పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

నవమ స్కంధము : శ్రీకృష్ణావతార కథా సూచన

  •  
  •  
  •  

9-728-సీ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

ట్టి సర్వేశ్వుని రయంగ జన్మాది-
రతంత్రభావ మెప్పాటఁ గలదు
రాజలాంఛనముల రాక్షసవల్లభు-
క్షౌహిణీశులై వనిఁ బుట్టి
నులను బాధింప శాసించు కొఱకునై-
సంకర్షణునితోడ ననమంది
మరుల మనముల కైన లెక్కింపంగ-
రాకుండు నట్టి కర్మములఁ జేసి

9-728.1-తే.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

లియుగంబున జన్మింపఁ లుగు నరుల
దుఃఖజాలంబు లన్నిటిఁ దొలఁగ నడచి
నేల వ్రేఁగెల్ల వారించి నిఖిలదిశల
విమలకీర్తులు వెదచల్లి వెలసె శౌరి.

టీకా:

అట్టి = అటువంటి; సర్వేశ్వరుని = నారాయణుని {సర్వేశ్వరుడు - సమస్తమునకు ఈశ్వరుడు, విష్ణువు}; అరయంగ = తరచిచూసినచో; జన్మ = పుట్టుక; ఆది = మున్నగువానికి; పరతంత్ర = చిక్కుకొనెడి; భావము = స్వభావము; ఎప్పాటన్ = ఏవిధముగ; కలదు = ఉండును; రాజ = రాజరికపు; లాంఛనములన్ = హోదాలతో; రాక్షస = దానవుల; వల్లభులు = రాజులు; అక్షౌహిణీ = అక్షౌహిణుల సైన్యములకు; ఈశులున్ = అధిపతులు; ఐ = అయ్యి; అవనిన్ = భూమిపైన; పుట్టి = జన్మించి; జనులను = ప్రజలను; బాధింపన్ = బాధించుచుండగా; శాసించు = శిక్షించుట; కొఱకున్ = కోసము; ఐ = అయ్యి; సంకర్షణుని = బలరాముని; తోడన్ = తోపాటు; జననము = పుట్టుకను; అంది = స్వీకరించి; అమరుల = దేవతల; మనముల = మనసుల; కైన = ఐనప్పటికి; లెక్కింపంగన్ = గణింప; రాకుండునట్టి = శక్యముకాని; కర్మములన్ = గొప్పకార్యములను; చేసి = ఆచరించి.
కలియుగంబునన్ = కలియుగమునందు; జన్మింపగలుగు = పుట్టబోవు; నరుల = మానవుల; దుఃఖ = దుఃఖములు; జాలంబులు = సమూహములు; అన్నిటిన్ = సమస్తమును; తొలగనడచి = పోగొట్టి; నేలన్ = భూమిపైన; వ్రేగున్ = భారము; ఎల్లన్ = అంతటిని; వారించి = పోగొట్టి; నిఖిల = అన్ని; దిశలన్ = దిక్కులందు; విమల = స్వచ్ఛమైన; కీర్తులు = కీర్తులను; వెదజల్లి = వ్యాపింపజేసి; వెలసెన్ = ప్రసిద్ధమయ్యెను; శౌరి = నారాయణుడు {శౌరి - శూరుని వంశమున పుట్టినవాడు, విష్ణువు}.

భావము:

అటువంటి సర్వేశ్వరునికి పుట్టుక మున్నగువాటిలో చిక్కుకునే స్వభావం ఎలా ఉంటుంది. రాక్షసరాజులు భూమ్మీద పుట్టి, అక్షౌహిణుల సైన్యాలకు అధిపతులు అయ్యి, ప్రజలను బాధిస్తుంటే. వారిని శిక్షించడం కోసం బలరాముని తోపాటు శ్రీమహా విష్ణువు శూరుని వంశంలో జన్మించాడు. దేవతలు సైతం గణింప శక్యంకాని గొప్పకార్యాలు ఆచరించాడు. కలియుగంలో పుట్టబోయే మానవుల దుఃఖాన్ని, అఙ్ఞానాన్ని పోగొట్టి, భూభారం తొలగించాడు; సకల దిక్కులా వ్యాపింపించిన స్వచ్ఛమైన కీర్తులతో ప్రసిద్ధుడు అయ్యాడు.