడు అని తెలిసి అతని మూడు తలలు ఇంద్రుడు నరికాడు. అలా వచ్చిన బ్రహ్మహత్యాపాతకం నేల, చెట్లు, స్త్రీలకు ఇచ్చి తప్పించుకున్నాడు. వృత్రాసుర సంహానంతరం కలిగిన బ్రహ్మహత్యాపాపం నుండి తప్పించుకోడానికి 1000 సంవత్సరాలు మానససరోవరంలోని తామర తూడులలో దాగుకున్నాడు.
ఇంద్రుని జయించగల సంతానం కోరి వ్రతం చేస్తున్న దితి గర్భం అదను చూసి ప్రవేశించి ఖండించాడు. అలా కలిగిన నలభైతొమ్మిది (49) మంది మరుద్గణములు ఇంద్రునిచేరి దేవతలు అయ్యారు. శశాదుని పుత్రుడు విరుక్షి దేవతల తరఫున యుద్ధాలు చేసి రాక్షసుల పురాలను జయించుటచే పురంజయుడు అని, ఆబోతు రూపుడైన ఇంద్రుడుని ఎక్కి రాక్షసుల జయించుట వలన ఇంద్రవాహనుడు అని; అతని మూపురంను ఎక్కి యుద్దం చేసినందు వలన కకుత్స్థుడు అని మూడు (3) పేర్లతోను పేరుపొందాడు.
యాదవులు ఇంద్రయాగం చేయలేదని కోపించి ఇంద్రుడు భీకరమైన వానలు ఏడురోజులు కురిపించగా. శ్రీ కృష్ణుడు గోవర్ధన గిరిని ఎత్తి వారిని కాపాడి, ఇంద్రుని గర్వం తొలగించాడు. - వంశం - దైవ యోని; పద్య సం.(లు) - 2-38-వ., 2-66-వ., 2-184-తే.,3-886-సీ., 3-972-వ., 4-516-వ., 4-909., 5.2-81-b., 6-258-వ.6-265-చ., 6-298-సీ., 6-316-వ., 6-437-వ., 6-525-వ., 9-163-వ., 10.2-1673-వ.,

  35) ఇంద్రుడు-3 (పురుష){}[భగణ విషయం]:- ఇంద్రుడి పట్టణం, అమరావతి, దేవధాని దేవతల రాజధాని, మానసోత్తర పర్వతానికి తూర్పున ఉంటుంది.
రసాతలంలోని దైత్యులు, దానవులు ఇంద్రుని దూతి అయిన సరమ ఉచ్చరించే మంత్రాలకు భయపడుతూ ఉంటారు.
శింశుమారచక్రం తోకభాగంలో ప్రజాపతి, అగ్ని, ఇంద్రుడు, ధర్ముడు ఉన్నారు. - వంశం - భగణ విషయం; పద్య సం.(లు) - 5.2-81-వ., 5.2-119-వ., 5.2-97-వ.,

  36) ఇంద్రులు- (పురుష){}[దైవ యోని]:- బ్రహ్మదేవుని పగలు కాలంలో పద్నాలుగు మన్వంతరాలు జరుగుతాయి. ఆ చతుర్దశమనువుల కాలంలో ఒక్కొక్కరు ఇంద్రుడు అయ్యారు. వారు ... రెండవది ఐన స్వారోచిష మన్వంతరంలో రోచనుడు, మూడవది ఐన ఉత్తమ మన్వంతరంలో సత్యజిత్తు, నాలుగవది ఐన తామస మన్వంతరంలో త్రిశిఖుడు, ఆరవదైన చాక్షుస మన్వంతరంలో మంత్రద్యుమ్నుడు ఇంద్రుడుగా అయ్యారు. ఏడవది ఐన ప్రస్తుత వైవస్వత మన్వంతరంలో పురందరుడు ఇంద్రుడు.
ఎనిమిదవదైన సూర్యసావర్ణి మన్వంతరంలో బలి, తొమ్మిదవదైన దక్షసావర్ణి మన్వంతరంలో అద్భుతుడు, పదవది ఐన బ్రహ్మసావర్ణి మన్వంతరంలో శంభుడు అనువాడు, పదకొండవదైన ధర్మసావర్ణి మన్వంతరంలో వైధృతుడు, పన్నెండవదైన భద్రసావర్ణి మన్వంతరంలో ఋతుధాముడు. పదమూడవదైన దేవసావర్ణి మన్వంతరంలో దివస్పతి, పద్నాలుగవదైన ఇంద్రసావర్ణి మన్వంతరంలో శుచి వరుసగా ఇంద్రులు అయ్యెదరు. - వంశం - దైవ యోని; పద్య సం.(లు) - 8-14-సీ., 8-16-సీ., 8-19-సీ., 8-141-సీ., 8-412-వ., 8-413-సీ., 8-417-వ., 8-419-వ., 8-421-వ., 8-423-వ., 8-425-వ., 8-427-వ.,

  37) ఇక్షుచాపుడు- (పురుష){}[దైవ యోని]:- మన్మథుడు, ఇక్షువు (చెరకు) విల్లుగా కలవాడు - వంశం - దైవ యోని; పద్య సం.(లు) - 3-288-వ.,

  38) ఇక్షురస- ( -){}[జల ప్రాంతం]:- క్షార = కారపు సముద్రము; ఇక్షురస = చెరకురసముసముద్రము; సుర = సురాసముద్రము; ఆజ్య = నేయ్యిసముద్రము; క్షీర = పాలసముద్రము; దధి = పెరుగుసముద్రము; ఉదకంబులు = నీటిసముద్రము; కలుగు = ఉండెడి; సాగరములు = సముద్రములు {సప్తసముద్రములు - 1క్షార(కారపు సముద్రము) 2ఇక్షురస(చెరకురసముసముద్రము) 3సుర(సురాసముద్రము) 4ఆజ్య(నేయ్యిసముద్రము) 5క్షీర(పాలసముద్రము) 6దధి(పెరుగుసముద్రము) 7ఉదకంబులు(నీటిసముద్రము)}; ఏడున్ = ఏడు (7). ఒక ద్వీపంతో మరొక ద్వీపం కలిసిపోకుండా ఉండడానికి సముద్రాలు ఏర్పడ్డాయి. - వంశం - జల ప్రాంతం; పద్య సం.(లు) - 5.1-19-సీ.,

  39) ఇక్షుసాగరం- ( -){}[జల ప్రాంతం]:- లవణసముద్రం తరువాత ప్లక్షద్వీపం రెండు లక్షల యోజనాల విస్తృతి కలిగి ఉంది. అంతే పరిమాణం గల (ఇక్షుసాగరం) చెరకు రస సముద్రం పరివేష్టించి ఉంటుంది. - వంశం - జల ప్రాంతం; పద్య సం.(లు) - 5.2-59-సీ.,

  40) ఇక్ష్వాకుడు- (పురుష){}[సూర్యవంశం]:- ఇక్ష్వాకుడు శ్రీరామునికి పూర్వజుడు. గొప్ప చక్రవర్తి, పరీక్షిత్తు జన్మించినప్పుడు, పురోహితులు అతని జాతకం ధర్మరాజునకు చెప్తూ ఇక్ష్వాకుని వలె ప్రజలను రక్షిస్తాడు అని మరి కొన్ని వివరాలు చెప్పారు.
ప్రస్తుత వైవశ్వత మన్వంతరంలో (ఏడవది) శ్రాద్ధదేవుడు అను వైవశ్వత మనువు కొడుకు పదిమందిలో ఒకడు. ఆ పదిమంది 9-3-సీ. ప్రకారం) నభగుడు, ధృష్టుడు, శర్యాతి, నరిష్యంతుడు, నాభాగుడు, దిష్టుడు, కరూశకుడు, వృషద్ధృడు, వసుమంతుడు. (పాఠ్యంతరం 9-9-వ. ప్రకారం) ఇక్ష్వాకుడు, నృగుడు, శర్యాతి, దిష్టుడు, దృష్టుడు, కరూశకుడును, నరిష్యంతుడు, పృషద్రధుడు, నభగుడు, కవి.
ఒకనాడు మనువు తుమ్మగా, అతని ముక్కురంధ్రం నుండి ఇక్ష్వాకుడు పుట్టి సూర్యవంశంలో గొప్ప రాజుగా ప్రసిద్ధుడు అయాడు.
ఇక్ష్వాకునికి వందమంది కొడుకులు. వికుక్షి, నిమి, దండకుడు అతని పెద్ద పుత్రులు ముగ్గురు (3) ఆర్యావర్తంలోని హిమాచలమునకున్ వింధ్యపర్వతముల నడుమ భూభాగాన్ని పాలించారు. ఇరవైఐదుమంది (25) కలిసి తూర్పువైపు ఉన్న రాజ్యాన్ని పరిపాలించారు. ఇంకొక ఇరవైఐదుమంది (25) పశ్చిమానికి రాజులు అయ్యారు. మిగిలిన నలభై ఏడుమంది (47) ఉత్తర భూములను దక్షిణ భూములను పరిపాలించారు. అప్పుడు తండ్రి అష్టకాశ్రాద్దం చేస్తాను అంటు పెద్ద కొడుకు వికుక్షిని పరిశుద్దమైన మాంసము తీసుకొనిరమ్మని పంపాడు.
అతను శుద్ధముకాని కుందేలు మాంసం తెచ్చేడు. అంత కులగురువు వసిష్ఠుని ఆజ్ఞమేరకు దేశాంతర శిక్ష వేసాడు. పిమ్మట గురువు చెప్పిన ప్రకారం యోగి ఐ మోక్షం పొందాడు.
ఈ నిర్మలమతి మహాత్ముడు భక్తితో ఆ దేవదేవుని సేవించి దాటరాని విష్ణుమాయను దాటాడు. - వంశం - సూర్యవంశం; తండ్రి - శ్రాద్ధ దేవుడు / వైవశ్వత మనువు; తల్లి - శ్రద్ధ / శ్రద్ధాదేవి; కొడుకు(లు) - నూరుగురు కొడుకులు, ముఖ్యులు వికుక్షి శశాదుడు, నిమి, దండకుడు; పద్య సం.(లు) - 1-293-వ., 9-3-సీ., 9-9-వ., 9-155-క., 9-156-సీ., 9-159-ఆ., 2-240-సీ.; 8-412-వ.,

  41) ఇడస్పతి- (పురుష){}[మానవ యోని]:- యజ్ఞుడు, దక్షిణలకు పన్నెండు (12) మంది పుత్రులు వారు స్వాయంభువ మన్వంతరంలో తుషితులు అను దేవగణాలు అయ్యారు. వారిలో ఇడస్పతి ఆరవ (6) వాడు. - వంశం - మానవ యోని; తండ్రి - యజ్ఞుడు ; తల్లి - దక్షిణ ; పద్య సం.(లు) - 4-6-వ.,

  42) ఇత్నవు- (పురుష){}[దక్షుని వంశం]:- దక్షపుత్రిక లంబ యందు ధర్మునకు పుట్టిన ఇద్దరు పుత్రులలో స్తనుడు, ఇత్నవు లలో ఒకడు - వంశం - దక్షుని వంశం; తండ్రి - విద్యోతుడు; పద్య సం.(లు) - 6-254-వ.,

  43) ఇధ్మజిహ్వుడు- (పురుష){}[మనువు వంశం]:- ఇతడు ప్లక్ష ద్వీపాధిపతి. స్వాయంభువ మనువు పుత్రుడు ప్రియవ్రతునికి విశ్వకర్మ ప్రజాపతి పుత్రిక బర్హిష్మతి యందు కలిగిన పదిమంది (10) కొడుకులలో రెండవ (2) వాడు. ప్రియవ్రతుడు భూమిని ఏలుతూ సప్త ద్వీపములుగా విభాగించాడు. ఇధ్మబాహును వాటిలో ప్లక్షద్వీపానికి మహీపతిగా చేసాడు. ఇతడు ప్లక్షద్వీపాన్ని ఏడు (7) వర్షాలుగా విభజించి తన ఏడుగురు కొడుకులు శివుడు, యశస్యుడు, సుభద్రుడు, శాంతుడు, క్షేముడు, అభయుడు, అమృతులకు వారి వారి పేర్లు గల వర్షాలకు అధిపతులను చేసాడు. - వంశం - మనువు వంశం; తండ్రి - ప్రియవ్రత ; తల్లి - బర్హిష్మతి ; కొడుకు(లు) - శివుడు; యశస్యుడు; సుభద్రుడు; శాంతుడు; క్షేముడు; అభయుడు; అమృతుడు ; పద్య సం.(లు) - 5.1-16-వ., 5.1-20., 5.1-59.1-ఆ., 5.2-60-వ.,

  44) ఇధ్మధర్ములు- (పురుష){}[మానవ యోని]:- శాల్మలీద్వీపంలోని పురుషులను శ్రుతధరులు, విద్యధరులు, ఇధ్మధర్ములు అంటారు - వంశం - మానవ యోని; పద్య సం.(లు) - 5.2-62-వ.,

  45) ఇధ్ముడు- (పురుష){}[దైవ యోని]:- యజ్ఞుడు, దక్షిణలకు పన్నెండు (12) మంది పుత్రులు వారు స్వాయంభువ మన్వంతరంలో తుషితులు అను దేవగణాలు అయ్యారు. వారిలో ఇధ్ముడు ఆరవ (7) వాడు. - వంశం - దైవ యోని; తండ్రి - యజ్ఞుడు ; తల్లి - దక్షిణ ; పద్య సం.(లు) - 4-6-వ.,

  46) ఇనతనయుడు- (పురుష){}[చంద్రవంశం]:- కర్ణుడు, ఇనుడి (సూర్యుని) తనయుడు.
విదురుడు చెప్పిన మంచి మాటలకు అలిగిన దుర్యోధనుడు ఇనతనయుని (కర్ణుని), శకుని, దుశ్శాసనుని చూసి అహంకారంతో దాసీపుత్రుడంటూ విదురుని అవమానిస్తూ మాటలాడాడు. - వంశం - చంద్రవంశం; పద్య సం.(లు) - 3-34-క.,

  47) ఇనుడు-1 (పురుష){}[దైవ యోని]:- సూర్యుడు,
రావణాసురుని పాలనలో సూర్యుడు గట్టిగా ఎండ కాయడానికి భయపడతాడు.
శైశవకృష్ణుడు యశోదకు విశ్వరూప దర్శనం చూపునప్పుడు, ఆవలించి అతని నోరు కొండగుహలా కనబడింది. ఆ లోతులలో అన్నింటితోపాటు సూర్యుడు కూడ కనబడ్డాడు.
పూతన నేల కూలాక, శైశవకృష్ణునికి రక్షావచనాలు పలుకుతూ ఇతడు కృష్ణుని కంఠాన్ని రక్షించాలని పలికారు. - వంశం - దైవ యోని; పద్య సం.(లు) - 3-214-సీ. 8-27-ఆ., 9-309-ఆ., 10.1-236-వ., 10.1-803-ఆ., 10.1-1600-ఆ., ,

  48) ఇనుడు-2 (పురుష){}[ప్రదేశము]:- సూర్యుడు - వంశం - ప్రదేశము; పద్య సం.(లు) - 8-28-క.,

  49) ఇభము- ( -){}[జంతు]:- ఏనుగు - వంశం - జంతు; పద్య సం.(లు) - 8-51-సీ.,

  50) ఇభయూధము- ( -){}[జంతు]:- ఏనుగుల గుంపు - వంశం - జంతు; పద్య సం.(లు) - 8-37-క.,

  51) ఇభరాజు- ( -){}[జంతు]:- గజేంద్రుడు - వంశం - జంతు; పద్య సం.(లు) - 8-49-సీ.,

  52) ఇభలోకేంద్రుడు- ( -){}[జంతు]:- గజేంద్రుడు - వంశం - జంతు; పద్య సం.(లు) - 8-45-క.,

  53) ఇరావంతుడు- (పురుష){}[చంద్రవంశం]:- ఇలావంతుడు పాఠ్యాంతరాలు ఇరావంతుడు, ఇరావ్రతుడు ఉన్నాయి.
ఇతడు అర్జునుడికి ఉలూపి అను నాగకన్య యందు పుట్టాడు.
- వంశం - చంద్రవంశం; తండ్రి - అర్జునుడు; తల్లి - ఉలూపి; పద్య సం.(లు) - 6-673-వ.,

  54) ఇరావతి-1 (స్త్రీ){}[చంద్రవంశం]:- ఈమె విరాటరాజు ఉత్తరుని కూతురు; పరీక్షిత్తుమహారాజు భార్య, - వంశం - చంద్రవంశం; తండ్రి - ఉత్తరుడు; భర్త - పరీక్షిత్తు; కొడుకు(లు) - జనమేజయుడు, శ్రుతసేనుడు, భీమసేనుడు, ఉగ్రసేనుడు.; పద్య సం.(లు) - 1-391-వ., ,

  55) ఇరావతి-2 (స్త్రీ){}[దైవయోని]:- ఏకాదశ రుద్రులకు బ్రహ్మదేవుడు నిర్దేశించిన భార్యలలో ఒకామె. రుద్రుడు కాలుడు నామం కలిగి భార్య ఇరావతితో, తపస్సు స్థానంగా కలిగి ఉంటాడు. - వంశం - దైవయోని; భర్త - కాలుడు; పద్య సం.(లు) - 3-369-క., 3-370-వ.,

  56) ఇరావ్రతుడు- (పురుష){}[చంద్రవంశం]:- ఇలావంతుడు పాఠ్యాంతరాలు ఇరావంతుడు, ఇరావ్రతుడు ఉన్నాయి.
ఇతడు అర్జునుడికి ఉలూపి అను నాగకన్య యందు పుట్టాడు.
- వంశం - చంద్రవంశం; తండ్రి - అర్జునుడు; తల్లి - ఉలూపి; పద్య సం.(లు) - 6-673-వ.,

  57) ఇల-1 (స్త్రీ){}[దైవ యోని]:- భూమి - వంశం - దైవ యోని; పద్య సం.(లు) - 1-194-క., 1-196-క., 1-233-సీ., 7-32-సీ., 8-541-క., 9-204-సీ., 10.1-262-క., 10.2-166-ఉ., 10.2-555-క., 10.2-762-క.,

  58) ఇల-2 (స్త్రీ){}[దైవయోని]:- ఏకాదశ రుద్రులకు బ్రహ్మదేవుడు నిర్దేశించిన భార్యలలో ఒకామె. రుద్రుడు ఉరురేతసుడు నామం కలిగి భార్య ఇలతో, భూమి స్థానంగా కలిగి ఉంటాడు. - వంశం - దైవయోని; భర్త - ఉరురేతసుడు; పద్య సం.(లు) - 3-369-క., 3-370-వ.,

  59) ఇల-3 (స్త్రీ){}[దక్షుని వంశం]:- దక్షపుత్రి అయిన ఈమె యందు భర్త కశ్యపునికి వృక్షాలు పుట్టాయి. - వంశం - దక్షుని వంశం; తండ్రి - దక్షుడు; తల్లి - అసిక్ని; భర్త - కశ్యపుడు ; కొడుకు(లు) - వృక్షాలు; పద్య సం.(లు) - 6-257-సీ.,

  60) ఇల - (స్త్రీ){}[మనువు వంశం]:- ఈమె ధ్రువుని చిన్న భార్య. ఉత్కలుడు, వత్సరుడు అని ఇద్దరు కొడుకులు - వంశం - మనువు వంశం; భర్త - ధ్రువుడు; కొడుకు(లు) - ఉత్కలుడు, వత్సరుడు; పద్య సం.(లు) - 4-217-తే., 4-218-క., 4-322-వ.,

  61) ఇలబిల- (స్త్రీ){}[సూర్యవంశం]:- తృణబిందునకు అప్సరస అంలబుస యందు పుట్టిన పుత్రిక ఈమె, ఈమె యందు పులస్త్యుని పుత్రుడు విశ్రవసునకు కుబేరుడు పుట్టాడు. - వంశం - సూర్యవంశం; తండ్రి - తృణబిందుడు; తల్లి - అలంబుస (అప్సరస); భర్త - విశ్రవసుడు; కొడుకు(లు) - ఐలబిలుడు కుబేరుడు; పద్య సం.(లు) - 4-26-వ., 9-48-వ.,

  62) ఇలావంతుడు- (పురుష){}[చంద్రవంశం]:- ఇతడు అర్జునుడికి ఉలూపి అను నాగకన్య యందు పుట్టాడు.
ఇలావంతుడు పాఠ్యాంతరాలు ఇరావంతుడు, ఇరావ్రతుడు ఉన్నాయి - వంశం - చంద్రవంశం; తండ్రి - అర్జునుడు; తల్లి - ఉలూపి; పద్య సం.(లు) - 6-673-వ.,

  63) ఇలావర్తుడు- (పురుష){}[ప్రియవ్రతుని వంశం]:- ఋషభుని వందమంది కొడుకులలో ఒకడు. తల్లి జయంతి, భరతుడు ఇతనితో పాటు తొమ్మిది మంది తమ్ముళ్ళకు భరత వర్షంలోని వారి వారి పేర బరగు భాగాలను పంచి ఇచ్చాడు. వారు కుశావర్తుడు, ఇలావర్తుడు, బ్రహ్మావర్తుడు, ఆర్యావర్తుడు, మలయకేతువు, భద్రసేనుడు, ఇంద్రస్పృశుడు, విదర్భుడు, కీకటుడు - వంశం - ప్రియవ్రతుని వంశం; తండ్రి - ఋషభుడు; తల్లి - జయంతి ; పద్య సం.(లు) - 5.1-63-సీ., 5.1-64-వ.,

  64) ఇలావృతవర్షం- ( - ){}[ప్రాంతం]:- జంబూద్వీపంలో గుండ్రటి ఆకారాలతో తొమ్మిదివేల యోజనాల విస్తీర్ణం కలిగిన తొమ్మిది వర్షాలు ఉన్నాయి. వాటి నన్నిటినీ విభజించే సరిహద్దులుగా ఎనిమిది పర్వతాలు ఉన్నవి. ఆ తొమ్మిది వర్షాలలో నట్టనడుమ ఇలావృతం అనే వర్షం ఉంది. దాని నడుమ బంగారు రంగుతో కూడిన మేరుపర్వతం ఉంది.
ఇలావృత వర్షానికి దక్షిణంగా నిషధ పర్వతం, హేమకూట పర్వతం, హిమవత్పర్వతం అనే మూడు సరిహద్దు పర్వతాలు ఉన్నాయి. ఇలావృత వర్షానికి పడమట మాల్యవంతం, తూర్పున గంధమాదనం అనే సరిహద్దు పర్వాలున్నాయి. అవి తూర్పు పడమరలకు పొడవూ, ఉత్తర దక్షిణాలకు వెడల్పూ కలిగి నీలపర్వత నిషధపర్వతాలను ఆనుకొని ఉన్నాయి. వాని విస్తృతి రెండు వేల యోజనాలు.
ఇలావృత వర్షానికి శివుడు అధిపతి. - వంశం - ప్రాంతం; పద్య సం.(లు) - 5.2-17-వ., 5.2-20-వ., 5.2-38-వ,

  65) ఇలావృతుడు- (పురుష){}[మనువు వంశం]:- ఇతడు ప్రియవ్రతుని పుత్రుడు అగ్నీధ్రుడు అప్సరస పూర్వచిత్తి యందు పొందిన తొమ్మండుగురు (9) పుత్రులలో ఒకడు.
ప్రియవ్రతుడు విశ్వకర్మ ప్రజాపతి కుమార్తె అయిన బర్హిష్మతి యందు ఆగ్నీధ్రుడు, ఇధ్మజిహ్వుడు, యజ్ఞబాహువు, మహావీరుడు, హిరణ్యరేతసుడు, ఘృతపృష్ఠుడు, సవనుడు, మేధాతిథి, వీతిహోత్రుడు, కవి అనే పదిమంది కొడుకులను, ఊర్జస్వతి అనే కుమార్తెను కన్నాడు. పిమ్మట కాలంలో అగ్నీధ్రుడు జంబూద్వీప అధిపతి అయ్యాడు, ఇతని పుత్రులు నాభి [1]; కింపురుష [2]; హరివర్షుడు [3]; ఇలావృతుడు [4]; రమ్యకుడు [5]; హిరణ్మయుడు [6]; కురువు [7]; భద్రాశ్వుడు [8]; కేతుమాలుడు [9].
వీరు జంబూద్వీపాన్ని తమతమ పేర్లతో భూములుగా విబాగించుకుని పాలించారు.
ఈ ఇలావృతుడు సోదరులు, మేరుదేవి పుత్రికలు అయిన లత మున్నగువారిని వివాహమాడారు. - వంశం - మనువు వంశం; తండ్రి - అగ్నీధ్రుడు ; తల్లి - పూర్వ చిత్తి అప్సరస; భార్య - లత; పద్య సం.(లు) - 5.1-40-వ., ,

  66) ఇల్వలుడు-1 (పురుష){}[రాక్షస యోని]:- వృత్రాసుర యుద్ధంలో వృత్రాసురుని తరఫున దేవతలతో యుద్ధం చేసిన దైత్యులలో ఒకడు ఇల్వలుడు. - వంశం - రాక్షస యోని; పద్య సం.(లు) - 6-363-వ., 8-334-వ.,

  67) ఇల్వలుడు-2 (పురుష){}[రాక్షస యోని]:- ప్రహ్లాదుని సోదరుడు అయిన హ్లాదునికి భార్య దమని యందు వాతాపి, ఇల్వలులు పుట్టారు. వీరిని అగస్త్యుడు భక్షించాడు.
బలరాముడు తీర్థయాత్రలకు వెళ్ళినపుడు, మునీశ్వరులు కోరిన ప్రకారం యజ్ఞఘాతకుడు అగు ఇల్వలుని కొడుకు పల్వలుని సంహరించాడు. - వంశం - రాక్షస యోని; తండ్రి - హ్లాదుడు ; తల్లి - దమని; కొడుకు(లు) - పల్వలుడు; పద్య సం.(లు) - 6-507-వ., 10.2-937-వ., 10.2-944-వ., 10.2-1343-గ.,

  68) ఇల్వలుడు-3 (పురుష){}[రాక్షసయోని]:- ఇల్వలుడు మున్నగు రాక్షసవీరులు సురాసుర యుద్ధములో బలి పక్షమున పోరాడాడు. ఇల్వలుడు వాతాపిలు బ్రహ్మపుత్రులతో యుద్ధం చేసారు. - వంశం - రాక్షసయోని; పద్య సం.(లు) - 8-327-క. నుండి 8-34-వ. వరకు,

  69) ఇళ- (స్త్రీ){}[చంద్రవంశం]:- వసుదేవునికి ఈమె యందు యదువు, ఉరువల్కలాదులు జన్మించారు. - వంశం - చంద్రవంశం; భర్త - వసుదేవుడు; కొడుకు(లు) - యదువు ఉరువల్కల మున్నగువారు; పద్య సం.(లు) - 9-722-వ.,

  70) ఇళాకన్య - (స్త్రీ){}[సూర్యవంశం]:- వైవశ్వతమనువునకు భార్య శ్రద్ధ యందు ఆడపిల్లగా పుట్టి, 6 నెలలు ఇళ పేరుతో స్త్రీగా, 6 నెలలు సుద్యుమ్నుడు పేరుతో పురుషుడుగా జీవించిన వ్యక్తి.
ఇళాకన్యగా బుధునితో పురూరవుని కొడుకుగా కన్నది.
మగవాడుగా సుద్యుమ్నుడు అయి ఉత్కళుడు, గయుడు, విమలుడు అని ముగ్గురు పుత్రులను పొందాడు. - వంశం - సూర్యవంశం; తండ్రి - మనువు శ్రాద్దదేవుడు; తల్లి - శ్రద్ద; భర్త - బుధుడు; కొడుకు(లు) - పురూరవుడు; పద్య సం.(లు) - 9-387-వ., 9-10-సీ., 9-25-వ., 9-27-వ., 9-32-వ.,

  71) ఇవురు- ( -){}[వృక్ష]:- చిగుళ్ళు - వంశం - వృక్ష; పద్య సం.(లు) - 8-39-సీ.,

  72) ఇవురుజొంపము- ( -){}[వృక్ష]:- చిగుళ్ళగుత్తి - వంశం - వృక్ష; పద్య సం.(లు) - 8-39-సీ.,

  73) ఇషంబరుడు- (పురుష){}[యక్షుడు]:- సూర్యుడు త్వష్ట పేరున ఆశ్వయుజమాసమందు సంచరించేటప్పుడు ఇషంబరుడు అను యక్షుడు ఒక సభ్యుడు, ఈనెలలో సూర్యునికి ఋచీకుని కొడుకు జమదగ్ని, కంబళాశ్వుడు, తిలోత్తమ, బ్రహ్మోపేతుడు, శతజిత్తు, ధృతరాష్ట్రుడు, ఇషంభరుడు అను సభ్యులు పరివారంగా సంచరిస్తుంటారు. - వంశం - యక్షుడు; పద్య సం.(లు) - 12-43-వ.,

  74) ఇషుడు- (పురుష){}[ధ్రువుని వంశం]:- ఇతడు ధ్రువపుత్రుడు వత్సరుని మూడవ కొడుకు. - వంశం - ధ్రువుని వంశం; తండ్రి - వత్సరుడు; తల్లి - సర్వర్థి ; పద్య సం.(లు) - 4-390-వ.,

  75) ఇషుమంతుడు- (పురుష){}[చంద్రవంశం]:- వసుదేవుని తమ్ముడు దేవశ్రవునికి, ఉగ్రసేనుని కూతురు కంసవతి యందు పుట్టిన ఇద్దరు కొడుకులలో ఇతడు (ఇషుమంతుడు) రెండవవాడు, పెద్దవాడు వీరుడు - వంశం - చంద్రవంశం; తండ్రి - దేవశ్రవుడు; తల్లి - కంసవతి; పద్య సం.(లు) - 9-722-వ.,

  [ ↑ ] 1) ఈశానం- ( -){}[పర్వతం]:- పురోజన వర్షంలో ఈశానం అను సరిహద్దు పర్వతము, అనఘ అను నది ఉన్నాయి. - వంశం - పర్వతం; పద్య సం.(లు) - 5.2-68-వ.,

  2) ఈశాని- (స్త్రీ){}[దైవ యోని]:- మాయాదేవికి గల అనేక పేరులలో ఒకటి. అవి దుర్గ, భద్రకాళి, విజయ, వైష్ణవి, కుముద, చండిక, కృష్ణ, మాధవి, కన్యక, మాయ, నారాయణి, ఈశాన, శారద, అంబిక అనే పద్నాలుగు పేర్లు. - వంశం - దైవ యోని; పద్య సం.(లు) - 10.1-61-వ.,

  3) ఈశానుడు-1 (పురుష){}[దైవ యోని]:- విష్ణువు - వంశం - దైవ యోని; పద్య సం.(లు) - 2-258-వ., 2-264-క., 7-20-మ.,

  4) ఈశానుడు-2 (పురుష){}[దైవ యోని]:- శివుడు - వంశం - దైవ యోని; పద్య సం.(లు) - 7-384-వ., 7-396-క., 8-403-సీ., 10.1-104-వ.,

  5) ఈశుడు-1 (పురుష){}[దైవ యోని]:- ఈశ్వరుడు - వంశం - దైవ యోని; పద్య సం.(లు) - 10.1-235-వ.,

  6) ఈశుడు-2 (పురుష){}[దైవ యోని]:- విష్ణువు - వంశం - దైవ యోని; పద్య సం.(లు) - 2-56-సీ.,.,.,

  7) ఈశ్వరి- (స్త్రీ){}[దైవ యోని]:- పార్వతీదేవి, ఈశ్వరుని భార్య - వంశం - దైవ యోని; పద్య సం.(లు) - 10.1-1729-ఉ., 10.1-1744-ఉ.,

  8) ఈశ్వరుడు-1 (పురుష){}[దైవయోని]:- విష్ణువు కృతయుగంలో తెల్లని రంగుతో నాలుగుచేతులు కలిగి ఉంటాడు; జడలు నారచీరలు జింకచర్మం జపమాలిక దండం కమండలము దాల్చి నిర్మలమైన తపస్సు ధ్యానము అనుష్టానము గల మునిశ్రేష్ఠులచేత హంసుడు, సుపర్ణుడు, వైకుంఠుడు, ధర్ముడు, అమలుడు, యోగీశ్వరుడు, ఈశ్వరుడు, పురుషుడు, అవ్యక్తుడు, పరమాత్ముడు అనే దివ్య నామాలతో ప్రశంసింపబడుతూ ప్రసిద్ధి చెందుతాడు. - వంశం - దైవయోని; పద్య సం.(లు) - 11-77-వ.,

  9) ఈశ్వరుడు-2 (పురుష){}[దైవ యోని]:- విష్ణువు - వంశం - దైవ యోని; పద్య సం.(లు) - 1-58-వ., 1-67-వ., 1-110వ.,.,.,

  10) ఈశ్వరుడు-3 (పురుష){}[దైవ యోని]:- శివుడు - వంశం - దైవ యోని; పద్య సం.(లు) - 2-38-వ., 7-372-గ., 8-737-ఆ., 9-114-వ., 10.1-235-వ.,

  [ ↑ ] 1) ఉగ్రకరుడు- (పురుష){}[దైవ యోని]:- సూర్యుడు - వంశం - దైవ యోని; పద్య సం.(లు) - 2-47-సీ.,

  2) ఉగ్రదంష్ట్ర - (స్త్రీ){}[మనువు వంశం]:- జంబూద్వీపపతి అగ్నీధ్రుని తొమ్మిది మంది కోడళ్ళలో ఒకామె ఈమె; హరివర్షము అధిపతి హరివర్షుని భార్య; అగ్నీధ్రుని తొమ్మిది (9) మంది కొడుకులు నాభి, కింపురుష, హరివర్ష, ఇలావృత, రమ్యక, హిరణ్మయ, కురు, భద్రాశ్వ, కేతుమాల; అగ్నీధ్రుని తొమ్మిదిమంది కోడళ్ళు మేరుదేవి, ప్రతిరూప, ఉగ్రదంష్ట్ర, లత, రమ్య, శ్యామ, నారి, భద్ర, దేవవతి; వారు ఏలిన జంబూద్వీప వర్షాలు నాభి, కింపురుషము, హరివర్షము, ఇలావృతము, రమ్యకము, హిరణ్మయము, కురు, భద్రాశ్వము, కేతుమాల. - వంశం - మనువు వంశం; తండ్రి - మేరు; భర్త - హరివర్షుడు ; పద్య సం.(లు) - 5-1-40-వ.,

  3) ఉగ్రశ్రవసుడు- (పురుష){}[ఋషి]:- ఇతనే సూతుడు, రోమహర్షణుని కుమారుడు, సకల పురాణాలను వ్యాఖ్యానించడంలో మిక్కిలి నేర్పరి అయి ఉగ్రశ్రవుడు అని ప్రసిద్ధుడైన సూతుడు శౌనకాది మహర్షులకు మహాభాగవత పురాణం చెప్పాడు. - వంశం - ఋషి; తండ్రి - రోమహర్షణుడు; పద్య సం.(లు) - 1-54-వ.,

  4) ఉగ్రసేనుడు-1 (పురుష){}[చంద్రవంశం]:- చంద్రవంశంలోని సుబాహునకు ఇతడు కొడుకు, ఇతని కొడుకు శ్రుతసేనుడు - వంశం - చంద్రవంశం; తండ్రి - సుబాహుడు; కొడుకు(లు) - శ్రుతసేనుడు; పద్య సం.(లు) - 10.2-1333-వ.,

  5) ఉగ్రసేనుడు-2 (పురుష){}[గంధర్వుడు]:- ఇతడు భాద్రపద (నభోస్వీ) మాసంలో సూర్యుని అనుచరులలోని గంధర్వుడు.
సూర్యుడు ఈ మాసంలో వివస్వంతుడు అను పేరుతో, అనుమ్లోచ, భృగువు, శంఖపాలుడు, వ్యాఘ్రుడు, ఉగ్రసేనుడు, ఆసారణుడు మున్నగువారు అనుచరులుగా కలిగి సంచరిస్తాడు. - వంశం - గంధర్వుడు; పద్య సం.(లు) - 12-41-వ. నుండి 12-45-వ. వరకు,

  6) ఉగ్రసేనుడు-3 (పురుష){}[చంద్రవంశం]:- ఇతడు చంద్రవంశంలో ఆహుకుని రెండవ కొడుకు, ఇతని అన్న దేవకుని కూతురు దేవకీదేవి కృష్ణుని కన్నది
ఇతనికి తొమ్మండుగురు (9) కొడుకులు (కంసుడు, న్యగ్రోధుడు, సునామకుడు, కహ్వుడు, శంకుడు, సుభువు, రాష్ట్రపాలుడు, విసృష్టుడు, తుష్టిమంతుడు) మఱియు నలుగురు (4) కూతుర్లు (కంస, కంసవతి, సురాభువు, రాష్ట్రపాలిక)
శ్రీకృష్ణుడు హస్తిన నుండి ద్వారకకు తిరిగి వచ్చినప్పుడు సాదరంగా ఎదురు వచ్చిన ప్రముఖులలోని ముఖ్యుడు.
కంస వధానంతరం, కృష్ణుడు కొడుకు కంసునిచే బంధింపబడిన ఇతనిని విడిపించి, సింహాసనం ఇచ్చి పాలింపజేసాడు.
- వంశం - చంద్రవంశం; తండ్రి - ఆహుకుడు; కొడుకు(లు) - కంసుడు, న్యగ్రోధుడు, సునామకుడు, కహ్వుడు, శంకుడు, సుభువు, రాష్ట్రపాలుడు, విసృష్టుడు, తుష్టిమంతుడు; కూతురు(లు)- కంస, కంసవతి, సురాభువు, రాష్ట్రపాలిక; పద్య సం.(లు) - 1-256-వ., 1-348-సీ., 3-52-క., 3-99.1-తే., 9-712-వ., 9-714-వ., 10.1-54-మ., 10.1-1400-క.,

  7) ఉగ్రసేనుడు-4 (పురుష){}[చంద్రవంశం]:- ఇతడు పరీక్షిత్తుకు భార్య ఇరావతి యందు కలిగిన నలుగురు (4) పుత్రులలో నాలుగవ వాడు.
- వంశం - చంద్రవంశం; తండ్రి - పరీక్షిత్తు; తల్లి - ఇరావతి; పద్య సం.(లు) - 9-677-వ.,

  8) ఉగ్రాక్షుడు- (పురుష){}[దైవ యోని]:- శివుడు, ఉగ్రమైన కన్ను కలవాడు - వంశం - దైవ యోని; పద్య సం.(లు) - 9-262-మ., 10.1-1761-వ.,

  9) ఉగ్రాయుధుడు- (పురుష){}[చంద్రవంశం]:- ఇతని తండ్రి కృతి. ఈయన సన్నతిమంతునికి పుట్టి హిరణ్యనాభుని వలన యోగమార్గం పట్టి, శోకమోహాలు వదలి తూర్పుదేశములో సామవేదం పఠించాడు. ఇతని కొడుకు పురంజయుని తాత క్షేముడు. - వంశం - చంద్రవంశం; తండ్రి - కృతి; కొడుకు(లు) - క్షేమ్యుడు; పద్య సం.(లు) - 9-655-వ.,

  10) ఉగ్రుడు- (పురుష){}[దక్షుని వంశం]:- ఇతడు భూతుడు సరూపల సంతానంలోని వాడు. శంకరుని అంశతో పుట్టిన భూతునకు, దక్షుని కూతురు సరూప అనే భార్య వల్ల కోట్లకొలది రుద్రగణాలు పుట్టారు. అంతేకాక రైవతుడు, అజుడు, భవుడు, భీముడు, వాముడు, అగ్రుడు, వృషాకపి, అజైకపాత్తు, అహిర్బుధ్న్యుడు, బహురూపుడు, మహాంతుడు అనేవాళ్ళు, రుద్రపారిషదులు, మిక్కిలి భయంకరాకారులైన ప్రేతలు, వినాయకులు జన్మించారు. - వంశం - దక్షుని వంశం; తండ్రి - భూతుడు; తల్లి - సరూప ; పద్య సం.(లు) - 6-254-వ.,

  11) ఉచథ్యుడు- (పురుష){}[దైవ యోని]:- ఇతని తండ్రి అంగిరసుడు, తల్లి కర్దమ పుత్రి శ్రద్ధ. ఇతని అక్కలు సినీవాలి, కూహూ, రాక, అనుమతి; తమ్ముడు బృహస్పతి.
ఇతని భార్య మమత. ఈమె బృహస్పతి వలన భరద్వాజుడు అను కొడుకును కన్నది. - వంశం - దైవ యోని; తండ్రి - అంగిరసుడు; తల్లి - శ్రద్ధ ; భార్య - మమత; పద్య సం.(లు) - 4-26-వ.,

  12) ఉడురాజు- (పురుష){}[దైవ యోని]:- చంద్రుడు, ఉడు (చుక్కలకు) రాజు. - వంశం - దైవ యోని; పద్య సం.(లు) - 3-637-సీ., 9-11-క.,

  13) ఉత్కలుడు-1 (పురుష){}[ధ్రువుని వంశం]:- ఇతడు ధ్రువునికి ఇల యందు పుట్టిన పెద్ద కొడుకు. తత్వంజ్ఞాని అయి అడవికి పోగా, మునులు తమ్ముడు వత్సరునికి రాజ్యం కట్టబెట్టారు. - వంశం - ధ్రువుని వంశం; తండ్రి - ధ్రువుడు; తల్లి - ఇల; పద్య సం.(లు) - 4-390-వ.,

  14) ఉత్కలుడు-2 (పురుష){}[రాక్షసయోని]:- ఉత్కలుడు మున్నగు రాక్షసవీరులు సురాసుర యుద్ధములో బలి పక్షమున పోరాడాడు. ఉత్కలుడు మాతృకాగణములుతో యుద్ధం చేసాడు. - వంశం - రాక్షసయోని; పద్య సం.(లు) - 8-327-క. నుండి 8-34-వ. వరకు,

  15) ఉత్కళ - (స్త్రీ){}[ప్రియవ్రతుని వంశం]:- ప్రియవ్రతుని వంశంలోని సమ్రాట్టు భార్య. వీరి కొడుకు మరీచి. - వంశం - ప్రియవ్రతుని వంశం; భర్త - సమ్రాట్టు; కొడుకు(లు) - మరీచి; పద్య సం.(లు) - 5.2-10-వ.,

  16) ఉత్కళుడు- (పురుష){}[సూర్యవంశం]:- మనువుకు అడపిల్లగా పుట్టి వసిష్ఠునిచే మగ పిల్లవానిగా మారి, పిమ్మట అడవులకు వెళ్ళి ఆడపిల్ల ఇళాకన్యగా మారి బుధునికి పురూరవుని కని, తన దేశానికి వచ్చి శివుని వరం వలన ఏటా ఆరు నెలలు స్త్రీగా, తరువాతి ఆరునెలలు సుద్యుమ్నుడను పేరుతో పురుషుడుగా రాజ్యం ఏలాడు. ఆ సుద్యుముని పెద్ద కొడుకు ఈ ఉత్కలుడు, తరువాతి వారు ఇద్దరు గయుడు, విమలుడు. - వంశం - సూర్యవంశం; తండ్రి - సుద్యుమ్నుడు; పద్య సం.(లు) - 9-25-వ., 9-32-వ.,

  17) ఉత్తమమనువు- (పురుష){}[మనువు]:- ఇతడు మనువులు పద్నాలుగురు(14)లో మూడవ (3) వాడు. ఇతని తండ్రి ప్రియవ్రతుడు. ప్రియవ్రతుడు ఉత్తముడు, తామసుడు, రైవతుడు అనే ముగ్గురు మూడవ, నాలుగవ, అయిదవ మనువులను కన్నాడు.
ఇతను భూలోకం అంతటినీ మూడవ మనువుగా పాలించాడు. అతని పుత్రులు పవనుడు, సృంజయుడు, యజ్ఞహోత్రుడు మొదలైన వారు, మిక్కిలి గుణవంతులు. ఆ మన్వంతరంలో సప్తర్షులు వశిష్టుని కొడుకులైన ప్రమథుడు మొదలైనవారు. సత్యజిత్తు అను వాడు దేవతల ప్రభువైన దేవేంద్రుడు. దేవతలు సత్యులూ, భద్రులు మొదలైనవారు, విష్ణు సత్యసేనుడు అను పేరుతో ధర్మజుడు సూనృతులకు కుమారుడిగా అవతారం ఎత్తాడు. అతను సత్యజిత్తుకు చెలికాడై లోకం మెచ్చుకునేలా సత్య నిష్ఠతో దుర్మార్గులు అయిన యక్ష రాక్షసులను శిక్షించాడు. - వంశం - మనువు; తండ్రి - ప్రియవ్రతుడు; కొడుకు(లు) - పవనుడు; సృంజయుడు; యజ్ఞహోత్రుడు; మొదలైన వారు; పద్య సం.(లు) - 5.1-17-సీ., 8-16-సీ.,

  18) ఉత్తమమన్వంతరం- ( -){}[కాలం]:- ఉత్తమమన్వంతరం పద్నాలుగు మన్వంతరాలలో మూడవది. - వంశం - కాలం; పద్య సం.(లు) - 8-16-సీ.,

  19) ఉత్తముడు- (పురుష){}[మనువు వంశం]:- ఇతడు ధ్రువుని సవితి సోదరుడు. స్వాయంభువ మనువు కొడుకైన ఉత్తానపాదునికి ప్రియభార్య సురుచి కొడుకు.
ఒకనాడు ఉత్తానపాదుడు ఉత్తముణ్ణి తొడలపై కూర్చుండబెట్టుకొని ముద్దు చేస్తుండగా ధ్రువుడు తానుకూడ తన తండ్రి తొడలపైకి ఎక్కటానికి ఉబలాటపడ్డాడు. కాని ఉత్తానపాదుడు ధ్రువుని దగ్గరకు తీసుకోలేదు, ఆదరించలేదు. అందుకు సురుచి గర్వించి, ధ్రువుడితో ఇలా అన్నది. “నా కడుపున పుట్టినవాడే తండ్రితొడ ఎక్కటానికి అర్హుడు. మరొక స్త్రీ గర్భాన పుట్టిన నీకు తండ్రి తొడ ఎక్కే అదృష్టం ఎలా కలుగుతుంది? కావాలంటే నీవు విష్ణువు గురించి తపస్సుచెయ్యి" అంది.
ధ్రువుడు కృతార్థుడై తిరిగి వచ్చి రాజ్యం చేస్తుండగా, వేటకై వెళ్ళిన అవివాహితుడైన ఆ ఉత్తముడు హిమవత్పర్వత ప్రాంతంలో యక్షునిచేతిలో మరణించాడు. ఆ దుఃఖంతో అడవికి వెళ్ళి దావానలంలో పడి మృతి చెందింది. ధ్రువుడు సోదరుని మరణానికి అలిగి యక్షుల మీద యుద్ధం చేసాడు. - వంశం - మనువు వంశం; తండ్రి - ఉత్తానపాదుడు ; పద్య సం.(లు) - 4-219-సీ., 4-312-సీ., 4-322-వ.,

  20) ఉత్తర-1 (స్త్రీ){}[చంద్రవంశం]:- ఈమె పరీక్షిత్తు తల్లి. అభిమన్యుని భార్య. విరాటరాజు సుధేష్ణుని కూతురు. పరీక్షిత్తు గర్భంలో ఉండగా, అశ్వత్థామ వేసిన బ్రహ్మశిరోనామకాస్త్రం నుండి శ్రీకృష్ణుడు కాపాడి పాండవ వంశాన్ని నిలబెట్టాడు. - వంశం - చంద్రవంశం; తండ్రి - సుధేష్ణ; భర్త - అభిమన్యుడు; కొడుకు(లు) - పరీక్షిత్తు; పద్య సం.(లు) - 1-178-వ., 1-234-వ., 1-530-గ., 3-130-వ., 9-675-వ.,

  21) ఉత్తర-2 ( -){}[భగణ విషయం]:- శింశుమారచక్రం కుడి ఎడమ చెవులలో మఘ, పుబ్బ, ఉత్తర, హస్త, చిత్త, స్వాతి, విశాఖ, అనూరాధ నక్షత్రాలు ఉన్నాయి. - వంశం - భగణ విషయం; పద్య సం.(లు) - 5.2-97-వ.,

  22) ఉత్తరకురువర్షం- ( - ){}[ప్రాంతం]:- జంబూద్వీపంలోని నీల శ్వేత శృంగవత్పర్వతాలు అనే సరిహద్దు పర్వతాలు నడిమి ప్రదేశంలో రమ్యకం, హిరణ్మయం, కురు అనే మూడు వర్షాలు ఉన్నాయి. అవి ఒక్కొక్కటి తొమ్మిది వేల యోజనాల విస్తృతి కలిగి ఉన్నాయి. ఇవన్నీ సముద్రం దాకా వ్యాపించి ఉన్నాయి. ఆ మూడు వర్షాల పొడవు నీల శ్వేత శృంగవత్పర్వతాల పొడవుతో సమానంగా ఉంటుంది.
ఉత్తర కురువర్షానికి వరాహదేవుడు అధిపతి. అక్కడ భూదేవి ఆ వర్షప్రజలు వరాహమూర్తిని ఆరాధిస్తారు. - వంశం - ప్రాంతం; పద్య సం.(లు) - 5.2-20-వ.స 5.2-49-క., 5.2-50-క.,

  23) ఉత్తరపల్గుని- (స్త్రీ){}[దక్షుని వంశం]:- ఉత్తర ఫల్గుని దక్షుని కుమార్తె - 27 నక్షత్రాలలో 12వది, చంద్రునికు దక్షుని కుమార్తెలు కృత్తికాదులు ఇరవైఏడుగురు (27) భార్యలు అయినను, చంద్రుడు తన భార్యలలో రోహిణిని అధిక మోహంతో చూచి మిగిలిన భార్యలను నిర్లక్ష్యం చేసి దక్షుని శాపం వల్ల క్షయరోగాన్ని పొంది సంతానం లేనివాడైనాడు. తరువాత దక్షుని దయవల్ల క్షయవల్ల తొలగిన కళలను తిరిగి పొందాడు. - వంశం - దక్షుని వంశం; తండ్రి - దక్షుడు; తల్లి - అసక్ని; భర్త - చంద్రుడు; పద్య సం.(లు) - 6-254-వ.,

  24) ఉత్తరములు- ( -){}[పరికరములు]:- ఉత్తరములు అంటే అలంకారములు. సాగరమథనం తరువాత జరిగిన సురాసుర యుద్ధంలో ఇరు పక్షాల వారు వీటిని వాడారు. - వంశం - పరికరములు; పద్య సం.(లు) - 8-327-క. నుండి 8-34-వ. వరకు,

  25) ఉత్తరాభాద్ర- (స్త్రీ){}[దక్షుని వంశం]:- ఉత్తరాభాద్ర దక్షుని కుమార్తె - 27 నక్షత్రాలలో 25వది, చంద్రునికు దక్షుని కుమార్తెలు కృత్తికాదులు ఇరవైఏడుగురు (27) భార్యలు అయినను, చంద్రుడు తన భార్యలలో రోహిణిని అధిక మోహంతో చూచి మిగిలిన భార్యలను నిర్లక్ష్యం చేసి దక్షుని శాపం వల్ల క్షయరోగాన్ని పొంది సంతానం లేనివాడైనాడు. తరువాత దక్షుని దయవల్ల క్షయవల్ల తొలగిన కళలను తిరిగి పొందాడు. - వంశం - దక్షుని వంశం; తండ్రి - దక్షుడు; తల్లి - అసక్ని; భర్త - చంద్రుడు; పద్య సం.(లు) - 6-254-వ.,

  26) ఉత్తరాయణ నక్షత్రాలు- ( -){}[భగణ విషయం]:- శింశుమారచక్రం కుడివైపుకు చుట్టుకొని కుండలీభూతంగా ఉన్నదానికి ఉత్తరభాగంలో ఉత్తరాయణ నక్షత్రాలు ఉన్నాయి, - వంశం - భగణ విషయం; పద్య సం.(లు) - 5.2-97-వ.,

  27) ఉత్తరాయణం- ( -){}[భగణ విషయం]:- మానసోత్తర పర్వత శిఖరంపై సంవత్సరాత్మకమైన సూర్యరథచక్రం తిరుగుతూ రాత్రింబగళ్ళు మేరువునకు ప్రదక్షిణం చేస్తూ ఉంటుంది.
బ్రహ్మాండానికి మధ్య భాగంలో సూర్యుడు ఉన్నాడు. ఆ సూర్యునికి ఇరువైపులా ఇరవై అయిదు కోట్ల యోజనాల దూరంలో బ్రహ్మాండ కటాహం ఉంది.
సూర్యునికి ఉత్తరాయణం, దక్షిణాయనం, విషువత్తు అనే మూడు గమనాలు. క్రమంగా మందకొడిగా, తీవ్రంగా, సమానంగా ఉంటాయి. వీటిని అనుసరించి రాత్రింబవళ్ళు దీర్ఘాలుగా, హ్రస్వాలుగా, సమానాలుగా మారుతూ ఉంటాయి - వంశం - భగణ విషయం; పద్య సం.(లు) - 5.2-78-వ.,

  28) ఉత్తరాషాడ- (స్త్రీ){}[దక్షుని వంశం]:- ఉత్తరాషాడ దక్షుని కుమార్తె - 27 నక్షత్రాలలో 21వది, చంద్రునికు దక్షుని కుమార్తెలు కృత్తికాదులు ఇరవైఏడుగురు (27) భార్యలు అయినను, చంద్రుడు తన భార్యలలో రోహిణిని అధిక మోహంతో చూచి మిగిలిన భార్యలను నిర్లక్ష్యం చేసి దక్షుని శాపం వల్ల క్షయరోగాన్ని పొంది సంతానం లేనివాడైనాడు. తరువాత దక్షుని దయవల్ల క్షయవల్ల తొలగిన కళలను తిరిగి పొందాడు. - వంశం - దక్షుని వంశం; తండ్రి - దక్షుడు; తల్లి - అసక్ని; భర్త - చంద్రుడు; పద్య సం.(లు) - 6-254-వ.,

  29) ఉత్తరాషాఢ- ( -){}[భగణ విషయం]:- శింశుమారచక్రం ఎడమపాదంలో ఉత్తరాషాఢ ఉంది. - వంశం - భగణ విషయం; పద్య సం.(లు) - 5.2-97-వ.,

  30) ఉత్తరుడు- (పురుష){}[చంద్రవంశం]:- పరీక్షిత్తు భార్య ఇరావతికి తండ్రి ఇతడు. - వంశం - చంద్రవంశం; పద్య సం.(లు) - 1-391-వ., ,

  31) ఉత్తానచరణుడు- (పురుష){}[మనువు వంశం]:- ఉత్తానపాదుడు. విష్ణుదేవుని అనుగ్రహం పొంది, ధ్రువుడు మరలి వస్తున్నాడు అని విని ఉత్తానపాదుడు సంతోషించాడు. - వంశం - మనువు వంశం; తండ్రి - స్వాయంభువుడు; తల్లి - శతరూప; భార్య - సునీతి , సురుచి ; కొడుకు(లు) - ఉత్తముడు, ధ్రువుడు; పద్య సం.(లు) - 4-301.1-తే.,

  32) ఉత్తానపాదుడు- (పురుష){}[మనువు వంశం]:- ఇతడు స్వాయంభువ మనువుకు అతని మహిషి శతరాప యందు కలిగిన పెద్ద కుమారుడు, ఇతని తమ్ముడు ప్రియవ్రతుడు. స్వాయంభువ మనువు కొడుకైన ఉత్తానపాదునికి ఇద్దరు భార్యలు ప్రియభార్య సురుచి మరొక బార్య సునీతి. ఉత్తానపాదునికి సురుచి యందు ఉత్తముడు, సునీతి యందు ధ్రువుడు అని ఇద్దరు కొడుకులు కలిగారు.
ఒకనాడు ఉత్తానపాదుడు ఉత్తముణ్ణి తొడలపై కూర్చుండబెట్టుకొని ముద్దు చేస్తుండగా ధ్రువుడు తానుకూడ తన తండ్రి తొడలపైకి ఎక్కటానికి ఉబలాటపడ్డాడు. కాని ఉత్తానపాదుడు ధ్రువుని దగ్గరకు తీసుకోలేదు, ఆదరించలేదు. అందుకు సురుచి గర్వించి, ధ్రువుడితో ఇలా అన్నది. “నా కడుపున పుట్టినవాడే తండ్రితొడ ఎక్కటానికి అర్హుడు. మరొక స్త్రీ గర్భాన పుట్టిన నీకు తండ్రి తొడ ఎక్కే అదృష్టం ఎలా కలుగుతుంది? కావాలంటే నీవు విష్ణువు గురించి తపస్సుచెయ్యి" అంది.
ధ్రువుడు కృతార్థుడై తిరిగి వచ్చి రాజ్యం చేస్తుండగా, వేటకై వెళ్ళిన అవివాహితుడైన ఆ ఉత్తముడు హిమవత్పర్వత ప్రాంతంలో యక్షునిచేతిలో మరణించాడు. ఆ దుఃఖంతో అడవికి వెళ్ళి దావానలంలో పడి మృతి చెందింది. ధ్రువుడు సోదరుని మరణానికి అలిగి యక్షుల మీద యుద్ధం చేసాడు. పిమ్మట విష్ణుమూర్తి వరం ప్రకారం, అత్యున్నతమైనది ఐన ధ్రువ పదం జేరి ఇప్పటికి ధ్రువ నక్షత్రంగా వెలుగొందుతున్నాడు. - వంశం - మనువు వంశం; తండ్రి - స్వాయంభువుడు; తల్లి - శతరూప; భార్య - సునీతి , సురుచి ; కొడుకు(లు) - ఉత్తముడు, ధ్రువుడు; పద్య సం.(లు) - 2-203-వ., 3-388-వ., 4-3-వ., 4-217-తే., 4-219-సీ., 4-322-వ.,

  33) ఉత్తానబర్హి-1 (పురుష){}[సూర్యవంశం]:- ఇతని అసలు పేరు బర్హిష్మదుడు. ఇతను చేసిన ఎడతెగని యజ్ఞాల వలన ఉత్తానబర్హి అను పేరు పొందాడు. నారదుడు మితిమీరిన యజ్ఞాలు జీవహింస అవుతాయి అని బోధించగా, యజ్ఞాలు ఆపాడు.ఇతడు విజితాశ్వుని కొడుకైన హవిర్దానునకు భార్య హవిర్ధాని యందు కలిగిన ఆరుగురు (6) కొడుకులలో పెద్దవాడు. ఇతని సోదరులు గయుడు, శుక్రుడు, కృష్ణుడు, సత్యుడు, జితవ్రతుడు అనే అయిదుగురు.
బ్రహ్మదేవుని ఆజ్ఞానుసారం అతిలోకసుందరి సముద్రపుత్రి అయిన శతధృతిని వివామాడాడు, ఆమె యందు ప్రచేసులు అను పదిమంది పుత్రులను కన్నాడు. వారు సమవ్రతులు, సమనాములు, ధర్మజ్ఞులు. - వంశం - సూర్యవంశం; తండ్రి - హవిర్ధానుడు; తల్లి - హవిర్ధాని; భార్య - శతధృతి; కొడుకు(లు) - ప్రాచేతసులను పదిమంది; పద్య సం.(లు) - 4-679-వ., 4-684-వ.,

  34) ఉత్తానబర్హి-2 (పురుష){}[సూర్యవంశం]:- శర్యాతికి కలిగిన ముగ్గురు కొడుకులలో పెద్దవాడు ఇతడు. ఇతని తమ్ముళ్ళు ఆనర్తుడు, భూరిషేణుడు.
- వంశం - సూర్యవంశం; తండ్రి - శర్యాతి; పద్య సం.(లు) - 9-69-వ.,

  35) ఉత్పలమాల- ( - ){}[భాష]:- ఛందస్సు, తెలుగు భాగవతములో ఉపయోగించిన ఒక ఛందోరీతి వృత్తము ఈ ఉత్పలమాల. వీటిని గ్రంధములో 475 పద్యాలకు ఉపయోగించారు - వంశం - భాష; పద్య సం.(లు) - 1-2-ఉ.,

  36) ఉత్సాహము- ( - ){}[భాష]:- ఛందస్సు, తెలుగు భాగవతములో ఉపయోగించిన జాతి ఛందోరీతి ఉత్సాహము.
గ్రంథములో ఈ ఛందస్సు మూడు (3) పద్యములకు మాత్రమే వాడారు. - వంశం - భాష; పద్య సం.(లు) - 6-389-ఉత్సా.,

  37) ఉదంకుడు- (పురుష){}[విప్ర]:- ఉదంకుడూ మొదలగువారు నిర్మలమతులైన మహాత్ము లందరూ అనురక్తులై భక్తితో ఆ దేవదేవుని తమ మనస్సులో నిల్పారు. ఆయనే గతి అని సేవించారు. అందువల్లనే దాట వీలుగాని విష్ణుమాయను దాటగల వారు అయ్యారు.
సూర్యవంశంపు కువలయాశ్వుడు ఇరవైయొక్క వేయి మంది పుత్రులుతో కలిసి వెళ్ళి ఉదంకుడు అనే బ్రాహ్మణుడు ఆజ్ఞాపించగా ధుంధుడు అనే రాక్షసుడిని సంహరించి ధుంధుమారుడు అని పేరు పొందాడు. - వంశం - విప్ర; పద్య సం.(లు) - 2=204-సీ., 9-164-క.,

  39) ఉదకంబులు- ( -){}[జల ప్రాంతం]:- క్షార = కారపు సముద్రము; ఇక్షురస = చెరకురసముసముద్రము; సుర = సురాసముద్రము; ఆజ్య = నేయ్యిసముద్రము; క్షీర = పాలసముద్రము; దధి = పెరుగుసముద్రము; ఉదకంబులు = నీటిసముద్రము; కలుగు = ఉండెడి; సాగరములు = సముద్రములు {సప్తసముద్రములు - 1క్షార(కారపు సముద్రము) 2ఇక్షురస(చెరకురసముసముద్రము) 3సుర(సురాసముద్రము) 4ఆజ్య(నేయ్యిసముద్రము) 5క్షీర(పాలసముద్రము) 6దధి(పెరుగుసముద్రము) 7ఉదకంబులు(నీటిసముద్రము)}; ఏడున్ = ఏడు (7). ఒక ద్వీపంతో మరొక ద్వీపం కలిసిపోకుండా ఉండడానికి సముద్రాలు ఏర్పడ్డాయి. - వంశం - జల ప్రాంతం; పద్య సం.(లు) - 5.1-19-సీ.,

  40) ఉదక్సేనుడు- (పురుష){}[చంద్రవంశం]:- జైగిషవ్యుని ఉపదేశం పొందిన బ్రహ్మదత్తునికి భార్య గోదేవి అందు కలిగిన విష్వక్సేనుని పుత్రుడు ఇతడు. ఈ ఉదక్సేనుని కొడుకు భల్లాదుడు. వీరు బార్హదిషుపులు అను రాజులు. - వంశం - చంద్రవంశం; తండ్రి - విష్వక్సేనుడు; కొడుకు(లు) - భల్లాదుడు; పద్య సం.(లు) - 9-655-వ.,

  41) ఉదయము- ( -){}[భగణ విషయం]:- సూర్యగమనం వలన ఏర్పడు దినములోని కాలభేదములు - వంశం - భగణ విషయం; పద్య సం.(లు) - 5.2-81-వ.,

  42) ఉదావసుడు- (పురుష){}[సూర్యవంశం]:- ఇతని తాత నిమి, తండ్రి జనకుడు. నిమికళేబరాన్ని మునీశ్వరులు మథించి పుట్టించిన వాడు కనుక వైదేహుడు, మథించుటచే పుట్టిన వాడు కనుక మిథులుడు అని ప్రాఖ్యాతుడు అయ్యాడు అతను నిర్మించిన నగరం మిథిలానగరం. ఈ ఉదావసుని కొడుకు నందివర్ధనుడు. ఇతని వంశంలో లోనే సీతా మహాసాధ్వి అవతరించింది. ఇతని నుండి కృతి, మహావశి వరకు గల రాజులను మైథిలులు అంటారు. - వంశం - సూర్యవంశం; తండ్రి - వైదేహుడు, మిథిలుడు; కొడుకు(లు) - నందివర్దనుడు; పద్య సం.(లు) - 9-372-వ., 9-373-క., 9-374-వ.,

  43) ఉదీచ్యులు- (పురుష){}[ఋషి]:- ఉదీచ్యులూ అవంత్యులూ అనే బ్రహ్మవేత్తలయిన అయిదువందల మందికి హిరణ్యనాభుడు అను కోసలుని పుత్రుడు, కుమారుడైన పౌష్పంజి అను సుకర్ముని పుత్రుడు, సామవేదశాఖలను ఉపదేశించి వారిని సామవేదపారగులుగా తీర్చిదిద్దారు. - వంశం - ఋషి; పద్య సం.(లు) - 12-30-వ.,

  44) ఉద్గాత-1 (పురుష){}[ఋషి]:- వేద నిర్వాహకులైన ఋత్విక్కులలోని "ఋగ్వేద మంత్రాలు స్తోమాలు" ప్రయోగించే వాడు ఉద్గాత. ఇవి బ్రహ్మదేవుని పశ్చిమ ముఖం నుండి ఉద్భవించాయి. - వంశం - ఋషి; పద్య సం.(లు) - 3-388-వ., 8-536-సీ., 9-487-వ.,

  45) ఉద్గాత-2 (పురుష){}[ప్రియవ్రతుని వంశం]:- ఇతడు ప్రియవ్రతుని వంశంలోని ప్రతీహుడు సువర్చలల మూడవ కొడుకు. ఇతని తండ్రి ప్రతీహుడు శుద్ధాత్ముడు, హరిభక్తుడు. ప్రతీహుడు యజ్ఞనిర్వాహణా నిపుణులైన ముగ్గురు కొడుకులను పొందాడు. వారు ప్రతిహర్త, ప్రస్తోత, ఉద్గాత. వీరిలో ప్రతిహర్తకు నుతి యందు వ్యోముడు, భూముడు అని ఇద్దరు కొడుకులు. వారిలో భూమునకు ఋషికుల్య యందు ఉద్గీథుడు పుట్టాడు. అతనికి దేవకుల్య యందు ప్రస్తోత పుట్టాడు. ప్రస్తోతకు వరరుత్స యందు విభుడు, అతనికి భారతి యందు పృథుషేణుడు, అతనికి ఆకూతి యందు నక్తుడు, నక్తునకు గొప్ప కీర్తివంతుడైన గయుడు కలిగారు - వంశం - ప్రియవ్రతుని వంశం; తండ్రి - ప్రతీహుడు; తల్లి - సువర్చల; పద్య సం.(లు) - 5.2-6-వ,

  46) ఉద్గీథుడు- (పురుష){}[ప్రియవ్రతుని వంశం]:- భూముడు ఋషికుల్యల కొడుకు ఇతడు, ప్రస్తోత అనే కొడుకును దేవకుల్య యందు పొందాడు. - వంశం - ప్రియవ్రతుని వంశం; తండ్రి - భూముడు; తల్లి - ఋషికుల్య; భార్య - దేవకుల్య; కొడుకు(లు) - ప్రస్తోత; పద్య సం.(లు) - 5.2-6-వ,

  47) ఉద్ధవుడు- (పురుష){}[చంద్రవంశం]:- ఉద్ధవాది నిర్మలమతులైన మహాత్ములు భక్తితో ఆ దేవదేవుని తమ మనస్సులో నిల్పారు, దాటరాని విష్ణుమాయను దాటగలవారు అయ్యారు.
కురుసభలో అవమానింపబడి దేశసంచారం సంచారం చేస్తూ వచ్చి విదురుడు ఉద్ధవుని దర్శించుకొని, కౌరవపాండదాదుల క్షేమసమాచారాలు అడిగాడు.
బాల్యం నుండీ ఏకాగ్రమైన కృష్ణభక్తి పరుడు ఇతడు
ఇతడు బృహస్పతి శిష్యుడు
శ్రీకృష్ణుడు తన అవతార సమాప్తి సమయంలో ఉద్దవునికి తత్వం ఉపదేశించాడు. ఇతడు పూర్వజన్మలో వసుబ్రహ్మలు చేస్ ఉండిన సత్రయాగంలో వసువు. అప్పుడితడు ఏ వస్తువునూ కోరకుండా, విష్ణుపాదసేవనే కోరుకున్నాడు. అందుచేత, "ఇదే నీకు చివరి జన్మ ఇక పునర్జన్మ ఎత్తేది లేదు." అని చెప్పి తత్త్వం బోధించాడు.
కృష్ణుడు ఉద్దవుని గోపికల వద్దకు దూతగా పంపాడు. వారు భ్రమర గీతాలు పలికారు.
కృష్ణుడు కుబ్జగృహానికి ఏతెంచినప్పుడు ఇతను కూడా వెళ్ళాడు.
ధర్మరాజు రాజసూయ యాగం చేయబోతున్నాడని నారదుడు తెలుపగా, ఉద్ధవుని సలహా కృష్ణుడు తీసుకున్నాడు - వంశం - చంద్రవంశం; పద్య సం.(లు) - 1-178-వ., 1-349-వ., 2-204-సీ., 3-79-వ., 3-150-వ., 4-211-వ., 9-731-సీ., 10.1-1437-శా., 10.1-1491-మ., 10.2-612-వ., 11-91-వ.,

  48) ఉద్బలుడు- (పురుష){}[దైవ యోని]:- త్రివిక్రమావతారాన్ని చాలించిన వామనునిపైకి రావడానికి బలి సేనలు సిద్ధం అవుతుంటే వారిపై యుద్ధానికి సిద్దపడిన శ్రీహరి పరిచరులలో ఉద్బలుడు ఒకడు. బలి తన వారిని వారించి శ్రీహరికి లొంగిపోయాడు. - వంశం - దైవ యోని; పద్య సం.(లు) - 8-634-వ.,

  49) ఉద్యానము- ( -){}[ప్రదేశము]:- తోటలు - ఇవి అష్టమ స్కంధములోని త్రికూట పర్వతములో వర్ణించబడ్డాయి - వంశం - ప్రదేశము; పద్య సం.(లు) - 8-23-సీ., 8-24-వ., 8-25-క.,

  50) ఉన్నతి- (స్త్రీ){}[దక్షుని వంశం]:- ఈమె దక్షునికి వైవశ్వత మనువు మూడవ కూతురైన ప్రసూతి యందు పుట్టిన పదహారుగురు (16) కుమార్తెలలో ఎనిమిదవ (8) కూతురు. వీరిలో పదమూడు మంది ధర్ముని భార్యలు అయ్యారు. అలా ఈమె ధర్ముని ఎనిమదవ (8) భార్య. ఈ ఉన్నతి వలన దర్పము పుట్టెను.
ధర్మునికి ఆ పదముగ్గురు భార్యల వలన కలిగినవారు. శ్రద్ధ వల్ల శ్రుతము, మైత్రి వల్ల ప్రసాదము, దయ వల్ల అభయము, శాంతి వల్ల సుఖము, తుష్టి వల్ల ముదము, పుష్టి వల్ల స్మయము, క్రియ వల్ల యోగము, ఉన్నతి వల్ల దర్పము, బుద్ధి వల్ల అర్థము, మేధ వల్ల స్మృతి, తితిక్ష వల్ల క్షేమము, హ్రీ వల్ల ప్రళయము, మూర్తి వల్ల నరనారాయణులనే ఇద్దరు ఋషులు. - వంశం - దక్షుని వంశం; తండ్రి - దక్షుడు; తల్లి - ప్రసూతి ; భర్త - ధర్ముడు; కొడుకు(లు) - దర్పము; పద్య సం.(లు) - 4-6-వ., 4-28-వ.,

  51) ఉన్మత్త- ( -){}[వృక్ష]:- ఉన్మత్త అంటే ఉమ్మెత్త అని మదించిన అని నానార్థాలు ఉన్నాయి. ఈ పదం ప్రథమ స్కంధలో నైమిశారణ్య వర్ణన సందర్భంలో మురాసురుడి ఇల్లు} కు ఉపమాన పదంగా వాడబడింది. - వంశం - వృక్ష; పద్య సం.(లు) - 1-39-వ.,

  52) ఉపగురువు- (పురుష){}[సూర్యవంశం]:- మైథిలులలోని సత్యరథునకు ఉపగురువు, ఉపగురువునకు ఉపగుర్వుడు, ఉపగుర్వునికి సావనుడు పుట్టారు. వారిలో ఈ సావనునికి సుభూషణుడు అని పివువబడే సువర్చుడు అనువాడు పుట్టాడు. - వంశం - సూర్యవంశం; తండ్రి - సత్యరథుడు; కొడుకు(లు) - ఉపగర్వుడు; పద్య సం.(లు) - 9-374-వ.,

  53) ఉపగుర్వుడు- (పురుష){}[సూర్యవంశం]:- మైథిలులలోని సత్యరథునకు ఉపగురువు, ఉపగురువునకు ఉపగుర్వుడు, ఉపగుర్వునికి సావనుడు పుట్టారు. వారిలో ఈ సావనునికి సుభూషణుడు అని పిలువవబడే సువర్చుడు అనువాడు పుట్టాడు. - వంశం - సూర్యవంశం; తండ్రి - ఉపగురువు; కొడుకు(లు) - సావనుడు; పద్య సం.(లు) - 9-374-వ.,

  54) ఉపదానవి- (స్త్రీ){}[రాక్షస యోని]:- హిరణ్యాక్షుని భార్య ఈమె, దానవ వంశస్థురాలు, తండ్రి వైశ్వానరుడు. ఈమెకు హయశిరస, పులోమ, కాలక అని ముగ్గురు చెల్లెళ్ళు. (కశ్యపునకు దనువు యందు పుట్టిన పులోముని కొడుకు ఈ వైశ్వానరుడు అని ఇతర గ్రంథాలలో చెప్పబడింది.) - వంశం - రాక్షస యోని; తండ్రి - వైశ్వానరుడు; భర్త - హిరణ్యాక్షుడు; కొడుకు(లు) - శకుని; శంబరుడు; కాలనాభుడు; మదోత్కచ మొదలైనవారు; పద్య సం.(లు) - 6-258-వ.,

  55) ఉపదేవ- (స్త్రీ){}[చంద్రవంశం]:- ఈమె దేవకీదేవి అక్క. తండ్రి దేవకుడు. భర్త వసుదేవుడు. కొడుకులు కల్పవృష్టుడు మున్నగువారు పదిమంది. ఆహుకుని పుత్రుడైన దేవకునికి నలుగురు (4) కొడుకులు (దేవలుడు, ఉపదేవుడు, సుదేవుడు, దేవవర్దనుడు) మఱియు ధృతదేవ, శాంతిదేవ, ఉపదేవ, శ్రీదేవ, దేవరక్షిత, సహదేవ, దేవకి అనెడి ఏడుగురు (7) కూతుళ్ళు. వారిలో ఉపదానవి మూడవ (3) ఆమె.
అప్పచెల్లెళ్ళు ఏడుగురు వసుదేవుని వివాహమాడాడు. అతనికి ఈమె యందు కల్పవృష్టుడు మున్నగువారు పదిమంది పుట్టారు. - వంశం - చంద్రవంశం; తండ్రి - దేవకుడు; భర్త - వసుదేవుడు; కొడుకు(లు) - కల్పవృష్ణుడు మున్నగు వారు పదిమంది.; పద్య సం.(లు) - 9-712-వ., 9-722-వ.,

  56) ఉపదేవుడు-1 (పురుష){}[మనువు వంశం]:- పద్నాలుగురు (14) మనువులలో పన్నెండవవాడైన (12) భద్రసావర్ణి ముగ్గరు కొడుకులు దేవవంతుడూ, ఉపదేవుడూ, దేవజ్యేష్టుడూ. వారిలో ఇతడు రెండవ వాడు. వీరు ఆ భద్రసావర్ణి మన్వంతరంలోని రాజులు అవుతారు. - వంశం - మనువు వంశం; తండ్రి - భద్ర సావర్ణి మనువు; పద్య సం.(లు) - 8-423-వ.,

  57) ఉపదేవుడు-2 (పురుష){}[చంద్రవంశం]:- కృష్ణుని తల్లి దేవకీదేవి ఇతని చెల్లెలు. ఇతడు దేవకుని రెండవ కొడుకు. ఆహుకుని పుత్రుడైన దేవకునికి నలుగురు (4) కొడుకులు (దేవలుడు, ఉపదేవుడు, సుదేవుడు, దేవవర్దనుడు) మఱియు ధృతదేవ, శాంతిదేవ, ఉపదేవ, శ్రీదేవ, దేవరక్షిత, సహదేవ, దేవకి అనెడి ఏడుగురు (7) కూతుళ్ళు. - వంశం - చంద్రవంశం; తండ్రి - దేవకుడు; పద్య సం.(లు) - 9-712-వ.,

  58) ఉపదేవుడు-3 (పురుష){}[చంద్రవంశం]:- ఇతడు అక్రూరుని రెండవ కొడుకు. ఇతని అన్న దేవలుడు - వంశం - చంద్రవంశం; తండ్రి - అక్రూరుడు; పద్య సం.(లు) - 9-712-వ.,

  59) ఉపనందుడు- (పురుష){}[చంద్రవంశం]:- ఇతను కృష్ణుని పెద్దమ్మ కొడుకు. వసుదేవునికి భార్య మదిర యందు కలిగిన రెండవ కొడుకు. ఇతని సోదరులు నందుడు, కృతకుడు, శ్రుతుడు, శూరుడు మున్నగువారు.
బాల్యంలో కృష్ణుడు లీలలు చూపుతుండగా, కనబడిన మహోత్పాదాలను చూసి ఒక దినమున విచారించి, "ఉపనందుని" ఆలోచన ప్రకారం, బృందావనానికి తరలి వెళ్ళిపోయారు. - వంశం - చంద్రవంశం; తండ్రి - వసుదేవుడు; తల్లి - మదిర; పద్య సం.(లు) - 9-722-వ., 10.1-422-వ., 10.1-425-వ.,

  60) ఉపబర్హణం- ( -){}[పర్వతం]:- క్రౌంచద్వీపంలోని సుదామ వర్షంలో ఉపబర్హణం అను పర్వతము, తీర్థపతి అను నది ఉన్నాయి. - వంశం - పర్వతం; పద్య సం.(లు) - 5.2-66-వ.,

  61) ఉపబర్హణుడు- (పురుష){}[దైవ యోని]:- నారదుడు పూర్వకల్పంలో ఉపబర్హణుడు అను గంధర్వుడు. అప్పుడు అతనికి అందమూ, చాతుర్యమూ, గాంభీర్యమూ మున్నగునవి ఉండేవి. ప్రజాపతులు చేసిన యజ్ఞంలో విష్ణుగాథలు గానం చేసేవాడు. ఆ క్రమంలో కలిసిన అప్సరసలతో కూడి మోహంలో పడి విష్ణుకథాగానాలకు దూరమయ్యాడు. దానితో ప్రజాపతులు శూద్రయోనిలో పుట్టమని శపించారు. - వంశం - దైవ యోని; పద్య సం.(లు) - 7-472-వ.,

  62) ఉపరిచరమనువు- (పురుష){}[చంద్రవంశం]:- కురు వంశంలో కృతికి ఇతడు కొడుకు. ఇతనికి కొడుకులు బృహద్రథుడు, కుసుంభుడు, మత్స్యుడు, ప్రత్యగ్రుడు, చేదిషాదులు.
ఉపరిచర వసువు వీర్యం వల్ల ద్వాపర యుగం తీఱే సమయంలో, ఉద్భవించిన వాసవి అనబడే సత్యవతికి పరాశరుని వల్ల నారాయణాంశతో వేదవ్యాసుడు జన్మించాడు. - వంశం - చంద్రవంశం; పద్య సం.(లు) - 9-659-వ., 1-82-వ., ,

  63) ఉపశ్లోకుడు-1 (పురుష){}[చంద్రవంశం]:- ఇతను శ్రీకృష్ణునికి త్రివక్ర యందు పుట్టాడు. ఇతడు గొప్ప కృష్ణ భక్తుడు. నారదుని శిష్యుడు. నారదుని నుండి సాత్వతతత్వం ఉపదోశం పొందాడు. - వంశం - చంద్రవంశం; తండ్రి - కృష్ణుడు; తల్లి - త్రివక్ర; పద్య సం.(లు) - 10.2-1330-వ.,

  64) ఉపశ్లోకుడు-2 (పురుష){}[మనువు వంశం]:- ఉపశ్లోకుడు అను వాడి కొడుకైన బ్రహ్మసావర్ణి పదవ మనువు అవుతాడు. ఆ మన్వంతరంలో అతని కొడుకులైన భూరిషేణుడు మొదలైనవారు రాజులు అవుతారు. హవిష్మంతుడు మొదలైనవారు ఋషులు అవుతారు. శంభుడు అనేవాడు ఇంద్రుడు అవుతాడు. విబుద్ధులు మొదలైనవారు దేవతలు అవుతారు. - వంశం - మనువు వంశం; కొడుకు(లు) - బ్రహ్మసావర్ణి; పద్య సం.(లు) - 8-419-వ.,

  65) ఉపహూతి- (పురుష){}[ఋషి]:- ఇతను ధర్మరాజు రాజసూయ యాగానికి వచ్చిన ఋషులలో ఒకడు. - వంశం - ఋషి; పద్య సం.(లు) - 10.2-766-సీ.,

  66) ఉపేంద్ర వజ్రము- ( - ){}[భాష]:- ఛందస్సు, తెలుగు భాగవతములో ఉపయోగించిన ఒక ఛందోరీతి వృత్తము ఈ ఉపేంద్ర వజ్రము.
గ్రంథములో ఈ ఛందస్సు ఒక్క పద్యమునకు మాత్రమే వాడారు. - వంశం - భాష; పద్య సం.(లు) - 10.1-407-ఉపేం.,

  67) ఉపేంద్రుడు-1 (పురుష){}[దైవ యోని]:- శైశవకృష్ణునికి గోపికలు దృష్టి తీస్తూ, పైభాగాన్ని ఉపేంద్రుడు రక్షించు గాక అన్నారు. - వంశం - దైవ యోని; పద్య సం.(లు) - 10.1-236-వ.,

  68) ఉపేంద్రుడు-2 (పురుష){}[చంద్రవంశం]:- కృష్ణుడు - వంశం - చంద్రవంశం; పద్య సం.(లు) - 10.2-408-శా., 10.2-728-ఉ., 10.2-822.1-తే.,

  69) ఉపేంద్రుడు-3 (పురుష){}[దైవ యోని]:- సాత్త్వికాహంకారం నుండి దిక్కులు, వాయువు, సూర్యుడు, వరుణుడు, అశ్వినీ దేవతలు, అగ్ని, ఇంద్రుడు, ఉపేంద్రుడు, మిత్రుడు, ప్రజాపతి అనే పదిమంది దేవతలు పుట్టారు. .. పాదేంద్రియానికి ఉపేంద్రుడు అధిదేవత. - వంశం - దైవ యోని; పద్య సం.(లు) - 2-86-వ.,

  70) ఉపేంద్రుడు-4 (పురుష){}[దైవ యోని]:- శ్రీహరి, వామనుడు, ఇంద్రుని తమ్మడు స్వర్గాపవర్గాలకు ప్రధానుడు. - వంశం - దైవ యోని; పద్య సం.(లు) - 5.2-114-సీ., 8-681-వ.,

  71) ఉపేంద్రుడు-5 (పురుష){}[దక్షుని వంశం]:- జయంతుడు, మరుత్పతి యందు ధర్మునికి కలిగిన ఇద్దరిలో చిన్న వాడు జయంతుడు. ఇతడు ఉపేంద్రుడు అని ప్రసిద్ధుడు అయ్యాడు. ఇతని సోదరుడు మరుత్వంతుడు. - వంశం - దక్షుని వంశం; తండ్రి - ధర్ముడు; తల్లి - మరుత్పతి; పద్య సం.(లు) - 6-254-వ.,

  72) ఉప్తుడు- (పురుష){}[చంద్రవంశం]:- పరీక్షిత్తు తరువాతి తరాల చంద్రవంశ రాజులలో ఆసీమకృష్ణుని పుత్రుడైన నిచకుని కొడుకు. ఇతని కొడుకు చిత్రరథుడు. - వంశం - చంద్రవంశం; తండ్రి - నిచకుడు; కొడుకు(లు) - చిత్రరథుడు; పద్య సం.(లు) - 9-679-వ.,

  73) ఉప్పరము- ( -){}[ప్రదేశము]:- ఆకాశము - వంశం - ప్రదేశము; పద్య సం.(లు) - 8-55-వ.,

  74) ఉభయసృష్టి- ( -){}[నది]:- వేపమాన వర్షంలో బలభద్రం, అను సరిహద్దు పర్వతము, ఉభయసృష్టి అను నది ఉన్నాయి. - వంశం - నది; పద్య సం.(లు) - 5.2-68-వ.,

  75) ఉమ-1 (స్త్రీ){}[దైవ యోని]:- పార్వతీ దేవి, దాంపత్య ప్రీతికామునకు ఉమాదేవిని ఉపాసించుట తగినది.
ఏకాదశ రుద్రులకు గల పదకొండు (11) మంది భార్యలలో ఉమ ఒకరు.
ఈమె పరమశివుని భార్య
- వంశం - దైవ యోని; పద్య సం.(లు) - 2-38-వ., 3-370-వ., 8-249-క., 10.1-1113-వ., 10.1-1744-ఉ.,

  76) ఉమ-2 (స్త్రీ){}[దైవయోని]:- ఏకాదశ రుద్రులకు బ్రహ్మదేవుడు నిర్దేశించిన భార్యలలో ఒకామె. రుద్రుడు మహత్తు నామం కలిగి భార్య ఉమతో, వాయువు స్థానంగా కలిగి ఉంటాడు. - వంశం - దైవయోని; భర్త - మహత్తు; పద్య సం.(లు) - 3-369-క., 3-370-వ.,

  77) ఉరగపతి- (పురుష){}[దైవ యోని]:- ఆదిశేషుడు, ఉరగములకు (పాములకు) పతి. - వంశం - దైవ యోని; పద్య సం.(లు) - 3-323-మ.,

  78) ఉరుక్రమ- (పురుష){}[దైవయోని]:- ఉరుక్రమావతారము ప్రథమ స్కంధములో వివరించిన వైష్ణవ అవతారాలలో ప్రధానమైన ఏకవింశ త్యవతారములు (21) అందలి 8 వ. అవతారం (1-63-వ.) - వంశం - దైవయోని; తండ్రి - నాభి; తల్లి - మేరుదేవి; పద్య సం.(లు) - 1-63-వ.,

  79) ఉరుక్రముడు- (పురుష){}[దైవ యోని]:- విష్ణువు, త్రేతాయుగంలో ఎర్రనిరంగుతో, నాలుగుచేతులు, బంగరురంగు జుట్టు కలిగి, మూడు పేటల మేఖలలు ధరించి, మూడువేదాల ఆకృతి ధరించి, స్రుక్కు స్రువము మొదలైన ఉపలక్షణాలతో శోభిల్లుతూ; విష్ణువు, యజ్ఞుడు, పృశ్నిగర్భుడు, సర్వదేవుడు, ఉరుక్రముడు, వృషాకపి, జయంతుడు, ఉరుగాయుడు అనే పేర్లతో బ్రహ్మవాదులచేత నుతింపబడతాడు. అని కరభాజనుడు అనే ఋషి విదేహరాజునకు చెప్పాడు. - వంశం - దైవ యోని; పద్య సం.(లు) - 11-77-వ.,

  80) ఉరుక్రముడు / వామనుడు- (పురుష){}[దైవ యోని]:- అదితియందు కశ్యపునకు కలిగిన ద్వాదశాదిత్యులలో (12) పన్నెండవ (12) వాడు ఉరుక్రముడు అను వామనుడు. ఉరుక్రమునకు కీర్తి అను భార్య యందు బృహత్ శ్లోకుడు పుట్టాడు.
ద్వాదశ ఆదిత్యులు. వివస్వంతుడు, అర్యముడు, పూషుడు, త్వష్ట, సవిత, భగుడు, ధాత, విధాత, వరుణుడు, మిత్రుడు, శక్రుడు, ఉరుక్రముడు - వంశం - దైవ యోని; తండ్రి - కశ్యపుడు ; తల్లి - అదితి ; భార్య - కీర్తి; కొడుకు(లు) - బృహత్ శ్లోకుడు; పద్య సం.(లు) - 5-258-వ.,

  81) ఉరుక్షతుడు- (పురుష){}[సూర్యవంశం]:- పరీక్షితుని కాలానికి భవిష్యద్రాజు, ఇతను బృహద్బలుని మనుమడు, బృహద్రణుని కొడుకు, వత్సప్రీతుని తండ్రి. - వంశం - సూర్యవంశం; తండ్రి - బృహద్రణుడు; కొడుకు(లు) - వత్సప్రీతుడు; పద్య సం.(లు) - 9-366-వ.,

  82) ఉరుక్షయుడు- (పురుష){}[చంద్రవంశం]:- రంతిదేవుని పిమ్మట మహావీర్యునికి, ఇతడు పుట్టాడు. ఇతనికి త్రయారుణి, కవి, పుష్కరారుణి అను ముగ్గురు పుట్టి బ్రాహ్మణులైపోయారు. - వంశం - చంద్రవంశం; తండ్రి - మహావీర్య; కొడుకు(లు) - త్రయారుణి, కవి, పుష్కరారుణి; పద్య సం.(లు) - 9-653-వ., 9-655-వ.,

  83) ఉరుగాయుడు-1 (పురుష){}[దైవ యోని]:- శైశవకృష్ణునికి గోపికలు దృష్టి తీస్తూ, కోణములలో శంఖ చక్ర గదా ధరుడైన ఉరుగాయుడు, రక్షించు గాక అన్నారు. - వంశం - దైవ యోని; పద్య సం.(లు) - 10.1-236-వ.,

  84) ఉరుగాయుడు-2 (పురుష){}[దైవ యోని]:- విష్ణువు త్రేతాయుగంలో ఎర్రనిరంగుతో, నాలుగుచేతులు బంగరురంగు జుట్టు కలిగి, మూడు పేటల మేఖలలు ధరించి, మూడువేదాల ఆకృతి ధరించి, స్రుక్కు స్రువము మొదలైన ఉపలక్షణాలతో శోభిల్లుతూ; విష్ణువు, యజ్ఞుడు, పృశ్నిగర్భుడు, సర్వదేవుడు, ఉరుక్రముడు, వృషాకపి, జయంతుడు, ఉరుగాయుడు అనే పేర్లతో బ్రహ్మవాదులచేత నుతింపబడతాడు. అని కరభాజన ఋషి విదేహరాజుకు చెప్పాడు - వంశం - దైవ యోని; పద్య సం.(లు) - 11-77-వ.,

  85) ఉరురేతసుడు- (పురుష){}[దైవయోని]:- రుద్రుని ఏకాదశ నామాలలో ఒకటి. బ్రహ్మదేవుని ముడిపడిన బొమముడి నుండి ఉద్భవించిన రుద్రునికి, బ్రహ్మదేవుడు ఇచ్చిన ఏకదశనామాలలో ఉరురేతసుడు నామం కలిగి భార్య ఇలతో, భూమి స్థానంగా కలిగి ఉంటాడు. రుద్రుని ఏకాదశనామాలు (మన్యువు, మనువు, మహాకాలుడు, మహత్తు, శివుడు, ఋతధ్వజుడు, ఉరురేతసుడు, భవుడు, కాలుడు, వామదేవుడు, ధృతవ్రతుడు) ఏకాదశ భార్యలు (ధీ, వృత్తి, అశన, ఉమ, నియుతి, సర్పి, ఇల, అంబిక, ఇరావతి, సుధ, దీక్ష). ఏకాదశ స్థానాలు (చంద్రుడు, సూర్యుడు, అగ్ని, వాయువు, జలం, ఆకాశం, భూమి, ప్రాణం, తపస్సు, హృదయం, ఇంద్రియాలు) - వంశం - దైవయోని; తండ్రి - బ్రహ్మదేవుడు; భార్య - ఇల; పద్య సం.(లు) - 3-369-క., 3-370-వ.,

  86) ఉరువల్కల- (పురుష){}[చంద్రవంశం]:- కృష్ణుని తండ్రి అయిన వసుదేవునికి ఇళ యందు పుట్టినవారిలో ఇతను ఒకడు. - వంశం - చంద్రవంశం; తండ్రి - వసుదేవుడు; తల్లి - ఇళ; పద్య సం.(లు) - 9-722-వ.,

  87) ఉరుశృంగం,- ( -){}[పర్వతం]:- మనోజన వర్షంలో ఉరుశృంగం, అను సరిహద్దు పర్వతము, ఆయుర్ద అను నది ఉన్నాయి. - వంశం - పర్వతం; పద్య సం.(లు) - 5.2-68-వ.,

  88) ఉరుశ్రవుడు- (పురుష){}[సూర్యవంశం]:- సూర్యవంశంలోని సత్యశ్రవునకు ఇతడు కొడుకు. ఇతని కొడుకు దేవదత్తుడు, మనుమడు అగ్నివేశుడు. ఈ అగ్నివేశుడు కానీనుడు అనబడుతూ జాతకర్ణుడు అని మహర్షిగా ప్రసిద్ధుడు అయ్యాడు. - వంశం - సూర్యవంశం; తండ్రి - సత్యశ్రవుడు; కొడుకు(లు) - దేవదత్తుడు; పద్య సం.(లు) - 9-42-వ.,

  89) ఉలూపి- (స్త్రీ){}[చంద్రవంశం]:- నాగ కన్య, ఈమెయందు అర్జునుడు ఇలావంతుడు అను కొడుకును పొందాడు. - వంశం - చంద్రవంశం; భర్త - అర్జునుడు; కొడుకు(లు) - ఇలావంతుడు; పద్య సం.(లు) - 9-673-వ.,

  90) ఉల్బణుడు- (పురుష){}[ఋషి]:- కర్దమపుత్రి ఊర్జ యందు వసిష్ఠుడు పొందిన సప్తఋషులలో ఇతను ఒకడు. ఆ సప్తఋషులు ఎవరంటే, చిత్రకేతుడు, సురోచి, విరజుడు, మిత్రుడు, ఉల్బణుడు, వసుభృద్ధ్యానుడు, ద్యుమంతుడు - వంశం - ఋషి; తండ్రి - వసిష్ఠుడు; తల్లి - ఊర్జ / అరుంధతి ; పద్య సం.(లు) - 4-26-వ.,

  91) ఉల్ముకములు- (-){}[పరికరములు]:- ఉల్ముకములు అంటే కొరవులు - వంశం - పరికరములు; పద్య సం.(లు) - 8-327-క. నుండి 8-34-వ. వరకు,

  92) ఉల్ముకుడు- (పురుష){}[ధ్రువుని వంశం]:- ఇతడు ధ్రువుని వంశపు చక్షుస్సంజ్ఞునికి భార్య అడ్వల యందు కలిగిన కొడుకులు పన్నిండుగురులో ఒకడు. ఇతనికి బార్య పుష్కరిణి యందు పుట్టిన కొడుకులు ఆరుగురు అంగుడు, సుమనసుడు, ఖ్యాతి, క్రతువు, అంగిరసుడు, గయుడు. - వంశం - ధ్రువుని వంశం; తండ్రి - చక్షుస్సంజ్ఞుడు; తల్లి - అడ్వల; భార్య - పుష్కరిణి ; కొడుకు(లు) - అంగుడు, సుమనసుడు, ఖ్యాతి, క్రతువు, అంగిరసుడు, గయుడు; పద్య సం.(లు) - 4-390-వ.,

  93) ఉశన- (స్త్రీ){}[ఋషి]:- ఈమె కర్దమ మహర్షి పుత్రిక, భృగువు భార్య. ఈమె పుత్రుడు కవి. - వంశం - ఋషి; తండ్రి - కర్దముడు; తల్లి - దేవహూతి; భర్త - భృగువు; కొడుకు(లు) - కవి; పద్య సం.(లు) - 4-26-వ.,

  94) ఉశనుడు- (పురుష){}[చంద్రవంశం]:- చంద్రవంశంలో పృథుశ్రవుని కొడుకైన ధర్మునికి ఇతడు కొడుకు. ఇతడు నూఱు (100) అశ్వమేథయాగాలు చేసాడు. ఇతని కొడుకు రుచికుడు. - వంశం - చంద్రవంశం; తండ్రి - ధర్ముడు; కొడుకు(లు) - రుచికుడు; పద్య సం.(లు) - 9-705-వ.,

  95) ఉశికుడు- (పురుష){}[చంద్రవంశం]:- ఇతడు చంద్రవంశంలోని కృతి కొడుకు, ఇతని కొడుకు చేది. - వంశం - చంద్రవంశం; తండ్రి - కృతి; కొడుకు(లు) - చేది; పద్య సం.(లు) - 9-709-వ.,

  96) ఉశీనరుడు- (పురుష){}[చంద్రవంశం]:- చంద్రవంశానికి చెందిన యయాతి తరువాతి తరాలలోని మహామనసునికి కలిగిన ఇద్దరు (2) పుత్రులలో ఇతను పెద్దవాడు. ఇతని తమ్ముడు తితిక్షువు. ఇతనికి శిబి, వనుడు, క్రిమి, దర్పుడు నలుగురు కొడుకులు. - వంశం - చంద్రవంశం; తండ్రి - మహా మనసుడు; కొడుకు(లు) - శిబి; పద్య సం.(లు) - 9-683-వ.,

  97) ఉశీనరేంద్రుడు- (పురుష){}[రాజు]:- హిరణ్యకశిపుడు తన సోదరుడు హిరణ్యాక్షుని మరణానికి దుఃఖిస్తున్న తమ తల్లీ మున్నగువారికి ఉశీనర దేశ రాజు సుయజ్ఞుని కథ చెప్పాడు. ఈ సుయజ్ఞునినే ఉశీనరేంద్రుడు అని కూడ పలికాడు - వంశం - రాజు; పద్య సం.(లు) - 7-41.1-ఆ.,

  98) ఉష-1 (స్త్రీ){}[రాక్షస యోని]:- ఈమె అనిరుద్ధునుల కథ ఉషపరిణయంగా ప్రసిద్ధి పొందింది. ఈమె పరమ శివభక్తుడైన బాణాసురుని కూతురు. కలలో కృష్ణుని మనుమడు అనిరుద్ధుని చూసి వరించింది. ఈమె సఖి, బాణుని మంత్రి కుంభాండకుని కూతురు అయిన చిత్రలేఖ లోకంలోని గొప్పవారందరి చిత్రాలు చిత్రించి చూపితే, ప్రద్యుమ్నపుత్రుడు అనిరుద్ధుని ఆనమాలు పట్టింది. చిత్రలేఖ అతనిని తెచ్చింది. ఇద్దరు రహస్యంగా కలిసి ఉండగా గర్భవతి అయింది. బాణుడు క్రుద్ధుడై అనిరుద్ధుని యుద్ధంలో నాగపాశంతో బంధించాడు. అది తెలిసి కృష్ణుడు యుద్దంలో బాణుని ఓడించి ఉషానిరుద్ధులను విడిపించి తీసుకువెళ్లాడు. ఈ సందర్భంలో శివునికీ కృష్ణునికీ కూడ యుద్ధం జరిగింది. - వంశం - రాక్షస యోని; తండ్రి - బాణాసురుడు; భర్త - అనిరుద్ధుడు; పద్య సం.(లు) - 10.2-327 నుండి 10.2-447-క.,

  99) ఉష-2 (స్త్రీ){}[దక్షుని వంశం]:- దక్షపుత్రి వసువునకు పుట్టిన అష్టవసువులలో విభావసుడు ఒకడు. ఇతనికి ఈ ఉష యందు వ్యుష్టి ; రోచి ; ఆతపుడు అను పుత్రులు పుట్టారు.
అష్టవసువులు. వారు ద్రోణుడు, ప్రాణుడు, ధ్రువుడు, అర్కుడు, అగ్ని, దోషుడు, వస్తువు, విభావసువు, - వంశం - దక్షుని వంశం; భర్త - విభావసువు ; కొడుకు(లు) - వ్యుష్టి; రోచి; ఆతపుడు; పద్య సం.(లు) - 6-254-వ.,

  100) ఉషాకాంతుడు- (పురుష){}[చంద్రవంశం]:- అనిరుద్ధుడు, ఉషా కన్య భర్త. - వంశం - చంద్రవంశం; పద్య సం.(లు) - 10.2448-ఉ.,

  101) ఉష్ణకరుడు- (పురుష){}[దైవ యోని]:- సూర్యుడు, వేడి కిరణములు కల వాడు, వేడిమి (ఎండ)ను కలిగించెడి వాడు, - వంశం - దైవ యోని; పద్య సం.(లు) - 10.2-311-తే.,

  102) ఉష్ణాంశుడు- (పురుష){}[దైవ యోని]:- సూర్యుడు, ఉష్ణము (వేడి) కల అంశ కలవాడు - వంశం - దైవ యోని; పద్య సం.(లు) - 10.2-137-శా.,

  103) ఉష్ణిక్- ( -){}[భగణ విషయం]:- సూర్యుని రథానికి పూన్చిన సప్తాశ్వాలులో ఒకటి - వంశం - భగణ విషయం; పద్య సం.(లు) - 5.2-82-సీ.,

  104) ఉష్ణీషములు- ( -){}[పరికరములు]:- ఉష్టీపములు అంటే కిరీటములు. సాగరమథనం తరువాత జరిగిన సురాసుర యుద్ధంలో ఇరు పక్షాల వారు వీటిని వాడారు. - వంశం - పరికరములు; పద్య సం.(లు) - 8-327-క. నుండి 8-34-వ. వరకు,

  [ ↑ ] 1) ఊర్జ / అరుంధతి- (స్త్రీ){}[ఋషి]:- ఈమె కర్దమునికి భార్య దేవహూతి యందు కలిగిన తొమ్మిది (9) మంది కన్యలలో ఎనమిదవ (8) ఆమె. ఈమె యందు భర్త వసిష్ఠుడు చిత్రకేతుడు ; సురోచి ; విరజుడు ; మిత్రుడు ; ఉల్బణుడు ; వసుభృద్నుడు ; ద్యుమంతుడు అను ఏడుగురు (7) ఋషులను కొడుకులుగా పొందాడు. - వంశం - ఋషి; తండ్రి - కర్దముడు; తల్లి - దేవహూతి ; భర్త - వసిష్ఠుడు; కొడుకు(లు) - చిత్రకేతుడు; సురోచి; విరజుడు; మిత్రుడు; ఉల్బణుడు; వసుభృద్నుడు; ద్యుమంతుడు అను ఏడుగురు ఋషులు; పద్య సం.(లు) - 4-26-వ., 2-119-చ., 3-827-తే.,

  2) ఊర్జస్తంభుడు- (పురుష){}[ఋషి]:- ఊర్జస్తంభాదులు స్వారోచిషమన్వంతరంలో సప్తఋషులు - వంశం - ఋషి; పద్య సం.(లు) - 8-14-సీ.,

  3) ఊర్జస్వతి -1 (స్త్రీ){}[ప్రియవ్రతుని వంశం]:- ఈమె మనుపుత్రుడైన ప్రియవ్రతునికి విశ్వకర్మ పుత్రికైన బర్హిష్మతి కూతురు. - వంశం - ప్రియవ్రతుని వంశం; తండ్రి - ప్రియవ్రత ; తల్లి - బర్హిష్మతి ; భర్త - భార్గవుడు / శుక్రుడు; కూతురు(లు)- దేవయాని; పద్య సం.(లు) - 5.1-16-వ.,

  4) ఊర్జస్వతి -2 (స్త్రీ){}[దక్షుని వంశం]:- ఈమె అష్టవసువులలో రెండవవాడైన ప్రాణుని భార్య. వీరికి సహుడు ; ఆయువు ; పురోజవుడు అని ముగ్గరు కొడుకులు. దక్ష ఎనిమిదవ పుత్రి వసువు యందు భర్త ధర్మునికి పుట్టిన వారు ఎనమండుగురు అష్టవసువులు. వారు ద్రోణుడు, ప్రాణుడు, ధ్రువుడు, అర్కుడు, అగ్ని, దోషుడు, వస్తువు, విభావసువు, - వంశం - దక్షుని వంశం; భర్త - ప్రాణుడు ; కొడుకు(లు) - సహుడు; ఆయువు; పురోజవుడు; పద్య సం.(లు) - 6-254-వ.,

  5) ఊర్జితుడు- (పురుష){}[చంద్రవంశం]:- చంద్రవంశంలోని కార్తవీర్యార్జుని వెయ్యి మంది కొడుకులలో, పరశురాముడు ఇరవైయొక్క మార్లు క్షత్రియులు అందరినీ సంహరించి, భూమిని క్షత్రియరహితం చేయునప్పుడు, అతని బారి నుండి జయద్వజుడు, శూరసేనుడు, వృషణుడు, మధువు, ఊర్జితుడు అనెడి ఐదుగురు కార్తవీర్యార్జునుని కొడుకులు మాత్రమే బతికిబట్టకట్టారు. ఆ అయిదుగురులో ఇతను ఒకడు. - వంశం - చంద్రవంశం; తండ్రి - కార్తవీర్యార్జునుడు; పద్య సం.(లు) - 9-703-వ.,

  6) ఊర్జుడు- (పురుష){}[ధ్రువుని వంశం]:- ఇతడు ధ్రువపుత్రుడు వత్సరుని నాలుగవ కొడుకు. - వంశం - ధ్రువుని వంశం; తండ్రి - వత్సరుడు; తల్లి - సర్వర్థి ; పద్య సం.(లు) - 4-390-వ.,

  7) ఊర్ణ- (స్త్రీ){}[ప్రియవ్రతుని వంశం]:- ఈమె చిత్రరథుని భార్య, గయుని కోడలు, కొడుకు సమ్రాట్టు. - వంశం - ప్రియవ్రతుని వంశం; భర్త - చిత్రరథుడు; కొడుకు(లు) - సమ్రాట్టు; పద్య సం.(లు) - 5.2-10-వ.,

  8) ఊర్ణుడు- (పురుష){}[యక్షుడు]:- ఇతడు పుష్య మాసంలో సూర్యుని అనుచరులలోని యక్షుడు.
సూర్యుడు ఈ మాసంలో భగుడు అను పేరుతో, పూర్వచిత్తి, ఆయువు, కర్కోటకుడు, స్పూర్జుడు, అరిష్టనేమి, ఊర్ణుడు మున్నగువారు అనుచరులుగా కలిగి సంచరిస్తాడు. - వంశం - యక్షుడు; పద్య సం.(లు) - 12-41-వ. నుండి 12-45-వ. వరకు,

  9) ఊర్ధ్వకేతుడు- (పురుష){}[సూర్యవంశం]:- సూర్యవంశంలోని సనధ్వాజునకు ఇతడు కొడుకు. ఇతని కొడుకు అజుడు. వీరు మైథిలులు అను రాజులలోని వారు. - వంశం - సూర్యవంశం; తండ్రి - సనధ్వజుడు; కొడుకు(లు) - అజుడు; పద్య సం.(లు) - 9-374-వ.,

  10) ఊర్ధ్వగుడు- (పురుష){}[చంద్రవంశం]:- శ్రీకృష్ణునికి లక్షణ యందు కలిగిన పుత్రదశకంలో ఒకడు. - వంశం - చంద్రవంశం; తండ్రి - కృష్ణుడు; తల్లి - లక్షణ; పద్య సం.(లు) - 10.2-275-వ.,

  11) ఊర్ధ్వబాహుడు- (పురుష){}[ఋషి]:- పద్నాలుగింటిలో, అయిదవదైన రైవత మన్వంతరంలో ఇతడు సప్తర్షులలో ఒకడు.
అయిదో మన్వంతరంలో హిరణ్యరోముడూ, ఊర్ధ్వబాహుడూ, వేదశీర్షుడు మున్నగువారు, సప్తర్షులు అయ్యారు; భూతరయులు మొదలైనవారు దేవతలు అయ్యారు. శుభ్రుడికి, పతివ్రత అయిన వికుంఠ అనే అతని భార్య కడుపున, “వైకుంఠుడు” అనే పేరుతో విష్ణుమూర్తి పుట్టాడు. - వంశం - ఋషి; పద్య సం.(లు) - 8-139-సీ.,

  12) ఊర్ధ్వరోమం- ( - ){}[పర్వతం]:- విప్ర వర్షంలో ఊర్ధ్వరోమం అను గిరి, ఘృతచ్యుత అను మహానది ఉన్నాయి. - వంశం - పర్వతం; పద్య సం.(లు) - 5.2-64-వ,

  13) ఊర్ధ్వాయనులు- (పురుష){}[మానవ యోని]:- ప్లక్షద్వీపంలో హంసులు, పతంగులు, ఊర్ధ్వాయనులు, సత్యాంగులు అను నాలుగు వర్ణాల ప్రజలు ఉన్నారు. ప్లక్షద్వీపంలో నివసించే పురుషుల ఆయుర్దాయం వేయి సంవత్సరాలు. ప్లక్ష ద్వీపానికి దేవుడు సూర్యభగవానుడు. - వంశం - మానవ యోని; పద్య సం.(లు) - 5.2-60-వ.,

  14) ఊర్మి- (స్త్రీ){}[రాక్షస యోని]:- ఈమె ప్రహ్లాదుని తమ్ముడైన అనుహ్లాదుని భార్య. వీరికి భాష్కలుడు, మహిషుడు పుట్టారు. - వంశం - రాక్షస యోని; పద్య సం.(లు) - 6-507-వ.,

  15) ఊర్వశి-1 (స్త్రీ){}[దైవ యోని]:- ఈమె మార్గశీర్ష (సహో) మాసంలో సూర్యుని అనుచరులలోని అప్సరస.
సూర్యుడు ఈ మాసంలో అర్యమ (మూలం అంశువు) అను పేరుతో, ఊర్వశి, కశ్యపుడు, మహాశంఖుడ, విద్యుచ్ఛత్రుడు, ఋతసేనుడు, తార్క్ష్యుడు మున్నగువారు అనుచరులుగా కలిగి సంచరిస్తాడు. - వంశం - దైవ యోని; పద్య సం.(లు) - 12-41-వ. నుండి 12-45-వ. వరకు,

  16) ఊర్వశి-2 (స్త్రీ){}[దైవ యోని]:- కామినీ కామునకు ఊర్వశిని సేవించుట తగినది.
కశ్యపునికి భార్య అదితి యందు కలిగిన వారు ద్వాదశాదిత్యులు పన్నెండు (12) మంది వివశ్వంతుడు ; ఆర్యముడు ; పూషుడు ; త్వష్ట ; సవిత ; భగుడు ; ధాత ; విధాత ; వరుణుడు ; మిత్రుడు ; శక్రుడు ; ఉరుక్రముడు (వామనుడు) ఆదిత్యులలో పదవ (10) వాడైన మిత్రుడు, తొమ్మిదవ (9) వాడైన వరణులకు అప్సరస ఊర్వశి యందు రేతస్సు స్కలనము కాగా, దానిని కుంభములో (కుండ) ఉంచగా, అందులోనుండి అగస్త్యుడు, వసిష్ఠుడు జన్మించారు. అందుచేత వీరిద్దరూ కుంభసంభవులు అని సార్థకనామధేయులు అయ్యారు.
వశిష్ఠుడు, నిమి పరస్పరము దేహము పడు గాక అని శంపించుకున్నారు. అందువలన వశిష్ఠుడు మిత్రావరణులకు పుట్టి కుంభసంభవుడు అయ్యాడు.
అప్సరస, నరనారాయణుల తపోభంగానికి ఇంద్రుడు పంపగా రంభాది అప్సరసలు వచ్చారు. నరనారాయణులు తొడలు గీకితే ఊర్వశి ముఖ్యులగు అప్సరసలు పుట్టారు. ఈమె ఊరువులను గోకగా పుట్టింది కనుక ఊర్వశి అయింది. వారి మహత్వానికి, ఈమె అందానికి అచ్చెరువొందిన రంభాదులు స్వర్గానికి తీసుకు వెళ్ళారు.
ఈమె ఇంద్ర సభలో అప్సరస. సభలో నారదుడు పురూరవుని శౌర్యం సౌందర్యం గాంభీర్యం ఆది గుణాలు వర్ణింస్తుంటే వినిన ఊర్వశి మానవ రూపం ధరించి భూలోకానికి వచ్చింది. ఊర్వశీ గర్భంలో పురూరవునకు ఆయువు, శ్రుతాయువు, సత్యాయువు, రయుడు, జయుడు, విజయుడు, అని ఆరుగురు (6) కొడుకులు పుట్టారు. - వంశం - దైవ యోని; కొడుకు(లు) - ఆయువు, శ్రుతాయువు, సత్యాయువు, రయుడు, జయుడు, విజయుడు, అని ఆరుగురు (6) కొడుకులు; పద్య సం.(లు) - 2-38-వ., 6-507-వ., 9-368-వ., 2-132-క., 2-133-వ., 11-69-వ., 9-387-వ., నుండి 9-422-వ వరకు., 12-43-వ.,

  [ ↑ ] 1) ఋక్షకుడు- (పురుష){}[సూర్యవంశం]:- సూర్యవంపు రాజైన ఇతడు పరీక్షితుని కాలానికి భవిష్యద్రాజైన సుతక్షత్రునికి కొడుకు. అంతరిక్షుడు ఇతని కొడుకు. - వంశం - సూర్యవంశం; తండ్రి - సుతక్షత్రుడు; కొడుకు(లు) - అంతరిక్షుడు; పద్య సం.(లు) - 9-366-వ.,

  2) ఋక్షగిరి- ( -){}[పర్వతం]:- భారతవర్షంలోని ప్రసిద్ధమైన అనేక పర్వతాలలో ఒకటి. - వంశం - పర్వతం; పద్య సం.(లు) - 5.2-55-వ.,

  3) ఋక్షుడు-1 (పురుష){}[చంద్రవంశం]:- ఇతడు చంద్రవంశంలోని అజమీఢుని కొడుకు. ఇతని కొడుకు సంవరణుండు. సంవరణునకు సూర్యకన్య తపతి యందు కురువు పుట్టాడు. ఇతని పేరనే కురుక్షేత్రం ఏర్పడింది. - వంశం - చంద్రవంశం; తండ్రి - అజమీఢుడు; కొడుకు(లు) - సంవరణుడు; పద్య సం.(లు) - 9-659-వ.,

  4) ఋక్షుడు-2 (పురుష){}[చంద్రవంశం]:- ఇతడు సూర్య వంశంలోని దేవాతిథికి కొడుకు. ఇతడికి భీమసేనుడు పుట్టాడు. - వంశం - చంద్రవంశం; తండ్రి - దేవాతిథి; కొడుకు(లు) - భీమసేనుడు; పద్య సం.(లు) - 9-661-వ.,

  5) ఋచికుడు- (పురుష){}[ఋషి]:- ఋచికుడు అను బ్రాహ్మణుడు గాధిరాజు పుత్రికను కోరాడు. ఈడు కాదని భావించిన రాజు తెల్లటి శరీరాలు నల్లటి చెవులు కల వెయ్యి (1000) గుఱ్ఱాలు కన్యాశుల్కంగా అడిగాడు. ఋచికుడు వరుణుని అడిగి వాటిని తీసుకు వచ్చి ఇచ్చి, సత్యవతిని వివాహమాడాడు. సత్యవతి ఆమె తల్లి కొడుకు కావాలని అడిగారు. ఋచికుడు బ్రాహ్మణ మంత్రాలతో, క్షత్రియ మంత్రాలతో హవిస్సులు చేసి, నదికి వెళ్ళాడు. తల్లీకూతుర్లు హవిస్సులు తారుమారు చేసి పుచ్చుకున్నారు. అంతట ఋచికుడు వచ్చి నీకు క్రూరుడు, నీ తల్లికి బ్రహ్మజ్ఞాని పుడతారు అని చెప్పాడు. సత్యవతి వేడుకోగా నీకు సాధు పుత్రుడు పుడతాడు కాని అతని కొడుకు క్రూరుడు అవుతాడు అని అనుగ్రహించాడు. అలా సత్యవతికి జమదగ్ని పుట్టి రేణువు కూతురు రేణుకను వివాహమాడాడు. సత్యవతి కౌశకీ నది అయి లోకాలను పావనం చేస్తోంది.
(ఋచికుడు చ్యవనుని కొడుకు.) - వంశం - ఋషి; భార్య - సత్యవతి; కొడుకు(లు) - జమదగ్ని; పద్య సం.(లు) - 9-423-సీ. నుండి 9-426-వ. వరకు,

  6) ఋచీకతనయ (జమదగ్ని)- (పురుష){}[ఋషి]:- జమదగ్ని, ఋచీకుని పుత్రుడు. సూర్యుడు ఆశయుజ మాసములో త్వష్ట పేరు ధరించి మెలగుతాడు. ఆశ్వయుజ మాసంలో ఋషి ఋచీకతనయుడైన జమదగ్ని అతనికి అనుచరులలో ఒకడు. ఆ అనుచరులు ఋచీకుని కొడుకు జమదగ్ని, కంబళాశ్వుడు, తిలోత్తమ, బ్రహ్మోపేతుడు, శతజిత్తు, దృతరాష్ట్రుడు, ఇషంభరుడు. - వంశం - ఋషి; తండ్రి - ఋచికుడు; తల్లి - సత్యవతి; భార్య - రేణుక; కొడుకు(లు) - వసుమనుడు మున్నగువారు, పరశురాముడు; పద్య సం.(లు) - 12-43-వ., 9-426-వ.,

  7) ఋజువు- (పురుష){}[చంద్రవంశం]:- వసుదేవునికి దేవకి యందు పుట్టి, కంసుని చేతిలో మరణించిన ఏడుగురు (7) కొడుకులలో నాలుగవ (4) వాడు. ఆ ఏడుగురు కీర్తిమంతుడు, సుషేణుడు, భద్రసేనుడు, ఋజువు, సమదనుడు, భద్రుడు, సంకర్షణుడు. వీరి పిమ్మట శ్రీకృష్ణుడు అవతరించాడు. - వంశం - చంద్రవంశం; తండ్రి - వసుదేవుడు; తల్లి - దేవకి; పద్య సం.(లు) - 9-722-వ.,

  8) ఋణకుడు- (పురుష){}[సూర్యవంశం]:- పరీక్షిత్తుకి భవిష్యత్తు రాజు, సూర్యవంశంలోని వాడు ఐన క్షుద్రకునికి కొడుకు. ఇతనికి సురథుడు పుడతాడు. ఇతనికి సుమిత్రుడు పుడతాడు. ఇతని అనంతరం సూర్యవంశం నశించగలదు - వంశం - సూర్యవంశం; తండ్రి - క్షుద్రకుడు; కొడుకు(లు) - సురథుడు; పద్య సం.(లు) - 9-366-వ.,

  9) ఋతంభర- ( -){}[నది]:- ప్లక్షద్వీపంలోని అభయవర్షంలో హిరణ్యగ్రీవం అను కుల పర్వతము, ఋతంభర అను మహానది ఉన్నాయి. - వంశం - నది; పద్య సం.(లు) - 5.2-60-వ.,

  10) ఋతధ్వజుడు- (పురుష){}[దైవయోని]:- రుద్రుని ఏకాదశ నామాలలో ఒకటి. బ్రహ్మదేవుని ముడిపడిన బొమముడి నుండి ఉద్భవించిన రుద్రునికి, బ్రహ్మదేవుడు ఇచ్చిన ఏకదశనామాలలో ఋతధ్వజుడు నామం కలిగి భార్య సర్పితో, ఆకాశము స్థానంగా కలిగి ఉంటాడు. రుద్రుని ఏకాదశనామాలు (మన్యువు, మనువు, మహాకాలుడు, మహత్తు, శివుడు, ఋతధ్వజుడు, ఉరురేతసుడు, భవుడు, కాలుడు, వామదేవుడు, ధృతవ్రతుడు) ఏకాదశ భార్యలు (ధీ, వృత్తి, అశన, ఉమ, నియుతి, సర్పి, ఇల, అంబిక, ఇరావతి, సుధ, దీక్ష). ఏకాదశ స్థానాలు (చంద్రుడు, సూర్యుడు, అగ్ని, వాయువు, జలం, ఆకాశం, భూమి, ప్రాణం, తపస్సు, హృదయం, ఇంద్రియాలు) - వంశం - దైవయోని; తండ్రి - బ్రహ్మదేవుడు; భార్య - సర్పి; పద్య సం.(లు) - 3-369-క., 3-370-వ.,

  11) ఋతవ్రతులు- (పురుష){}[మానవ యోని]:- ఋతవ్రతులు శాకద్వీపంలో ఉండు ఋతవ్రతులు, సత్యవ్రతులు, దానవ్రతులు, సువ్రతులు చాతుర్వర్ణాలలోని ఒక వర్ణం వారు. - వంశం - మానవ యోని; పద్య సం.(లు) - 5.2-68-వ.,

  12) ఋతసేనుడు- (పురుష){}[గంధర్వుడు]:- ఇతడు మార్గశీర్ష (సహో) మాసంలో సూర్యుని అనుచరులలోని గంధర్వుడు.
సూర్యుడు ఈ మాసంలో అర్యమ (మూలం అంశువు) అను పేరుతో, ఊర్వశి, కశ్యపుడు, మహాశంఖుడ, విద్యుచ్ఛత్రుడు, ఋతసేనుడు, తార్క్ష్యుడు మున్నగువారు అనుచరులుగా కలిగి సంచరిస్తాడు. - వంశం - గంధర్వుడు; పద్య సం.(లు) - 12-41-వ. నుండి 12-45-వ. వరకు,

  13) ఋతుడు- (పురుష){}[ధ్రువుని వంశం]:- ఇతడు ధ్రువుని వంశపు చక్షుస్సంజ్ఞునికి భార్య అడ్వల యందు కలిగిన కొడుకులు పన్నిండుగురులో ఒకడు. ఆ పన్నెండుగురు పురువు, కుత్సుడు, త్రితుడు, ద్యుమ్నుడు, సత్యవంతుడు, ఋతుడు, వ్రతుడు, అగ్నిష్టోముడు, అతిరాత్రుడు, సుద్యుమ్నుడు, శిబి, ఉల్ముకుడు. - వంశం - ధ్రువుని వంశం; తండ్రి - చక్షుస్సంజ్ఞుడు; తల్లి - అడ్వల; పద్య సం.(లు) - 4-390-వ.,

  14) ఋతుధాముడు-1 (పురుష){}[దైవ యోని]:- పన్నెండవదైన భద్రసావర్ణి మన్వంతరంలో ఇతడు ఇంద్రుడు అవుతాడు. భద్రసావర్ణి కొడుకులైన దేవవంతుడూ, ఉపదేవుడూ, దేవజ్యేష్టుడూ మొదలైనవారు రాజులు అవుతారు. హరితులూ మొదలైనవారు దేవతలు అవుతారు. తపోమూర్తి, తపస్వి, అగ్నీధ్రకుడూ మొదలైనవారు సప్తఋషులు అవుతారు. - వంశం - దైవ యోని; పద్య సం.(లు) - 8-423-వ.,

  15) ఋతుధాముడు-2 (పురుష){}[సూర్యవంశం]:- ప్రతర్దనునునికి శత్రుజిత్తు అని, ఋతుధ్వజుడు అని పేర్లు ఉన్నాయి. ఇతడు దివోదాసునికి (ద్యుమంతుని) కొడుకు. ద్యుమంతుడు ధన్వంతరి మనుమడి కొడుకు. ఈ ప్రతర్దునికి కువలయాశ్వుడు పుట్టాడు. - వంశం - సూర్యవంశం; తండ్రి - దివోదాసు (ద్యుమంతుడు); కొడుకు(లు) - కువలయాశ్వుడు; పద్య సం.(లు) - 9-499-వ.,

  16) ఋతుధాముడు-3 (పురుష){}[చంద్రవంశం]:- ఇతడు చంద్రవంశంలోని వాడు. వసుదేవుని సోదరడైన ఆనకుని కొడుకు. ఇతని సోదరుడు జయుడు. - వంశం - చంద్రవంశం; తండ్రి - ఆనకుడు; తల్లి - కర్ణిక; పద్య సం.(లు) - 9-722-వ.,

  17) ఋతుపర్ణుడు- (పురుష){}[సూర్యవంశం]:- సూర్య వంశంలో అయుతాయువుకు పుట్టాడు. ఇతని కొడుకు సర్వకాముడు. ఇతనికి కల్మాషపాదుడు అని సార్థకనామధేయం కలిగింది.
నలమహారాజు మిత్రుడు అతనికి అక్షహృదయం అనే విద్యను (లేక్క పెట్టే విద్య, చెట్టుకున్న ఆకుల లెక్క చెప్పి తన విద్య ప్రదర్శించాడు) ఇచ్చి, అశ్వహృదయం అనే విద్యను నలుని నుండి పొందాడు ఇతను శ్రీరాముని వంశంలోని పూర్వుడు అయోధ్యాధిపతి] - వంశం - సూర్యవంశం; తండ్రి - అయుతాయువు; కొడుకు(లు) - సర్వకాముడు; పద్య సం.(లు) - 9-234-వ., 9-236-వ.,

  18) ఋతేపువు- (పురుష){}[చంద్రవంశం]:- ఇతడు చంద్రవంశంలోని రౌద్రాశ్వునికి అప్సరస ఘృతాచికి పుట్టిన కొడుకు. ఇతని కొడుకు అంతిసారుడు. - వంశం - చంద్రవంశం; తండ్రి - రౌద్రాశ్వుడు; తల్లి - ఘృతాచి (అప్సరస); కొడుకు(లు) - అంతిసారుడు; పద్య సం.(లు) - 9-593-వ.,

  19) ఋభుడు- (పురుష){}[ఋషి]:- ఇతడు బ్రహ్మదేవుని కుమారులలో ఒకడు. నైష్ఠికులై గృహస్తులు కాకపోవడం వలన వంశాలు కొనసాగని బ్రహ్మదేవుని పుత్రులలోని వాడు. అలా సనకుడు, సనందనుడు, సనత్సుజాతుడు, సనత్కుమారుడు, నారదుడు, హంసుడు, అరుణి, ఋభుడు, యతి అను ఈ బ్రహ్మదేవుని పుత్రుల వంశాలు కొనసాగలేదు. - వంశం - ఋషి; తండ్రి - బ్రహ్మదేవుడు; పద్య సం.(లు) - 4-214-క.,

  20) ఋభువు- (పురుష){}[ఋషి]:- బ్రహ్మదేవుడు భాగవత వైభవం వివరిస్తూ చెప్పిన భగవన్మాయను తరించగల్గిన వారిలో ఋభువు ఒకరు. బ్రహ్మదేవుడు చెప్పిన భగవన్మాయను తరించగల్గిన వారు తాను, సనకుడు, సనందనుడు, సనత్కుమారుడు, సనత్సుజాతుడు, నారదుడు మొదలైన వాళ్లు, భగవంతుడైన శివుడు, దైత్యులను పాలించే ప్రహ్లాదుడు, స్వాయంభువుడనే మనువు, అతని భార్య శతరూప అనే సతీమణి, వాళ్ల కుమారులైన ప్రియవ్రతుడు, ఉత్తానపాదుడు, పుత్రికలైన దేవహూతి మొదలైనవారు, ప్రాచీనబర్హి అనే రాజేంద్రుడు, ఋభువు అనే మహర్షి, వేనుని తండ్రి అయిన అంగుడు, ఉత్తానపాదుని కుమారుడగు ధ్రువుడు. - వంశం - ఋషి; పద్య సం.(లు) - 2-203-వ.,

  21) ఋభువులు- (పురుష){}[దైవ యోని]:- తపస్సు చేసి సోమలోకాన్ని పొందినవారు ఋభువులు అనే దేవతలు అవుతారు. దక్షయజ్ఞ సమయంలో సతీదేవి యోగాగ్నిలో దగ్ధంకాగా, రుద్రాచరులైన ప్రమథ గణాలు రెచ్చిపోయారు. అంతట భృగువు దక్షిణాగ్నిలో వ్రేల్వగా తపస్సు చేసి సోమలోకాన్ని పొందిన ఋభువులు అనే దేవతలు వేలకొలదిగా పుట్టి, బ్రహ్మతేజస్సుతో దివ్యవిమానా లెక్కి, మండుతున్న కొరవులు ఆయుధాలుగా ధరించి, రుద్రుని అనుచరులైన ప్రమథులను, గుహ్యకులను తరిమివేశారు. ఆ తరువాత తండ్రిచేత అవమానింపబడి భవాని మరణించిందని, ప్రమథాదులు ఋభువులచేత ఓడిపోయారని నారదుని వలన శివుడు విన్నాడు. - వంశం - దైవ యోని; పద్య సం.(లు) - 4-104-వ.,

  22) ఋశ్యమూకం- ( -){}[పర్వతం]:- భారతవర్షంలోని ప్రసిద్ధమైన అనేక పర్వతాలలో ఒకటి. - వంశం - పర్వతం; పద్య సం.(లు) - 5.2-55-వ.,

  23) ఋశ్యశృంగుడు- (పురుష){}[ఋషి]:- రూపాంతరం ఋష్యశృంగుడు. ఇతను ఎనిమిదవదైన సూర్యసావర్ణి మన్వంతరంలో సప్తర్షులలో ఒకరు.
సూర్య సావర్ణి (ఎనిమిదవ) మన్వంతరంలో అతని కొడుకులు నిర్మోహుడూ, విరజస్కుడూ మొదలైనవారు రాజులు అవుతారు. సుతపులూ, విరజులూ, అమృతప్రభులూ దేవతలు అవుతారు. గాలవుడూ, దీప్తిమంతుడూ, పరశురాముడు, ద్రోణుని కొడుకైన అశ్వత్థామ, కృపుడూ, వ్యాసుడు, ఋష్యశృంగుడు, సప్తఋషులు అవుతారు. ఇప్పుడు వారు తమతమ ఆశ్రమాలలో ఉన్నారు. విరోచనుని కొడుకైన బలిచక్రవర్తి ఇంద్రుడు అవుతాడు.
రోమపాదుడు స్నేహితుడు దశరథుని పుత్రిక శాంతను దత్తత చేసుకొన్నాడు. రాజ్యంలో కొంత కాలం వర్షాలు కురవక పోవడంతో, విభాండక ముని కుమారుడు ఋశ్యశృంగుడు వస్తే వర్షాలు కురుస్తాయి అని విన్నాడు. ఋశ్యశృంగుడు, విభాండకముని భార్య లేడి రూపం ధరించి క్రీడించగా పుట్టాడు. అతడు అడవిలో గొప్ప తపస్సు చేసుకుంటుంటే పోమపాదుడు అందమైన వారవనితలను పంపాడు. పుట్టిననాటి నుండి ఇతర ప్రపంచంకాని ఆడవారు కాని తెలియని అతనిని వారు రాజు వద్దకు తీసుకువెళ్ళారు. అతను తన కుమార్తె శాంతను ఇచ్చి వివాహంచేసి నగరంలో ఉంచుకున్నాడు. ఆ మునిశ్రేష్ఠుడు రాగా అనావృష్టి దోషాలు తొలగిపోయి వానలు కురిసాయి. ఋష్యశృంగుడు పుత్రకామేష్టియాగం చేయించి అపుత్రకుడైన రోమపాదునికి పుత్రులు కలిగేలా చేసాడు. పిమ్మట అతని కరుణతోనే దశరథుడుకూడ పుత్రకామేష్టి చేసి పుత్రులను పొందాడు. - వంశం - ఋషి; పద్య సం.(లు) - 8-415-వ., 9-685-వ. నుండి 9-696-ఆ వరకు,

  24) ఋషభం- ( -){}[పర్వతం]:- భారతవర్షంలోని ప్రసిద్ధమైన అనేక పర్వతాలలో ఒకటి. - వంశం - పర్వతం; పద్య సం.(లు) - 5.2-55-వ.,

  25) ఋషభుడు-1 (పురుష){}[ప్రియవ్రతుని వంశం]:- ఋషభుడు మహారాజు యజనాభం అనే దేశాన్ని ఏలాడు. తన రాజ్యాన్ని కర్మభూమిగా భావించి, కర్మతంత్రాన్ని జనులందరికీ ఇష్టమయ్యే విధంగా తెలియజేయా లనుకున్నాడు. అందుచేత కర్మలు ఆచరించడానికి తానే స్వయంగా గురువుల వద్దకు చేరాడు. వారి ఆజ్ఞను శిరసావహించి దేవేంద్రుడు ఇచ్చిన జయంతి అనే కన్యను వివాహం చేసుకున్నాడు. ఆ జయంతి వల్ల భరతుడు మొదలైన వందమంది కొడుకులను కన్నాడు. పట్టణాలతో, ఆశ్రమాలతో, కొండలతో, చెట్టు చేమలతో నిండిన భూమండలం భరతుని పేరు మీదుగా భరతవర్షం అనే ప్రశస్తిని పొందింది. ఇతనికి భార్య జయంతి యందు భరతుడు, కుశావర్తుడు, ఇలావర్తుడు, బ్రహ్మావర్తుడు, ఆర్యావర్తుడు, మలయకేతువు, భద్రసేనుడు, ఇంద్రస్పృశుడు, విదర్భుడు, కీకటుడు, కవి, హరి, అంతరిక్షుడు, ప్రబుద్ధుడు, పిప్పలాయనుడు, అవిర్హోత్రుడు, ద్రమీఢుడు, చమనుడు, కరభాజనుడు మున్నగు వందమంది పుత్రులు కలిగారు. వీరిలో భరతుని తమ్ముళ్ళు కుశావర్తుడు, ఇలావర్తుడు, బ్రహ్మావర్తుడు, ఆర్యావర్తుడు, మలయకేతువు, భద్రసేనుడు, ఇంద్రస్పృశుడు, విదర్భుడు, కీకటుడు అనే తొమ్మిది మందికి భరతుడు వారి వారి పేర ప్రసిద్ధమైన వర్షాలకు అధిపతులను చేసాడు. మరొక తొమ్మిది మంది ఐన కవి, హరి, అంతరిక్షుడు, ప్రబుద్ధుడు, పిప్పలాయనుడు, అవిర్హోత్రుడు, ద్రమీఢుడు, చమనుడు, కరభాజనుడు పరమ భాగవతులు అయ్యారు వీరు తరువాతి కాలంలో విదేహ రాజుకు తత్వం చెప్పారు. మిగతా ఎనభై ఒక్క మంది కొడుకులు పిత్రువాక్య పాలకులే, వీరందరూ బ్రాహ్మణులు అయ్యారు.
సన్యసించిన ఋషభుడు లింగ శరీరాన్ని వదలిపెట్టినా యోగమాయా వాసనల కారణంగా లౌకికంగా దేహధారిగా చరించాడు. అతడు ఒకరోజు కోంకణ, వంగ, పట, కుటకాలు అనే దక్షిణ కర్ణాట దేశానికి అప్రయత్నంగా వెళ్ళి కుటక పర్వత సమీపంలోని ఉపవనం చేరుకున్నాడు. అక్కడ శిలాఖండాలను నోటిలో పెట్టుకొంటూ పిచ్చివానిలాగా చెదరిన జుట్టుతో దిగంబరుడై సంచరించాడు. అప్పుడు వీచిన సుడిగాలి విసురుకు వెదురుకర్రలు రాపిడి చెంది భయంకరమైన కార్చిచ్చు రేగింది. ఆ మంటలలో ఋషభుడు కాలిపోయాడు. ఋషభుని చేతలను ఆ ప్రాంతంవారు చెప్పుకోగా అర్హతుడు అనే పేరుగల ఆ రాష్ట్రాధికారి విని, స్వధర్మం వదలిపెట్టి స్వదేశస్థులతో ఆ ఆచారానికి ఆమోదం తెలిపాడు. - వంశం - ప్రియవ్రతుని వంశం; తండ్రి - నాభి; తల్లి - మేరుదేవి; భార్య - జయంతి ; కొడుకు(లు) - భరతుడు, కుశావర్తుడు, ఇలావర్తుడు, బ్రహ్మావర్తుడు, ఆర్యావర్తుడు, మలయకేతువు, భద్రసేనుడు, ఇంద్రస్పృశుడు, విదర్భుడు, కీకటుడు, కవి, హరి, అంతరిక్షుడు, ప్రబుద్ధుడు, పిప్పలాయనుడు, అవిర్హోత్రుడు, ద్రమీఢుడు, చమనుడు, కరభాజనుడు మున్నగు వందమంది పుత్రులు; పద్య సం.(లు) - 5.1-56-ఆ. నుండి 5.1-91-వ., 11-35-వ., 11-70-వ., 11-79-వ., 5.1-89-వ., ,

  26) ఋషభుడు-2 (పురుష){}[దైవ యోని]:- వీరు శీతోష్ణాది ద్వంద్వాల నుండి కాపాడు గాక అని విశ్వరూపుడు దేవేంద్రునికి ఉపదేశించిన శ్రీమన్నారాయణ కవచంలో ఉన్న నలభైతొమ్మిది స్తుతులలో ఇది ఒకటి.
శ్రీమన్నారాయణ కవచంలో ద్వంధ్వం వలన నిర్జితాత్ముడైన ఋషభుడు రక్షించు గాక అని వేడతారు.
చిత్రకేతోపాఖ్యానంలో మరణించిన కొడుకు వద్ద విలపిస్తున్న చిత్రకేతునికి అంగిరస నారదులు వచ్చి తత్వబోధ చేసి ఊరడించగా, వారిని ఆ రాజు వీరిలో మీరెవరని అడుగుతూ నారద, ఋషభ మున్నగు మహానుభావుల పేర్లు తలుస్తాడు.
ఇతడు ఇంద్రుని కొడుకు,
ద్వాదశాదిత్యులు పన్నెండుగురు (12) లోనూ పదకొండవవాడైన ఇంద్రునికి శచీదేవి వల్ల జయంతుడు, ఋషభుడు, విదుషుడు అనే కుమారులు కలిగారు. - వంశం - దైవ యోని; తండ్రి - శక్రుడు ; తల్లి - పౌలోమి; పద్య సం.(లు) - 6-300-చ. నుండి 6-307-వ., 6-307-వ., 6-458-సీ., 6-507-వ.,

  27) ఋషభుడు-3 (పురుష){}[చంద్రవంశం]:- ఇతడు చంద్రవంశంలో కురువంశమందు కుశాగ్రునికి కొడుకు. ఇతనికి సత్యహితుడు పుట్టాడు. - వంశం - చంద్రవంశం; తండ్రి - కుశాగ్రుడు; కొడుకు(లు) - సత్యహితుడు; పద్య సం.(లు) - 9-659-వ.,

  28) ఋషభులు- (పురుష){}[మానవ యోని]:- క్రౌంచద్వీపంలోని గురువులు, ఋషభులు, ద్రవిణకులు, దేవకులు అనే నాలుగు వర్ణాలవారి లోని వారు. - వంశం - మానవ యోని; పద్య సం.(లు) - 5.2-66-వ.,

  29) ఋషికుల్య-1 ( -){}[మహానది]:- భారతవర్షంలోని ప్రసిద్ధమైన పర్వతాలకు పుత్రికలవంటివి అయిన మహానదులలో ఒక నది. - వంశం - మహానది; పద్య సం.(లు) - 5.2-55-వ.,

  30) ఋషికుల్య-2 (స్త్రీ){}[ప్రియవ్రతుని వంశం]:- ఈమె భూముని భార్య, వీరికి ఉద్గీథుడు పుట్టాడు. - వంశం - ప్రియవ్రతుని వంశం; భర్త - భూముడు; కొడుకు(లు) - ఉద్గీథుడు; పద్య సం.(లు) - 5.2-6-వ,

  31) ఋషిజ్య వర్షం- ( -){}[ప్రాంతం]:- ఋషిజ్య వర్షం క్రౌంచద్వీపంలోని సప్తవర్షాలలోది. దీనికి అధిపతి ఘృతపర్ణుని కొడుకైన ఋషిజ్యుడు. ఈ వర్షంలో ఆనందం అను పర్వతము, తృప్తిరూప అను నది ఉన్నాయి. క్రౌంచ ద్వీపంలో నాలుగు వర్ణాలవారు గురువులు, ఋషభులు, ద్రవిణకులు, దేవకులు. వారు వరుణదేవుని సేవిస్తూ ఉంటారు. - వంశం - ప్రాంతం; పద్య సం.(లు) - 5.2-66-వ.,

  32) ఋషిజ్యుడు- (పురుష){}[రాజు]:- ఇతడు క్రౌంచద్వీపానికి అధిపతి ప్రియవ్రతపుత్రుడైన ఘృతపృష్ఠుని ఏడుగురు కొడుకులలో ఒకడ. ఆ ఏడుగురు ఆమోదుడు, మధువహుడు, మేఘపృష్ఠుడు, సుదాముడు, ఋషిజ్యుడు, లోహితార్ణుడు, వనస్పతి అని ఏడుగురు కుమారులు. వీరు తమ తమ పేరుల మీదుగా క్రౌంచద్వీపాన్ని ఏడు వర్షాలుగా విభజించుకుని పాలించారు. ఈ వర్షంలో ఆనందం అను పర్వతము, తృప్తిరూప అను నది ఉన్నాయి. క్రౌంచ ద్వీపంలో నాలుగు వర్ణాలవారు గురువులు, ఋషభులు, ద్రవిణకులు, దేవకులు. వారు వరుణదేవుని సేవిస్తూ ఉంటారు. - వంశం - రాజు; తండ్రి - ఘృతపృష్ణుడు ; పద్య సం.(లు) - 5.2-66-వ.,

  33) ఋష్యశృంగుడు- (పురుష){}[ఋషి]:- రూపాంతరం ఋశ్యశృంగుడు. ఇతను పద్నాలుగు మన్వంతరాలలో, ఎనిమిదవదైన సూర్యసావర్ణి మన్వంతరంలో సప్తర్షులలో ఒకరు.
సూర్య సావర్ణి (ఎనిమిదవ) మన్వంతరంలో అతని కొడుకులు నిర్మోహుడూ, విరజస్కుడూ మొదలైనవారు రాజులు అవుతారు. సుతపులూ, విరజులూ, అమృతప్రభులూ దేవతలు అవుతారు. గాలవుడూ, దీప్తిమంతుడూ, పరశురాముడు, ద్రోణుని కొడుకైన అశ్వత్థామ, కృపుడూ, వ్యాసుడు, ఋష్యశృంగుడు, సప్తఋషులు అవుతారు. ఇప్పుడు వారు తమతమ ఆశ్రమాలలో ఉన్నారు. విరోచనుని కొడుకైన బలిచక్రవర్తి ఇంద్రుడు అవుతాడు.
ఋష్యశృంగుడు రోమపాదుడు స్నేహితుడు దశరథుని పుత్రిక శాంతను దత్తత చేసుకొన్నాడు. రాజ్యంలో కొంత కాలం వర్షాలు కురవక పోవడంతో, విభాండక ముని కుమారుడు ఋశ్యశృంగుడు వస్తే వర్షాలు కురుస్తాయి అని విన్నాడు. ఋశ్యశృంగుడు, విభాండకముని భార్య లేడి రూపం ధరించి క్రీడించగా పుట్టాడు. అతడు అడవిలో గొప్ప తపస్సు చేసుకుంటుంటే పోమపాదుడు అందమైన వారవనితలను పంపాడు. పుట్టిననాటి నుండి ఇతర ప్రపంచంకాని ఆడవారు కాని తెలియని అతనిని వారు రాజు వద్దకు తీసుకువెళ్ళారు. అతను తన కుమార్తె శాంతను ఇచ్చి వివాహంచేసి నగరంలో ఉంచుకున్నాడు. ఆ మునిశ్రేష్ఠుడు రాగా అనావృష్టి దోషాలు తొలగిపోయి వానలు కురిసాయి. ఋష్యశృంగుడు పుత్రకామేష్టియాగం చేయించి అపుత్రకుడైన రోమపాదునికి పుత్రులు కలిగేలా చేసాడు. పిమ్మట అతని కరుణతోనే దశరథుడుకూడ పుత్రకామేష్టి చేసి పుత్రులను పొందాడు. - వంశం - ఋషి; పద్య సం.(లు) - 8-415-వ.,

  [ ↑ ] 1) ఎఱ్ఱన ప్రెగ్గడ- (పురుష){}[బ్రాహ్మణ వంశం]:- మహాభాగవతం షష్ఠ స్కంధం ఆంధ్రీకరించిన ఏర్చూరి సింగయకు పూర్వీకుడు.
శ్రీవత్సగోత్రుడు, ఆపస్తంబ సూత్రుడు, సుగుణ సంపన్నుడు, ఏర్చూరుకు శాసకుడు అయిన ఎఱ్ఱన ప్రెగ్గడ కుమారుడు వీరన్న. ఆయన పుత్రుడు నాదయామాత్యుడు. ఆయన భార్య పోలమ్మ యందు కసువన్న, వీరన్న, సింగన్న అనే ముగ్గురు కుమారులు జన్మించారు. వారిలో కసువన మంత్రికి భార్య ముమ్మడమ్మకి సింగయ మంత్రి, తెలగయ మంత్రి అని ఇద్దరు కొడుకులు. వీరిలో పెద్దవాడే షష్ఠ స్కంధ కర్త మన ఏర్చూరి సింగయ. - వంశం - బ్రాహ్మణ వంశం; పద్య సం.(లు) - 6-26-సీ.,

  2) ఎల్లన- (పురుష){}[బమ్మెర వంశం; కౌండిన్య గోత్రం; ఆపస్తంభ సూత్రం]:- మహాభాగవతాన్ని తెలుగులో ప్రణీతం చేసిన బమ్మెర పోతన యొక్క తాతగారు.
ఈయన బమ్మెర సోమనగారికి ధర్మపత్ని మల్లమ యందు పుట్టారు. ఎల్లన గారికి ధర్మపత్ని మాచమ యందు కేతన / కేతయ జన్మించారు. వీరి పుత్రుడే మన పోతనామాత్యులవారు. - వంశం - బమ్మెర వంశం; కౌండిన్య గోత్రం; ఆపస్తంభ సూత్రం; తండ్రి - సోమన మంత్రి; తల్లి - మల్లమ; భార్య - మాచమ; కొడుకు(లు) - కేతన / కేసయ; పద్య సం.(లు) - 1-24-సీ.,

  [ ↑ ] 1) ఏకచక్ర-1 (పురుష){}[ఋషి]:- ఏకచక్ర అంటే ఏకచక్రపురము అని చక్రవాక పక్షులు అని నానార్థాలు ఉన్నాయి. ఈ పదం ప్రథమ స్కంధలో నైమిశారణ్య వర్ణన సందర్భంలో మహాభారతం} ఉపమాన పదంగా వాడబడింది. - వంశం - ఋషి; పద్య సం.(లు) - 1-39-వ.,

  2) ఏకచక్ర-2 ( -){}[గగనచర]:- ఏకచక్ర అంటే చక్రవాక పక్షులు అని ఏకచక్రపురము అని నానార్థాలు ఉన్నాయి. ఈ పదం ప్రథమ స్కంధలో నైమిశారణ్య వర్ణన సందర్భంలో మహాభారతం} కు ఉపమాన పదంగా వాడబడింది. - వంశం - గగనచర; పద్య సం.(లు) - 1-39-వ., 9-230-వ.,

  3) ఏకచక్ర-3 ( -){}[గగనచర]:- నైమిశారణ్య వర్ణనలో, ఏకచక్ర అని ప్రయోగించి ముఖ్యమైన చక్రవాక పక్షులు, ఏకచక్ర పురము అనే అర్థాలు స్ఫురించేలా వర్ణించారు. అది ఎలా ఉందంటే... మహాభారతంబునుం బోలె నేకచక్ర, బక, కంక, ధార్తరాష్ట్ర, శకుని, నకుల సంచార సమ్మిళితంబై;
గంగాప్రవాహ వర్ణనలో అనేక సేనలు, చక్రవాకములు అని స్పురింప చేస్తూ ఏకచక్ర వాడారు. అది ఎలా అంటే....ప్రధాన పర్వంబు పొలుపున నేకచక్ర బక భీమ మహాభంగ సుభద్రార్జున చరిత్రారామంబై, - వంశం - గగనచర; పద్య సం.(లు) - 1-39-వ., 9-230-వ.,

  4) ఏకచక్రుడు- (పురుష){}[రాక్షస యోని]:- కశ్యపునికి దనువు యందు పుట్టిని పద్దెనిమిది (18) మంది దానవులలో ఇతను పదమూడవ వాడు. ఆ పద్దెనిమిది (18) మంది దానవులు ద్విమూర్ధుడు, శంబరుడు, అరిష్టుడు, హయగ్రీవుడు, విభావసుడు, అయోముఖుడు, శంకుశిరుడు, స్వర్భానుడు, కపిలుడు, అరుణి, పులోముడు, వృషపర్వుడు, ఏకచక్రుడు, అనుతాపకుడు, ధూమ్రకేశుడు, విరూపాక్షుడు, విప్రచిత్తి, దుర్జయుడు - వంశం - రాక్షస యోని; తండ్రి - కశ్యపుడు ; తల్లి - దనువు ; పద్య సం.(లు) - 6-258-వ.,

  5) ఏకదంతుడు- (పురుష){}[దైవ యోని]:- వినాయకుడు, ఏర్చూరి సింగయ షష్ఠ స్కంధారంభంలో వినాయకుని ప్రార్థిస్తూ ఏకదంతుడు అన్నారు. - వంశం - దైవ యోని; పద్య సం.(లు) - 6-4-ఉ.,

  6) ఏకపాదతానకము- ( -){}[నృత్తము]:- పారిభాషిక పదము - రాసక్రీడ - నృత్తము
ఒంటికాలితో అడుగులు వేయుట - వంశం - నృత్తము; పద్య సం.(లు) - 10.1-1084-వ.,

  7) ఏకాంతులు- (పురుష){}[మానవ యోని]:- విష్ణుభక్తులు - వంశం - మానవ యోని; పద్య సం.(లు) - 1-388.1-తే., 7-10-ఆ., 7-218-మ., 7-372-సీ., 8-83-సీ.,

  8) ఏకాదశరుద్రులు- (పురుష){}[దైవ యోని]:- పాతాళలోకం అడుగున ఆదిశేషుడు ఉన్నాడు. ఆదిశేషునికే అనంతుడు, సంకర్షణుడు, అవ్యయుడు అని పేర్లు. అనంతుని తలమీద ఆవగింజలాగా ఈ భూమండలం ఉన్నది. ప్రళయకాలంలో దిశేషుడు ప్రచండమైన కోపంతో ఏకాదశరుద్రులను సృష్టిస్తాడు. - వంశం - దైవ యోని; పద్య సం.(లు) - 5.2-122-సీ.,

  9) ఏకుడు- (పురుష){}[చంద్రవంశం]:- చంద్ర వంశంలో రయునికి ఇతను కొడుకు. ఇతని రెండవ కొడుకు. అన్న శ్రుతుడు. - వంశం - చంద్రవంశం; తండ్రి - రయుడు; పద్య సం.(లు) - 9-422-వ.,

  10) ఏనుగుగమి- ( -){}[జంతు]:- ఏనుగుల గుంపు - వంశం - జంతు; పద్య సం.(లు) - 8-38-వ.,

  11) ఏలాపుత్రుడు- (పురుష){}[నాగుడు]:- ఇతడు శ్రావణ (నభో) మాసంలో సూర్యుని అనుచరులలోని నాగుడు.
సూర్యుడు ఈ మాసంలో ఇంద్రుడు అను పేరుతో, ప్లమోచ, అంగిరసుడు, ఏలాపుత్రుడు, చర్యుడు, విశ్వవసువు, శ్రోతుడు మున్నగువారు అనుచరులుగా కలిగి సంచరిస్తాడు. - వంశం - నాగుడు; పద్య సం.(లు) - 12-41-వ. నుండి 12-45-వ. వరకు,

  [ ↑ ] 1) ఐరావత-1 ( -){}[వృక్ష]:- ఐరావత అంటే నారిజ చెట్లు అని ఏనుగు ఐరావతము అని నానార్థాలు ఉన్నాయి. ఈ పదం ప్రథమ స్కంధలో నైమిశారణ్య వర్ణన సందర్భంలో ఇంద్రుడి ఇల్లు} కు ఉపమాన పదంగా వాడబడింది. - వంశం - వృక్ష; పద్య సం.(లు) - 1-39-వ.,

  2) ఐరావత-2 ( -){}[భూచర]:- ఐరావత అంటే ఏనుగు ఐరావతము అని నారిజ చెట్లు అని నానార్థాలు ఉన్నాయి. ఈ పదం ప్రథమ స్కంధలో నైమిశారణ్య వర్ణన సందర్భంలో ఇంద్రుడి ఇల్లు} ఉపమాన పదంగా వాడబడింది. - వంశం - భూచర; పద్య సం.(లు) - 1-39-వ., 6-326-వ., 359., 6-390., 8-136-వ., 8-331-వ., 10.2-214-వ. 11-105-వ.,

  3) ఐరావతము- (పురుష){}[పరికరములు]:- ఐరావతము దేవంద్రుని వాహనము. క్షీరసాగరమథనం పిమ్మట జరిగిన సురాసుర యుద్ధంలో దీనిపై ఎక్కి ఇంద్రుడు సురాసురయుద్ధంలో యుద్ధం చేసాడు. - వంశం - పరికరములు; పద్య సం.(లు) - 8-327-క. నుండి 8-34-వ. వరకు,

  4) ఐరావతుడు- (పురుష){}[నాగుడు]:- ఇతడు ఫాల్గుణ (తపస్య) మాసంలో సూర్యుని అనుచరులలోని నాగుడు.
సూర్యుడు ఈ మాసంలో క్రతు (మూలం పర్జన్య) అను పేరుతో, సేనజిత్తు, భరద్వాజుడు, ఐరావతుడు, వర్చసుడు, విశ్వుడు, పర్జన్యుడు (మూలం క్రతు) మున్నగువారు అనుచరులుగా కలిగి సంచరిస్తాడు. - వంశం - నాగుడు; పద్య సం.(లు) - 12-41-వ. నుండి 12-45-వ. వరకు,

  5) ఐలబిలుడు / కుబేరుడు- (పురుష){}[సూర్యవంశం]:- కుబేరుడు, ఇలబిల కుమారుడు కనుక ఐలబిలుడు. కర్దమపుత్రి హవిర్భుక్కు పులస్త్యుల పుత్రుడైన "విశ్రవసు"నికి, అప్సరస అలంబుస తృణబిందుల పుత్రిక "ఇలబిల"కు, ఐలబిలుడు అయిన కుబేరుడు పుట్టాడు.
ఇలబిల తృణబిందును వరించిన అప్సరస అలంబుస తృణబిందు యందు పుట్టి విశ్రావసును వివాహమైంది, వీరికి ఐలబిలుడు ఐన కుబేరుడు పుట్టాడు. - వంశం - సూర్యవంశం; తండ్రి - విశ్రవసుడు; తల్లి - ఇలబిల; పద్య సం.(లు) - 4-26-వ., 9-48-వ.,

  6) ఐలుడు- (పురుష){}[రాజు]:- ఐలుడు మొదలగు నిర్మలమతులైన మహాత్ములు అనురక్తులై, భక్తితో ఆ దేవదేవుని తమ మనస్సులో నిల్పుకొని, ఆయనే గతి అని సేవించి దాట వీలుగాని విష్ణుమాయను దాటగలవారయ్యారు. - వంశం - రాజు; పద్య సం.(లు) - 2-204.1-సీ.,

  [ ↑ ] 1) ఓఘవంతుడు- (పురుష){}[సూర్యవంశం]:- మను పుత్రుడు నృగుని వంశములోని వసువునకు ప్రతీతుడు పుట్టాడు; ప్రతీతునికి ఓఘవంతుడు పుట్టాడు; అతని పుత్రిక ఓఘవతి అనె ఇంతిని సుదర్శనుడు పెండ్లాడాడు. - వంశం - సూర్యవంశం; తండ్రి - ప్రతీతుండు; కూతురు(లు)- ఓఘవతి; పద్య సం.(లు) - 9-42-వ.,

  2) ఓఘవతి- (స్త్రీ){}[సూర్యవంశం]:- మను పుత్రుడు నృగుని వంశములోని వసువునకు ప్రతీతుడు పుట్టాడు; ప్రతీతునికి ఓఘవంతుడు పుట్టాడు; అతని పుత్రిక ఓఘవతి అనె ఇంతిని సుదర్శనుడు పెండ్లాడాడు. - వంశం - సూర్యవంశం; తండ్రి - ఓఘవంతుడు; భర్త - సుదర్శనుడు; పద్య సం.(లు) - 9-42-వ.,

  3) ఓజుడు-1 (పురుష){}[చంద్రవంశం]:- ఇతడు కృష్ణునికు లక్షణకు పుట్టిన పదిమంది (10) కొడుకులలో ఆరవ (6)వ వాడు - వంశం - చంద్రవంశం; తండ్రి - కృష్ణుడు; తల్లి - లక్షణ; పద్య సం.(లు) - 10.2-275-వ.,

  4) ఓజుడు-2 (పురుష){}[యక్షుడు]:- ఇతడు వైశాఖ (మాధవం) మాసంలో సూర్యుని అనుచరులలోని యక్షుడు.
సూర్యుడు ఈ మాసంలో అర్యముడు అను పేరుతో, పుంజికస్థలి, పులహుడు, కంజనీరుండు, ప్రహేతి, నారదుండు, ఓజుడు మున్నగువారు అనుచరులుగా కలిగి సంచరిస్తాడు. - వంశం - యక్షుడు; పద్య సం.(లు) - 12-41-వ. నుండి 12-45-వ. వరకు,

  [ ↑ ] 1) ఔత్తరేయుడు- (పురుష){}[చంద్రవంశం]:- పరీక్షిత్తు, ఉత్తర యొక్క కుమారుడు. - వంశం - చంద్రవంశం; తండ్రి - అభిమన్యుడు; తల్లి - ఉత్తర; పద్య సం.(లు) - 2-52-వ.,

  2) ఔదంబరులు- (పురుష){}[ఋషి]:- వానప్రస్ధ ఆశ్రమంలో ప్రొద్దుట లేవగానే ఏ దిక్కు కనిపిస్తుందో ఆ దిక్కుకు పోయి అక్కడ ఆయాచితంగా లభించిన పదార్ధాలను భుజించేవారు ఔదుంబరులు. - వంశం - ఋషి; పద్య సం.(లు) - 3-388-వ.,

  3) ఔర్వుడు-1 (పురుష){}[ఋషి]:- ఇతని తేజస్సుతో తాళజంఘునికి వందమంది పుత్రులు పుట్టారు.
చంద్రవంశంలోని కార్తవీర్యార్జునకు వెయ్యిమంది కుమారులలో పరశురాముని భారిని పడకుండా జయద్వజుడు, శూరసేనుడు, వృషణుడు, మధువు, ఊర్జితుడు అనెడి ఐదుగురు మాత్రమే బ్రతికారు. జయద్వజునకు తాళజంఘుడు; తాళజంఘునకు ఔర్వముని తేజస్సు వలన వందమంది పుత్రులు పుట్టారు. వారిలో మొదటివాడు వీతిహోత్రుడు. - వంశం - ఋషి; పద్య సం.(లు) - 9-201-వ,

  4) ఔర్వుడు-2 (పురుష){}[ఋషి]:- సూర్యవంశంలోని బాహుకుని శత్రువులు ఓడించగా, తన స్త్రీలతో అడవికి వెళ్ళి, చనిపోయాడు. అతని రాణి సహగమనము చేయబోగా, ఆమె కడుపుతో ఉందని తెలిసిన ముని ఔర్వుడు ఆపాడు. ఆమెకు నవమాసములు నిండగా అసూయతో చూడలేని సపత్నులు, కావాలని విషాన్నం పెట్టారు. అలా విషంతోపాటు పుట్టినవాడు కనుక సగరుడు అయ్యాడు. తండ్రి పగను తీర్చి, గొప్ప సార్వభౌముడు అయ్యాడు. ఔర్వుడు చెప్పగా అనేక అశ్వమేధాలు చేసాడు. - వంశం - ఋషి; పద్య సం.(లు) - 9-202-సీ. నుండి 9-205-సీ.,